land
-
టీడీపీ కార్యాలయానికి రూ.50 కోట్ల భూమి ధారాదత్తం
సాక్షి, అమరావతి: కడపలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ శాఖ భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుంది. ఈ భూమి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద పార్టీ కార్యాలయం కోసం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులిచి్చంది. కడప మండలం అక్కయ్యపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 37/4లోని ఈ భూమిపై టీడీపీ 2014లోనే కన్నేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌కి తెలియకుండా, స్థానికంగా ఉన్న అభ్యంతరాలు ఖాతరు చేయకుండా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజుకి కేటాయించింది. అయితే, పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కొందరు టీడీపీ నాయకులు దాన్ని అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతోనే నిర్మాణాలు చేపట్టలేదనే అనుమానాలున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ భూమిపై స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు తేలడంతో కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కోర్టులో ఉన్న భూమిని మళ్లీ టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే భర్త అయిన శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాల్లో విలువైన భూములను చేజిక్కించుకుని పార్టీ కార్యాలయాలు నిరి్మంచడం టీడీపీకి అలవాటేనని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకుని నిరి్మంచిందే. విశాఖపట్నం కార్యాలయం కూడా అక్రమంగా కేటాయించుకుని కట్టుకున్నదే. ఇప్పుడు ఏకంగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని మంత్రివర్గం ఆమోదంతో పార్టీ కార్యాలయం కోసం రెండోసారి కేటాయించుకోవడం వివాదాస్పదంగా మారింది. -
నిరుపయోగ భూములపై నజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతున్న నేపథ్యంలో.. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్దేశించిన అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిరుపయోగంగా ఉన్న ప్లాట్ల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. నిరుపయోగంగా ఉన్న భూములను అవసరమైతే స్వా«దీనం చేసుకుని.. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు కేటాయించాలని భావిస్తోంది.ఇందుకోసం పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ మల్సూర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి చెందిన ఇద్దరు అధికారులను ఇందులో సభ్యులుగా నియమించింది. టీజీఐఐసీ ద్వారా పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఆ నివేదిక అధారంగా నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఉచితంగా భూమి కేటాయించినా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని 225 సంస్థల నుంచి 1,964 ఎకరాల భూమిని టీజీఐఐసీ గతంలో వెనక్కి తీసుకుంది. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కమిటీ పరిశీలించే అంశాలివే ⇒ గతంలో జరిపిన భూ కేటాయింపులపై పూర్తిస్థాయిలో ‘భూ తనిఖీ’(ల్యాండ్ ఆడిట్) చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ⇒ టీజీఐఐసీ భూ కేటాయింపులను రద్దు చేసినా, కొన్నిచోట్ల సదరు భూములు పారిశ్రామిక సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఆ భూములను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై జరిమానా కూడా విధించారు. ఇలాంటి అంశాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ⇒ పారిశ్రామిక వాడల్లో విక్రయించగా మిగిలిన ప్లాట్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటి సంఖ్య, విస్తీర్ణం తేల్చే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించారు. ⇒ పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారా లేదా? అనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది.దుర్వినియోగం కాకుండా పర్యవేక్షక వ్యవస్థటీజీఐఐసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 170కి పైగా పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. కొత్తగా మరో 35 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 13,741 ఎకరాల భూమి అవసరమని టీజీఐఐసీ గుర్తించింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ, 7,638 ఎకరాలు అసైన్డ్, 3,765 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన, ప్రస్తుతం సేకరిస్తున్న భూములతో కూడిన ల్యాండ్ బ్యాంక్ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కేటాయింపులను పర్యవేక్షించడంతో పాటు దుర్వినియోగం కాకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
భూమ్మీద అడవుల లెక్క ఇదీ..
⇒ 2022లో ప్రపంచవ్యాప్తంగా నరికివేతకు గురైన అడవులు.. 41 లక్షల హెక్టార్లు (సుమారు కోటి ఎకరాలు). ⇒ అంటే ప్రతి ఒక్క నిమిషానికి నరికివేత జరిగిన విస్తీర్ణం.. 11 ఫుట్‌బాల్ గ్రౌండ్లతో సమానం ⇒ ఏడాదిలో తగ్గిపోయిన అడవుల వల్ల భూమి వాతావరణంలోకి అదనంగా చేరిన కార్బన్ డయాక్సైడ్.. 2.7 గిగాటన్నులు ⇒ఇది భారతదేశం మొత్తంలో ఒక ఏడాది పాటు బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగిస్తే వెలువడే కార్బన్ డయాౖMð్సడ్‌తో సమానం. ⇒ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) –2021 నివేదిక ప్రకారం మన దేశ విస్తీర్ణంలో అడవుల శాతం.. 21.72% ⇒ దేశంలో 2019తో పోలిస్తే 2021 నాటికి అదనంగా పెరిగిన అడవులు.. 1,540 చదరపు కిలోమీటర్లు.. -
రైతు భూమి వేలానికి దండోరా
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్‌కు చెల్లించినా అప్పు తీరలేదు. ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్‌లో చాటింపు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు.. నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం -
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ్య)థ
సంస్థాన్ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్‌రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా బాల్‌రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ అయ్యింది. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయకపోవడంతో బాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నానని తహసీల్దార్ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరంటూ తహసీల్దార్‌తో బాల్‌రెడ్డి వాదించాడు. వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా.. బాల్రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్‌లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చేదిలేదు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములు తీసుకుని కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని వాపోతున్నారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఆదివారం 6 పంచాయతీల ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఎయిర్‌పోర్టును ముక్తకంఠంతో వ్యతిరేకించారు.ఉద్దాన ప్రాంత ప్రజల అవసరాలు, మనోభావాలు తెలుసుకోకుండా, స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని బలవంతంగా కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దాన ప్రాంతానికి ఉద్యమాలు కొత్తకాదన్నారు. జీవనాధారమైన పంట భూముల్ని పరిహారానికి ఆశపడి ఇవ్వబోమని స్పష్టంచేశారు.ఈ సందర్భంగా రాంపురం వేదికగా ఉద్దానం ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా కొమర వాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారం రోజుల్లో పంచాయతీల వారీగా కమిటీలు వేసుకుని అనంతరం పోరాట కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. -
ఆ భూములు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)లకు గతంలో కేటాయించిన భూము ల్లో.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. మొత్తంగా 10 వేల ఎకరాలకుపైగానే నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వ ధర తీసుకుని తమకు అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రెవెన్యూ వర్గాల సమాచారం. మిధాని, డీఆర్డీవో, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్, హెచ్ఏ ఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ వంటి సంస్థల భూములు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్ ఉందని, దీంతో ఈ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశముందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. దశాబ్దాల కింద కేటాయింపు.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోపాటు నిబంధనలకు అనుగుణంగా అప్పగించిన ఈ భూములను ఆయా సంస్థలు తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ సంస్థలు ఏ మేరకు భూములను వినియోగించుకుంటున్నాయన్న దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల వివరాలు సేకరించింది.రాష్ట్రంలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 8,900 ఎకరాలు కేటాయించగా.. అందులో 2,300 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగతా భూములను నిరుపయోగంగా వదిలేశారని తేలింది. వీటితోపాటు ఇప్పటికే మూతపడిన సిమెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటీల పరిధిలో మరో 3,300 ఎకరాల వరకు భూమి ఉందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రూ.45 వేల కోట్ల విలువతో.. హైదరాబాద్ నగరానికి శివార్లలో, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ నిరుపయోగ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఈ భూములను ప్రభుత్వ ధరకు తిరిగి తీసుకోవడం ద్వారా... పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య అవసరాలకు, వేలం వేసి నిధుల సమీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వ ధరతో ఆ భూములను తిరిగి తీసుకోవాలంటే రూ.8 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే కోరినా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిరుపయోగ భూములను ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కారు కూడా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2022లో కేంద్రానికి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర పీఎస్‌యూల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కానీ కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదని తేలాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వ్యవసాయ కుటుంబాల.. భూపరిమాణం తగ్గుతోంది
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణం ఏటా తగ్గిపోతోంది. 2016–17లో ఇది 1.1 హెక్టార్లుండగా 2021–22లో అది 0.7కు పడిపోయింది. ఈ విషయాన్ని నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021–22 వెల్లడించింది. వ్యవసాయ గృహాల సాగు సామర్థ్యం, ఉత్పత్తి భూమి పరిమాణం గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో దేశంలోను వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణాన్ని ఐదు తరగతులుగా వర్గీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక దేశంలో 38 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి ఉంది.33 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్ వరకు ఉంది. 15 శాతం వ్యవసాయ కుటుంబాలకు 1.01 హెక్టార్ల నుంచి 2.0 హెక్టార్ల వరకు భూమి ఉంది. 8 శాతం కుటుంబాలకు 2.1 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంది. ఆరు శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.01 హెక్టార్లలోపే భూమి ఉంది. ఇలా దేశంలోని వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉన్న సగటు భూమి పరిమాణం రాష్ట్రాల మధ్య విస్తృత వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఒక హెక్టారు కన్నా ఎక్కువ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సగటు భూమి ఒక హెక్టార్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఒక హెక్టార్ కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లు పేర్కొంది. మరో పది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలకు సగటు భూమి 0.4 హెక్టార్లలోపే ఉందని నివేదిక తెలిపింది. అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో చిన్న భూ పరిమాణమే ఉందని సర్వే స్పష్టం చేసింది. -
న్యాయపోరాట యోధుడు.. రూ.5,003 కోసం.. 42 ఏళ్లుగా పోరాటం!
సాక్షి, అమరావతి : ప్రభుత్వం నుంచి పరిహారంగా తనకు దక్కాల్సిన రూ.5003 కోసం ఏకంగా 42 ఏళ్ల పాటు ప్రభుత్వంతో పోరాటం చేశాడు. ఈ పోరాటంలో 15 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. చివరకు జీవిత చరమాంకంలో తన పోరాటంలో విజయం సాధించాడు. 81 ఏళ్ల వయస్సులో మంచంపై ఉండి కూడా ఆయన చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సామాన్య రైతుకు చిన్న మొత్తం పరిహారంగా చెల్లించే విషయంలో జరిగిన ఈ అసాధారణ జాప్యాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.పరిహారం కోరడం పౌరుల రాజ్యాంగ హక్కు ‘వెంకటనారాయణేమీ ధనికుడు కాదు. విద్యావంతుడూ కానందున తన హక్కుల కోసం పోరాటం చేసేందుకు సరైన న్యాయ సలహాలు పొందలేకపోయారు. నష్టపోయిన ఆస్తికి పరిహారం పొందకుండా వెంకటనారాయణ వంటి వారిని కోర్టులు అడ్డుకోలేవు. నాలుగు దశాబ్దాలకు పైగా పరిహారం చెల్లించకపోవడాన్ని ఏ రకంగానూ మేం మన్నించజాలం. చట్ట నిబంధనల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వెంకటనారాయణ వయస్సు ఇప్పుడు 81 ఏళ్లు. వయోభారం వల్ల మంచం మీద ఉన్నారు. అతనికి ఎంతో మద్దతు అవసరం. వెంకటనారాయణ హక్కుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ న్యాయస్థానం మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తోంది. తన జీవనాధారాన్ని తీసుకోవడం వల్ల వెంకటనారాయణ వంటి సామాన్య రైతు అనుభవించిన వేదనను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే నష్టాన్ని కేవలం డబ్బుతోనే పూడ్చలేం. అయినప్పటికీ చట్ట ప్రకారం మేం ఆ పని చేయదలుచుకున్నాం. భూమి కోల్పోయిన యజమానికి పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడానికి వీల్లేదు. నష్టపోయిన ఆస్తికి పరిహారం కోరడమన్నది పౌరుల రాజ్యాంగ హక్కు. ప్రస్తుత కేసు వంటి అసాధారణ కేసుల్లో న్యాయస్థానాలు అధికరణ 226 కింద తన అధికార పరిధిని ఉపయోగించడం తప్పనిసరి. వెంకటనారాయణ ఓ చిన్న రైతు. రాష్ట్ర ప్రభుత్వం అతనికున్న చిన్నపాటి భూమిని తీసేసుకోవడమే గాక.. 42 ఏళ్లుగా ఆ భూమికి పైసా కూడా పరిహారం చెల్లించలేదు.’ అంటూ ప్రభుత్వం తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘పాత భూ సేకరణ చట్టంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రం 2013లో కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది. తద్వారా వెంకటనారాయణ వంటి వారికి పునరావాసం కల్పించేందుకు అవకాశం కల్పించడం వీలవుతోంది. ప్రస్తుత కేసులో వెంకటనారాయణ పట్ల అధికారుల వ్యవహరించిన తీరు దురదృష్టకరం. అది విస్మయకర నిర్లక్ష్యం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించి దానిని నాలుగు నెలల్లో ఆయనకు చెల్లించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఈ లోపు 1982 ఫిబ్రవరి 16 నుంచి ఈ రోజు వరకు వెంకట నారాయణకు చెల్లించాల్సిన రూ.5003 పరిహారాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి మూడు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశిస్తున్నాం. ఈ రూ.5003, వడ్డీ మొత్తాన్ని మార్కెట్ ధర ప్రకారం అంతిమంగా చెల్లించే పరిహారంలో సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏం చేసినా కూడా దానిని కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద భావిస్తాం’ అంటూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2009 నుంచి న్యాయ పోరాటంకృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు ఆ గ్రామంలోని సర్వే నంబర్ 694/2ఏ2లో 0.87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరికొందరికి చెందిన మొత్తం 44.43 ఎకరాల భూమిని 1977లో అధికారులు భూ సేకరణ చట్టం 1894 కింద సేకరించారు. 1982లో అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణకు తప్ప మిగిలిన వారందరూ కూడా కోర్టుకెళ్లి ఎకరాకు రూ.5002.50 పరిహారంగా చెల్లించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటనారాయణ మిగిలిన వారికి ఇచ్చినట్టుగా తనకూ పరిహారం ఇవ్వాలంటూ 1997లో అధికారులను కోరారు. ఆ అభ్యర్థనను అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెంకటనారాయణ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. వెంకటనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి 2023లో తీర్పునిస్తూ సేకరించిన భూమికి గాను ఆయనకు ఎకరాకు రూ.5003 చొప్పున 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని చెప్పలేదు. ధర్మాసనం ఎదుట అప్పీల్సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వెంకటనారాయణ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎదుట 2024లో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందర్రావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. వెంకటనారాయణ తరఫు న్యాయవాది ఏవీ శివయ్య వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చట్ట ప్రకారం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మిగిలిన వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి పెంచిన మేర పరిహారం చెల్లించిన అధికారులు.. పిటిషనర్‌కు మాత్రం ఇప్పటి వరకూ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ వాదనలతో ప్రభుత్వం విభేదించింది. వెంకటనారాయణ భూమిని 1982లోనే స్వాధీనం చేసుకున్నామని.. అందువల్ల ఆయనకు కొత్త భూ సేకరణ చట్టం వర్తించదంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు రోజుల కిందట తీర్పునిచ్చింది. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
‘కొణతాల’ వారి కబ్జా కథ..
సాక్షి, అనకాపల్లి: దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల బరితెగింపునకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఎంతో ఉన్నతాశయంతో ఆరేడు దశాబ్దాల క్రితం దేవదాయ శాఖకు రాసిచ్చిన భూములపై కూటమి గద్దలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చీరాగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడీ కబ్జా బాగోతాన్ని నడిపిస్తోంది అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబీకులు. ఈ భూదాహం కథాకమామిషు ఏమిటంటే..అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబరు 66లో 29.71 ఎకరాల భూమి (పూల్‌బాగ్ భూములు)ని చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. తన తదనంతరం దేవదాయ శాఖకు భూమిని అప్పగించాలని.. అప్పటివరకు ట్రస్టీలుగా తన పెద్ద అల్లుడు రాజూభీర్ ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావులను నియమించారు. ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవదాయ శాఖాధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవదాయ శాఖకే అనుకూలంగా కోర్టు తీర్పువచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవదాయ శాఖాధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు.దేవస్థానం బోర్డులు పీకేసి..నిజానికి.. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటినుంచో కన్నేశారు. అందులో భాగంగా.. కోర్టు ఇంటెరిం ఆర్డర్ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్ 27నే పీకేశారు. వాటి స్థానంలో ఆ భూములు తమవేనని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ కొణతాల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు వెలిశాయి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పటి దేవదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన ఆరుగురిపై సీఐ దాడి మోహన్ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం ఏఈవో రాంబాబు, దేవదాయ ఏఈ కె.సూర్యనారాయణమూర్తి, సిబ్బంది, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ కోర్టుకుఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే.. ఆ భూమిలో కొణతాల రామకృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుంచి రూ.10వేల చొప్పున కౌలు వసూలుచేస్తున్నారు. అంతేకాక.. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హఠాత్తుగా శనివారం మరోసారి దేవదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు. నాయుడుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవదాయశాఖ భూములను కాపాడతాంగతంలో కోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇస్తే.. దేవస్థానం బోర్డులు పీకేసీ బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటుచేశారు. అప్పుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై కేసులు నమోదుచేశారు. మళ్లీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాం. దేవదాయశాఖ భూములను కాపాడడమే మా లక్ష్యం. – రాంబాబు, కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ, అనకాపల్లి -
57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు
జోగిపేట(అందోల్): ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అనిల్‌కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన అంజమ్మ, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నారాయణఖేడ్ పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్ తండాకు చెందిన రవీందర్‌లు రియల్టర్లు. వీరు ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వ్యవసాయభూమిని ఎకరాకు రూ.39 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన యాదగిరిరెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలు చొప్పున రూ.22.80 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ కింద మే 3వ తేదీన యాదగిరిరెడ్డి తన స్నేహితుడు వాసుదేవరెడ్డి ఖాతా ద్వారా రూ.11లక్షలు సంజీవరెడ్డికి చెల్లించారు. నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచి్చంది. దీంతో అందోలు గ్రామంలోని ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీయగా.. తాము ఈ భూమిని ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు.తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కాపీలను చూపించగా, అవి నకిలీవని తేలాయి. దీంతో సంగారెడ్డి ఎస్పీ రూపే‹Ùకు ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట సీఐ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేపట్టింది. నిందితులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివ, హోంగార్డు సురేశ్‌లను సీఐ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. -
భూమిని ఆక్రమించారని కలుపు మందు తాగాడు
కారేపల్లి: తన భూమిని అన్యాయంగా ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నుతున్నారంటూ ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన పచ్చిపాల భద్రయ్య, ఆయన సోదరులు సోమయ్య, రామయ్య, మల్లయ్యకు ఆలియాతండాలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో భద్రయ్య మినహా మిగతా వారు ఆర్టీఐ మాజీ కమిషనర్ జి.శంకర్‌నాయక్‌కు భూమి అమ్ముకు న్నట్లు సమాచారం. అయితే, సర్వేనంబర్ 548లోని తన 1.20 ఎకరాల భూమిని శంకర్‌నాయక్ తప్పుడు పత్రాలతో బై నంబర్లు సృష్టించి పట్టా చేసుకున్నారని భద్రయ్య కొన్నే ళ్లుగా ఆరోపిస్తున్నాడు. మరోపక్క శంకర్‌నాయక్ తాను చట్ట ప్రకారమే భూమి కొన్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇరు వర్గాలు తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఫిర్యా దు చేసుకున్నారు. భద్రయ్య కోర్టును సైతం ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం శంకర్‌నాయక్ మను షులు ట్రాక్టర్లతో వివాదాస్పద భూమిని దున్నసాగారు. దీంతో రైతు భద్రయ్య, ఆయన భార్య భాగ్యమ్మ అడ్డుకున్నారు. ట్రాక్టర్ కదలకుండా భద్రయ్య అడ్డుగా పడుకోవడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కలుపు మందు తాగి అస్వస్థత కు గురయ్యాడు. ఆయనను తొలుత ఇల్లెందుకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆలియాతండాకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఇదే జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల భూవివాదంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో రైతు ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది. తాజా ఘటనలో భద్ర య్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై రాజారాం తెలిపారు. భద్రయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. -
ఇంటి స్థలం చదరపు మీటర్‌కు 8 రూపాయలే..
భూములు, స్థలాల విలువలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కనీసం వంద గజాల ఇంటి స్థలం కొనాలన్నా.. లక్షలకు లక్షలు కావాల్సిందే. కానీ ఒక చోట మాత్రం ఇంటి స్థలాన్ని చదరపు మీటర్‌కు ఎనిమిది రూపాయల లోపు ధరకే అమ్ముతున్నారు. అంటే రూ.800 పెడితే చాలు.. ఇంటి స్థలం వచ్చేస్తుందన్న మాట. కాకపోతే అలా కొనుక్కోవడానికి మనం స్వీడన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మరి. స్వీడన్‌లోని గోటెన్ నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌కు 321 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. పాపులేషన్ తగ్గడం, ఆర్థిక సమస్యలతో.. స్వీడన్‌లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ పాపులేషన్ తగ్గడానికి తోడు సిటీకి కాస్త ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీనితో హౌజింగ్ మార్కెట్‌కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలా లను అమ్మకానికి పెట్టినట్టు గోటెన్ సిటీ మేయర్ జోహన్ మాన్సన్ ప్రకటించారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా రేటుతో.. మన కరెన్సీలో రూ.7.86 రేటుతో 29 ప్లాట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్‌లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్‌కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను స్థాపించడానికి హైదరాబాద్‌లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్‌లను కొనుగోలు చేసింది. -
కబ్జాకోరు రామోజీ
రోజూ ఉషోదయం నుంచే గురివింద నీతులు చెప్పే ఓ రామోజీ.. దీనికి మీరేం సమాధానం చెబుతారు? వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ఆ చట్టం గురించి నీకు తెలీదా? లేక ఈ చట్టం చంద్రబాబు చుట్టం అనుకున్నావా? నాకు వర్తించదనే గర్వమా? ఒక మత సంస్థ భూమిని ఇంత దౌర్జన్యంగా, నిస్సిగ్గుగా లాక్కొన్నదే కాకుండా.. దౌర్జన్యం చేయడం, బెదిరించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం..ఇవన్నీ మీ చంద్రబాబును చూసుకునే కదా! ఈనాడును అడ్డుపెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అవునులే.. ఫిల్మ్ సిటీ భూములే కొట్టేశాను.. ఇవెంత అనుకున్నావేమో.. ఇలాంటి బాగోతాలు ప్రతి జిల్లాలోనూ లెక్కలేనన్ని ఉంటే ఇదొక్కటేగా బయటపడింది అనుకోవచ్చు.. తీగ లాగితే డొంక కదులుతుందన్న సామెతను ఓసారి గుర్తు చేసుకోండి.కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు నగర సమీపంలో అత్యంత విలువ చేసే వక్ఫ్ బోర్డు (మసీదుకు చెందిన) భూమిని ఈనాడు రామోజీరావు అక్రమంగా చేజిక్కించుకున్నారు. తనకున్న పలుకుబడి, పత్రికను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వెళ్లి విలువైన భూమిలో పాగా వేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులు, కోర్టులను లెక్క చేయక తను చెప్పిందే వేదమంటూ ఏకంగా ఆ భూమి తనదేనంటూ బోర్డు కూడా పెట్టారు. కర్నూలు–హైదరాబాద్ రహదారిలో సంతోష్ నగర్ దాటిన తర్వాత ఈనాడు జిల్లా ఎడిషన్ (ఎడిటోరియల్ విభాగం + ప్రింటింగ్) ఏర్పాటు చేసిన చోటుకు పక్కనే వక్ఫ్ భూమి ఉంది. రామోజీ తన కుమారుడు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ కిరణ్ ద్వారా పావులు కదిపి.. ఈ కంపెనీ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు మత పెద్ద ఒకరిని లోబరుచుకుని రికార్డులు సృష్టించారు. వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని అందరికీ గురివింద నీతులు చెప్పే రామోజీ రావు ఇలా అక్రమ మార్గంలో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ భూమిని కాపాడుకునే విషయమై వక్ఫ్ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రామోజీ పలుకుబడి ముందు అవి సరిపోలేదు. కన్ను పడింది.. కబ్జా చేశాడు.. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో, 1963 అక్టోబరు 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్‌లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. అంటే మసీదుకు చెందిన ఇనాం భూమి. కాశ్నిర్ – కన్యాకుమారి 44వ నంబర్ జాతీయ రహదారి (గతంలో ఎన్‌హెచ్–7)ని ఆనుకుని ఉంది.ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలను 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్‌ను మభ్యపెట్టి, భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా, వివాదం చెలరేగి, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వక్ఫ్ భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్థలంలో ఈనాడు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్ను పడటంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. ఎండీ కిరణ్ పేరుతో నోటీసులు మసీదులు, దర్గాల నిర్వహణ కోసం గతంలో పూరి్వకులు వక్ఫ్‌కు భూములు, స్థలాలు బోర్డుకు స్వా«దీన పరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ములో కొంత బోర్డుకు కౌలు (గుత్త) రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు.. ఆ భూమిని తమకు స్వా«దీన పరచాలని ఈనాడు సంస్థ, ఉషోదయ పబ్లికేషన్స్ ఎండీ కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటికీ రామోజీ, ఆయన తనయుడు ఇసుమంతైనా స్పందించలేదు. ముతవల్లిని అరెస్టు చేయించిన ఈనాడు జామియా మసీదుకు చెందిన సర్వే నంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఇనాం భూమిలో ఈనాడు – ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.90 ఎకరాల భూమిని సాగు చేసుకొని మసీదు బాగోగులు, నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్టు చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ను వదిలేశారు. వక్ఫ్ చట్టం గురించి తెలీదా రారా.. వక్ఫ్ ఆస్తులు ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకు చెందినవే అని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చంది. అవి మసీదులు, ఆ మత సంస్థలకే చెందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వక్ఫ్ ఆక్ట్ 52ఏ సవరణ (2013 నవంబరు 1వ తేదీ) ప్రకారం వక్ఫ్ బోర్డు భూములు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇంత కఠినంగా చట్టాలున్నా, ఈనాడు రామోజీరావు (రారా) చంద్రబాబు ద్వారా వాటిని తన చుట్టాలుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.కాగా, రాష్ట్రంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,104 సంస్థలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండగా, 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూమి గెజిట్‌లో నమోదైంది. మరో 10 వేల ఎకరాలు గెజిట్‌లో నమోదు కాని భూములున్నాయి. ప్రస్తుతం రామోజీ రావు ఆక్రమించిన భూమి గెజిట్‌లో నమోదైనది కావడం గమనార్హం. చర్యలు తీసుకోకుండా ఒత్తిడి రామోజీరావు చెరలో అక్రమంగా ఉన్న వక్ఫ్ భూములను రక్షించాలని కోరుతూ అప్పట్లో స్థానికులు ఆందోళనలు చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. దీంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమంగా పొందిన వక్ఫ్ భూములను స్వా«దీనం చేసుకునే ముందు వక్ఫ్ యాక్ట్ 51, 52 సెక్షన్ల కింద బోర్డు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌కు 1999 జూన్ 7న నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ నిందితులు అని నిర్ధారించాకే చర్య తీసుకోవడానికి వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఈ తిరకాసు సెక్షన్ కింద నోటిసులిచ్చారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రామోజీరావు వక్ఫ్ బోర్డు నోటీసులను సవాలు చేస్తూ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎనిమిదేళ్ల పాటు విచారణ సాగింది. 2008 ఏప్రిల్ 22న తీర్పు వెల్లడైంది. గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సర్వే కమిషనర్ రిపోర్టు ఆధారంగా సర్వే నంబర్ 80లో ఉన్న భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది. అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి, వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటిసుల సెక్షన్లు సరైనవి కావని తప్పుబట్టింది.పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని తీర్పునిచి్చందని అధికారులు చెప్పారు. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ చేసి, భూమిని స్వా«దీనం చేసుకోడానికి చట్టం ఒప్పుకోదని.. సరైన మార్గంలో చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన మూడేళ్ల తర్వాత 2011 సెపె్టంబరు 20న ట్రిబ్యూనల్ సూచించిన సెక్షన్ 51 కింద బోర్డు సీఈఓ నోటీసులిచ్చారు. తర్వాత జిల్లా వక్ఫ్ అధికారులు కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఈ భూమి రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చారు. రామోజీ తన పలుకుబడితో రిజి్రస్టేషన్ అధికారులను భయపెట్టి నోటీసులు అమలు కాకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆ భూమి ఈనాడు చెరలోనే ఉండిపోయింది. రామోజీరావు ఆక్రమించిన భూమిలో రెండు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ‘‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ డేటెడ్ 22–04–2008 ఆఫ్ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్.. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్’’ అని రాశాడు. దీన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారట! అతిక్రమించింది ఎవరు రామోజీ? నువ్వు, నీ కుమారుడు కాదా? వక్ఫ్ చట్టాన్ని అతిక్రమించి కబ్జా చేసిందే మీరు. ఈ బోర్డు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. మిమ్మల్ని చూసే ఈ నానుడి పుట్టుకొచి్చంది కాబోలు. ఆ జడ్జిమెంట్‌లో ఏముందో మీకు తెలియకపోతే ఇంగ్లిష్ తెలిసిన వాళ్లెవరితో అయినా చదివించుకోండి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కాకుండా పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పు మేరకే ఆ తర్వాత మీకు సెక్షన్ 51 కింద నోటీసులివ్వడం నిజం కాదా? ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? ఆ ఆదేశాలు అమలు కాకుండా మీరు బెదిరించలేదా? ఇన్ని వాస్తవాలమధ్య ఆ భూమి తమదని బోర్డు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలి.సమగ్ర విచారణలో బండారం బట్టబయలుకలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ తిరుపతి సాయి మండల సర్వేయర్‌తో కలిసి సమగ్ర విచారణ జరిపారు. 2019 ఆగస్టు 20వ తేదీన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాలు ఆర్.ఎస్.ఆర్, ఆర్.ఓ.ఆర్ రికార్డ్స్, ఆన్ లైన్ అడంగల్ ప్రకారం అది మసీదు ఇనామ్కు చెందిన భూమి అని స్పష్టం చేశారు. అదే సర్వే నంబర్లోని 2.78 ఎకరాల భూమిని 1995 డిసెంబరు 15 తేదీన ఈనాడు పేపర్‌కు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక, ఇతరత్రా పరిశీలన అనంతరం 2019 అక్టోబర్ 14వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆ రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.అది వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే ఈనాడు సంస్థ ఆ«దీనంలో ఉన్న సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాల భూమి పక్కాగా వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే. వక్ఫ్ గెజిట్‌లో కూడా స్పష్టంగా ఉంది. ఆ భూమి మసీదుకే దక్కాలని నేను పని చేసిన కాలంలో పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయినా స్పందించ లేదు. రాష్ట్ర బోర్డు అధికారులకు చెప్పాం. వాళ్లు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని వాళ్లు ఖాతరు చేయలేదు. – నూర్ మహమ్మద్, వక్ఫ్ బోర్డు రిటైర్డు ఇన్స్పెక్టర్ మసీదు భూమిని అన్యాయంగా లాక్కున్నారు మునగాలపాడు గ్రామానికి చెందిన జామియా మసీదుకు చెందిన 4.68 ఎకరాల భూమిని గతంలో ముతవల్లి నుంచి ఈనాడు వాళ్లు అక్రమంగా పొందారు. చేసిన తప్పులను ఎత్తిచూపాల్సిన పత్రిక యజమానులే ఇలా అన్యాయానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో మా సంఘం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది కలెక్టర్లకు విన్నపాలు చేశాం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. – సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డు తహశీల్దార్, ఏపీ ముస్లిం కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలం వద్దకు వెళ్తే అరెస్టు చేయించారు ఈనాడు సంస్థ తమ ఆ«దీనంలో పెట్టుకున్న భూమి పక్కాగా మా గ్రామ మసీదుకు చెందినదే. దీనిని కాపాడుకునేందుకు మా గ్రామస్తులు, పెద్దలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ భూమి మసీదుకు చెందినదని బోర్డులు పెట్టబోయాము. అది మా భూమి అని ఈనాడు బోర్డు పెట్టింది. ఆ భూమి వద్దకు వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు. మమ్మల్ని భయపెట్టారు. ఈ భూమి కోర్టులో ఉందని అనేక ఇబ్బందులకు గురి చేశారు. – షేక్షావలి, జామియా మసీదు ముతవల్లి, మునగాలపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితమని, ప్రస్తుతానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికొస్తే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఈ స్టాంపింగ్ విధానం టీడీపీ హయాంలో 2016లోనే పైలెట్ ప్రాజెక్టుగా మొదలైందన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కరణాలు, మునసబులతో నడుస్తున్న వ్యవస్థను 1984లో రద్దు చేశారని, 1985ృ86లో విలేజ్ అసిస్టెంట్లను రిక్రూట్ చేసుకోవడంతో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 1988 89లో కొంతమంది విలేజ్ అసిస్టెంట్లను నియమించారని, కరణాలు, మునసబుల్లో కొందరు 1992లో మళ్లీ విధుల్లోకి చేరారని, ఈ రకంగా అనేక మార్పులు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల అప్డేషన్ సక్రమంగా జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2002లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీరందరినీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపేశారని తెలిపారు. ఆ సమయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను అనుభవం లేని పంచాయతీ సెక్రటరీలకు కూడా అప్పజెప్పడంతో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రెసెంపటివ్ ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ వల్ల సబ్‌డివిజన్ పనులు, వంశపారంపర్యంగా వచ్చే మార్పులు, లావాదేవీలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయాలంటే దరఖాస్తుదారు పలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 (ఆర్ఓఆర్) అమలుపరిచిన ఈ చట్టం పూర్తిగా విజయవంతం కాలేదదన్నారు. భూముల నిర్వహణ, మార్పులు, కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారానికి ఒక సంపూర్ణ చట్టం అంటూ లేదన్నారు. వీటన్నింటి కోసం అనేక చట్టాల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. చట్టాల్లో కొన్ని కేంద్రప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు సవరణలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోందని తెలిపారు. 2003లో బయటపడిన తెల్గీ స్టాంప్ పేపర్స్ స్కామ్ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్‌తో స్టాంప్ పేపర్ల నిర్వహణలో ఉన్న లోపాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈృస్టాంపింగ్ ప్రక్రియను అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 2016లో ఈృస్టాపింగ్ పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారన్నారు. 2007లో ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం మన దేశంలో సివిల్ కోర్టులందు ఉన్న కేసుల్లో 66% సివిల్ కేసులు భూతగాదాలకు సంబంధించినవేన్నారు. దేశంలో భూములకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల, భూ యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉండడంతో భూమిపై ఆధారపడి జీవించేవారి జీవన విధానం సరిగ్గా జరగడం లేదని భారత ప్రభుత్వము/నీతి ఆయోగ్ గ్రహించి, దీనిపై అనేక సమావేశాలు నిర్వహించి నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సంయుక్తంగా ఒక మోడల్ చట్టం, నిబంధనలతో తయారు చేసి డిసెంబర్ 2019 లో రాష్ట్రాలన్నింటికీ పంపించారన్నారు. దీని ఫలితంగా ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేక చట్టం అవసరమైందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంస్థలకు చెందిన భూములతో సహా, సమగ్ర సమాచార సేకరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు వివాదాలు లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారించుటకు ఈ చట్టం అవసరమైందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించే సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసేందుకు అవకాశం లేని విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ చట్టం ద్వారా రైతులకు, భూ యజమానులకు, భూభాగాలకు సంబంధించి పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా హక్కుదారు భూ హక్కులను రక్షిస్తూ వివాదాలు లేని భూ పరిపాలన అందించడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డుల, భూహక్కుల పరిరక్షణ అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని భావించిందన్నారు. అన్ని స్తిరాస్థిలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ సంస్థలకు చెందిన భూముల సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాలు లేని భూయాజమాన్య హక్కులు నిర్ధారించుట జరుగుతోందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించు సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్‌చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డ్స్ తారుమారు చేసేందుకు అవకాశం లేని రీతిలో నిర్వహించబడుతుందన్నారు. ∗ భూయాజమాన్య హక్కుల్లో జరిగే మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు రికార్డ్స్ నందు నమోదవుతూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగు సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భూయాజమాన్య హక్కులకు సంబందించిన మార్పులు చేర్పులన్నీ నిర్ధారిత కాలవ్యవధిలో నమోదు చేస్తుందని పేర్కొన్నారు.∗ హక్కుదారుల భూహక్కులను పరిరక్షిస్తూ, వివాదాలు లేని భూపరిపాలన చేసేందుకే ఉపయోగపడుతుందన్నారు. ∗ ఈ చట్టం ద్వారా రైతులకు, భూయజమాన్యులకు, భూభాగానికి సంబందించి పూర్తి హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు.∗ ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేయలేదని, ఈ చట్టం పరిధి (ఏరియాస్ కవర్డ్) ని నిర్ధారించలేదన్నారు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేసిన అధికారులను ఇంకా అపాయింట్ చేయలేదని, ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను,సూచనలను తీసుకొని అవసరమైన మార్పులను, చేర్పులను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ∗ న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆ పిటిషన్లన్నింటినీ విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారిస్తూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారన్నారు. ఇంకా రీృసర్వే పూర్తి కాలేదని దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏపి ప్రభుత్వం ఈ చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య మా బంధువు ఒకాయన తరచుగా మీ సేవ కేంద్రానికి వెళుతున్నారు. ఎందుకు? అని అడిగితే.. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. తన పొలం, స్థలాల వంటివి తన పేరనే ఉన్నాయా?లేవా? అన్నది చూసుకోవడానికి అని చెప్పారు. ఈసీ తీసుకోవడానికి వెళ్తున్నా అని అన్నారు. అలా ఎందుకు ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక ఎక్కడి వెళతాయని అన్నాను. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యం వేసింది.ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందట. మా భూములు మాకు ఉండవట. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని కాపీలు ఇస్తారట!.. ఇలా చెబుతూ పోయాడు. అదంతా విని ‘అలా ఎందుకు జరుగుతుంది?’ అని అడిగా. దానికి అతను వివరణ ఇచ్చాడు. అప్పుడు అర్ధం అయింది. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అబద్దపు వార్తల ప్రభావానికి లోనయ్యాడని. ఒక మంచి పని చేయాలంటే ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అదే ఒక వదంతి సృష్టించడం ఎంత తేలికో చూడండి. దేశంలో కాని, ప్రపంచంలోకాని ఏ ప్రభుత్వం అయినా ఎవరి ప్రైవేటు ఆస్తులను లాక్కోవడానికి చట్టం తీసుకు వస్తుందా? విద్యాధికుడు అయిన ఆయనే ఇంత అపోహపడితే ,సామాన్య ప్రజలు ఇంకెత అపార్ధం చేసుకుంటారు.టైటిలింగ్ చట్టం వస్తే ఎవరి భూములు ఉండవని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నీచమైన అబద్దాలు రాయడానికి సిగ్గు పడడం లేదు. టీడీపీ మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని, ఇలాంటి అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి కనుక ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ ఎమ్.ఎ. చేసిన చంద్రబాబు నాయుడు వంటివారు కూడా ఇలా ప్రచారం చేయడం ఏమిటి?ఆయన నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ ఈ అసత్యాలను ప్రజలలో ఎందుకు విస్తరిస్తోంది. సుమారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదహారు ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేయవచ్చా? అంటే ఏమి చెబుతాం. ఔఆయనది ఎప్పుడూ కుట్ర స్వభావమే. తాను అధికారంలో ఉంటే అన్ని సంస్కరణలు తనవే అంటారు.ప్రతిపక్షంలో ఉంటే ఏ సంస్కరణ చేపట్టకూడదని అంటారు.తన వ్యతిరేక ప్రభుత్వం ఉంటే ,ఆ సంస్కరణలపై విషం కక్కుతారు. ఈయన రాజకీయ నేత, కుట్రలకు అలవాటుపడిన మనిషి కనుక ఇలా చేస్తున్నారులే అని అనుకోవచ్చు. కానీ, ఏభై ఏళ్లుగా ప్రజలకు తమ పత్రికల ద్వారా ,ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీవీల ద్వారా విజ్ఞానం అందిస్తున్నామని ప్రచారం చేసుకునే ఈనాడు అధినేత రామోజీరావు ఇలాంటి దరిద్రపు ప్రచారం చేస్తున్నారు? అబద్దం అని తెలిసి కూడా ఇలాంటి చెత్త వార్తలు రాయవచ్చా? అంటే ఆ విజ్ఞతను రామోజీ ఎప్పుడో కోల్పోయారు. ఏపీ ప్రజలలో జగన్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగొలా మార్చాలని, జగన్ కు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మార్చాలన్న దుర్మార్గపు ఆలోచనే రామోజీరావులో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ అలాంటి నీచపు ఆలోచనలతో ఉంటారు కనుక చెప్పుకోనవసరం లేదు.వాస్తవం ఏమిటంటే టైటిలింగ్ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు. కానీ ఇంకా మార్గదర్శక సూత్రాలను సిద్దం చేయలేదు. పైగా కోర్టులో స్టే ఉంది. రైతుల,భూ యజమానుల హక్కులను రక్షించి,వారికి అధునాతన టెక్నాలజీలో భూముల వివరాలను నమోదు చేయడానికి ఉద్దేశించినది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసి, వారు చేసిన సిఫారసుల మేరకు ఈ మోడల్ చట్టాన్ని రూపొందించింది.దీని ప్రకారం.. రాష్ట్రాలలో ఉన్న భూ వివాదాలు తగ్గించవచ్చు. ఒకసారి భూముల సర్వే జరిగి వివిధ శాఖల సమన్వయంతో రికార్డులలోకి వివరాలు ఎక్కితే భూ యజమానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరి భూమి ప్రభుత్వం తీసుకోలేదు.భూములు, రిజిస్ట్రేషన్ ల రంగంలో నిపుణులైన కొందరు దీనిని అధ్యయనం చేసి,ఈ చట్టం తీసుకురావడం దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఏవైనా చిన్న,పెద్ద అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు.అలాకాకుండా అసలు ఈ చట్టాన్నే వ్యతిరేకిస్తూ ఎన్నికల సమయంలో ప్రజలలో అపోహలు సృష్టించడానికి టిడిపి,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రయత్నించడం అంటే ఎపి ప్రజలకు ద్రోహం చేయడమే.ఈ చట్టం వస్తే వీరు తమ బినామీ,కబ్జా భూముల బాగోతం బయటకు సస్తుందని భయపడుతుండవచ్చు.ఒకసారి గతంలో చంద్రబాబు ఏమి చెప్పేవారో గుర్తుకు చేసుకోండి. ఆయన 1995 లో ఎన్టీఆర్‌ను పడగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తాను సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టిన వ్యక్తినని చెప్పుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్ ను కంప్యూటర్ ద్వారా చేసేవారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. అయితే చంద్రబాబు తన టైమ్ లో ఏమి చేసినా తన ఘనత అని,అదే ఎదుటివారు ఏమైనా చేస్తుంటే బురద చల్లుతుంటారు.ఉదాహరణకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు ఆ చట్ట సవరణ చేసిన కేంద్రం కన్నా,తానే అవన్ని కనిపెట్టానని చెప్పుకునేవారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని అనేవారు.ప్రభుత్వరంగంలో కార్పొరేషన్ లు వృధా అని చెప్పేవారు. తన మనసులో మాట పుస్తకంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాని అదే పెద్దమనిషి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా రివర్స్‌గా మాట్లాడుతున్నారు. మరో ఉదాహరణ చూస్తే.. కేంద్రం ఆదేశాల ప్రకారం జగన్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టింది. ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో తెలుసా?మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరి వేయడమే అని అన్నారు. పోనీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. ఆ చట్టం తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊసు ఎత్తడం లేదు. ఎల్లో మీడియా కూడా దీని గురించి ప్రచారం ఆపేసింది.అలాగే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం ఇంకా ఏపీలో అమలులోకి రాకముందే పచ్చి అబద్దాలను వీరంతా కలిపి ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు చంద్రబాబు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. రామోజీ , రాధాకృష్ణలు రాసే వార్తలను జనం విశ్వసించడం లేదు కనుక సరిపోయింది. లేకుంటే ఏపీ సమాజం అంతా తీవ్ర అలజడికి గురి అయ్యేది. అయినా వీరు రాసే అబద్దాలను నమ్మేవారు కొద్ది మంది ఉండకపోరు. ఒక చదువుకున్న వ్యక్తి అనుభవాన్ని గమనిస్తే,ఇలాంటి వారు కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వీరిలో అత్యధికులు తెలుగుదేశం వారే. వారే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే చెత్తవార్తలు రాసి నమ్మి టెన్షన్ పడుతున్నారు.31 లక్షల ఇళ్ల స్థలాలు, కొన్ని లక్షల ఎకరాల చుక్కల భూములు.. తదితరాలను చట్టబద్దం చేసి పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు అందించిన జగన్ భూములు లాక్కొంటారని ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారో చూడండి.ఏ సంస్కరణ అయినా, ఏ టెక్నాలజీ అయినా ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వాలు తీసుకు వస్తాయి. అంతే తప్ప వారికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటాయి?. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వామపక్షాలు సీపీఐ, సీపీఎం వంటివి తీవ్రంగా వ్యతిరేకించేవి. బీజేపీ కూడా విమర్శలు చేసేది. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంస్కరణలు అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం అయితే ఏకంగా భారతరత్న బిరుదును ఇచ్చింది.ఒకప్పుడు కంప్యూటర్లు లేని రోజుల్లో తెల్ల కాగితాల మీద పెన్నుతో ఏ విషయం అయినా రాయవలసి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక మొత్తం జన జీవితాలే మారిపోయాయి. కంప్యూటర్లనే అంతా వాడడం ఆరంభం అయింది. మొదట్లో ఈ కంప్యూటర్లను వ్యతిరేకించినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పౌరులు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లన్నిటీ స్కాన్ చేసి కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు.దీనివల్ల రికార్డులకు భద్రత పెరిగింది.అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ లలో మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని సంబంధిత యజమానికి సంబంధం లేకుండా మరెవరూ రిజిస్టర్ చేయడానికి వీలులేని విధంగా టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ప్రతి భూమికి ఒక నెంబర్ ఇస్తారు.దాని ఆధారంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో భూముల సర్వే జరుగుతోంది. ఇదంతా అయిన తర్వాత కాని టైటిలింగ్ చట్టం అమలు చేయవలసి ఉంటుంది. అయినా ప్రజలలో అనవసర అనుమానాలను విపక్షం, ఎల్లో మీడియా కల్పిస్తున్నందున ,అసలు ఈ చట్టాన్ని ఇప్పట్లో అమలు చేయబోమని,దేశం అంతటా దీనిపై అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చాక అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి.గతంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, ఆ డిపాజిట్లకు సర్టిఫికెట్ లు ఇచ్చేవారు. వాటిని మనం భద్రపరుచుకోవల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంకులు సర్టిఫికెట్ ల బదులు రశీదులు ఇస్తున్నాయి. అవి కేవలం మన సంతృప్తి కోసమే. ఎందుకంటే మనం డిపాజిట్ మెచ్యూర్ అయ్యే డేట్ మర్చిపోయినా, బ్యాంకుల నుంచి ఆటోమాటిక్ గా మెస్సేజ్ రావడం, మనం ఆ డిపాజిట్ తీసుకోవడం జరుగుతోంది. ఎంత మార్పో ఆలొచించండి. ఒకప్పుడు ఏ కంపెనీ షేర్లను అయినా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికెట్ రూపంలో వచ్చేవి. ఆ షేర్లను మనం అమ్మితే వాటిని కొనుగోలుదారుకు పంపవలసి ఉండేది. కాని ఇప్పుడు అసలు షేర్లు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చూడనక్కర్లేదు. అన్ని డిజిటల్ లాకర్ లలోనే ఉంటున్నాయి. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. మరి నా షేర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా కాపీ ఇస్తారా? అని ఎవరైనా అడిగితే అతనిని అయోమయం వ్యక్తిగా చూస్తారు.అలాగే.. ఇప్పుడు భూముల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఒరిజినల్‌వి కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కంపెనీల షేర్ల మాదిరి భూములు కూడా కంప్యూటర్లలో ఈ చట్టం కింద పరిరక్షణలో ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇంకో ఉదాహరణ చెప్పాలి. గతంలో పత్రికలు తమ దిన సంచికలను జాగ్రత్తగా స్టోర్ చేసేవి. అవన్ని దుమ్ముకొట్టుకుపోయేవి.చెదలు పట్టి పాడైపోతుండేవి. మరి ఇప్పుడు వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. పలు లైబ్రరీలు కూడా ఇలాగే వివిధ పత్రికలను డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. అలాకాదు.ఒరిజినల్ పాత పేపర్లు కావాలని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాం?. పాతకాలపు మనిషి అని నవ్వుకుంటారు.కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకపోవడంతో భూ వివాదాలు పెరిగాయి. నకిలీలు, కబ్జాలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది..వీటన్నింటిని అరికట్టడానికి లాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ఇక ఈ-స్టాంపింగ్ వ్యవస్థపై కూడా ఈనాడు పత్రిక దారుణమైన అబద్దాలు రాసింది. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఈ-స్టాంపింగ్ వ్యవస్థ అమలులో ఉంది. తెల్గీ స్టాంప్ కుంభకోణం తర్వాత కేంద్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రత తో ఈ-స్టాంపింగ్ వ్యవస్థను కేంద్రం తెచ్చింది.ఈ ప్రభుత్వం కూడా దీనిపై ప్రయోగాలు చేస్తుంటే ,కొందరు స్వార్ధపరులు దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ స్టాంపులు జిరాక్స్ కాపీలు కావని ,నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ సేఫ్ అని వారు అంటున్నారు.ఏపీలో ఏ అభివృద్ది జరిగినా, ఏ సంస్కరణ తెచ్చినా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటికి వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాయడం,దానిని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అందుకోవడం నిత్యకృత్యం అయింది. వలంటీర్ల వ్యవస్థపై వీరంతా ఎంత విషం చిమ్మారో చూశాం. ఇప్పుడు అదే వ్యవస్థ తాము కొనసాగిస్తామని,ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గ్రామ ,వార్డు సచివాలయాలతో గ్రామ పంచాయతీలకు నష్టం అని ప్రచారం చేశారు. ఇప్పుడు వృద్దుల పెన్షన్లు వారి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏ సంస్కరణ తెచ్చినా విషం కక్కుతున్న వీళ్లిద్దరి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఇలాంటివారిని నమ్మి మోసపోయారు. మరోసారి మోసపోతే కోలుకోవడం కష్టమే అవుతుందని చెప్పక తప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కేంద్రం టైటిల్‌తో బాబు డ్రామా
అమలులోకి రాని చట్టంపైఇంత దుష్ప్రచారమెందుకు? ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్రం స్పష్టంగా అన్ని రాష్ట్రాలకూ చెబుతున్న నేపథ్యంలో.. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. బలవంతంగానైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఎవరి హయాంలో ఉంటుంది? బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. ఎన్డీఏతో కూటమి గట్టిన చంద్రబాబు నాయుడి హయాంలోనే కదా? ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగాఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ చట్టాన్ని ప్రజల ఇష్టాయిష్టాల మేరకు అమల్లోకి తేవటమో, తేకుండా నిలిపేయటమో ఏదైనా చేయగలరు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు కదా! బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్నారు గనక.. ఎన్డీఏ పేరుతో ఓట్లడుగుతున్నారు కనక.. ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలి. ఇది వాస్తవం. ఇది పచ్చి నిజం. మరి దొంగ మాటలెందుకు చంద్రబాబూ? పైపెచ్చు అమల్లోకి రాని ఈ చట్టాన్ని రద్దు చేస్తాననే ఓ పిచ్చి హామీని మేనిఫెస్టోలో పెట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ మానసిక స్థితి సరిగానే ఉందా? అసలు అమల్లోకే రాని ఈ చట్టంపై ఉన్నవీ లేనివీ చెబుతూ...దాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిందని, అందరి భూములూ లాక్కుంటోందని దిగజారిపోయి దౌర్భాగ్యపు ప్రచారానికి దిగటం ఎంత నీచం? ఈ చంద్రబాబు నాయుడి నైచ్యానికి అంతూ పొంతూ ఉండదా? మనిíÙగా పుట్టాక కాస్తయినా సిగ్గూ శరం ఉండాలి కదా? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెబుతున్న ఈ పెద్ద మనిíÙ.. ఇంత కుళ్లూ కుతంత్రాలతో.. జనం సాక్షిగా కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పేస్తూ విషం కక్కుతుండటం హేయం కాదా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి పునాది పడింది 1989లోనే. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి, ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరిట టైటిల్ ఇచ్చి.. ఆ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని, దీనికోసం ల్యాండ్ రికార్డులన్నిటినీ డిజిటల్ చేయాల్సి ఉంటుందని అప్పట్లోనే తీర్మానించారు. ఆ తీర్మానాలకు కొనసాగింపుగా.. 2004లో జాతీయ ల్యాండ్ రికార్డుల కంప్యూటరీకరణ (ఎన్ఎల్ఆర్ఏపీ) పథకాన్ని రూపొందించారు.దాని ప్రకారం 2009లో తొలి మోడల్ చట్టం తయారైంది. ఈ మోడల్ చట్టాన్ని అనుసరిస్తూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 2015లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. అదిగో ఆ తర్వాతే...అంటే 2015లో ముసాయిదా తెచ్చాకే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ దీనికో రోడ్ మ్యాప్ ఇచ్చింది. టైటిల్ గ్యారంటీకి ఏమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలమనే రోడ్డు మ్యాప్ అది. ఆ రోడ్ మ్యాప్‌కు తగ్గట్టుగానే 2019లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదాకు అనుగుణంగా.. ఈ చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర భూముల సర్వేను పూర్తి చేయటం తప్పనిసరి కనక... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీ సర్వే పూర్తయితేనే ‘ల్యాండ్ టైట్లింగ్’ వాస్తవానికి రాష్ట్రంలో 17,000 గ్రామాలుండగా వాటిలో ఇప్పటికే 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే జరిగి.. ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుంది. అదంతా పూర్తయ్యాక, రీ సర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూ హక్కు పత్రాలిస్తారు. ఆ పత్రాల ఆధారంగానే.. ప్రతి ఒక్కరికీ ఆయా భూముల టైటిల్‌ను వారి పేరిట మంజూరు చేస్తారు. అంటే.. రీ సర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తేవటం అసాధ్యం. రీ సర్వే పూర్తయి.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే... భూములపై సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు, ఇవేవీ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ వాస్తవం. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అవసరమా? నిజానికిప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలుంటున్నాయి. 10(1), అడంగల్ వంటివి రెవెన్యూ విభాగం ఇచ్చేవి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే ఆ శాఖ రిజిస్టరైన ప్రతిసారీ ఒక డాక్యుమెంట్ నెంబరు కేటాయిస్తుంది. అంతేకాదు.. సర్వే సెటిల్మెంట్, ఎండోమెంట్, అటవీ శాఖ, వక్ఫ్, స్థానిక సంస్థలు.. వీటన్నిటి వద్దా ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు ఉంటున్నాయి. ఆ భూమిని ఒకరు కొన్నప్పుడో, అమ్మినప్పుడో అన్ని రికార్డుల్లోనూ ఒకేసారి నమోదయ్యే అవకాశం లేదు.దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదవుతాయి. కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక... రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక... వేరెవరో వచ్చి అది తాను ముందే కొన్నానని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక... అది అసైన్డ్ భూమి అనో, గ్రామ కంఠం భూమి అనో, లేదా చుక్కల భూమి అనో తెలుస్తోంది. ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. ఇక రుణాల సంగతి తీసుకుంటే.. ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే ఆ సమాచారం రిజి్రస్టార్ కార్యాలయంలో అప్డేట్ కాదు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటమో, రుణం తీçర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమో జరుగుతోంది. నిజంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలçకు ఆస్కారం ఉండదు. అన్ని రికార్డులూ ఒకే రిజిస్టర్లో... ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే... టైటిల్ రిజిస్టరులో ప్రతి భూమికీ ఒక యునిక్ నంబరును (రీ సర్వేలో పేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టరు భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రతి బ్యాంకుకూ, ఆర్థిక సంస్థకూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు తామిచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఆ రిజిస్టరులో నమోదు చేస్తాయి. కాబట్టి తదుపరి మోసాలకు, వివాదాలకు తావుండదు. అందుకే ప్రభుత్వ గ్యారంటీ మోసాలకు తావుండదు కనక.. ఈ చట్టం ప్రకారం ప్రతి భూమికీ ప్రభుత్వం ఆయా టైటిల్ దారు పేరిట బీమా చేయిస్తుంది. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో ఆ భూమి తనదంటూ వేరెవరైనా వివాదం తెచ్చినా... ఒకవేళ అది ఏ అసైన్డ్ భూమో అని తేలినా.. టైటిల్ దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ టైటిల్దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్న మాట. ఇదీ చంద్రబాబు సహా ఎల్లో ముఠా ఎక్కడా చెప్పని పచ్చి నిజం.మోదీతో చెప్పించు బాబూ? అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే కదా? దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరీ.. తగిన మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ‘నీతీ ఆయోగ్’ కదా? ఆ కమిటీ నివేదిక మేరకు.. దానికి రకరకాల ముసాయిదాలు రూపొందించి.. దాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించింది అబద్ధమా? దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా చేయటం అబద్ధమా? ఆ కోవలోనే కదా! ఈ చట్టం తేవాలంటే ముందుగా రాష్ట్రం మొత్తాన్ని రీ సర్వే చేయాల్సి ఉంటుంది కనక ఆ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంత మాత్రానికే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చేసిందంటూ అన్ని భూములనూ జగన్ ప్రభుత్వం తన పేరిట రాసేసుకుంటోందని చెబుతూ ఎన్నికల ముందర చంద్రబాబు, ఆయన పచ్చ ముఠా వికృత క్రీడ మొదలు పెట్టింది. లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటం లేదు. బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీనీ పిలిపిస్తోంది.ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసి వెళ్లిన నరేంద్ర మోదీ.. త్వరలో మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఆ రోజున ప్రధాన మంత్రి ముందే ఈ చట్టాన్ని మేం అమలు చేయబోమని చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయబోమని మోదీతో చెప్పించగలవా? ల్యాండ్ టైట్లింగ్ అంటూ ఊగిపోతున్న పవన్ కల్యాణ్.. మోదీ ముందు అదే నటనను కొనసాగించగలరా? ఎన్నాళ్లీ పనికిమాలిన డ్రామాలు?ఇదీ... ఎల్లో ముఠా సాగిస్తున్న విష ప్రచారం 1. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు. రాత్రికి రాత్రి ఆన్లైన్లో రికార్డులను మార్చేస్తారు. 2. సివిల్ కోర్టులకు ఇక భూములపై అధికారాలు ఉండవు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి గానీ, రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది.. 3. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారు.. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ వాళ్లు చెప్పిన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారు. 4. ఈ చట్టం వచ్చాక భూములున్న వారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అసలు వాస్తవాలు ఇవీ.. 1. ప్రభుత్వం భూములెలా లాక్కుంటుంది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గిరిజనులకు 3.22 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం కలలోనైనా ఇలాంటి ఆలోచన చేస్తుందా? నిజానికి రీసర్వే చేసేటపుడే ఆ భూమి ఎవరిదో తేల్చి.. వారి పేరిట హక్కు పత్రాలు ఇస్తోంది. ఆ హక్కుదారు పేరే కదా రికార్డుల్లో ఉంటుంది. మరి ఆ పేరును మార్చేయటం సాధ్యమా? రాత్రికి రాత్రి ఆన్లైన్లో ఎలా మార్చేస్తారు? మన పేరిట హక్కు పత్రం ఇచ్చినపుడు...ఆ పత్రం మనదగ్గర ఉన్నపుడు రికార్డుల్లో మన పేరు మార్చేయటం ఎలా సాధ్యం? ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఇది తెలిసిపోతుంది కదా! 2. రికార్డుల్లో జరిగే తప్పులపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నది తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు ప్రభుత్వ అధికారులకే కదా? వీళ్లతో పాటు ఉండే టైటిల్ రిజి్రస్టారు కూడా ప్రభుత్వాధికారే ఉంటారు. దీన్లో తప్పేముంది? ఇక భూమి యాజమాన్యంపై వచ్చే సివిల్ వివాదాలు ఇప్పటి మాదిరే కోర్టుల్లోనే పరిష్కారమవుతాయి. దీన్లో ఎలాంటి తేడా ఉండదు. మరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనటం పచ్చి అబద్ధం కాదా? 3. అన్ని అధికారాలూ టైటిల్ రిజి్రస్టారుకు ఎందుకుంటాయి? ఇప్పుడు భూముల రిజిస్టరు సబ్ రిజి్రస్టారు కార్యాలయంలో ఉంటోంది. ఆయన కూడా ప్రభుత్వాధికారే. మరి ఆయన ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్లు రికార్డుల్లో పేర్లు మార్చేయగలుగుతున్నారా? ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేయగలుగుతున్నారా? రికార్డుల్లోని వివరాల నిర్వహణకు ప్రభుత్వం నియమించే గుమాస్తాగానే ఆయన్ను చూడాలి తప్ప.. రికార్డులు మార్చే అధికారం తనకు ఎందుకుంటుంది? 4. మళ్లీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అసలు ఆ అవసరం ఎందుకుంటుంది? వివిధ కార్యాలయాల్లో ఉండే వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించి.. రీ సర్వేలో ఇచ్చిన హక్కు పత్రాల ఆధారంగా రిజిస్టరులో ప్రభుత్వమే నమోదు చేసుకుంటుంది. మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర నిర్ణయం
శ్రీకాకుళం క్రైమ్: నూతన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని చెప్పారు. అయినా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని ధర్మాన స్పష్టంచేశారు. కానీ, కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుచేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ నేతలు ఈ చట్టంపై వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘1989 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను దేశంలో అమలుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. రకరకాల అ«ధ్యయనాల ద్వారా ఫైనల్‌గా బీజేపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ వంటి ఉన్నతమైన సంస్థతో ఓ మోడల్ యాక్ట్ తయారుచేయించింది. అదే కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో అమలుచేస్తామని గతంలోనే స్పష్టంగా చెప్పాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, ఇక్కడ అమలు చేయబోమని మరోసారి చెబుతున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్లలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు అమలుచేశారు. వందేళ్ల తర్వాత చేపట్టిన భూ సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది. దీనివల్ల భూ రికార్డులు అప్డేట్గా ఉంటాయి. కానీ టీడీపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక సర్వే రాళ్లపై వైఎస్సార్ బొమ్మ ఉందని విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్ బొమ్మ ఉంటే తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన కార్ట్–2.0 అనే ప్రాజెక్టుపై విపక్షాలకు వత్తాసు పలికే మీడియా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. వాస్తవానికి దీనివల్ల ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజి్రస్టేషన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. గ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ కార్యాలయాలు వచ్చి మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగి ఈసీ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ వంటివి అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం రాజధాని వెనకపడి రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది.’ అని ధర్మాన తెలిపారు.జగన్ ఎలాంటివారు అనేది ఐదేళ్ల పాలనే చెబుతుంది ‘సీఎం వైఎస్ జగన్ భూములు తీసుకునేవారా.. భూములు పంచేవారా.. అన్నది ఈ ఐదేళ్ల పాలనే చెబుతుంది. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది వైఎస్ జగన్ కాదా.. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవారిలా కనిపిస్తున్నారా..? రూ.12,800 కోట్లు ఖర్చు పెట్టి భూములు కొని 31లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవారిలా కనిపిస్తున్నారా..? రెండు లక్షల ఎకరాల శివాయ్ జమాదార్ (పేదల సాగులో ఉండి హక్కులు లేని) భూములకు పట్టాలిచ్చింది సీఎం జగన్ అని గుర్తుంచుకోండి. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకునే భావజాలం టీడీపీది. రైతులకు వ్యతిరేకంగా మేం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను.’ అని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్‌ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్‌కి, సబ్ రిజిస్ట్రార్‌కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి!
హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. -
బాబు.. బిల్లీ.. లక్ష కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిజంగా విజనరీయే. 20 ఏళ్ల కిందటే రూ. లక్ష కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే... అందుకోసం ఎవ్వరి దృష్టీ పడని క్రీడా రంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ‘ఐఎంజీ అకాడెమీస్ భారత్’ అనే కంపెనీని పెట్టించి... అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి... హడావుడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి, సేల్‌డీడ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి? శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించటంతో పాటు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చేసి... వాటి నిర్వహణ ఛార్జీలను కూడా ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారంటే ఏమనుకోవాలి? క్రీడల ద్వారా, వాటి అడ్వర్టయిజ్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఐఎంజీ అకాడెమీస్కే చెందేలా భారీ దోపిడీకి పథకం వెయ్యగలిగారంటే ఆయన విజనరీయే కదా? ఇప్పటి విలువల ప్రకారం చూస్తే ఈ స్కామ్ విలువ లక్ష కోట్లపైనే. స్పై కెమెరాకు పట్టుబడిన బిల్లీ... ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంది కాబట్టే 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. బాబు ఓడిపోయారు. వైఎస్సార్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపుల్ని సమీక్షించినపుడు మొత్తం బోగస్ కంపెనీలేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. కానీ బాబు గారి ముఠా ఊరుకోలేదు. తమకు కోర్టుల్లో బలం ఉంది కనక... న్యాయస్థానంలో సవాల్ చేశారు. 2009 ఎన్నికల ముందు... ఈ కేసులో తీర్పు వెలువడవచ్చని బిల్లీరావు భావించారు. ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన్ను కలిసి.. తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు. వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాల్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు. వాటిని ‘సాక్షి’ ప్రచురించింది కూడా. అప్పట్లో అది సంచలనం కావటంతో... తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తులు మారటంతో సుదీర్ఘకాలం కొనసాగింది. తాజాగా గురువారంనాడు బిల్లీరావు తమకే కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు... అది మొత్తం వ్యవస్థ నివ్వెరపోయే కుంభకోణమని తేల్చింది. చంద్రబాబు దోపిడీని బయటపెట్టింది. దీనిపై వైఎస్సార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా... అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్న సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ... తమకు తగిన సిబ్బంది లేరన్న సాకుతో దాన్ని చేపట్టలేదు. తాజాగా గురువారంనాడు హైకోర్టు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టంచేసింది. ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ అక్కడి ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. నిజానికి అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిపి ఉంటే.. ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి, చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవారని స్పష్టంగా చెప్పొచ్చు. బాబు... నా జేబులో ఉంటారన్న బిల్లీ తాజా పరిణామాల నేపథ్యంలో... అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు... బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు? వ్యవస్థలో ఎంతమందిని వాడేశారు? వంటి వివరాలు మరొక్కసారి చూద్దాం. ‘‘ఇదిగో తీర్పు ...ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపి. ఈ తీర్పును నేనే రాశాను. నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ––– కు ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబే చెప్పారు. అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి అలాంటిది. ఆయనే అన్నీ చూస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేపి అడిగినా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు. నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు’’. వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురి పేర్లను బిల్లీ వాడేశారు. ‘సాక్షి’ వాటిని ప్రచురించలేదు. ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది కూడా. క్రీడా వ్యవస్థను చెరబట్టేందుకు పన్నాగం కేవలం కాగితాలకే పరిమితమైన ఐంఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంతం్ర పన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినా, వైఎస్సార్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయేది. సామాన్యులెవ్వరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయేవారు. ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 850 ఎకరాలను కేటాయించడమే కాదు. 16 స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీ రావుకు 45 ఏళ్లపాటు లీజు పేరిట కట్టబెట్టేశారు. ఆ సమయంలో ఆ స్టేడియంలు, వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐంఎంజీ భారత్ పెత్తనం కిందకే వస్తాయి. కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. బీమా ప్రీమియాన్నీ చెల్లిస్తుంది. స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు, ఉచిత విద్యుత్, వినోద పన్ను రాయితీ, విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది. అంతేకాదు.. మరో ప్రమాదకరమైన నిబంధననూ చేర్చారు. స్టేడియంలు, వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజును చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజీ భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడమన్న మాట. అంటే రాష్ట్రంలో 45 ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజీ భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు, వాటి ఆస్తులన కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరి మడతపెట్టేస్తారన్నది సుస్పష్టం. కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు, ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలను తిప్పికొట్టింది. ఐంఎంజీ భారత్‌కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లో 850 ఎకరాలను కేటాయించడాన్ని రద్దు చేస్తూ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ భూకేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది. దాంతో చంద్రబాబు భూబాగోతం బెడిసికొట్టింది. ఇపుడు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తే... చంద్రబాబు ఊచలు లెక్కబెట్టడం ఖాయమనేది న్యాయవర్గాల మాట.