inter students suicide
-
నన్ను పెళ్లి చేసుకో.. లేదా పురుగు మందు తాగు..
బోయినపల్లి (చొప్పదండి): నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో.. లేదంటే పురుగు మందు తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో క్రిమిసంహారకమందు తాగిన ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంట తెచ్చిన పురుగు మందు డబ్బా చూపిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించా డు. సతీశ్ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు. -
విషాదం: రెండేళ్ల క్రితం భర్త.. ఇప్పుడు కుమార్తె..
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కాకినాడలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న సంగాడి శాంతి(17) శనివారం అర్థరాత్రి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన శాంతి కాకినాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. లక్ష్మీనారాయణ నగర్ చైతన్య బాలికల క్యాంపస్ హాస్టల్లో ఉంటోంది. చదవండి: కామాంధుడు.. తినుబండారాలు కొనిపెడతానని ఇంటికి తీసుకెళ్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని శనివారం తల్లితో ఫోన్లో చెప్పి బాధపడింది. క్యాంపస్‌కు రావాలని కోరింది. అందుకు తల్లి రేపు వస్తానంటూ చెప్పి కూతుర్ని సముదాయించింది. ఈ క్రమంలో శాంతి శనివారం రాత్రి ముభావంగా ఉంది. స్నేహితులు భోజనానికి పిలిచినా వెళ్లలేదు. దీంతో వారే ఆమెకు మెస్ నుంచి భోజనం తీసుకొచ్చారు. ఆపై వారు చదువుకోవడం కోసం పక్క గదుల్లో ఉన్న స్నేహితుల వద్దకు వెళ్లారు. చదువు ముగించుకొని తిరిగి గదికి వచ్చి చూసే సరికి గదిలో ఫ్యానుకు శాంతి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయపడ్డ రూంమేట్లు వార్డెన్‌కు విషయం చెప్పారు. సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెను దించాడు. కళాశాల యాజమాన్యం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు నిర్ధారించారు. చదువులో మేటి... శాంతి చదువులో ఉన్నతంగా రాణిస్తోంది. రిలయన్స్ సంస్థ అందిస్తున్న ప్రతిభావంతుల స్కాలర్‌షిప్‌తో కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోంది. తను చదవడంతో పాటు తోటి స్నేహితులకు సబ్జెక్టుకు సంబంధించిన సమస్యలను సునాయాసంగా అర్థమయ్యేరీతిలో వివరించి చెప్పేదని స్నేహితులు వాపోయారు. కూతురే ప్రపంచం అంటూ బతుకుతున్న శాంతి తల్లి ధనబుజ్జి పరిస్థితి దయనీయంగా ఉంది. కాకినాడ జీజీహెచ్‌లో కుమార్తె మృతదేహాన్ని చూసి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. చేపల వేటతో ఇంటిని పోషిస్తున్న భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో ధనబుజ్జి రోడ్డున పడింది. మనో ధైర్యంతో ముందడుగు వేసి జీవనోపాధి కోసం నాలుగిళ్లల్లో ప నులు చేసుకుంటూ కష్టపడి కుమార్తెను చదివించింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూసిన శాంతి అందుకు తగ్గ రీతిలో చదువులో రాణిస్తూ రిలయన్స్ స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. తానే ఇంటి పెద్దననీ, పరిస్థితులకి భయపడొద్దని తన తమ్ముడికి ధైర్యం చెప్పి తాను ఉసురు తీసుకుందంటూ ధనబుజ్జి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరుల కళ్లు చమర్చేలా చేశాయి. అనుమానాస్పద మృతిగా కేసు తన కుమార్తె కొన్నాళ్లుగా సాధారణ ఆస్తమాతో బాధపడుతోందని తల్లి ధనబుజ్జి పోలీసులకు తెలిపింది. తనను ఆదివారం రమ్మని చెప్పి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదని అంది. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కాకినాడ టూ టౌన్ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జీజీహెచ్‌లో శాంతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందన్నారు. -
చూస్తుండగానే భవనంపై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థి.. కారణం అదేనా?
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకతీయ విద్యాసంస్థల భవనంపై 3వ అంతస్తు నుంచి దూకి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాయి కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని పరిశీలించగా అప్పటికే సాయి కిరణ్ మరణించాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్! అయితే ఆత్మహత్యకు ముందు బైక్‌పై వస్తూ సాయి కిరణ్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసినట్లు.. ఆ భయంతోనే భవనంపై నుంచి దూకినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా సాయి కిరణ్ భవనం మీదకెక్కి ఆత్మహత్యకు పాల్పడే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చూస్తుండగానే సాయి కిరణ్ భవనంపై నుంచి దూకి ప్రాణాలు విడవడంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం
పెద్దకొత్తపల్లి/గూడూరు/కుల్కచర్ల/గజ్వేల్‌రూరల్: తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన సుధాకర్, రాజేశ్వరి కుమార్తె సోని (16) వనపర్తిలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరం 314 మార్కులు వచ్చాయి. దీంతో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. (ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్) అలాగే.. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం జంపయ్య, నాగమణి దంపతుల దత్తత కూతురు సోలం సరయు (16) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన గురుకుల ఆశ్రమ కళాశాలలో చదువుతోంది. ఈమె మూడు సబ్జెక్టుల్లో తప్పినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన సరయు.. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్ తండాకు చెందిన విస్లావత్ హన్మంతు, సక్రిబాయిల కూతురు నిఖిత (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయింది. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన అగుళ్ల సాయిలు, మంగ దంపతుల కూతురు శ్రావణి (17) ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే. గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ అలియాస్ అభి (17) ఇంటర్లో ఫెయిలయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రిని పోలీసు కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలుతో తన్నిన విషయం తెలిసిందే. అయితే సంధ్యారాణి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలని కేటీఆర్ తెలిపారు. చదవండి: నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం -
పరీక్షల్లో పాస్ కాలేనేమోనని..
సాక్షి, ఎమ్మిగనూరు: పట్టణంలోని బీసీ హాస్టల్లో శనివారం తెల్లవారు జామున ఇంటర్ విద్యార్థి హరిజన మహేంద్ర(19) ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు.. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామానికి చెందిన ఈరన్న, యశోదమ్మలకు మహేంద్ర, వీరేంద్ర సంతానం. పెద్ద కుమారుడు హరిజన మహేంద్ర పట్టణంలోని రాఘవేంద్ర జూనియర్ కాలేజీలో హెచ్ఈసీ ఇంటర్ ద్వితీయం సంవత్సరం చదువుతున్నాడు. వీరేంద్ర బురాన్‌దొడ్డిలో పదో తరగతి చదువుతున్నాడు. హరిజన మహేంద్ర కాలేజీలో చదువుతూ గుడేకల్ రోడ్డు శివ సర్కిల్లోని బీసీ వసతి గృహంలో ఉంటున్నాడు. ఫస్ట్ ఇయర్లో మూడు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున స్టడీహాల్‌లో ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్నేహితులు గమనించి వార్డెన్ అబ్దుల్ అజీమ్‌కు సమాచారం అందించగా అతడు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చేరవేశాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజీలో నమోదు.. విద్యార్థి మహేష్ ఆత్మహత్య ఘటన హాస్టల్‌ని సీసీ ఫుటేజీలో నమోదై ఉంది. శుక్రవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి ఉరి వేసుకునేందుకు శనివారం తెల్లవారుజాము 1.55 గంటల వరకు వేచి చూశాడు. వార్డెన్ అబ్దుల్ అజీమ్ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రాలయం హాస్టల్ నుంచి రాత్రి 11గంటలకు వచ్చారు. ఆ సమయంలో బయటే ఉన్న విద్యార్థి మహేష్‌ను వార్డెన్ పలకరించారు. తోటి విద్యార్థి ఒకరు 1.30 గంటల వరకు చదువుకుంటుండటంతో అంతవరకు వేచి చూశాడు. ఆ విద్యార్థి నిద్రకు ఉపక్రమించగానే తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిరువూరు(కృష్ణా) : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భూక్యా స్వప్న (17) బుధవారం ఉదయం కళాశాల హాస్టలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంపలగూడెం మండలం వినగడపకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా వాల్యా కుమార్తె స్వప్న ఉదయం తోటి విద్యార్థినులు స్టడీ అవర్‌కు వెళ్తుండగా తనకు అనారోగ్యంగా ఉందని హాస్టల్లోనే ఉంది. అయితే, స్వప్న గది తలుపులు తీయకపోవడంతో హాస్టలు వార్డెను, వాచ్మెన్ కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కొందరు యువకుల సహకారంతో స్వప్న మృతదేహాన్ని కిందకు దింపిన వార్డెన్ కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. తమ కుమార్తె మరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హాస్టలుపై దాడి చేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. విద్యార్థిని స్వప్న మృతదేహం విద్యార్థి సంఘాలు సైతం స్వప్న మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హాస్టలు ఎదుట ధర్నా చేశారు. మైలవరం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి కళాశాల యాజమాన్యంతో, విద్యార్థి సంఘాలతో, మృతురాలి తల్లిదండ్రులతో చర్చించారు. స్వప్నను ఓ అధ్యాపకుడు కళాశాల తరగతి గదిలో మందలించిన కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల ఎదుట ఆరోపించారు. అయితే, పోలీసు స్టేషన్లో కళాశాల యాజమాన్యానికి, విద్యార్థిని తల్లిదండ్రులకు రాజీ కుదిర్చిన పోలీసులు.. స్వప్న కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్–1 ఎస్ఐ సుబ్రహ్మణ్యం, గంపలగూడెం ఎస్ఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లు భరించలేక ఓ ఇంటర్ విద్యార్థిని నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. నవలూరు స్వప్న అనే విద్యార్థిని గంగూరు మైత్రి క్యాంపస్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన స్వప్నను తక్షణమే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చామని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పట్ల కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. తనకు న్యాయం చేయాలని స్వప్న తండ్రి వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కేసీఆర్, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తమ ప్రభుత్వ తప్పిదం ఏమాత్రం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిందని, కానీ ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివరణ కోరడంతో రక్షణలో పడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ మీడియా నోరు నొక్కి గ్లోబరీనా వ్యవహారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా , ఇప్పుడు రాష్ట్రపతి వివరణ అడిగేసరికి గుటకలు మింగుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పిదాలు ఇవాళ కాకపోయినా రేపైనా వెలుగులోకి వస్తాయన్న విషయాన్ని తండ్రీకొడుకులు గుర్తుంచుకోవాలని విజయశాంతి హితవు పలికారు. తాను ఆణిముత్యం, తన కుమారుడు స్వాతిముత్యం అనుకుని మురిసిపోతే కుదరదని, కాలం మారడం ఖాయమని, జనం ఆలోచన, అభిమానం మారడం అంతకన్నా ఖాయమని ఆమె హెచ్చరించారు. -
వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్..!
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడంతో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మధుశ్రీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకె లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అతని భార్య స్వగ్రామంలోనే ఉంటూ కూతురు మధుశ్రీని చదివిస్తోంది. ఈక్రమంలో అఖిల్ రాజేష్ జులాయిగా తిరుగుతూ ప్రేమపేరుతో మధుశ్రీ వెంటపడ్డాడు. పదోతరగతి నుంచే అతని వేధింపులు మొదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇద్దరూ మైనర్లు కావడంతో వారి భవిష్యత్ నాశనం అవుతుందనే కారణంగా హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత బాలికను వేరే గ్రామంలోని పాఠశాలలో చేర్పించారు. పదోతరగతి పూర్తిచేసిన మధుశ్రీ రాజోలు శ్రీచైతన్య కాలేజీలో చేరింది. తాజాగా రాజేష్ మళ్లీ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. బస్సు ఎక్కేడప్పుడు దిగేటప్పుడు నిత్యం వేధిస్తున్నాడు. అతని కారణంగా తల్లిదండ్రుల పరువు పోతోందని భావించిన మధుశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణవార్త విన్న లక్ష్మీనారాయణ గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వదేశానికి తిరిగొచ్చాడు. కూతురు మరణం వెనకున్న అసలు విషయాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక సూసైడ్ అనంతరం ‘నన్ను వదిలి వెళ్లిపోయావా’ అంటూ రాజేష్ టిక్‌టాక్ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. -
ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాలకు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమేనని, అయితే ఇంటర్ ఫలితాలకు వారి ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 3.82 లక్షల మంది ఇంటర్ పరీక్షల్లో తప్పితే వారందరి జవాబు పత్రాలను ఎలాంటి రుసుము వసూలు చేయకుండా రీవెరిఫికేషన్ చేస్తే 1,183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఇది 0.16 శాతమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రీవెరిఫికేషన్ తర్వాత 460 మంది మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థుల పత్రాల్ని రీవెరిఫికేషన్లో వెలువడిన ఫలితాల శాతాన్ని బేరీజు వేసి చూస్తే తప్పు జరిగినట్లు పరిగణించాల్సిన స్థాయిలో లేదని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా జరగడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తప్పులు చేసిన ఇంటర్ బోర్డు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు, న్యాయవాది రాపోలు భాస్కర్ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, అయితే వారి ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలకు సంబంధం లేదని, పిటిషనర్ కోరినట్లుగా వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించే ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఇంటర్ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు రెండు పిల్స్‌ను తోసిపుచ్చింది. -
వారి జవాబు పత్రాలు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాలు తమకు ఇవ్వాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, పిల్లల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అఫిడవిట్ ద్వారా వివరాలను హైకోర్టుకు నివేదించామని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల జవాబు పత్రాల నకళ్లను కూడా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ చెప్పారు. 1.8 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంటర్ బోర్డు కారణంగానే 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి మార్కుల మెమోలు, రీవెరిఫికేషన్ తర్వాత వారి జవాబు పత్రాలను ప్రభుత్వం కోర్టుకు నివేదించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదించారు. వెబ్సైట్ నుంచి అభ్యర్థుల జవాబుపత్రాలు, మార్కుల జాబితాలు డౌన్లోడ్ కాలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వివరాలన్నింటినీ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదించాలని బోర్డును ఆదేశించింది. దీనిపై సంజీవ్ కుమార్ అభ్యంతరం చెబుతూ.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసి గత నెల 27న వాటి నకళ్లను వెబ్సైట్లో పెట్టామని చెప్పారు. మొత్తం 9,24,290 జవాబు పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే 1.8 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన 23 మంది ఫలితాలు.. రీవెరిఫికేషన్లో 1,183 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని, అందులో 582 మంది ఇంటర్ ద్వితీయ పరీక్షల్లోనూ, మిగిలిన 601 మంది ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణులయ్యారని సంజీవ్ కుమార్ చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన 23 మంది విద్యార్థుల్లో ఇద్దరు అప్పటికే ఉత్తీర్ణులయ్యారని, ఒక విద్యార్థి మాత్రం మూడు సబ్జెక్టులకు పరీక్షలు రాసి మిగిలిన మూడు సబ్జెక్టులు రాయలేదని తెలిపారు. కాగా, ఇంటర్ తొలి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు శుక్రవారం (జూన్ 7) నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పరీక్షల కోసం 4,63,236 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విచారణకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు. -
అశోకా.. ఏంటీ లీల!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనట్లు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణురాలైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే జవాబు పత్రాల ఫొటో స్టాట్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో అనామిక పాసైనట్లా.. ఫెయిలైనట్లా..? అన్నది సందిగ్ధంగా మారింది. రీవెరిఫికేషన్ చేసిన తరువాత కూడా ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మెమోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమెకు ఏకంగా 28 మార్కులు పెరిగినట్లు చూపించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కి చెందిన గణేష్‌కుమార్, హారిక దంపతులకు అనామికతో పాటు ఉదయ, సీతల్, భావేష్ అనే పిల్లలున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వీరికి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో అనామిక సికింద్రాబాద్ చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఉమా వద్దే ఉంటూ చదువుకుంది. కింగ్‌కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చదువులోనే కాదు.. ఆటలు, ఎన్సీసీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. నాడు 20.. మెమోలో 48... ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో అనామిక (హాల్‌టికెట్ నంబర్ 1961112037)కు ఇంగ్లీష్– 64, ఎకనామిక్స్–55, సివిక్స్ –67, కామర్స్–75, తెలుగు–20 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు తెలుగులో 20 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిలైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఆమె ఒత్తిడికి గురైంది. అదే బాధతో ఏప్రిల్ 18న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్లు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తంగా 48 మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్లో పేర్కొంది. తమ కుమార్తె పాసైనట్లు తేలడంతో అనామిక కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు మూల్యాంకనాన్ని సరిగ్గా చేపట్టి ఉంటే తమ చిన్నారి బతికి ఉండేదని అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే జావాబు పత్రంలో ఫొటో స్టాట్‌లో మాత్రం అనామికకు 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చనిపోయిన తర్వాత ఫలితాలా? అనామిక పాసైందన్న మెమోను చూసిన తరువాత ఆమె అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన అనామిక పాసైనందుకు ఆమె ప్రాణాలను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ అంశంపై న్యాయం కోసం కోర్టుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉదయ బోరున విలపిస్తూ చెప్పింది. ఫలితాలు ముందే సరిగ్గా వచ్చి ఉంటే అనామిక బతికేదని, ఇంటర్ బోర్డు అధికారులు తమ పిల్లను పొట్టనబెట్టుకున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అనామిక పాస్ కాలేదు: ఇంటర్ బోర్డు ఆరుట్ల అనామిక పాస్ కాలేదని ఇంటర్ బోర్డు సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అనామిక సోదరి ఆరుట్ల ఉదయ ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగానే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఖండించారు. ఈ విషయంలో తాము హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించామని, రీ వెరిఫికేషన్‌లో అనామికకు కేవలం 20 నుంచి ఒకే ఒక్క మార్కు పెరిగి 21 వచ్చాయని తెలిపారు. కానీ, క్లరికల్ మిస్టేక్ వల్ల ఫలితాల వెల్లడిలో 48 మార్కులు వచ్చినట్లు చూపించిందని వివరించారు. ఈ మేరకు అశోక్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అనామిక రాసిన 24 పేజీల బుక్‌లెట్‌ను కూడా జత చేశారు. -
బలిదానాల తెలంగాణ మాకొద్దు
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో రాష్ట్రం బలిదానాల తెలంగాణగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గురువారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టారు.దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ కార్యకర్తలు ఎక్కడివారక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లచొక్కాలతో తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ హెచ్చరించారు. పరిస్థితి అదుపుతప్పే క్రమంలో అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మంత్రులంతా కేసీఆర్‌కు బంట్రోతులుగా మారారని మండిపడ్డారు. 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై హైకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యా యం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నరసింహ, రాకేశ్, నళిని, రేణుక, అమీనా, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
వారి ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది..
బన్సీలాల్‌పేట్/మారేడుపల్లి : ప్రభుత్వ నిర్వాకం.. పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్లే రాష్ట్రంలో 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లోని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక కుటుంబాన్ని, మారేడుపల్లిలోని లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇంటర్ విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న అనామిక మరణం హృదయ విదారకరమన్నారు. అనామిక సోదరి ఉదయ డిగ్రీ ఫీజులను భరించడంతో పాటు వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ....ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. వాస్తవాలకు విరుద్ధంగా విద్యా మంత్రి, ఇంటర్ బోర్డు అధికారులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తమ పోరాటం ఆగదని..ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతి దృష్టికి వివరాలు వివరాలు సేకరించి రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ దృష్టికి సుకెళతామని లక్ష్మణ్ పేర్కొన్నారు. మెరిట్ విద్యార్ధులు ఇంటర్లో సింగిల్ డిజిట్ మార్కులు రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క విద్యార్ధి కుటు ంబ సభ్యులను కూడా ఏ ఒక్క మంత్రి పరామర్శించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి ఎస్. కుమార్, మాధవీ, టి. రాజశేఖరరెడ్డి, వై. సురేష్‌కుమార్, ఎ. ఆనంద్ యాదవ్, రామ్ రమేష్, అధికార ప్రతినిధి మాధవి, జనరల్ సెక్రటరీ ప్రేమిందర్, కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ వివాదం నుంచి దృష్టి మళ్లించే కుట్ర: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న 26 మంది విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఆ కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపి, ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చేలా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఈ నెల 7, 8 తేదీల్లో పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు బృందాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని ఆయా కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తామని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతామని చెప్పారు. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇందుకోసం ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. అక్కడ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి విజ్ఞాపనపత్రం అందజేస్తామన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కరోజు నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులతో 15, 16 తేదీల్లో అన్ని జిల్లాకేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ప్రభుత్వం ‘పుండు మీద కారం చల్లినట్లు’గా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా బీజేపీ పోరాటం చేస్తే నిర్భందాలు, నీరుగార్చే కుట్రలు చేశారని ఆరోపించారు. బోర్డు తప్పిదాలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కనీసం స్పందించకపోగా, విపక్షాలపై బురద జల్లుతున్నారన్నారు. అర్హత లేనివారితో బోర్డు జవాబు పత్రాలు దిద్దించిందని ఆరోపించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ తప్పిదాల వల్లే ఇంత గందరగోళం జరిగితే, ఆయనతోనే సమాధానం చెప్పించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకోవడం తగదు అంబర్‌పేటలో దర్గా ఉందనే సాకుతో ప్రజోపయోగ పనులను అడ్డుకోవడం తగదని లక్ష్మణ్ అన్నారు. మూడురోజులు మజ్లిస్ ఎమ్మెల్యే అక్కడ ప్రార్థనలు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అక్కడికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మాత్రం అరెస్టు చేశారన్నారు. పాత జిల్లాలవారీగా పరామర్శించే బృందాలు ఇవే.. హైదరాబాద్, రంగారెడ్డి: లక్ష్మణ్ నేతృత్వంలో డీకే అరుణ, ప్రేమేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, వై.గీత, ఎస్.కుమార్, వేముల అశోక్ మెదక్, నిజామాబాద్: మురళీధర్‌రావు నేతృత్వంలో ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఆనందభాస్కర్, ఎం.ధర్మారావు, యెండల లక్ష్మినారాయణ, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి నల్లగొండ, వరంగల్: బండారు దత్తాత్రేయ నేతృత్వంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, చింతా సాంబమూర్తి, ఎస్.మల్లారెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డి, భరత్‌గౌడ్ మహబూబ్‌నగర్, కరీంనగర్: కిషన్‌రెడ్డి నేతృత్వంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, విజయరామారావు, రామకృష్ణారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పాపారావు, ఆకుల విజయ. ఇంటర్ వివాదం నుంచి దృష్టి మళ్లించే కుట్ర: లక్ష్మణ్ డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న లక్ష్మణ్. చిత్రంలో బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి. చింతల తదితరులు రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఫలితాల్లో జరిగిన అవక తవకలపై ప్రజల దృష్టికి మళ్లించేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డిలతో డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. అంబర్‌పేటలో జరిగిన వివాదంపై లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం లక్ష్మణ్, దత్తాత్రేయ మాట్లాడుతూ అంబర్‌పేటలో ఫ్లైఓవర్ ఘటనలో పరిహారం చెల్లించే విషయంలో చెలరేగిన వివాదాన్ని పథకం ప్రకారం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ బోర్డులో అవకతవకలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎంఐఎం ఈ వివాదానికి ఆజ్యం పోసిందని విమర్శించారు. సోమవారం జరిగిన వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను, ఇతర నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిం చారు. పోలీసుల ఏకపక్ష తీరును డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయకుండా సీఎం కేసీఆర్ కేరళ వెళ్లడాన్ని లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మా విద్య–మా హక్కు పేరుతో పోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శి రుచిగుప్తా వ్యాఖ్యానించారు. విద్యార్థులు చనిపోతున్నా ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. బుధవారం గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులెవ రూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థుల పక్షాన తాము పోరాటం చేస్తామన్నారు. మా విద్య– మా హక్కు పేరుతో విద్యార్థుల పక్షాన పోరాడుతామని, పరీక్షల విధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
విద్యార్ధి ఉసురుతీసిన ఐఐటీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఐఐటీలో ర్యాంకు రాలేదన్న భయంతో నేరేడ్మెట్ బాలాజీనగర్‌లో ఇంటర్ విద్యార్ధి సోహెల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పనిచేశాడు. ఇంటర్లో బ్యాక్‌లాగ్‌లపై తండ్రి మందలించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన సోహెల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో తన బెడ్రూమ్లోనే గన్‌తో కాల్చుకుని సోహెల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఫలితాలపై బెంగతోనే సోహెల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. -
‘ఇంటర్’ వెనుక పెద్దల హస్తం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించని కారణంగానే రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడలేదని, ఇది అసాధార ణ సమస్య అని పేర్కొన్నారు. ఇంత జరిగినా ప్రభు త్వం సరిగా వ్యవహరించకపోవటం దారుణమన్నా రు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల నుంచే తప్పిదాలు చోటు చేసుకున్నట్టు తేలినా బోర్డు సరిగా వ్యవహరించలేదని, దాన్ని పర్యవేక్షించే వారు పరిష్కారానికి చొరవ చూపలేదని, అదే ఇప్పుడు ఇందరు విద్యార్థుల మృతి, లక్షల కుటుంబాల్లో ఆవేదనకు కారణమైందన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశంతో బీజేపీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఇలాంటి పెద్ద పరీక్షలను నిర్వహించిన పరిపాలనపరమైన అనుభవం ఉన్నవారు కమిటీలో లేకపోవడం సరికాదని మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. ఏదో కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ నివేదికపై ప్రభావం చూపిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఆశ్చర్యపరుస్తోందని, ఈ వ్యవహారానికి కారకులెవరో చెప్పకపోవటం విడ్డూరమన్నారు. ఎవరినో రక్షించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో దోషులకు ప్రభుత్వంలో పెద్దస్థాయి వారితో సన్నిహిత సంబంధాలుండటమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, అసమర్ధత వల్లనే 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాత్రధారి అయితే సూత్రధారి ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఒత్తిడికి చిత్తయ్యి..
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మానసిక ఒత్తిడితో పసిమనసులు రాలిపోయాయి. పరీక్షల్లో ఫెయిలైతే జీవితమే లేదన్న క్షణికాలోచనతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడ్డ తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్మీడియెట్ బోర్డు అలసత్వం, మార్కుల వేటలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తెస్తుండటంతో ఫెయిలైతే అంతేనన్న ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధ కలిగిస్తోంది. మార్కుల వెనుక పరుగు.. పోటీ ప్రపంచంలో అధిక మార్కులు రావాలంటూ తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడి ఓ వైపు.. కార్పొరేట్ కాలేజీల్లో ఇరుకు గదుల్లో కుక్కి బయట ప్రపంచమే తెలియకుండా చేస్తున్న చదువు మరోవైపు.. జీవితంపై వారికి విరక్తి కలిగేలా చేస్తోంది. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేని పరిస్థితికి చేరుస్తోంది. ఫలితంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడి కారణంగా ఫెయిలైన విద్యార్థులు ఏం సమాధానం చెప్పాలో, సమాజంలో తమను హేళన చేస్తారేమోనన్న ఆందోళనతో ఆత్యహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఒత్తిడి తగ్గించే చర్యలేవీ? జీవితంలో విజ్ఞానం కోసమే చదువు అన్న ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించడం, మార్కుల కోసం జీవితం కాదన్న సత్యాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ఇటు ఇంటర్మీడియెట్ బోర్డు అటు విద్యార్థుల తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యల వైపు చూస్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేసే కౌన్సిలర్లు కాలేజీల్లో లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. గతంలో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకున్న సమయంలోనూ ఇంటర్ బోర్డు ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ఓ కమిటీ కూడా వేసింది. ఇంటర్లో మార్కుల విధానం తీసేసి గ్రేడింగ్ విధానం అమల్లోకి తేవాలని చెప్పింది. అలాగే ప్రతి కాలేజీలో హాస్టళ్లలో క్వాలిఫైడ్ కౌన్సిలర్లను నియమించాలని, వారి నేతృత్వంలోనే ముభావంగా ఉండే విద్యార్థులను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. దానిపై బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది తప్ప కాలేజీల్లో కౌన్సిలర్ల అమలు విధానంపై ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులకు మార్గదర్శనం చేసే వారు లేకుండా పోవడంతో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 1,560 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా దాదాపు 900కు పైగా హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడా కౌన్సిలర్ల నేతృత్వంలో ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవని ఇంటర్ విద్య అధికారులే పేర్కొంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంప్‌నకు చెందిన తోట వెన్నెల (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక (16) సికింద్రాబాద్ బన్సిలాల్‌పేట్‌లోని ఇంటర్ చదువుతోంది. తెలుగులో ఫెయిల్ కావడం మనస్తాపంతో సమీపంలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గాకు చెందిన మోడెం భానుకిరణ్ (17) ద్వితీయ సంవత్సరం గణితంలో ఫెయిలైనందుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాగేందర్ అనే విద్యార్థి ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన గాయత్రి.. ఫెయిలైనందుకు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన సోలిపురం శివకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఓ సబ్జెక్టులో 2 మార్కులు తక్కువొచ్చాయని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
గుత్తి: త్వరలో పరీక్షలు రాయాల్సిన ఇంటర్ విద్యార్థి తరగతి గదిలోనే అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. యాజమాన్యమే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన చాకలి రామచంద్ర, చాకలి రంగమ్మ దంపతుల చిన్న కుమారుడు పవన్‌కల్యాణ్ (16) గుత్తిలోని శ్రీ మహాత్మా జూనియర్ కాలేజీలోఫస్టియర్ బైపీసీ చదువుతున్నాడు. కాలేజీ అనుబంధ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. శనివారం ఉదయం ఆరు గంటలకు పిల్లలు నిద్ర లేచారా, లేదా అని పరిశీలించేందుకు వెళ్లిన కరస్పాండెంట్ ధనుంజయరెడ్డికి తరగతి గదిలో ఉరికి వేలాడుతున్న పవన్ కల్యాణ్ కనిపించాడు. వెంటనే కిందకు దింపి ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే..అప్పటికే మృతి చెందాడని తెలుసుకుని తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల వాగ్వాదం కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు రంగమ్మ, రామచంద్ర హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల కరస్పాండెంట్ ధనుంజయరెడ్డి, ప్రిన్సిపాల్ లలితాదేవితో వాగ్వాదానికి దిగారు. ‘మీరే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారం’టూ శాపనార్థాలు పెట్టారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తొండపాడు తిరునాలకు వస్తానని చెప్పాడని, అలాంటి వాడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని తల్లిదండ్రులు నిలదీశారు. మీరే ఎవరో చంపి.. ఉరివేసుకున్నాడని కట్టుకథలు చెబుతున్నారంటూ ఆరోపించారు. ఓ దశలో కళాశాల నిర్వాహకులపై దాడికి యత్నించారు. కళాశాల గుర్తింపు రద్దుకు డిమాండ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా కళాశాల యజమానులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా కాలేజీలోనే హాస్టల్ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కట్టాలని, చదువుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే పవన్ కల్యాణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చురీ వద్ద ధర్నా ఇంటర్ విద్యార్థి పవన్ కల్యాణ్ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ మృతుని తల్లిదండ్రులతో కలిసి ఆస్పత్రిలోని మార్చురీ వద్ద ధర్నా చేశారు. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారని, వెంటనే కళాశాలను సీజ్ చేసి కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్ఐ యువరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. -
విషాదం
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: తండ్రి మందలించాడని మనస్థాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. మండలంలోని పట్టెన్నపాలెంకు చెందిన పి.నాగదుర్గాప్రసాద్ స్థానికచైతన్య(వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ) జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే దుర్గాప్రసాద్ సక్రమంగా కళాశాలకు వెళ్లడం లేదు. దసరా సెలవుల అనంతరం కూడా కళాశాలకు డుమ్మాకొట్టాడు. అయితే ఈ నెల 26న కళాశాలకు వెళ్లిన దుర్గాప్రసాద్ మధ్యాహ్నం నుంచి కళాశాల మానివేశాడు. అదే సమయంలో కళాశాల అధ్యాపకుడు ఒకరు స్థానిక కళాశాల రోడ్డులో వెళుతుండగా దుర్గాప్రసాద్ అక్కడ తారసపడ్డాడు. దీంతో ఆ అధ్యాపకుడు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో దుర్గాప్రసాద్ తండ్రి సీతారాముడు వచ్చి కొడుకును మందలించాడు. అయితే శనివారం సాయంత్రం వరకు దుర్గాప్రసాద్ స్నేహితులతో గడిపాడు. సాయంత్రం సమయంలో ఇద్దరు స్నేహితులతో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వెనుక కొద్దిసేపు గడిపిన అనంతరం అకస్మాత్తుగా పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. దీనినిగుర్తించిన ఇద్దరు స్నేహితులు వెంటనే తండ్రి సీతారాముడికి సమాచారం ఇవ్వగా, దుర్గాప్రసాద్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎ.దుర్గారావు చెప్పారు. కళాశాల బస్సుల ధ్వంసం నాగదుర్గాప్రసాద్ మృతిచెందాడని తెలుసుకున్న కొందరు విద్యార్థులు కళాశాల బస్సులు ఐదింటిని ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఇదే కళాశాలలో కొందరు విద్యార్థులు కళాశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, సరిగా చదవకపోవడంతో యాజమాన్యం టీసీలు ఇచ్చి పంపించివేసింది. ఈ విధంగా టీసీలు తీసుకున్న విద్యార్థులు మరికొందరితో కలిసి వచ్చి కళాశాల బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం, చుట్టుపక్కల వారు విద్యార్థులను అదుపు చేయడంతో శాంతించారు. -
మరో ‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: విద్యా వ్యవస్థ రోజురోజుకు విద్యార్థుల పాలిట ఉచ్చులా మారుతోంది. ర్యాంకుల పేరుతో కాలేజీ యాజమాన్యాలు పెంచుతున్న ఒత్తిడికి తాళలేక చాలామంది విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పేరు మోసిన కార్పోరేట్ కాలేజీల్లో ఈ ఉదంతాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తాజాగా వేరవేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన తనీష్ చౌదరి నిడమనురు నారాయణ కాలేజిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం ప్రత్యేక క్లాస్‌లకు హాజరైన అనంతరం అర్దరాత్రి హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిన తోటి విద్యార్ధులు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే తనీష్ విగతజీవుడయ్యాడు. హుటాహుటిన కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న యాజమాన్యం మృతదేహాన్ని గుట్టు చప్పుడుకాకుండా కామినేని ఆస్పత్రికి తరలించారు. తనీష్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు, స్నేహితులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. తెలంగాణలోని వికారాబాద్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం మెమిన్‌పేట్ మండలం ఇర్లపల్లికి చెందిన విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని, కాలేజీ వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.