AudioLaunch
-
ప్రియమైన థ్రిల్
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరో హీరోయిన్గా ఏజే. సుజిత్ దర్శకత్వం వహించిన సైకో థ్రిల్లర్ ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వహణ సారథ్యంలో సుజిత్, బాబు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేదికపై హీరో అశోక్ మాట్లాడుతూ– ‘‘మంచి సైకో థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో నేనే హీరో, నేనే సైకో. యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమిది’’ అన్నారు. ‘‘మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో వందో చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ దేవా. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షా, సహ–నిర్మాత: కె. లక్ష్మీకాంత్. -
ఆ తపనతో ఈ సినిమా చేశారు
‘‘అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్’.. ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటిది ‘దేశంకోసం భగత్ సింగ్’ సినిమాలో రవీంద్ర గోపాల్ ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు చేయడం గొప్ప విషయం’’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘అన్నల రాజ్యం, నాగమ నాయుడు, రాఘవేంద్ర మహత్యం’ లాంటి సినిమాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం భగత్‌సింగ్’. ప్రమోద్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ–‘ ‘స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు రవీంద్ర. ఈ సినిమా చూశా.. బాగుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 3న మా సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు రవీంద్ర గోపాల్. -
డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా
శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్’. జీవీకే (జి. వెంకట్ కృష్టణ్) దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. ఎంఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మణిశంకర్’ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్ కృష్టణ్. ‘‘నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజా పాల్గొన్నారు. -
అవి ఉన్నంత కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.. 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నే చూస్తూ'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో.. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ పాటలకు రమణ్ రాథోడ్ సంగీతమందించారు. చిత్ర నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆడియోను మణిశర్మ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించాం. ఈ పాటలు మాకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాయి. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం.' అని అన్నారు. చిత్ర దర్శకుడు కె.గోవర్ధనరావు మాట్లాడుతూ..'ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అని చెప్పే ప్రేమకథా చిత్రానికి సీనియర్ యాక్టర్స్ ను సుమన్, సుహాసిని, బాను చందర్, శాయాజి షిండే, కిన్నెర లాంటి వారు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరందరినీ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు' అని అన్నారు. -
దేశం గర్వపడేలా చేసే కుర్రాడి కథ ఇది: వైష్ణవ్ తేజ్
‘‘నేను సినిమా తీసింది ఒకెత్తు అయితే.. కీరవాణిగారి సంగీతం మరో ఎత్తు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కీరవాణిగార్లు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మన్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు తనకు దక్కాల్సినదాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది కథ. రాజీవ్ వల్లే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను’’ అన్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన ఆడియో విడుదల వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణిగారే ఈ రోజు హీరో. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది’’ అన్నారు. ‘‘అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునేలా ఈ చిత్రంలో ఓ మంత్రాన్ని (రయ్...రయ్..) కంపోజ్ చేశాను’’ అని కీరవాణి అన్నారు. ‘‘కీరవాణిగారితో మళ్లీ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రాజీవ్‌రెడ్డి. ‘‘నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఇది’’ అన్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పల్లెటూరి అనుబంధాలు
సీనియర్ నటి అన్నపూర్ణ, జమున, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎమ్ఎన్ఆర్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం పాటలను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత కేఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్టు కావాలనుకున్న శివనాగు దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే పల్లెటూరి వాతావరణ ం కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘‘మంచి టైటిల్‌తో ఇలాంటి కుటుంబ చిత్రాన్ని తీయడం అభినందనీయం’’ అన్నారు దర్శకులు సాగర్. ‘‘కథకు ప్రాధాన్యం ఇచ్చి తీసిన చిత్రం ఇది’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఈ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘పల్లెటూరి ప్రేమలను, వాతావరణాన్ని ప్రతిబింబించాల్సిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది’’ అన్నారు శివనాగు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం’’ అన్నారు ఎమ్ఎన్ఆర్ చౌదరి. నటుడు బెనర్జీ, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, సింగర్స్ పసల, బేబి, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమంటే ప్రమాదం
రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి ముఖ్య పాత్రల్లో రాజ్ కింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. ఎస్.చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అంతా కష్టపడ్డాం అని అందరూ అంటున్నారు. ఎవరెంత కష్టపడ్డామన్నది సినిమా చూసి ప్రేక్షకులే నిర్ణయించాలి’’ అన్నారు. ‘‘ప్రతిభ ఉన్న దర్శకుడికి సరైన నిర్మాత కుదిరితే మంచి సినిమా వస్తుంది. అలా కుదిరిన సినిమాయే ‘ఇష్క్ ఈజ్ రిస్క్’’ అన్నారు సీనియర్ దర్శకుడు సాగర్. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు రవిచంద్ర. ‘‘హాస్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజ్‌కింగ్. -
మంచి సందేశంతో మార్షల్
‘‘అభయ్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘మార్షల్’. తన జన్మస్థలమైన గుంటూరులోనే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జరపడం ఎంతో సంతోషం. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అభయ్ అడకా, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటించారు. జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. అభయ్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదలకానుంది. ఈ చిత్రం ఆడియో, టీజర్‌ని గుంటూరులో విడుదల చేశారు. అభయ్ అడకా మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగిన గుంటూరులో నా తొలి చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా ఉంది. ఇదో వైవిధ్యభరితమైన చిత్రం. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మా సినిమా కథ నచ్చడంతో ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవిబసురి మా సినిమాకి రీ రికార్డింగ్‌తో పాటు 2 పాటలకు స్వరాలు సమకూర్చారు’’ అని జై రాజాసింగ్ అన్నారు. శ్రీకాంత్, షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నిర్మాత వెంకటేశ్వర రావు, మేఘనా చౌదరి, సంగీత దర్శకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.యం.స్వామి. -
తూనీగ ఆడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ చిత్రం ఘన విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆకాంక్షించారు. తూనీగ చిత్ర స్వరాల వేడుక యూనిట్ సభ్యుల కుటుంబ సభ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల నడుమ రామానాయుడు స్టూడియోలో సోమవారం జరిగింది. సీనియర్ డైలాగ్ రైటర్ మరుధూరి రాజా, రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఇటీవల విడుదలయిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయని, అదే క్రమంలో ఈ సినిమా చేరాలన్నది తన అభిమతం అన్నారు. తనకూ ఉత్తరాంధ్ర నేలతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. మరుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని, అలాంటి నేల నుంచి వచ్చిన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో కష్టించారని, తొలి ప్రయత్నంతోనే విజయం సాధించాలని దీవించారు. వర్థమాన రచయిత రత్నకిశోర్ శంభు మహంతి తనకు అత్యంత ఆప్తుడని, సోదర సమానుడని అన్నారు. హీరో వినీత్ చంద్రతో సహా ఇతర నటీనటులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ స్వరాల వేడుకకు అతిథులుగా ప్రొడ్యూసర్ దేవీగ్రంథం, నెపోలియెన్ మూవీ ప్రొడ్యూసర్ బొగేంద్ర గుప్త మామిడిపల్లి, ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ పద్మిని నాగులపల్లి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు, యంగ్ హీరో మనోహర్ విచ్చేశారు. తొలి సీడీని చిత్ర సమర్పకులు పద్మావతి, దేవీప్రియ సంయుక్తంగా అందుకున్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు సిద్ధార్థ్ సదాశివుని, సినిమాటొగ్రఫర్ హరీష్ ఎదిగ, పోస్టర్ డిజైనర్ ఎంకేఎస్ మనోజ్, ప్రోమో డైలాగ్, లిరికల్ వీడియోస్ ఎడిటర్ నికిల్ కాలేపు, పాటల రచయితలు కిట్టు, ఫణి, గాయకులు కరీముల్లా, విశ్వ, ఇషాక్, సహ నిర్మాత కర్రి రమేశ్, నటీనటులు సిల్వర్ సురేశ్, చైత్రిక, తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
విసిరి గీతాలావిష్కరణ
తమిళసినిమా: నటుడు విజయ్ తప్పుడు సమాచారాన్ని చెప్పరాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ.అరసుకుమార్ పేర్కొన్నారు.ఈయన తొలిసారిగా విసిరి అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. వెన్నెలావీడు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత వెట్ట్రిమహాలింగం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నవ నటుడు రాజసూర్య, రామ్సరవణన్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మదన్‌కార్గీ పాటలను, ధన్‌రాజ్ మాణిక్యం, శేఖర్సాయ్భరత్, నవీన్ శంకర్ల త్రయం సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్, ధనుంజయన్ పాల్గొన్నారు. బీజేపీరాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ.అరసుకుమార్ రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నటుడిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతరచయిత మదన్‌కార్గీ పద్మావతి చిత్ర సమస్యను ప్రస్తావిస్తూ రాజకీయ అంశానికి తెర లేపారు. భావ స్వాతంత్య్రం గురించి సినిమా పరిశ్రమలోనే, దేశ వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నారని, ఈ వేదికపై బీజేపీ నాయకుడు ఉండడంతో ఆయనకు చెబితే ప్రధానిమంత్రికు చెప్పినట్లేనని, దయచేసి భావ స్వాతంత్య్రం విషయంలో జోక్యం చేసుకోవద్దని ఒక నోరులేని జీవిగా ఇది తన విజ్ఞప్తి అని అన్నారు. అనంతరం బీజేపీ నాయకుడు పీటీ.అరసకుమార్ మాట్లాడుతూ నటుడు విజయ్ అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. విజయ్ చెప్పే విషయం కోట్లాదిమంది ప్రజలకు చేరుతుందన్నారు.అలాంటి ఆయన తప్పుడు సమాచారాన్ని తన చిత్రాల ద్వారా చెప్పకూడదని అరసకుమార్ పేర్కొన్నారు. -
ఘనంగా ఇంద్రసేన ఆడియో ఫంక్షన్