
పాలకుర్తి (రామగుండం)/ బంజారాహిల్స్/ నాగోలు (హైదరాబాద్)/భువనగిరి: ఇంటర్మిడియెట్ పరీక్షలో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు బలవన్మరణాని కి పాల్పడ్డారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్ (జీడీనగర్) గ్రామానికి చెందిన సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కుమార్తె శశిరేఖ (17), బంజారాహిల్స్ రోడ్డునంబర్–2 ఇందిరానగర్‌కు చెందిన నిష్ట (16), తట్టిఅన్నారం, వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన సుక్కా రవికుమార్ కూతురు అరుంధతి (17), భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన రాసాల మల్లేశ్, సునీత దంపతుల చిన్నకుమారుడు అఖిలేష్ యాదవ్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డారు.