demolition
-
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేత ప్రారంభం
-
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: మణికొండలో హైడ్రా(hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
200 ఎకరాలను పరిరక్షించాం!
‘ఈ ఏడాది జూలై 19న హైడ్రా ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలను పరిరక్షించాం. వీటిలో 12 చెరువులు, ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుద్ధభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్లమని, హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాల పైనే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 2025 సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది. సంజాయిషీ నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని, కూల్చేస్తామని సైతం నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన 5 నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2025కు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్ఆర్కు ఆనుకుంటూ అవతలి వైపునకూ విస్తరించి ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పునరు ద్ధరించిన 12 చెరువులకు 2025లో పునరుజ్జీవం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్టీఎల్... ప్రస్తుతం నగరం పరిధిలో ఉన్న 1095 చెరువుల్ని హైడ్రా గుర్తించింది. వీటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నిర్ధారణ, పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డులు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డేటా, శాటిలైట్ ఇమేజ్‌తో పాటు అత్యంత రెజల్యూషన్ ఉన్న గూగుల్ డేటా తీసుకుంటున్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్, డ్రోన్స్ ఫొటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా ఆయా చెరువుల ఎఫ్టీఎల్ మారడానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోనున్నారు. పెద్ద నాలాల ఆక్రమణలపైనా నజర్... చెరువులతో పాటు నాలాల పైనా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికోసం కిర్లోస్కర్ కమిటీ, ఓమెంట్స్ నివేదికలను పరిశీలిస్తోంది. చిన్న చిన్న నాలాలు కాకుండా మూడు, నాలుగు ఆర్డర్స్‌లో ఉండే పెద్ద వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నాలాలపై ఆక్రమణలను గుర్తిస్తున్నారు. చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో వీటి డంపింగ్ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జలవనరులకు జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ప్రజలు, కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాప్, వెబ్సైట్ ద్వారా సమాచారం ⇒ హైడ్రా 2025లో తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారం జీపీఎల్ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు. ⇒ ఓ వ్యక్తి ఎక్కడైనా నిల్చుని హైడ్రా యాప్ ఓపెన్ చేస్తే..అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగిన ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ⇒ త్వరలో ఏర్పాటుకానున్న హైడ్రా పోలీసుస్టేషన్ ప్రభుత్వ, చెరువుల భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు, అధికారులను గుర్తిస్తుంది. ⇒ హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ డీ–మార్కేషన్ను 2025లో హైడ్రా పూర్తి చేయనుంది. మూసీలో ఉన్న ఆక్రమణల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీరు పరిరక్షణ పైనా హైడ్రా అధ్యయనం చేయనుంది. -
నోటీసులు ఇవ్వం.. కూల్చివేతలు ఆపం.. హైడ్రా రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్ చెప్పారు.‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్టిఎల్ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్ స్పష్టం చేశారు.‘‘హైడ్రా అనగానే కూల్చడం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. త్వరలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్ఎం ఛానెల్ రాబోతుంది. కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. హైడ్రా ఆధ్వర్యంలో ఎఫ్టిఎల్ లిస్ట్ త్వరలో వెబ్సైట్లో పెడతాం. చెరువుల వద్ద ఉన్న షెడ్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి...హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా?. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్టీఎల్ గుర్తించిన తరువాత అనధికారిక నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 550 చెరువుల ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తోంది. పేదలను ముందు చూపి వెనకాల మాఫియా వేరే ఉంటుంది. మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు, హైడ్రాకు సంబంధం లేదు. మూసీలో కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కబ్జా నిర్మాణాలను హైడ్రా కచ్చితంగా కూల్చుతుంది. ఇప్పటికే పలువురు బిల్డర్స్‌కి వార్నింగ్ ఇచ్చాము. మూసీ కబ్జాలపై చర్యలు ఉంటాయి కానీ మూసి రివర్ ప్రాజెక్ట్‌కు హైడ్రాకు సంబంధం లేదు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది...హైడ్రా ఛైర్మన్‌గా సీఎం ఉంటారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించాం. హైడ్రాపై సోషల్ మీడియాలో మాత్రమే తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఇళ్లు బఫర్ ఎఫ్టిఎల్లో లేదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే చెరువుపైనే వస్తుంది. నా ఇల్లు చెరువుకి కింద కిలో మీటర్ దూరంలో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు చర్యలు ఎదుర్కొంటారు’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు.. -
శ్రీకాళహస్తిలో రిసార్ట్ కూల్చివేతకు కుట్ర
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామునే వచ్చి... మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని.. ఉదయం నుంచి రివర్వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు. -
5 అంతస్థుల భవనం కూల్చేందుకు హైడ్రా రెడీ..
-
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..
-
సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ యాక్టీవ్
-
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
దేవాలయాల జోలికొస్తే ఊరుకోం.. చంద్రబాబుపై మల్లాది ఫైర్
సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మధురా నగర్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు. -
సీఎం యోగి ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డ్‌లు మూసీ సుందరీకరణ,కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలపై చేశారు.30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్ కార్డ్‌లను రూపొందించాం. అన్ని చోట్ల అద్యయనం చేసి డిజిటల్ కార్డ్‌లను తయారు చేశాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డ్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీల్లో కుటుంబాలు పెరిగాయి. కొత్తగా కార్డ్‌లు లేకపోవడంతో పదకాలు అందలేదు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లు అందిస్తాం. ప్రజల సంక్షేమం కోసమే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లు. రేషన్ కార్డ్‌లు ఇవ్వడం లేదనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. రేషన్ కార్డ్‌లు ఇవ్వాలని అన్నీ జిల్లాల నుంచి రిక్వెస్ట్‌లు పంపారు. డిజిటల్ కార్డ్‌లో ఫ్యామిలీ వివరాలు ఉంటాయి. అన్నీ పథకాలు ఒకటే కార్డ్ అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వచ్చిన పేదలు ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ముందుగా నియోజకవర్గానికి రెండు చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. దీనిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుబీజేపీ,బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నాం. తాగునీరు అందించే చెరువుల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఫాంహౌస్ కూలగొట్టా.. వద్దా? ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచావు కదా? మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా? కేటీఆర్,హరీష్ రావు సెక్రటేరియేట్‌కు రావాలి. ప్రధాని మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా. చిన్నపాటి వర్షంతో మునిగిపోతున్న నగరాన్ని సంరక్షించేందుకు నడుం బిగించాం. మూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా ఉన్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధం హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాలు ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుదాం. మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. బావబామర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు.కూల్చి వేతలపై వెనక్కి తగ్గబోమని, ఇలాగే కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గతంలో ఒకాయన చేసింది రెండే పనులు.. అవి అప్పులు, తప్పులుఅధికారం పోయాక విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు.ప్రతిపక్షాలు వాగుడు ఆపడం మంచిదిమూసీలో మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్మును పంచి పెట్టండిమీ ఖాతాలోని రూ.500 కోట్లు పంచి పెట్టండిమూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బతుకుతున్నారుమూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం తప్పామీరు మాత్రం ఫాం హౌజ్‌లో ఉండాలా?మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధంమీ ముగ్గురి ఫాంహౌస్‌లు కూల్చాలా? వద్దా?అధికారం రాక ముందు చెప్పులు లేకుండా తిరిగిన మీరు కోట్లకు ఎలా పడగలెత్తారు.మూసీ పేదలకు ఇళ్లు ఇవ్వాలా? వద్దా?బావబామ్మర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారుబీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందిఒకరోజు కేటీఆర్ మాట్లాడితే.. మరో రోజు అదే అంశాన్ని ఈటెల మాట్లాడుతున్నారుప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దామోదీ దగ్గరు వెళ్దాం రా ఈటలఎవరు ఆక్రమించారో తేలుద్దాంహైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాల ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేలుద్దాంకేటీఆర్,హరీష్‌రావు సచివాలయానికి రండి.. 4రోజులు లేవకుండా చర్చిద్దాం -
సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ
ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? -
KSR Live Show: కూల్చివేతల 'హైడ్రా'మా వెనక్కి తగ్గారా..?
-
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
ద్వారంపూడి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత..
-
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు
-
ప్రభుత్వ స్థలంలో 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
-
కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్