auctioned
-
70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు
1954 నాటి మెర్సిడెస్ బెంజ్ కారు (Mercedes-Benz W196 R Stromlinienwagen) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ కారు ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫార్ములా 1 కారుగా నిలిచింది.బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్లైన్డ్ బాడీవర్క్‌తో కలిగిన నాలుగు మోడల్‌లలో ఒకటి. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేసారు అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అయితే ఈ కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కారు. ఇది (ఉహ్లెన్‌హాట్ కూపే) 2022లో సుమారు రూ. 1,266 కోట్లకు వేలం అమ్ముడైంది.సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్‌లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను రికార్డ్ చేశాడు. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో 2.5-లీటర్ స్ట్రెయిట్ ఎయిట్ ఇంజన్‌ను కలిగి.. 290 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే మ్యూజియమ్‌కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది. -
ప్రపంచంలోనే తొలి పోస్టల్ స్టాంప్ వేలానికి
సాక్షి, నేషనల్ డెస్క్... ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంప్ వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు రూ.20 కోట్ల (25 లక్షల డాలర్ల) దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్లరంగు స్టాంప్‌ను పెన్నీ బ్లాక్ స్టాంప్‌గా పిలుస్తారు. ఇంగ్లండ్‌లో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లెంకిన్స్లోప్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ల దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్‌పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులంటించడం ద్వారా పోస్టేజీ చార్జీలను ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు. లెటర్లను అందుకునే వాళ్లే పోస్ట్‌మాన్‌కు పోస్టేజ్ రుసుము చెల్లించేవాళ్లు. వాళ్లు గనక లెటర్లను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్ పెట్టేందుకు సర్ రోలాండ్ హిల్ ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంప్‌ను రూపొందించాడు. ప్రఖ్యాత వేలం సంస్థ సోత్బీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్ స్టాంప్ వేలానికి రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని సోత్బీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ ఆస్టిన్ అన్నారు. చదవండి: లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు -
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్‌ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. "దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి. ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ? -
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
HYD: రూ. కోటి 26 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది. మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. -
ఆల్ టైం రికార్డ్,వేలంలో రూ.41లక్షలు పలికిన లడ్డూ..ఎక్కడంటే?
ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలకగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో లడ్డు ధర రికార్డ్ స్థాయిలో రూ.41లక్షలు పలికింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన కీర్తి రిచ్మాండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో 179విల్లాస్‌లో 82 మంది నివసిస్తున్నారు. అయితే స్థానికులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహించారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపిన లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. లడ్డూ వేలం పాటలో 5 కేజీల లడ్డూ రూ.41లక్షలు పలికినట్లు నిర్వాహకలు తెలిపారు. ఇక్కడ 2019లో జరిగిన వినాయక చవితి లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర 27లక్షలు పలికింది. కానీ ఈ సారి ఏకంగా రూ.41 లక్షలు పలకడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏదాడి బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ -
మెస్సీ కన్నీళ్లు తుడిచిన టిష్యూ పేపర్ ధర రూ. ఏడున్నర కోట్లు
Lionel Messi.. సెలబ్రిటీలు ఏం చేసినా దానిని ఒక వార్తగా చూడడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. లేచినా.. పడుకున్నా.. తిన్నా.. ఇలా ఏది చేసినా దాన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి సెలబ్రిటీలు వాడిన వస్తువులను ఆన్లైన్లో వేలం వేయడం చూస్తుంటాం. ఎంతైనా ఒక సెలబ్రిటీ కాబట్టి దానికి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. తాజాగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇటీవలే కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్వెల్ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఒక ప్రబుద్ధుడు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్ చేసిన ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు. 13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. we cant take this man 😭💔 The #GOAT🐐 crying 😭 #MESSI pic.twitter.com/bqNVPcjKmq — MaayoNᴮᵉᵃˢᵗ😎🎩💫 (@itz_satheesh4) August 8, 2021 -
వైరల్: ‘‘ది సాకురా’’ పింక్ డైమండ్ ఖరీదు తెలుసా?
హాంగ్‌కాంగ్: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది. జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం "ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్" 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా. కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.."ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం." అని ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) -
జ్ఞాపికల వేలంతో గంగా ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో స్వీకరించిన 1800కు పైగా జ్ఞాపికలను జనవరిలో పదిహేను రోజుల పాటు సాగిన వేలంలో విక్రయించినట్టు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఆదివారం వెల్లడించింది. వేలం ప్రక్రియ ద్వారా సమకూరిన మొత్తాన్ని గంగా నదీ ప్రక్షాళనకు వెచ్చిస్తామని పేర్కొంది. ప్రధానికి లభించిన జ్ఞాపికల వేలం ద్వారా నిధులు ఎంతమేర వసూలయ్యాయనే వివరాలను పీఎంఓ పేర్కొనలేదు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) ఈ వేలం నిర్వహించింది. కాగా, ఈ వేలంలో ప్రత్యేకంగా చెక్కతో తయారు చేసిన బైక్ రూ 5 లక్షలు పలికింది. రూ 5000 బేస్ ధరగా నిర్ధారించిన శివుని విగ్రహం రూ పది లక్షలు పలికిందని పీఎంఓ తెలిపింది. ఇక రూ 4000 బేస్ ధరగా నిర్ణయించిన అశోకుడి స్ధూపం రూ 13 లక్షలకు వేలంలో విక్రయించామని వెల్లడించింది. రూ 4000 ప్రామాణిక ధర కలిగిన గౌతమ బుద్ధ విగ్రహం వేలంలో రూ ఏడు లక్షలు పలికిందని పేర్కొంది. ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ తనకు లభించిన మెమెంటోలను వేలం ద్వారా విక్రయించి ఆ నిధులను బాలికల విద్య కోసం కేటాయించేవారని, అదే సంప్రదాయం ఇప్పుడూ కొనసాగిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
మాల్యా హెలికాప్టర్లు అమ్మేసారు..
-
అగ్రి గోల్డ్ ఆస్తులు జూన్ 1న వేలం
-
ఒక్క పేజీకి మూడున్నర కోట్లు
వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి దోపిడీ గుట్టువిప్పిన కారల్ మార్క్స్ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్ కాపిటల్ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్ రాసిన దాస్ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్లకు పైగా ధర పలికింది. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య కాలంలో లండన్‌లో దాస్ కాపిటల్ రాయడం కోసం ఆయన తయారుచేసుకున్న 1,250 పేజీల నోట్సులోనిదే ఈ పేజీ అని భావిస్తున్నారు. చైనాకి చెందిన ఫెంగ్ లుంగ్ అనే వ్యాపారవేత్త బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ వేలం కార్యక్రమంలో 5,23,000 డాలర్లకు ఈ పేజీ అమ్ముడయ్యింది. 3 లక్షల యువాన్లతో ప్రారంభమైన ఈ వేలం ముగిసేసరికి 3.34 మిలియన్ యువాన్లు అంటే 5,23000 డాలర్లు పలికింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మానిఫెస్టో పుస్తక సహ రచయిత, మార్క్స్ సహచరుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాత ప్రతిని సైతం వేలం వేసారు. 1862 నవంబర్‌లో ఓ పత్రిక కోసం ఎంగెల్స్ దాన్ని రాసినట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. అయితే ఎంగెల్స్ రాత ప్రతి 1.67 మిలియన్ యువాన్లకు అమ్ముడపోయింది. -సాక్షి నాల్డెజ్ సెంటర్ -
ఆ రెండు లక్షలు ఏమయ్యాయి..?
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2017–18కుగాను జరిగిన జాతర వేలం పాటకు సంబంధించి రూ.రెండులక్షలు తేడాలొచ్చాయి. ఆ సమయంలో టెండర్ పాడిన అనుగం శివకుమార్ రూ.14, 85,232కు టెండర్ దక్కించుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ.12లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.రెండు లక్షలను గత సంవత్సరం మే 7, 18న అప్పటి ఈవో సులోచనకు ఇచ్చానని, ఆ సమయంలో ల్లకాగితంపై రాసి ఇచ్చారని శివకుమార్ అంటున్నాడు. బయటపడిందిలా.. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో టెండర్లు పిలిచారు. ఇందులో శివకుమార్ కూడా పాల్గొన్నాడు. పాత డబ్బులు చెల్లించలేదని, అవి చెల్లించాకే టెండర్లో పాల్గొనాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శివకుమార్ అవాక్కయ్యాడు. తాను ఎప్పుడో డబ్బులు ముట్టజెప్పానంటూ అప్పటి ఈవో సులోచన రాసి ఇచ్చిన కాగితాన్ని చూపించాడు. అయినా వారు ససేమిరా అనడంతో ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సులోచనను వివరణ కోరగా.. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చానని పేర్కొన్నారు. -
నిరాశాజనకంగా ఆగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
-
వేలానికి 'సహారా' ఆస్తులు!
న్యూఢిల్లీః సహారా ఆస్తుల వేలానికి హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తెలిపింది. సహారా గ్రూప్ నకు చెందిన ఆస్తులనుంచి రిజర్వ్ ధర 1,192 కోట్లు వద్ద పదింటిని వేలానికి పెడుతున్నట్లు వెల్లడించింది. డిపాజిట్లు పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిన సహారా గ్రూప్ వ్యవహరంలో ప్రస్తుత ఆస్తుల వేలంతో బాధితులకు త్వరలో న్యాయం జరిగేట్లు కనిపిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు సహారా గ్రూప్ లోని పది ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు సెబి తెలిపింది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్లు అమ్మకాలు ఈ ఆక్షన్ ద్వారా జూలై 4న ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య, తిరిగి జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. సహారా ఆస్తుల అమ్మకాలను చేపట్టి, బాధితులకు వెంటనే డిపాజిట్లు చెల్లించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు అమ్మకాలను ప్రారంభించేందుకు హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ 721,96 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఐదు ప్రాపర్టీలను ఆన్లైన్ లో అమ్మేందుకు నిర్ణయించినట్లు గురువారం ప్రచురించిన ఓ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలుస్తోంది. సహారా గ్రూప్ నకు సంబంధించిన ఆస్తులు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్, ఆంధ్రప్రదేశ్ ల లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకాలకోసం ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సహారాకు సంబంధించిన ఐదు ప్రాపర్టీలను 470.04 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఆన్టైన్ వేలం నిర్వహించనున్నట్లు జూన్ 10న ఓ ప్రత్యేక పబ్లిక్ నోటీసును ప్రచురించనున్నట్లు తెలిపింది. అలాగే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లోని ఆస్తుల పాటకోసం బిడ్డర్స్ జూన్ 8,9 తేదీలలో ఆన్లైన్ లో పరిశీలించవచ్చని తెలిపింది. -
దావూద్ ముంబై ఆస్తులు వేలం
-
మోడీ కుర్చీకి భలే డిమాండు!
ఒక కుర్చీ విలువ ఎంత ఉంటుంది.. మహా అయితే వెయ్యి రూపాయలో, ఇంకా అయితే పదివేలో అంతేకదా. కానీ, ఆగ్రాలో మాత్రం ఒక కుర్చీని దక్కించుకోడానికి కొంతమంది పోటీలు పడి దాని విలువను ఏకంగా లక్షా పాతిక వేల రూపాయలు చేసేశారు!! అవును, అది అలాంటి ఇలాంటి కుర్చీ కాదు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూర్చున్న కుర్చీ మరి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో మోడీ దానిమీద కూర్చున్నారట. అందుకే ఆ కుర్చీని దక్కించుకోడానికి బీజేపీ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఇప్పటివరకు రూ. 1.25 లక్షల బిడ్ వేశారు. ఈ పోటీలో ఇంకా చాలామంది ఉన్నారండోయ్. మరో ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ, ఆగ్రా ఎంపీ రాంశంకర్ కతేరియా లక్ష రూపాయల చొప్పున బిడ్లు వేశారు. అయితే.. ఆరోజు ర్యాలీకి ఫర్నిచర్ అందించిన కాంట్రాక్టరు, బీజేపీ కార్పొరేటర్ అయిన ప్రమోద్ ఉపాధ్యాయ మాత్రం, అసలు ఆ కుర్చీని ఎవరికీ ఇచ్చేది లేదని పట్టుపడుతున్నారట. ఆరోజు కార్యక్రమంలో ఉపయోగించిన కుర్చీల్లో కొన్నింటిని తనకు అమ్మాలని పార్టీ కార్యకర్త ఒకరు సదరు కాంట్రాక్టరును అడగడంతో మోడీ కుర్చీ కోసం పోటీ మొదలైంది. కానీ కాంట్రాక్టర్ ప్రమోద్ నిరాకరించడంతో గుజరాత్ సీఎం కూర్చున్న కుర్చీకి రెండు వేల రూపాయలు ఇస్తానని ఆ కార్యకర్త అప్పటికప్పుడు ఆఫర్ చేశాడు. ఆ పోటీ కాస్తా అలా పెరుగుతూ పోయి ఏకంగా లక్షల వరకు వెళ్లింది! మోడీయా మజాకా మరి!!