father of nation
-
భరత జాతి గుండెచప్పుడు
సత్యం, అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాత్ముడిని దేశం మొత్తం స్మరించుకుంటోంది. నాజీవితమే నా సందేశం అంటూ ఎలుగెత్తి చాటిన ఆ మహనీయుడు స్మృతుల్లో సకల భారతావని తేలిపోతోంది. తరతరాలకు ఆదర్శప్రాయుడైన గాంధీని అనుసరిద్దాం అంటూ ఎలుగెత్తి చాటుతోంది. ....... భరతమాత స్వేచ్ఛ కోసం జీవితాంతం తపన పడిన ఆ గుండె చప్పుడుని ఇప్పుడు మనమూ వినొచ్చు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియంలో ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అందులో గాంధీ గుండె చప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గాంధీజీ జీవితంలో వివిధ దశల్లో తీసిన ఈసీజీలను సేకరించి వాటికి అనుగుణంగా డిజిటల్ పద్ధతుత్లో గుండె చప్పుడుని కృత్రిమంగా సృష్టించారు. ఈ గుండె చప్పుడు సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుందని మ్యూజియం డైరెక్టర్ ఎ. అన్నామలై తెలిపారు. అహింసా, ప్రపంచ శాంతి అన్న థీమ్‌తో ఒక ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అంతే కాదు మహాత్ముడికి చెందిన అరుదైన సేకరణలతో డిజిటల్ మల్టీమీడియా కిట్‌ను రూపొందించారు. ఒక పెన్ డ్రైవ్‌లో ఉండే ఈ కిట్‌లో గాంధీజీ రచించిన 20 పుస్తకాలు, మహాత్ముడిపై వచ్చిన 10 పుస్తకాలు, గాంధీజీపై ఎకే చెట్టియార్ తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్, మహాత్ముని జీవిత విశేషాల్ని తెలిపే 100 అరుదైన చిత్రాలు, గాంధీజీ ప్రసంగాలు, గాంధీజీ ఆశ్రమంలో టూర్, ఆయనకు ఇష్టమైన భజనలు ఆ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్‌ను రూ.300లకు సందర్శకులు కొనుక్కోవచ్చు. నెదర్లాండ్స్‌లో గాంధీ మార్చ్ అక్టోబర్ 2, గాంధీ మహాత్ముడి జయంతే కాదు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు సంబరాలు చేసుకున్నాయి. ఈ సారి మహాత్ముడి 150వ జయంతి కావడంతో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో వెయ్యి మందితో గాంధీ మార్చ్ జరిగింది. ఇందులో వివి«ధ దేశాలకు చెందిన 20 మంది రాయబారులు కూడా పాల్గొన్నారు. వీరంతా మహాత్ముడిని అనుసరిద్దాం అన్న లోగో ప్రింట్ చేసిన టీ షర్ట్లు ధరించారు. నెదర్లాండ్స్‌లో భారత రాయబారి రాజమణి ఈ మార్చ్‌కు నేతృత్వం వహించారు. మార్పు కోసం 150 ఆలోచనలు బాపూజీ ఆదర్శాలే స్ఫూర్తిగా సమాజంలో మార్పు కోసం 150 ఐడియాలు ఇవ్వండి అంటూ లెటర్‌ఫారమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. సమాజంలో మార్పుకోసం తమకు వచ్చిన ఆలోచనల్ని పోస్టుకార్డుపై రాసి పంపండి అంటూ ఆ స్వచ్ఛంద సంస్థ యువతకి పిలుపునిచ్చింది. వచ్చే ఏడాదిలోగా యువత నుంచి వచ్చిన వాటిలో అత్యుత్తమమైన 150 ఆలోచనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకొని దేశాభివృద్ధి కోసం ఏం చేయవచ్చో సమగ్ర చర్చ జరుపుతామని లెటర్‌ఫారమ్స్ స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడు సాటి మాథ్యూ వెల్లడించారు. యువత తమకు వచ్చిన ఆలోచనని ఛేంజ్150, లెటర్‌ఫారమ్స్, పోస్టుబ్యాగ్నెం.1683, కొచ్చి, కేరళ అన్న చిరునామాకు పంపించవచ్చు. ముంబైలో కళాకారుల ప్రదర్శన దక్షిణ ముంబైలోని ప్రతిష్టాత్మక సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (ఎస్జేజేఎస్ఏ) మహాత్ముడి కోసం ప్రత్యేకంగా కళాకారుల ప్రదర్శన ఏర్పాటుచేసింది. మహారాష్ట్రవ్యాప్తంగా 150 మంది కళాకారులు వివిధ కళారూపాల్లో గాంధీజీకి నివాళులర్పించనున్నారు. చిత్రకారులు, శిల్పకళాకారులు, చేనేత కళాకారులు రకరకాల ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నారు. డ ఒడిశాలో రెండేళ్లపాటు ఉత్సవాలు ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గాంధీజీ 150 జయంతి ఉత్సవాలను రెండేళ్లపాటు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ గాంధీజీ సిద్ధాంతాలు తెలిసేలా, గాంధీని అనుసరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 2020 అక్టోబర్ 2వరకు కొనసాగనున్నాయి. ట్విట్టర్లో గాంధీజీ ఇమోజీ మహాత్మా గాంధీ 150 జయంతిని సందర్భంగా ట్విట్టర్ మంగళవారం గాంధీజీ ఇమోజీని ఆవిష్కరించనుంది. ఈ ఇమోజీ వారం రోజుల పాటు నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా ఎవరైనా ట్వీట్లు చేస్తే గాంధీ జయంతి హ్యాష్‌ట్యాగ్‌లతో పాటుగా గాంధీ ఇమోజీని కూడా వినియోగించవచ్చు. దీంతో పాటుగా మహాత్ముడి క్యారికేచర్ కూడా నీలం తెలుపు రంగుల్లో ట్విట్టర్ బ్యాక్ డ్రాప్లో మెరిసిపోనుంది. ట్విట్టర్ అధికారిక లోగో థీమ్‌లో భాగంగా ఈ కేరికేచర్ దర్శనమివ్వబోతోంది. గాంధీజీ స్కూలు.. ఇక ‘చరిత్ర’నేనా..! జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా అట్టహాసంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అప్రియ సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లో గాంధీజీ స్థాపించిన ‘రాష్ట్రీయ శాల’ స్కూలు నిర్వహణ కుæ నిధులు కొరవడడంతో రెండు నెలల క్రితం మూతపడింది. 97 ఏళ్ల నాటి ఈ పాఠశాలలో 1–7 తరగతుల మధ్య చదువుకుంటున్న 37 మంది విద్యార్థులు ఇప్పుడు మరో స్కూళ్లో చేరాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి మ్యూజియంగా మార్చిన ఆల్ఫ్రేడ్ హైస్కూల్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మ్యూజియంకు కేవలం 2 కి.మీ దూరంలోనే ఈ పాఠశాల ఉనికి కోల్పోయింది. 1921 ఫిబ్రవరి 1న ప్రారంభించిన ఈ స్కూల్ నియామవళిని గాంధీజీనే రూపొందించారు. జాతి నిర్మాణానికి సంబంధించి ఆదర్శాలను పిల్లల్లో ప్రోదిగొల్పేలా చేయాలన్నదే వీటి లక్ష్యం. ఈ పాఠశాలలోనే గాంధీజీ తరచుగా ప్రార్థన చేయడంతో పాటు , స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా 1939లో ఇక్కడే నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ నగరంలోనే ఓ ఉత్తమ పాఠశాలగా ఇది విరాజిల్లింది. ప్రస్తుత గుజరాత్ విద్యాపీ uŠ‡ వైస్‌ఛాన్సలర్ అనామిక్ షా తో సహా పలువురు ప్రముఖుడు ఇక్కడే చదువుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చాక గాంధీజీ అప్పుడున్న విద్యావిధానాన్ని తక్షణం మార్చాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీనిద్వారానే ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి సిద్ధం చేయగలమనే అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలకు ప్రతిరూపంగానే ‘రాష్ట్రీయ శాల’ రూపుదిద్దుకుంది. యువతకు మాతృభాషలోనే విద్యాబోధన అందాలని. ఆ విధంగా విద్యను అందించగలిగితే దేశంతో పాటు కష్టాల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన నమ్మారు. ఈ స్కూలును నడుపుతున్న రాష్ట్రీయ శాలట్రస్ట్ నిధుల కోసం బుక్లెట్ల ద్వారా ప్రజలకు విజ్ఞప్తిచేసింది. ఈ చారిత్రక విద్యాసంస్థ పరిరక్షణ కోసం విరాళాలివ్వాల్సిందిగా ప్రజలు, కార్పొరేట్ల సహాయం కూడా కోరింది. అయితే స్కూల్‌ను నడిపేందుకు ఏడాదికి రూ.8.3 లక్షలు కావాలని, ఆ మేర నిధులు లేకపోవడంతో గత్యంతరం లేక దీనిని మూసేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ, పాఠశాల ప్రధాన కార్యదర్శి జీతూ భట్ తెలిపారు. టాల్‌స్టాయ్ మెచ్చిన గాంధీ రష్యా ప్రఖ్యాత నవలాకారుడు లియో టాల్‌స్టాయ్ తన జీవిత చరమాంకంలో ఆఖరి ఉత్తరాన్ని ఎవరికి రాశారో తెలుసా? మన గాంధీజీయే. తనకంటే వయసులో 40 ఏళ్లు చిన్న అయినప్పటికీ తమ్ముడూ, మిత్రమా అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ తన ఆలోచనల్ని పంచుకున్నారు. 1910లో తన 82 ఏళ్ల వయసులో మరణించడానికి సరిగ్గా రెండు నెలల ముందు టాల్‌స్టాయ్ గాంధీజీకి రాసిన లేఖ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలోనూ, భారత్‌లోనూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. ‘నేను సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. మరణం నా వెనుకే పొంచి ఉందని నాకు తెలుస్తోంది. అందుకే నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెబుతున్నాను. దుర్మార్గుల్ని నిరోధించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచంలో మిమ్మల్నెవరూ బానిసలుగా మార్చలేరు‘ అంటూ ఆ లేఖలో రాశారు. అహింసా మార్గంలో గాంధీజీ చేస్తున్న పోరాటాన్ని కూడా టాల్‌స్టాయ్ అభినందించారు. మీ మార్గం అనితరసాధ్యం, ప్రపంచానికే అది అనుసరణీయం అంటూ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీజీ కూడా టాల్‌స్టాయ్‌ను అంతకు అంతా అభిమానించారు. మహాత్మా మన్నించు! ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీకి తెలియదు.. తన మాటకు భవిష్యత్తు పాలకులు తిలోదకాలిస్తారని..! నేనున్నానంటూ ఇచ్చిన భరోసా వట్టిమాట అవుతుందని..! గాంధీజీ పేరుతో రాజకీయాలు చేసే ప్రభుత్వాలు ఆయన ఆశయాలకు తిలోదకాలిస్తున్నాయని చెప్పే వాస్తవగాథ ఇది. గాంధీజీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పేందుకు నిదర్శనం ‘ఘసెరా’ గ్రామం! దేశ రాజధాని ఢిల్లీకి కేవలం దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘసెరాలో మియో ముస్లింలు అధికంగా నివసిస్తున్నారు. దేశ స్వాతంత్య్రం, విభజన తర్వాత నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో మహాత్మా గాంధీజీ ఘసెరాను సందర్శించి గ్రామ ప్రజలు పాకిస్థాన్‌కు వెళ్లొద్దని, భారతదేశంలోనే ఉండాలని కోరారు. గ్రామ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన ఎంతో చొరవచూపిన కారణంగా గ్రామానికి ‘గాంధీ గ్రామ్ ఘసెరా’ అని పేరొచ్చింది. అయితే గాంధీజీ మాటపై గౌరవంతో ఘసెరాలో స్థిరపడిపోయిన స్థానిక ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక అవసరాలైన గృహ, తాగునీరు, రోడ్లు, విద్య, పారిశుధ్యం వంటి కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకు మాత్రం మారట్లేదు. భూత్ బంగ్లా కాదు..గరీబోడి ఇల్లు.. నాటి మహాత్ముడి ప్రసంగ వేదిక ఇదే... -
గాంధీతత్వమే భవితవ్యం
గాంధీ పుట్టిన భారతంలో గాంధీతత్వం మనుగడ ఇప్పుడొక ప్రశ్నార్ధకం. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అన్నీ తానై పోరు సాగించాడు మహాత్ముడు. అహింసా పోరాటంతో స్వతంత్రం సాధించాడు. అందుకే ‘జాతిపిత’ అయ్యాడు. మరి గాంధీయిజం ఇప్పటి కాలంలో ఎంతవరకు మనగలుగుతోంది? భారత సమాజంలో గాంధీతత్వం ఏ మేరకు ఆచరణలో వుంది? గాంధీ చెప్పిన అహింస, స్వావలంబన, సర్వోదయ సూత్రాలను ఎంతవరకు పాటిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన వివిధ దేశాల నేతలు గాంధీయిజం గురించి ఏం చెబుతున్నారు? పరిశీలిద్దాం. గాంధీ అంటే ఓవైపు దేశ స్వతంత్ర పోరాటం సాగిస్తూనే, మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయవేత్త. సూక్ష్మబుద్ధి గల నేత. మార్పు కోసం సాగే పోరులో నీతి, అహింస, మైనార్టీల ప్రజాస్వామిక హక్కులు చాలా ముఖ్యమనేది గాంధీ ఉద్దేశం. ఈ విషయంలో అష్టాంగ మార్గాన్ని అనుసరించిన బుద్ధుడిని ఆయన తలపుకు తెస్తాడు. ఈ విషయాలను మనం గ్రహించగలిగితే, గాంధీతత్వ సారాంశాన్ని గమనంలోకి తీసుకోగలిగితే, గాంధీయిజానికి వర్తమాన ప్రపంచంలో కాలం చెల్లిందనే అభిప్రాయం తప్పని గ్రహించగలుగుతాం. అహింస విషయంలో ప్రపంచానికి ఒక చక్కని అవగాహన కల్పించినవాడు గాంధీజీ. ఆయన పేరు జాతి – మత – దేశాల హద్దుల ఆవలికి చేరింది. 21వ శతాబ్దంలో ఆయన మాట ఒక ప్రవచనమయ్యింది. అహింసాయుత సిద్ధాంతాన్ని ఆచరించి, మహాన్నత మనవతావాదానికి కట్టుబడిన గాంధీని ఇప్పుడు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటోంది. ధనస్వామ్య – వినియోగ సంస్కృతి రాజ్యమేలుతున్న సమాజానికి గాంధీ బోధనల అవసరం ఏముంది? ఈ ఆధునిక ప్రపంచానికి గాంధీ ప్రాముఖ్యత ఏమటి? ఆయన విజయ రహస్యాలేమిటి? వంటి ప్రశ్నలు ఎవరిలోనైనా తలెత్తవచ్చు. ఈ సందర్భంలో గాంధీని ఒక దేదీప్యమానమైన దీపంగా భావించే టిబెటన్ ఆధ్మాత్మిక వేత్త దలైలామా మాటల్ని గుర్తు చేసుకోవచ్చు. అనేకమంది పురాతన కాలపు భారతీయ గురువులు అహింసను ఒక తత్వశాస్త్రంలా బోధించారు. అది కేవలం తాత్విక అవగాహనకే పరిమితైంది కానీ మహాత్ముడు – ఈ 21 వ శతాబ్దంలో – ఒక అధునాతన దృక్పథం ఇచ్చాడు. ఆధునిక రాజకీయాల్లో అహింస అనే ఒక గొప్ప తత్వాన్ని ఆచరించి చూపాడు. అందుకే విజయవంతమైనాడు’ అంటారు దలైలామా. అదే గాంధీ గొప్పతనం. అదే గాంధీ ఆధునిక ప్రపంచానికి ఇస్తున్న సందేశం. గత శతాబ్దంలో – ప్రపంచంలోని కొన్ని దేశాలు దమన నీతితో కూడిన విధానాల్లో మార్పులు చేసుకోవడం వెనుక వున్నది గాంధీతత్వమే. గాంధీజీ విజయ రహస్యాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తే – విశ్వాసం – కార్యాచరణ – ప్రజాకర్షణ అనే మూడింటిని మనం గమనించగలం. ఇవి ఆయన జీవితంలోని మూడు ముఖ్య అంశాలు. సాధారణ ప్రజలతో తన మనోభావాలను అసాధారణ రీతిలో పంచుకోవడం ఆయన విజయ రహస్యాల్లో మరొకటి. ఆయన ప్రజలకు నిజమైన నాయకుడు. వారికి స్నేహితుడు. దలైలామా నుంచి డెస్మండ్ టుటూ వరకూ.. ఆఫ్రికన్ – అమెరికన్ పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ నుంచి దక్షిణాఫ్రికా స్వతంత్ర పోరాటయోధుడు నెల్సన్ మండేలా వరకూ.. గాంధీ నుంచి రకరకాలుగా స్ఫూర్తి పొందిన వారే. దారుణ చట్టాలను ఉల్లంఘించిన మనిషి సంతోషంగా జైలు కెళ్లాలని భావించిన గాంధీ నుంచి ఎంతగానో ఉత్తేజం పొందాడు మార్టిన్ లూథర్ కింగ్. శాంతియుతంగానే బ్రిటీష్ పాలనను ప్రతిఘటించాలని గాంధీ కోరాడు. జనం ఊరేగింపులు తీశారు. వీధుల్లో బైఠాయించారు. సమ్మెలు చేశారు. విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు. కానీ హింసను ఎప్పుడూ ఆశ్రయించలేదు. లూథర్ కింగ్ చెప్పినట్టు – ఆయన జీవించాడు. ఆలోచించాడు. ఆచరించాడు. మానవతా దృక్పథంతో ఉత్తేజపరిచాడు. తన ‘జీవితానికి ఒక స్పూర్తి’ ఇచ్చిన మహానీయుణ్ణి గాంధీలో దర్శించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సాధారణ ప్రజలను అసాధారణ చర్యలకు పురిగొల్పగల ఒక గొప్ప పరివర్తనకారుణ్ణి గాంధీలో చూశారాయన. అనేక ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో వున్న బర్మా నాయకురాలు అంగ్ సాన్ సూకీ ..గాంధీ నుంచి గొప్ప స్ఫూర్తి పొందారు. శాంతి సిద్ధాంతానికి – సయోధ్యకు ఆచరణ రూపం ఎలా ఇవ్వాలో గాంధీ నుంచే ఆమె నేర్చుకున్నారు. దారుణమైన రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో విజయం సాధించిన సూకీ.. మహాత్ముని బోధనలే తనకు విజయాన్ని సమకూర్చాయంటారు. గాంధీయుజం ఆధునిక యుగంలో సజీవంగా, చురుకుగా వుందని వీరిæ మాటలు చెబుతున్నాయి. గాంధీ స్ఫూర్తినిచ్చాడు. ప్రపంచంలోని అనేకమంది రాజకీయ – సామాజిక – మత నాయకులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. అమెరికన్ జానపద గాయకుడు – మానవ హక్కుల కార్యకర్త జోన్ బాజ్ కావచ్చు లేదా అహింసా మార్గంలో నడుస్తున్న పాలస్తీనా నేత ముబారక్ అవద్ లాంటి వారు కావచ్చు.. వీరంతా తమ పోరాటంలో గాంధీ నుంచి ఉత్తేజం పొందుతున్న వారే. మంచితనానికి జ్ఞానాన్నీ, ధైర్యాన్నీ, దృఢ విశ్వాసాన్నీ తప్పక తోడు చేసుకోవాలని చెప్పాడు గాంధీ. సిద్ధాంతాల్లేని రాజకీయం, పని కల్పించలేని సంపద, నీతి లేని వాణిజ్యం, శీలం లేని విద్య, అంతరాత్మ అంటని ఆనందం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగానికి సిద్ధపడని ఆరాధన –వీటన్నింటినీ సామాజిక పాపాలు అన్నాడు గాంధీ. కాబట్టి ఇవాళ గాంధీతత్వం మరింత అవసరం. భారత్ లాంటి దేశాల్లో గాంధీతత్వానికి కఠినమైన పరీక్షలు ఎదురవుతున్నాయంటే అందుకు ఆ సిద్ధాంత బలహీనతలు కారణం కాదు. చెడుతో పోరాడగల ధైర్యమూ, దృఢ విశ్వాసమూ ఉన్న బలమైన నాయకులు లేకపోవడమే అసలు కారణం. బాపూజీ అడుగు జాడలు..! నేటి నుంచి దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంలో ఆయన జీవనయానంలో ముఖ్య ఘట్టాలు... ►1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో (సుధామపురి, కథియావాడ్) జననం ►1883లో పోర్బందర్లో 14 ఏళ్ల వయసులో కస్తూర్భాతో బాల్య వివాహం ►1888 సెప్టెంబర్ 4న లా చదువు కోసం లండన్ పయనం ►1891 జనవరి 12న లాపరీక్షలో ఉత్తీర్ణత ►1891 జూన్ 6న భారత్‌కు తిరుగుప్రయాణం ►1892 మే 24న హైకోర్టు బారిస్టర్‌గా బొంబాయిలో ప్రాక్టీస్ ప్రారంభం ► 1893 ఏప్రిల్‌లో పోర్బందర్ సంస్థ తరఫున వాదించేందుకు దక్షిణాఫ్రికాకు పయనం ►1893 జూన్‌లో ఫస్ట్‌క్లాస్ టికెట్ ఉన్నా కూడా పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్లో మరో కంపార్ట్మెంట్లోకి వెళ్లాల్సిందిగా గాంధీజీని అధికారులు ఆదేశించారు. అందుకు ఆయన నిరాకరించడంతో పోలీస్ కానిస్టేబుల్‌ను పిలిచి బలవంతంగా ప్లాట్‌ఫామ్‌పైకి నెట్టివేస్తారు. ఆ రోజు రాత్రంతా కూడా చలిలో వణుకుతూ వెయిటింగ్‌రూంలోనే ఆయన గడపాల్సి వచ్చింది. ►1894 ఆగస్టు 22న వర్ణవివక్షతపై పోరాడేందుకు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ఏర్పాటు ►1899 అక్టోబర్ 18న తన సేవలు అవసరమైతే మళ్లీ దక్షిణాఫ్రికాకు వస్తానంటూ భారత్‌కు తిరుగుపయనం ►1902 నవంబర్ 20న భారతీయుల నుంచి వత్తిడి పెరగడంతో మళ్లీ దక్షిణాప్రికాకు పయనం ►1906 సెప్టెంబర్‌లో సత్యగ్రహ (పాసివ్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) ఉద్యమం ప్రారంభం ►1902 నవంబర్ 13–22 మధ్యలో దక్షిణాఫ్రికా నుంచి లండన్‌కు వెళ్లే దారిలో గుజరాతీలో ‘హింద్ స్వరాజ్’ లిఖించారు ►1915 జనవరి 9న భారత్‌కు తిరిగి రాక ►1915 మే 25న అహ్మదాబాద్‌లోని కొచ్రెబ్‌లో సత్యగ్రాహ ఆశ్రమం స్థాపస ►1917 ఏప్రిల్‌లో చంపారన్ సత్యాగ్రాహం ►1918లో అహ్మదాబాద్ మిల్లు వర్కర్లు, ఖేడా రైతుల సత్యాగ్రాహం ►1919 ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలాబాగ్ బహిరంగసభలో నరమేథం చోటుచేసుకోవడంతో ప్రజలంతా శాంతితో మెలగాలని విజ్ఞప్తి ►1919 అక్టోబర్ 8న గాంధీజీ సంపాదకత్వంలో యంగ్‌ఇండియా మొదటిసంచిక విడుదల ►1920–21 ఖిలాఫత్, సహాయనిరాకరణ ఉద్యమం మొదలు ►1922 ఫిబ్రవరి 5న యూపీ గోరఖ్‌పూర్‌లోని చౌరీ చౌరాలో చోటుచేసుకున్న హింసాత్మకఘటనలతో ఈ ఉద్యమం ఉపసంహరణ ►1924 సెప్టెంబర్ 17న హిందు–ముస్లింల ఐక్యత కోసం 21 రోజుల నిరాహారదీక్ష ప్రారంభం ►1928 డిసెంబర్లో కలకత్తా కాంగ్రెస్‌కు హాజరు. 31న ముసాయిదా భారత రాజ్యాంగానికి ఆమోదం ►1929 డిసెంబర్లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్రంపై గాంధీజీ తీర్మానం ఆమోదం. వెంటనే చట్టసభలు బహిష్కరించాలని నిర్ణయం ►1930 జనవరి 26న భారత్ వ్యాప్తంగా స్వాతంత్య్రదినం వాగ్దానం చేసిన ప్రజలు ►1930 ఫిబ్రవరి 19న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ద్వారా ‘పౌర ఉల్లంఘన కార్యక్రమం–శాసనోల్లంఘన’ తీర్మానం ఆమోదం ►1930 మార్చి 12న 78 మంది ఆశ్రమవాసులతో కలిసి ఉప్పు తయారీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చరిత్రాత్మక దండియాత్ర ప్రారంభం ►1931 మార్చి 5న గాంధీ–ఇర్విన్ ఒప్పంద ప్రకటన ►1931 మార్చి 29న నిర్ణయాత్మక రౌండ్ బేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ పయనం ►1931 డిసెంబర్ 5న మళ్లీ సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం ►1932 జనవరి 4న హరిజనుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నిరాహారదీక్ష ప్రారంభం ►1933 మే 8న హరిజనుల స్థితిగతులు మెరుగుపరచాలంటూ 21 రోజుల నిరాహారదీక్ష మొదలు ►1933 జులై 31 వ్యక్తిగత శాసనోల్లంఘన మొదలు ►1934 సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయబోతున్నట్ఠు ప్రకటన ►1936లో వార్థాలో సేవాగ్రామ్ ఆశ్రమం స్థాపన ►1939 మార్చి 3న రాజ్‌కోఠ్‌లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం. 7న విరమణ ►1940 అక్టోబర్ 15న ఆచార్య వినోభా భావేతో కలిసి యుద్ధవ్యతిరేక వ్యక్తిగత సత్యాగ్రాహం ప్రారంభం ►1942 జనవరి 15న తన రాజకీయవారసుడిగా పండిట్ జవహర్లాల్ నెహ్రు పేరు ప్రకటన ►1942 మార్చి 30న తొలిసారి ‘క్విట్ ఇండియా’ అలోచన, ఆ తర్వాత కొన్నిరోజులకు బొంబాయిలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో క్విట్ఇండియా తీర్మానం ఆమోదం ►1944 ఫిబ్రవరి 22న కస్తూర్భా మరణం, ►1945 జనవరి–జులై మధ్యలో సిమ్లా కాన్ఫరెన్స్ ►1946 అక్టోబర్ 10న తూర్పు బెంగాల్‌లోని నోవాఖాలి, ఇతర జిల్లాల్లో పెద్దెత్తున హింసాత్మక ఘటనలు ►1946 నవంబర్ 6న నోవాఖాలికి పయనం ►1947 జనవరి–డిసెంబర్ల మధ్యలో బెంగాల్, బిహార్, ఢిల్లీలలోని ప్రభావిత ప్రాంతాల పర్యటన ►1947 ఆగస్టు 15న దేశానికి రెండుగా విభజించడంపై కలకత్తాలో నిరాహారదీక్ష ►1948 జనవరి 13న మతఘర్షణలకు నిరసనగా ఢిల్లీలో నిరాహారదీక్ష ప్రారంభం ►1948 జనవరి 27న ఇకపై రాజకీయసంస్థగా కాంగ్రెస్‌పార్టీ కొనసాగకూడదని రాతపూర్వకంగా వెల్లడి ►1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనల సందర్భంగా నాథూరాం గాడ్సే తుపాకి గుళ్లకు నేలకొరిగిన గాంధీజీ మహాత్మా గాంధీజీ ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో ఒకరు. దక్షిణాఫ్రికా ఈ స్థాయికి రావడానికి గాంధీ ఆలోచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. వర్ణ వివక్ష నిర్మూలనలో గాంధీ బోధనలు దిక్సూచిలా నిలిచాయి. – నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా దివంగత అధ్యక్షుడు. మనకు యేసు క్రీస్తు లక్ష్యాన్ని ఇస్తే.. జాతి విముక్తికి మహాత్మా గాంధీ అహింస అనే ఆయుధం ద్వారా మెలకువలు నేర్పించారు. – మార్టిన్ లూథర్‌కింగ్, అమెరికా పౌరహక్కుల నేత. భవిష్యత్తు తరాలకు గాంధీజీ మార్గదర్శకుడు. మా తరంలో గాంధీ అత్యంత గొప్ప ఉన్నత ఆలోచనలు గల రాజకీయ నాయకుడు. – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త. మనిషి స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్న గొప్ప మానవుడు గాంధీజీ. ఆయన జీవితం నాకు ఆదర్శవంతం. – దలైలామా, ప్రముఖ బౌద్ధ గురువు. మహాత్మా గాంధీ నిజమైన హీరో. నాకు స్ఫూర్తి ప్రదాత. – బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు. -
మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. స్థానిక నాయకులు, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ వారికి గాంధీ విగ్రహం తొలగించటంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులదే ప్రధాన పాత్ర అని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతలకు ఈ ప్రభుత్వం పట్టించిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముణ్ని అర్ధరాత్రి హత్యచేసి మురికినీటిలో పడేయటం దారుణమన్నారు. మూడురోజుల్లో విగ్రహాన్ని నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పటతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.