Gandhi
-
సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: సంతానం కోసం ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేసే స్థోమత లేనివారికి అండగా నిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం.. మరిన్ని జిల్లాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌లోని గాందీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలిజేషన్) కేంద్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పేదలు వస్తున్నారు. దీంతో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో మరో 5 ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు రంగంలో 358 ఫెర్టిలిటీ సెంటర్లు తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్నారు. çరాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. చాలా సెంటర్లు సిట్టింగ్‌ల పేరుతో ఏళ్లకేళ్లు చికిత్సలు అందిస్తూ రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి.. గాం«దీ, పేట్ల బురుజు, వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు జీవో 520 విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అవి ఏర్పాటు కాలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేసి, అదే ఏడాది అక్టోబర్‌లో గాం«దీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, డాక్టర్లు, రీ ఏజెంట్స్, ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో నామ్‌కే వాస్తేగా మిగిలింది. అక్టోబర్‌లో గాం«దీ, పేట్ల బురుజులో ప్రారంభం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించింది. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొని అక్టోబర్ 15న ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అవసరమైన అన్ని రీ ఏజెంట్స్, ఔషధాలు పంపిణీ చేశారు. పేట్లబురుజు ఆసుపత్రిలోనూ ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించి, ఈ నెల 9న ఐవీఎఫ్ సేవలు ప్రారంభించారు.గాం«దీలోని ఐవీఎఫ్ సెంటర్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) కింద ఈ నెల 20 వరకు 271 మంది సంతానం కోసం రాగా, ఫాలిక్యులర్ స్టడీ కింద 66 మంది, ఐయూఐ కింద 26 మందికి పరీక్షలు నిర్వహించారు. ఐవీఎఫ్‌కు ఆరుగురు ఎంపికయ్యారు. పేట్ల బురుజులో 82 మంది ఓపీలో, ఫాలిక్యులర్ స్టడీకి 16 మంది, ఐయూఐకి 10 మందికి పరీక్షలు నిర్వహించారు. నలుగురిని ఐవీఎఫ్‌కు ఎంపిక చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో మరిన్ని ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజనర్సింహ ఇటీవలే శాసనమండలిలో ప్రకటించారు. -
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
చిన్నారులతో పాటు చీపురు పట్టిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేడు (బుధవారం) దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చీపురు పట్టి, పరిసరాలను పరిశుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛతా హి సేవా 2024’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న భారత దేశాన్ని అందరం కలిసి సాకారం చేద్దామన్నారు. అందుకు ఈరోజు మనకు ఈ స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నేటితో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు.గత పక్షం రోజుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతర కృషితోనే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చుకోగలం. ఈ రోజున పరిశుభ్రతకు సంబంధించిన సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మిషన్ అమృత్ కింద దేశంలోని పలు నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించనున్నామన్నారు. ఇది స్వచ్ఛ భారత్ మిషన్‌ను మరో మైలురాయి దాటిస్తుందన్నారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్‌లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్‌లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్‌పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్‌పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’
లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది. యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్‌ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.దీంతో ఆయన రాంపూర్ మార్కెట్లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది. తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది. ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన -
గాంధీ, ఉస్మానియాల్లో డాక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో డాక్టర్ల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఈనెల 9వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14వ తేదీన నియామకపత్రాలు ఇవ్వనున్నారు.ఈ రెండు ఆస్పత్రుల్లో 235 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఉస్మానియాలో 8 ప్రొఫెసర్ పోస్టులు, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గాంధీ ఆస్పత్రిలో 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్, 24 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 4 ట్యూటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 9న గాంధీ మెడికల్ కాలేజీ పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్‌లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వారితోపాటు కొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరగా.. ఈ ఇద్దరి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు
-
అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్ చూడటం తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్ తెలిపింది. ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా? అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. Rather surprised to see this from a mainstream Bollywood actor. Janhvi Kapoor on Ambedkar, Gandhi & caste 👏pic.twitter.com/KyH8Ad08f5— Siddharth (@DearthOfSid) May 24, 2024 -
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్‌కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్‌నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ డైరీలో మహాత్ముని వాక్కులు
జనవరి 30న అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1948లో ఇదే రోజున నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ గుజరాత్ నివాసి. మహాత్మా గాంధీ నేర్పిన పాఠాలు ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ గురించి లోతైన అధ్యయనం చేశారు. మహాత్మా గాంధీ తెలిపిన పలు విషయాలను ప్రధాని మోదీ తన పర్సనల్ డైరీలో రాసుకున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలు ట్విట్టర్ హ్యాండిల్ ‘మోదీ ఆర్కైవ్’లో షేర్ అయ్యాయి. ప్రధాని మోదీ తన డైరీలో రాసుకున్న మహాత్మా గాంధీకి సంబంధించిన అమూల్య విషయాలు దీనిలో ఉన్నాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత డైరీలోని కొన్ని పేజీలను యూజర్స్ కోసం అందుబాటులో ఉంచామని ‘మోదీ ఆర్కైవ్’ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనిని చూస్తే ప్రధాని మోదీ మహాత్మాగాంధీ గురించి వివరంగా చదవడమే కాకుండా, గాంధీజీ చెప్పిన అమూల్యమైన విషయాలను తన వ్యక్తిగత డైరీలో రాసుకున్నారని తెలుస్తుంది. ఇవి ప్రధాని మోదీకి మార్గదర్శకంగా నిలిచాయి. మహాత్మా గాంధీ తన 78 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ కాంప్లెక్స్‌లో నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని కాల్చి చంపాడు. భారతదేశ విభజనపై గాంధీ అభిప్రాయాలను గాడ్సే వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గౌరవార్థం ఆయనను గుర్తుచేసుకుంటూ జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. We bring to you pages from @narendramodi's personal diary, which demonstrate that not only did he extensively read #MahatmaGandhi, but he also wrote down Gandhi's quotes in his personal diary as something of inspirational value to him. These entries continued to guide his… pic.twitter.com/MCvgCBMCx1 — Modi Archive (@modiarchive) January 30, 2024 -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024 -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్‌వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్‌లు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు?
అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత దక్కిన అధికారం కాంగ్రెస్ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన కమల్‌నాథ్‌ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్‌కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న నేతగా కమల్‌నాథ్ పేరు తెచ్చుకున్నారు. పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన కమల్‌నాథ్.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్‌కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది. అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్‌నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్‌సభ టిక్కెట్ ఇవ్వడంతో కమల్‌నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్‌నాథ్ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్‌నాథ్, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? మహాత్మా గాంధీ 1938, నవంబర్ 26న ‘హరిజన్’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇంగ్లండ్ బ్రిటీష్ వారికి చెందినట్లే, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? -
ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? తరువాత ఏం జరిగింది?
అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్‌కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చౌదరి చరణ్ సింగ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్ బాగ్పత్ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్‌కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా ఇందిర.. గుర్జర్ నేత వికల్‌ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్‌కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్‌కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా, ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్లో ఆవిష్కరించనున్నారు. ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
ఘనంగా మహాత్మ గాంధీ 154వ జయంతి వేడుకలు
-
స్వాతంత్రం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు?
అక్టోబర్ 2 గాంధీ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అందించారు. భారతదేశంలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మోహన్‌దాస్ అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లారు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లి, వలసదారుల హక్కులను కాపాడేందుకు అక్కడ సత్యాగ్రహం నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఎలా జాతిపిత అయ్యారు? ప్రతి భారతీయుడు ఆయనను బాపు అని ఎందుకు పిలుస్తారనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు. భారత స్వాతంత్ర్యం తరువాత గాంధీజీ భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పనిచేశారు, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. సత్యం, సంయమనం, అహింసల మార్గాన్ని అనుసరించాలని చెబుతూ, అందుకు స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తన సర్వస్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే మనిషికి ఆనందాన్నిస్తుందని ఆయన తన నడత ద్వారా చూపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. సరళత, నిర్లిప్తత, ఆత్మతో అనుసంధానం అనే భావనలతో గాంధీజీ జీవించారు. ధోతీ ధరించి, ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించి, ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీజీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ప్రజలు ఆయనను బాపు అని పిలవడం ప్రారంభించారు. మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ‘జాతి పితామహుడు’ అని పిలిచి గౌరవించారు. మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్.. గాంధీజీని ఉన్నతునిగా పేర్కొన్నారు. అప్పటి నుండే అందరూ గాంధీజీని ‘జాతిపిత’ అని పిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్‌లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్‌కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు?
ఆమధ్య రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. తాను పండిట్ నెహ్రూ పేరు చెప్పడాన్ని మర్చిపోతే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందన్నారు. కానీ నెహ్రూ ఇంటిపేరును కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, రాయ్ బరేలీ ఎంపీ అయిన తన ముత్తాత ఫిరోజ్ గాంధీ ఇంటి పేరును రాహుల్ గాంధీ తన ఇంటి పేరుగా పొందారు. ఫిరోజ్ గాంధీ 1960లో తన 48 ఏళ్ల వయసులో మరణించారు. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘంఢీ. ఆయన 1912,సెప్టెంబర్ 12న బొంబాయిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతిమాయి, జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ. వీరు పార్సీ మతానికి చెందివారు. జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ మెరైన్ ఇంజనీర్. తండ్రి మరణించినప్పుడు ఫిరోజ్ గాంధీ చాలా చిన్నవాడు. యువ ఫిరోజ్ నాటి రోజుల్లో లేడీ డఫెరిన్ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేస్తున్న తన అత్త షిరిన్ దగ్గర ఉండేందుకు అలహాబాద్ చేరుకున్నారు. ఫిరోజ్ అలహాబాద్‌లోని ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఫిరోజ్ గాంధీ జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం. రెండవది నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడటం. ఫిరోజ్ గాంధీ ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆ కళాశాల వెలుపల జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఒకరోజు ఆమె అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఫిరోజ్ ఆమెకు సాయం అందించారు. ఆ రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ‘ఆనంద్ భవన్’ కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచే ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యం కొనసాగింది. అదే సమయంలో ఫిరోజ్ తన ఇంటిపేరులో ‘ఘంఢీ’ని ‘గాంధీ’గా మార్చుకున్నారు. మహాత్మా గాంధీపై గల గౌరవంతోనే ఫిరోజ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీతో పరిచయం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. ఫిరోజ్ ఆమె కంటే 5 ఏళ్లు పెద్ద. కాగా కమలా నెహ్రూ.. ఇందిర, ఫిరోజ్‌ల వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగరిక ఘోష్ తన పుస్తకం ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’లో.. టీబీ కారణంగా కమలా నెహ్రూ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఫిరోజ్ ఆమెను చికిత్స కోసం జర్మనీ తీసుకువెళ్లారని రాశారు. ఇది కూడా చదవండి: లండన్‌లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి? -
‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్‌కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్‌లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్‌పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్‌లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్‌లో, మూడవ భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
గాంధీ జంక్షన్లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..
కరీంనగర్: 715 ఫీట్లలోతులో బోర్వెల్.. 492 ఫీట్ల మేర కేసింగ్ పైప్.. ఇది నగరంలోని కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్ వద్ద వేసిన అధికారులు వేసిన బోర్వెల్ లెక్కలు. జంక్షన్ అభివృద్ధిలో భా గంగా ఇటీవల వేసిన బోర్వెల్కు సంబంధించిన లెక్కలు నగరపాలకసంస్థలో జరుగుతున్న అక్రమాలను తారాస్థాయికి తీసుకుపోయాయి. అవడానికి చిన్నబిల్లు అయినా, వేసిన కేసింగ్ పైప్ లెక్కలు చూసి కాంట్రాక్టర్లు కళ్లు తేలేస్తున్నారు. సింగరేణి మి నహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే ఇంత లోతులో కేసింగ్ పైప్‌లైన్ వేసిన దాఖలాలు లేవని బోర్వెల్ యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 175 ఫీట్లలోతులో బోరు.. నగరంలోని కూడళ్ల ఆధునీకరణలో భాగంగా కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్‌ను అభివృద్ధి చేసి నాలు గు నెలల క్రితం ప్రారంభించారు. జంక్షన్ అభివృద్ధిలో భాగంగా అక్కడ బోర్వెల్ వేశారు. ఈ బోర్ వెల్‌కు సంబంధించిన చెల్లింపులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఎంబీ రికార్డ్ ప్రతులతో ఈ బోర్ 715 ఫీట్లు (218 మీటర్లు) వేసినట్లు, 492 ఫీట్ల (150 మీటర్లు) కేసింగ్పైప్ వేసినట్లు తేలింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా 50, 60 ఫీట్లకు మించి కేసింగ్ వేయరు. గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి ప్రాంతాల్లో మాత్రమే కేసింగ్ పైప్‌లు ఎక్కువగా వేస్తారు. కానీ కరీంనగర్ సిటీలో ఈ స్థాయిలో కేసింగ్ పైప్‌లు వేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని బోర్వెల్ యజమానులంటున్నారు. తాము ఇప్పటివరకు 492 ఫీట్ల కేసింగ్ పైప్ అనే ముచ్చటే వినలేదని ఆశ్చర్యపోతున్నారు. గ్రానైట్ పనులు నిత్యం నడిచే బావుపేట ప్రాంతంలో కూడా 70, 80 ఫీట్లకు మించి కేసింగ్ వేయలేదంటున్నారు. తన 35ఏళ్ల సీనియార్టీలో వంద ఫీట్ల కేసింగ్ పైప్ ఒక్కసారి కూడా వేయలేదని నగరానికి చెందిన ఓ సీనియర్ బోర్వెల్ యజమాని పేర్కొన్నారు. అవినీ తిలో చరిత్ర సృష్టించే ఘనత వహించిన కొంతమంది అధికారులు ఇష్టారీతిన చేస్తున్న అంచనాలు, బిల్లుల వ్యవహారానికి ఇది సజీవ తార్కాణం. సున్నా జత చేశారా...? చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు సున్నా జత చేశారా అనే చర్చ సాగుతోంది. అక్కడ 15 మీటర్ల మేరనే కేసింగ్ పైప్ వేశారని, దానికి సున్నా జత చేసి 150 మీటర్లుగా రాశారని, అలాగే రూ.9,060 బిల్ అయితే సున్నా కలిపి రూ.90,600 గా మార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలోనూ ఈ జంక్షన్లో గాంధీ విగ్రహాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా బోర్వెల్ లెక్కల్లో నమ్మలేని పనులు జరిగినట్లు బిల్లులు సృష్టించడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై సమగ్రవిచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బోర్వెల్ కేసింగ్ పైప్ వ్యవహారంపై ఇంజినీరింగ్ అధికారులు స్పందించలేదు. ముందుగా తమ పరిధిలోకి రాదంటూ దాటవేశారు. సంబంధిత ఏఈ విషయం విన్న తరువాత స్పందించడం మానేశారు. -
జనరల్ డయ్యర్‌ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్‌వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్‌ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్‌ను క్షమించారు. ‘డయ్యర్‌ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్‌కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్‌పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్‌వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్‌వాలాబాగ్‌లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్‌కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్‌ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
శేరీలింగంపల్లి నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..!
శేరీలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ 2014లో టిడిపి,బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలవగలిగారు. గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు. గాందీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. శేరిలింగంపల్లిలో 2014లో టిడిపి అభ్యర్ధిగా అరికపూడి గాందీ 75904 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.శేరీలింగంపల్లిలో ఒకసారి బిసి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి గెలవగా, రెండుసార్లు కమ్మ సామాజికవర్గం నేత గెలుపొందారు. శేరీలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రైలు పుస్తకం
ఈ దేశానికి స్వాతంత్య్రం రైలు వల్లే వచ్చిందంటే ఉలిక్కిపడవలసిన అవసరం లేదు. జూన్ 7, 1893 రాత్రి– సౌత్ ఆఫ్రికా డర్బన్ నుంచి ప్రెటోరియాకు గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మొదటి తరగతి టికెట్ ఉన్నా, అది ‘వైట్స్ ఓన్లీ క్యారేజ్’ కావడాన పీటర్మార్టిస్బర్గ్ అనే చిన్న స్టేషన్ లో కిందకు ఈడ్చేశారు. వివక్షతో కూడిన ఆధిపత్యం ఎంతటి క్రూరమైనదో గాంధీకి అవగాహన వచ్చిన సందర్భం అది. భారతదేశం వచ్చాక ఇక్కడ బ్రిటిష్‌వారి పాలనలో అంతకన్నా ఘోరమైన వివక్షను, ఆధిపత్యాన్ని దేశ జనులు అనుభవిస్తున్నారని ఆయనకు తెలియచేసింది రైలే. ‘మూడవ తరగతి పెట్టెల్లో విస్తృతంగా తిరిగాక ఈ దేశమంటే ఏమిటో అర్థమైంది’ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత స్వాతంత్య్ర సంకల్పం తీసుకున్నాడు. నిజానికి గాంధీ రైలు ప్రయాణాలే జనం చెప్పుకుంటారుగాని నెహ్రూ కూడా ‘నేను ఈ దేశాన్ని రైలులో తిరగడం ద్వారానే ఆకళింపు చేసుకున్నాను’ అని ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో రాసుకున్నాడు. ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా వాసికెక్కిన లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ రాజ్యం, పాలన బలపడాలంటే భారతదేశంలో రైళ్ల వ్యవస్థ సమర్థంగా విస్తరించాలని భావించాడు. అయితే డల్హౌసీ ఒకటి తలిస్తే దేశ జనులు మరొకటి తలిచారు. ఏనాడు కనని, వినని ప్రాంతాలను రైలు ద్వారా సగటు భారతీయుడు తెలుసుకున్నాడు. బహు జాతులతో, సంస్కృతులతో సంపర్కంలోకి వచ్చాడు. అలా మనదంతా ఒక జాతి, ‘భారత జాతి’ అనే భావన పాదుకొనడానికి, అందరూ ఏకమై బ్రిటిష్ వారిపై పోరాడటానికి మొదటి భూమికను ఏర్పరించింది ఈ దేశంలో రైలే. ‘భారతీయులు తమ పల్లెటూళ్లను రైల్వేస్టేషన్ లోకి తీసుకొస్తారు. పల్లెల్లో వాళ్ల ఇళ్లల్లోకి రానీయకపోవచ్చు. కాని పల్లె స్వభావం మొత్తం స్టేషన్ లో ప్రదర్శనకు పెడతారు’ అని అమెరికన్ ట్రావెల్ రైటర్ పాల్ థెరూ ‘ది గ్రేట్ రైల్వే బజార్’ (1975) పుస్తకంలో రాశాడు. నిజమే. గడ్డి మోపులు, ధాన్యం బస్తాలు, కోళ్ల గంపలు, కుండలు, గిన్నెలు, కట్టెలు, పాల క్యాన్లు, సైకిళ్లు, పనిముట్లు, అరుపులు, కేకలు, అక్కరలు, మక్కువలు... వారు స్టేషన్ కు తేనిది ఏమిటి? బండి ఎక్కించనిది ఏమిటి? ‘భారతదేశంలో రైలు కంపార్ట్మెంట్ అంటే ఇల్లే. అందులో ప్రతి ఒక్క ఇంటి సభ్యుణ్ణి చూడొచ్చు. రైలులో వారు అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నలుగానే ఎక్కువగా ప్రయాణి స్తారు. ప్రయాణికులుగా తక్కువగా మారుతారు’ అని మరొక పాశ్చాత్య రచయిత రాశాడు. దొరలు ఎక్కే ఈ పొగబండి జన సామాన్యానికి అందుబాటులోకి వచ్చాక కథ, కవిత, నవల, సినిమా, నాటకాల్లో దీని ప్రస్తావన లేకుండా సృజన సాగలేదు. భారతీయ రైళ్లను, వాటి కిటికీల గుండా కనిపించే దేశాన్ని మొదట రడ్యార్డ్ కిప్లింగ్ ‘కిమ్’ (1901) నవలలో రాశాడు. అయితే రైలును ఒక చారిత్రక సాక్ష్యంగా కుష్వంత్ సింగ్ మలిచాడు. మనో మజ్రా అనే చిన్న సరిహద్దు గ్రామంలో జనం ఒక ట్రైన్ ఆ ఊరి మీదుగా వెళితే నిద్ర లేస్తారు. మరో ట్రైను కూత వినిపిస్తే మధ్యాహ్నం కునుకు సమయం అని గ్రహిస్తారు. ఇంకో ట్రైన్ శబ్దం వచ్చాక రాత్రయ్యింది పడుకోవాలి అని పక్కల మీదకు చేరుతారు. 1947లోని ఒక వేసవి రోజు వరకూ వారి దినచర్య అలాగే ఉండేది. కాని ఆ రోజున వచ్చిన ఒక రైలు వారి జీవితాలను సమూలంగా మార్చేసింది. ఆ ఊరి వాళ్లు ఆ రైలు రాకతో హిందువులుగా, ముస్లింలుగా, సిక్కులుగా విడిపోయారు. ఆ తర్వాత? ‘ట్రైన్ టు పాకిస్తాన్ ’ నవల చదవాలి. రైలు ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ‘గాలి వాన’ అనే గొప్ప కథ రాశారు పాలగుమ్మి పద్మరాజు. మనుషుల ప్రాథమిక సంవేదనల ముందు వారు నిర్మించుకున్న అహాలు, జ్ఞానాలు, ఆస్తులు, అంతస్థులు, విలువలు గాలికి లేచిన గడ్డిపోచల్లా కొట్టుకుని పోతాయి అని చెప్పిన కథ ఇది. చాసో ‘ఏలూరెళ్లాలి’ కథ రైలు పెట్టెలోనే మనుగడ రహస్యాన్ని విప్పుతుంది. రైలు చుట్టూ ఎన్నో ప్రహసనాలు, పరిహాసాలు. తిలక్ రాసిన ‘కవుల రైలు’లో కవులందరూ ఎక్కి కిక్కిరిసిపోతారు. పాపం ప్లాట్‌ఫారమ్ మీద ఒక యువతి మిగిలిపోతుంది. ‘నీ పేరేమిటమ్మా’ అంటాడు స్టేషన్ మాస్టరు. యువతి జవాబు– ‘కవిత’! ‘షోలే అంత పెద్ద హిట్ ఎందుకయ్యింది’ అని ఎవరో అడిగితే ‘రైలు వల్ల’ అని సమాధానం ఇచ్చాడు అమితాబ్. ‘షోలే’ సినిమా రైలుతో మొదలయ్యి రైలుతో ముగుస్తుంది. అందులోని ట్రైన్ రాబరీ వంటిది ఇప్పటికీ మళ్లీ సాధ్యపడలేదు. ‘సగటు ప్రేక్షకుడికి రైలు కనపడగానే కనెక్ట్ అయిపోతాడు’ అని అమితాబ్ ఉద్దేశం. ‘ఆరాధన’లో రైలు కిటికీ పక్కన పుస్తకం చదువుకుంటున్న షర్మిలా టాగోర్‌ను, రోడ్డు మీద జీప్‌లో పాడుకుంటూ వస్తున్న రాజేష్ ఖన్నాను మర్చిపోయామా మనం? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్– కదిలిపోతున్న రైలులోని హీరోను అందుకోవడానికి హీరోయిన్ పరుగులు– సూపర్‌హిట్ ఫార్ములా! అందుకే రైలు ఈ దేశ ప్రజల జీవనంలో అవిభాజ్యం. అంతేనా? రైలు ఈ దేశంలో ఎన్నో బరువుల, బాధ్యతల, మమతల, కలతల, కలల వాహిక. గమ్యంపై ప్రయాణికుడు పెట్టుకునే నమ్మకం. ‘చేరి ఫోన్ చేస్తారు’ అని కుటుంబం పెట్టుకునే భరోసా. బెర్త్‌పై నిశ్చింతగా ముసుగు తన్నే నిద్ర. దానికి దెబ్బ తగిలితే భారతీయుడు విలవిల్లాడతాడు. ‘నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. మృత్యుశకటం లాంటి రైలు కంటే ఎప్పటికీ రాని రైలు మేలైనది అనిపిస్తే ఆ నేరం ఎవరిది? -
తిరుపతి ఐఐటీలో సందడి చేసిన సింగర్ నిఖితా (ఫొటోలు)
-
టీనేజ్‌లో గాంధీజీని తీవ్రంగా విమర్శించేవాడిని: కమల్ హాసన్
సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్‌కి చెప్పారు. తాను టీనేజ్‌లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు. సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో కమల్‌హాసన్‌కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్ హాసన్‌తో అన్నారు. అలాగే రాహుల్ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్ చేయగా, అందుకు ప్రతిగా కమల్ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు. (చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు) -
రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
దుర్గా మండపంలో విగ్రహం వివాదం.. మహిశాసురుడిలా గాంధీ!
కోల్‌కతా: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వివాదానికి కేంద్ర బిందువైంది. త్రిశూలంతో దుర్గామాత వధిస్తున్న మహిశాసురుడు.. గాంధీజీ రూపురేఖల్లో ఉండటమే ఇందుకు కారణం. బట్టతలతో, గుండ్రని కళ్లద్దాలతో ధోతీ ధరించినట్లు ఆ విగ్రహముంది. గాంధీజీని అవమానించాలనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించాయని పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌సహా పలు పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. అయితే, ఈ ఘటనను అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి సమర్థించుకున్నారు. ‘అసురుడి ముఖం అలా ఉండటం కేవలం యాదృచ్ఛికం. అయినా, ఆ బొమ్మ చేతిలో రక్షణ కవచం ఉంది. గాంధీజీ అవేం ధరించడుకదా. అయినా నేతాజీ, భగత్‌సింగ్‌లే నిజమైన హీరోలు. గాంధీజీని విమర్శించాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ ఇదే బీజేపీ, సంఘ్ పరివార్ నిజమైన భావజాలం. మిగతాదంతా డ్రామా. మహాత్ముడిని ఇలా అవమానిస్తారా?’ అని టీఎంసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కునాల్ ఘోష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెల్సుకున్న పోలీసులు మండపానికి వెళ్లి రాక్షసుడి ముఖాన్ని మరో రూపంలోకి మార్చాలని నిర్వాహకులకు సూచించారు. చదవండి: మంగళ్యాన్ కథ ముగిసింది -
వలస కూలీల హీరో.. లాయర్ గాంధీ
వలస ఒప్పంద కూలీలైన ‘గిరిమిటియా’లను ఆ చెర నుంచి విడిపించడం కోసం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయిన లాయర్ గాంధీ.. ఆ పని సాధించాకే తిరిగి ఇండియా వచ్చారు. గాంధీజీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటం చేశారో అంతటి పోరాటం దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం చేశారు. 1893 మే నెలలో న్యాయవాదిగా వృత్తి ధర్మంతో దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు గాంధీ. ఆ పని సంవత్సరంలో అయిపోయింది. 1894లో స్వదేశానికి తిరిగి రావలసి వుంది కానీ ఆ దేశంలో వారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వలన కలిగే నష్టాలేమిటో అక్కడి మన భారతీయులకు వివరించడానికి గాంధీజీ ఆగిపోయారు. అలా గాంధీజీ బిల్లు గురించి చెప్పేసరికి వారంతా గాంధీజీని అక్కడే (దక్షిణాఫ్రికాలో) ఉండిపోయి తమ కష్టాలను నివారించమని కోరారు. దాంతో గాంధీజీ అక్కడే 21 సంవత్సరాలు.. అంటే 1914 వరకూ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ప్రధానంగా గిరిమిటియాల సమస్యను పరిష్కరించాడు. ‘గిరిమిటియా’ అంటే ‘ఒప్పంద వలస కూలీ’ అని బ్రిటిష్ అర్థం. పద్ధతి రద్దు కాలేదు ఐదేళ్లు పని చేస్తామని అంగీకరించి ఒప్పందం పత్రంపై సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు ఉపాధి కోసం వెళ్లిన వారిని గిరిమిటియాలు అంటారు. అటువంటి గిరిమిటియాలకు 1914లో విధించిన 3 పౌండ్ల పన్ను రద్దు అయినప్పటికీ, ఆ విధానం మాత్రం పూర్తిగా రద్దు కాలేదు. (1916లో మదన్ మోహన్ మాలవ్య పెద్దల కౌన్సిల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దీనికి సమాధానంగా లార్డ్ హార్డింగ్ తగిన సమయం వచ్చినప్పుడు ఆపుతామని అన్నారు.) గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లే నాటికి ఆ దేశం నాలుగు కాలనీల సమూహం. నేటాల్, కేఫ్, ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్. డచ్చి వారు (బోయర్స్) ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లోనూ, బ్రిటిష్ వారు నేటాల్, కేఫ్ ప్రాంతాల్లోనూ ఉండేవారు. వీరు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉండేవారు. చివరకు బోయర్స్ వార్తో దక్షిణాఫ్రికా యావత్తూ బ్రిటిష్ వారి వశమయ్యింది. అయితే భారతీయుల న్యాయపరమైన హక్కుల రక్షణకే ఈ యుద్ధం చేశామని బ్రిటిష్ వారు చెబుతూ వచ్చారు. ఇష్టమైతే మరో ఐదేళ్లు దక్షిణాఫ్రికాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఖనిజ సంపద, వజ్రాలు పైకి తీయడానికి శ్వేత జాతీయులకు భారతీయ కూలీల సహాయం విధిగా కావాలి. కనుక భారతీయ కూలీలను కాంట్రాక్టు పద్ధతిమీద దక్షిణాఫ్రికా పంపడానికి ఇండియాలోని బ్రిటిష్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటువంటి కాంట్రాక్టు కూలీల జట్టు ఒకటి 1860లో దక్షిణాఫ్రికా చేరింది. కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతోనే వారికి ఇష్టమయితే మరో అయిదు సంవత్సరాల పాటు తిరిగి కూలీలుగా కాంట్రాక్టు లో చేరవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణానికయ్యే ఖర్చుకు ఎంత భూమి లభిస్తుందో అంత భూమిని వారికే కేటాయిస్తారు. ఆ భూమిలో స్థిరపడి వారు అక్కడే సేద్యం చేసుకోవచ్చు. అలా స్థిరపడిన వారి అవసరాలు తీర్చడానికి అచిరకాలంలోనే భారతీయ వర్తకులు కూడా అక్కడ ప్రవేశించారు. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో భారతీయ జనాభా పెరిగింది. అవసరం కోసం ఆసరా! 1969లో ఇంకా కూలీలను ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు ‘కూలీ కాంట్రాక్టు కాల పరిమితి అయిపోవడంతోనే వారు ఆ దేశంలోని సాధారణ చట్టాలను అనుసరించి జీవించడానికి వీలుండాలనీ, ఏ విధమైన నిర్బంధాలు ఉండకూడదని’ బ్రిటన్ స్పష్టం చేసింది. 1858లో విక్టోరియా రాణి ప్రకటనలో కూడా ‘‘మన ఇతర దేశాల ప్రజల వలనే భారతీయులకు కూడా సమాన హక్కులుంటాయి’’అని హామీ ఇచ్చారు. భారతీయ వర్తకులు చౌకగా జీవించగలిగేవారు. అందువల్ల బ్రిటిష్ డచ్ వర్తకులకన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మగలిగేవారు. దాంతో భారతీయ వర్తకులు యూరోపియన్ వర్తకులకు బాగా పోటీగా వున్నారని వారు గ్రహించారు. భారతీయ వ్యవసాయదారులు కొత్త రకాలైన కాయలను, పండ్లనూ, చౌకగానూ, విస్తారంగానూ పండించడం మొదలుపెట్టారు. అలా భారతీయుల్ని స్వేచ్ఛగా తమ దేశంలోనికి రానిచ్చినట్లయితే వారు వ్యవసాయంలోనూ, వ్యాపారం లోనూ తెల్లవారిని తుడిచి పెట్టేస్తారేమోనని వారు భయపడ్డారు. అందువల్ల భారతీయులపై అనేక ఆంక్షలను విధించడం ప్రారంభించారు. 1885 లో 3 వ నెంబరు చట్టాన్ని ట్రాన్స్ వాల్ లో ప్రవేశపెట్టారు. ఆసియా వాసులు.. ముఖ్యంగా భారతీయులు పారిశుధ్య కారణాల వల్ల వారికి ప్రత్యేకించబడిన ప్రాంతాలలోనే నివసించాలనీ, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో తప్ప స్థిరాస్తులను సంపాదించుకోకూడదని, వ్యాపారనిమిత్తం వచ్చేవారు లైసెన్సు పొంది రిజిస్టర్ చేయించుకుని రావాలని శాసించింది ప్రభుత్వం. ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతటా భారతీయుల మీద జాతి విద్వేషం, రైళ్లలోనూ, బస్సుల్లోనూ, స్కూళ్లలోనూ, హోటళ్లలోనూ అపారంగా పెరిగిపోయింది. పర్మిట్ లేకుండా భారతీయులను ఒక కాలనీ నుంచి మరో కాలనీకి పోనివ్వలేదు. భారతీయుల సంఖ్య హెచ్చుగా వున్న ‘నేతాల్‘ లో భారతీయుల ఓటు హక్కును రద్దు చేశారు. ఆ క్రమంలో గాంధీజీ ఓడలో దక్షిణాఫ్రికాలోని టయోటా రేవుకు చేరారు. ఓడ దిగక ముందే.. ‘మీరు తిరిగి వెళ్లిపోండి లేకపోతే సముద్రంలో ముంచేస్తాం, తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ ఇచ్చివేస్తాం‘ అని ఓడ ప్రయాణికులను అక్కడివారు హెచ్చరించారు. చివరకు పోలీసు వారి సహాయంతో ఓడ దిగగానే గాంధీజీ పై రాళ్ల దాడి జరిగింది. ఎలానో గాంధీజీ ని పోలీసులు ఇంటికి చేర్చారు. స్థానికులు గాంధీజీ ఇంటి ముందు చేరి ‘గాంధీ ని మాకు అప్పగించండి’ అని గొడవ చేశారు. ప్రిటోరియా లో గాంధీజీకి క్షవరం చేయడానికి క్షురకుడు కూడా నిరాకరించాడు. ఆ విధంగా న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలను నివారించడానికి గాంధీజీ 21 సంవత్సరాలు పోరాటం చేయాల్సివచ్చింది. ఆ పోరాటం వల్లనే గిరిమిటియా సమస్య కూడా పరిష్కారమయ్యింది. 1914 లో గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చి అకుంఠిత దీక్షతో దక్షిణాఫ్రికా పోరాట అనుభవంతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 1947 లో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకురాగలిగారు. – డా. కాశింశెట్టి సత్యనారాయణ,విశ్రాంత ఆచార్యులు (చదవండి: సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా) -
తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్: ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ గాంధీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నేతలను సమీకరించి పోరాడితే.. కేసీఆర్ తెలంగాణ తేవడంతోపాటు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నార న్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్‌లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
బాపూ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర బాపూ డైరీనీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రగతిభవన్‌లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వడ్ల సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ డైరీలో ఐక్యరాజ్య సమితి సూచించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలను పొందుపరిచినట్లు వెల్లడించారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సంస్థ ప్రతినిధుల కృషిని మంత్రి కేటీఆర్ అభినందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని గోశాలలో నిర్వహిస్తున్న రామచంద్ర ప్రకృతి ఆశ్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి, ఆశ్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఎస్.వి.సి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ మాట కూడా వినరా?
గాంధీజీ–అంబేడ్కర్ మధ్య వివాదమూ, చర్చలూ, ఆ తర్వాత 1932 సెప్టెంబర్ 24న జరిగిన పూనా ఒడంబడిక– ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య వివరించారు (సాక్షి; సెప్టెంబరు 23). యువతరంలో చాలామందికి అంతగా తెలియని ఉదంతమిది. 30 ఏళ్ళ యువ అంబేడ్కర్– అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలనీ; అదీ దళితుల ద్వారానే ఎన్నిక య్యేలా ఉండాలనీ బ్రిటిష్ పాలకులను కోరారు. ఇది హిందువులను చీలుస్తుం దనే కారణంతో గాంధీ వ్యతిరేకించినా, ‘కమ్యూనల్ అవార్డు’ పేరిట బ్రిటిష్‌వారు అంగీకరించారు. ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ ఆమరణదీక్ష, ఫలితంగా అంబేడ్కర్‌పై ఒత్తిడి, చివరకు పూనా ఒడంబడిక జరి గాయి. దాని ఫలితమే నేడు అమలులోవున్న రిజర్వుడ్ స్థానాల విధానం. ఈ విధానంలో ‘నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నిక కావటం లేదు’ అన్న వాస్త వాన్ని లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఐతే అంబేడ్కర్ ఆశిం చినట్టుగా ఎన్నుకుంటే సామాజిక, రాజకీయరంగంలో ‘మౌలిక మార్పులు’ వచ్చేవి అనటం వాస్తవ విరుద్ధం. ఈ విషయాన్ని 1955 నాటికే అంబేడ్కర్ గుర్తిం చారు. విద్యావంతులైన దళితులు, వారి ప్రతినిధులు దళిత జనబాహుళ్యాన్ని విస్మరిస్తున్నారని బాహాటంగా 1956 మార్చి 18 ఆగ్రా ఉపన్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా తమ భవంతిలోకి ఆహ్వా నిస్తే, వెళితే వెళ్ళండి. అమ్ముడుపోవాలనుకుంటే మీ ఇష్టం... ఇతరుల నుంచి కాదు, నా వాళ్లనుండే నాకు ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తున్నాను’ అన్నారు. అంబేడ్కర్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవ కుండా చూశాయి పాలకవర్గాలు. రాజ్యాంగం ఆమోద మైన రెండేళ్ళకే, వయోజన ఓటింగుతో జరిపిన పార్ల మెంటు తొలి 1952 ఎన్నికల్లోనూ (ఆయన ఓట్లలో నాల్గవ స్థానంలో ఉన్నారు), 1954 ఉప ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ దళిత అభ్యర్థితో రిజర్వుడ్ సీటులోనే ఆయన్ని ఓడించారు. ఆమాటకొస్తే 1946లోని పరి మిత ఓటింగ్‌తో జరిపిన ఎన్నికల్లోనూ అదే స్థితి! సొంత రాష్ట్రం సంయుక్త మహారాష్ట్ర నుంచి గెలిచే సీటు లేక, తూర్పు బెంగాల్ వెళ్ళి అక్కడి దళిత, ముస్లిం పార్టీల మద్దతుతో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. తమ ప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న ఒక ‘రాజకీయ ఉద్యమా’నికి సన్నద్ధం కావాలని లక్ష్మయ్య రాశారు. ఇది సాధ్యం కాదు. గెలిచిన అభ్య ర్థులనే కాదు, పార్టీలనే కొనేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు. ఎస్సీ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ తన సమావేశంలో – అంబేడ్కర్ ఆధ్వర్యంలోనే– 1955 ఆగస్టు 21 నాడు ఒక తీర్మానం (నంబర్ 6) పాసు చేసింది, బొంబాయిలో ఏకగ్రీవంగా: ‘పార్లమెంటు, శాసనసభలు, మున్సిపాలిటీలు, జిల్లాబోర్డులు వంటి స్థానిక సంస్థలలో ఎస్సీలకున్న రిజర్వేషన్ నిబంధ నను వెన్వెంటనే – రాబోయే ఎన్నికలకు ముందే – రద్దుచేయాలి అని వర్కింగ్ కమిటీ భావిస్తున్నది’. ప్రభుత్వం ప్రచురించిన అంబేడ్కర్ సమగ్ర రచనల్లో ఉంది (వాల్యూం 17; పేజీ 439). ధనంజయ కీర్ రాసిన ప్రసిద్ధ జీవిత చరిత్రలోనూ దీన్ని పేర్కొన్నారు. రాజకీయ రిజర్వేషన్ని ‘రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని’ తీర్మానించినట్టు ఇలా పేర్కొన్నారు: కాంగ్రెసు నిలబెట్టిన ‘ఎలకల్లాటి’ ఎస్సీ అభ్యర్థులు, ఫెడరేషన్ నిల్పిన ‘సింహాలను’ వారి కేంద్రాల్లోనే ఓడించారని దిగ్భ్రాంతితో చేసిన తీర్మానం ఇది. అంబేడ్కర్ అక్కడితో ఆగలేదు. తానే స్థాపించిన ఆ ఫెడరేషన్‌ని (ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఓడారు) రద్దుచేయటానికి, కులప్రాతిపదిక లేని రిపబ్లిక్ పార్టీ స్థాపనకు నిర్ణయించి 1956 సెప్టెంబర్ 30న ప్రకటిం చారు. ఆ డిసెంబర్ 6న మరణించారు పైవే కాదు, ఇంకా అనేక విషయాలను మేధావులు దాచిపెడుతుం టారు. తమకి అంగీకారం వున్నా లేకపోయినా అంబే డ్కర్ అభిప్రాయాలను, చరిత్రను మరుగుపరచడం అంబేడ్కర్‌వాదులకు తగదు. అంబేడ్కర్‌వాద నాయ కులు అనేకమంది కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు; కాంగ్రెస్తోనేకాదు, బీజేపీతోనూ బీఎస్పీ కలిసి పని చేసింది. అందువల్ల లక్ష్మయ్య సూచనలు సాధ్యం కావు, అభిలషణీయమూ కాదు. – ఎం. జయలక్ష్మి ఏజీఎం(రిటైర్డ్), ఆప్కాబ్, హైదరాబాద్ -
గాడ్సే మరణ వాంగ్మూలం
జాతి పిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ హంతకుడు గాడ్సే నేపథ్యంలో ‘మరణ వాంగ్మూలం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై పరిశోధన చేశాను. గాంధీ తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మృతి చెందారు. గాంధీ హత్యలో గోపాల్ గాడ్సే ప్రమేయం ఏంటి? అనే అంశాల్ని కూడా చూపించనున్నాం’’ అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ–‘‘గాడ్సే రాసిన పుస్తకం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్‌లో తన వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘భరద్వాజ్‌గారు గాడ్సే మీద సినిమా గురించి చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. సినిమాని డిసెంబర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాత సూరజ్. -
సంఘ సంస్కరణకర్తగా గాంధీజీ
పుత్లీభాయి కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మనదేశానికి ఖ్యాతి తెచ్చినవారిలో అగ్రగణ్యుడుగా నిలిచాడు. మానవాళికి ఎన్నో క్రొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన ఆ మహా త్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో వున్నాయి. వారు ప్రవేశపెట్టిన సంఘసంస్కరణల గురించి పరిశీలిద్దాం. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు మనపై అధికారం చెలాయించడానికి రెండు కారణాలు ప్రధానమైనవిగా గమనించారు గాంధీజీ. వారి ఆధునిక సాంకేతిక ఆయుధబలం మొదటి కారణమైతే భారతీయులలో నాడు లోపించిన ఐకమత్యం రెండోది. బ్రిటిష్ వారి ఆయుధబలానికి ప్రతిగా మన సంఖ్యాబలాన్ని ఒడ్డడానికి అనుకూలమైన అహింసామార్గాన్ని అవలంబించారు. ఇటీవలకాలంలో దేశవిదేశాలలోని పెక్కు విశ్వవిద్యాలయాలు అహింసామార్గాన్ని పరిశోధించి అవిష్కరించిన రెండు సత్యాలు– (1) సామాన్యమానవునికి సాయుధపోరాటంలో కన్నా అహింసామార్గంతోకూడిన పోరాటంలో పాల్గొనడానికి పదకొండు రెట్లు అవకాశముంటుంది. (2) గత శతాబ్ద కాలంలో జరిపిన సాయుధపోరాటాలు 27% విజయం సాధించగా అహింసామార్గంతోకూడిన పోరాటాలు 51% విజయం సాధించినవి. మనలో ఐకమత్య లేమికి ప్రధాన కారణాలు కులమత భేదాలన్న విషయం గమనించిన బాపూజీ వాటిని రూపుమాపడానికి ఎన్నో సంఘసంస్కరణలు ప్రవేశపెట్టారు. తండ్రి పోర్బందర్ సంస్థానంలో దీవాన్ కావడంతో వారిం టికి అన్యమతస్తుల బడుగువర్గాలవారి రాకపోకలు మెండుగా వుండేవి. దాంతో గాంధీజీకి సహజంగానే విశాల దృక్పథం వుండేది. మార్గాలు వేరైనా అన్నిమతాల గమ్యం ఒకటేనన్నారు. అనామధేయుడైన భగవంతునికి సహస్రనామాలన్న సత్యాన్ని నొక్కి వక్కాణించారు. ఎవరేపేరుతో పిలిచినా పలికే భగవంతుడొక్కడేనన్నారు. గాంధీజీ ప్రవేశపెట్టిన సంఘసంస్కరణలన్నిటికీ మూలం తాను నమ్మిన ఈ అద్వైతంలో దొరుకుతుంది. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ మొదటి అధ్యాయం చంపారణ్ రైతుసమస్య పరిష్కారం. ఆనాటి జమీందారి వ్యవస్థ బ్రిటిష్ వారి పరిపాలనలో ప్రథమాంకం. శిస్తువసూలులో వారిది ప్రముఖపాత్ర. నూటికి తొంభైఐదుమంది రైతులు జమిందారులవద్ద పొలం కౌలుకి తీసుకొనేవారు. కౌలుకి తీసుకొన్న పొలంలో కొంతభాగం నాటి ప్రముఖ వాణిజ్య పంట అయిన ఇండిగోను పండించి మొత్తం ఇండిగో పంటని జమీందారుకివ్వాలన్నది నియమం. గత్యంతరంలేని రైతులు ఆ నియమాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదు. అద్దకంలో ఇండిగో ప్రముఖపాత్ర వహించినంతకాలం జమీందారులు తృప్తిగావున్నారు. జర్మనీవారు ఇండిగోకి ప్రత్యామ్నాయంగా కృత్రిమ డై కనిపెట్టడంతో ఇండిగో ధరలు గణనీయంగా పడిపోయాయి. దానితో రైతులపై జమీందారుల దౌర్జన్యం మితిమీరింది. ఇండిగోతోపాటూ రైతుల పంటధాన్యాలను కూడా చెల్లించుకోవల్సివచ్చింది. గాంధీజీ రైతులను, జమీందారులను విస్తృతంగా కలిసి పరిష్కారాన్వేషణలో నిమగ్నమైనారు. దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలు తెలుసుకొన్న కలెక్టరు ఆ ప్రాంతం నుంచి తక్షణమే గాంధీని వెళ్లిపోవాలని ఆదేశించారు. గాంధీజీ సహజంగానే ఆ ఆదేశాన్ని ఉల్లంఘించారు. అంతే సహజంగా గాంధీజీని బోనెక్కించారు కలెక్టరు. సమస్యా పరిష్కారం నేరమైతే నిస్సందేహంగా నేరస్తుడనని ఒప్పుకొంటానన్నారు గాంధీజీ. చట్టప్రకారం శిక్షార్హుడనని అందుకు తను సిద్ధంగా వున్నానని చెప్పారు. విషయం తెలిసిన గవర్నర్ హుటాహుటిన కలెక్టరు చేత కేసు విరమణ చేయించారు. పత్రికలద్వారా విపులంగా తెలుసుకొన్న ప్రజానీకానికి అసలుసిసలు శాసనోల్లంఘన అంటే ఏమిటో తెలి సింది. గాంధీగారు నాటినుంచి బాపూజీ ఐనారు. చంపారణ్లో రైతులపై జమిందారుల దోపిడీని కట్టడంచేయడంతో గాంధీజీ సరిపెట్టుకోలేదు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని రైతులు దోపిడీకి గురికావడంలో ఆశ్చర్యంలేదని గమనించిన గాంధీజీ పాఠశాలల్ని ఏర్పరచారు. స్త్రీపురుషుల అసమానతలను అంటరానితనాన్ని ఖండించారు. పరిసర పరిశుభ్రతను ప్రోత్సహించారు. సంఘసంస్కరణ బాధ్యతను కూడా చంపారణ్‌లోనే తన భుజాలపై వేసుకొన్నారు. స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని నాయకుడైనాడు. అలనాడు బడుగువర్గాలకు ఆలయప్రవేశంలేదు వారిని మతం మార్పించడంలో మిషనరీలు అంతగా కృతకృత్యులవడానికి ముఖ్యకారణమిదే కావచ్చు. నలుగురు మంచినీళ్ళు తెచ్చుకొనే బావి దగ్గరకొచ్చే ఆస్కారం లేదు. వారి పిల్లలు పాఠశాలకెళ్లే అవకాశాలు తక్కువ. ఒకవేళ వెళ్లగలిగినా అక్కడ వారెదుర్కొనే అవమానాలు అన్నీఇన్నీకావు. అందుకు బీఆర్ అంబేడ్కర్ పడ్డ అగచాట్లే తార్కాణం. పైగా వారికి చతుర్వర్ణాలలో తావివ్వక పంచములన్నారు. అంటరానివారని ఊరివెలుపల బ్రతకమన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురై అవమానాలకు గురైన గాంధీజీ అంటరానితనం అమానుషం అని ఎలుగెత్తిచాటడంలో ఆశ్చర్యమేముంది? నేటికి స్వాతంత్య్రభారతం సాధించిన ఘనవిజయాలలో అతిముఖ్యమైనది అంటరానితనాన్ని దాదాపుగా రూపుమాపడమని చెప్పవచ్చు. వారికి నేడున్న విద్యావుద్యోగావకాశాలు బ్రిటిష్ పాలనలో కలలోకూడా ఊహించుకోలేము. అలనాడు స్త్రీల పరిస్థితి కూడా దారుణంగా వుండేది. వారికి చదువుకొనే అవకాశాలు బహుతక్కువ. ఇంతెందుకు కస్తూరి గాంధీనే పెద్దగా చదువుకోలేదంటే సామాన్య వనితల విషయం చెప్పపనిలేదు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో వుంటుందని గాంధీజీ చెప్పేవారు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులుగా ఉండేవారని చెప్పటానికి వేదోత్తములైన గార్గివాచక్నవి సులభ మైత్రేయి గురించి ఉదహరించేవారు. జనక మహారాజు రాజసూయ యాగసమయంలో జరిగిన చర్చలో యాజ్ఞవల్క్యుడు గార్గివాచక్నవి పోటీపడ్డ కథను బృహదారణ్యకోపనిషత్‌లో ప్రస్తావించిన విషయం గుర్తుచేసేవారు. శారీరకంగా పురుషులది పైచేయి అయినా మానసికంగా స్త్రీలది పైచేయి అన్న నిజం గాంధీ ఆనాడే గ్రహించారు. స్వాతంత్య్రపోరాటంలో సైతం వారిని ప్రోత్సహించారు. అరుణా అసఫ్ ఆలీ సరోజినీ నాయుడు వంటి వారికి నాయకత్వపు అవకాశాలు కల్పించారు. కులమతభేదం వలదని నినాదాలివ్వడమే కాకుండా ఆచరణలో కూడా చూపించారు. ప్రేమవివాహాలపై కూడా గాంధీగారిది విశాలదృక్పథమే. కులాలు వేరైనా రాజాజీ కుమార్తెతో తన తనయుడికి వివాహం జరిపించారు. మతాలు వేరైనా ఇందిరానెహ్రూకి ఫిరోజ్ గాంధీతో దగ్గరుండి వివాహం జరిపించారు. గాంధీజీకే కాదు ఆయన శిష్యులకి కూడా కులమత భేదాలు లేవు. హిందూ కుటుంబంలో పుట్టిన అరుణా గంగూలీ ఒక ముస్లింని ప్రేమించి పెండ్లి చేసుకొని అరుణా అసఫాలీ అయినారు. అగ్రవర్ణాలకి చెందిన సరోజినీ రైతు కుటుంబానికి చెందిన వారిని పెండ్లాడారు. గాంధీజీ వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. ప్రముఖ గాంధేయవాది కమలాదేవి ఛటోపాధ్యాయ గారి ద్వితీయ వివాహం ఇందుకు నిదర్శనం. స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన గాంధీగారి గురించి రాజ కుమారి అమృత కౌర్ చెప్పిన నాలుగు మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. ‘గాంధీగారిలో మేము జ్ఞానసంపన్నులైన తండ్రినేకాదు అమృతతుల్యమైన తల్లినికూడా చూశాము. మా కష్టసుఖాలను ఆయనతో అరమరికలు లేకుండా పంచుకొనేవారిమి. అహింసామార్గం పుణ్యమా అని స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం దొరికింది’. (నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా) ఎంఆర్కే కృష్ణారావు, రిటైర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా -
మతరహిత దేశం.. గాంధీ స్వప్నం
గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15.. శాంతిని కోరుకుంటూ ఉపవాసం పాటించాల్సిన దినం. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగారు. ‘ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపుల వంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజుకూ వర్తించేటటువంటి, జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఘనమైన సమాధానం ఇచ్చారు. ’ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. అది 1946 నవంబర్ 6 నడిరాత్రి. దశాబ్దాలుగా మహాత్మాగాంధీ కాంక్షించిన స్వాతంత్య్రం మరికొన్ని నెలల్లో సిద్ధించబోతోంది. అప్పుడే దేశ విభజన శాపంలా ముందుకు వచ్చి అరాచకం, హత్యాకాండ రగులుకున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రాత్రి మహాత్మాగాంధీ ఒక పెర్రీ బోట్లో చాంద్‌పూర్ చేరుకున్నారు. క్రూర హింసాకాండకు గురైన హిందువుల పిలుపునందుకుని ఆయన నాటి తూర్పు బెంగాల్‌లోని నౌఖాలి మాగాణిప్రాంతంలో పూర్తిగా నాలుగు నెలల కాలం గడపదలిచారు. తన పర్యటనలో తొలి మజిలీలో అడుగుపెట్టిన వెంటనే బీహార్‌లో ముస్లింలపై పాశవిక ప్రతిదాడి మొదలైందన్న వార్తలు గాంధీ చెవిన పడ్డాయి. తీవ్ర విషాదంతో, అవమానంతో గాంధీ చెప్పారు. ‘ఈరోజు భారత స్వాతంత్య్రం బెంగాల్, బిహార్లలో ప్రమాదంలో పడింది. బిహారీలు పిరికిపందల్లా వ్యవహరించారు. బిహారీలు నిజంగా ఎదురుదెబ్బ తీయాలని భావించి ఉంటే వారు నౌఖాలికి వచ్చి అక్కడ ప్రాణాలివ్వడానికి సిద్ధపడి ఉండాలి’. ఆ మరుసటి రోజు రెండు ప్రతినిధి బృందాలు గాంధీని కలిశాయి. మొదట ముస్లిం ప్రతినిధులు వచ్చి, చాంద్‌పూర్‌లో ఎలాంటి అలజడులూ జరగకుండా చూస్తున్నామని చెప్పారు. తర్వాత హిందూ ప్రతినిధులు వచ్చారు. తమకు పోలీసు, మిలటరీ రక్షణ కావాలని చెప్పారు. ఆ సాయంత్రం చాంద్‌పూర్‌లో 15 వేలమంది (ఎక్కువమంది ముస్లింలే) హాజరైన సభలో గాంధీ ప్రసంగించారు. ‘ఇక్కడ బలవంతపు మత మార్పిడిలు జరిగాయని విన్నాను. బలవంతంగా గొడ్డుమాంసం తిని పించారని విన్నాను. బలవంతంగా పెళ్లిళ్లు జరిపిం చారని విన్నాను. ఇక హత్యలు, లూటీలు, దోపిడీల విషయం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు విగ్రహాలు కూల్చేశారు. ముస్లింలు విగ్రహారాధన చేయరు. నేను కూడా పాటించను. కానీ ఆ విగ్రహాలను పూజిస్తున్న వారి వ్యవహారాల్లో వీరు ఎందుకు తల దూర్చినట్లు? ఇలాంటి ఘటనలు ఇస్లాం పేరుకు కళంకం తెస్తున్నాయి’. తూర్పు బెంగాల్లో దహనకాండ పూర్తిగా అంతం కాకున్నా కాస్త చల్లారింది. తర్వాత గాంధీ 1947 మార్చి 3న ప్రత్యర్థి యుద్ధరంగమైన బిహా ర్కు వెళ్లారు. అక్కడ బిర్ అనే గ్రామంలో అమాయక ముస్లింలపై పాశవిక హింసాకాండ గురించి తెలుసుకుని ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీ తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయారు. ‘110 సంవత్సరాల వయసు ఉన్న ఒక వృద్ధ మహిళను మీ కళ్లముందే నరికిపారేస్తుంటే మీరు చూస్తూ ఇంకా ఎలా బతికి ఉన్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇక విశ్రాంతి తీసుకోను, ఇతరులను విశ్రాంతిగా ఉంచను. ఈ ప్రాంతమంతటా కాలినడకతోనే తిరుగుతాను. ఏం జరిగిందని ఇక్కడ పడి ఉన్న అస్థిపంజరాలను అడుగుతాను. ఈ మొత్తం ఘటనలన్నింటికీ పరిష్కారం కనుగొనేదాకా నేను శాంతిగా ఉండలేను. నాలో మంటలు రేగుతున్నాయి’ అని గాంధీ పేర్కొన్నారు. రెండు భూభాగాల్లో అధికార మార్పిడికి చర్యలు తుదిరూపం తీసుకుంటున్న సందర్భంలో గాంధీ ఆ తతంగానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఆయన హృదయం చెబుతున్న చోటికే ఆయన పాదాలు అడుగేశాయి. హింసాకాండ బాధితులు ఎక్కడుంటే అక్కడికల్లా ఆయన వెళ్లిపోయారు. ఇక ఆగస్టు మొదట్లో ఆయన బిహార్ నుంచి బెంగాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా వ్యవస్థ విఫలం స్పష్టంగా కనబడుతున్న నౌఖాలీకి తిరిగి వెళ్లాలన్నదే ఆయన ఉద్దేశం. కలకత్తాలో, అతిపెద్ద ముస్లిం ప్రతినిధి బృందం గాంధీని కలిసి అల్లర్లు జరగనున్నట్లు కనిపిస్తున్న నగరంలోనే ఉండిపోవాలని కోరారు. అయితే రెండు షరతులపై గాంధీ అందుకు అంగీకరించారు. ఒకటి. నగరంలో శాంతి పరిరక్షణకోసం తనను ఉండిపోవాలని కోరుతున్న కలకత్తా ముస్లింలు నౌఖాలీలో హిందువుల భద్రతకోసం ప్రయత్నం చేయాలి. రెండు, నగరంలో ముస్లిం నివాసుల భద్రతకు హిందువులు హామీ ఇచ్చేటటువంటి ముస్లిం ప్రాంతంలోనే తాను ఉంటాడు. గాంధీ ఎక్కడ విడిది చేయాలో నిర్ణయించారు. అది బెలియాఘట్ శివార్లలోని హైదరి మంజిల్. అది ఎంతో పాడుపడిన ఇల్లు అని మను గాంధీ నమోదు చేశారు. ‘ఆ ఇంటిలో ఏ సౌకర్యమూ లేదు. అన్ని వైపులా తెరుచుకునే ఉంటుంది. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఆ ఇంటిలోని ప్రతి అంగుళం దుమ్ముతో నిండివుంది. ఇంటినిండా వర్షధారలు కాస్త సౌకర్యంగా ఉన్నట్లు కనిపించే ఒక్క గదిలోనే బాపూతో సహా అందరూ గడిపారు’.ఆగస్టు 9న సమాచార శాఖకు చెందిన ఒక అధికారి గాంధీని కలిసి ఆగస్టు 15న జాతినుద్దేశించి సందేశం ఇవ్వాలని కోరారు. కానీ గాంధీ నిరాకరించారు. మీరు సందేశం ఇవ్వకపోతే ఆనాటి కార్యక్రమం పాడైపోతుందని ఆ అధికారి ఒత్తిడి చేశారు. దానికి గాంధీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘నేను సందేశం ఇవ్వను.. ఆ కార్యక్రమం పాడు కానివ్వండి’. ఆగస్టు 14న అక్కడ వాతావరణంలో కాస్త మార్పు కలిగినట్లు కనిపించింది. ప్రీమియర్ హెచ్ఎస్ సుహ్రావర్ధికి ఆరోజు తన కార్యాలయంలో చివరి రోజు. దాంతో స్వాతంత్య్ర ఉత్సవ కార్యక్రమాలను చూపించడానికి, చివరి బ్రిటిష్ గవర్నర్ నిష్క్రమించడాన్ని, భారత తొలి గవర్నర్ పదవీ స్వీకారాన్ని, పీసీ ఘోష్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును గాంధీకి చూపించడానికి తన వాహనంలో తీసుకుపోయే అవకాశాన్ని పొందారాయన. ఆ రోజు నగరంలో పరిస్థితులను చూసిన తర్వాతే గాంధీ తన సందేశం ఇచ్చారు. అది నాటి పరిస్థితులను ప్రతిధ్వనించిన సందేశం. ‘రేపు బ్రిటిష్ బంధనాలనుంచి విముక్తి పొందుతున్నాం. కానీ ఈ అర్ధరాత్రి నుంచే హిందూస్తాన్ రెండు ముక్కలవుతోంది. కాబట్టి రేపు అటు ఆనందాన్ని, విషాదాన్ని కలిగించే రోజుగా ఉండబోతోంది’ అని గాంధీ ఆ సందేశంలో పేర్కొన్నారు. గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15 ఉపవాసం పాటించాల్సిన దినం. ఆయన హృదయంలో ఆనాడు ఆగ్రహజ్వాలలు రేగుతూ ఉండిపోయాయి. 1942లో ఆ రోజునే మరణించిన తన పుత్రసమానుడైన కార్యదర్శి మహదేవ్ దేశాయి గురించి తల్చుకున్నారు. బెలియాఘటలో తాను ఉంటున్న చోటుకు వేలాదిమంది జొరబడ్డారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు కూడా వారిలో ఉన్నారు. ఆయన వారితో ఇలా అన్నారు. ‘ఊరించే సంపదల మాయలో పడవద్దు’. ఆ మరుసటి దినం 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగాడు. ’ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపులవంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఈరోజుకూ వర్తిస్తూ జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్న ఘనమైన సమాధానం ఇచ్చారు. ‘ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. (హిందూస్తాన్ టైమ్స్ సౌజన్యంతో) వ్యాసకర్త మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీవిశ్లేషణ -
అనంత్ ‘చరిత్ర’ పాఠాలు
నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అలాంటివారిలో ఒకరు. పార్టీలో శరవేగంతో ఎదగడానికో...అధినేత దృష్టిలో పడితే ఇప్పుడున్న స్థానాన్ని మించిన అవకాశాలు వస్తాయనో భావించి ఇష్టానుసారం మాట్లాడే నేతలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. కానీ అనంత్‌కుమార్ హెగ్డే ఆ కోవలోకి రారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకొచ్చినవారు కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపీగా పనిచేసినవారు. అలాంటి నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే కొత్తగా వచ్చే నాయకులకు, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పోతాయి. ఆ సంగతి ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఇంతక్రితం కూడా పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై నిరసనలు పెల్లుబికాయి. ఒకసారైతే నోరు జారారనుకోవచ్చు. కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటి వెనక నిర్దిష్టమైన ఉద్దేశాలు న్నాయని, ప్రయోజనాలున్నాయని అనుకోవాల్సివస్తుంది. ఆయన తాజాగా దేశ స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరెత్తకుండా, ఆయన్నుద్దేశించే అంటున్నట్టు అందరికీ అర్థ మయ్యేలా నిందాపూర్వకంగా వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి, అది తీసుకున్న మలుపుల గురించి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని, ఉంటారని ఆశించలేం. అలాగే స్వాతంత్య్రోద్యమంపైనా, దాని తీరుతెన్నులపైనా భిన్నాభిప్రాయం ఉండటం తప్పేం కాదు. ఆ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోనే షహీద్ భగత్‌సింగ్ వంటి వారికి గాంధీ అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి ఉండేది. బలప్రయోగంతో ప్రజల స్వాతంత్య్రేచ్ఛను అణిచివేయాలని చూస్తున్న బ్రిటిష్ పాలకులకు అదే భాషలో బదులీయాలని ఆయన వాదించేవారు. నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)ను స్థాపించి, యువతీయువకులను సమీకరించారు. అయితే హెగ్డే అభ్యం తరం పూర్తిగా వేరు. ఆయన దృష్టిలో స్వాతంత్య్రోద్యమంలో రెండు రకాలవారున్నారు. ఆయుధా లతో పోరాడినవారు. మేధోశక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసినవారు. వీరుగాక మరో రకం సమర యోధులున్నారు. ఈ సమరయోధులు బ్రిటిష్ పాలకులతో లాలూచీ పడి ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ సారథులు దాన్నెలా నడపాలో ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారినుంచి సలహాలు తీసుకునే వారు. పాలకులు చెప్పినట్టల్లా చేస్తామన్న అవగాహనతో, సర్దుబాట్లతో ఆ ఉద్యమం సాగింది. తమ ఉద్యమాన్ని గుర్తించి, తమను అరెస్టు చేసి జైలుకు పంపమని ఈ ఉద్యమ సారథులు పాలకులను వేడుకునేవారు. జైళ్లలో తమను జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరేవారు. ఇలాంటి నాయకులపై బ్రిటిష్ పోలీసులు ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. ఇంతవరకూ ఎవరి గురించి మాట్లాడు తున్నారో స్పష్టత లేకుండా ప్రసంగించిన అనంత్‌కుమార్ ఆ తర్వాత కాస్త స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్‌ను సమర్థించేవారంతా ఆమరణ నిరాహార దీక్షల వల్లా, సత్యాగ్రహం వల్లా స్వాతంత్య్రం వచ్చిందని చెబుతుంటారని, కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. సత్యాగ్రహం వల్ల బ్రిటిష్ పాలకులు ఈ దేశం వదిలిపోలేదని, వారు నిరాశానిస్పృహలకు లోనై స్వాతంత్య్రం ప్రకటిం చారన్నది హెగ్డే అభిప్రాయం. ఇలా స్వాతంత్య్రోద్యమ చరిత్రనంతా ఏకరువు పెట్టాక, ఈ ఉద్యమం నడిపించినవారు మన దేశంలో మహాత్ములయ్యారని వ్యాఖ్యానించారు. నిజంగా ఈ దేశం కోసం పనిచేసి, పెను మార్పులు తీసుకురావడానికి త్యాగాలు చేసినవారిని చరిత్ర చీకటి కోణాల్లోకి నెట్టేశారని ఆవేదన చెందారు. ఎవరికీ తెలియని ఈ చరిత్రనంతా తాను ఎక్కడ అధ్యయనం చేశారో ఆయన చెప్పలేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించాక తన మాటల్ని మీడియా వక్రీకరించిందని ఆయనంటున్నారు. తాను గాంధీ, నెహ్రూ పేర్లెత్తలేదని చెబుతున్నారు. ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ సమరం నడిపిందీ, ఆమరణ దీక్షలు చేసిందీ ఎవరో హెగ్డే చెప్పకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఉద్యమాలు సాగించినవారు మహాత్ములయ్యారన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేరూ ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ స్వాతంత్య్రోద్యమం గురించి ఎంతో కొంత తెలిసినవారికి కూడా ఎవరినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారో సులభంగా తెలుస్తుంది. నిజానికి అలా తెలియాలనే ఆయన అంత వివరంగా, అంత ‘స్పష్టంగా’ మాట్లాడారు. కాకపోతే పేర్లు నేరుగా వెల్లడించడానికి ఇంకా సమయం రాలేదని అనుకుని ఉండొచ్చు. ‘పెదవి దాటని మాటలకు మనం యజమానులం. పెదవి దాటి బయటకు వచ్చిన మాటలకు మాత్రం మనమే బానిసలవుతామ’ని బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మహాత్ముణ్ణి గుర్తుకుతెచ్చేంతగా వ్యాఖ్యానించిన హెగ్డే...తమ మేధో శక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసిన ఆ మహానుభావులెవరో కూడా స్పష్టంగా చెప్పివుండాల్సింది. అప్పట్లో ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి పాటుబడి, చరిత్ర చీకటికోణాల్లో మగ్గిపోయిన వారెవరో కూడా వివరించి ఉండాల్సింది. ఆయన అలా చేసివుంటే ఈ చర్చ మొత్తం వేరుగా ఉండేది. అలాగే తన ‘లాలూచీ’ ఆరోపణలకు సమర్థనగా బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలేమైనా వెల్లడించివుంటే అందరూ సంతోషించేవారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా గత నవంబర్‌లో ఇదేవిధంగా మహాత్మా గాంధీని ఏమనలేదు. కానీ ఆయన్ను పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశ భక్తుడన్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ మందలించింది. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చెప్పింది. స్వాతంత్య్రోద్యమాన్ని పల్చన చేసి, దాని సారథుల్ని కించపరిచి సాధించదల్చు కున్నదేమిటో హెగ్డే చెప్పాలి. తమ పార్టీ వారినుంచే తరచు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలెందు కొస్తున్నాయో బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
గాందీజీపై హెగ్డే వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
-
చిన్న చిన్న పాఠాలు
గురువు అంటే బెత్తం పట్టుకుని బడిలో తారసపడే వ్యక్తి మాత్రమేనా? అభ్యాసంలో చేయి పట్టి నడిపించేవాడు మాత్రమేనా? తప్పులను దండించి సరిదిద్దేవాడు మాత్రమేనా? ఒక్క చదువులో సాయం పట్టేవాడు మాత్రమేనా? దారి పొడవున ఎందరో గురువులు. ఎన్నో మలుపులు. ఎన్నోచోట్ల ఎందరో గురువులు తారసపడి జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అది చిన్న సలహాలా ఆ క్షణానికి అనిపించవచ్చు. కాని అది జీవితానికి సరిపడా గురోపదేశం కూడా కావచ్చు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత హక్కుల కార్యకర్త, కళాకారిణి మాయా యాంజిలో తనకు జీవితంలో గురోపదేశంలా ఉపయోగపడిన సలహా తన నానమ్మ నుంచే అందిందని చెప్పుకుంది. ‘మా నానమ్మ నాతో ఏమందంటే– అమ్మాయ్.. లోకం నిన్ను ఒక దారిలో నిలబెట్టి ముందుకు వెళ్లమంటే... ఆ దారి నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? ఆ దారి చూపే గమ్యం ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్? అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్లడం కూడా ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్. ఏమీ చేయకు. చప్పున ఆ దారి వొదిలి నీదైన దారిని కనిపెట్టు.. అని చెప్పింది. నేను అలా నా దారిని కనిపెట్టుకున్నాను’ అందామె.టాటా సంస్థల్లో ఒక ముఖ్య అధిపతి, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జంషెడ్ జె.ఇరానీకి తన పదిహేడో సంవత్సరం అతి ముఖ్య ఉపదేశం తండ్రి నుంచే అందింది. విదేశాలలో చదువుకోవడానికి వెళుతున్న జంషెడ్ ఇరానీతో తండ్రి– ‘అబ్బాయ్... ప్రపంచంలో పుట్టే ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఆ పదోవాడికి పని చేసి పెట్టడానికే పుడతారు. కనుక నువ్వు ఆ పదోవాడిగా ఉండటానికే ప్రయత్నించు’ అన్నాడు. అప్పటి వరకూ ఒక లక్ష్యం లేని జంషెడ్ ఆ సలహా విని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే సంపద అంటే ఆర్థిక సంపద మాత్రమే కాదు. ఆత్మిక సంపద కూడా. అలాంటి సంపదను కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విలువైన సలహాలు గురోపదేశాలై జీవితాన్ని నడిపిస్తాయి. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ తన భర్తను కోల్పోయినప్పుడు ఆమెకు ఇద్దరు కుమార్తెలే ఉండటాన, కుమారుడు లేనప్పుడు భర్త ఆస్తి దక్కని చట్టం నాడు ఉనికిలో ఉండటాన, బంధువులు ఆ చట్టాన్ని ప్రస్తావించి తనకు ఏమీ దక్కని పరిస్థితి తెచ్చి పెట్టబోతున్నారని గ్రహించి వారందరి మీద కోపంతో ఆమె అమెరికా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. అప్పుడు గాంధీజీ ఆమెను పిలిచి ‘నీ లోపల అశాంతి పెట్టుకుని ఎంత దూరం వెళ్లినా ప్రశాంతత పొందలేవు. సామరస్యం వల్లే శాంతి వస్తుంది. ఎవరో మనకు హాని చేస్తారని అనుకుంటాం కాని మనకు మనం తప్ప ఎవరూ హాని చేయలేరు. నువ్వు నీ వారితో సయోధ్య చేసుకో’ అని చెప్పారు. ఆ మాట విన్న విజయలక్ష్మి బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లింది. వాళ్లందరూ ఎంతో రిలీఫ్ పొందారు. ఆమెకు కూడా ఆందోళన వదిలిపోయింది. బంధాలు నిలబడ్డాయి. అంతే కాదు... గుడ్డిగా వెళ్లే దారిలో చిన్న టార్చిలైట్‌లాగా మిత్రుల నుంచి గురోపదేశం అందుతుంది. నటుడు మనోజ్ బాజ్‌పాయ్ థియేటర్ ఆర్టిస్ట్‌గా ఢిల్లీలో సంవత్సరాల తరబడి పని చేశాడు. ఎన్నేళ్లు పని చేసినా నటుడుగా పేరు, గుర్తింపు తప్ప ఆర్థిక ఉన్నతి లేదు. కాని తోటి నటులంతా అలాగే ఉన్నారు కనుక అలా ఉండటమే జీవతం కాబోలు అని అతను అనుకున్నాడు. కాని ‘బాండిట్ క్వీన్’ ఆడిషన్స్ కోసం ఢిల్లీ వెళ్లిన దర్శకుడు శేఖర్ కపూర్ మనోజ్ బాజ్‌పాయ్‌ని ఒక పాత్రకు ఎంపిక చేసి ‘జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని, అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు లేని ఇలాంటి జీవితంలో ఎన్నాళ్లుంటావ్. సినిమాల్లో నటించు’ అని హితవు పలికాడు. ఆ సలహా అతణ్ణి ఇవాళ ఎక్కడ నిలబెట్టిందో మనకే తెలుసు.+ తెలుగులో వేటూరి సుందరరామ మూర్తికి కూడా పాత్రికేయ వృత్తి మీద, కవిగా జీవనం సాగించం మీద మాత్రమే ఆసక్తి వుండేది. కాని ఆయన విద్వత్తును గమనించిన ఎన్.టి.రామారావు ‘సినిమాలకు పాటలు రాయండి’ సలహా ఇచ్చారు. కాని దానిని వేటూరి పాటించలేదు. రెండు మూడేళ్లు గడిచిపోయాయి. మళ్లీ మద్రాసులో వేటూరి తారసపడ్డారు ఎన్.టి.ఆర్కు. ఆయన తన సలహాను మర్చిపోలేదు. ఈసారి కోపంగా ‘ఎందుకు మా సలహా వినరు. సినిమాలకు రాయండి’ అని హూంకరించారు. అంతేకాదు అవకాశాలు ఇప్పించారు. వేటూరి సుందరరామమూర్తికి ఆ సలహా గురోపదేశంలా పని చేసింది. సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ ఒకరోజు నటుడు అశోక్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అశోక్ కుమార్‌తో కూచొని మాట్లాడుతూ ఉంటే లోపలి నుంచి సైగల్ గొంతుతో పాట వినిపిస్తూ ఉంది. అచ్చు సైగల్ గొంతులాగానే. అది విన్న ఎస్.డి.బర్మన్ ‘లోపల పాడుతున్నది ఎవరు?’ అని అశోక్ కుమార్‌ని అడిగాడు. ‘మా తమ్ముడే’ అని అశోక్ కుమార్ తన తమ్ముడిని పిలిచి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు బర్మన్ ‘చూడు.. బాగా పాడుతున్నావు. కాని సైగల్ లాగా పాడుతున్నావు. అనుకరణలో భవిష్యత్తు లేదు. నవ్వు నీలాగా పాడటం నేర్చుకో పైకొస్తావు’ అన్నాడు. ఆ కుర్రాడు ఆ ఉపదేశం పాటించి భవిష్యత్తులో కిశోర్ కుమార్ అయ్యాడు. రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయదినోత్సవం ప్రపంచ కోటీశ్వరుడు వారెన్ బఫెట్ తనకు అందిన అతి గొప్ప గురోపదేశంగా ఒక మిత్రుడు వాక్కు గురించి ప్రస్తావిస్తాడు. బఫెట్ అంటాడు– ‘‘ఒక మిత్రుడు నాతో ఒకసారి అన్నాడు – ‘బఫెట్ నీకు గనక కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజుకు నోరు మూసుకొని ఉండు. మరునాడు కూడా అలాగే అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో’ అని. నా జీవితంలో ఆ సలహాను పాటించి లాభం పొందుతూనే ఉన్నాను’’ అంటాడాయన. ఉర్దూ కవిత్వంలో ‘తరన్నుమ్’ అనేది గాన పద్ధతి. కవిత్వాన్ని పాటలాగా పాడి వినిపిస్తారు. ప్రఖ్యాత కవి కైఫీ ఆజ్మీ ఇంకా తాను అంత ప్రఖ్యాతం కాక మునుపు ఒకసారి హైదరాబాద్‌లో సరోజిని నాయుడును కలిశారు. ‘ఏదీ నీ కవిత్వం వినిపించు’ అని ఆమె అడిగారు. కైఫీ తన కవిత్వాన్ని తరన్నుమ్ పద్ధతిలో పాడి వినిపించాడు. అది విని సరోజిని నాయుడు ‘కైఫీ... దయచేసి ఇక మీదట ఎవరికీ ఇలా పాడి నీ కవితను వినిపించకు. భావస్పోరకంగా చదువు. చాలు’ అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి కైఫీ తన కవితను పాడటం మానేశాడు. ఆయన గొంతే ఆ తర్వాతి కాలంలో కవితా ఉనికి అయ్యింది. పాఠాలు ఇలాంటివే చాలా దొరుకుతూ ఉంటాయి. అవి పాఠాలుగా గ్రహించినప్పుడే మనం ఉత్తమ శిష్యులవుతాము. ఆ తర్వాత గురువులవుతాము. బడి బయట ఎందరో ఉపాధ్యాయులు. వారందరికీ వందనాలు.– సాక్షి ఫ్యామిలీ -
గాంధీజీపై ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య
ముంబై: జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేనే నిజమైన దేశ భక్తుడని ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు మరిచిపోకముందే.. ముంబైలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి గాంధీపై అనుచితంగా ట్వీట్ చేశారు. వివరాలు.. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిధి చౌదరి.. ‘మహాత్మాగాంధీ ముఖచిత్రాన్ని భారత కరెన్సీపై తొలగించాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను, పలు సంస్థలు, రోడ్లకు పెట్టిన గాంధీ పేరును మార్పు చేయాలి. థ్యాంక్యూ గాడ్సే’అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో గాంధీపై చేసిన ట్వీట్‌ను ఆమె డిలీట్ చేశారు. గాంధీపై వివాదాస్పద ట్వీట్ చేసిన నిధి చౌదరీని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చవాన్, ఎన్సీపీ నేత జితేంద్ర డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె తన ట్వీటును తొలగించారు. ‘గాంధీని నేను అవమానించ లేదు. గాంధీ జాతిపిత. నేను వ్యంగ్యంగా చేసిన ట్వీటును తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని మరో ట్వీటులో ఆమె చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ గాంధీజీని అవమానించలేదు. వ్యంగ్యంగా రాసిన పోస్టును అపార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గాంధీపై వ్యతిరేక, తప్పుడు వ్యాఖ్యానాలు అనేకమంది చేస్తున్నారు. ఈ వ్యతిరేక వ్యాఖ్యలను గాంధీ చూడకపోవడమే మంచిదని భావించి గాడ్సేకు ధన్యవాదాలు చెప్పానని నిధి తెలిపారు. -
ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్, బిజినెస్ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చేరారు. గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని వ్యాఖ్యానించడం విశేషం. गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए। — Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019 -
గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి
గాంధీఆస్పత్రి : గాంధీ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు చెందిన రూ.6.50 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్లో కూడా ఈ విషయం స్పష్టమైందని తక్షణమే ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టి, తమకు డబ్బులు ఇప్పించాలని నర్సింగ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి, గాం«ధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ ఆస్పత్రికి అనుసంధానంగా బోయిగూడలోని గాంధీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపాల్ మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జమాఖర్చులపై ఆడిట్ చేయాలని డీఎంఈ ఆదేశించారు. బుధవారం రాత్రి ముగిసిన ఆడిట్లో విద్యార్థినులకు చెందిన సుమారు రూ. 6.50 లక్షలు గోల్మాల్ జరిగిందని ఆడిట్లో వెల్లడైందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, అవకతవకలకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎంఈ, సూపరింటెండెంట్లకు ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఆడిట్ ముగిసినా పూర్తి నివేదిక తమకు అందలేదన్నారు. విచారణ అధికారిగా ఆర్ఎంఓ–1 జయకృష్ణ కొనసాగుతున్నారని, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘మన్‌కీ బాత్’ మాటలకు అర్థాలు వేరు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్’లో చెప్పే మాటలు, ఆయన లోపలి మాటలు పరస్పరం భిన్నమైనవి, మోసపూరితమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. మగ్దూంభవన్‌లో బుధవారం నిర్వహించిన ‘లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సులో సురవరం మాట్లాడారు. తమకు అనుకూలంగా లేని వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులు ముద్ర వేస్తున్నాయని విమర్శించారు. నాడు గాంధీని హత్య చేసిన అసహనమే నేడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో బుసలు కొడుతోందన్నా రు. మైనారిటీలు, దళితులతోపాటు శాస్త్రీయ ఆలోచనలు ప్రచారం చేసే మేధావులు, భావప్రకటనా స్వేచ్ఛ కోరే ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘ నేతలు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రస్తుతం మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల దాడి జరుగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలను బలహీనపరచడం ద్వారా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సమావేశానికి డా.సుధాకర్ అధ్యక్షత వహించగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కొల్లాయి కట్టి... 99 ఏళ్లు!
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938 మాలపిల్ల సినిమాలో సూరి బాబు పాడిన గీతం. నిజానికి ఈ కొల్లాయి కట్టే ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే మనం కొంత ఆలోచిస్తాం కానీ, ఎవరీ వ్యక్తి అంటే, ఒక్క క్షణమైనా తడుముకోకుండా, కొల్లాయి కట్టినది గాంధీజీ అని చెప్పేస్తాం. పైపెచ్చు తెలుగు సాహిత్యంలో, ‘కొల్లాయిగట్టితేనేమి’ ఒక ప్రఖ్యాత తెలుగు నవల కూడా. 1960లలో ఈ నవల రాసింది మహీధర రామమోహనరావు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల ఇది. అయితే గాంధీజీ జీవితంలో కూడా ఇది జరిగింది సెప్టెంబర్ 1921లో. తన పత్రిక నవజీవన్‌లో గాంధీ ఇలా చెప్పారు. ‘‘మదరాసు నుంచి మదురైకి రైలుబండిలో వెళ్తుండగా, ఏమీ పట్టనట్టుగా రైలు పెట్టెలో ఉన్న జనాలను చూశాను. అందరూ విదేశీ దుస్తుల్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి నేను నచ్చచెప్పబోయాను. వారు తలలు అడ్డంగా ఊపి ‘‘మేం చాలా పేదవారం, ఖాదీ ధారణ చేయడానికి, కొనాలంటే ఖాదీ చాలా ఖరీదు’’ వారి మాటల అంతరార్థం నేను గ్రహించాను. నేను పూర్తి దుస్తుల్లో ఉన్నాను, తలపై టోపీతో సహా. వీరు చెప్పింది కొంతవరకూ సత్యమే అయినా, కోట్లాదిమంది ప్రజలు కేవలం ఒక్క లంగోటీతో కాలం గడుపుతూ ఇదే నిజాన్ని చెప్తున్నారనిపిం చింది. వారికి నేనేమని సరైన జవాబివ్వగలను, నా వంటిమీది అదనపు దుస్తులను ప్రతి అంగుళమూ గనుక వదులుకుంటే, అలా చేయడం ద్వారా, ఈ దేశపు కోట్లాది మందికి దగ్గర కాగలిగితే.. మరునాడు ఉదయం మదురై సమావేశం తరువాత, వెంటనే నేను ఆ పని చేశాను’’. అలా మదురై మహాత్మునికి కొల్లాయి కట్టించిన తల్లి. తన దుస్తుల ధారణ, జాతీయోద్యమంలో భాగం చేయగల మేధావి గాంధీజీ. కొల్లాయి గాంధీజీ బ్రాండ్‌గా ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరకొర దుస్తుల ఫకీరు, అతిపెద్ద ఉపఖండ స్వాతంత్య్ర పోరాట నాయకుడని, గాంధీజీ ఆకర్షణ వలయంలో పడిపోయింది. ఈ దుస్తుల పద్ధతి, ఒకసారి అయిదో జార్జ్ చక్రవర్తిని బకింగ్ హామ్ భవంతిలో కలవడానికి వెళ్లాల్సివచ్చినప్పుడు, ఇవే దుస్తులా అని ప్రపంచం, పాలక వర్గాలు విస్మయంలో పడ్డాయి. చక్రవర్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చాలీ చాలని దుస్తుల్లోనే వెళ్తారా? అన్నది మీడియా ప్రశ్న. ‘‘మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’’ అన్నది గాంధీజీ ఇచ్చిన చురుకైన జవాబు. విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ రోజుల్లో ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా బ్రిటిష్ వారి పై ఆర్థిక పరమైన దెబ్బ తీశారు గాంధీజీ. ఇలా కొల్లాయి కట్టిన ఘట్టానికి నాంది, సెప్టెంబర్ 1921లో గాంధీజీ బస చేసిన మదురైలోని పడమటి మాసి స్ట్రీట్‌లోని డోర్ నంబర్ 251 ఇల్లు. ఇప్పుడు అదే భవనంలో ఖాదీ ఎంపోరియం నడుస్తున్నది. కొల్లాయిగట్టితేనేమి, మహీధర వారి నవల 1920 డిసెంబర్–1921 ఏప్రిల్ వరకూ కథా కాలంగా నడుస్తుంది. టెక్నికల్‌గా, ఈ నవలలో కథనడిచే కాలానికి ఇంకా గాంధీజీ (సెప్టెంబర్ 1921 దాకా) కొల్లాయి కట్టడం ప్రారంభించలేదు. అందుకే మహీధర వారు, ఎంత చారిత్రక దృష్టితో చెప్పారు అంటే, ఈ నవల కథాకాలం పూర్తి అయిన కొద్ది నెలలకు కానీ గాంధీజీ కొల్లాయి కట్టడం మొదలు కాలేదు. అంటే గాంధీజీ కొల్లాయి కట్టడానికి ముందర కాలంలో, అసలు కొల్లాయి కట్టు గురించి ఏ పాటలూ లేని కాలంలోకి వెళ్ళి (1920–21) తను 1960లో రాసిన నవలకి ఇలా పేరు పెట్టిన సంగతి వివరించారు. అలా 1921లో తన దుస్తుల ధారణ కూడా స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేసిన వ్యూహకర్త గాంధీజీ. ఆ దుస్తుల వ్యూహానికి ఇది 99వ వత్సరం. 70ఏళ్ల రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో, గాంధీజీ కొల్లాయి ధారణ ఈ దేశానికి చేసిన మేలు ఎంతో, స్వదేశీ ఉత్పత్తుల సమాదరణ వల్ల ఎంత అభివృద్ధి సాధించగలమో కూడా ఇంకా మనం గ్రహించవలసి ఉన్నది. (నేడు కృష్ణానదీ నౌకావిహార సాహిత్య సభలో మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలపై సాయంత్రం 5 గంటలకు రామతీర్థ ప్రసంగం) వ్యాసకర్త కవి, విమర్శకులు‘ 98492 00385 రామతీర్థ -
సభ సజావుగా నడిపించే బాధ్యత నాపై ఉంది
-
గాంధీకి లేనిది.. పటేల్‌కు ఎందుకు..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ విగ్రహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత శశిథరూర్ పలు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి దేశంలో ఎక్కాడా అంతపెద్ద విగ్రహం లేదని.. గాంధీకి కట్టని విగ్రహం పటేల్‌కు ఎందుకు కట్టారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. పటేల్ చాలా సాధారణమైన వ్యక్తని.. గాందేయవాదైన పటేల్‌కు గంభీరమైన రూపంగల విగ్రహాన్ని నిర్మించడం సబబేనా అన్నారు. గాంధీకి పటేల్ శిష్యుడు వంటివాడని.. శిష్యుడికి 182 మీటర్ల విగ్రహం ఎందుకని థరూర్ ప్రశ్నించారు. గాంధీ పెద్ద విగ్రహం పార్లమెంట్‌లోనే ఉందని.. గురువుని కాదని శిశ్యుడికి అతిపెద్ద విగ్రహం నిర్మించడం సరికాదని అన్నారు. పటేల్ తన జీవితకాలమంతా గాంధీ సిద్దాంతాలతో, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కావాలనే పటేల్‌ను వారి నాయకుడిగా వర్ణించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా సర్దార్ వల్లభ్‌భాయ్ అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
ఉక్కుమణి
మణి.. అమూల్యమైనది.‘ఉక్కు’కు తోడైన ఆ మణి..తండ్రి జీవితాన్నుండి ప్రభావితమైతండ్రి జీవితాన్ని ప్రభావితం చేసి..వారసత్వానికే వన్నె తెచ్చింది.ఉక్కు సంకల్పం నాన్నది. ఉద్యమ గుణం మణిది. అందుకే మణిబెన్.. ఉక్కుమణి! నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. నేడే గుజరాత్లో పటేల్ ఐక్యతా ప్రతిమ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఆ ఉక్కుమనిషికి చివరి వరకు బాసటగా ఉన్న కుమార్తె మణిబెన్ పటేల్ గురించి స్ఫూర్తిదాయకమైన విశేషాలు, విశేషాంశాలూ ఇవి.‘నేనూ పెద్దవాడినైపోయాను. ఇప్పటికైనా ఏదో మార్గం ఎంచుకోవాలి నువ్వు!’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1944లో తన ఏకైక కుమార్తె మణిబెన్ పటేల్‌కు ఇచ్చిన సలహా ఇది. ‘పటేల్: ఏ లైఫ్’ పేరుతో గాంధీజీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. కూతురితో ఈ మాట అనే నాటికి సర్దార్ స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ కుడిభుజం. తొందరలోనే స్వరాజ్యం వస్తుందని అంతా నమ్ముతున్న కాలం. ఆ అంచనా వాస్తవం కూడా. గాంధీజీకి ముఖ్య అనుచరుడిగా, జవహర్లాల్ నెహ్రూకు సముడిగా స్వతంత్ర భారతదేశంలో పటేల్ స్థానం ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయినా ఆయన కూతురికి ఇలాంటి సలహా ఇచ్చారు. అంటే తన సంతానం రాజకీయాలలోకీ, ప్రభుత్వ పదవులలోకీ రావాలని ఆయన ఎంతమాత్రం అనుకోలేదు. సర్దార్ పటేల్, జవేర్బాయి పటేల్‌లకు ఒక కూతురు, కొడుకు. కూతురే మణిబెన్. కొడుకు దహ్యా పటేల్. పటేల్‌కు 33 ఏళ్ల వయసులో భార్యా వియోగం జరిగింది. పటేల్‌కు సంతానమంటే ఎంతో అనురాగం. ద్వితీయ వివాహం చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనీ, అవి పిల్లలను ఇబ్బంది పెడతాయనీ చేసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే బారిస్టర్ చదువు కోసం సర్దార్ టెంపుల్ టౌన్‌కు (ఇంగ్లండ్) వెళ్లారు. అప్పుడే చాలాకాలం మణిబెన్ నానమ్మ దగ్గర, పెదనాన్న విఠల్‌భాయ్ పటేల్‌ల దగ్గర పెరిగింది. విఠల్‌భాయ్ పటేల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే. జీవితాంతం తండ్రికి బాసట మణి, దహ్యా కూడా గుజరాత్ విద్యాపీలో చదువుకున్నారు. మణి గుజరాతీ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. నిజానికి మణిబెన్ (1903–1990) దేశ సేవకు అంకితమైంది. ఆమె స్వాతంత్య్రోద్యమంలో తండ్రితో, గాంధీజీతో కలసి నడిచారు. జీవితాంతం తండ్రికి బాసటగా ఉన్నారు. మణిబెన్ తండ్రికి కార్యదర్శి, వ్యక్తిగత సేవిక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే న ర్స్. ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసే పని కూడా ఆమెదే. ఆయన బట్టలు కూడా ఉతికేవారు. తండ్రి జీవిత చరమాంకంలో ప్రతిక్షణం ఆయనను వెన్నంటే ఉన్నారు మణి. అందుకే ఆమె రాసిన డైరీ ‘ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్’ ఎన్నో కీలక చారిత్రకాంశాలను, ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటలకు ఎక్కడం సాధ్యంకాని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని కరంసద్లోనే (సర్దార్ పటేల్ పూర్వీకుల స్వగ్రామం) మణి జన్మించారు. స్వస్థలంలోను, గుజరాత్ విద్యాపీuŠ‡లోను చదువుతున్నప్పుడే గాంధీజీ ఉపన్యాసాలు, బోధనలు ఆమెకు ఉత్తేజం కలిగించాయి. 1918లో ఆమె అహమ్మదాబాద్‌లోని గాంధీజీ ఆశ్రమంలో చేరారు. మనవరాలి పెళ్లి గురించి పటేల్ తల్లి లాద్బా (తండ్రి పేరు జవేర్భాయ్, పటేల్ భార్య పేరు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది) తపన పడుతూ ఉండేవారు. కానీ పెళ్లి విషయంలో కూతురి అభిప్రాయం ఏమిటో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఆయన అడగలేదు. కారణం– ఆ ఇంట పిల్లలు పెద్దల ఎదుట నోరు విప్పరు. పెద్దలు కూడా అంతే. పిల్లలతో చాలా తక్కువ మాట్లాడతారు. తాను 33వ ఏట కూడా చుట్టు పక్కల పెద్దలు ఉంటే పెదవి కదపలేదని ఒక లేఖలో పటేల్ రాశారు. 1926లో మరోసారి మణి అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. 1927 జనవరిలో గాంధీజీ నుంచి పటేల్‌కు ఒక లేఖ అందిది. ‘వివాహం చేసుకునే యోచన ఏదీ ప్రస్తుతం మణి దగ్గర లేదు. ఆ విషయం గురించి మీరు ఆందోళన చెందవద్దు. నాకు వదిలిపెట్టండి!’ ఇదీ సారాంశం. చివరికి ఆమె అవివాహితగానే ఉండిపోయారు. సత్యాగ్రహంలో మూడో పటేల్ సహాయ నిరాకరణోద్యమంలో ఆమె గాంధీజీ, తన తండ్రిలతో కలసి పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనూ కొద్దికాలం ఉన్నారు. 1928 నాటి బార్డోలీ సత్యాగ్రహంలో ముగ్గురు పటేళ్లు కనిపిస్తారు. మొదటివారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్. రెండు, ఆయన అన్నగారు విఠల్‌భాయ్ పటేల్. మూడు, మణిబెన్ పటేల్. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మణి అరెస్టయ్యారు. పూనా దగ్గరి ఎరవాడ జైలుకు ఆమెను పంపారు. గాంధీజీ చరిత్రలోనే కాకుండా, ఉద్యమ చరిత్రలో కూడా కీలకమైన రెండు ఘట్టాలు అక్కడే చోటు చేసుకున్నాయి. ఆ జైలుకు వెళ్లిన పదిరోజులలోనే గాంధీజీకి ఎంతో ఆప్తుడు, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్ అనార్యోంతో హఠాత్తుగా కన్నుమూశారు. తరువాత కొద్దికాలానికే కస్తూర్బా కూడా అక్కడే కన్నుమూశారు. అంటే గాంధీజీని బాగా కదిలించిన, కుంగదీసిన రెండు ఘటనలకు మణి ప్రత్యక్ష సాక్షి. నెహ్రూ తీరుకు నిరాశ! 1950లో తండ్రి మరణించిన తరువాత మణిబెన్ ప్రథమ ప్రధాని నెహ్రూను కలవడానికి ఢిల్లీ Ðð ళ్లారు. ఆ క్షణాలను గురించి అమూల్ రూపశిల్పి వర్ఘీస్ కురియన్ (‘నాకూ ఉంది ఓ కల’ పుస్తకంలో) మనసును కదిలించే ఒక ఘట్టాన్ని నమోదు చేశారు. మణిబెన్ స్వయంగా కురియన్‌కు ఈ సంగతి చెప్పారు. ‘నీవు మాత్రమే ఈ పని చేయాలి’ అంటూ తండ్రి చివరి క్షణాలలో పెట్టిన షరతు మేరకు ఒక పెద్ద సంచి, పద్దుల పుస్తకం ఒకటి నెహ్రూకు అప్పగించారు మణి. ఆ సంచిలో 35 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ పుస్తకం పార్టీ ఖర్చులు, విరాళాల వివరాల పుస్తకం. ఈ రెండు అప్పగించిన తరువాత నెహ్రూ నోటి నుంచి ఒక మాట కోసం మణి ఎదురు చూశారట. అదేమిటని కురియన్ అడిగారు. ‘ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న మాట ఆయన నోటి నుంచి వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన (నెహ్రూ) ‘థాంక్స్’ అనే వెళ్లిపోయారు’ అని సమాధానమిచ్చారామె. నెహ్రూకూ, పటేల్‌కు మధ్య వైరుధ్యాలు ఆ కాలానికి ఎంత తారస్థాయిలో ఉండేవో దీనిని బట్టే అర్థమవుతుంది. పటేల్ మరణించడానికి రెండు నెలలముందు జరిగిన ఒక ఉదంతం గురించి మణిబెన్ డైరీలో ఏం రాశారో అహ్మదాబాద్‌కు చెందిన రతీన్దాస్ వెల్లడించారు. ‘బాబ్రీ మసీదు జీర్ణోద్ధరణ, సోమ్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణం వేరువేరు అంశాలు.సోమ్‌నాథ్ ఆలయం కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదు’ అని పటేల్ వివరణ ఇవ్వగానే నెహ్రూ మౌనం వహించారన్నదే ఆ పేజీలోని మాటల సారాంశం. మరోసారి ‘మణి’ దండి యాత్ర గాంధీజీ మరణించే వరకు ఢిల్లీలోని బిర్లా భవన్‌లోనే మణిబెన్ కూడా ఉన్నారు. ఆయన హత్యకు గురైన తరువాత కూడా కొద్దికాలం అక్కడ ఉండవలసిందని బిర్లాలు కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు.తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మణిబెన్ 1976లో మరోసారి దండి యాత్ర జరిపారు. కారణం– భారత ప్రజానీకంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించడమే. అది ఎమర్జెన్సీ కాలం.అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న నాయకులను విడుదల చేయాలనీ, ఎమర్జెన్సీ ఎత్తివేయాలనీ, పత్రికల మీద సెన్సార్ షిప్‌ను వెంటనే తొలగించాలనీ నినాదాలు ఇస్తూ ఆమె దండి యాత్ర నిర్వహించారు.ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మణిబెన్ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వీక్షించి 1990లో అంతిమ శ్వాస విడిచారు. ‘పటేల్‌ది ఒక తాత్విక వారసత్వం.దానిని మేం సొంతానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. దానిని ప్రజలే అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. రుద్దే ఆలోచన మాకు లేదు’ అంటున్నారు పటేల్ వారసులు. ముందే రాజకీయాల్లోకి రాలేదు పటేల్ మరణించిన తరువాత మాత్రమే మణిబెన్ రాజకీయాలలోకి వచ్చారు. గుజరాత్ కాంగ్రెస్ శాఖకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్నో సాంఘిక, విద్యా సంస్థల కోసం పనిచేశారు. నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ తరఫున తొలి లోక్‌సభకు (1952–1957) ఆమె దక్షిణ కైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత రెండో లోక్‌సభకు (1957–1962) ఆనంద్ నియోజక వర్గం నుంచి గెలిచారు. 1964–70 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. – గోపరాజు నారాయణరావు -
గినీస్ బుక్ రికార్డ్: 5149 విద్యార్ధులు గాందీ వేషధారణ
-
గాంధీజీ కలను నిజం చేద్దాం
న్యూఢిల్లీ: స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. వచ్చే నెల అక్టోబర్ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. అనంతరం ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ స్కూల్లో పరిసరాల్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. 4.5లక్షల గ్రామాలు బహిర్భూమి రహితం ‘స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు 40 నుంచి 90 శాతానికి విస్తరించాయి. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం నాలుగేళ్లలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 450 జిల్లాలు, 4.5 లక్షల గ్రామాలు బహిర్భూమి రహితంగా మారడాన్ని మీరు ఊహించారా? ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని ప్రధాని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2, 2018 నాటికి దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ బహిర్భూమి∙రహిత రాష్ట్రంగా మారనుందని స్వచ్ఛ భారత్ సర్వే వెల్లడించిందని గుర్తు చేశారు. ‘అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ 1.36 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం’ అని యోగి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ప్రభు త్వం చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసించారు. మీడియా కృషిని ప్రశంసించిన ప్రధాని ప్రజల జీవన ప్రమాణాల్ని మెరగుపర్చడంలో స్వచ్ఛత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వల్ల మూడు లక్షల మంది ప్రాణాల్ని కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. డయేరియా కేసులు 30 శాతం తగ్గుతాయి’ అని ఆయన వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, బిహార్, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల ప్రజలతో మోదీ సంభాషించారు. కశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలో ప్యాంగాంగ్ సరస్సు శుద్ధిలో పాలుపంచుకుంటోన్న టిబెట్ సరిహద్దు పోలీసు బలగాలతో పాటు పట్నా సాహిబ్ గురుద్వారాకు చెందిన సిక్కు మతపెద్దలు, అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మతగురువులు, దైనిక్ జాగరణ్ మీడియా గ్రూపు సిబ్బందితో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో వార్తా పత్రికలు, చానళ్లు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీలకు ప్రశంసలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్‌టాటాలు కూడా ప్రధానితో సంభాషించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాల్ని కొనియాడారు. అలాగే తమిళనాడులో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాలుపంచుకోవడాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫరీదాబాద్‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్నాలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. -
గాంధీ అరెస్ట్
మే–17 ఇయక్కం కన్వీనర్ తిరుమురుగన్ గాంధీ అరెస్టు అయ్యారు. విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు చెన్నై పోలీసులు బెంగళూరు బయలు దేరి వెళ్లారు. సాక్షి, చెన్నై : తమిళాభిమాన సంఘంగా మే–17 ఇయక్కం కార్యకలాపాలు రాష్ట్రంలో సాగుతున్నాయి. దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న తిరుమురుగన్ గాంధీని ఇటీవల పోలీసులు టార్గెట్ చేశారు. గత ఏడాది ఆయన్ను గూండా చట్టం కింద సైతం అరెస్టుచేసి కొంతకాలం కటకటాల్లో పెట్టారు. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఆ కేసు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మీద పోలీసులు పలు రకాల కేసుల్ని నమోదు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తూత్తుకుడి అల్లర్ల కేసులో తిరుమురుగన్ పేరును చేర్చారు. అలాగే, గ్రీన్ హైవేకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ పలు కేసుల్ని నమోదు చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా లుక్ అవుట్ నోటీసు సైతం జారీచేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం నిమిత్తం ఇక్కడి నుంచి జెనీవాకు వెళ్లారు. అక్కడ తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ గురించి , గ్రీన్ హైవే ప్రాజెక్ట్ గురించి, తమిళనాట ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లోనూ వివాదాల్ని పసిగట్టిన పోలీసులు తిరుమురుగన్ గాం«ధీని టార్గెట్ చేశారు. బెంగళూరులో అరెస్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశాన్ని ముగించుకుని బుధవారం బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే, లుక్ అవుట్ నోటీసును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తిరుమురుగన్ గాంధీని అరెస్టు చేయడానికి తగ్గట్టు విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బెంగళూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీదున్న కేసుల్ని పరిగణించి అరెస్టుచేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. తిరుమురుగన్ గాంధీని తమ కస్టడికి తీసుకుని చెన్నైకి అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం తిరుగు పయనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, తిరుమురుగన్ గాంధీని బెంగళూరులో అరెస్టు చేయడాన్ని తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంనేత దినకరన్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఈ అరెస్టును ఖండించారు. -
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
గాంధీ ఆస్తులపై ఏసీబీ ఆరా
జంగారెడ్డిగూడెం:లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఆరాతీశారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి గాంధీ, ఆయన బినామీల పేరున ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది రికార్డులు తనిఖీ చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో 4.50 ఎకరాలు, దిప్పకాయలపాడులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో కూడా ఏమైనా ఆస్తులు ఉన్నయా, ఆయన బినామీలు ఎవరైనా ఉన్నారా అనేది ఆరా తీస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారి గాంధీ అరెస్టు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపేట గాంధీని ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో నాటకీయ పరిణామాల మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ వారాసిగూడలోని గాంధీ నివాసంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాంధీని అరెస్టు చేసి, ఆయన నివాసం నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు :గాంధీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో మల్లంపేట గాంధీకి వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ తనకు గుండెపోటు వస్తోందని, కాలేయ సమస్య ఉందని, శ్వాస ఆడటంలేదని చెప్పడంతో సాయం త్రం 5 వరకు వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను మెట్టుగూడలోని న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. అనంతరం గాంధీని ప్రత్యేక వాహనంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్న సమయంలో గాంధీ కుటుంబ సభ్యులు, బంధువులు మీడియాను అడ్డుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీయరాదంటూ అడ్డంగా నిలబడి హడావుడి చేశారు. కాగా, చంచల్‌గూడ జైలు వైద్యులు గాంధీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో శనివారం సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఓ న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం. సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శనివారం రాత్రి అనంతరం కూడా సో దాలు కొనసాగుతున్నాయి. సమీప బంధువు ఫిర్యాదుతో గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన సమీప బంధువు ఒక రు ఇటీవల ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అన్ని వివరాలు, ఆధారాలు సమర్పించారు. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఏసీబీ అధికారులు.. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కలసి.. తమకు అందిన ఫిర్యాదు, తాము సేకరించిన ఆధారాలను సమర్పించారు. పూర్తిస్థాయి ఆధారాలు ఉండటంతో గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుకు ఏసీజే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు శనివారం గాంధీపై కేసు నమోదు చేసి... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, మరికొన్ని చోట్ల గాంధీ, ఆయన సమీప బంధువుల నివాసాల్లో ఏకకాలం లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదేళ్లకు పైగా ఒకే కోర్టులో.. మల్లంపేట గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2015లో హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన గాంధీ కుమార్తె వివాహ వేడుకల్లో ఆ నేత చాలాసేపు గడిపారని కొందరు న్యాయాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఢిల్లీస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సైతం గాంధీ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఓ దశలో గాంధీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏకంగా ఐదేళ్లకుపైగా కొనసాగారు. ఓ న్యాయాధికారి ఒకే కోర్టులో ఐదేళ్లకుపైగా కొనసాగడాన్ని అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. దాడుల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.57 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. బంజారాహిల్స్‌లో రూ.10.52 లక్షల విలువైన ఫ్లాట్ డీడీ కాలనీలో రూ.33.51 లక్షల విలువైన ఫ్లాట్ వారాసిగూడలో రూ.35 లక్షల విలువైన ఇల్లు వారాసిగూడలోనే రూ.70 లక్షల విలువైన నూతన మూడు అంతస్తుల భవనం రూ.12.30 లక్షల విలువైన వెర్నా కారు రూ.17 లక్షల విలువైన కారోలా ఆల్టిస్ కారు రూ.3.5 లక్షల విలువైన ఆల్టో కారు రూ.60 వేల విలువైన హోండా యాక్టివా టూ వీలర్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో రూ.48.65 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కరగపాడులో రూ.23 లక్షల విలువైన 8.73 ఎకరాల భూమి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో రూ.30 లక్షల విలువైన 1.5 కేజీల బంగారం బ్యాంకు లాకర్లో రూ.2 లక్షల విలువగల 4 కేజీల వెండి అభరణాలు బ్యాంకు ఖాతాలో రూ.9 లక్షల నగదు నిల్వ.. ఇంట్లో రూ.89 వేల నగదు రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు రూ.33 లక్షల విలువగల చిట్టీల డబ్బు -
ప్రిసైడింగ్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. నాంపల్లి కోర్టులో పనిచేస్తున్న గాంధీ ఆదాయానికి మించి అస్తులున్నాయనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. హైదరాబాద్, గోదావరి జిల్లాల్లోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల ఇంటిపైన సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వ్యవసాయ భూములతో పాటు 30 తులాల బంగారం, ఓ లాకర్‌ను కనుగొన్నట్టు ఆయన వెల్లడించారు. ఏడు చోట్లు తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. -
కేరళలో గాంధీ విగ్రహానికి అవమానం
న్యూఢిల్లీ : విగ్రహాల విధ్వంసం దేశమంతా దావానంలా వ్యాపిస్తోంది. కేరళ, కన్నూర్‌లోని తాళిపరంబ ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ అవమానానికి గురైంది. విగ్రహాన్నుంచి కళ్లజోడుని దుండగులు వేరుచేశారు. గాంధీజీ తల నుంచి వేరుపడివున్న కళ్లజోడుని ఈ ఉదయం స్థానికులు గుర్తించారు. తమిళనాడులోని తిరువత్రియూర్ పెరియార్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి రంగులు పూసి దుండగులు అవమానం చేశారు. త్రిపుర ఎన్నికల్లో విజయానంతరరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చిన సంగతి.. కోల్‌కతాలో మంగళవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం కూల్చివేతకు గురైన విషయం విదితమే. -
మేం కట్టం..
పాలకుల ఆజ్ఞల్ని శిరసావహించేవారు కొందరైతే, వాటిని పూచికపుల్లగా ధిక్కరించి విప్లవాగ్ని రగిల్చినవారు మరికొందరు. చరిత్ర పుటల్లో కొందరు ఇలాంటి ధిక్కారాలకు పాల్పడి పాలకుల పాలిట సింహస్వప్నమై నిలిచారు. పన్ను పోట్లపై దండెత్తారు. ‘దండి’గా ధిక్కరణ ►తెల్లవాడి దురహంకారంపై తొలి దెబ్బ. రవి అస్తమించని సామ్రాజ్యం మాది.. అంటూ విర్రవీగుతున్న ఆంగ్లేయుల నెత్తిపై తొలి పిడుగు.. అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా 1930 మార్చి 12న జాతిపిత బాపూజీ నేతృత్వంలో సాగిన ఈ సత్యాగ్రహం ఏప్రిల్ 6న గుజరాత్‌లోని దండిలో బ్రిటిష్ చట్టాలను ధిక్కరించి ఉప్పును తయారుచేయడంతో ముగిసింది. ఉక్కు మహిళకూ తప్పలేదు.. ►స్థానిక, సేవల పన్నులకు వ్యతిరేకంగా 1990లో బ్రిటన్ పౌరులు సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2కోట్ల మంది ఈ పన్నులను చెల్లించేందుకు నిరాకరించారు. ట్రఫాల్గర్ స్క్వేర్ వద్దకు లక్షలాదిగా చేరుకుని సర్కారుపై యుద్ధభేరి మోగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు, అల్లర్లు చెలరేగాయి. చివరికి నాటి ప్రధాని, ఉక్కు మహిళ మార్గరేట్ థాచర్ ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. టీ కప్పులో ‘బోస్టన్’తుపాను.. ►ఆంగ్లేయుల గుత్తాధిపత్యానికి ‘బోస్టన్ టీ పార్టీ’ఉదంతం చెంపపెట్టులాంటిది. బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఈస్టిండియా కంపెనీకి, వారి తొత్తులకు మాత్రమే టీ పొడి దిగుమతిపై పన్నును మినహాయించడం వలస పాలనలో మగ్గుతున్న అమెరికా వర్తకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో బోస్టన్ వర్తకులు తిరుగుబాటు చేసి అక్కడి నౌకల్లోని టీ పొడి మొత్తాన్ని సముద్రంపాలు చేశారు. 1773 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటన చరిత్రలో బోస్టన్ టీ పార్టీగా వినుతికెక్కింది. ప్రజలకోసం నగ్నంగా.. ►పన్నుల పేరిట భర్త అరాచకాన్ని చూడలేక భార్యే ఎదురుతిరిగిన సంఘటన ఇది. 11వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోని మెర్సియా రాజ్యపాలకుడు లియోఫ్రిక్ ప్రజలపై విపరీతంగా పన్నులు వేసి వేధించేవాడు. సామాన్యుల కష్టాలకు చలించిపోయిన అతడి భార్య లేడీ గొడవపడి భర్తతో వాగ్వాదానికి దిగింది. రెచ్చిపోయిన భర్త.. నగ్నంగా శ్వేతాశ్వంపై నగరాన్ని చుట్టొస్తే పన్నుల భారం తగ్గిస్తానన్నాడు. ఆమె ఒప్పుకుంది. గుర్రంపై నగ్నంగా వెళుతున్నప్పుడు ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దన్న షరతుతో నగ్నంగా నగర వీధుల్లో దౌడులు తీసింది. బడ్జెట్.. ‘బొగెట్టీ’ ►బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలుసంచిలో తీసుకొచ్చేవారు. అందువల్లే ఈ మాట వాడుకలోకి వచ్చింది. -
మహాత్ముని మరణం 30 జనవరి 1948
వడివడిగా, వేగంగా ప్రార్థనకు నడుస్తూ వస్తున్నారు గాంధీజీ. బిర్లాహౌస్ (ఢిల్లీ) మైదానంలోని జనం లేచి ‘బాపూజీ, బాపూజీ’ అని ఆరాధనతో తన్మయమౌతున్నారు. అచ్ఛాదన లేని ఆయన ఛాతీ ఎన్ని మృత్యువులనైనా చేరదీసి, సేదతీర్చే ప్రేమ మందిరంలా ఉంది. మళ్లొకసారి తుపాకీ సర్దుకున్నాడు గాడ్సే. గాంధీజీకి ఎదురు నడుస్తున్నాడు గాడ్సే. మృత్యువా? మహాత్ముడా? ఎవరు ఎవరిని గౌరవిస్తారో, ఎవరు ఎవరికి శిరస్సు వంచి నమస్కరిస్తారో, ఎవరు ఎవరిని అంతిమంగా ఒడిలోకి తీసుకుంటారో.... కొద్దిసేపట్లో తేలిపోతుంది. గాంధీజీకి ఇటు మనూ, అటు అభా ఉన్నారు. తృటిలో మృత్యువు అక్కడికి చేరుకుంది. గాంధీజీకి అతి దగ్గరగా వచ్చి, వంగి, చేతులు జోడించాడు గాడ్సే. ఆ చేతుల మధ్య తుపాకీ ఉంది! మృత్యువును జయించడమంటే... మృత్యువును వట్టి చేతులతో సాగనంపడం కాదని మహాత్ములు మాత్రమే అనగలరు. ఇవ్వడానికి గాంధీజీ దగ్గర నిండు ప్రాణాలున్నాయి. తృణప్రాయంగా వాటిని అర్పించగల గుండె ధైర్యం ఉంది. మహాత్ముని శరీరంలోకి మూడు గుండ్లు దూసుకెళ్లాయి. కోట్ల హృదయాలకు తూట్లు పడ్డాయి. బాపూజీ భౌతికంగా మరణించి నేటికి డెబ్భై ఏళ్లు. ఆయన అనుసరించి, మానవాళికి అందించి వెళ్లిన జీవిత సందేశాలు మాత్రం ఏనాటికీ మరణం లేనివి. -
మహాత్ముడి ఫొటో మార్ఫింగ్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా గాంధీ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారని, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, ఆ సందర్భంగా అక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను మసక వెలుతురులో చూపించారని ఆరోపించింది. దీనిపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. వెనుక వైపు గాంధీ చిత్రపటం ఉండగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అయితే కొందరు ఆకతాయిలు గాంధీ ఫొటోను మొగల్ చక్రవర్తిగా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది మహాత్మాగాంధీని అవమానించడమేనన్నారు. కాగా, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, తగు చర్యలు తీసుకుంటామని సైబర్ సెల్ ఎస్పీ శైలేంద్రసింగ్ చెప్పారు. -
వెయ్యి మంది గాంధీలొచ్చినా!
న్యూఢిల్లీ: స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను రాజకీయం చేయటం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెయ్యి మంది మహాత్మా గాంధీలొచ్చినా దేశాన్ని స్వచ్ఛంగా మార్చలేరని, 125 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమ లక్ష్యాలను చేరుకోవటం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. చీపురు పట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించినపుడు తనను చాలా మంది విమర్శించారన్నారు. ‘మోదీని విమర్శించాలంటే చాలా అంశాలున్నా యి. కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చే అంశాలపై హాస్యాస్పదంగా మాట్లాడటం, రాజ కీయం చేయటం సరికాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. మహాత్ముడు చూపిన మార్గంలో ముందుకెళ్తాను’అని ప్రధాని పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటి సెలవును వృథా చేస్తున్నా నంటూ కొందరు ప్రజలు, మరికొందరు తోటి రాజకీయ నాయకులు విమర్శించారన్నారు. ‘వెయ్యి మంది మహాత్మా గాంధీలు, లక్ష మంది నరేంద్ర మోదీలు, ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఏకమైనా స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోవటం కష్టం. 125 కోట్ల మంది దేశ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం’ అని మోదీ వెల్లడించారు. తను చాలా విషయాల్లో ఓపికగా ఉంటానన్న మోదీ.. విమర్శలను సహించడంలోనూ తన సామర్థ్యా న్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. ‘ఐదేళ్ల క్రితం విద్యార్థులు స్కూళ్లు ఊడుస్తుంటే పెద్ద వివాదం చేశారు. తల్లిదండ్రులు కూడా టీచర్ల తీరును తప్పుబట్టారు. కానీ ఇప్పుడు ఆ విద్యార్థులే స్కూళ్లల్లో పారిశుధ్యం కోసం పనిచేస్తుండటాన్ని గొప్ప విషయంగా చూస్తున్నారు’ అని ఆయన తెలిపారు. మీడియా, పౌర సమాజం సభ్యులు స్వచ్ఛత ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయటంలో కీలక భూమిక పోషించారన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో సాధించింది స్వల్పమేనని.. చేయాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు. -
గాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా దివంగత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్లో నివాళులర్పించారు. నిరాడంబర వ్యక్తిత్వం, సమర్థ నాయకత్వానికి మారుపేరైన లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్' అన్న ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన నిజమైన పరిపాలకుడని, యువతే కాదు దేశ నిర్మాతలకు సైతం ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ శాస్త్రి పాల్గొన్నారని స్మరించుకున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మహాత్మాగాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. Remembering Mahatma Gandhiji on his 148th jayanthi. His life is an inspiration and should be emulated by each one of us. — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017 My tributes to Lal Bahadur Shastriji on his jayanthi. pic.twitter.com/y30fdonIqV — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017 -
అప్పుడు గాంధీగారికి 78 ఏళ్లు... నాకిప్పుడు 60 ఏళ్లే! ప్రయత్నిస్తా!
రాజకీయాలపై తన అభిప్రాయాలను కమల్‌హాసన్ సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప్రస్తుత రాజకీయాలపై ఆయన స్పందిస్తున్న తీరు సంచలనమవుతోంది. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయడానికేనా ఇదంతా? అని కమల్‌ను ప్రశ్నిస్తే... ‘‘నేనలా చెప్పానా? మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు?’’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి, మీ లక్ష్యం ఏంటి? అనడిగితే... ‘‘కరప్షన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ఉద్యమిస్తా. కేవలం తమిళ రాజకీయాల్లోని కుళ్లుని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అవినీతిని కడిగేస్తా’’ అంటున్నారు కమల్‌హాసన్. ఒంటి చేత్తో మీరు పోరాటం చేయగలరా? అంటే... ‘‘కనీసం నన్ను ప్రయత్నించనివ్వండి. నా స్ఫూర్తి ప్రదాత గాంధీగారు 78 ఏళ్ల వయసులో కరప్షన్‌కి వ్యతిరేకంగా పోరాడినప్పుడు... 60 ఏళ్ల వయసులో నేను ప్రయత్నించలేనా?’’ అని కమల్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... కమల్ పై విధంగా స్పందించారు. అంతే కాదు... రజనీకాంత్‌కు వ్యతిరేకంగా తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. -
ప్రియమైన బాపూ.. నువ్వే ప్రేరణ!
⇒ ఉత్తరం రాయండి.. బహుమతి గెల్చుకోండి ⇒ ప్రధాని సూచనతో తపాలా శాఖ వినూత్న కార్యక్రమం ⇒ ఉత్తమ లేఖకు సర్కిల్ స్థాయిలో రూ.25 వేలు.. జాతీయ స్థాయిలో రూ.50 వేలు ⇒ గాంధీ జయంతి రోజున సబర్మతి ఆశ్రమంలో అందజేత సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీకి లేఖ రాయాలనుకుంటున్నారా..? అయితే ఆయన జీవి తం మీకు ఎలా ప్రేరణ కలిగించిందో ఓ ఉత్తరం రాయండి.. అది ఆకట్టుకునేలా ఉంటే సబర్మతి ఆశ్ర మానికి చేరుకుంటుంది. మీకు నగదు పురస్కారం దక్కుతుంది! ఈ మేరకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో మహాత్ముడి చిత్రాలతో ఉన్న కొన్ని తపాలా కవర్లను విడుదల చేశారు. ఆ సందర్భంగా మహాత్ముడిని జనం మరోసారి తలచుకోవటంతోపాటు ఉత్తరాలు రాసే మధుర జ్ఞాపకాన్ని నెమరేసుకోవటం ఒకేసారి జరిగేలా ఓ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తపాలా శాఖకు సూచించారు. దీంతో ‘ప్రియ బాపూ... నువ్వే నా ప్రేరణ’ పేరుతో తపాలా శాఖ ఓ కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. మహాత్ముడి ప్రేరణ ప్రభావాన్ని స్వీయానుభవంలో వివరిస్తూ ఆగస్టు 15లోపు తెలం గాణ సర్కిల్ తపాలా చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్‌కు చేరేలా ఉత్తరం స్వదస్తూరీతో రాసి పంపాలి. వాటి ల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మూడు నగదు పురస్కారాలను తపాలా శాఖ అందించనుంది. వా టిని జాతీయ స్థాయి పురస్కార ఎంపికకు కూడా పంపుతుంది. అక్కడ ఎంపికైతే మరో దఫా పుర స్కారం వరిస్తుంది. అలా ఉత్తమమై నవి సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటాయి. అక్కడ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వాటిని ప్రదర్శించ టంతోపాటు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పోటీ ఇలా... ఈ పోటీ రెండు వయసుల వారికి ఉంది. 18 ఏళ్లలోపు వారు, అంత కంటే ఎక్కువ వయసున్న వారికి విడివిడిగా ఏర్పాటు చేశారు. ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలకు మించకుండా, ఏ4 సైజ్ కాగితంలో అయి తే వెయ్యి పదాలకు మించకుండా వ్యాసం రాసి రూ.5 పోస్టు కవర్లో ఉంచి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్, అబిడ్స్ హైదరాబాద్, 500001 చిరునామాకు పంపాలి. గాంధీజీని ఉద్దేశిస్తూ తమ జీవితంలో ఆయన ఎలా స్ఫూర్తి నింపారో రాయాలి. దాంతోపాటు వయసు పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి. బహుమతులు ఇలా.. సర్కిల్ స్థాయిలో మొదటి ఉత్తమ లేఖకు రూ.25 వేలు, రెండో లేఖకు రూ.10వేలు, మూడో ఉత్తమ లేఖకు రూ.5వేలు నగదు బహుమతి ఉంటుం ది. ఇది రెండు వయసుల వారికి విడివిడిగా ఉంటుంది. ఇవి జాతీయ స్థాయి లో మళ్లీ ఎంపికైతే మొదటి ఉత్తమ లేఖకు రూ.50 వేలు, 25 వేలు, రూ.10 వేలు బహుమతి ఉంటుంది. అక్టోబర్ 2న వాటిని సబర్మతి ఆశ్రమంలో ప్రద ర్శిస్తారు. ఇందుకు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇన్లాండ్ లెటర్లను, పెన్నులను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. దాదాపు 3 నుంచి 5 లక్షల లేఖలను సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గాంధీ ‘బంధీ’
కలెక్టర్ కార్యాలయం ముందుభాగంలో ఉన్న ఐలాండ్‌లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు గ్రహణం వీడలేదు. దీంతో మహాత్ముని విగ్రహం జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ చాంబర్ వెనుక గదిలో బంధీగా ఉండిపోయింది. రెండేళ్ల కిందట ఇస్కాన్ మందిరం వారు అందజేసిన ఈ విగ్రహాన్ని ఐలాండ్‌లో ఏర్పాటు చేయడానికి ఖజానా శాఖ అధికారులు అప్పట్లో అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఖజానాకు ఎదురుగా నంది విగ్రహం ఉందని, దానికి అడ్డుగా విగ్రహం ఉంచడం సరికాదని చెప్పడంతో ఏర్పాటు చేయలేదని సమాచారం. ఇక అప్పటి నుంచి విగ్రహం గదికే పరిమితం అయ్యింది. ఆ తరువాత విగ్రహం ఏర్పాటు అంశం పూర్తిగా మరుగునపడింది. -
డల్లాస్‌లో ఘనంగా యోగా దినోత్సవం
డల్లాస్: టెక్సాస్‌లో గల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వద్ద మూడో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్జీఎమ్ఎన్టీ, కన్సూలెట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 300 మంది ఔత్సాహికులు యోగా డే వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో రావు కల్వల మాట్లాడుతూ.. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా డే ప్రపోజల్‌ను పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టెక్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మ్యాట్ రినాల్డి మాట్లాడుతూ.. అమెరికాలో అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడానికి డా.తోటకూర ప్రసాద్ చేసిన కృషిని కొనియాడారు. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. దాదాపు 5000 సంవత్సరాల క్రితం రిషీకేష్‌లో యోగా ప్రారంభమైందని తెలిపారు. మూడో అంతర్జాతీయ యోగా వేడుకలు గాంధీజి విగ్రహం ముందు జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. గాంధీ ప్రతి రోజు మెడిటేషన్, యోగా సాధన చేసే వారని చెప్పారు. -
రాజ్‌నాథ్‌సింగ్ రాయని డైరీ
‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా’’ అని చంపారన్ నుంచి వచ్చిన ఒక సీనియర్ సిటిజన్ ఈ ఉదయం నన్ను పట్టుకుని అడిగాడు! చూడ్డానికి ఆయన అచ్చు గాంధీజీలా ఉన్నారు. చేతిలో కర్ర లేదు. కళ్లకు గుండ్రటి ఫ్రేమ్ ఉన్న అద్దాలు లేవు. ఇంకో చేతిలో పుస్తకమూ లేదు. అయినా గాంధీజీలానే ఉన్నారు. ఆయన అడిగిన ప్రశ్నను బట్టి, ముఖ్యమైన పనేమీ లేకుండానే ఆయన నన్ను కలవడానికి వచ్చినట్లు అనిపించింది. అంత ముఖ్యం అయి ఉంటే, నేనే అతడి దగ్గరికి ఢిల్లీ నుంచి చంపారన్ వెళ్లి ఉండేవాడిని! చంపారన్ బిహార్‌లో ఉంటుంది. బిహార్‌లో నితీశ్‌కుమార్ ఉంటాడు. బిహార్‌లోనే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉంటాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉన్నా సరే, ఈ పెద్దాయన కోసం అక్కడికి వెళ్లి ఉండేవాడిని. వెళ్లి, సమస్య ఏమిటని అడిగి ఉండేవాడిని. ఎంతైనా ఈ బిహారీ గాంధీజీకి కూడా నేను హోమ్ మినిస్టర్‌నే కదా. హోమ్ మినిస్టర్ ఏ స్టేట్‌కి అయినా వెళ్లొచ్చు. అక్కడ బీజేపీ ప్రభుత్వం లేకపోవచ్చు. అయినా వెళ్లొచ్చు. అక్కడ నితీశ్, లాలూ ఉండొచ్చు. అయినా వెళ్లొచ్చు. ముఖం చూడ్డం ఇష్టం లేక వెళ్లడం మానేస్తే, మనం చూడాలనుకున్న ముఖాలను చూడలేం. మనల్ని చూడాలనుకున్నవాళ్లకూ ముఖం చూపించలేం. ‘‘పెద్దాయనా.. ముందు మీరు కూర్చోండి. మీకు ఏ విధంగానైనా సహాయపడ గలగడం కోసమే కదా మేమంతా ఇక్కడ.. ఈ ఢిల్లీలో సిద్ధంగా ఉన్నాం’’ అన్నాను. ఆయన కూర్చోలేదు! ‘‘నాకు సహాయం వద్దు. సమాధానం కావాలి’’ అన్నారు.‘‘చెప్తాను కూర్చోండి’’ అన్నాను. ‘‘చెప్పండి. కూర్చుంటాను’’ అన్నారు. గాంధీజీ కంటే మొండివాడిలా ఉన్నాడు. ‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా?’’ అని మళ్లీ అడిగాడు. ‘‘ఉంది పెద్దాయనా.. గాంధీజీపై గౌరవం ఉంది. గాంధీజీ సత్యాగ్రహం చేసిన చంపారన్‌పై గౌరవం ఉంది. చంపారన్‌లో ఉంటున్న మీపైనా గౌరవం ఉంది’’ అన్నాను. ‘‘మరి చంపారన్‌లో వందేళ్ల సత్యాగ్రహ సభ జరుగుతుంటే.. ఆ సభకు మీరెందుకు రాలేకపోయారు?’’ అని ప్రశ్నించాడు పెద్దాయన. ‘‘రాలేకపోవడం.. గౌరవం లేకపోవడం రెండూ ఒకటేనా పెద్దాయనా’’ అని అడిగాను. ‘‘రాజ్‌నాథ్‌జీ.. మీకోసం ఎల్తైన వేదికపైన కుర్చీ వేశారు. ఆ కుర్చీపైన అందరికీ కనిపించేలా మీ పేరు కూడా రాశారు. లాలూజీ ఏమన్నారో తెలుసా? గాంధీజీకి పూలదండ వేసిన చేత్తోనే మీరు గాడ్సేకీ వేస్తారని, అలాంటి మనిషి సత్యాగ్రహ సభకు ఎందుకు వస్తారనీ! ఆ మాట నిజమేనా రాజ్‌నాథ్‌జీ.. చెప్పండి’’ అన్నారు. ఏం చెప్పను?! ‘‘ఆగ్రహాన్ని నా దగ్గర వదిలేసి, లాలూజీ కనిపెట్టిన సత్యాన్ని తిరిగి మీతోనే చంపారన్ మోసుకెళ్లండి పెద్దాయనా’’ అని చెప్పాను. -
ఆ సెలైన్‌లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. నీలోఫర్‌లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్‌లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు. -
బాపు
-
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాత్మాగాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న భారతదేశం తయారవ్వాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, కృష్ణమోహన్, సీఐలు నాగరాజ యాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం... రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి ఎస్పీ ఆకే రవికృష్ణ ఆర్థిక సాయాన్ని అందించారు. ఏఆర్పీసీ రామాంజనేయులు, సివిల్ పీసీ నాగరాజు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురై మతిస్థిమితం కోల్పోయి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలు చంద్రరేణుక, కాంతమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
అమరులకు వందనం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం బ్రిటిష్ పతాకం పరిచిన చీకట్ల కింద మగ్గిపోతున్న భారతావనికి కొత్త సూర్యోదయాన్ని చూపించి తాను అస్తమించారు బాపూజీ. మాతృభూమికి స్వేచ్ఛావాయువుల నిచ్చి తుదిశ్వాస వదిలారాయన. జనవరి 30, 1948న గాడ్సే తుపాకి గుళ్లకు బలైనప్పటికీ చాలామంది ప్రపంచ ప్రజల గుండెల్లో ఆయన స్మృతి ఈనాటికీ పదిలమే. గాంధీజీ స్ఫూర్తి, ఆదర్శం ప్రపంచ చరిత్రలో అనంతమైన అధ్యాయాలుగా మిగిలాయి కూడా. అహింస అనే ఆయన ఆదర్శానికి కైమోడ్పులు ఘటిస్తూనే స్వాతంత్య్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు దీటుగా తమవైన పంథాలలో ఉద్యమించి త్యాగాలు చేసిన వారినీ స్మరించుకోవడం ఇవాళ్టి తరాల బాధ్యత. మితవాదులైనా, అతివాదులైనా, తీవ్ర జాతీయవాదులైనా– దాస్య శృంఖలాలు తెగే వరకే ఆ దృష్టి. ఆ విభజన. మార్గం వేరైనా, వారందరి లక్ష్యం దేశ స్వాతంత్య్రమే. ఎవరి త్యాగమైనా స్వరాజ్య భారతికీ, కొత్త తరాల దృష్టిలోనూ విలువైనదే కావాలి. అందుకే గాంధీజీ వర్ధంతికే ఆ మృతవీరులనూ స్మరించుకునే సమున్నత ఆదర్శాన్ని ఈ దేశం పాటిçస్తున్నది. గాంధీజీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిపారు. నిజమే! ఆయనకు ముందు జరిగిన పోరులలోనూ, అలనాటి వీరులలోనూ అలాంటి శక్తే కనిపిస్తుంది. ఇదీ నిజమే! కానీ..... రక్తదీపావళిని మరిపించే ఆ త్యాగమూర్తుల జీవితాలలో మనకు తెలిసినవి ఎన్ని? వారిలో ఎందరిని తలుచుకుంటున్నాం? ఎంతమంది గురించి మన తరం వాళ్లం చదువుకున్నాం? చరిత్ర పుటలలో ఓ చోటు కోసమనీ, స్వతంత్ర భారతంలో పదవులొస్తాయనీ వారు తమ సర్వస్వం అర్పించలేదు. కేవలం దేశం కోసం ప్రాణాలర్పించారు. నిస్వార్థంగా నిష్క్రమించారు. అందుకే ఆ హుతాత్మల త్యాగ నిరతిని గాలికి వదిలేయడం ఏ దేశమైనా చేయవలసిన పనికాదు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా కాల్చిన మంగళ్ పాండే సాహసం, నానా సాహెబ్, లక్ష్మీబాయి, తాంతియా తోపే, తురేబాజ్ ఖాన్, వీరందరి వెనుక నిలిచిన సిపాయీల త్యాగాలు మరచిపోతామా! చిన్న ఉద్యమంతో పెద్ద త్యాగం చేసిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేని తలచుకోవడం మన విధి. పంజాబ్‌లో కొన్ని క్షణాల పాటు ఆరో నదికి– నెత్తుటి నదికి జన్మనిచ్చిన జలియన్‌వాలాబాగ్ దురంతంలో నేలకూలిన వారిని స్మరించేందుకు రెండు నిమిషాలు కేటాయించలేమా? స్వరాజ్యం నా జన్మహక్కు అన్న తిలక్, లాఠీదెబ్బలకు బలైన లజ్‌పతిరాయ్, అండమాన్ జైలులో కఠోర శిక్షలు అనుభవించిన సావర్కర్, ఇంకా ఎందరో త్యాగధనులు... గదర్‌వీరులు లాలా హరదయాళ్, సోహన్‌సింగ్ భాక్నా, కర్తార్ సింగ్, పృథ్వీసింగ్ ఆజాద్, రాస్ బిహారీ బోస్, ఉద్దమ్‌సింగ్, మౌల్వీ బర్కతుల్లా, దర్శి చెంచయ్య వంటి వారి స్వాతంత్య్ర కాంక్ష సదా స్మరణీయమే. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యకు వేలాడాడు ఖుదీరాం. అషఫుల్లా ఖాన్, మదన్‌లాల్ థింగ్రా చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హిందుస్తాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పేరు గుర్తుకు వస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దద్దరిల్ల చేసిన బాంబు పేలుడు చెవిని తాకడమే కాదు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఉడుకు రక్తపు చుక్కలు కంటి ముందు కదులుతాయి. కొండకోనలలో సంతాల్ హూల్ అంటూ సంతాల్ తెగ ఆదివాసులు, ఉల్గులాన్ అంటూ బిర్సా ముండా నేతృత్వంలో ముండా తెగ గిరిజనులు; ఇంకా ఖోలీలు, ఖోందులు, రాణీ గ్లెయిడినీ నాయకత్వంలో పోరాడిన నాగా వీరులు, నల్లమల చెంచులు.. ఎందరో గిరిపుత్రులు బ్రిటిష్ దాష్టీకం మీద శర సంధానం చేశారు. ప్రాణాలు వదిలారు. ‘జైహింద్’ అంటూ... ‘చలో ఢిల్లీ’ అంటూ నినదించిన సుభాష్ బోస్, షానవాజ్ ఖాన్, మోహన్‌సింగ్ దేవ్ వంటి ఆజాద్ హింద్ ఫౌజు జవానులు; చిట్టగాంగ్ మహావీరుడు సూర్యసేన్... ఎందరని! ఎన్నెన్ని త్యాగాలని! ఎన్నెన్ని రక్త తర్పణలని! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్వేచ్ఛాకాంక్షతోనే దేశం ప్రతిధ్వనించింది. వీటి నడుమనే కనిపిస్తుంది విశాఖ మన్య పోరాటం. ఆ మహా యుద్ధానికి నాయకుడే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు. ఇది తెలుగు గడ్డ మీద జరిగిన పోరు. అయినా ఇప్పటికీ తెలుగువారికి తెలియని సత్యాలెన్నో! ఈ వారం నుంచి మొదలయ్యే ‘ఆకుపచ్చని సూర్యోదయం’ సీరియల్ ఆ లోటును పూరిస్తుందని మా నమ్మకం. -
చరఖా తిప్పితే గాంధీ కాలేరు
‘ఖాదీ’ క్యాలెండర్లో మోదీ చిత్రంపై విపక్షాల ఆగ్రహం • ఖాదీ ఖ్యాతినీ హైజాక్ చేయాలని చూస్తున్నారన్న రాహుల్ • గతంలోనూ గాంధీజీ చిత్రం లేకుండా క్యాలెండర్ వచ్చింది.. • ఇదంతా అనవసర రాద్ధాంతమన్న పీఎంవో న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ క్యాలెండర్, డైరీపై గాంధీ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను ముద్రించడంపై వివాదం మరింత ముదిరింది. చరఖా తిప్పినంత మాత్రాన ఎవరూ గాంధీ కాలేరు అంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు శుక్రవారం విమర్శల దాడి ప్రారంభించాయి. మంగళయాన్ యాత్ర విజయవంతమైన సమయంలో ఆ ఘనత కోసం వెంపర్లాడిన మోదీ... ప్రస్తుతం ఖాదీ ప్రచారకర్తగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో విమర్శించారు. ‘చరఖాతో పాటు మహాత్ముడి చిత్రం తొలగించి మోదీబాబు ఫొటో పెట్టారు.. జాతిపిత చిత్రాన్నే తొలగిస్తారా.. మోదీగారూ.. ఏంటిది?’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఖాదీ, గాంధీజీ అనే పదాలు దేశ చరిత్ర, స్వావలంబన, పోరాటానికి చిహ్నాలని, క్యాలెండర్ నుంచి గాంధీజీ ఫొటో తొలగించడం మహా పాపమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం... ఇదంతా అనవసర రాద్ధాంతంగా కొట్టిపారేసింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ (కేవీఐసీ) క్యాలెండర్, డైరీలపై మహాత్మా గాంధీ ఫొటో తప్పనిసరనే నిబంధన ఏదీ లేదని, గతంలోనూ గాంధీజీ ఫొటో లేకుండా క్యాలెండర్లు వెలువడ్డాయంటూ సమర్థించుకుంది. 1996, 2002, 2005, 2011, 2012, 2013, 2016 సంవత్సరాల్లో విడుదలైన క్యాలెండర్లలో గాంధీ ఫొటో లేదని పేర్కొంది. మోదీ యువత చిహ్నమని అభివర్ణిస్తూ.. యువతలో ఖాదీ ఉత్పత్తులపై ప్రజాదరణ పెరుగుతుండటం దీనికి నిదర్శనమని చెప్పింది. ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించేందుకే.. ‘ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించి నేతన్నల జీవితాల్ని మెరుగుపర్చేందుకే ప్రధాని మోదీ చిత్రాన్ని క్యాలెండర్, డైరీలపై ముద్రించాం. గాంధీజీ స్థానాన్ని మోదీతో భర్తీ చేశారంటున్న వారిని ఒక్కటే ప్రశ్న వేస్తాను. వేరెవరితోనైనా గాంధీజీని పోల్చగలమా? మహాత్ముడి ఖ్యాతి అంత తక్కువా? గాంధీజీ స్థానం ఎన్నటికీ వేరొకరు భర్తీ చేయలేరు. ఇదంతా అనవసర వివాదం’ అంటూ కేవీఐసీ చైర్మన్ వీకే సక్సేనా వివరణ ఇచ్చారు. ఖాదీ పరిశ్రమ మొత్తం గాంధీజీ సిద్ధాంతం, ఆదర్శాలపై ఆధారపడి ఉందని, కేవీఐసీకి ఆయన ఆత్మ. కాబట్టి ఆయనను విస్మరించే ప్రశ్నే లేదన్నారు. ఫ్యాషన్‌గా మారింది: తుషార్ గాంధీ గాంధీజీ చరఖా సాధికారతా సాధనమని, అయితే పేరు ప్రఖ్యాతులు పొందేందుకు ప్రస్తుతం అది ఫ్యాషన్ వస్తువుగా మారిపోయిందంటూ మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేద, బలహీనవర్గాలకు బాపూజీ చరఖా ఉత్పత్తి, సాధికారత సాధనం. స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయుధంలా పనిచేసింది. ప్రస్తుతం అది కేవలం ఫొటోలు తీసుకునే పరికరంగా మారిపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. గాంధీ సిద్ధాంతాల ప్రచారం: బీజేపీ కేవీఐసీ క్యాలెండర్లపై గాంధీజీ చిత్రాలను అనేకసార్లు ముద్రించలేదని, దీనిపై కాంగ్రెస్ అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని బీజేపీ ఆరోపించింది. మహాత్ముడి సిద్ధాంతాల్ని ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం గాంధీ పేరును, ఫొటోల్ని వాడుకొని ఆయన ఆశయాల్ని, ఆదర్శాల్ని విస్మరించిందని బీజేపీ విమర్శించింది. -
అందుకే మోదీ ఫోటో పెట్టారు: కమల్ రాజ్
న్యూఢిల్లీ : గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్ వివాదంపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు క్యాలండర్‌తో ఆటు డైరీలపై జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని మోదీ ఫోటో పెట్టడాన్ని కేంద్రమంత్రి కమల్ రాజ్ మిశ్రా సమర్థించారు. ఖాదీ వినియోగాన్ని ప్రధాని ప్రోత్సాహిస్తున్నారని, మోదీ ఫోటో పెట్టాలన్నది ఖాదీ బోర్డు నిర్ణయమని ఆయన అన్నారు. విపక్షాలవి అనవసర ఆరోపణలు అంటూ కమల్ రాజ్ కొట్టిపారేశారు. ఖాదీ సంస్థ కేలండర్, డైరీలపై కేవలం మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే పెట్టాలన్న నిబంధనేమీ లేదన్నారు. కాగా కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని ఖాదీ బోర్డు పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. అయితే మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
గాంధీ స్థానంలో మోదీ
ముంబై: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్, డైరీలపై ఖాదీకి మారుపేరైన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేసింది. కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. వీటిని చూసి ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కొందరు నోరెళ్లబెట్టారు. గురువారం ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని మౌన నిరసన తెలిపారు. గాంధీ చిత్రాలతో వీటిని పునర్ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేయాలి
– ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, మల్లికార్జున కల్లూరు (రూరల్): నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేయాలని ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ మల్లికార్జున డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ఎదుట ఐఎంఏ చేపట్టిన దేశవ్యాప్త సత్యాగ్రహం కార్యక్రమానికి కర్నూలు మెడికల్ రెప్రజెంటేటివ్ అసోసియేషన్ మద్దుతుతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ, మల్లికార్జున మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అతిపెద్దదని, 30 రాష్ట్రాల్లో 1765 బ్రాంచులుండి దేశవ్యాప్తంగా 2,70వేల మంది డాక్టర్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేసి ఎంసీఐని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. పీసీ, పీఎన్డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లను సవరించాలన్నారు. వినియోగదారుల రక్షణ యాక్ట్‌ను సవరించి మృతుల కుటుంబాలకు ఇచ్చే కాంపన్సేషన్‌ను ఆపేయాలన్నారు. షెడ్యూల్డ్ మందులు అల్లోపతి వైద్యులు మాత్రమే రాయాలన్న హక్కులు సరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు బాలమద్దయ్య, రామచంద్రనాయుడు, అల్లారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కుళ్లాయప్ప, రమేష్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలతో మహాత్ముడికి నీరాజనం
అనంతపురం కల్చరల్ : కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా మచ్చా నరసింహులు నేతృత్వంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి పూలమాలలు పలువురు రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు. అనంతరం నిరుపేద మహిళలకు నూతన వస్త్రాలనందించారు. అలాగే అమ్మవారిశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అన్ని పార్టీల వారు ఒకే వేదికపై సందడి చేశారు. ఎంపీ దివాకరరెడ్డి, మేయర్ స్వరూప, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సత్కరించారు. అలాగే పాతూరు అమ్మవారి శాల, హరిశ్చంద్ర ఘాట్, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తాడిపత్రి బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయం అధ్యక్షులు ముత్యాల రంగయ్య నేతృత్వంలో 500 మంది పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గాంధీ మార్గంలో పయనించాలి
జయంతి వేడుకల్లో జేసీ సత్యనారాయణ రాంనగర్ : మహాత్మా గాంధీ ప్రపంచానికి చూసిన శాంతి, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 147వ జయంతి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గాన్ని ఎచుకుని మానవ జాతి మనుగడకు మార్గం చూపిన మూల పురుషుడన్నారు. గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. మానవ సమాజం శాంతి, స్వచ్ఛత, క్షమాగుణం కలిగి ముందుకు సాగాలన్నారు. హింస వల్ల అంతా నష్టమేగాని ఏమి లాభం ఉండదని, దేశంలో నానాటికి హింసా ప్రవృత్తి పెరుగుతందని, దానిని విడనాడి శాంతియుత మార్గంలో నడవాలని సూచించారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు గాంధీజీని స్మరించుకుంటున్నారన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింసా తత్వం మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, టీఎన్జీఓ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, వీఆర్వోల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె జాన్పాషా తదితరులు బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.