
ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ విషయం వింటే..ఇది జోక్ ఏమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయమే అలాంటిది మరి.. అందులోనూ ఓ కోడి గుడ్డు వేలానికి వెళ్లడమే విడ్డూరం అనుకుంటే..ఇక ఆ వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో వింటే నోరెళ్లబెడతారు. ప్చ్..! ఇదెలా అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించొద్దు..ఆలస్యం చేయకుండా అసలు కథేంటో చదివేయండి మరీ..
సాధారణంగా కోడిగుడ్డులు అండాకారం లేదా ఓవెల్ ఆకృతిలోనే ఉంటాయి. అందరికీ తెలిసింది. కానీ ఓ గుడ్డు మ్రాతం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా..!. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని సోమర్‌సెట్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్‌లో చోటు చేసుకుంది.
ఆ ఫామ్‌లో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నా అలిసన్ గ్రీన్ అనే మహిళ అలా గుండ్రంగా ఉన్న కోడిగుడ్డుని చూసి అవాక్కయ్యింది. ఆ విధంగా ఆ గుడ్డు వేలానికి వెళ్లింది. అయితే అది ఏకంగా రూ. 43000లకు అమ్ముడైంది. ఆ డబ్బుని అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళల కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ డెవాన్ రేప్ క్రైసిస్‌కు అందివ్వనున్నట్లు పేర్కొంది అల్లిసన్.
ఈ మేరకు అల్లిసన్ మాట్లాడుతూ..మూడేళ్లుగా ఫెంటన్ ఫామ్‌లో పనిచేస్తున్నా..ఇప్పటి వరకు దాదాపు 42 మిలయన్ల గుడ్లను సేకరించా..కానీ ఇలాంటి గుండ్రని గుడ్డుని మాత్రం చూడలేదని అన్నారు. ఇది తనను ఎంతగానో ఆకర్షించిందని..అందువల్లే వేలంలో పెట్టి వచ్చిన డబ్బు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నట్లు పేర్కొంది. అందుకు తమ ఫామ్ యజమాని కూడా ఒప్పుకోవడంతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది అలిసన్.
(చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయొద్దు..! కొంచెం చూసి తిందామా..)
Comments
Please login to add a commentAdd a comment