ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా తయారీకి కావల్సినవి:
ఉడికించిన గుడ్లు – ఆరు; మటన్ ఖీమా – అరకేజీ; కారం – టీస్పూను;
పసుపు – పావు టీస్పూను; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; గరం మసాలా – టీస్పూను;
మిరియాల పొడి – టీస్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు;
పచ్చిమర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను;
బ్రెడ్ ముక్కల ΄÷డి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేయాలి.
► దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కల పొడి, టేబుల్ స్పూను నూనె వేసి మెత్త్తగా గ్రైండ్ చేయాలి.
► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక మాదిరి పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
► ఇప్పుడు ఉడికించిన గుడ్ల పెంకు తీసేయాలి ∙ఖీమా ఉండను తెరిచి గుడ్డును లోపలపెట్టి ఖీమా మిశ్రమంతో కోఫ్తాలా వత్తుకోవాలి.
► ఇలా ఆరు గుడ్లను కోఫ్తాలా తయారు చేసుకున్నాక, సన్నని మంటమీద డీప్‌ఫ్రైచేయాలి.
► కోఫ్తా బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించితే ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా రెడీ .
► కోఫ్తాను మధ్యలో రెండు సగాలుగా కట్ చేసి నచ్చిన సాస్‌తో సర్వ్‌చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment