భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్, కరుణకుమార్, సూరజ్
జాతి పిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ హంతకుడు గాడ్సే నేపథ్యంలో ‘మరణ వాంగ్మూలం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై పరిశోధన చేశాను. గాంధీ తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మృతి చెందారు.
గాంధీ హత్యలో గోపాల్ గాడ్సే ప్రమేయం ఏంటి? అనే అంశాల్ని కూడా చూపించనున్నాం’’ అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ–‘‘గాడ్సే రాసిన పుస్తకం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్‌లో తన వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘భరద్వాజ్‌గారు గాడ్సే మీద సినిమా గురించి చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. సినిమాని డిసెంబర్‌లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాత సూరజ్.
Comments
Please login to add a commentAdd a comment