
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్‌మెంట్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
అసెంబ్లీ లాబీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్‌మెంట్ ఇస్తున్నాం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి కూడా క్లారిటీ ఇచ్చాం. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాం. దీనిపై ఫిర్యాదు ఇస్తే.. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం మా దృష్టికి తెచ్చారు. మేము దాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే.. అంత క్లారిటీ రావడం లేదు. సర్వే చేసి.. తేడా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతం అక్కడ మట్టిని డంప్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది.. తీసేయాలని ఆదేశాలు ఇచ్చాం అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు.. హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారు. కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదని తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment