ఆ తపనతో ఈ సినిమా చేశారు | Desam Kosam Bhagat Singh Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఆ తపనతో ఈ సినిమా చేశారు

Published Thu, Jan 26 2023 5:24 AM | Last Updated on Thu, Jan 26 2023 5:30 AM

Desam Kosam Bhagat Singh Movie Audio Launch - Sakshi

పరుచూరి గోపాలకృష్ణ, రవీంద్ర గోపాల్‌

‘‘అల్లూరి సీతారామరాజు, భగత్‌  సింగ్, సుభాష్‌ చంద్రబోస్‌’.. ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటిది ‘దేశంకోసం భగత్‌ సింగ్‌’ సినిమాలో రవీంద్ర గోపాల్‌ ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు చేయడం గొప్ప విషయం’’ అని  ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

‘అన్నల రాజ్యం, నాగమ నాయుడు, రాఘవేంద్ర మహత్యం’ లాంటి సినిమాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్‌ అధినేత రవీంద్ర గోపాల లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం భగత్‌సింగ్‌’. ప్రమోద్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ–‘ ‘స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి  తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు రవీంద్ర. ఈ సినిమా చూశా.. బాగుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 3న మా సినిమాని రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు రవీంద్ర గోపాల్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement