
సాయి కిరణ్ భవనం మీదకెక్కి ఆత్మహత్యకు పాల్పడే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చూస్తుండగానే సాయి కిరణ్ భవనంపై నుంచి దూకి..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకతీయ విద్యాసంస్థల భవనంపై 3వ అంతస్తు నుంచి దూకి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాయి కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని పరిశీలించగా అప్పటికే సాయి కిరణ్ మరణించాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్!
అయితే ఆత్మహత్యకు ముందు బైక్‌పై వస్తూ సాయి కిరణ్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసినట్లు.. ఆ భయంతోనే భవనంపై నుంచి దూకినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా సాయి కిరణ్ భవనం మీదకెక్కి ఆత్మహత్యకు పాల్పడే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చూస్తుండగానే సాయి కిరణ్ భవనంపై నుంచి దూకి ప్రాణాలు విడవడంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు.