chaprasi
-
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్‌కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్‌నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
‘ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ’
అగర్తల : ఇస్లామాబాద్‌లో సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదులు పాలన కొనసాగిస్తున్నారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ మాత్రమే అంటూ బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక పాకిస్తాన్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ఐక్య రాజ్య సమితి వేదికగా ప్రకటించిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్లో సైన్యం, ఉగ్రవాదం అధికారమేలుతున్నాయి. ఇప్పుడక్కడ ఇమ్రాన్ ఖాన్ కేవలం ఓ చప్రాసీ మాత్రమే. మన దేశం ఎంత శాంతియుతంగా ఉంటున్న పాక్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం. పాకిస్తాన్‌ను బలూచ్, సింధ్, పష్తున్లతో పాటు పశ్చిమ పంజాబ్ అనే నాలుగు భాగాలుగా విభజించాలి. అప్పుడైతేనే ఈ సమస్యలు సమసిపోతాయి’ అన్నారు. అంతేకాక ‘అంతర్జాతీయ వేదికల మీద మన దేశం, పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా ఆ దేశం ఒత్తిడికి గురై ఏవేవో ఆరోపణలు చేస్తుంది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్ గురించి మర్చిపోండి. మన ఆర్మీని సిద్ధం చేయండి. కేవలం ఒక్క రోజులో పాక్ నాలుగు భాగాలుగా విడిపోతుంది’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘మన దేశం అన్ని రకాలుగా బంగ్లాదేశ్‌కు సాయం చేస్తోంది. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఆమె హిందూవులను వేధిస్తూ, దేవాలయాలను నాశనం చేస్తూన్న పిచ్చి వారిని ఆపడంలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్‌పై తగు చర్యలు తీసుకోవాలిని నేను మన ప్రభుత్వానికి సిఫారసు చేస్తాన’ని తెలిపారు. -
'సీఎం అయి కూడా చప్రాసీ క్వార్టర్స్ లో ఉన్నా'
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు చిన్న క్లాస్ పీకారు. కాస్తా పద్ధతిగా మసులుకొని.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన మహాకూటమి గౌరవాన్ని నిలుపాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ బంగ్లాల కోసం పరస్పరం కోట్లాటలకు దిగడం, ప్రభుత్వం అధికారికంగా నివాసాలు కేటాయించకముందే.. ముందే వెళ్లి వాటిలో పాగా వేసేందుకు పాకుతుండటంతో వారి తీరుపై లాలూ, ఆయన తనయుడు డిప్యూటీ సీఎం తేజస్వి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాలూ తనదైన శైలిలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాలుగు నెలలు చప్రాసీ (ప్యూన్) క్వార్టర్ లో గడిపానని, ఈ విషయాన్ని కొత్త ఎమ్మెల్యేలు గుర్తించాలని సూచించారు. 'మహాకూటమి నేతృత్వంలోని ప్రభుత్వ గౌరవాన్ని కాపాడే బాధ్యత మీపై ఉంది. పద్ధతిగా వ్యవహరించండి. తప్పుడు పనులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకండి' అని లాలూ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బిహార్ లో కొత్తగా ఎన్నికైన అధికార ఆర్జేడీ, జేడీయూ ఎమ్మెల్యేలు విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాల కోసం ఎగబడుతుండటం.. వివాదాస్పదంగా మారింది. -
చప్రాసీ నుంచి మండలి చైర్మన్ దాకా..
ఇది గొప్ప ప్రజాస్వామ్యం: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: చప్రాసీగా ఉన్న తనను పెద్దల సభకు చైర్మన్‌ను చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానిదేనని శాసనమండలి నూతన చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం మరెక్కడుందని వ్యాఖ్యానించారు. ఎక్కడో బీసీ కుటుంబంలో పుట్టి, అటెండర్‌గా ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు మండలి చైర్మన్‌గా అత్యున్నతమైన బాధ్యతను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు, సహకరించిన సభ్యులకు తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. అంతకుముందు సభలో 21 మంది సభ్యులు నూతన చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌ను అభినందించడంతోపాటు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... * తట్టుకోలేని ఉద్వేగానికి గురవుతున్న సందర్భమిది. కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ సాయుధ, ఉద్యమ అమర వీరుల పోరాట ఫలితమే ఇది. నన్ను అక్కున చేర్చుకున్న నా ఊరుతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన సభ్యులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు ఆచార్య జయశంకర్, అమర వీరుల ఆత్మలు పులకించినట్లే. * నేను పోరాటం మొదలుపెట్టాక ఏనాడూ మూడు గంటల సేపు మౌనంగా ఉన్న సందర్భం లేదు. ఈ రోజే తొలిసారిగా మీరంతా మాట్లాడుతుండగా మౌనంగా ఉన్నాను. చెప్పింది విని సలహాలు, సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకోవడాన్ని నా బాధ్యతగా భావిస్తున్నా. * మీ అందరితో పోలిస్తే రాజకీయాల్లో నేను పసిబాలుడిని. మీ అందరి సహకారంతో తప్ప స్వతహాగా ముందుకు వెళ్లలేనివాడిని. ఇకపై నేను అధికార, ప్రతిపక్షానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ రెండు పయ్యల(చక్రాల)ను పట్టాలపై సమంగా నడిపించేందుకు కృషి చేస్తా.