భవేష్ మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్
వరంగల్ డెస్క్: ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ నగరంలోని ముంపుకాలనీల వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది.
వరధ ఉధృతికి ఇంట్లోని భూమి పట్టాదార్‌పాస్‌పుస్తకాలు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా అన్ని రకాల విలువైన పత్రాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల తడిసి పనికి రాకుండాపోయాయి. ఈ క్రమంలో తమకు కనీసం ధ్రువీకరణపత్రం కూడా లేకుండాపోయిందని పలువురు వరద బాధితులు అంటుండగా, పై చదువులకు ఎలా వెళ్లేది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఫొటో వరంగల్ నగరంలోని బీఆర్‌నగర్.వరద బాధితులు ఇలా ఇంట్లో తడిసిన అన్ని పత్రాలను మంచంపై పరిచి ఆరబెట్టారు. ఇటీవల వరదలకు ఈ కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో కాలనీవాసులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గాక ఇంటికి చేరుకున్న వారికి
ఏ వస్తువు చూసినా బురదతో నిండి ఉంది. ఇంట్లోని ధ్రువీకరణ పత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలుఅన్నీ తడిసిపోయాయి.
సర్వే చేస్తున్నాం
మోరంచపల్లి గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే ఆధారంగా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు వచ్చేలా కృషి చేస్తాం. తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తాం..
కొండాయి, మోరంచపల్లి, వరంగల్‌లో..
గత 27వ తేదీన వరద బీభత్సానికి కొండాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను వదిలి ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇళ్లల్లో దాచుకున్న ధ్రువీకరణపత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇక వరంగల్ నగర పరిధిలో వరద ముంపునకు గురైన బీఆర్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, గోపాల్‌పూర్, నయీంనగర్ ప్రాంతాల్లోని వారిదీ ఇదే పరిస్థితి.
అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి
ట్రంకు బాక్సులో పెట్టుకున్న పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లన్నీ కొట్టుకుపోయాయి. నా పై చదువుల పరిస్థితి ఏమిటీ? ఇంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. నా సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలి.
-ప్రవీణ్‌కుమార్, దొడ్ల, ములుగు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment