మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం
మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం
Published Sat, Aug 6 2016 8:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
ఇబ్రహీంపట్నం :
రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. స్థానిక నాయకులు, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ వారికి గాంధీ విగ్రహం తొలగించటంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులదే ప్రధాన పాత్ర అని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతలకు ఈ ప్రభుత్వం పట్టించిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముణ్ని అర్ధరాత్రి హత్యచేసి మురికినీటిలో పడేయటం దారుణమన్నారు. మూడురోజుల్లో విగ్రహాన్ని నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పటతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement