Audi
-
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
కొత్త సంవత్సరం వాహన ధరలు పెంపు.. ఎంతంటే..
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అన్ని మోడళ్ల ధరలను 2025 జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చుల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.‘స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి కంపెనీతోపాటు డీలర్ భాగస్వాములకు ఈ దిద్దుబాటు అవసరం. మా విలువైన కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 వంటి మోడళ్లను భారత్‌లో ఆడి విక్రయిస్తోంది. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు కూడా జనవరి నుంచి రేట్లు పెంచనున్నాయి.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!బీఎండబ్ల్యూ మోటోరాడ్ ధరలు ప్రియంవాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 జనవరి 1 నుండి అన్ని మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలను సవరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
వచ్చే ఏడాదిపై ఆడి కంపెనీ ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెలిపింది. సరఫరా అంతరాయాలతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ పనితీరుకు ఆటంకం కలిగింది. 2024 మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొన్న సరఫరా సవాళ్ల నుండి కోలుకుని వచ్చే సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం పెరుగుతాయని ఆడి అంచనా వేస్తోంది.‘భారత్‌లో 2024లో లగ్జరీ కార్ల పరిశ్రమ వృద్ధి 8–10 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ సైతం ఇదే విధమైన వృద్ధిని ఆశిస్తోంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. గత మూడేళ్లలో భారీ వృద్ధిని కనబరిచిన తర్వాత పరిశ్రమ విక్రయాల వృద్ధి క్షీణించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో పరిశ్రమ వృద్ధి దాదాపు 5 శాతంగా ఉంది. గత మూడేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధిని సాధించిందని తెలిపారు. అత్యధిక వార్షిక విక్రయాలు.. లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలు 50,000 యూనిట్ల మార్కును దాటుతుందని విశ్వసిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మొదటి రెండు త్రైమాసికాల్లో కార్ల సరఫరా తగినంతగా లేనందున 2024 ఆడి ఇండియాకు కఠిన సంవత్సరంగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది ఎదగలేమని, వచ్చే సంవత్సరం బలంగా తిరిగి పుంజుకుంటామని వివరించారు.కాగా, ఎస్యూవీ క్యూ7 కొత్త వెర్షన్‌ను సంస్థ పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటి వరకు భారత్‌లో 10,000 యూనిట్లకు పైగా క్యూ7 మోడల్ కార్లను విక్రయించింది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్‌ను కలిగి ఉండాలనే కస్టమర్ల నిరంతర కోరిక ఇందుకు నిదర్శనమని ధిల్లాన్ పేర్కొన్నారు. క్యూ7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.88.66 లక్షల నుంచి ప్రారంభం. -
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10వేల అడుగుల ఎత్తునుంచి కిందపడి
ఆడి ఇటలీ అధినేత 'ఫాబ్రిజియో లాంగో' (Fabrizio Longo) ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు.ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. పర్వతాలను ఎక్కే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదం జరిగింది. తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు, వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్ రిట్రీవల్ బృందం తదుపరి పరీక్ష కోసం అతని మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటనే దిశగా విచారణ జరుగుతోంది.ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తరువాత 2002లో లాన్సియా బ్రాండ్‌కు నాయకత్వం వహించారు. 2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు. -
లాంచ్‌కు సిద్ధమవుతున్న జర్మన్ బ్రాండ్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్‌ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 14.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్‌లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
భారత్‌లో ఆడి కొత్త క్యూ8
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో కొత్త క్యూ8 విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.17 కోట్లు. 8 స్పీడ్ టిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్, 48వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.6 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, లేజర్ టెక్నాలజీతో డైనమిక్ ఇండికేటర్స్‌తో హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 17 స్పీకర్స్‌తో బీఅండ్వో ప్రీమియం 3డీ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆడి వర్చువల్ కాక్‌పిట్, రెడ్ బ్రేక్ కాలిపర్స్‌తో ఆర్21 గ్రాఫైట్ గ్రే అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కాగా, ఆడి 15 ఏళ్లలో భారత్‌లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. -
భారత్‌లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.Make heads turn as you drive the new Audi Q7 Bold Edition.*Terms and conditions apply. European model shown. Accessories and equipment shown may not be currently offered in India. Bold Edition is available on select variants and select colours only.#AudiQ7 #BoldEdition pic.twitter.com/5hQZVQpQXL— Audi India (@AudiIN) May 21, 2024 -
భారత్‌లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్‌పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ ఇన్‌టేక్ సరౌండ్‌లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
కెనడాలో భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. గుర్తు తెలియని దుండగలు అతడిపై కాల్పులు జరిపినట్లు సౌత్ వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి తమకు సమాచరం వచ్చిందని చెప్పారు. బాధితుడు చిరాగ్ ఆంటిల్(24)గా గుర్తించారు అధికారులు. వాంకోవర్ పోలీసులు ఇంకా అనుమానితులని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. అగంతకుల ఆచూకీకై దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి సోదరుడు రోనిత్ ఉదయం చిరాగ్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను మాట్లాడానని చెప్పాడు. అయితే అతడు ఆడి కారు తీసుకుని ఎక్కడకో వెళ్లాడు. అప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదనగా చెప్పాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ విషాదకర ఘటనపై తక్షణమే స్పందించి.. దర్యాప్తు వేగంవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయాలని ఎక్స్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు చౌదరి. కాగా, చిరాగ్ కుటుంబం అతడి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక చిరాగ్ యాంటిల్ సెప్టెంబరు 2022లో వాంకోవర్‌కి వచ్చారు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్ పర్మిట్ పొందాడని అన్నారు. (చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!..!) -
వచ్చేఏడాది ప్రముఖ కంపెనీ నుంచి 20 కొత్త మోడళ్లు
జర్మనీ వాహన సంస్థ ఆడి వచ్చే ఏడాది చివరి వరకు పలు మార్కెట్లలో 20 కొత్త మోడళ్లు తీసుకురానుందని కంపెనీ సీఈఓ గెర్నాట్ డాల్నెర్ తెలిపారు. 2027కు ప్రధాన విభాగాలను పూర్తిగా విద్యుత్‌కు మార్చాలని కంపెనీ భావిస్తోంది. 2024-28 మధ్య మూలధన వ్యయాలుగా 41 బిలియన్ యూరోలు (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) వెచ్చించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇంటర్నెల్ కంబస్టన్ ఇంజిన్ల అభివృద్ధి, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర విభాగాలపై 11.5 బిలియన్ యూరోలు, బ్యాటరీ విద్యుత్ వాహనాలు, డిజటలీకరణలపై 29.5 బిలియన్ యూరోలను సంస్థ ఖర్చు చేయనుంది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారత్‌లో విద్యుత్తు కార్ల తయారీని చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆండ్రే వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ కంపెనీలు భారత్‌లో ఈవీలను ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్‌లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో
సాధారణంగా ధనవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది దీనికి భిన్నంగా పొలంగా వ్యవసాయం చేస్తారు, రోడ్డుపై కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెరైటీ ఫార్మర్ (variety_farmer) అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన ఆకుకూర అమ్మడం చూడవచ్చు. ఈ వీడియో చూడగానే కొందమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజమే. ఆధునిక కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు వీడియోలో కనిపించే వ్యక్తి. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఆడి కారులో వచ్చి ఒక దుకాణం ముందు ఆగాడు. ఆ తరువాత అక్కడే పక్కన ఉన్న ఆటో రిక్షా వద్దకు వెళ్లి ఆకు కూరని రోడ్డుపక్కన ప్లాస్టిక్ షీట్ మీద వేస్తాడు. మొత్తం అమ్మేసిన తరువాత ప్లాస్టిక్ షీట్ మడిచి ఆటోలో పెట్టుకుని మళ్ళీ తన కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ యువ రైతు పేరు సుజిత్. కేరళకు చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఆవార్డులను కూడా అందుకున్నాడు. యితడు అందరు రైతుల మాదిరిగానే వ్యవసాయం ప్రారంభించి కరంగా పురోగతి సాధించాడు. వచ్చిన లాభాలతోనే ఆడి కారు కొన్నట్లు తెలిపాడు. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. View this post on Instagram A post shared by variety farmer (sujith) (@variety_farmer) -
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు క్యూ8 ఇ-ట్రాన్ విడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు ధరలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ప్రారంభ ధరలు రూ. 1.14 కోట్లు నుంచి రూ. 1.18 కోట్లు వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారు కోసం రూ. 5 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ 55 వేరియంట్లు 114 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. లోయర్-స్పెక్ 50 వేరియంట్స్ 95 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. ఈ రెండూ వరుసగా 350 అండ్ 408 హార్స్ పవర్ డెలివరీ చేస్తాయి. రేంజ్ విషయానికి వస్తే 50 వేరియంట్స్ 491 కిమీ (SUV) నుంచి 505 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు.. 55 వేరియంట్స్ 582 కిమీ (SUV) నుంచి 600 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు ఉంటాయని తెలుస్తోంది. ఆడి క్యూ8 ఇ-ట్రాన్ 22 కిలోవాట్ ఏసీ & 170 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన ఇక డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్రిల్ బ్లాక్ సరౌండ్‌లతో కొత్త మెష్ డిజైన్ కలిగి, ట్వీక్డ్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఇందులో 2డీ లోగో చూడవచ్చు. ఫ్రంట్ ఇప్పుడు గ్లోస్ బ్లాక్‌లో పూర్తయింది, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్ దాదాపు దాని ముకుప్టి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం 10.1 ఇంచెస్ స్క్రీన్, HVAC కోసం 8.6 ఇంచెస్ స్క్రీన్ లభిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త జర్మన్ కారు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది బీఎండబ్ల్యూ ఐఎక్స్, జాగ్వార్ ఐ-పేస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
లగ్జరీ కార్ల సేల్స్ బీభత్సం.. ఏ వెహికల్‌ను ఎక్కువగా కొన్నారంటే
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్‌తో పోలిస్తే 97% ఎక్కువ. సుమారు 47,000 యూనిట్లు.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్‌లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్‌లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు. రికార్డులు బ్రేక్ అవుతాయి.. ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు. 2030 నాటికి రెండింతలు.. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్‌లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు. -
ఆగష్టులో విడుదలయ్యే కొత్త కార్లు ఇవే!
Upcoming Cars: జులై నెల దాదాపు ముగిసింది. ఇక రెండు రోజుల్లో ఆగష్టు నెల రానుంది. అయితే ఆ నెలలో (ఆగష్టు) విడుదలయ్యే కొత్త కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది.. ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ కంపెనీకి చెందిన మైక్రో ఎస్యువి త్వరలో సీఎన్జీ రూపంలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టింది. గత కొంత కాలంలో ఇది టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. కావున ఈ కారు ఆగష్టు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెకండ్ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్సీ (Second-gen Mercedes-Benz GLC) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2023 ఆగష్టు 09న తన సెకండ్ జనరేషన్ జిఎల్సీ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తాహముగా అరంగేట్రం చేసిన ఈ కారు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. ఆధునిక కాలంలో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ లభించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron) జర్మనీ బ్రాండ్ కంపెనీ అయిన ఆడి కూడా ఆగష్టు 18న తన క్యూ8 ఈ-ట్రాన్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, రియర్ బంపర్ వంటి వాటిని కలిగిన ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 600 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ టయోటా రూమియన్ (Toyota Rumion) మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లు ఏవైన ఉన్నాయంటే అందులో 'టయోటా' కూడా ఉంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో అందుబాటులో ఉన్న ఈ ఎంపివి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 103 హార్స్ పవరే, 137 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. రానున్న రోజుల్లో ఇది సీఎన్జీ రూపంలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడన్ కంపెనీకి చెందిన వోల్వో కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కంపెనీకి చెందిన రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ఆగస్ట్‌లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్‌కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్‌లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్‌లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్!
న్యూఢిల్లీ: ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్లకు చార్జింగ్ పాయింట్ల వివరాలను అందుబాటులో ఉంచడంపై లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. మైఆడికనెక్ట్ యాప్‌లో ’చార్జ్ మై ఆడి’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది చార్జింగ్ పాయింట్లకు అగ్రిగేటర్‌గా పనిచేస్తుంది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు దీనికోసం ఆర్గో ఈవీ స్మార్ట్, చార్జ్ జోన్, రీలక్స్ ఎలక్ట్రిక్, లయన్చార్జ్, జియోన్ చార్జింగ్ అనే అయిదు పార్ట్నర్లతో జట్టు కట్టింది. దీంతో ఈ–ట్రాన్ యజమానులకు 750 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తాము వెళ్లే రూట్లో ఉండే పాయింట్ల సమాచారం ముందుగా తెలిస్తే కస్టమర్లు తమ ప్రయాణ ప్రణాళికలను వేసుకునేందుకు సులువవుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఆడి ఇండియా ప్రస్తుతం ఈ–ట్రాన్ శ్రేణిలో 50, 55, స్పోర్ట్‌బ్యాక్, జీటీ మొదలైన వాహనాలను విక్రయిస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
మీకు తెలుసా.. ఈ ఆడి కార్ల ధరలు పెరగనున్నాయ్!
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన జర్మన్ బ్రాండ్ 'ఆడి' 2023 మే 01 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలు వచ్చే నెల ప్రారభం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్ఎస్ 5, ఎస్ 5 ధరలు ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా వచ్చే నెల ప్రారంభం నుంచి మరో రెండు మోడల్స్ ధరలు పెరుగుతాయి. ఆడి కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ వివిధ స్థాయిలలో ధరల ప్రభావాన్ని కస్టమర్ల మీద పడకుండా చూడటానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ధరలను పెంచాల్సిన అవసరం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడళ్ల ధరలను ఏప్రిల్ 01 నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెంచింది. -
‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మనం ఇప్పటివరకు టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ సాధించిన ఎంబీయే చాయ్‌వాలా, బీటెక్ అమ్మాయి..బుల్లెట్ బండిపై పానీ పూరీ అమ్మిన స్టోరీలు చదివాం కదా. తాజాగా 'ఆడి చాయ్‌వాలా' హాట్‌టాపిక్‌గా నిలిచాడు.విలాసవంతమైన కారులో రోడ్డు పక్కన టీ అమ్ముతున్న వ్యక్తికి చెందిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆశిష్ త్రివేది అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో లగ్జరీ వైట్ ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని చూడవచ్చు.కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇదో స్మార్ట్ పద్ధతి అనుకున్నాడో ఏమోకానీ ఖరీదైన కారులో టీ అమ్మడం విశేషంగా మారింది. అయితే ఆడి చాయ్‌వాలా ఇన్వెంటివ్ మార్కెటింగ్ వ్యూహం అంటూ యూజర్ల కమెంట్ చేశారు. ఇంకొంత మంది ఈఎంఐ కవర్ చేయడానికి టీ విక్రయిస్తున్నాడని ఒకరు, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో మెర్సిడెస్-బెంజ్ జీ వాగన్‌ను కొనాలకి ఇంకొకరు, టీ అమ్మి ఆడి కారును కొనుగోలు చేశారా? లేక ఆడి కారు కొన్నాక టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా అని మరికొందరు, చాయ్ అమ్మి దేశ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియోకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, 3,లక్షల 72 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by A S H I S H T R I V E D I (@ashishtrivedii_24) -
ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్ లాంచ్ చేసిన ఆడి: ధర, ప్రత్యేకతలు
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లాంచ్ చేసింది. ఇది ఎల్, ఎస్, ఎమ్ అనే మూడు సైజుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 8,900 యూరోలు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7.69 లక్షలు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆవిష్కరణల్లో భాగంగానే ఈ ఎలక్ట్రిక మౌంటెయిన్ బైక్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైకులో ఇటలీకి చెందిన ఫాంటిక్ మోటార్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం జరిగింది. ఇది ఆడి ఆర్ఎస్ క్యూ ఈ-ట్రాన్ ఆధారంగా రూపొందించబడింది, అంతే కాకుండా ఈ మోడల్ 2022 డేకర్ ర్యాలీ నాలుగు స్టేజెస్‌లో విజయం సాధించింది. (ఇదీ చదవండి: Kia Niro: మగువలు మెచ్చిన కారు.. 2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత) ఆడి ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 720kWh బ్యాటరీ ప్యాక్ బూస్ట్, ఎకో, స్పోర్ట్, టూర్ అనే నాలుగు సైక్లింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని ఎకో మోడ్ మాగ్జిమమ్ రేంజ్లో ప్రయాణించడానికి, స్పోర్ట్ మోడ్ స్పోర్టీ సైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ హ్యాండిల్ బార్ మీద ఉన్న డిజిటల్ డిస్ప్లేలో స్పీడ్, బ్యాటరీ లెవెల్ వంటి వాటిని చూడవచ్చు. -
లగ్జరీ ఫీచర్లతో ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: బుకింగ్స్ షురూ!
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్‌బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2.0లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్‌తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్‌లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్ ఇండియా, హోండా కార్స్ తెలిపాయి. -
క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైక్రో బ్లాకింగ్ సైట్లో ప్రకటనలు నిలిపివేస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ ట్విటర్లో చెల్లింపు ప్రకటనలను నిలిపివేయగా, తాజాగా మరిన్ని కంపెనీలు ఈ రేస్‌లో దూసు కొస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా బ్లూటిక్ ఫీజు, ఖర్చులను తగ్గించుకునే పనిలో సగంమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ట్విటర్‌కు తాజా పరిణామాలు భారీ షాకిస్తున్నాయి. ఇదీ చదవండి: ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్? ట్విటర్ టేకోవర్ తరువాత యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మస్క్ బూస్ట్ ఇస్తున్నప్పటికీ ఓరియోస్, ఆడి కూడా ప్రకటనలను ఆపివేస్తున్నట్టు ప్రకటించాయి. సీఈఓ డిర్క్ వాన్ డి పుట్ మంగళవారం రాయిటర్స్ న్యూస్‌మేకర్ ఇంటర్వ్యూలో ఓరియోస్ తయారీదారు మోండెలెజ్ ట్విటర్లో తన ప్రకటనలను ఆపివేసినట్లు తెలిపారు. మస్క్ సొంతమైన తరువాత ట్విటర్లో ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల పరిమాణం గణనీయంగా పెరిగిందని పుట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం తమ ప్రకటనలపై చూపనుందనీ, ఈ ప్రమాదం తగ్గేంతవరకూ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) గత వారం, కంటెంట్ ఫిల్టరింగ్‌పై ఆందోళనల కారణంగా ప్రకటనదారులు ట్విటర్ యాడ్స్నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్, జనరల్ మిల్స్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి ఆఫ్ అమెరికా, జనరల్ మోటార్స్ లాంటి అనేక ముఖ్యమైన కంపెనీలు ప్రకటనలను నిలిపి వేశాయి. గిలియడ్ సైన్సెస్, దాని విభాగం కైట్ కూడా ఇదే ప్రాసెస్‌లో ఉన్నట్ట ప్రకటించింది. -
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్...స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ప్రైస్!
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్‌యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్‌యూవీలో స్పెషల్ ఎడిషన్‌ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో జోడించింది. అలాగే ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్‌తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. (ట్విటర్‌కు సవాల్: టాప్-...0 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!) అంతేకాదురెండు స్పెషల్ కలర్స్‌తో (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేక ధరతో,పరిమితి కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇంజీన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తోంది. ఇది 249 hpపవర్‌ను, 370Nm టార్క్‌ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్‌తో అడాప్టివ్ సస్పెన్షన్‌ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి ఆరు డ్రైవ్ మోడ్స్‌లో ఇది లభ్యం. సింగిల్ గ్రిల్లే, వర్టికల్, స్ట్రట్స్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్‌లైట్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్‌తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్స్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో ఖరీదైన లెదర్, లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్‌తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది. 755 వాట్స్ అవుట్‌పుట్‌తో 3D సౌండ్ ఎఫెక్టస్తో 19 స్పీకర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే సపోర్ట్‌తో 25.65 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లాంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి. ధరలు: ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్) ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్) ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 66,21,000 (ఎక్స్-షోరూమ్) -
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...
ఇటీవల యువత చాలా అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఐతే ఇక్కడోక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వరడుకి కేవలం పెళ్లి ఊరేగింపుకే రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకో తెలుసా! వివరాల్లోకెళ్తే....ముజఫర్నార్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం వరుస లగ్జరీ అడీ కార్లలతో సందడి చేసింది. వరుడు అతని స్నేహితుల బృందం టాప్‌లెస్ కారులో డ్యాన్స్‌లు చేశారు. మరికొంతమంది కారు కిటికిలోంచి వేలాడుతూ సెల్పీలు తీయడం వంటి పనులు చేశారు. ఐతే ఇలాంటి స్టంట్లు తోటి ప్రయాణికుల భద్రతను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేస్తూ అంకిత్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. అతను ట్విట్టర్లో... తాను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తున్న సమయంలో.. ముజఫర్ నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గ్రహిస్తారని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు పెళ్లి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఊరేగింపులో ఉపయోగించిన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కారు యజమానులపై రూ. 2 లక్షలు జరిమాన విధించారు కూడా. ➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही। ➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO — MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022 (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
కొత్త కారు కొన్న మెగా కోడలు ఉపాసన, ధరెంతో తెలుసా?
Upasana Buy Brand New Luxury Car Video Viral: మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో షేర్ చేసుకుంంటుంటారామె. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ను పంచుకున్నారు ఉపాసన. తాను సూపర్ లగ్జరీ ఆడి కొత్త కారు కొన్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఈ మేరకు ఉపాసన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరిస్తూ ఆమె వీడియోను వదిలారు. ‘నా దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉండటమే. నా ఈ ఆడి ఈ-ట్రాన్(Audi E-Tron) ఆ రెండింటిని కలిగి ఉంది. అత్యాధునిక సౌకర్యాలను కలిగిన ఈ లగ్జరీ ఆడి కారు ఎంతో సురక్షితమైంది’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా ఉపాసన కొన్న ఈ లగ్జరి ఆడి ఈ-ట్రాన్ కారు ధర దాదాపు కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని సమాచారం. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వీటికి క్రేజ్ ఎక్కువే, భారతీయులు ఎక్కువగా కొంటున్న లగ్జరీ కార్లివే!
మనదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, ఫలితంగా డెలివరీ సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఓ ఆటోమొబైల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గతేడాది నుంచి కొన్ని నెలల వ్యవధిలోనే సి అండ్ డి సెగ్మెంట్లో రూ .70-75 లక్షలకు పైగా ఉన్న కార్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆ విభాగంలో వాల్యూమ్-సెగ్మెంట్ కార్ల విభాగంలో వృద్ధి సాధించినట్లు" ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పిటిఐకి చెప్పారు. "ముఖ్యంగా ఈసెగ్మెంట్ కార్లను (వ్యాపార వేత్తలు, స్పోర్ట్స్ పర్సన్లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు) కొనుగోలు చేస్తున్నారని, తద్వారా వీటి డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. ఆడి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రాన్ కార్ సేల్స్‌ను ఉదాహరించిన ధిల్లాన్.."మేం కోటిరూపాయలకు పై కేటగిరీలో ఉన్న కార్లను అమ్ముతున్నాం. ఆ కార్లు భారత్‌కు రాకముందే అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.." జీఎల్ఎస్, జీఎల్ఇ (ఎస్యూవీ)ను భారతీయులు కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల పాటు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడ లగ్జీర కార్లను కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నట్లు చెప్పారు. 2022మొదటి త్రైమాసికంలో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్లను పొందింది. గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో కోటి ధర పైగా ఉన్న 2వేల టాప్ఎం డ్ కార్లను అమ్మింది.వీటిలో ఎస్-క్లాస్ మేబాచ్, జీఎల్ఎస్ మేబాచ్, టాప్ ఎండ్ ఏఎంజీ, ఎస్ క్లాస్, జీఎల్ఎస్ ఎస్‌యూవితో సహా ఈ కార్ల కంపెనీ మొత్తం వార్షిక అమ్మకాలలో 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో హై ఎండ్ సెగ్మెంట్ వాల్యూమ్ 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండ బ్ల్యూ కూడా దాని ప్రీమియం వాహనాల వేగవంతమైన పెరుగుదలను చూస్తోంది. 'ఎస్ఏవీ (స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్)- ఎక్స్3, ఎక్స్4, ఎక్స్7 మోడళ్లు బాగా అమ్ముడుపోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు . మేం ఆ విభాగంలో 80 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాము. మా పోర్ట్‌ఫోలియోలో 50 శాతానికి పైగా వినియోగదారులు ఉన్నారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా అన్నారు. బీఎం డబ్ల్యూ ఇండియా ఎస్ఎవి సెగ్మెంట్లో 40శాతం వృద్ధితో రూ.61 లక్షలకు పైగా ధరలతో, మొదటి త్రైమాసికంలో 1,345 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది . 3నెలల వెయిటింగ్ పిరియడ్‌లో కంపెనీ కాంపాక్ట్ లగ్జరీ కారు మినీతో సహా మొత్తం 2,500 కార్లను వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు. చదవండి👉అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే! -
అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్ వీల్ బేస్, 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తామన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2021లో ఆడి ఇండియా రెండింతల అమ్మకాలతో 3,293 యూనిట్లు నమోదు చేసింది. సంస్థ ఈ ఏడాది ఇప్పటికే రూ.80 లక్షల ఎక్స్‌షోరూం ధరతో క్యూ7 ఎస్యూవీ కొత్త వర్షన్ ప్రవేశపెట్టింది. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, 'ఆడీ' కి షాక్!
కోల్‌కతా: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా గతేడాది దేశవ్యాప్తంగా 3,293 యూనిట్లను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 101 శాతం వృద్ధి అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ‘లగ్జరీ కార్ల విపణిలో తొలి స్థానంపై గురి పెట్టడం లేదు. సుస్థిర వ్యాపార విధానం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అయిదు ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో పరిచయం చేశాం. 2025 నాటికి అంతర్జాతీయంగా మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఈవీ విభాగం ఉండాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం నాలుగు ఇంటర్నల్ కంబషన్ (ఐసీ) కార్ల తయారీని భారత్‌లో చేపడుతున్నాం. 2033 నాటికి ఐసీ కార్ల విక్రయాలు నిలిపివేస్తాం. 2026 నుంచి నూతన తరం మోడళ్లన్నీ ఎలక్ట్రిక్ మాత్రమే ఉంటాయి. ఉక్రెయిన్ నుంచి చాలా విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నందున సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది’ అని వివరించారు. డీజిల్ కార్ల అమ్మకాలను 2020 ఏప్రిల్ నుంచి కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం పెట్రోల్, ఈవీ మోడళ్లు మాత్రమే విక్రయిస్తోంది. లగ్జరీ కార్ల రంగంలో దేశంలో మూడవ స్థానంలో కంపెనీ నిలిచింది. -
వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఆడి ‘క్యూ7 ఎస్యూవీ’ కొత్త వెర్షన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర క్యూ7 ప్రీమియం ప్లస్ రూ.79.99 లక్షలు, క్యూ7 టెక్నాలజీ రూ.88.33 లక్షలు ఉంది. 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 8 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. రూ.5లక్షలు చెల్లించి కార్ బుక్ చేసుకోవచ్చు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని ఆడి ప్రతినిధులు వెల్లడించారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!
ముంబై: గత కొద్ది రోజుల నుంచి టెస్లా కంపెనీని తమ రాష్ట్రంలో అంటే.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయలని అనేక రాష్ట్రాల మంత్రులు పోటీ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, మహారాష్ట్రకు చెందిన ఈ మంత్రి మాత్రం.. టెస్లా కంపెనీకి అనుకూలంగా ఒక లేఖను కేంద్రం మంత్రికి రాశారు. మహారాష్ట్ర పర్యాటక & పర్యావరణ మంత్రి ఆదిత్య థాక్రే వచ్చే నెల ప్రారంభంలో సమర్పించనున్న రాబోయే కేంద్ర బడ్జెట్ 2022-23లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. థాక్రే రాసిన లేఖలో ఇలా ఉంది.. "టెస్లా, రివియన్, ఆడీ, బిఎమ్‌డబ్ల్యు వంటి దిగ్గజ సంస్థలకు రిటైల్ అమ్మకం కోసం దిగుమతి కస్టమ్స్ సుంకల మీద కాలపరిమితితో కూడిన రాయితీ రేటు ఇవ్వాలి. ఇది మార్కెట్లో డిమాండ్ పెంచడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సహకరిస్తుంది. అమ్మకాలు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే, ఇలాంటి దిగ్గజ కంపెనీల నాయకత్వాన్ని అనుసరించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొన్నారు. రాయితీ రేటు గరిష్టంగా మూడు సంవత్సరాలు ఇవ్వాలని, భారతదేశంలో ప్రపంచ ప్రమాణాలను పాటించే ఎలక్ట్రిక్ వాహనలను మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. I have written to the Hon’ble Finance Minister of India Smt. Nirmala Sitharaman ji a few humble suggestions to give a boost to the Electric Mobility revolution in India. pic.twitter.com/MstdI20oke — Aaditya Thackeray (@AUThackeray) January 19, 2022 40 శాతం డిస్కౌంట్ కావాలి భారతదేశంలో ఇతర దేశాలలో తయారు చేసిన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా చూస్తుంది. కానీ, మన దేశంలో దిగుమతి పన్నులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని గతంలో మస్క్ చెప్పారు. టెస్లా బేసిక్ మోడల్ 3 కారు ధర $39,990(సుమారు రూ.30 లక్షలు). విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. ఈ సుంకల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. -
ఎంట్రీ లెవల్లో ఆడి నుంచి మరో సరికొత్త కారు..! ధర ఎంతంటే..!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లలోకి మరో సరికొత్త కారును లాంచ్ చేసింది. ఏ4 సెడాన్ శ్రేణిలో ఆడి ఏ4 ప్రీమియం ఎంట్రీ లెవల్ కారును భారత్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు భారత్‌లో రూ. 39.99 లక్షలకు రానుంది(ఎక్స్‌షోరూం). ఆడి ఏ4 శ్రేణిలో ఇప్పుడు మూడు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. ప్రీమియం, ప్రీమియం ప్లస్, ఆడి ఏ4 టెక్నాలజీతో రానున్నాయి. కస్టమర్లకు ఐదు రకాల బాహ్య రంగులతో, రెండు రకాల ఇంటీరియర్ రంగులను ఎంచుకోనే వీలును ఆడి కల్పిస్తుంది. కారు ఫీచర్స్..! ఆడి ఏ4 ప్రీమియమ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌ను అమర్చారు. ఎల్ఈడీ వెనుక కాంబినేషన్ లైట్లు, గ్లాస్ సన్‌రూఫ్, ఆడి సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్, వైర్లెస్ ఛార్జింగ్, పార్కింగ్ ఎయిడ్ ,రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆడి డ్రైవ్ సెలెక్ట్, 25.65 సెం.మీ సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో రానుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కల్గి ఉంది. దీనిలో క్రూజ్ కంట్రోల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే..! ఆడి ఏ4 ప్రీమియం కారు రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ కారు 190 హెచ్‌పీ శక్తిని, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అత్యధిక అమ్మకాలు..! ఆడి ఏ4 ప్రీమియం కారు విడుదల సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ.. జనవరిలో ఏ4 విడుదలైనప్పటి నుంచి భారీ ఆదరణ లభిస్తోందని తెలిపారు. తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో ఇదే అత్యధికంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన మోడల్‌తో మరింత మంది వినియోగదారులు ఆడి వైపు మొగ్గుచూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు! -
కార్ల రేట్లు రయ్..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు. ‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. 2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు.. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్ఈ 400, జీఎల్ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది. ఆడి 3 శాతం వరకూ.. అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు.. కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు. -
అదిరిపోయిన ఆడి క్యూ5.. బీఎండబ్ల్యూ ఎక్స్3కి పోటీగా!
ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్లరీ కార్ల తయారీ సంస్ల ఆడి ఈరోజు భారతదేశంలో ఆడి క్యూ5ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల క్రితం బిఎస్ 6 నిబంధనల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి వైదొలగిన క్యూ5 ఫేస్ లిఫ్ట్ ఎస్యువి కారు కొత్త అవతారంలో తిరిగి వచ్చింది. కంపెనీ 2021 ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ఎస్‌యువిని రూ. 58.93 లక్షల(ఎక్స్ షోరూమ్)కు, ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 63.77 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇప్పటికే వినియోగదారులు వందకు పైగా యూనిట్లు బుక్ చేసినట్లు, డెలివరీలు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆడి ధృవీకరించింది. ఆడి క్యూ5 ఎస్యువి కారు బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ జిఎల్ సి, వోల్వో ఎక్స్ సీ60 వంటి కార్లకు పోటీనిస్తుంది. భారతదేశంలో ఐసీఈ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త క్యూ5 దోహదపడుతుందని ఆడి భావిస్తోంది. దీనిలో 2.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 249 బిహెచ్పీ శక్తిని, 370 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇది క్వాటో ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ, డంపర్ కంట్రోల్‌తో సస్పెన్షన్ సిస్టమ్ మెరుగైన డ్రైవ్ డైనమిక్లతో వస్తుంది. నిలువు స్టట్లతో కూడిన సింగిల్ఫ్రేమ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్లు, ఎల్ఈడీ లైట్లు, ఆడి క్యూ-5కి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. (చదవండి: ‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’) ఆడి పార్క్ అసిస్ట్, సెన్సార్ కంట్రోల్డ్ బూట్ లిడ్ ఆపరేషన్‌తో కూడిన కంఫర్ట్ క్హీ ఆడి ఎక్స్‌క్లూజివ్ పియానో బ్లాక్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ఫ్లస్, 19 స్పీకర్ B&0 ప్రీమియం 3డీ సౌండ్ సిస్టమ్‌తో సహా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్ & కనెక్టివిటీ, వైర్లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఆడి ఫోన్ బాక్స్, MMI టచ్‌తో MMI నావిగేషన్ ఫ్లస్ సిస్టమ్ ఇందులో ఉంది. అడి డ్రైవ్ సెలెక్ట్ సౌకర్యం, డైనమిక్, వ్యక్తిగత, ఆటో, సామర్థ్యం, ఆఫ్-రోడ్‌తో సహా బహుళ మోడ్‌లను అందిస్తుంది. భద్రత కోసం వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ ఎస్యువి కారు గంటకు 237 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.ఎఆర్ఎఐ సర్టిఫై చేసిన ప్రకారం లీటరుకు 17.01 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) -
అదిరే 'ఆడి'..ఇండియన్ మార్కెట్లో మరో సూపర్ ఎలక్ట్రిక్ కార్
లగ్జరీ బ్రాండ్ ఆడి సరికొత్త ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి రీలీజ్ చేసింది. టెస్లాకార్లకు పోటీగా ఈ కారు ఎస్యూవీ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,79,90,000లుగా స్పోర్ట్స్ మోడల్ ధర రూ. 2.05 కోట్లుగా ఆడి నిర్ణయించింది. ఆడి సంస్థ తమ ఈవీ కారుని ఎస్యూవీ, స్పోర్ట్స్ బ్యాక్ మోడళ్లలో మార్కెట్లోకి తెస్తోంది. ఈ రెండు మోడళ్లలో స్టాండర్డ్, ఆర్ఎస్ వేరియంట్లు ఉన్నాయి ఈ ట్రాన్ కార్లలో 93 కిలోవాట్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని అమర్చారు. స్టాండర్డ్ వేరియంట్లో ఒక్క సారి ఛార్జ్ చేస్తేఏ 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆర్ఎస్ వేరియంట్ 481 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఆర్ఎస్ ఈట్రాన్ కారు 637 బీహెచ్పీతో 830ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. స్టాండర్డ్ ఈ ట్రాన్ 523 బీహెచ్పీతో 630 ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. 3.3 సెకండ్ల నుంచి 4.1 సెకన్ల వ్యవధిలో గంటలకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు 2025 కల్లా ఇండియా ఈవీ మార్కెట్లో 25 శాతం మార్కెట్ వాటాని ఆడి లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.04 కోట్లు. 450 హెచ్‌పీ పవర్‌తో 2.9 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 జోన్ ఎయిర్కండీషనింగ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ వంటివి పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. కంపెనీ పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తోంది. -
ఆడి.. ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ–ట్రాన్ శ్రేణిలో మూడు రకాల పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. వీటిలో ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్–55 మోడళ్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.99.99 లక్షల నుంచి రూ.1.18 కోట్ల వరకు ఉంది. ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్–55 మోడళ్లకు 300 కిలోవాట్ పవర్, 664 ఎన్ఎం టార్క్‌తో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్‌ను బిగించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటాయి. ఇందులోని 95 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే 359–484 కిలోమీటర్ల వరకు కారు ప్రయాణిస్తుంది. 230 కిలోవాట్ డ్యూయల్ మోటార్‌తో ఈ–ట్రాన్ 50 మోడల్ రూపుదిద్దుకుంది. దీనిలోని 71 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో వాహనం 264–379 కిలోమీటర్లు వెళ్తుంది. అంతర్జాతీయంగా 2025 నాటికి 20 రకాల ప్యూర్ ఎలక్ట్రిక్, 10 రకాల ప్లగ్–ఇన్ హైబ్రిడ్ మోడళ్లను పరిచయం చేయాలన్నది ఆడి లక్ష్యం. వీటిలో కొన్ని భారత్‌లోనూ అడుగుపెట్టనున్నాయి. -
మార్కెట్లోకి నయా ఆడి ఎలక్ట్రిక్ కారు వేరియంట్లు..! ధర ఎంతంటే
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు ఆడి భారత విపణిలోకి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లు ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు రకాల బాడీ స్టైల్స్‌తో ఆడి కస్టమర్లకు అందించనుంది. తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మల్టీపుల్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన లగ్జరీ కార్ల సంస్థగా ఆడి నిలిచింది. ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ-ట్రోన్50, ఈ-ట్రోన్55, ఈ-ట్రోన్55 స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఆడి ఈ-ట్రోన్50 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99 లక్షలు, ఈ-ట్రోన్55 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.1కోట్లు, ఈ-ట్రోన్55 స్పోర్ట్‌బ్యాక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ కార్లు 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. -
ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా?
వెబ్‌డెస్క్: లగ్జరీ కార్లలో ఆడిది ప్రత్యేక స్థానం. రాబోయే ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఆడి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ కార్లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మాత్రమే కొత్త మోడళ్లు తేవాలన్నది ఆ సంస్థ వ్యూహంగా ఉంది. ఈ మేరకు జర్మన్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 2026 వరకే ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ ప్రతీ ఏడు ఓ కొత్త మోడల్ని మార్కెట్లోకి ఆడి రిలీజ్ చేస్తోంది. ఆడిని ప్రమోట్ చేస్తోన్న వోక్స్వ్యాగన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆడిని పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కే పరిమితం చేసే విధంగా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్‌కు సంబంధించి చివరి మోడల్ని 2026లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత మరో పదేళ్ల పాటు డిజీల్, పెట్రోల్ ఇంజన్ వెహికల్స్‌కి సర్వీస్ అందివ్వనుంది. అనంతరం పూర్తిగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్ నుంచి తప్పుకోవడం ఖాయమని తేల్చి చెబుతోంది ఆడి యాజమాన్యం. ఇప్పటికే కంబస్టర్ ఇంజన్ తయారీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చును గణనీయంగా తగ్గించింది. ఓన్లీ ఈవీ వోక్స్వ్యాగన్ నుంచి ఎంట్రీ, మిడ్ రేంజ్ కార్లు వివిధ పేర్లతో మార్కెట్‌కి వస్తుండగా.... లగ్జరీ విభాగంలో ఆడీ, హై ఎండ్ విభాగంలో పోర్షే, స్పోర్ట్స్ సెక్షన్లో లాంబోర్గిని కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఆడిని పూర్తి స్థాయి ఈవీ కార్ల తయారీకే వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆడి నుంచి ఈ ట్రోన్, ఈ ట్రోన్ స్పోర్ట్ బ్యాక్, క్యూ 4 ఈ ట్రోన్, ఈ ట్రోన్ జీటీ కార్లను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో తెచ్చింది. ఇందులో ఈ ట్రోన్ పేరుతో కొత్త ఈవీ లగ్జరీ కారుని ఇండియా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. చదవండి : స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ
వెబ్‌డెస్క్ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి నుంచి ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఈ ట్రోన్ పేరుతో తొలి ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌కి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో క్రమంగా అన్ని మేజర్ కార్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ ట్రోన్ పేరుతో ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారుని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది ఆడి సంస్థ. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర ఎంతనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే పోర్షే, వోల్వో, లాండ్ రోవర్ సంస్థలు కూడా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం! -
ఆడి నయా వర్షన్ అదరహో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ సెడాన్ కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది. భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ను 2017 లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్5 నయా మోడల్ అప్డేటెడ్ వర్షన్‌గా రానుంది. దీని ధర రూ. 79.06 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మరింత ఆకర్షణీయమైన ఔటర్ డిజైనే కాకుండా, అప్డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. కార్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే , ప్రస్తుత డిజైన్ స్పోర్టి లూక్‌తో రానుంది. ట్వీక్డ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, అంతేకాకుండా షార్ప్‌గా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటుగా , డే టైమ్ రన్నింగ్ లైట్లతో( డిఆర్ఎల్) అమర్చారు. క్వాడ్-టిప్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు ఇంటిరియల్స్లో భాగంగా 10 అంగుళాల టచ్ స్క్రీన్ రానుంది. కారుకు 354 హార్స్‌పవర్‌ను అందించగల 3.0-లీటర్ ట్విన్-టర్బో, వి 6 పెట్రోల్ ఇంజన్ తో పాటు వస్తోంది. దీంతో కారుకు 500 ఏన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తోంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా 8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది. ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జి సి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 ఎఎమ్‌జి, బీఎండబ్ల్యూ ఎం 340 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5 పోటీపడనుంది. (చదవండి: బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే? ) -
2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్
"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్ గేరు!) ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ. ఇది 592 బిహెచ్పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో) మసెరటి లెవాంటే లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్యూవీ ఇది. ఈ ఎస్యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది. -
ఇండియాలో ‘ఆడి’కి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌కు చెందిన మరో సంస్థ ఆడికు దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. నోయిడా నివాసి ఒకరు కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులపైనా తాజాగా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదైంది. (ఆడి కొత్తకారు వచ్చేసింది) కాలుష్య నివారణకు సంబంధించి, ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే మోసపూరిత పరికరాలతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2018లో కోట్ల రూపాయల విలువైన ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. డెలివరీ సమయంలో, భారతదేశంలో చీట్ డివైసెస్ గురించి తాను విచారించానని, అయితే అలాంటి దేమీ లేదని చెప్పి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతించిన పరిమితుల కంటే ఆడికార్లలో 5-8 రెట్లు ఉన్నాయని తేలడంతో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఫోక్స్ వ్యాగన్‌పై 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో తాను మేల్కొన్నాని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ పరికరాలతో ఉద్దేశ పూర్వకంగానే ఈ కంపెనీలు తనను మోసం చేశాయని, తన కష్టార్జితాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాల్సింగా సింగ్ డిమాండ్ చేశారు. కాగా ఫోక్స్ వ్యాగన్ గ్లోబల్ ఉద్గార నిబంధనల ఉల్లంఘన కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో దేశంలో తాజా కేసు నమోదు కావడం గమనార్హం. పరిమితికి మించి 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేసే పరికరాలను కార్లలో అమర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్‌లో విడుదల చేసిన డీజిల్ కార్లలో ‘చీట్ డివైజ్’ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ఎన్జీటీ గత ఏడాది మార్చిలో ఫోక్స్ వ్యాగన్‌కు 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్
ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ ఆడి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ పేరుతో అందిస్తున్న ఈ ఐదు సీట్ల కారు ధర రూ.1.94 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు కోసం బుకింగ్స్‌ను గత నెల 23నే ప్రారంభించామని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలుపెడతామని ఆడి ఇండియా తెలిపింది. వీ8 ట్విన్–టర్బో 4–లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకోగలదని పేర్కొంది. మెర్సిడెస్–ఏఎమ్‌జీ ఈ 63 ఎస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కార్లకు ఈ కొత్త ఆడి కారు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆడి కొత్తకారు వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారును గురువారం లాంచ్ చేసింది. ప్రారంభ ధర 1.94 కోట్ల రూపాయలతో భారత మార్కెట్లలో విడుదల చేసింది. జూన్ 23 నుంచి ప్రీబుకింగ్‌లను ఆరంభించామనీ, వచ్చే నెలలో ప్రారంభమవుతాయని ఆడి ఇండియా తెలిపింది. వినియోగదారులు ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. 5 సీట్ల సెకండ్ జనరేషన్ కొత్త ఆర్ఎస్ 7 కారులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి 8 పెట్రోల్ ఇంజీన్ అమర్చింది. టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ హార్ట్ ఇంజిన్ 600 బీహెచ్పీ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తమ కొత్త ఆడి ఆర్ఎస్7 కేవలం 3.6 సెకన్లలో గంటకు 100 కి.మీ వరకు వేగం పుంజుకుంటుందని ఆడిఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటించారు. తన వినియోగదారుల కోసం ఉత్తేజకరమైన ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామన్నారు. కొత్త ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మెర్సిడెస్-ఎఎమ్‌జి ఇ 63 ఎస్, బీఎండబ్ల్యూ ఎం 5 వంటి వాటికి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు. మొదటి తరం ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ను భారతదేశంలో 2015 లో ఆడి లాంచ్ చేసింది. Wild and untamed yet elegant and poised. Introducing the all-new #AudiRS7 Sportback. #PerformanceIsAnAttitude pic.twitter.com/tyuwor6SWk — Audi India (@AudiIN) July 16, 2020 -
ఆడికార్లపై కళ్లు చెదిరే ఆఫర్..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్‌లోభాగంగా ఐకానిక్ మోడల్స్‌పై ఈ తగ్గింపును అందిస్తోంది. ఆడి పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది. 2009 లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది. ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. ఆఫర్ కింద రూ .49.99 లక్షలకే లభ్యం. తగ్గింపు రూ. 5.81 లక్షలు క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభ్యం. క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అసలు ధర ధర రూ .78.01 లక్షలు. తగ్గింపు రూ .6.02 లక్షలు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు బహుళ ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం కాగా స్టాక్ కొనసాగే వరకు కొనసాగుతుందని ఆడి తెలిపింది. -
‘ఆడి క్యూ7, ఏ4’ నూతన ఎడిషన్లు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తాజాగా తన ఎస్యూవీ క్యూ7, సెడాన్ ఏ4 మోడళ్లలో ‘లైఫ్ స్టైయిల్’ పేరుతో నూతన వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆడి క్యూ7 లైఫ్ స్టైయిల్ ఎడిషన్ ధర 75.82 లక్షల రూపాయిలు కాగా, ఏ4 లైఫ్ స్టైయిల్ ఎడిషన్ ధర 43.09 లక్షల రూపాయిలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారి మాట్లాడుతూ.. ‘ఏ6 మోడల్‌కు లైఫ్ స్టైయిల్ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేశాక మా వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. నూతన వేరియంట్లకు బలమైన డిమాండ్ దక్కింది. ఈ ప్రేరణతో తాజాగా మరో రెండు నూతన వేరియంట్లను విడుదలచేశాం’ అని అన్నారు. -
ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్యూ5’లో పెట్రోల్ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.55.27 లక్షలు. కొత్త వేరియంట్లో 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ‘క్యూ5 పెట్రోల్ ఇంజిన్ హార్స్పవర్ 252. ఇది గరిష్టంగా గంటకు 237 కిలోమీటర్లు వెళ్తుంది. 0– 100 వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది’ అని ఆడి ఇండియా తెలిపింది. ఇక ఇందులో ఆల్–వీల్ డ్రైవ్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ క్యూ5 డీజిల్ వేరియంట్‌ను తీసుకువచ్చింది. -
ఆడి సీఈవో స్టాడ్లర్ అరెస్టు
ఫ్రాంక్ఫర్ట్: ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ వాహనాల ఉద్గారాల వివాద కేసులో జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఆడి సీఈవో రూపర్ట్ స్టాడ్లర్ అరెస్టయ్యారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్టాడ్లర్ నివాసంలో సోదాలు నిర్వహించిన వారం రోజుల వ్యవధిలోనే అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నియంత్రణ సంస్థలను, వినియోగదారులను మోసపుచ్చేలా.. కాలుష్యకారక వాయువుల పరిమాణాన్ని తగ్గించి చూపే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్ తమ డీజిల్ కార్లలో అమర్చిందనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్వేర్ అమర్చడం నిజమేనంటూ ఆడికి మాతృసంస్థయిన ఫోక్స్‌వ్యాగన్ 2015లో అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆడి ఇంజినీర్లే అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ స్కామ్‌తో ఫోక్స్‌వ్యాగన్ దాదాపు 25 బిలియన్ యూరోల మేర బైబ్యాక్, నష్టపరిహారాలు, జరిమానాల రూపంలో కట్టుకోవాల్సి వచ్చింది. -
ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరెస్ట్
జర్మనీ లగ్జరీ కారు తయారీదారి ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపెర్ట్ స్టాడ్లర్ అరెస్ట్ అయ్యారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడి సొంతమైన ఫోక్స్‌వాగన్ అధికార ప్రతినిధి రూపెర్ట్ అరెస్ట్‌ను సోమవారం ధృవీకరించారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. ఫోక్స్‌వాగన్ కర్బన్ ఉద్గారాల స్కాండల్‌లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డారని రూపెర్ట్పై విచారణ కొనసాగుతోంది. మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచిన 2,10,000 డీజిల్ ఇంజిన్ కార్లను ఆడి 2009 నుంచి అమెరికా, యూరప్‌లలో విక్రయించిందని ఆ కంపెనీపై పెద్ద ఎత్తున్న ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే తమ 60వేల ఏ6, ఏ7 మోడల్స్‌ను మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నట్టు కంపెనీ ఒప్పుకుంది కూడా. ఈ మోసపూరిత ఆరోపణలు, అక్రమ ప్రొడక్ట్ ప్రమోషన్లపై ఈ లగ్జరీ కారు తయారీదారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఈ మోసంలో ఆడి సీఈవో రూపెర్ట్ పాత్ర ఉందని మునిచ్ న్యాయవాదులు జూన్ 13న ప్రకటించారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా జరిపారు. 1994 నుంచి రూపెర్ట్ ఫోక్స్‌వాగన్-ఆడిలో పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆడిలో టాప్ మేనేజ్మెంట్ స్థానంలో ఉన్నారు. -
ఇంట్లోనే కారులో పడుకున్న డ్రైవర్..!
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు చోరీ కేసులో ఆసక్తికరమైన ట్విస్టు వెలుగుచూసింది. యువన్‌శంకర్‌రాజా డైవర్ నవాజ్‌ఖాన్ కారును దొంగలించినట్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలైన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరా దృశ్యాలను తమకు చూపించాలని యువన్ సతీమణి జఫ్రూన్ నిసాను పోలీసులు కోరారు. సీసీటీవీ కెమెరాలు చూడటంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. చోరీకి గురైనట్టు భావిస్తున్న కారు యువన్ నివాసంలోనే లెవల్-2కు బదులు లెవల్ -3లో పార్క్ చేసి ఉంది. వెంటనే కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో డ్రైవర్ నవాజ్ ఖాన్ ఇంకా పడుకొని ఉన్నాడు. ఏమైందని డ్రైవర్‌ను ఆరాతీయగా తాను కారులో నిద్రపోయానని, ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో కాల్స్ రాలేదని అతను చెప్పాడు. దీంతో షాక్ తినడం యువన్ భార్య నిసా, పోలీసుల వంతైంది. పొరబడటం వల్లేనా!? సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్‌ఖాన్ యువన్‌కు చెందిన లగ్జరీ కారు ఆడీ-6ను బయటకు తీసుకువెళ్లాడు. తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చిన జఫ్రూన్ నిసా ఇంట్లోని లెవల్-3లో కారు పార్క్ చేసి లేకపోవడంతో సందేహించింది. యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటివద్ద లేకపోవడంతో కారు చోరీకి గురైందేమోనన్న అనుమానంతో వెంటనే ఎంగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి అయినా కారు తిరిగిరాకపోవడం, డ్రైవర్‌కు ఫోన్ చేస్తే కలువకపోవడం వల్ల ఆమె పొరబడి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోందని స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. తీరా కారు, డ్రైవర్‌తో సహా ఇంట్లోనే ఉండటంతో ఫిర్యాదును వెనుకకు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఆడి కార్లు 9 లక్షల వరకు ప్రియం!!
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి తాజాగా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి వాహన ధరలు రూ. 1 నుంచి రూ. 9 లక్షల వరకు పెరుగుతాయని పేర్కొంది. బడ్జెట్లోని కస్టమ్స్ సుంకం పెంపు దీనికి ప్రధాన కారణమని ఆడి ఇండియా తెలిపింది. కాగా ఆడి కంపెనీ ఎస్యూవీ క్యూ3 దగ్గరి నుంచి స్పోర్ట్స్ కారు ఆర్8 వరకు పలు రకాల కార్లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి ధర శ్రేణి రూ.35.35 లక్షలు–రూ.2.63 కోట్లుగా ఉంది. -
భారీగా పెరగనున్న ఆడి కార్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. భారత ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మొత్తం అన్ని మోడళ్ల కార్లపై ఈ పెంపును వర్తింప చేస్తున్నట్టు ప్రకటించింది. లక్ష రూపాయల నుంచి రూ.9లక్షల దాకా ధరలను పెంచామనీ, ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కస్టమ్ సెక్యూరిటీ పెరుగుదల ధరల పెంపునకు దారి తీసిందని పేర్కొన్నారు. కాగా భారత్‌లో రూ. 35.35 లక్షల (ఎస్‌యూవీవీ క్యూ 3) నుంచి రూ. 2.8 కోట్ల (స్పోర్ట్స్ కార్లు) వరకు ఆడి విక్రయిస్తుంది. 2018-19 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సీకెడీ వాహనాల దిగుమతులపై సుంకాన్ని 10శాతం నుంచి పెంచి 15శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఆడి క్యూ5 లాంచ్..కొత్త డిజైన్‌తో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ ఆడి కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కొన్ని నెలలు వెయింటిగ్ తరువాత , ఆడి చివరకు ఇండియాలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ ఎంఎల్‌బీ ఎవో ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించిన ఈ లగ్జరీ కారు ప్రారంభ ధరను రూ.53.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ నిర్ణయించింది. టాప్ ఎండ్ టెక్నాలజీ వేరియంట్ ధరను రూ. 57. 60లక్షలుగాను ప్రకటించింది. త్వరలో డెలివరీ ప్రారంభం కానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర ఫీచర్లు క్యూ7 మాదిరిగానే 2.0లీటర్ టీడీఐ ఇంజీన్ కెపాసిటీతో వస్తున్నఈ కారులో కంట్రోల్ నాబ్ స్థానంలో నాలుగు టోగుల్ బటన్స్ యాడ్ చేసి మునుపటి 8.3అంగుళాల ఎంఎంఐ ఇన్ఫోటైన్‌మెంట్‌ను, బోనెట్ డిజైన్‌ను అప్ గ్రేడ్ చేసింది. వర్చువల్ కాక్‌పిట్, వైర్లెస్ చార్జింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రీకల్లీ ఎడ్జస్టబుల్ సీట్స్‌తోపాటు ముందుభాగంలో మాట్రిక్స్ సింగిల్ ఫ్రేమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమర్చింది. వెనుక కూడా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, డిఫ్యూసర్తో కొత్త బంపర్‌ను జోడించింది. దీని ఇంజీన్18బీహెచ్పీ, 400ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపు..భలే ఆఫర్ కూడా
సాక్షి,న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారీ ఆఫర్ ప్రకటించింది. రానున్న క్రిస్మస్ , న్యూ ఇయర్ సందర్భంగా లగ్జరీ కార్లవర్స్కోసం తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు మూడు నుంచి రూ.8.85 లక్షల వరకు ధరలు తగ్గించినట్లు ఆడి ప్రకటించింది. లిమిటెడ్ ఆఫర్‌గా ప్రకటించిన ఈ "ప్రత్యేక ధరల"తో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.దీంతోపాటు మరో బంపర్ ఆఫర్కూడా ఉంది. 2017లో ఫేవరేట్ ఆడి కారును కొనుగోలు చేసిన కస్టమర్లు.. 2019లో చెల్లింపులు మొదలుపెట్టవచ్చని ఇది తమ కస్టమర్లకు అందిస్తున్న అదనపు ప్రయోజనమని కంపెనీ వెల్లడించింది. అమ్మకాల డ్రైవ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తున్నట్టు ఆడి శుక్రవారం వెల్లడించింది. క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ఈ ప్రత్యేక ధరలు, సులభ ఈఎంఐని అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్లో భాగంగా ఆడి ఏ3 ఇపుడు రూ.26.99 లక్షలకే లభ్యంకానుంది. దీని పాత ధర రూ.31.99 లక్షలు. ఇక ఆడి ఏ4 పాత ధర రూ.39.97 లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.33.99 లక్షలకే అందుబాటులో ఉండనుంది. అలాగే ఆడి ఏ6 సెడాన్ ధర రూ.53.84 లక్షల నుంచి రూ.44.99 లక్షలకు, ఎస్యూవీ ఆడి క్యూ3 ధర రూ.33.4 లక్షల నుంచి రూ.29.99 లక్షలకు తగ్గింది. -
ఆడీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కారు తయారీదారు ఆడీ తన కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇయర్-ఎండ్ సేల్స్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.8.85 లక్షల వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు శుక్రవారం తెలిపింది. ప్రత్యేక ధరలు, సులభతరమైన ఈఎంఐ ఆప్షన్లు ఆఫర్ చేయనున్నట్టు కూడా కంపెనీ పేర్కొంది. ఆడీ రష్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లో భాగంగా ఆడీ ఏ3, ఆడీ ఏ4, ఆడీ ఏ6, ఆడీ క్యూ3 మోడల్స్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో భాగంగా ఎంపికచేసిన మోడల్స్‌పై రూ.3 లక్షల నుంచి 8.85 లక్షల వరకు ధరల ప్రయోజనం లభించనుందని ఆడి ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017లో వినియోగదారులు కొనే తమ ఇష్టమైన ఆడీపై అదనపు ప్రయోజనాలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో భాగంగా పేమెంట్ 2019 నుంచి ప్రారంభించవచ్చు. ఆఫర్ కింద ఆడీ ఏ3 వాహనం రూ.26.99 లక్షలకు విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.31.99 లక్షలు. ఆడీ ఏ4 ధర రూ.33.99 లక్షలు. ఆఫర్ ముందు వరకు దీని ధర రూ.39.97 లక్షలు. అదేవిధంగా రూ.53.84 లక్షలుగా ఉన్న ఆడీ ఏ6 సెడాన్ రూ.44.99 లక్షలుగా ఉంది. ఎస్యూవీ ఆడీ క్యూ3 రూ.29.99 లక్షలకే విక్రయానికి వచ్చింది. ఇది లిస్ట్ అయిన ధర రూ.33.4 లక్షలు. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా ఆడీ ఈ ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. -
బ్యాడ్ టైంలో..గుడ్ టైం అంటే ఇదే
-
బ్యాడ్ టైంలో..గుడ్ టైం అంటే ఇదే
