BMW India
-
రూ.1.03 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కారు - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ ఎం2 కూపేను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 1.03 కోట్లు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపించే బీఎండబ్ల్యూ ఎం2 కూపే.. ఇప్పుడు సావో పాలో ఎల్లో, ఫైర్ రెడ్, పోర్టిమావో బ్లూ, స్కైస్క్రాపర్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎం వీల్స్ బ్లాక్ ఫినిషింగ్‌తో డబుల్ స్పోక్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఆప్షనల్ ఆల్కాంటారా ఫినిషింగ్ పొందుతుంది. ఇందులో ఐడ్రైవ్ సిస్టమ్‌తో కొత్త డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.అప్డేటెడ్ బీఎండబ్ల్యూ ఎం2 కారు 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ద్వారా 480 hp పవర్, 600 Nm టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన స్టాండర్డ్ M2 కూపే ఇప్పుడు 0-100kph వేగాన్ని 4 సెకన్లలో కవర్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 285 కిమీ/గం. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని స్పష్టమవుతోంది.Introducing the new avatar of unadulterated adrenaline. The new BMW M2 Coupé. #BMWIndia #BMWM #TheM2—————————————————The models, equipment, and possible vehicle configurations illustrated in the advertisement may differ from vehicles supplied in the Indian market. pic.twitter.com/dC701ZP66j— BMW India (@bmwindia) November 29, 2024 -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి. -
ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.గత ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్సర్ట్లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది. -
రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
నాగోలు: ఎల్బీనగర్లోని చింతల్‌కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్నాడు. ఎల్బీనగర్ చింతల్‌కుంట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్ (50)తో పాటు నగరానికి చెందిన పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే ఎల్బీనగర్ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతుర్ని చూసేందుకు వచ్చి.. చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్ కుమారుడు వినయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్‌లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్‌ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్‌లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
భారత్‌లో బీఎండబ్ల్యూ ఎం2 లాంచ్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎం2 స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.98 లక్షలు. రెండు డోర్లు, నాలుగు సీట్లను కలిగి ఉంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. బీఎండబ్ల్యూ ఎమ్2 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 460 hp పవర్ & 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 4.1 సెకన్లు, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 4.3 సెకన్లలో అందుకుంటుంది. -
లగ్జరీ కారును కొన్న సచిన్ టెండ్కూలర్.. ధర ఎంతంటే?
గాడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండ్కూలర్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి ఇంట్లో దాదాపు ఎనిమిది లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా సచిన్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. లేటెస్ట్ టాప్ వేరియెంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ 4.18 కోట్లగా ఉంది. ఈ కారు ఉరుస్ లైనప్‌లో వచ్చిన రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్ మోడల్ కంటే తక్కువ ధర. ఇక టెండూల్కర్ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్ 12 వోల్గ్స్(CS 12 Vlogs) అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. కాగా 2012 నుంచి ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి గ్యారేజీలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అదే విధంగా సచిన్‌కు మారుతి 800 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సచిన్ తన మెుట్టమెుదటి కారు ప్రయాణం మారుతి 800 తోనే ప్రారంభమైంది. 1989 లోనే సచిన్ ఈ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు
BMW Z4 Facelift: భారతదేశంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఖరీదైన కొత్త 'జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' కారుని విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఈ ఖరీదైన కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & డెలివరీ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' (BMW Z4 Roadster Facelift) ధర రూ. 89.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌తో ఇరువైపులా రీడిజైన్ చేసిన ట్రయాంగిల్ ఎయిర్ ఇన్టేక్స్, హెడ్‌ల్యాంప్, హనీకూంబ్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ వంటి వాటితో పాటి సైడ్ ప్రొఫైల్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, వెనుక వైపు దాదాపు దాని అవుట్గోయింగ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని ఫాబ్రిక్ రూఫ్-టాప్ కేవలం 10 సెకన్లలో ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది. (ఇదీ చదవండి: ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ & డెలివరీ వివరాలు) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఐడ్రైవ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్, డ్యూయల్ జోన్ ఏసీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, M స్పోర్ట్స్ సీట్లు, స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇది 2 డోర్స్ మోడల్. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) ఇంజిన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ ఇంజన్ 340 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది మార్కెట్లో 'పోర్స్చే 718 బాక్స్‌స్టర్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. This is sportiness turned up to the maximum. The ultimate embodiment of sheer driving pleasure, the new BMW Z4 lets you feel hallmark BMW sporting prowess as you make statements of undeniable athleticism at every moment behind the wheel.#BMW #TheNewZ4 #MaximumOfSportiness… pic.twitter.com/2iVrABywH7 — BMW India (@bmwindia) May 25, 2023 -
ఈ బీఎండబ్ల్యూ కారు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే - ధర ఎంతో తెలుసా?
లగ్జరీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'బీఎండబ్ల్యూ' (BMW) దేశీయ మార్కెట్లో ఒక కొత్త కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బీఎండబ్ల్యూ విడుదల చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 ఎమ్40ఐ'. ఈ SUV కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తుంది. కావున ఇది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్లలో లేదా, సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఎక్స్3 ఎమ్40ఐ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రూక్లిన్ గ్రే అండ్ బ్లాక్ సఫైర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎమ్ కిడ్నీ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో మ్యాట్రిక్స్ ఫంక్షన్ తో కూడిన అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మల్టీఫంక్షన్తో లెదర్ స్టీరింగ్ వీల్, కాంట్రాస్ట్ స్టిచింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్కమ్ లైట్ కార్పెట్, యాంబియంట్ లైటింగ్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్40ఐ 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 360 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కినీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఇక చివరగా ప్రధానమైనది సేఫ్టీ ఫీచర్స్, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డైనమిక్ బ్రేకింగ్ లైట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ మొదలైనవి ఉంటాయి. -
ఏకంగా రూ. 3 లక్షలు పెరిగిన ఎక్స్1 ప్రైస్ - కొత్త ధరలు ఇలా!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) 2023 ప్రారంభంలో ఎక్స్1 లగ్జరీ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన కేవలం మూడు నెలలకే కంపెనీ ఈ మోడల్ ధరలను భారీగా పెంచేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కొత్త ధరలు: 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు డీజిల్ వేరియంట్ ధరలు రూ. 3 లక్షల వరకు పెంచింది. కావున X1 sDrive 18d M Sport ధర రూ. 50.90 లక్షలు. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 47.50 లక్షలు. ఇక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, sDrive 18i xLine ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఇది రూ. 45.90 లక్షలకే అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కార్లను బుక్ చేసుకున్న వారికి కొద్ద ధరలు వర్తించవు. రానున్న రోజుల్లో బీఎండబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ కొనాలనుకునేవారు ఈ కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజైన్: దేశీయ మార్కెట్లో 2023 BMW X1 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్సర్ట్లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అట్రాక్టివ్ హెడ్‌ల్యాంప్, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక LED టెయిల్ ల్యాంప్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?) ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్: కొత్త ఎక్స్1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే చూడచక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్‌లు, కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, ADAS టెక్నాలజీ ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 136 హెచ్‌పి పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 150 హెచ్‌పి పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. BMW X1 పెట్రోల్ వెర్షన్ కేవలం 9.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, డీజిల్ ఇంజిన్ కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.03 కిమీ మైలేజ్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ లీటరుకు 19.23 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రత్యర్థులు: కొత్త 2023 ఎక్స్1 దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి క్యూ3, మినీ కంట్రీమ్యాన్, వోల్వో ఎక్స్‌సి 40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్‌లో బీఎండబ్ల్యూ హవా: మళ్ళీ కొత్త కారు లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని లాంచ్ చేసింది. ఇది ఎక్స్3 లైనప్‌లో చేరిన కొత్త వేరియంట్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతదేశంలో విడుదలైన కొత్త బీఎండబ్ల్యు ఎక్స్3 20డి ఎక్స్లైన్ (BMW X3 20d xLine) ధర రూ. 67.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారు ధర దాని మునుపటి అవుట్గోయింగ్ లగ్జరీ ఎడిషన్ ఎక్స్3 కంటే రూ. 20,000 ఎక్కువ. డిజైన్: బీఎండబ్ల్యు ఎక్స్3 ఎక్స్లైన్ కిడ్నీ గ్రిల్‌తో మునుపటి అదే స్టైలింగ్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్, వెనుక భాగం మొత్తం విస్తరించి ఉండే టెయిల్ లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఎక్స్టీరియర్ లైన్స్, రూఫ్ రైల్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: భారత్‌లో మసెరటి రూ. 3.69 కోట్ల సూపర్‌కార్ విడుదల - పూర్తి వివరాలు) ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్3 ఎక్స్లైన్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ కలిగి హెడ్స్-అప్ డిస్ప్లే, 3D వ్యూ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్-కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ & పనితీరు: కొత్త BMW X3 మోడల్ 2-లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. తద్వారా అద్భుతమైన పనితీరు లభిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 213 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బిఎండబ్ల్యు ఎక్స్3 కారు వోల్వో ఎక్స్‌సి60, ఆడి క్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కొత్త లగ్జరీ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్లో మాత్రమే లభిస్తుంది. -
దేశీయ మార్కెట్లో కొత్త జర్మన్ లగ్జరీ కారు: ధర రూ. 68.90 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ భారతీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు M స్పోర్ట్ రూపంలో 520d మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 68.90 లక్షలు. బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ 520డి విడుదల చేసిన సందర్భంగా 530డి ఎమ్ స్పోర్ట్, 520డి లగ్జరీ లైన్, 50 జహ్రే ఎమ్ ఎడిషన్లను నిలిపివేసింది. అయితే మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోడల్ స్పోర్టియర్ ఎక్ట్సీరియర్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ ఆప్రాన్లు, సైడ్ స్కర్ట్స్, గ్లోస్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బ్లూ బ్రేక్ కాలిపర్లు, క్రోమ్ ఎగ్జాస్ట్‌లతో కూడిన ఎమ్ స్పోర్ట్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డోర్ సిల్స్, ఫ్లోర్ మ్యాట్స్, స్పోర్ట్స్ సీట్లు, లెదర్ స్టీరింగ్ వీల్ వంటి వాటితో పాటు, లేజర్‌లైట్ టెక్నాలజీ, హెడ్స్-అప్ డిస్ప్లే, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: World's Richest Man: ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, మరెవరో తెలుసా?) కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్పి పవర్, 1750 - 2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది. -
బీఎండబ్ల్యూ కొత్త కారు.. అదిరే లుక్‌తో '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్'
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమజిన్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.57.9 లక్షల నుంచి ప్రారంభం. 2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.2 సెకన్లలో, డీజిల్ వేరియంట్ 7.6 సెకన్లలో అందుకుంటుంది. దేశీయ మార్కెట్లో BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ అనేది లాంగ్ వీల్ బేస్ కలిగి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 330Li పెట్రోల్, రెండోది 320Ld డీజిల్ వేరియంట్స్. కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 190 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇక 2.0 పెట్రోల్ ఇంజిన్ 258 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 15.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. దేశీయంగా ఈ కారును తయారు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
డైనమిక్ ఫీచర్లతో బీఎండబ్ల్యూ కొత్త బైక్స్, ధర తెలిస్తే షాక్!
సాక్షి,ముంబై: అంత్యంత ఖరీదైన బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ సిరీస్‌లో 2022 బైక్స్ మోడల్స్‌ను ఇండియా మార్కెట్లలో లాంచ్ చేసింది. లగ్జరీ బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 మోడల్స్ బైక్స్‌ని ప్రీమియం టూరింగ్ రేంజ్లో బీఎండబ్ల్యూ ఇండియా తీసుకొచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన కే 1600 గ్రాండ్ అమెరికా ధర రూ. 33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గాను, బేస్ వేరియంట్ ఆర్1250 ఆర్టీ ధరను రూ. 23.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గాను కంపెనీ నిర్ణయంచింది. R1250 RT, K 1600 బాగర్, K 1600 GTL, K 1600 గ్రాండ్ అమెరికా ఇలా నాలుగు వేరియంట్లలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభం. ఫ్రెష్ లుక్స్, డైనమిక్స్ ఫీచర్లతో పాటు, లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ బీఎండబ్ల్యూ ShiftCam లాంటి స్పెషల్ ఫీచర్లతో లాంగ్ హైవే రైడర్లకు స్మూత్ రైడింగ్ ఫీలింగ్ వస్తుందని కంపెనీ తెలిపింది. కే1600లో 6సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్ అమర్చింది.ఇది 6750 RPM వద్ద 160 HPని, 5250 RPM వద్ద 180 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇక R 1250 RT లో 1254 cc ఇంజీన్ 7750 RPM వద్ద 136 HP, 6250 RPM వద్ద 143 Nm శక్తిని అందిస్తుంది. బీఎండబ్ల్యూ కే-1600 GTL డ్రాగ్ టార్క్ కంట్రోల్ (డైనమిక్ ఇంజన్ బ్రేక్ కంట్రోల్), డైనమిక్ ESA పవర్‌ట్రెయిన్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కనెక్టివిటీ, కొత్త 10.25-అంగుళాల TFT కలర్ డిస్ప్లే అద్భుతమైన రీడబిలిటీ , స్పష్టమైన మెను నావిగేషన్, ఆడియో సిస్టమ్ 2.0 ఫీచర్‌ను జోడించింది. ఈ కొత్త బైక్స్ వివిధ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌ను సొంతం చేసుకున్న కస్టమర్లకు బీఎండబ్ల్యూ పలు ఆఫర్లు కూడా ఇస్తోంది. అన్ లిమిటెడ్ కిలీమీటర్లు, 3 సంవత్సరాల పాటు ప్రామాణిక వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365-రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ లాంటివి ప్రకటించింది. -
బీఎండబ్ల్యూ కొత్త స్పోర్టీ బైక్ : ఇంతకంటే తక్కువ ధరలో మరే బైక్ లేదట!
సాక్షి, ముంబై: బీఎండబ్ల్యూ ఎఫర్డ్బుల్ ప్రైస్‌లో సరికొత్త బైక్‌ను భారత మార్కెట్లో శుక్రవారం లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్ఆర్ పేరుతో ఈ సూపర్ బైక్స్ మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్కనునుగుణంగా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్తో ఆకర్షణీమైన రంగుల్లో తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ జీ310 ఆర్, జీఎస్ అడ్వెంచర్ టూరర్ తర్వాత 310 సిరీస్‌లో బవేరియన్ బ్రాండ్‌కు సంబంధించి మూడో మోడల్ ఇది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించిన కంపెనీ నెలకు రూ. 3,999ల ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను వెనుక టెయిల్-ల్యాంప్లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్‌తో పాటు, రీడిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ప్రధానంగా ఉన్నాయి. ఈ బైక్‌లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని, 7,700 rpm వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. ఇందులో రైడ్ , డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లున్నాయి. మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్210, కేటీఎం ఆర్సీ 390 లాంటి బైక్స్‌కి పోటీగా నిలవనుంది. Reveal your racing attitude with the first-ever BMW G 310 RR. Ex-showroom prices start at INR 2.85 Lakhs. Also available at an attractive EMI of INR 3,999 per month*. #BMWMotorradIndia #BMWMotorrad #BMWG310RR #G310RR #BMWG310RRBookingsOpen #NewLaunch #RevealYourRacingAttitude pic.twitter.com/whJ1QDSoDJ — BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 15, 2022 -
వీటికి క్రేజ్ ఎక్కువే, భారతీయులు ఎక్కువగా కొంటున్న లగ్జరీ కార్లివే!
మనదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, ఫలితంగా డెలివరీ సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఓ ఆటోమొబైల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గతేడాది నుంచి కొన్ని నెలల వ్యవధిలోనే సి అండ్ డి సెగ్మెంట్లో రూ .70-75 లక్షలకు పైగా ఉన్న కార్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆ విభాగంలో వాల్యూమ్-సెగ్మెంట్ కార్ల విభాగంలో వృద్ధి సాధించినట్లు" ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పిటిఐకి చెప్పారు. "ముఖ్యంగా ఈసెగ్మెంట్ కార్లను (వ్యాపార వేత్తలు, స్పోర్ట్స్ పర్సన్లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు) కొనుగోలు చేస్తున్నారని, తద్వారా వీటి డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. ఆడి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రాన్ కార్ సేల్స్‌ను ఉదాహరించిన ధిల్లాన్.."మేం కోటిరూపాయలకు పై కేటగిరీలో ఉన్న కార్లను అమ్ముతున్నాం. ఆ కార్లు భారత్‌కు రాకముందే అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.." జీఎల్ఎస్, జీఎల్ఇ (ఎస్యూవీ)ను భారతీయులు కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల పాటు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడ లగ్జీర కార్లను కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నట్లు చెప్పారు. 2022మొదటి త్రైమాసికంలో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్లను పొందింది. గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో కోటి ధర పైగా ఉన్న 2వేల టాప్ఎం డ్ కార్లను అమ్మింది.వీటిలో ఎస్-క్లాస్ మేబాచ్, జీఎల్ఎస్ మేబాచ్, టాప్ ఎండ్ ఏఎంజీ, ఎస్ క్లాస్, జీఎల్ఎస్ ఎస్‌యూవితో సహా ఈ కార్ల కంపెనీ మొత్తం వార్షిక అమ్మకాలలో 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో హై ఎండ్ సెగ్మెంట్ వాల్యూమ్ 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండ బ్ల్యూ కూడా దాని ప్రీమియం వాహనాల వేగవంతమైన పెరుగుదలను చూస్తోంది. 'ఎస్ఏవీ (స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్)- ఎక్స్3, ఎక్స్4, ఎక్స్7 మోడళ్లు బాగా అమ్ముడుపోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు . మేం ఆ విభాగంలో 80 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాము. మా పోర్ట్‌ఫోలియోలో 50 శాతానికి పైగా వినియోగదారులు ఉన్నారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా అన్నారు. బీఎం డబ్ల్యూ ఇండియా ఎస్ఎవి సెగ్మెంట్లో 40శాతం వృద్ధితో రూ.61 లక్షలకు పైగా ధరలతో, మొదటి త్రైమాసికంలో 1,345 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది . 3నెలల వెయిటింగ్ పిరియడ్‌లో కంపెనీ కాంపాక్ట్ లగ్జరీ కారు మినీతో సహా మొత్తం 2,500 కార్లను వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు. చదవండి👉అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే! -
హల్చల్ చేస్తోన్న బీఎండబ్ల్యూ నయా కార్...! ధర ఎంతంటే..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్4 సిల్వర్ షాడో ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.71.9 లక్షల నుంచి ప్రారంభం. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 252 హెచ్‌పీ పవర్‌తో 2 లీటర్ ఇంజన్, 6.6 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ 265 హెచ్‌పీ పవర్‌తో 3.0 లీటర్ ఇంజన్, 5.8 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం చేరుకుంటుంది. బుకింగ్స్ ప్రారంభ అయినట్టు కంపెనీ ప్రకటించింది. చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!
కొత్తగా కారు కొనాలనుకునే వారికి లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ శ్రేణి కారు ధరలను 3.5 శాతం వరకు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది. మెటీరియల్, లాజిస్టిక్స్ ఖర్చులు, ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావం, మారకం రేట్ల ప్రభావం వల్ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు జర్మన్ ఆటోమేకర్ ఒక ప్రకటనలో తెలిపింది. 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, ఎమ్ 340ఐ, 5 సిరీస్, 6 సిరీస్ గ్రాన్ టురిస్మో, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్ 3, ఎక్స్ 4, ఎక్స్ 5, ఎక్స్ 7, మినీ కంట్రీమ్యాన్ కార్లతో సహా స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను కంపెనీ విక్రయిస్తుంది. బీఎండబ్ల్యూ డీలర్ షిప్ కేంద్రాలలో 8 సీరిస్ గ్రాన్ కూపే, ఎక్స్ 6, జెడ్4, ఎమ్2 కాంపిటీషన్, ఎమ్5 కాంపిటీషన్, ఎమ్8 కూపే,ఎక్స్ 3ఎమ్, ఎక్స్ 5ఎమ్ కార్లను కూడా అమ్మకాలు జరుపుతుంది. బీఎండబ్ల్యూ గ్రూప్'కు 100 శాతం సబ్సిడరీ అయిన బీఎండబ్ల్యూ ఇండియా ప్రధాన కార్యాలయం గురుగ్రామ్'లో ఉంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!) -
బీఎండబ్ల్యూ నుంచి బ్లాక్షాడో
BMW X4In India: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ తాజాగా ఎస్యూవీ కూపే ఎక్స్4 కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పెట్రోల్ వేరియంట్ ధర రూ. 70.5 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ రూ. 72.5 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుందని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసీ)గా వ్యవ హరించే కారులో డిజైన్పరంగా మెరుగుపర్చడంతో పాటు మరిన్ని విడిభాగాలు, కొత్త ఫీచర్ల ను కూడా చేర్చినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. దేశీయంగా చెన్నై ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేసినట్లు ఆయన వివరించారు. ’బ్లాక్ షాడో’ ఎడి షన్ పేరిట పరిమిత సంఖ్యలో ఈ మోడల్ లభిస్తుందన్నారు. డీజిల్ వేరియంట్ 5.8 సెకన్లలో, పెట్రోల్ వేరియంట్ 6.6 సెకన్లలో గంటకు 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. -
బీఎండబ్ల్యూకి భారీ షాక్..వెంటనే డ్రైవింగ్ ఆపేయండి,షెడ్డుకు లక్షల కార్లు!
ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకి భారీ షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా బీఎండబ్ల్యూ వెహికల్స్‌లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా 1.03 మిలియన్ వెహికల్స్‌ను రీకాల్ చేస్తున్నట్లు బీఎండబ్ల్యూ అధికారికంగా తెలిపింది. 2017నుంచి బీఎండబ్ల్యూ ఇప్పటి వరకు రెండు సార్లు తమ కార్లను రీకాల్ చేసింది. తాజాగా 2006 నుంచి 2013 మధ్య కాలంలో తయారు చేసిన కార్లతో పాటు 1సిరీస్, 3సిరీస్, ఎక్స్ 3, 5సిరీస్, ఎక్స్ 5, జెడ్ 4 మోడల్ కార్లు ఉన్నాయి. పాజిటివ్ క్రాంక్కేస్ వెంటిలేషన్ వాల్వ్ (పీసీవీ) కోసం హీటర్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినా.. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. డ్రైవింగ్ చేయడం ఆపండి కొత్తగా రీకాల్ చేసిన కార్లు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో 917,106, కెనడాలో 98,000, దక్షిణ కొరియాలో 18,000 వాహనాలు ఉన్నాయని బీఎండబ్ల్యూ వెల్లడించింది. గతంలో 2017లో 740,000, 2019లో 184,000 వాహనాల్ని రీకాల్ చేయగా..తాజాగా భారీ ఎత్తున కార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం తాము తయారు చేస్తున్న కొత్తకార్లకి, రీకాల్ చేసిన కార్లకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తాజా రీకాల్‌కు సంబంధించి ఎలాంటి ప్రమాదాలు లేదా గాయాల గురించి తమకు తెలియదని, రీకాల్ పరిష్కారానికి సంబంధించి యజమానులు డ్రైవింగ్‌ను ఆపాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం నుండి పొగ లేదా పొగ వాసన లేదా ప్లాస్టిక్ మండే వాసన కనిపించినట్లయితే వెంటనే డ్రైవింగ్ చేయడం ఆపేయాలని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది. చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..! -
బీఎండబ్ల్యూ నుంచి ఎస్యూవీ కారు.. దుమ్మురేపే స్పీడు..
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్3 ఎస్‌యూవీని గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలుగా ఉంది. స్థానికంగా తయారయ్యే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2–లీటర్ ఫోర్–సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 235 కిలో మీటర్ల వేగం ప్రయాణించగలదు. బీఎండబ్ల్యూ ఎక్స్ 3కి సంబంధించి డీజిల్ మోడల్‌ను తర్వలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ‘‘మిడ్–సైజ్ స్పోర్ట్ యాక్టివిటీ వెహికల్(ఎస్ఏవీ) విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బీఎండబ్ల్యూ ఎక్స్3ని ప్రవేశపెట్టాము. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, డ్రైవింగ్ పనితీరు కస్టమర్లకు సరికొత్త అనూభూతినిస్తాయి’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. చదవండి: దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు -
బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఎన్నడూలేని విధంగా 2021లో రికార్డుస్థాయిలో వాహనాల అమ్మకాలను జరిపినట్లు బీఎండబ్ల్యూ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీగా పెరిగిన అమ్మకాలు..! 2021 భారత్‌లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. మినీ కూపర్స్ కూడా అధికమే..! బీఎండబ్ల్యూ వాహనాల్లో మినీ కూపర్స్ కూడా భారత్‌లో అత్యధిక ఆదరణను నోచుకున్నాయి. 2021లో 640 యూనిట్ల మినీ కూపర్ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5 వాహనాలు భారీగా అమ్ముడైనాయి. వీటితో పాటుగా బీఎండబ్ల్యూ ఎమ్ 340ఐ ఎక్స్డిజైర్, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ 3 సిరీస్ వాహనాల కోసం కొనుగోలుదారులు నెలల తరబడి వేచి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
బీఎండబ్ల్యూ దండయాత్ర.. 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో రాబోయే 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే 30 రోజుల్లో తన ఫ్లాగ్ షిప్ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యువి కారుని మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. దీని తర్వాత మినీ ఎలక్ట్రిక్ కారును రాబోయే మూడు నెలల్లో లాంఛ్ చేయనుంది. చివరగా ఐ4 సెడాన్ కారును 2022 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. 425 కిలోమీటర్ల రేంజ్ మొదటి లాంచ్ చేయనున్నఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యువి కారుని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఈ కారు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 6.1 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకుంటుంది. డిసెంబర్ మొదటి వారం నాటికి బీఎండబ్ల్యూ ఐఎక్స్ కారును లాంచ్ చేయనున్నట్లు కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. దీని తర్వాత మినీ ఎలక్ట్రిక్ లాంఛ్ చేయనున్నారు. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. చివరగా, ఐ4 సెడాన్ కారును 2022 మొదటి అర్ధభాగంలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. (చదవండి: టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!) బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ కారుతో పాటు 11కెడబ్ల్యు ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అందిస్తుంది. దీని ద్వారా రెండున్నర గంటలు ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వెళ్లనుంది. 35 నగరాల్లో గల బీఎండబ్ల్యూ డీలర్ షిప్ కేంద్రాల్లో 50కెడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్లను కూడా ఇన్ స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ వారం ప్రారంభంలో బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయడానికి పన్ను ప్రోత్సాహకలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. టెస్లా, హ్యుందాయ్ వంటి కంపెనీలు పన్ను ప్రోత్సాహకలను ఇవ్వాలని గతంలో కేంద్రాన్ని కోరారు. -
‘మేడ్ ఇన్ ఇండియా’ బీఎమ్‌డబ్ల్యూ కార్‌పై ఓ లుక్కేయండి..!
Made In India BMW 530i M Sport Carbon Edition Launched: ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా కొత్త బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ ‘కర్బన్ ఎడిషన్’ కారును ఆవిష్కరించింది. ఈ కారును చెన్నై ప్లాంట్‌లో బీఎమ్‌డబ్ల్యూ ఉత్పత్తి చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలుదారులు ఈ కారును బుక్ చేసుకోవచ్చును. భారత మార్కెట్లో బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ కర్బన్ ఎడిషన్ ధర రూ. 66,30,000 (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. చదవండి: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎమ్జీ ఆస్టర్..! కార్ ఫీచర్స్ ..! కర్బన్ ఎడిషన్ మోడల్ 5 సిరీస్ మోడల్లో కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ వ్యూ మిర్రర్స్, రియర్ బూట్ లిడ్ స్పాయిలర్ లాంటివి కర్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. . అంతేకాకుండా 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను అమర్చారు. ఈ కారుకు ఆల్ఫైన్ వైట్ పెయింట్ వర్క్‌ను జోడించారు. కార్ ఇంటిరీయర్స్ విషయానికి వస్తే...బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్డ్ స్పోర్ట్ సీట్స్‌తో కారు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 16-స్పీకర్, 464-వాట్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 4జోన్ టెంపరేచర్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాలను కారులో అమర్చారు. ఇంజిన్ విషయానికి వస్తే..! బీఎమ్‌డబ్ల్యూ స్టాండర్డ్ 530i ఎమ్ స్పోర్ట్ మోడల్ ఇంజిను కొత్త కార్బన్ ఎడిషన్ వెర్షన్లో కూడా అమర్చారు. 1998సీసీ సామర్థ్యంతో ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 8-స్పీడ్ స్పోర్ట్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఇంజిన్ 248 బీహెచ్పీ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. చదవండి: Facebook: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!