
అమెరికన్ బ్రాండ్ టెస్లా.. భారతదేశంలో ప్రవేశిస్తుందనే వార్త దేశీయ విఫణిలో కొంతమంది వాహన తయారీదారులను ఒకింత భయానికి గురి చేసింది. అయితే బీఎండబ్ల్యూ ఇండియా మాత్రం.. మాకు ఏమాత్రం భయం లేదని స్పష్టం చేసింది.
టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని బీఎండబ్ల్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ 'విక్రమ్ పవాహ్' స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ పోటీ ఉన్నప్పుడే.. ఆ విభాగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

టెస్లా కంపెనీ పోటీపై మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో మా ఉనికి ఉంది. ప్రతి ఏటా బీఎండబ్ల్యూ నమోదు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా ఆశాజనకంగానే ఉందని విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు. 2024లో బీఎండబ్ల్యూ గ్రూప్ నాలు లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు అమ్మకాలతో పోలిస్తే 13.5 శాతం ఎక్కువ.
ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్స్ రెండూ.. కూడా వరుసగా 3,68,523 యూనిట్లు.. 56,181 యూనిట్ల అమ్మకాలను సాధించాయని పవాహ్ చెప్పారు. 2025 జనవరి, మార్చి కాలంలో భారతదేశంలో కార్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,914 యూనిట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కూడా కంపెనీ అమ్మకాలలో వృద్ధి కనపరచడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.