బీజింగ్: కన్నుమూసి తెరిచేలోపు అనూహ్యంగా ఓ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అద్భుతానికే ఆశ్చర్యం వేసేలా ఉన్న ఈ మిరాకిల్ వీడియో ఇపుడు నెట్లో వైరల్ గా మారింది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం చైనాలో ఝుజాయ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఖరీదైన ఆడి కారుపై సడెన్‌గా ఓ భారీ క్రేన్ వచ్చి పడింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే డ్రైవర్(29) మాత్రం స్వల్ప గాయాలతో బయటకు రావడం వీడియోలో చూడొచ్చు. ఏం జరిగిందో తెలియక బిక్కుబిక్కుమంటూ పగిలిపోయిన అద్దం నుంచి డ్రైవర్ బయటకు రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. డ్రైవర్ కాలి మడమ విరగడంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అకస్మాత్తుగా ఘటన జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదంటూ డ్రైవర్ బేల ముఖం పెట్టాడు. మరోవైపుఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. -
భారత్‌లోకి మూడు ఆడి కొత్త కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారి ఆడి తన ఏ5 రేంజ్లో మూడు కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఏ5 కాబ్రియోలెట్, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ పేర్లతో వీటిని ఆడి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ.70.60 లక్షలుగా ఉన్నాయి. మొదటి రెండు మోడల్స్ పూర్తిగా కొత్తవి కాగ, ఎస్5 ప్రస్తుతమున్న ప్రొడక్ట్‌కు అప్డేటడ్ మోడల్. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ కార్లను ఆడి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏ5 మోడల్2.0 లీటరు ఇంజిన్‌ను, 190బీహెచ్పీ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్. 7.9 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను సాధించగలదని కంపెనీ చెప్పింది. ఎస్5 మోడల్ చాలా పెద్దది, చాలా వేగవంతమైనది. 3 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారు 354కేహెచ్‌పీ పీక్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 250 కేఎంపీహెచ్. 4.7 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను ఇది చేరుకోగలదు. -
8.50 లక్షల డీజిల్ కార్లు వెనక్కి
ఫ్రాక్ఫర్ట్ : జర్మన్ ఆటో దిగ్గజం ఆడీ ఏజీ భారీమొత్తంలో డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటుంది. ఆరు సిలిండర్, ఎనిమిది సిలిండర్ డీజిల్ ఇంజిన్ గల 8,50,000 లక్షల కార్లను ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నట్టు ఆడీ ఏజీ తెలిపింది. అమెరికా, కెనడా దేశాల మినహా మిగతా అన్ని దేశాల్లో ఈ కార్లు రీకాలింగ్ ప్రక్రియను కంపెనీ చేపట్టనున్నట్టు చెప్పింది. ఈ కార్లలో ఉద్గారాలను మెరుగుపరచడానికే ఆడీ ఈ రీకాల్ చేస్తోంది. ఫోక్స్‌వాగన్ గ్రూప్‌కు ఆడీ ఏజీ సబ్సిడరీ గ్రూప్. ఆడి కూడా ఈ డీజిల్ ఉద్గారాల స్కామ్‌కు పాల్పడినట్టు వెల్లడైంది. దీంతో ఈ కంపెనీ తన కస్టమర్లకు ఉచితంగా రిట్రోఫిట్ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్‌తో ఉన్న కార్లు, ముఖ్యంగా ఈ ప్రభావితమైన కార్లకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తామని ఆడీ ప్రకటించింది. అంతేకాక మొత్తంగా ఉద్గారాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ఉద్గారాలను తగ్గించాలనుకుంటున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో చెప్పింది. అదేవిధంగా ఉచిత సర్వీసులను పోర్స్చే, ఫోక్స్ వాగన్ మోడల్ కార్లకు ఆడీ చేపట్టనుంది. ఇదే కారణంతో మరో జర్మన్ కార్ల తయారీసంస్థ డైమ్లర్ ఏజీ కూడా మెర్సిడెస్ బెంజ్ బ్రాండుతో ఉన్న 30 లక్షలకు పైగా డీజిల్ కార్లను యూరప్ అంతటా రీకాల్ చేస్తోంది. దీని ప్రభావంతో ఆ కంపెనీకి 220 మిలియన్ యూరోల నష్టం వాటిల్లుతోంది. ఉద్గారాల పరీక్షలో డైమ్లర్, ఆడీ రెండూ కూడా సాఫ్ట్వేర్ అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. -
భారీ మొత్తంలో ఆడి కార్ల రీకాల్
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ కార్ మేకర్ ఆడి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల 50 వేల డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కార్ల ఉద్గారాల వృద్ధికిగాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు సిలిండర్ల , ఎనిమిది-సిలిండర్ డీజిల్ ఇంజిన్ల కార్లను రీకాల్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల కోసం "రెట్రోఫైట్ ప్రోగ్రాం" ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ గాఉన్న ఆడి కర్బన ఉద్గారాల కుంభకోణంలో ఆరోపణలుఎదుర్కొంటున్న ఆడి ఈ పరిహార కార్యక్రమాన్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ రీకాల్ ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఉద్గారాలు తగ్గించేందుకు, అలాగే డీజిల్ ఇంజన్ల భవిష్యత్తులో సాధ్యత నిర్వహించాలని ఆడి భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇదే కారణంగా, మరో జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లెర్ ఏజీ కూడా "డీజిల్ ఇంజిన్లు సమగ్ర ప్రణాళిక’’ లో భాగంగా యూరోప్ అంతటా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, మూడు మిలియన్లకు పైగా డీజిల్ కార్లు రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆడి, డైమ్లెర్ రెండూ కర్బన ఉద్గారాల కుంభకోణంలో నిందిత కంపెనీలే. ఉద్గార పరీక్షల్లో మోసం చేయడానికి ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించాన్న ఆరోపణలున్నాయి. -
ఆడి కొత్త ఏ3 సెడాన్ @32 లక్షలు
ఆడి ఇండియా కంపెనీ ఏ3 సెడాన్ మోడల్లో అందిస్తున్న కొత్త వేరియంట్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, సినిమా నటి నిమ్రత్ కౌర్‌లు. ఈ కారు ధరలు రూ.30.5–32.2 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఏడాదితో భారత్‌లో తమ కార్యకలాపాలకు 10 సంవత్సరాలు పూర్తవుతాయని ఆడి ఇండియా కంపెనీ పేర్కొంది. -
ఆడి ఏ3 కాబ్రియోలెట్ @రూ.47.98 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, ఆడి కొత్తగా ఆడి ఏ3 కాబ్రియోలెట్ పేరుతో కొత్త వేరి యంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఈ కారు ధర రూ47.98 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారి చెప్పారు. ఈ కారు మైలేజీ లీటర్‌కు 19.2 కిమీ. అని పేర్కొన్నారు. . ఈ కారులో రీ డిజైన్ చేసిన వెనక లైట్లు, వెనక భాగంలో ఉన్న ఎల్ఈడీ లైట్లలో ఇన్స్టాల్ చేసిన డైనమిక్ టర్న్ సిగ్నల్స్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. -
ఆడి రికార్డు అమ్మకాలు
బెర్లిన్: జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ ఆడి 2016 లో దూసుకుపోయింది. గత సంవత్సరం డీజిల్ ఉద్గారాలు కుంభకోణంలో అభియోగాలు, ప్రత్యర్థుల గట్టి పోటీ ఉన్నప్పటికీ, విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఫోక్స్ వ్యాగన్ గ్రూపు లగ్జరీకార్లు, స్పోర్ట్స్ యుటిలీటీ వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2015 నాటి 1.80 మిలియన్ల వాహనాల విక్రయాలతో పోలిస్తే 2016, డిసెంబర్ అమ్మకాల్లో 1.87 మిలియన్ యూనిట్లను సాధించినట్టు కంపెనీ ప్రతినిధి శనివారం వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లో నెం. 2గా ఉన్న ఆడి బ్రిటన్ లో 6.4 శాతం, యునైటెడ్ స్టేట్స్ లో 4 శాతం, ఎక్కువ అమ్మకాలు సాధించింది. అయితే కంపెనీ అధికారిక లెక్కల్ని సోమవారం (జనవరి 9) ప్రకటించనుంది. అయితే ఎమిషన్స్ స్కాంతో గ్లోబల్ లగ్జరీ కార్ల బ్రాండ్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయినా అమ్మకాల్లో హవా కొనసాగించింది.ప్రదాన పత్యర్థులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలతో పోలిస్తే ర్యాకింగ్స్ లో రెండు స్థానాలు వెనుకబడిందని నిపుణుల అంచనా. మరోవైపు ఉద్గారాల కుంభకోణంపై ఇంకా ఎలాంటి తీర్పు వెలువడకపోయినప్పటికీ.... లగ్జరీ కార్ మేకర్ ఆడి అమెరికాలో డీజిల్ కార్ల అమ్మకాలను మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్..
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘ఏ4’లో కొత్త వెర్షన్ (బి9)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.1 లక్షల నుంచి రూ.41.2 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఇది ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. -
ఆడి కొత్తకారు ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి సరి కొత్త కార్ ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆడి అత్యంత విజయ వంతమైన లగ్జరీ సెడాన్ బీ9 వెర్షన్ కు చెందిన సెడాన్ ఎ4 ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరలను రూ. 38.1లక్షల నుంచి రూ 41.2 లక్షలు(ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎక్స్ షో రూం ధరలు)గా కంపెనీ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని దీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 2,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం అంతకంటే ఎక్కువ డీజిల్ కార్లు ఎస్ యూవీలపై సుప్రీంకోర్టు ఎనిమిది నెలల నిషేధం తమకు కలిసి వచ్చే అంశమని ఆడి తెలిపింది. అలాగే తరువాతి త్రైమాసికంలో ఆడి వాహనాల విక్రయాల్లో వృద్ధిని సాధిస్తామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ పీటీఐకి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రస్తుత అన్ని మోడళ్ల పెట్రోల్ వెర్షన్లు లాంచ్ యోచిస్తున్నామన్నారు. మార్కెట్లో డిమాండ్ అనుగుణంగా తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నట్టు చెప్పారు. టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్, 150 హెచ్‌పీ పవర్ కెపాసిటీతో వస్తున్న ఈ సరికొత్త సెడాన్ గంటకు 250 కి.మీవేగంతో దూసుకుపోతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ , ఈయూ 6 ఎమిషన్ క్లాస్ వస్తున్న ఈ కారులో పర్యావరణనాశనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆడీ ఆల్ వీల్స్ క్వాట్రో టెక్నాలజీ ఇందులో లేదు. -
ఫోక్స్‌వాగన్‌కు షాకిచ్చిన దక్షిణ కొరియా
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్ వాగన్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 80 ఫోక్స్‌వాగన్ మోడల్స్ అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఉద్గారాల చీటింగ్ స్కాండల్‌కు పాల్పడినందుకు గాను నిషేధంతో పాటు 16.06 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 83వేల డీజిల్, పెట్రలో సామర్ధ్యంతో రూపొందిన ఫోక్స్ వాగన్ వెహికిల్స్‌కు, తన లగ్జరీ కారు బ్రాండ్లు ఆడీ,బెంట్లీలకు అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం 2,09,900 ఫోక్స్ వాగన్ అమ్మకాలు దక్షిణ కొరియాలో నిలిపివేయనున్నారు. ఈ అమ్మక నిషేధం ఫోక్స్ వాగన్ గ్రూపుకు చెందిన మొత్తం 32 రకాల వాహనాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. 2007 నుంచి ఫోక్స్‌వాగన్ మొత్తం 68 శాతం వెహికిల్స్ ను ఆ దేశంలో విక్రయించినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్ లోనే 1,26,000 ఫోక్స్ వాగన్ వాహనాలకు ప్రభుత్వం అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేసింది. ఆ వాహనాలన్నింటినీ వెంటనే రీకాల్ చేసుకోమని ఆదేశించి, నష్టపరిహారం సైతం విధించింది. తాజాగా అమ్మకాల నిషేధంతో పాటు, 16.06 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ముందే ఈ కారు తయారీదారి వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి స్కాంకు ప్రభావితమైన కార్ల అమ్మకాలను జూలై 25నుంచి నిషేధిస్తున్నట్టు తెలిపింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్‌కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్‌వేర్‌ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో ఫోక్స్ వాగన్ అష్టకష్టాలు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్‌వాగన్‌కు నేడు వెలువరించిన నిర్ణయం మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది. ఈ స్కాండల్ బయటపడక ముందు దక్షిణ కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్ లో ఫోక్స్ వాగన్ ఒకటిగా నిలిచేది. -
ఆడి ఆర్8 వీ10 ప్లస్@రూ. 2.62 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఆర్8 వీ10 ప్లస్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.62 కోట్లు (హైదరాబాద్ ఎక్స్‌షోరూం). రేస్ కార్ అయిన ఆడి ఆర్8 ఎల్ఎంఎస్ మోడల్‌కు చెందిన 50 శాతం విడిభాగాలను వీ10 ప్లస్ తయారీలో వాడారు. 610 హెచ్పీతో 5.2 ఎఫ్ఎస్ఐ క్వాట్రో ఇంజన్‌ను పొందుపరిచారు. 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. 31.24 సెంటీమీటర్ల స్క్రీన్‌తో వర్చువల్ కాక్‌పిట్ అదనపు ఆకర్షణ. వినూత్న టెక్నాలజీ కారణంగా.. రాత్రి వేళ కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు దాటగానే లేజర్ లైట్లు తెరుచుకుని అధిక కాంతిని ఇస్తాయని ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం. సంఘ్వీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే మూడు బుకింగ్స్ నమోదు అయ్యాయన్నారు. 9 ఏళ్లలో తమ షోరూం ద్వారా మొత్తం 2,700లకుపైగా కార్లు విక్రయించామని చెప్పారు. తమ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 25 శాతమే అయినప్పటికీ, వృద్ధి రేటు ఏకంగా 35 శాతముందని అన్నారు. -
కాలి బూడిదైన ఆడీ..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లైఓవర్ పై ఓ లగ్జరీ కారు శుక్రవారం రాత్రి పూర్తిగా కాలి బూడిదైంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న కారు ఓనర్ కపిల్ అగర్వాల్(32) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడే ఆపి కిందకు దిగారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఫైర్ ఇంజన్ అక్కడి చేరుకునే లోపే కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రముఖ నగల దుకాణం యజమాని అగర్వాల్ పేరు మీద కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గత జనవరి నెలలో కారుకు సర్వీసింగ్ చేయించినట్లు అగర్వాల్ తెలిపారు. అంతకుముందు నుంచి చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఉన్నట్టుండి మంటలు రావడంతో అగర్వాల్ కార్ బానెట్ ను తెరచి చూశారని దీంతో ఒక్కసారి మంటలు రేగి కారు అంతా వ్యాపించినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఇక ప్రతీ ఏడాదికి ఓ ఆడి ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమొబైల్ తయారీసంస్థ ఆడీ, కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్ ను ప్రతిఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2018 నుంచి ఈ ప్లాన్ ను అమలుచేయాలని భావిస్తోంది. టెస్లాకు, లగ్జరీ కార్ల మార్కెట్ ల్లో ఉన్నఇతర కంపెనీలకు పోటీగా ఈ కార్లను ప్రవేశపెట్టాలని ఆడీ నిర్ణయించింది. ఈ కొత్త ప్రయత్నం ఆడీ ఈ-క్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ తో రూపొందే అన్నీ ఎలక్ట్రిక్ లగ్జరీ క్లాస్ ఎస్‌యూవీలపై చేపట్టనుంది. గురువారం జరిగిన కారు తయారీదార్ల వార్షిక సమావేశంలో ఆడీ సీఈవో రాబర్ట్ స్టాడ్లర్ ఈ విషయాన్ని తెలిపారు. మొదట లార్జ్ సిరీస్ ఎలక్ట్రిక్ కారు తయారీని 2018లో చేపడతామని వెల్లడించారు. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఎలక్ట్రిక్ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆడీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి చూపించుకోవడానికి కాదని, అధిక వాల్యుమ్ విభాగాలు క్యూలైన్ క్రాస్ ఓవర్స్, వాగన్స్, ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. గ్యాస్, డీజిల్ వెహికిల్స్ తో పాటు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికిల్స్ పై ఆడీ మొదటి నుంచి దృష్టిపెట్టింది. తన పేరెంట్ కంపెనీ ఫోక్స్ వాగన్ డీజిల్ కర్బన ఉద్గారాల ఎక్కువగా ఉపయోగించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది నుంచి ఆడీ ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ దృష్టిసారిస్తోంది. -
ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్ఎస్ఐ
ధర రూ. 45.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్ఎస్ఐ(పెట్రోల్ వేరియంట్) కారును శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.45.9 లక్షలు(ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ, ముంబై). ఈ కారుతో పాటు ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఆడి ఏ6 మ్యాట్రిక్స్తో ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్ కార్ల విక్రయాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ వ్యక్తం చేశారు. కొత్త 1.8 ఎల్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ రూపొందిన ఈ కారు లీటర్‌కు 15.2 కిమీ. మైలేజీని ఇస్తుందని, 7 గేర్ల ఎస్-ట్రానిక్ ట్రాన్సిమిషన్ , ఆటో ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, నెక్స్ట్ జనరేషన్ మాడ్యులర్ ఇన్ఫోటైన్మెంట్ ప్లాట్‌ఫామ్ వంటి ప్రత్యేకతలున్నాయన్నారు. -
భారత్‌లో ఆడి టెక్నికల్ సెంటర్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, భారత్‌లో టెక్నికల్ సర్వీస్ సెంటర్‌ను ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇదే తొలి టెక్నికల్ సర్వీస్ సెంటర్. ఆసియా-పసిఫిక్‌లో ఏడవది. భారత వినియోగదారుల ప్రాధాన్యతలపై ఈ టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంది. -
ప్రాణం తీసిన కారు!
-
6758 కార్లను రీకాల్ చేయనున్న ఆడీ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేయాలని లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేసిన కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు ఆడీ కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే తప్ప.. ఎలాంటి పరికరాలను మార్చబోమని ఆడి తెలిపింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులకు డీలర్లు అందుబాటులో ఉంటారని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆడి తెలిపింది. -
లగ్జరీ కార్లు దిగొస్తున్నాయ్!