మనదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, ఫలితంగా డెలివరీ సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఓ ఆటోమొబైల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
గతేడాది నుంచి కొన్ని నెలల వ్యవధిలోనే సి అండ్ డి సెగ్మెంట్లో రూ .70-75 లక్షలకు పైగా ఉన్న కార్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆ విభాగంలో వాల్యూమ్-సెగ్మెంట్ కార్ల విభాగంలో వృద్ధి సాధించినట్లు" ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పిటిఐకి చెప్పారు.
"ముఖ్యంగా ఈసెగ్మెంట్ కార్లను (వ్యాపార వేత్తలు, స్పోర్ట్స్ పర్సన్‌లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు) కొనుగోలు చేస్తున్నారని, తద్వారా వీటి డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. ఆడి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రాన్ కార్ సేల్స్‌ను ఉదాహరించిన ధిల్లాన్.."మేం కోటిరూపాయలకు పై కేటగిరీలో ఉన్న కార్లను అమ్ముతున్నాం. ఆ కార్లు భారత్‌కు రాకముందే అమ్ముడుపోతున్నట్లు చెప్పారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.." జీఎల్ఎస్, జీఎల్ఇ (ఎస్‌యూవీ)ను భారతీయులు కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల పాటు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడ లగ్జీర కార్లను కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నట్లు చెప్పారు. 2022మొదటి త్రైమాసికంలో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్‌లను పొందింది.
గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో కోటి ధర పైగా ఉన్న 2వేల టాప్ఎం డ్ కార్లను అమ్మింది.వీటిలో ఎస్-క్లాస్ మేబాచ్, జీఎల్ఎస్ మేబాచ్, టాప్ ఎండ్ ఏఎంజీ, ఎస్ క్లాస్, జీఎల్ఎస్ ఎస్‌యూవితో సహా ఈ కార్ల కంపెనీ మొత్తం వార్షిక అమ్మకాలలో 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో హై ఎండ్ సెగ్మెంట్ వాల్యూమ్ 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండ బ్ల్యూ కూడా దాని ప్రీమియం వాహనాల వేగవంతమైన పెరుగుదలను చూస్తోంది. 'ఎస్ఏవీ (స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్)- ఎక్స్3, ఎక్స్4, ఎక్స్7 మోడళ్లు బాగా అమ్ముడుపోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు . మేం ఆ విభాగంలో 80 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాము. మా పోర్ట్ఫోలియోలో 50 శాతానికి పైగా వినియోగదారులు ఉన్నారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా అన్నారు.
బీఎం డబ్ల్యూ ఇండియా ఎస్ఎవి సెగ్మెంట్‌లో 40శాతం వృద్ధితో రూ.61 లక్షలకు పైగా ధరలతో, మొదటి త్రైమాసికంలో 1,345 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది . 3నెలల వెయిటింగ్ పిరియడ్‌లో కంపెనీ కాంపాక్ట్ లగ్జరీ కారు మినీతో సహా మొత్తం 2,500 కార్లను వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు.
చదవండి👉అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే!
Comments
Please login to add a commentAdd a comment