Egg
-
World Best Egg Dishes: మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..
గుడ్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటితో డెజెర్ట్ల దగ్గర నుంచి వివిధ రకాల వంటకాల వరకు పలు రకాలు చేసుకుని ఆస్వాదిస్తుంటా. అలాంటి గుడ్డు వంటకాలలో ది బెస్ట్‌గా భారతీయ వంటకం నిలిచింది. ప్రతి ఏడాది ది బెస్ట్ డెజర్ట్, బెస్ట్ కర్రీ వంటి వాటికి ర్యాంకులిచ్చి మరీ జాబితాను విడుదల చేసే ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ గుడ్డు వంటకాల జాబితానను కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే టాప్ వంద గుడ్డు వంటకాల జాబితాను వెల్లడించింది. వాటిలో మన భారతీయ వంటకం మసాలా అమ్మేట్ 22వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి 50 బెస్ట్ గుడ్డు వంటకాల్లో మసాలా ఆమ్లేట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో జపాన్‌కి చెందిన అజిత్సుకే టమాగో అనే గుడ్డు వంటకం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అజితసుకే టమాగో అనేది మిరిన్, సోయా సాస్‌తో నానబెట్టి ఉకించిన గుడలతో చేసే సంప్రదాయ జపనీస్ వంటకం ఇది. ఇక నోరూరించే మన భారతీయ మసాలా అమ్మెట్ తయారీ ఎలాగో చూద్దామా..!దీనిని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు పొడితో తయారు చేస్తారు. అన్ని పదార్థాలను గుడ్లతో కలిపి, ఆ మిశ్రమాన్ని పాన్‌లో (సాధారణంగా వెన్న లేదా నూనెతో) వండుతారు. ఈ స్పైసీ ఆమ్లెట్‌ను సాంప్రదాయకంగా పావ్ లేదా బ్రెడ్‌తో అల్పాహారంగా వడ్డిస్తారు. తాజాగా వండిన రోటీతో కూడా తినవచ్చు. చాలా మంది దీనిని టమోటా కెచప్ లేదా కొత్తిమీర-పుదీనా చట్నీతో ఆస్వాదిస్తారు. వీధి దుకాణాలలో ఈ వంటకాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కొందరూ టమోటాలను కూడా ఉపయోగిస్తారు. చివరగా ప్రపంచంలోని టాప్ 10 గుడ్డు వంటకాల జాబితా ఏంటంటే..అజిత్సుకే టమాగో (జపాన్) టోర్టాంగ్ టాలాంగ్ (ఫిలిప్పీన్స్) స్టాకా మే అయ్గా (గ్రీస్) స్ట్రాపట్సదా (గ్రీస్) ఇస్పానక్లి యుమూర్త (టర్కీ) టోర్టిల్లా డి బెటాన్జోస్ (స్పెయిన్) యుఎస్ఎ బెనెడిక్ట్ (జపాన్) షక్షౌకా (ట్యునీషియా ప్రాంతాలు) మెనెమెన్ (టర్కీ)(చదవండి: -
బర్డ్‌ఫ్లూ భయం : సగానికి దిగజారిన గుడ్డు వినియోగం!
గుడ్లవల్లేరు: కోడిగుడ్డు వాడకాలు సగానికి పడిపోయాయి. జిల్లాలో నిత్యం కోడిగుడ్ల వినియోగం 20 లక్షల పైమాటే ఉండేది. కానీ బర్డ్‌ఫ్లూతో 10 లక్షలకు వాడకాలు పడిపోయాయి. గతంలో రిటైల్‌లో గుడ్డు ధర రూ.7 ఉండేది. అదే కోడిగుడ్డు ధర రూ.4.30కు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌తో పాటు కోడిగుడ్లను తినకూడదన్న ప్రచారం బాగా కొనసాగుతుంది. దీంతో గుడ్డుకు ఉండే మాత్రం డిమాండ్ తగ్గిపోయింది. జిల్లాలో నిత్యం ఈ కోడిగుడ్ల వినియోగం 20లక్షల పైమాటే ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 ఉండేది. అది కాస్తా....రూ.7కు పెరిగిపోయింది. ఇప్పుడైతే బర్డ్‌ఫ్లూతో రూ.4.50కు దిగజారింది. 30 గుడ్లు ఉండే ఒక్కో ట్రే గుడ్లను ప్రాంతాలను బట్టి రూ.135 నుంచి రూ.15 0వరకు మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.బర్డ్‌ఫ్లూ భయంతో.... బర్డ్‌ఫ్లూతో జిల్లాలో కోడిగుడ్ల వాడకం 10 లక్షలకు పడిపోయింది. తిరువూరు, గంపలగూడెంలో బర్డ్‌ఫ్లూ కలకలంతో మరింత ఆందోళన అధికమైంది. గతంలో జిల్లాలో గుడ్ల వాడకం 20 లక్షల పైమాటే ఉండేది. జిల్లాలోని ప్రజలతో పాటు హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్ల వినియోగం కూడా బర్డ్‌ఫ్లూతో తగ్గిపోయింది. అలాగే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో వాడకం కూడా నానాటికీ దిగజారిపోతుంది. వీటిలో గుడ్ల వాడకం గతంలో ప్రతి స్నాక్స్ కోటింగ్‌కు వినియోగించటంతో పాటు ఫ్రైడ్‌రైస్ తయారు చేసే ఆ చెఫ్‌కు ఎగ్స్ లేకుండా వంట అనేది ముందుకు వెళ్లేదే కాదు. కానీ ఇపుడు చికెన్‌తో పాటు గుడ్డు లేకుండా ఉన్న స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్నే కస్టమర్స్ ఎక్కువగా అడుగుతున్నారని ఆ రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గుడ్డుకు ఇలాగే డిమాండ్ తగ్గితే ఇపుడు ఒక్కో గుడ్డు రూ.4.50 ఉండటంతో ఆగిపోకుండా మరింతగా దిగజారిపోయే అవకాశం ఉందని వ్యాపారులు సతమతమవుతున్నారు.గుడ్డు హ్యాపీగా తినవచ్చు బర్డ్‌ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో తప్ప గుడ్డును నిత్యం ఎలా ఆరోగ్యానికి వినియోగిస్తారో...అలాగే తినవచ్చు. కానీ ఆరగ్యోం కోసం పచ్చి గుడ్లను తాగేవాళ్లు కొన్నాళ్లు ఆ అలవాటుకు అడ్డుకట్ట వేయాలి. బర్డ్ఫ్యూ ప్రభావం తగ్గేంత వరకు కొన్ని జాగ్రత్తలతో గుడ్లను తింటే ఆరోగ్యానికి మంచిది. సగం ఉడికించిన (హాఫ్ బాయిల్డ్) గానీ, సరిగా ఉడకని ఆమ్లెట్ గానీ తినకూడదు. చలికాలంలో గుడ్లను తినటంతో శరీరానికి ఎక్కువగా వెచ్చదనం వస్తోంది. – డాక్టర్ ఎ.లక్ష్మీనారాయణ,వెటర్నరీ ఏడీ గుడ్లవల్లేరు -
'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది ఎందుకంటే..?.ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్‌తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట. ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్‌ని చీజ్‌లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!. ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్‌ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.కావాల్సిన పదార్థాలు తురిమిన చీజ్: 80 గ్రాములుబ్రెడ్: రెండు స్లైసులుస్ప్రింగ్ ఆనియన్స్ : 2పచ్చి మిరపకాయ: 1నూనె: 1 టీస్పూన్పెద్ద గుడ్లు: 2నల్ల మిరియాలు: రుచికి సరిపడతురిమిన చీజ్‌లో చక్కగా గోల్డెన్ కలర్లో బ్రెడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్‌పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇది.(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!) -
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్‌ఫ్లూ తరహాలోనే.. బర్డ్‌ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్‌లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
హ్యూమన్స్ ఆఫ్ బాంబే సీఈఓ కరిష్మా మెహతా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటీవల తన అండాలను (ఎగ్స్)ను భద్రపర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్దతిని ఇప్పటికే చాలా మంది, సెలబ్రిటీలు హీరోయిన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పునరుత్పత్తి సాధికారత కోసం ఎగ్స్‌ను చాలా మంది మహిళలు ఫ్రీజ్ చేసుకుంటున్న అంశాన్ని ఆమె హైలైట్ చేశారు. ఇంతకీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకోవడం. ఇది కరియర్లో లేదా చదువులో బిజీగా ఉన్నపుడు, కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులు బాటు కల్పిస్తుంది. 30 వయసు దాటిన తరువాత నుంచి మహిళల్లో అండాల ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత క్షీణిస్తుంది అందుకే ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మహిళల అండాలను సేకరిచి భద్రపరుస్తారు. కావాలనుకున్నపుడు ఈ అండాల ద్వారా పిల్లల్ని కనవచ్చు.ఈ ప్రక్రియను “ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ అంటారు. తద్వారా జీవితంలో తరువాతి కాలంలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు తమ అండాలను గుడ్డు దానం విషయంలో ఇదే టెక్నిక్ సహాయపడుతుంది. మహిళల అండాల పరిస్థితి, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకోసం దాదాపు 10 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చు. తాజాగా కరిష్మా మెహతా ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. తద్వారా ఎగ్ ఫ్రీజింగ్ మహిళల సంతానోత్పత్తి, పిల్లల్ని ఎపుడు కనాలి అంశాలనే చర్చను మరింత విస్తృతం చేశారు. కాగా ముంబైకి చెందిన కరిష్మా 1992 మార్చి 5న జన్మించింది. తన ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ ద్వారా ఎందరో విజేతలను పరిచయం చేసింది. వారు అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి.ఇలా సంతానోత్పత్తిలో కీలకమైన అండాలను మహళలు భద్రపర్చుకోవడం ద్వారా పిల్లల్ని ఎపుడు కనాలనుకుంటే అపుడు కనేందుకు ఇది చాలా అవసరమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పిల్లల్ని కనేందుకు సంసిద్దంగా లేనపుడు, భవిష్యత్తులో పిల్లలు పుడతారా లేదా? అనే ఒత్తిడిని అరికట్టేందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అనుమతిస్తుంది.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. స్టార్ హీరోయిన్, ప్రియాంక చోప్రా, హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరారు. అంతేకాదు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్ షిప్ దొరకడం చాలా కష్టమని. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పు కొచ్చింది. -
తిరుమలలో ఎగ్ పలావ్!
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శనివారం కొందరు కొడిగుడ్ల పలావ్ (ఎగ్ బిర్యానీ) తింటూ కనిపించడం కలకలం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం గుమ్ముడిపూండికి చెందిన 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్ నిండా కోడిగుడ్ల పలావ్ తమ వెంట తెచ్చుకున్నారు. వారు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్, లగేజ్ స్కానింగ్ దాటుకుని తిరుమలకు చేరుకున్నారు. రాంబగీచా అతిథిగృహం సమీపంలోని బస్టాండ్ వద్ద బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావ్ తినసాగారు.ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి సమీపంలోని పోలీస్ కాంప్లెక్స్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి గుమ్ముడిపూండికి చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలకు ఇలాంటి ఆహారం తీసుకురాకూడదని పోలీసులు మందలించారు. ఈ అంశంపై టూ టౌన్ సీఐని సంప్రదించగా.. అది చాలా చిన్న విషయమని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం గమనార్హం. కాగా, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం నిఘా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తిరుమలలో బయటపడ్డ ఎగ్ పలావ్ -
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్‌కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గుడ్డు పగలగొట్టారు బ్రో..
-
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్‌పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్‌గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్‌గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
తగ్గిన చికెన్ ధర.. పెరిగిన గుడ్డు ధర
జ్యోతినగర్(రామగుండం): బహిరంగ మార్కెట్లో కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకకోడిగుడ్డు రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది. హోల్‌సేల్‌గా రూ.6.50గా ధర ఉంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు.క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్‌ల కోసం..ఈనెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదేసమయంలో కేక్‌ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్‌లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.కార్తీకం నేపథ్యంలో దిగివచ్చిన చికెన్కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గాయి. కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్ పడిపోయిందని, ఫలితంగా చికెన్ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.180గా పలుకుతోది. మరోవైపు.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరకు చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.చలికాలమే కారణం..30 గుడ్లు గల ట్రే ధర రూ.195గా ఉంది. హోల్‌సేల్‌గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.– గుండ చంద్రమౌళి, హోల్‌సేల్ వ్యాపారి, ఎన్టీపీసీ -
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్‌గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్‌గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్‌కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!) -
కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు. ‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
లింగాల: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో చోటుచేసు కుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన ఉప్పరి తిరుపతయ్య (55) ఆదివారం లింగాల మండలంలోని అప్పాయ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చాడు. లింగాలలో ఉన్న బజ్జీల బండి దగ్గర ఉడకబెట్టిన గుడ్డు తీసుకున్నాడు. అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న కమాన్ దగ్గర కూర్చొని గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించి వారికి మృతదేహాన్ని అప్పగించారు. తిరుపతయ్య భార్య లక్ష్మమ్మ మూడేళ్ల క్రితం మృతిచెందగా ముగ్గురు కుమారులు ఉన్నారు. -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
ఈ విషయం తెలుసా! ఏ గుడ్డయినా... వెరీగుడ్డే!
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్లలో బలం ఎక్కువగా ఉంటుందని కొందరిలో ఓ అపోహ ఉంటుంది. కానీ పోషక విలువల విషయంలో నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా ఒకటే. రెండింటిలోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే కాస్తంత చిన్నగా ఉంటాయి, మరికాస్త ఎక్కువ ముదురురంగుతో కాస్త గోధుమరంగు అనిపించేలా ఉంటాయి. అంతేతప్ప పోషకాలతో పాటు మరింకే విషయంలోనూ తేడా ఉండదు. కాబట్టి అధిక ధర పెట్టి నాటు కోడిగుడ్లు కొనడమన్నది జేబుకు నష్టం తప్ప... ఒంటికి చేకూరేలా మరే లాభమూ ఉండదు.ఇవి చదవండి: కాటేసిన కార్ఖానా -
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్‌పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్‌లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
అంగన్ వాడీల్లో పురుగులు గుడ్లు..
-
ఎగ్గొట్టారు!
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులు అర్ధాకలితో సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పేరుతో ఆకర్షణీయమైన మెనూతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించగా.. నేడు ఆ పథకం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఇవ్వడం లేదు. గుంటూరులో ఉన్న 14 ఉన్నత పాఠశాలలతో పాటు 80 ప్రాథమిక పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రూపకల్పన చేసిన మెనూ యథావిధిగా అమలయ్యేది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేశారు. దీంతో విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం తృప్తిగా ఆరగించేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది. విద్యార్థులకు వారంలో ఐదు రోజులు కోడి గుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. దీనిని పూర్తిగా విస్మరించారు. ఎక్కడా మెనూ పాటిస్తున్న దాఖలాలు లేవు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు.. చాలీచాలని, రుచి లేని భోజనం చేయలేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని చెప్పారు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
-
యూఎస్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్‌ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్‌ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్‌తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్‌ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్‌ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో సలాడ్స్ ముందువరుసలో ఉంటాయి. కానీ సలాడ్స్‌ను తయారు చేసుకోవడమంటేనే బద్ధకమా? అయితే వెంటనే ఈ స్లైస్ డివైస్‌ని తెచ్చుకోండి. ఏ పండునైనా ఒకే ఒక్క నిమిషంలో స్లైసెస్‌గా చేసిపెడుతుంది. ఉడికించిన గుడ్లు, యాపిల్, బనానా వంటి పండ్లనైతే ఒకేసారి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా మధ్యలో ఒక వైపు మందంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ డివైడర్ స్టాండ్ అమర్చి ఉంటుంది. దాని సాయంతో పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మరోవైపు కూడా అదేమాదిరి మరో షేప్‌లో డివైడర్ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం.. క్లీన్ చేసుకోవడం రెండూ సులభమే. కిచెన్‌లో చిన్న ప్లేస్‌లో కూడా దీన్ని సర్దొచ్చు. స్థలం పెద్దగా ఆక్రమించదు. దీని ధర 7 డాలర్లు (రూ.580). ఇవి చదవండి: ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ -
1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..? వివరాల్లోకెళ్తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్) -
ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?
నాకిప్పుడు 32 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా కెరీర్ వల్ల పిల్లలను ప్లాన్ చేసుకోవడం లేట్ అవుతోంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌కి వెళితే.. ఇప్పటికిప్పుడు నా ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఒక అయిదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సాధ్యమేనా? అప్పటికీ ఎగ్స్ ఇంతే క్వాలిటీతో ఉంటాయా? ప్రెగ్నెన్సీ క్యారీ చేయడంలో అయిదారేళ్ల తర్వాత నా ఏజ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? నా డౌట్స్ క్లియర్ చేయగలరు. మీ ఆన్సర్స్ మీదే నేను పిల్లలను ప్లాన్ చేసుకోవడం డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నా హజ్సెండ్ సహా మా ఇంట్లో వాళ్లంతా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ని ఒప్పుకోవట్లేదు. పేరు, ఊరు రాయలేదు. ఎగ్ ఫ్రీజింగ్ని oocyte cryopreservation అంటారు. ఈ ప్రొసీజర్‌లో అండాశయాల నుంచి అండాలను తీసి ఫ్రీజ్ చేసి అన్ఫర్టిలైజ్డ్ స్టేట్‌లో ఉంచుతారు. భవిష్యత్‌లో గర్భందాల్చాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్‌ని ఫర్టిలైజేషన్కి ఉపయోగించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చేలా చేస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల స్త్రీలు ఈ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో oocyte క్వాలిటీ చాలా త్వరగా తగ్గిపోతోంది. ఇప్పుడు 30–35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే సౌకర్యాన్ని చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి దీన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలోనూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఫ్రోజెన్ ఎగ్స్ cryo freezing ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అండాశయాల నుంచి అండాలను తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించి అంటే బవెల్ గాయపడడం, రక్తనాళాలు గాయపడడం వంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అండాలను తీయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్కి కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి రావచ్చు. వీటిని మందులతో తగ్గించవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ 5 శాతం కేసెస్‌లో కనపడతాయి. 0.1 శాతం కేసెస్‌లో బ్లడ్ క్లాట్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్ వంటివాటితో కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే.. నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత శాతం రిస్క్ ఉంటుందో ఫ్రోజెన్ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలోనూ అంతే రిస్క్ ఉంటుంది. అదనంగా ఏమీ ఉండవని అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఫ్రోజెన్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ 30 – 60 శాతం వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎగ్ ఫ్రీజింగ్ సమయంలోని మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. --డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!) -
మామిడిపిందె అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
'మనం సాధారణంగా కోడిగుడ్లల్లో పెద్దవిగానో, చిన్నవిగానో చూసి ఉంటాం. అలాగే కొన్నింటినీ గండ్రంగా గానీ, పొడవుగా గానీ, తోలుగుడ్లలాంటివి కూడా చూసుంటాం. కానీ ఇలాంటి అసలు సిసలైన, గమ్మత్తైన కోడిగుడ్డును చూశారా! మరెందుకు ఆలస్యం.. అదేంటో చూద్దాం!' ఈ ఫొటోలో చూస్తుంది.. మామిడిపిందె అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాదు కాదు.. తప్పులో కాలేసినట్లే.. అవును ఇది నిజం.. ఇది మామిడిపిందె కాదు.. మామిడి పిందె ఆకారంలో ఉన్న అసలు సిసలైన ‘కోడిగుడ్డు’.. ఇది నమ్మాల్సిన నిజమే.. మామిడి పిందెలాంటి గుడ్డు కథలోకి వెళ్తే.. హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఎదురుగా ఉన్న దుమ్మల శ్రీనివాస్‌యాదవ్ కిరాణంలో గురువారం ఈ మామిడిపిందె ఆకారంలో ఉన్న కోడిగుడ్డు కనిపించింది. అప్పుడే వచ్చిన కోడిగుడ్ల నిల్వను దుకాణంలో ఓ చోట పెడుతూ ఉండగా ఒక్కసారిగా గుడ్ల ట్రేలో తేడా కనిపించడంతో పరీక్షించి చూడగా కోడిగుడ్డు రూపం గమ్మత్తుగా అగుపించింది. కోడిగుడ్డు అచ్చంగా ‘మామిడిపిందె’ ఆకారంలో విచిత్రంగా కనబడటంతో ఆ గుడ్డును అంతా విచిత్రంగా చూస్తూ ఔరా.! ఇదేంటీ ఈ విచిత్రం సుమా.. అనుకోవడం కొసమెరుపే. ఇవి చదవండి: ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ! కానీ ఆమెకు.. -
చికెన్ చౌక.. గుడ్డు కేక!
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి వేళ మాంసాహార ప్రియులకు చికెన్ ధర ఊరటనిస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా దీని రేటు దిగివచ్చింది. దాదాపు నెల రోజుల కిందట కిలో బ్రాయిలర్ చికెన్ రూ.300కు పైగా పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.190కి క్షీణించింది. సంక్రాంతి మర్నాడు కనుమ పండగకు మాంసాహారులు బంధుమిత్రులతో కలిసి విధిగా చికెన్, మటన్ వంటి వాటిని తినడం రివాజుగా వస్తోంది. సాధారణ రోజులకంటే ఆరోజు మూడు నాలుగు రెట్ల అధికంగా వీటి వినియోగం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని విక్రయదారులు వీటి ధరను గణనీయంగా పెంచుతుంటారు. అయితే ఈ ఏడాది కనుమకు బ్రాయిలర్ కోడి మాంసం సరసమైన ధరకే లభించనుంది. కొద్దిరోజుల నుంచి మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.170–180 మధ్య ఉంది. రెండ్రోజుల కిందట స్వల్పంగా పెరిగి రూ.190కు చేరుకుంది. అయినప్పటికీ ఈ ధర మధ్య తరగతి వారికి సైతం అందుబాటులోనే ఉంది. కిలో రూ.300 రేటుతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గింది. మంగళవారం కనుమ నాటికి మరికాస్త పెరిగినా అది రూ.10–20కి మించి ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా గడచిన కొన్నేళ్ల కనుమ పండగలతో పోల్చుకుంటే ఈసారి చికెన్ ధర చాలా తక్కువగా ఉందని నాన్‌వెజ్ ప్రియులు అంటున్నారు. ‘ఎగ్’బాకి.. దిగివచ్చి.. మరోవైపు కోడిగుడ్ల కొద్ది రోజుల నుంచి ధర స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నెల రోజుల కిందట విశాఖపట్నంలో వంద గుడ్ల ధర రూ.590 ఉండగా డిసెంబర్ 27 నాటికి అది రికార్డు స్థాయిలో రూ.625కి ఎగబాకి పౌల్ట్రీ చరిత్రలో అత్యధిక ధరను నమోదు చేసింది. ఇలా ఈ నెల 10 వరకు ఇదే రేటు కొనసాగింది. 11వ తేదీ నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.599 రేటు కొనసాగుతోంది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డుపై కోల్‌కతా మార్కెట్ ప్రభావం కోడిగుడ్ల ధరపై కోల్‌కతా మార్కెట్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నిత్యం కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. శీతాకాలంలో ఆయా ప్రాంతాల ప్రజలు గుడ్లను విరివిగా తింటారు. దీంతో ఇతర సీజన్లకంటే ఈ శీతలంలో గుడ్ల వినియోగం గణనీయంగా ఊపందుకుంటుంది. దీనికనుగుణంగా వీటి రేటు కూడా పెరుగుతుంది. ఇటీవలే కోల్‌కతా మార్కెట్లో గుడ్ల కొనుగోళ్లను తగ్గించడంతో ధర క్షీణించింది. ఫలితంగా విశాఖలో వంద గుడ్ల ధర రూ.625 నుంచి 599కి తగ్గింది. ధర తగ్గితే గుడ్లను నిల్వ చేసుకునే సదుపాయం ఉత్తరాంధ్రలో అంతగా లేదు. దీంతో పౌల్ట్రీ రైతులు రేటు ఎంతున్నా తెగనమ్ముకోవల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రలో 40 లక్షల కోళ్లు రోజుకు సగటున 32 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. దాదాపుగా ఇవన్నీ స్థానికంగానే వినియోగమవుతాయని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ సభ్యుడు భరణికాన రామారావు ‘సాక్షి’కి చెప్పారు. పొరుగున ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే గుడ్లను కొన్ని స్థానిక వినియోగానికి, మరికొన్ని ఎగుమతి చేస్తుంటారు. -
ధర ఎగ్సే
సాక్షి, భీమవరం/అమరావతి: పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. కోడి గుడ్డు రైతు ధర రూ.5.79కు చేరి పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా.. పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.7కు చేరింది. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 60 శాతం ఉత్తరాదికి ఎగుమతి రాష్ట్రంలో 2 వేలకు పైగా కోళ్లఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సగటున 4.20 కోట్ల నుంచి 4.75 కోట్ల మధ్య గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 40 శాతం స్థానికంగానే వినియోగిస్తుండగా.. మిగిలిన 60 శాతం బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావం ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి ముఖ్య సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ సీజన్లో అత్యధిక ధర నమోదవుతుంటుంది. 2017–18 సీజన్లో రూ.5.45 అత్యధిక ధర నమోదైంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో సీజన్ కలిసి రాక రైతు ధర రూ.5 దాటడం గగనంగా ఉండేంది. చరిత్రలో ఇదే గరిష్ట ధర ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పడటంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి నాలుగేళ్ల తర్వాత 2022–23 పౌల్ట్రీ సీజన్లో రూ.5.57 గరిష్ట ధర పలికింది. కాగా.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో ధరలో ఒడిదొడుకులు ఎదురైనా.. వారం, 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం రూ.5.79కి చేరి అల్‌టైమ్ రికార్డు నమోదైంది. కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో స్థానిక వినియోగం మరింత పెరగనుండటంతో ఫామ్ గేట్ వద్ద ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నూకలు దొరకట్లేదు పౌల్ట్రీ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే నూకలు టన్ను రూ.13 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు చేరింది. నూకలను ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తుండటంతో మార్కెట్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నూకలకు బదులు మొక్కజొన్నపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మొక్కజొన్న కూడా టన్ను రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. సోయాబీన్ టన్ను రూ.48 వేల నుంచి రూ.50 వేల మధ్య పలుకుతోంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. పెరిగిన మేత ధరలతో పాటు మందులు, వ్యాక్సిన్ల ధరలు, కార్మికుల జీతాలు పెరగడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచేసింది. ఫలితంగా పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి గతేడాది రూ.300–310 ఖర్చు కాగా.. ప్రస్తుతం రూ.360–370 ఖర్చవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7, మారుమూల పల్లెల్లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రైతు ధరకు 40–50 పైసలు అదనంగా చేర్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంటారు. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
గుడ్డులోని పచ్చసొన మంచిదేనా? ఇన్నాళ్లకు సమాధానం దొరికింది
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. అయితే చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం.గుడ్డులోని పచ్చసొన తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భ్రమ పడతారు. అందుకే కేవలం ఎగ్‌వైట్ మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంతకీ కోడిగుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? ఎప్పటినుంచో ఉన్న ఈ సందేహానికి రీసెంట్గా యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్‌తో ఫుల్స్టాప్ పడింది. ఇంతకీ ఆ అధ్యయనంలో ఏం తేలింది? అన్నది ఈ స్టోరీలో చదివేయండి. కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది గుడ్డు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఉడకబెట్టిన గుడ్లు. అమ్లెట్, ఫ్రై ఇలా అనేక రూపాల్లో తీసుకుంటారు. అయితే, మనలో చాలామంది పచ్చసొనను తీసుకోవటం అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఫ్యాట్ ఫుడ్ అని, దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని భావిస్తారు. తాజాగా ఇదే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ (యుకాన్) సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం 18-35ఏళ్ల వయసున్న 28 మంది ఆరోగ్యవంతులను ఈ రీసెర్చ్ కోసంఎంచుకున్నారు. వీళ్లలో కొందరిని కేవలం ఎగ్ వైట్ తినేలా, మరికొందరిని పచ్చసొనతో కలిపి గుడ్డు మొత్తం తినేలా, మిగిలిన వాళ్లకు గుడ్డు లేని ఆహారం అందించారు. నాలుగు వారాల తర్వాత వారి డైట్‌ను బట్టి జీవక్రియ, హెమటోలాజికల్ ప్రొఫైల్‌లపై గుడ్డు ప్రభావాన్ని పరిశీలించారు. వీరిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కోలిన్ అనే పోషకం గణనీయమైన పెరుగుదలను చూపించిందని సైంటిస్టులు తెలిపారు. కోలీన్.. మెదడు, నాడీ వ్యవస్థ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రించడానిక కోలిన్ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ట్రైమిథైలామైన్ N-ఆక్సైడ్ (TMAO) ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా గుడ్డు పచ్చసొన తింటే కొవ్వు పెరిగి గుండెపై ప్రభావం చూపిస్తుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు జరిపిన ప్రయోగం ప్రకారం.. పచ్చసొన కలిపిన గుడ్డు తిన్నవారిలో TMAO మారలేదని పరిశోధకులు గమనించారు. గుడ్డు మొత్తాన్నితినడం వల్ల మైక్రోన్యూట్రియెంట్ డైట్ క్వాలిటీ, కోలిన్, మంచి కొలెస్ట్రాల్‌లో పెరుగుదల కనిపించిందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. వాస్తవానికి గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ మరియు విటమిన్ B2 చాలా ఎక్కువ. కానీ గుడ్డు పచ్చసొనలో వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఒక కంప్లీట్ ఎగ్ తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమతులంగా అందుతాయి గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి కొవ్వు కరిగే విటమిన్లు ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. థైరాయిడ్ ఆరోగ్యంలో సెలీనియం కీలకపాత్ర పోషిస్తుంది. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందున బరువు పెరిగే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది.అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట. జంక్ ఫుడ్స్, మధ్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ మినహాయించి ఎవరైనా పచ్చసొనతో కలిపి గుడ్డును తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచి నిక్షేపంగా గుడ్డులోని పచ్చసొనను కూడా తినొచ్చన్నమాట. -
గుడ్డుతో భలే వెరైటీలు.. ఎగ్ ఫింగర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ ఫింగర్స్ తయారికి కావల్సినవి: గుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, మైదా పిండి – పావు కప్పు చాట్ మసాలా, కారం – పావు టీ స్పూన్ చొప్పున బ్రెడ్ పౌడర్ – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మూడు గుడ్లు పగలగొట్టి.. అందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చతురస్రాకారపు పాత్రకు నూనె రాసి.. దానిలో వేసుకుని.. స్టీమ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక చిన్న పాత్రలో మిగిలిన గుడ్డు పగలగొట్టి, స్పూన్‌తో గిలకొట్టి పెట్టుకోవాలి. మరో పాత్రలో మైదా పిండి, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో చిన్న పాత్రలో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో ముక్కను మొదట మైదా మిశ్రమంలో.. తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి అటూ ఇటూ తిప్పి.. బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. -
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్‌గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
Egg Side Effects: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?
గుడ్డు ఆరోగ్యానికి మంచిదని డైట్లో కంప్లసరీ ఉండేలా చూసుకుంటారు. దీనిలో ప్రోటీన్ల తోపాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కూడా ఉంటాయన్నది నిజమే. కానీ అలా అని వాటిని ఎక్కువగా తింటే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తింటే అంతే ప్రమాదం అంటున్నారు వైద్యులు. గుడ్డు ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్డు అస్సలు తినకూడదు. తింటే ఒక్కసారిగి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న పేషెంట్లు తింటే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. తినాలనుకుంటే గుడ్డులోని పసుపు భాగాన్ని బయటకు తీసి తినవచ్చు. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే గాక శరీరంలో అదనపు ప్రోటీన్లు, కొవ్వు కూడా పెరుగుతుంది. మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువే. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. అతిగే తింటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు (చదవండి: జీ20లో అదిరిపోయే వంటకాలు ఇవే..ఏకంగా 500కిపైగా..) -
వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!
ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!. బనానా ఆమ్లెట్కి కావలసినవి: అరటి పండు – ఒకటి గుడ్లు – రెండు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – టీస్పూను కారం – అరటీస్పూను నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా. తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్‌లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ. (చదవండి: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..) -
వీకెండ్ స్పెషల్: ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా, టేస్ట్ మామూలుగా ఉండదు
ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా తయారీకి కావల్సినవి: ఉడికించిన గుడ్లు – ఆరు; మటన్ ఖీమా – అరకేజీ; కారం – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; మిరియాల పొడి – టీస్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చిమర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; బ్రెడ్ ముక్కల ΄÷డి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేయాలి. ► దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కల పొడి, టేబుల్ స్పూను నూనె వేసి మెత్త్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక మాదిరి పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి. ► ఇప్పుడు ఉడికించిన గుడ్ల పెంకు తీసేయాలి ∙ఖీమా ఉండను తెరిచి గుడ్డును లోపలపెట్టి ఖీమా మిశ్రమంతో కోఫ్తాలా వత్తుకోవాలి. ► ఇలా ఆరు గుడ్లను కోఫ్తాలా తయారు చేసుకున్నాక, సన్నని మంటమీద డీప్ఫ్రైచేయాలి. ► కోఫ్తా బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించితే ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా రెడీ . ► కోఫ్తాను మధ్యలో రెండు సగాలుగా కట్ చేసి నచ్చిన సాస్‌తో సర్వ్‌చేసుకోవాలి. -
పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?
పచ్చసొన పారేస్తున్నారా? చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం. నిజానికి పచ్చసొన మీకు ఎటువంటి హానీ కలిగించదు. పైగా గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినడం వల్ల పచ్చసొనలో ఉండే ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరు. పచ్చసొన తినకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం పోషకాల లోపం గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చికెన్, చేపలు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో కనిపిస్తుంది. పూర్తిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చసొనలో ఐరన్, జింక్ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు. రోగనిరోధక శక్తి కోల్పోవడం: గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి12 ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కళ్లను సురక్షితంగా ఉంచడమే కాకుండా చర్మం, జుట్టుకి కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న చాలామంది వ్యక్తులు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా వదిలేస్తారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాదాపు ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ తీసుకునే మటన్ , ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే తక్కువే. ఇలాంటి పరిస్థితులలో గుడ్డులోని పసుపుభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి.. ప్రకృతి మనకు గుడ్డులో తెల్లసొన, పచ్చసొన కలిపే ఇచ్చింది. అంటే కలిపే తినమని అర్థం. కాబట్టి అది మంచిది కాదేమోననే అనుమానంతో దానిని వేరు చేయాల్సిన అవసరం లేదు. (చదవండి: బరువు తగ్గడం..అంత బరువేం కాదు!) -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
'గుడ్డు' లేకుండానే ఆమ్లెట్..ఆ సరికొత్త రెసిపీ వ్యాపారవేత్తగా..
ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో పొట్టకింత తిన్నమా అన్నట్లు కానిస్తారు. ఏదో తూతూ మంత్రంగా తినడమే గానీ గంటలు గంటలు కూర్చొని చేసే వంటకాల జోలికే వెళ్లరు. ఇక బ్రేక్ ఫాస్ట్‌లు దగ్గరకు వస్తే..త్వరగా అయిపోయే వాటికే ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ముఖ్యంగా బ్రెడ్, ఆమ్లేట్ వంటివే ప్రివర్ చేస్తారు. చాలామంది ఉడకబెట్టి లేదా బ్రెడ్ ఆమ్లెట్ వంటి రెసీపీలు చేసుకుంటారు. మనం వెళ్లే కంగారు ఆ గుడ్డుని పగలుగొట్టడానికి నానాతంటాలు..ఇక గిలకొట్టడం మరో పని. దీంతో హడావిడిగా కిందమీద పడేసి చేసేస్తుంటాం. అలాంటి హైరానా ఏమి లేకుండా..అసలు 'గుడ్డే' లేకుండా క్షణాల్లో రెడీ చేసే ఆమ్లేట్ మన ముందుకు వస్తోంది. ఓ కేరళ వ్యక్తి దీన్ని సృష్టించాడు. ఇంతకీ ఎలా చేస్తారు? ఏవిధంగా వంటి కథాకమామీషులు ఒక్కసారి చూద్దామా!. వివరాల్లోకెళ్తే..కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ 'గుడ్లు' లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాడు. అందుకు సంబంధించిన ఇన్స్టెంట్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు కూడా. ఆ పౌడర్‌కి సంబంధించిన చిన్న ప్యాకెట్ ధర రూ. 5 నుంచి రూ. 100 వరకు వివిధ రేంజ్లో ధరలో పెద్ద ప్యాకెట్ల వరకు కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు. ఈ పౌడర్ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందట. ఈ రెసీపీ తయారీ వెనుక ఉన్న రీజన్.. అర్జున్ తన కూతురు ధన్‌శివ కోసం "ముత్తయప్పం" (ఆమ్లెట్) త్వరగా ఎలా తయారు చేయడం ఎలా అని ఆలోచించాడు. అదే ఈ గుడ్డ లేకుండా త్వరగా చేసే ఆమ్లెట్ రెసీపీకి నాంది పలికింది. ఆ తరువాత అర్జున్ ఇలా మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించడమే గాక తాను రూపొందించిన ఆ పౌడర్‌ను మార్కెట్లకి తీసుకువచ్చే ముందు మరిన్ని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు ఇచ్చేంత వరకు కొంత డబ్బును ఖర్చు పెట్టాడు. అంతా ఓకే అనుకున్నాకే మార్కెట్లోకి తాను తయారు చేసిన ప్రొడక్ట్‌లను తీసుకొచ్చాడు. ఈ మేరకు అర్జున్ దాదాపు రూ. 2 కోట్లతో కొండోట్టి వజ్హయూర్‌లో 'ధన్స్ డ్యూరబుల్' అనే పేరుతో ఓ కంపెనీని కూడా పెట్టి..సేల్స్ ప్రారంభించాడు. అంతేకాదు కిడ్స్ ఆమ్మెట్, ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్మెట్ బార్ స్నాక్ వంటి కొత్త ఫ్లేవర్స్‌లో మరిన్ని వెరైటీలను కస్టమర్లకు పరిచయం చేయనున్నాడు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్ వంటి దేశాలకు కూడా తన ప్రొడక్ట్‌లను మార్కెట్ చేసుకుంటున్నాడు. అర్జున్ 2021లో తన వ్యాపారాన్ని ప్రారంభించారడు. ఈ పౌడర్‌ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడమే గాక సుమారు ఏడుగురు మహిళలతో సహ 12 మందికి ఎంప్లాయిమెంట్‌ని కల్పించాడు అంతేకాదు ఆఖరికి ఆన్లైన్లో కూడా కొనుగొళ్లు చేసేలా మార్కెట్‌ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు కూడా. అతని గురించి ఔట్లుక్ అనే న్యూస్ ఛానెల్ 'ది ఆమ్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' శీర్షికతో అర్జున్ గురించి కథనం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అతను ఓ సెలబ్రెటీ మాదిరిగా అన్ని పత్రికలు అతని గురించి కథనాలు రావడం జరిగింది. పైగా తాను త్వరగా ఆమ్లెట్‌ని రెడీ చేసే విధానంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ని బద్దలు కొట్టే సన్నహాలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు అర్జున్. (చదవండి: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..కంగుతిన్న జూ సిబ్బంది) -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్‌రైస్, ఎగ్ నూడిల్స్ తయారు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా స్టాంప్‌లు వేస్తున్నారు. అయితే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో స్టాంప్ వేసి ఉన్న కోడిగుడ్లతో ఫాస్ట్‌ఫుడ్ తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అవకతవకలు జరుగుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనమని, ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణ పెంచి, తనిఖీలు విస్తృతం చేయాలని నెటిజన్లు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
అది అత్యంత విచిత్ర జీవి.. పాలివ్వడమే కాదు.. గుడ్లు కూడా పెడుతుంది!
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు 1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది. రక్షణ కోసం విషం జిమ్ముతూ.. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది. ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి -
గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోసం రకరకాల గృహవైద్యాలను అనుసరిస్తుంటారు. వాటిపై అపరిమితమైన నమ్మకం కలిగివుంటారు. ఒక్కోసారి అటుంటి ఆహారాలపై ఏవగింపు కలిగినా, ఆరోగ్యం పేరుతో వాటిని తింటారు. ఈ కోవలో కొందరు పాములను, మరికొందరు కీటకాలు, పురుగులను కూడా తింటుంటారు. అది వర్జిన్ గుడ్డు.. ఇదేకోవలోకి వచ్చే ఒక ‘పోషకాహారం’ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మూత్రంలో గుడ్లను ఉడికించి, వాటిపై మసాలాలు చల్లి ఎంతో ఆనందంగా తింటుంటారు. యూరిన్‌లో గుడ్లను ఉడికించి, తినడం వలన మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతుంటారు. ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్డును వారు వర్జిన్ గుడ్డు అని అంటారు. ఈ విధంగా గుడ్లను ఉడికించేందుకు కొందరు చైనావాసులు.. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి మూత్రం సేకరిస్తారు. స్కూలు టాయిలెట్లలో బకెట్లను ఉంచి.. మూత్రంలో ఉడికించిన గుడ్లను తినడం వలన ఎప్పుడూ జ్వరం రాదని కొందరు చైనావాసులు నమ్ముతారు. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు. మూత్రం సేకరించేందుకు ఇక్కడివారు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. స్కూళ్ల టాయిలెట్లలో బకెట్లను ఉంచి, చిన్నారుల నుంచి మూత్రాన్ని సేకరిస్తారు. దానిని గుడ్లను ఉడికించేందుకు వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: చిరుతల మధ్య పోరాటం..‘అగ్నికి’ తీవ్రగాయాలు..! -
'గుడ్లను తాకితే తాటతీస్తా..!' జూ కీపర్‌పై కొండ చిలువ వీరంగం..
ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్‌పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) ఓ పైథాన్ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్‌ను ఆటపట్టించాలనుకుంటాడు. అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్‌ను కరవడానికి వస్తుంది. అతను ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్‌కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. ఇదీ చదవండి: ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో -
కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది!
కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు. పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..) -
ఈ గుడ్ల ధరలు తెలిస్తే.. గుడ్లు తేలేస్తారు!
చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు. ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది. మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
కోడిగుడ్ల ఆహారోత్పత్తులకు పురస్కారాలు!
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) తాజాగా విజన్ 365 ఎగ్ ఇన్నోవేషన్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కోడిగుడ్లతో చేసిన వినూత్న ఆహారోత్పత్తులకు గాను ఈ అవార్డును అందించనున్నట్లు విజన్ 365 చైర్మన్ సురేష్ చిట్టూరి తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. నూతన ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు, వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగస్టు 11లోగా కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24–28 మధ్య జరిగే ఐఈసీ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తారు. -
ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి
కొరాపుట్: అధికార పార్టీ బీజూ జనతాదల్కు చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు రఘురాం పొడాల్పై కోడి గుడ్లతో దాడి జరిగింది. ఈ నేపథ్యంలోకొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి కేంద్రంలో వివాదం చెలరేగాయి. లమతాపుట్లో ప్రభుత్వం నూతనంగా పంచాయతీ భవనం నిర్మించింది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కానున్నారు. ఈ మేరకు భవన శిలాఫలకంపై ఎమ్మెల్యే, కలెక్టర్ పేర్లు ఉన్నాయి. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక జిల్లా పరిషత్ సభ్యుల పేర్లు లేవు. దీనిని గమనించిన ఆ పార్టీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే రఘురాం భవనం ప్రారంభించేందుకు కారులో వచ్చారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. మార్కెట్ మీదుగా ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా కోడి గుడ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోగా పరారయ్యారు. అయితే యథావిధిగా కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న రఘురాం పొడాల్.. భవనాన్ని ప్రారంభించారు. ఈ ఘటన అనంతరం మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్‌లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
తూర్పు తీరం ఆడపడుచులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టింటిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమకారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరువాత సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగలగటం వాటి జ్ఞాపక శక్తికి నిదర్శనమంటారు. ఆలివ్ రిడ్లే శాస్త్రీయ నామం‘లెపిడోచెలిస్ ఒలివేసియా’.గ్రీన్ టర్టిల్, లెదర్ బ్యాగ్, గ్రీన్సీ టర్టిల్, హాక్చిల్సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూల నుంచి.. ఈ మూల వరకు ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపుతాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువాత ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడుపుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్లలు బయటకొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది. కళ్లు తెరిచిన పిల్లలను సూర్యుడు ఉదయించే వేళ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వెలుతురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలవైపు పరుగులు తీస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్ ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటికే 8వేల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. సమతుల్యతలో కీలకం కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరాన్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడికే వస్తాయి. సముద్రం జలాల్లో వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో వీటి పాత్ర కీలకం. సముద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్‌లను ఆలివ్ రిడ్లేలు ఆహారంగా తీసుకుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండటం, సముద్ర జలాలలో కాలుష్యం నివారించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. – ఎస్.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి. తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్ రిడ్లే తెలివితేటలు అమోఘం. -
Health: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. పొద్దుతిరుగుడు గింజలు... వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. వెల్లుల్లి... వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. గుడ్లు... గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. నువ్వులు... నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్‌గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్‌మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
బ్రాండెడ్ గుడ్డు గురూ.. ‘ఎగ్గోజ్’తో మరో సంచలనం!
సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్‌ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది. ‘ఎగ్గోజ్’తో సంచలనం ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్‌లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం.. బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్‌పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్ -
కోడిగుడ్డు.. కొత్త రికార్డు
మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్యధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సీజన్లో రైతు ధర రూ.5 దాటడం గగనమైంది. ఈ సీజన్లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ధర పెరిగింది. ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధరలు తగ్గితేనే ఊరట గతంతో పోలిస్తే ఈ సీజన్లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ -
Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: మరణం మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో అకారణ మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని చావు వరకు తీసుకెళ్తున్నాయి. గొంతులో ఆమ్లెట్, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో అనుమానాస్పద స్థితిలో ఓ రోగి మృతి చెందిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొట్టు తీయని గుడ్డు గొంతులో ఇరుక్కుని ఊపిరాడకపోవడం వల్లనే రోగి మృతి చెందినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రోగిది సహజ మరణమేనని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి సమీపంలోని ఓ హోం నుంచి అంజి అనే వ్యక్తి సెప్టెంబర్ 5న ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేరారు. ఆస్పత్రిలోని డీసీ వార్డులో చికిత్స పొందుతున్న అంజి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఊపిరాడని స్థితిలో ఉన్నట్లు ట్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు లక్ష్మీ వైద్యాధికారి రఘువీర్రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందాడు. పొట్టు తీయని గుడ్డును నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు వెలువడగా, మానసిక చికిత్సాలయం ఆర్ఎంఓ మనోహర్ సోమవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. చదవండి: ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి -
Hair Care: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా..
శిరోజాలు సిల్కీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. రెడీమేడ్‌గా దొరికే షాంపూల్లో రసాయనాల గాఢత ఎక్కువగా ఉండి వెంట్రుకలు దెబ్బతింటున్నాయని బాధపడుతుండే వారు ఇంట్లోనే షాంపూని తయారు చేసుకోవచ్చు. కావలసినవి: ►కోడిగుడ్డు ►టేబుల్‌స్పూన్ నిమ్మరసం ►టేబుల్ స్పూన్ క్యాస్టిల్ సోప్ లిక్విడ్ ►టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ►అరకప్పు నీళ్లు లేదా హెర్బల్ టీ ►కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తయారి: ►వీటన్నింటినీ కలిపి తలకు రాసుకుని స్నానం చేయాలి. ►ఈ షాంపూని ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు వారాల వరకు వాడుకోవచ్చు. ►తాజాగా తయారు చేసుకుంటే మరింత మంచిది. చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? Cucumber Juice: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌ను ఇలా వాడితే సెబమ్ ఉత్పత్తి పెరిగి.. -
ధర వెరీ గుడ్డు.. పౌల్ట్రీ రైతుకు ఊరట
సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్‌గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 మార్క్‌ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. ఎగుమతులకు ఊపు సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్‌కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఊరట మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. ఎగుమతులు పెరగటం వల్లే.. చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది. – తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్ఈసీఎస్, విజయవాడ జోన్ తొలిసారి గిట్టుబాటు ధర కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం. – ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస) -
Recipe: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ!
ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడి గుడ్లతో ఇలా ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్లకు సండే ఇలా స్పెషల్ వంటకం చేసి పెట్టండి! కావలసినవి: ►ఆపిల్ ►గుడ్లు – 2 చొప్పున ►పాలు – పావు కప్పు ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార, బటర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►నూనె, దాల్చిన చెక్క 1 టీ స్పూన్ చొప్పున ►పుదీనా – కొద్దిగా ►పంచదార పొడి – కొద్దిగా తయారీ: ►ముందుగా రెండు వేరువేరు బౌల్స్ తీసుకుని.. గుడ్లలోని తెల్లసొన ఒకదానిలో.. పసుపు సొన ఒకదానిలో వేసుకోవాలి. ►తెల్లసొనలో పంచదార వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా కలపాలి. ►పసుపు సొనలో మొక్కజొన్న పిండి, పాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి. ►ఈలోపు ఆపిల్స్ పైతొక్క తొలగించి.. గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని.. మధ్యలో గింజలు ఉండే భాగాన్ని తీసేసుకోవాలి. ►అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం పెట్టుకుని.. దానిపై బటర్ వేసుకోవాలి. ►బటర్ కరిగిన తర్వాత నూనె కూడా వేసుకుని.. ఒక్కో ఆపిల్ ముక్కని రెండు బౌల్స్‌లో బాగా ముంచి.. ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్
గుడ్లు, మాంసానికి కటకట ఏర్పడింది. పాల ఉత్పత్తుల సరఫరా భారీగా పడిపోయింది. కూరగాయలు, పండ్ల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దుంపలు పండడమే లేదు. డిమాండ్‌కు సరిపడా పంటల ఉత్పత్తిలేక బ్రిటన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ధరాభారంతో రైతులు, సామాన్యులు కుదేలైపోతున్నారు. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లకి రేషన్ పెట్టేశారు. ఇదే పరిమితి ఇతర ఆహార పదార్థాలపై విధించే పరిస్థితులొస్తాయన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. బ్రిటన్ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. బ్రెగ్జిట్ నుంచి దేశానికి మొదలైన ఆర్థిక కష్టాల పరంపర కొనసాగుతోంది. కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడులు, నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా దేశాన్ని ఊపేసిన ఏవియాన్ ఫ్లూతో గుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లు అమ్మకంపై పరిమితులు విధించారు. బంగాళదుంపలు దొరకడం లేదు. టమాట దిగుబడులు కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయాయి. బ్రాసిల్, యాపిల్స్, దోసకాయలు, ఇతర కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయాయి. గత 45 ఏళ్లలో ఈ స్థాయిలో పంట దిగుబడులు తగ్గిపోవడం ఈ ఏడాదే జరిగింది. 27% పెరిగిపోయిన పంట ఉత్పత్తి వ్యయం ఏడాది వ్యవధిలో పంటల ఉత్పత్తికయ్యే ఖర్చు 27 శాతం పెరిగింది. చమురు, ఎరువులు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో రైతన్నలు పంటల్ని పండించే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. డీజిల్ ధరలు 2019తో పోలిస్తే 75 శాతం పెరిగిపోవడం రైతన్నలపై పెనుభారం మోపింది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని రైతులను ఆదుకోకపోతే బ్రిటన్‌లో కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడుతుందని జాతీయ రైతు యూనియన్ (ఎన్ఎఫ్యూ) హెచ్చరించింది. 2019తో పోల్చి చూస్తే రిజిస్టర్డ్ వ్యవసాయ కంపెనీల సంఖ్య 7 వేలు తగ్గిపోయిందని వెల్లడించింది. పనివాళ్ల కొరత సైతం రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కుదేలైపోయాయి. ఎన్నో సూపర్ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో పాలు, వెన్న సరఫరా చేసే అతి పెద్ద సంస్థ ఆర్లా ఫుడ్స్ డిమాండ్‌కు సరిపడా సరఫరా ఇక చేయడం కష్టమని తేల్చి చెప్పింది. పశుపోషణకయ్యే వ్యయం భారీగా పెరగడంతో రైతులు పాలు సరఫరా చేయడం లేదని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై పడుతోంది. బంగాళదుంపలు, ఇతర దుంప కూరలు సరిగా పండడం లేదని జేమ్స్ హట్టన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ లెస్లీ వెల్లడించారు. బంగాళదుంపల ధరలు రెట్టింపయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇంధనం ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 11% శాతం మేరకు తగ్గిపోయాయని ఇంధన, పర్యావరణ నిఘా విభాగం నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ రిటైల్ కన్సోర్టియమ్లో ఫుడ్ అండ్ సస్టయినబులిటీ డైరెక్టర్ ఆండ్రూ ఒపె రిటైల్ మార్కెట్లు నిత్యావసరల కొరతతో కళ తప్పినప్పటికీ సంక్షోభం వచ్చే పరిస్థితులు వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రభుత్వం రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తోందని, ఆహార భద్రతకు రిషి సునాక్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నవంబర్‌లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.6 శాతానికి చేరుకున్నప్పటికీ అక్టోబర్‌తో పోలిస్తే 0.1 శాతం తగ్గిందని, గత రెండేళ్లలో ధరలు తగ్గడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కళ తప్పిన క్రిస్మస్ క్రిస్మస్ పండుగ దగ్గరకొస్తుంటే సామాన్యుల్లో ఈ సారి ఆ హుషారు కనిపించడం లేదు. సాధారణంగా క్రిస్మస్కు నెల రోజుల ముందు నుంచే మార్కెట్లు జనంతో కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లుల భారం భరించలేక ఎందరో చిరు వ్యాపారులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటడం, కావల్సిన వస్తువులకి కొరత ఏర్పడడంతో ప్రజలు ఉన్నంతలో బతుకుని నెట్టుకొస్తున్నారు. ఒక కుటుంబంపై నెలవారి నిత్యావసరాల ధరల భారం 34 పౌండ్లు. అంటే 3,400 రూపాయల వరకు పడుతోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. -
Beauty Tips: నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా కావాలంటే ఇలా చేయండి!
Beauty Tips In Telugu: మేని నిగారింపుకు, చర్మ లావణ్యాన్ని ఇనుమడింపచేసుకోవడానికి దోహదం చేసే కొన్ని సహజసిద్థమైన క్లెన్సర్లు, ప్యాక్‌లను ఇంట్లో మనం రోజూ వాడే వాటితోనే చేసుకోవచ్చు. ►గుడ్డులోని తెల్లసొనలో తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల ఎండకు నల్లబడిన ముఖచర్మం తిరిగి మామూలవుతుంది. ►బార్లీ పొడిలో తేనె, పెరుగు, బాదం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ►టొమాటో రసానికి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ►శనగపిండిలో క్యారట్ రసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ►రెండు టీ స్పూన్ల టొమాటో రసానికి నాలుగు టీ స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ►రెండు టీ స్పూన్ల క్యాబేజ్ రసంలో చిటికెడు ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మేని మెరిసిపోతుంది. మెడ నల్లగా ఉందా? ముఖం, మెడ మీద చర్మం నల్లగా, జిడ్డుగా అనిపిస్తే ఇంట్లోనే ఇలా క్లెన్సర్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడతాయి. మృతకణాలను తొలగించడంలోనూ ఉపకరిస్తాయి. కాబట్టి ఈ రెండింటితో తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. టొమాటోను గుజ్జు చేయాలి. దీనిని పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి ఒత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్‌కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి.. పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. నోట్: పొడి, సున్నితమైన చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. చదవండి: Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్ లక్షణాలు.. నివారణ ఇలా.. -
దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి : తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగం నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలంటే దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే రైతుకు మద్దతు ధర లభిస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. ‘ఉత్పత్తి వ్యయాలకు తగ్గట్టుగా మాత్రమే గుడ్డు ధర నిర్ణయించాలి. మార్కెట్లో ధర విషయంలో పూర్తిగా బోర్డుదే తుది నిర్ణయం కావాలి. తద్వారా రైతులకు, వినియోగదార్లకు ప్రయోజనం ఉంటుంది. బోర్డుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వమే గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. లేదా ప్రైవేటు గిడ్డంగులను లీజుకు తీసుకోవాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాను కట్టడి చేయాలి. బోర్డు కార్యరూపంలోకి వస్తే కొత్తగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పౌల్ట్రీకి పూర్తిగా వ్యవసాయ రంగ హోదా ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలి’ అని వివరించారు. రైతులు ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై సగటున 50–60 పైసలు, బ్రాయిలర్‌పై రూ.10–20 నష్టపోతున్నారని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో.. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 22–25 తేదీల్లో ఇక్కడి హైటెక్స్‌లో జరుగనుంది. తొలిరోజు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తారు. 370 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ రావు పొట్లూరి తెలిపారు. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
పాఠశాలకు విద్యార్థులకు వెరీ ‘గుడ్డు’.. ఇక ప్రతివారం రంగు తప్పనిసరి!
రాయవరం (అంబేడ్కర్ కోనసీమ): జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి_గుడ్లు సరఫరా చేసేవారు. దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షం.. అంతా షాక్!) కోడిగుడ్లపై స్టాంపింగ్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు కలర్ స్టాంపింగ్‌తో సరఫరా అవుతున్న కోడిగుడ్లు పకడ్బందీ పరిశీలన మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. కోడి గుడ్ల సరఫరాకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్ల సైజు, కలర్ స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఎంఎంస్ యాప్‌లో నమోదు చేయాలన్న నిబంధన విధించారు. (చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు) నాణ్యతకు పెద్ద పీట ‘విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న కోడిగుడ్లనే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పాఠశాల హెచ్ఎంలు కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి దిగుమతి చేసుకునే ముందు కచ్చితంగా గుడ్డు సైజు, కలర్ స్టాంపింగ్ చెక్ చేసుకోవాలి. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోకూడదు. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, అమలాపురం -
ఇకపై మరింత వెరీ ‘గుడ్డు’
సాక్షి, అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’లో కీలక పౌష్టికాహారమైన కోడిగుడ్లను మరింత నాణ్యంగా, తాజాగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోడిగుడ్లు సరఫరాలో, వాటి నిల్వలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించింది. పాఠశాల విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై దీనిపై చర్చించారు. కోడిగుడ్ల నాణ్యతపై ప్రభుత్వం థర్డ్ పార్టీ ద్వారా చేయించిన పరిశీలనల నివేదికపై కూడా సమావేశంలో చర్చించారు. కోళ్ల ఫారాల నుంచి నేరుగా స్కూళ్లకు తాజా, నాణ్యమైన గుడ్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకనుంచి నెలకు నాలుగుసార్లు సరఫరా చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. -
Recipe: అటుకులు, జొన్నపిండి.. నోరూరించే పోహా రోటీ- ఆమ్లెట్ రోల్స్ తయారీ ఇలా
రోటీ, ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా! ఇలా వెరైటీగా అటుకులు, జొన్నపిండితో రొట్టె చేసుకుని.. ఆమ్లెట్ రోల్స్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. పోహా రోటీ – ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: ►గుడ్లు – 3 (ఒక బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని, అందులో ఉప్పు,కారం, పసుపు, పాలతోపాటు ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కూరగాయల తరుగు వంటివి అభిరుచిని బట్టి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి) ►అటుకులు – 2 కప్పులు ►జొన్నపిండి – పావు కప్పు ►నెయ్యి – టేబుల్ స్పూన్ ►గోరు వెచ్చని నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ►ముందుగా అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ►15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఆ ఉండలను చపాతీల్లా ఒత్తుకోవాలి. ►పాన్‌పై సరిపడా నూనె వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►ఒకవైపు ఆమ్లెట్ వేసుకుని.. సర్వ్చేసుకునే ముందు.. నచ్చిన మసాలా కర్రీతో రోల్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా -
Recipe: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారు చేసుకోవచ్చు!
బోన్‌లెస్ చికెన్.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్ పొటాటో నగ్గెట్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారీకి కావలసినవి: ►బోన్‌లెస్ చికెన్ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి) ►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున ►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 2 (ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్ స్పూన్ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి) ►బ్రెడ్ పౌడర్ – గార్నిష్ కోసం ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి. ►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా! Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్ ప్రధాన రోడ్డులో వెజ్ ఫుడ్ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు. దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి.. -
తెలుగు రాష్ట్రాల నుంచి 50 శాతం పడిపోయిన గుడ్ల ఎగుమతులు
-
Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఇలా తయారు చేసుకోండి!
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. స్కూలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే ఎంత త్వరగా లేచినా సమయం సరిపోకపోగా రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలు విసుగు పుట్టించేస్తుంటాయి. ఇటువంటి వారు వెరైటీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయొచ్చు.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ కావలసినవి: ►బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – మూడు ►గుడ్లు – నాలుగు ►బటర్ – వేయించడానికి సరిపడా ►పాలు – రెండు టేబుల్ స్పూన్లు ►బరకగా దంచిన ఎండు మిర్చి పొడి – టేబుల్ స్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►మిరియాల పొడి – పావు టేబుల్ స్పూను ►ఉల్లిపాయ –ఒకటి(సన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి –మూడు (సన్నగా తరగాలి) తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ►దీనిలోనే పాలు, బరక మిరప పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్‌పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైస్‌ను గుడ్ల సొనలో ముంచి పాన్‌పై పెట్టాలి. ►బ్రెడ్స్లైస్ ఒకవైపు కాలుతుండగానే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును పైన వేయాలి. ►ఈ ముక్కలపైనే కొద్దిగా గుడ్లసొన మిశ్రమం వేయాలి. ►బ్రెడ్ స్లైస్‌ను రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చి సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! Egg Poha Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా! -
Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా!
అటుకులు, కోడిగుడ్డుతో ఇలా రుచికరమైన వంటకం ఎగ్ పోహా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ పోహా తయారీకి కావాల్సినవి: ►గుడ్లు – 2 ►అటుకులు – 1 కప్పు (ముందుగా నీళ్లలో కడిగి, తొట్టెలో వేసుకుని వడకట్టుకోవాలి) ►నూనె – సరిపడా, కరివేపాకు రెమ్మలు – 3 ►ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా ►ఉప్పు – తగినంత ►కొత్తిమీర తరుగు – గార్నిష్ కోసం ఎగ్ పోహా తయారీ విధానం ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ►అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అవన్నీ బాగా వేగిన తర్వాత.. కళాయి మధ్యలో ఖాళీ చేసి.. గుడ్లు పగలగొట్టి వేసుకుని.. పసుపు సొనను బాగా కలపాలి ►ఆమ్లెట్‌లా 2 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించి.. తర్వాత గరిటెతో అటూ ఇటూ కదిలిస్తూ.. ఇప్పుడు క్యాప్సికం మిశ్రమంతో కలిపి వేయించాలి. ►అనంతరం కారం, పసుపు, మిరియాల పొడి వేసుకుని తిప్పాలి. ►తర్వాత అటుకుల్ని వేసుకుని మరోసారి తిప్పి.. కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►ఆ కళాయిపై మూతపెట్టి 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. ►అనంతరం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Kakori Kebab Recipe: మటన్ కీమా.. పచ్చిబొప్పాయి తరుగు.. కకోరి కబాబ్ తయారీ ఇలా! Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్! -
సాక్షి కార్టూన్ 20-07-2022
-
పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ బైట్స్.. దీనితో సులభంగా తయారు చేసుకోవచ్చు! ధర?
చిన్నాపెద్దా ఇష్టపడే రుచుల్లో ఎగ్ బైట్స్ ప్రత్యేకం. కాఫీ, టీలతో పాటు సాయంకాలపు స్నాక్స్‌లో అవీ భాగమే. పిల్లల స్నాక్స్ బాక్సుల్లోనూ వాటినే సర్దుతుంటారు చాలామంది తల్లులు. ఈ ఎగ్ బైట్స్‌ను తయారు చేయడంలో ఈ డివైజ్ చక్కగా ఉపయోగపడుతుంది. డివైజ్ అడుగు భాగంలో ట్రే కింద వాటర్ నింపుకుని, ట్రే బౌల్స్‌లో సిద్ధం చేసుకున్న రెసిపీనీ ఉంచేసి.. మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. పదే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ ఎగ్ బైట్స్ సిద్ధమైపోతాయి. ఎగ్ తిననివారు ఇతర రెసిపీలతో కూడా ఈ కప్స్‌ను కుక్ చేసుకోవచ్చు. భలే ఉంది కదూ. -ధర : 27 డాలర్లు (రూ.2,133) చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. Black Pepper: మిరియాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే -
Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా!
ఎగ్ బుర్జీ బాల్స్ ఇలా సులువైన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోండి! ఎగ్ బుర్జీ బాల్స్ తయారీకి కావలసినవి: ►బ్రెడ్ పౌడర్ – పావు కప్పు + 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 6, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ ►ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తరిగినవి) ►కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు – కొద్దికొద్దిగా ►మైదా పిండి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు (కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి) ► క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్ల చొప్పున ( అభిరుచిని బట్టి) ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసుకుని బాగా కలపాలి. ►కళాయిలో నూనె వేసి ఆమ్లెట్‌లా వేసి.. నిమిషం పాటు కదపకుండా ఉంచాలి. ►అనంతరం గరిటెతో కలియతిప్పి.. బుర్జీలా చేసుకోవాలి. ►స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత అందులో పావు కప్పు బ్రెడ్ పౌడర్, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము వేసుకుని బాగా కలపాలి. ►కొద్దిగా ఉప్పు జోడించి.. బాల్స్‌లా చేసుకోవాలి. ►వాటిని మైదా పిండి పేస్ట్‌లో ముంచి.. మిగిలిన బ్రెడ్ పౌడర్‌లో దొర్లించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
గుడ్డులో గుడ్డు
నగరి: కోడి గుడ్డు పగులగొడితే అందులో మరో గుడ్డు కనిపించింది. నగరి మునిసిపాలిటీ పరిధిలోని బస్టాండు ప్రాంగణంలో రోడు పక్కన టిఫిన్ సెంటర్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హోటల్ యజమాని మధర్బాయి ఆమ్లెట్ వేయడానికి గుడ్డు పగలగొట్టగా అందులో మరో చిన్న గుడ్డు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. గుడ్డులో గుడ్డు వచ్చిందని తెలియటంతో దానిని చూసేందుకు జనం గుమిగూడారు. టిఫిన్ సెంటర్లో ఉన్న కస్టమర్లతో పాటు బస్టాండు ప్రాంగణంలో ఉన్న వారు కూడా ఈ వింతను చూసేందుకు ఎగబడ్డారు. -
Health Tips: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. విటమిన్- డి పుష్కలం!
మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి! వీటిలో విటమిన్- డి పుష్కలం. ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’ ►పుట్టగొడుగుల్లో ‘విటమిన్–డి’ ఎక్కువగా ఉంటుంది. ►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్–డి’ లభిస్తుంది. ►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి. ►ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్–డి సమృద్ధిగా ఉంటుంది. ►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్–డి’కి మంచి వనరులు. ►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు! -
Recipe: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా!
రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతి తయారీకి కావలసినవి: ►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి) ►గుడ్లు – 4 లేదా 5 ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►ఉప్పు –తగినంత ►పసుపు – చిటికెడు ►కారం – 1 టీ స్పూన్ ►చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్ ఎగ్ చపాతి తయారీ విధానం: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి. ►అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్ వేసుకోవాలి. ►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా!
నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీకి కావలసినవి: ►గుడ్లు – 6, బ్రెడ్ పౌడర్ – అర కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►వెల్లుల్లి – 6 రెబ్బలు (తురుములా చేసుకోవాలి) ►పచ్చిమిర్చి –6 (మూడిటితో పేస్ట్‌లా చేసుకుని, మిగిలినవి చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి) ►కొత్తిమీర – 2 టీ స్పూన్లు, కరివేపాకు – అభిరుచిని బట్టి ►ఉల్లిపాయల ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – 4 టీ స్పూన్లు ►ధనియాల పొడి – కొద్దిగా ►కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – సరిపడా ►టమాటా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►పెరుగు: 2 కప్పులు, రెడ్ చిల్లీ సాస్ – కొద్దిగా ►జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు ►నూనె – 3 గరిటెలు, ఉల్లికాడల ముక్కలు – గార్నిష్‌కి సరిపడా ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ విధానం: ►ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని, పచ్చసొన లేకుండా తెల్లటి గుడ్డు భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►ఈ ముక్కల్లో సన్నగా తరిగిన పావు టీ స్పూన్ అల్లం తురుము, సగం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల గరం మసాలాతో పాటు బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ►అందులో మిగిలిన 2 గుడ్లు పగలగొట్టి తెల్లసొనను మాత్రమే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ►తర్వాత ఈ మిశ్రమాన్ని కుకర్‌లో స్టీమ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►అనంతరం కళాయిలో 3 గరిటెల నూనె వేసుకుని.. వేడికాగానే టమాటా ముక్కలు, మిగిలిన అల్లం తురుము, మిగిలిన వెల్లుల్లి తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి. ►రెడ్ చిల్లీ సాస్, పెరుగు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ►అనంతరం ఎగ్ ముక్కల్ని వేసుకుని.. పెరుగు– సాస్ మిశ్రమం ముక్కలకు పట్టే విధంగా గరిటెతో తిప్పుతూ కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు!