bank passbook
-
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
ఎస్బీఐ బ్యాంక్ : ఆధార్ ఉంటే చాలు, ఇక ప్రభుత్వ పథకాల్లో సులభంగా చేరొచ్చు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకాలలో ఆధార్ సాయంతో పేర్ల నమోదుకు వీలు కల్పిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీలు) వద్ద ఈ సేవలకు సంబంధించి సదుపాయాన్ని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రారంభించారు. ఎస్బీఐ కస్టమర్లు సీఎస్పీ వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. అకౌంట్ పాస్‌బుక్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక భద్రత పొందేందుకు ఉన్న అడ్డంకులను ఈ నూతన సదుపాయం తొలగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. -
60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా ఒక్క రోజులోనే ధనవంతులుగా మారిగా సందర్భాలు గతంలో కోకొల్లలు. ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. చిలీ ప్రాంతానికి చెందిన 'ఎక్సెక్వియెల్ హినోజోసా' (Exequiel Hinojosa) జీవితంలో ఇదే జరిగింది. ఇతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తరువాత క్షణ్ణంగా పరిశీలించగా.. అతని అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్‌బుక్ అని అర్థమైంది. బ్యాంక్ పాస్‌బుక్.. నిజానికి ఆ బ్యాంక్ పాస్‌బుక్ అతని తండ్రికి తప్పా ఇంకెవరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ పాస్‌బుక్ 1960-70 కాలానికి చెందినట్లు గుర్తించాడు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ (Chilean pesos) డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. ఆ డబ్బుని ఎక్సెక్వియెల్ హినోజోసా విత్‌డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముంచు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది వెల్లడించారు. కానీ అతని పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. స్టేట్ గ్యారెంటీడ్.. ఆ బ్యాంకు పాస్‌బుక్‌లో స్టేట్ గ్యారెంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంకు ఇవ్వని పక్షంలో, కస్టమర్‌కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. చివరికి చేసేదిలేక కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! ఆ డబ్బు తన తండ్రి డిపాజిట్ చేసయినట్లు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాదించి.. చివరకు 1 బిలియన్ చిలీ పెసోస్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇది 1.2 మిలియన్ డాలర్లకు సమానం (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 కోట్లు). దీంతో దెబ్బకు ఇతడు కోటీశ్వరుడయ్యాడు. -
భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస
వరంగల్ డెస్క్: ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, జయశంకర్భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ నగరంలోని ముంపుకాలనీల వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. వరధ ఉధృతికి ఇంట్లోని భూమి పట్టాదార్పాస్పుస్తకాలు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా అన్ని రకాల విలువైన పత్రాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల తడిసి పనికి రాకుండాపోయాయి. ఈ క్రమంలో తమకు కనీసం ధ్రువీకరణపత్రం కూడా లేకుండాపోయిందని పలువురు వరద బాధితులు అంటుండగా, పై చదువులకు ఎలా వెళ్లేది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటో వరంగల్ నగరంలోని బీఆర్‌నగర్.వరద బాధితులు ఇలా ఇంట్లో తడిసిన అన్ని పత్రాలను మంచంపై పరిచి ఆరబెట్టారు. ఇటీవల వరదలకు ఈ కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో కాలనీవాసులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గాక ఇంటికి చేరుకున్న వారికి ఏ వస్తువు చూసినా బురదతో నిండి ఉంది. ఇంట్లోని ధ్రువీకరణ పత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలుఅన్నీ తడిసిపోయాయి. సర్వే చేస్తున్నాం మోరంచపల్లి గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే ఆధారంగా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు వచ్చేలా కృషి చేస్తాం. తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తాం.. కొండాయి, మోరంచపల్లి, వరంగల్‌లో.. గత 27వ తేదీన వరద బీభత్సానికి కొండాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను వదిలి ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇళ్లల్లో దాచుకున్న ధ్రువీకరణపత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇక వరంగల్ నగర పరిధిలో వరద ముంపునకు గురైన బీఆర్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, గోపాల్పూర్, నయీంనగర్ ప్రాంతాల్లోని వారిదీ ఇదే పరిస్థితి. అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి ట్రంకు బాక్సులో పెట్టుకున్న పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లన్నీ కొట్టుకుపోయాయి. నా పై చదువుల పరిస్థితి ఏమిటీ? ఇంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. నా సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలి. -ప్రవీణ్‌కుమార్, దొడ్ల, ములుగు జిల్లా -
FIFA: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్నఫైనల్తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తన దేశం తరపున చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్ కొట్టడమే గాక సూపర్ అసిస్ట్స్తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్ కొట్టాలని కోరుకుందాం. అయితే అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు చెందిన పాస్‌బుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్బీఐ పాక్బుక్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్బీఐ పాస్ బుక్ రంగు ఒకటి కావడమే. అర్జెంటీనా జెర్సీ లైట్ బ్లూ, వైట్ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్బీఐ పాస్‌బుక్ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎస్బీఐ పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ పాస్‌బుక్ ఫొటోలు ట్విటర్లో వైరల్‌గా మారింది. SBI's lunch time = Argentina's Whole Match https://t.co/u2kt12FyRX — Harshad (@_anxious_one) December 15, 2022 Reason why Indians support Argentina Indians feel if Argentina loose they will loose all their money 😉#India #FIFAWorldCup #GOAT𓃵 #FIFAWorldCupQatar2022 #Argentina #WorldCup2022 #WorldCup #finale #mumbai #Delhi #Kerala #TamilNadu #Karnataka #Bengaluru #SBI #Bank pic.twitter.com/CTi7TW5X3Y — We want United India 🇮🇳 (@_IndiaIndia) December 15, 2022 State Bank of India (SBI) is also supporting Argentina 😆#FIFA #FIFAWorldCupQatar2022 #FIFAWorldCup2022 #ArgentinaVsFrance #Argentina @TheOfficialSBI pic.twitter.com/4gRYXItziq — Maghfoor Ahmad (@maghfoormalkana) December 15, 2022 చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు -
గూడు చెదిరి.....
చెట్టుకొకరు, పుట్టకొకరుగా అగ్నిప్రమాద బాధితులు పొలం గట్లూ.. చెట్ల కిందే ఆవాసం సాయం కోసం ఎదురుచూపులు నాగవరం బాధితుల కన్నీటి గాథ నిన్నమొన్నటి వరకు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఒకరిపై ఆధారపడకుండా గుట్టుగా కాపురం చేసిన ఆ కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఊహించని ఉపద్రవం వల్లో.. రెండు వర్గాల మధ్య ఏర్పడిన పంతం వల్లో తెలియదు గానీ అగ్నిప్రమాదం కబళించడంతో ఆ పల్లె నేడు బూడిద కుప్పగా మారింది. ఆహ్లాదంగా, ఆనందంగా గడిపిన ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. బాధితులు పొలం గట్ల వెంట, చెట్ల కింద తలదాచుకుంటూ సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. గూడూరు : మండలంలోని నాగవరం గ్రామంలో ఈ నెల 17న జరిగిన అగ్నిప్రమాదంలో 42 నివాస గృహాలు, 15 పశువుల పాకలు, 20కి పైగా గడ్డివాములు దగ్ధమయ్యాయి. 56 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సంఘటన ప్రమాద రూపంలో జరిగిందా లేదా మానవ ప్రేరేపితంగా జరి గిందా అన్న విషయంలో అనుమానాలున్నా.. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పొలాల్లోనే ఆశ్రయం... అగ్నిప్రమాద ఘటన కారణంగా బాధిత కుటుంబాలవారు కట్టుబట్టలతో మిగిలి దుర్భర స్థితిలో రోజులు గడుపుతున్నారు. ఆశ్రయం పొందే అవకాశం లేక సమీప పొలాలు, పొలం గట్లపైనే తలదాచుకుంటున్నారు. అగ్నిప్రమాదం సమయంలో దగ్ధమవగా మిగిలిన వస్తు సామగ్రితో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రమాద ఘటనలో ఇళ్ల మధ్య ఉన్న చెట్లు సైతం బుగ్గిపాలు కావటంతో నిలువ నీడ కరువవుతోంది. కట్టుబట్టలతోనే అందుబాటులో ఉన్న కర్రలు, వాసాలతో గుడారాలు ఏర్పాటు చేసుకుని దయనీయ స్థితిలో నివసిస్తున్నారు. అసలే నిప్పులు చెరిగే ఎండలు.. ఆపైన వడగాడ్పులతో పొలాల్లో నేలపై ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ముసలీముతకా సమీప ఆలయాల అరుగుల పైనే తలదాచుకుంటున్నారు. కదిలిస్తే.. కన్నీరే... ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలే బయటపడుతున్నాయి. కన్నీటి పర్యంతమవుత తమ కష్టాలు ఏకరువు పెట్టడం కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, పొలం దస్తావేజులు తదితర విలువైన పత్రాలు కూడా కాలిపోయాయి. దీంతో ప్రభుత్వ సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు తాత్కాలిక రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకూ అందిన దాఖలాలు లేవు. ఆ ప్రక్రియ పురోగతిలో ఉందని తహశీల్దార్ బీఎల్ఎన్ రాజకుమారి చెబుతున్నారు. గృహనిర్మాణ శాఖ ద్వారా, ఐఏవై పథకం ద్వారా గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ నిధులు ఏ మూలకూ చాలవని బాధితులు చెబుతున్నారు. కనీసం ఫౌండేషన్ వరకైనా స్వచ్ఛంద సంస్థలు సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఆపన్నుల సాయం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. మరికొందరు దహనమైన ఇళ్లలో నివసిస్తే అరిష్టమనే ఆచారం ఉండటంతో కాలి బూడిదై మిగిలిన మొండి గోడల శిథిలాలను తొలగించి, వాటి స్థానంలో తాత్కాలిక పాకలు వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పశువులకూ తప్పని పాట్లు... అగ్నిప్రమాదం కారణంగా గ్రామస్తులతో పాటు పశువులకు కూడా కష్టాలు తప్పటం లేదు. పశువుల పాకలు, వరి గడ్డివాములు కూడా మంటల్లో ఆహుతవడంతో నీడ లేక, ఆహారం దొరకక అవి అలమటిస్తున్నాయి. సరైన నీడ లేకపోయినా.. పొలం గట్లపైనే పవువులను ఉంచుతూ అరకొర మేత వేస్తుండటంతో బక్కచిక్కిపోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం వరి గడ్డి రూ.2,500 నుంచి రూ.3 వేల మధ్య పలుకుతోంది. ఈ పరిస్థితిలో వరిగడ్డి కొనాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక, పశువులను మేపలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా దాణా, పశుగ్రాసం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇతోధికంగా సాయం చేస్తే గానీ గ్రామ పరిస్థితులు కొద్దిగానైనా మెరుగుపడే పరిస్థితి లేదు. కనీసం ఆహారం వండుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఉందంటే గ్రామ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు, అధికారులు చొరవ తీసుకుని సహాయ కార్యక్రమాలతో పాటు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తే గాని గ్రామంలో మునుపటి పరిస్థితి నెలకొనదు. ఆ పలకరింపులేవీ.. నిన్న, మొన్నటి వరకు ఆ గ్రామంలో ఎవరైనా ఎదురుపడితే ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలు ఉండేవి. బాబాయ్, అబ్బాయ్, మామయ్య, అల్లుడు.. అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆత్మీయంగా పలకరించుకునేవారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. గ్రామంలోని రెండు ఊర చెరువుల నుంచి వచ్చే ఫల సాయం ఎవరికి దక్కాలనే పంతం గ్రామంలో చిచ్చు పెట్టింది. తాజా అగ్నిప్రమాదం ఈ వివాదంలో భాగమేననే ఆరోపణలు ఒక వర్గం వారు చేస్తున్నారు. ఏదేమైనా స్నేహపూర్వక వాతావరణంలో కళకళలాడిన ఆ పల్లెలో నేడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.