
జర్మన్ కంపెనీ అయిన 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2,00,000 ప్యాసింజర్ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేసిన మొట్టమొదటి లగ్జరీ కార్ బ్రాండ్‌గా అవతరించింది. మహారాష్ట్రలోని పూణేలోని చకన్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ కారు EQSను విడుదల చేయడంతో కంపెనీ ఈ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.
మెర్సిడెస్ బెంజ్ పూణేలోని చకన్ ప్లాంట్‌లో 50000 యూనిట్లను అసెంబుల్ చేయడానికి 19 సంవత్సరాలు (1995 నుంచి 2014 వరకు) పట్టింది. ఆ తరువాత 1.50 లక్షల యూనిట్లను కేవలం పదేళ్లలో (2015 నుంచి 2025 వరకు) ఉత్పత్తి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఉత్పత్తి సుమారు 470 శాతం పెరిగింది.