
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్‌ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment