
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.
రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.
ఈసీయూ సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment