అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ, జమున
సీనియర్ నటి అన్నపూర్ణ, జమున, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎమ్‌ఎన్‌ఆర్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం పాటలను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత కేఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్టు కావాలనుకున్న శివనాగు దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే పల్లెటూరి వాతావరణ ం కనిపిస్తోంది’’ అన్నారు.
‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘‘మంచి టైటిల్‌తో ఇలాంటి కుటుంబ చిత్రాన్ని తీయడం అభినందనీయం’’ అన్నారు దర్శకులు సాగర్. ‘‘కథకు ప్రాధాన్యం ఇచ్చి తీసిన చిత్రం ఇది’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఈ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘పల్లెటూరి ప్రేమలను, వాతావరణాన్ని ప్రతిబింబించాల్సిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది’’ అన్నారు శివనాగు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం’’ అన్నారు ఎమ్‌ఎన్‌ఆర్ చౌదరి. నటుడు బెనర్జీ, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, సింగర్స్ పసల, బేబి, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment