లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.
‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.
‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.
కాంగ్రెస్‌కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందారు. ఈసారి వాయ్‌నాడ్‌తో పాటు బార్‌బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్‌నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment