Sachin Tendulkar buys Lamborghini Urus S, adds super SUV to swanky collection - Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: లగ్జరీ కారును కొన్న సచిన్‌ టెండ్కూలర్‌.. ధర ఎంతంటే?

Published Fri, Jun 2 2023 12:09 PM | Last Updated on Fri, Jun 2 2023 12:57 PM

Sachin Tendulkar buys Lamborghini Urus S, adds super SUV to swanky collection - Sakshi

గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్‌ టెండ్కూలర్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యే‍కంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి ఇంట్లో దాదాపు ఎనిమిది లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా సచిన్‌ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. లేటెస్ట్‌ టాప్ వేరియెంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ ఎగ్జరీ  కారును సచిన్‌ కొనుగోలు చేశాడు.

లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ 4.18 కోట్లగా ఉంది. ఈ కారు ఉరుస్ లైనప్‌లో వచ్చిన రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్‌ మోడల్‌ కంటే తక్కువ ధర. ఇక టెండూల్కర్‌ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్‌ 12 వోల్గ్స్‌(CS 12 Vlogs) అనే యూట్యూబ్‌ ఛానల్‌ షేర్‌ చేసింది.

కాగా 2012 నుంచి ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి గ్యారేజీలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అదే విధంగా సచిన్‌కు మారుతి 800 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సచిన్ తన మెుట్టమెుదటి కారు ప్రయాణం మారుతి 800 తోనే ప్రారంభమైంది. 1989 లోనే సచిన్ ఈ కారును కొనుగోలు చేశాడు.  ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement