
నిజామాబాద్, సాక్షి: బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.
అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment