భారీ మొత్తంలో ఆడి కార్ల రీకాల్
ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీ కార్ మేకర్ ఆడి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల 50 వేల డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కార్ల ఉద్గారాల వృద్ధికిగాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా, కెనడా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు సిలిండర్ల , ఎనిమిది-సిలిండర్ డీజిల్ ఇంజిన్ల కార్లను రీకాల్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల కోసం "రెట్రోఫైట్ ప్రోగ్రాం" ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ గాఉన్న ఆడి కర‍్బన ఉద్గారాల కుంభకోణంలో ఆరోపణలుఎదుర్కొంటున‍్న ఆడి ఈ పరిహార కార్యక్రమాన్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ రీకాల్ ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఉద్గారాలు తగ్గించేందుకు, అలాగే డీజిల్ ఇంజన్ల భవిష్యత్తులో సాధ్యత నిర్వహించాలని ఆడి భావిస్తున్నట్టు సమాచారం.
కాగా ఇదే కారణంగా, మరో జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లెర్ ఏజీ కూడా "డీజిల్ ఇంజిన్లు సమగ్ర ప్రణాళిక’’ లో భాగంగా యూరోప్ అంతటా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, మూడు మిలియన్లకు పైగా డీజిల్ కార్లు రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆడి, డైమ్లెర్ రెండూ కర్బన ఉద్గారాల కుంభకోణంలో నిందిత కంపెనీలే. ఉద్గార పరీక్షల్లో మోసం చేయడానికి ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించాన్న ఆరోపణలున్నాయి.