Audi Q5 2022 Special Edition launched at Rs 67.05 lakh: What's new
Sakshi News home page

Audi Q5 Special Edition:స్పెషల్‌ ప్రైస్‌..లిమిటెడ్‌ పీరియడ్‌, త్వరపడండి!

Published Wed, Nov 9 2022 11:35 AM | Last Updated on Wed, Nov 9 2022 2:00 PM

Audi Q5 special edition 2022 launched  price and features - Sakshi

సాక్షి,ముంబై:  లగ్జరీ  కార్‌ మేకర్‌ ఆడి  తన ఎస్‌యూవీలో కొత్త ‍స్పెషల్‌ ఎడిషన్‌ను ఇండియాలో  లాంచ్‌ చేసింది. ఆడి క్యూ5 ఎస్‌యూవీలో స్పెషల్ ఎడిషన్‌ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్‌, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో  జోడించింది. అలాగే  ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్‌తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్‌) అందిస్తోంది.  (ట్విటర్‌కు సవాల్‌: టాప్‌-...0 ఆల్టర్‌నేటివ్స్‌ ఇవిగో!)

అంతేకాదురెండు స్పెషల్‌ కలర్స్‌తో  (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేక ధరతో,పరిమితి  కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది  పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ సూపర్‌ బైక్‌,సూపర్‌ ఫీచర్లతో)
ఆడి క్యూ5  స్పెషల్‌ ఎడిషన్‌ ఇంజీన్‌
2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తోంది. ఇది 249 hpపవర్‌ను,  370Nm టార్క్‌ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్‌తో అడాప్టివ్ సస్పెన్షన్‌ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి  ఆరు డ్రైవ్ మోడ్స్‌లో ఇది లభ్యం.

సింగిల్‌ గ్రిల్లే, వర్టికల్‌, స్ట్రట్స్‌, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్‌లైట్‌ ఇందులో ఉన్నాయి.  బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్‌తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్స్‌, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. 

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్  క్యాబిన్‌లో ఖరీదైన లెదర్,  లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్‌తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది.  755 వాట్స్ అవుట్‌పుట్‌తో 3D సౌండ్ ఎఫెక్టస్‌తో 19 స్పీకర్లు,  వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్‌ప్లే  సపోర్ట్‌తో 25.65 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే లాంటి ఇంటీరియర్‌ ఫీచర్లున్నాయి. 

ధరలు: 
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్  రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్)
ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర  రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్)
ఆడి క్యూ5 టెక్నాలజీ  రూ.  66,21,000 (ఎక్స్-షోరూమ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement