1954 నాటి మెర్సిడెస్ బెంజ్ కారు (Mercedes-Benz W196 R Stromlinienwagen) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ కారు ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫార్ములా 1 కారుగా నిలిచింది.
బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్‌లైన్డ్ బాడీవర్క్‌తో కలిగిన నాలుగు మోడల్‌లలో ఒకటి. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేసారు అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అయితే ఈ కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కారు. ఇది (ఉహ్లెన్‌హాట్ కూపే) 2022లో సుమారు రూ. 1,266 కోట్లకు వేలం అమ్ముడైంది.
సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్‌లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను రికార్డ్ చేశాడు. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో 2.5-లీటర్ స్ట్రెయిట్ ఎయిట్ ఇంజన్‌ను కలిగి.. 290 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్‌వే మ్యూజియమ్‌కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment