ముంబై: కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకాలలో ఆధార్ సాయంతో పేర్ల నమోదుకు వీలు కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్‌పీలు) వద్ద ఈ సేవలకు సంబంధించి సదుపాయాన్ని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రారంభించారు.
ఎస్‌బీఐ కస్టమర్లు సీఎస్‌పీ వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.
అకౌంట్ పాస్‌బుక్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక భద్రత పొందేందుకు ఉన్న అడ్డంకులను ఈ నూతన సదుపాయం తొలగిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment