Recipe
-
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్‌ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. -
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
మఖానా స్మూతీ ఎపుడైనా ఇలా ట్రై చేశారా?
కమ్మని రుచి, చక్కని పోషకాలతో ఆరోగ్యాన్ని అందించే మఖానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి:వేయించిన మఖానా– కప్పుబాదం పప్పు– 3 టేబుల్ స్పూన్లుఅరటిపండు – ఒకటి; ఖర్జూరాలు– 4;పీనట్ బటర్– టేబుల్ స్పూన్;పాలు– 300 ఎం.ఎల్;గుమ్మడి గింజలు– టీ స్పూన్;తయారీ:గుమ్మడి గింజలుమినహా మిగిలిన అన్నింటినీ మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేయాలి. గ్లాసుల్లో పోసి పైన గుమ్మడి గింజలు చల్లి సర్వ్ చేయాలి. చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది మంచి ΄ోషకాహారం. పిల్లలు ఆటల్లో మునిగి తినడానికి ఇష్టపడక పరుగులు తీస్తుంటారు. పోషకాలన్నింటినీ ఒక గ్లాసులో పోసి ఇచ్చినట్లే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ఒక గ్లాసు తాగితే రోజుకు అవసరమైన పోషకాలన్నీ దాదాపుగా అందినట్లే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బదులుగా కూడా ఈ స్మూతీని ఇవ్వవచ్చు. ఫిట్నెస్ చేసేవాళ్లు వర్కవుట్ తర్వాత ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు.పోషకాలు:శక్తి– 764 కిలోకేలరీలు ప్రొటీన్– 26.1 గ్రాముకార్బొహైడ్రేట్లు– 87.2 గ్రాములుఫ్యాట్ – 36.3 గ్రాములుఫైబర్– 10 గ్రాములుడాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
ఆలియా భట్ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!
ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది. బీట్రూట్ సలాడ్కావలసినవి: తురిమిన బీట్రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.సొరకాయ సబ్జీకావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చియా పుడ్డింగ్ కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
డైట్ ప్లాన్‌లో ఉన్నారా : డిన్నర్ కోసం అదిరిపోయే పరాటా
పోషకాలు విరివిగా లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్ మొక్కలాగా కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం.సోయాకూరలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.సోయా, ఓట్స్ పరాటాకావాల్సినవి :దిల్ ఆకులు : ఒక కప్పు ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి : ఒక కప్పు నెయ్యి రెండు టీస్పూన్లునాలుగు పచ్చిమిర్చి జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు : అర కప్పుతయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి. తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్ వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్చేసి పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం మీద నెయ్యివేసి, సన్నని మంటమీద కాల్చుకుంటే, టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్ పరాటా రెడీ. దీన్ని ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు. -
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్‌లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి. -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
Dussehra 2024 : కజ్జికాయలు.. ఈజీగా, హెల్దీగా!
దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్లాగా కూడా ఉంటుంది. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనెకజ్జికాయల తయారీమైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి! -
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
గణపయ్య బొజ్జనిండేలా పాలతాలికలు, రెసిపీ ఇదిగో
వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పాలతాలికల రెసిపీ తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి. వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు. బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు శుభ్రంగా కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని పిండి పట్టించి, జల్లించుకోవాలి. అరిసెల కోసం తయారుచేసుకునే పిండిలాగా మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి. పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. -
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్‌గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్‌లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది. -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది. -
రెస్టారెంట్ అంటేనే దడపుడుతోందా? ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా టొమాటో కెచప్
హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని హోటల్స్‌లో ఆహారభద్రతా శాఖ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, కాలం తీరిన పదార్థాలు, బొద్దింకలు, పురుగులు, లేబుల్ లేని ఆహారం, లైసెన్స్ లేని ఆహార బ్రాండ్లులాంటివి చూస్తోంటే గుబులు రేగుతోంది. రెస్టారెంట్‌కు వెళ్లాలంటేనే వామ్మో.. అనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే నోనూరించే టొమాటో కెచప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసినవి: టొమాటోలు – 2.5 కేజీలు; వెల్లుల్లి రేకలు-15; అల్లం– 3 అంగుళాల ముక్క; ఎండు మిర్- 6; కిస్మిస్-అర కప్పు; యాపిల్ సిడెర్ వినెగర్- అర కప్పు; ఉప్పు – టేబుల్ స్పూన్; చక్కెర- 6 టేబుల్ స్పూన్లు; సోడియం బెంజోయేట్ – పావు టీ స్పూన్ (టీ స్పూన్ నీటిలో వేసి కరిగించాలి)తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడగాలి. ఆరిన తర్వాత తొడిమలు తొలగించాలి. ఇప్పుడు టొమాటోలన్నింటినీ మీడియం సైజు ముక్కలుగా తరగాలి వెల్లుల్లి రేకల పొట్టు వలిచి సన్నగా తరుక్కోవాలి. అల్లం కడిగి చెక్కు తీసి తరగాలి కిస్మిస్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఎండు మిర్చి తొడిమలు తీసి, మధ్యకు విరిచి గింజలతను తొలగించాలి. మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, కిస్మిస్, వినెగర్, ఉప్పు, చక్కెర వేసి గరిటెతో కలిసి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ టొమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి పాత్రను దించేయాలి ∙వేడి తగ్గిన తరవాత బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద చిల్లులున్న స్ట్రెయినర్‌లో వడ΄ోయాలి. టొమాటో తొక్కలు, మెదగని గింజల వంటివి పైన నిలుస్తాయి. వడ΄ోసిన ద్రవాన్ని బాణలిలో ΄ోసి కొంత సేపు మీడియం మంట మీద ఉడికించి దగ్గరవుతున్నప్పువు సన్నమంట మీద ఉడికించాలి. టొమాటో ద్రవం కెచప్కు తగిన చిక్కదనం సంతరించుకోవాలంటే అరగంటకు పైగా ఉడకాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. దించడానికి ముందు టీ స్పూన్ వేడి నీటిలో పావు టీ స్పూన్ సోడియం బెంజోయేట్ కలిపి కెచప్‌లో పోసి కలిపి స్టవ్ ఆపేయాలి. సోడియం బెంజోయేట్ కెచప్ నిల్వ ఉండడానికి దోహదం చేసే ప్రిజర్వేటివ్. కెచప్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకునే వాళ్లు సోడియం బెంజోయేట్ లేకుండా కూడా సాస్ చేసుకోవచ్చు ∙కెచప్ ఉడికేలోపు సాస్ నిల్వ చేయడానికి గాజు బాటిల్‌ని సిద్ధం చేసుకోవాలి. బాటిల్‌ని శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీటిలో ముంచి తీసి ఆరబెట్టాలి ∙కెచప్ చల్లారిన తర్వాత సీసాలో వేసి గట్టిగా మూత పెట్టాలి. దీనిని స్నాక్స్‌లోకి తినవచ్చు లేదా భోజనానికి ముందు ఆకలి పెంచడానికి అప్పిటైజర్గా కూడా పని చేస్తుంది. నాలుక రుచి కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఒక టీ స్పూన్ కెచప్‌ను చప్పరిస్తే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి. -
బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
అధిక బరువు నుంచి బైటపడాలంటే చక్కని పోషకాహారంతోపాటు, రోజుకు కనీసం అరగంట వ్యామాయం చేయాల్సిందే. బరువు తగ్గాలంటే వ్యాయామం కంటే డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నం మానేశాం అంటూనే ఉదయం పూట టిఫిన్‌లో ఇడ్లీ, పూరీ, వడ దోసలు, చపాతీలు లాగించేస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దమా..!అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. రోజుమొత్తానికి శక్తినిచ్చేలా ఉండాలి. పోషకాలతో కూడిన అల్పాహారం తింటే ఆరోగ్యకరమైన బరువుతో, మెటబాలిజం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్లూటెన్-రహిత మిలెట్ల్స్ను తీసుకోవడం ఉత్తమం. మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రెడీమేడ్ మిల్లెట్ ఆధారిత పిండి, పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఫింగర్ మిల్లెట్ లేదా రాగి దోస, రాగి ఇడ్లీ, రాగి జావ : ఫైబర్, కాల్షియం ,ఐరన్ అధికం.జొన్నలతో కిచ్డీ, జొన్నరొట్టె : కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలంఫాక్స్టైల్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్స్‌తో చేసిన పొంగల్, లిటిల్ మిల్లెట్ దోస: కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంప్రోసో మిల్లెట్ దోస: సాధారణ దోసలాగానే బియ్యం కలపుకుండా, కొద్దిగా మినపపప్పు కలిపి చేసుకోవాలి. బార్నియార్డ్ మిల్లెట్ పొంగల్ : దీన్ని కూడా బియ్యం పొంగల్లాగా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ , ప్రోటీన్‌లో అధికం. -
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి. థండయ్ కుల్ఫీ కావలసినవివెన్న తీయని పాలు- 2 కప్పులు కోవా-100 గ్రాములు ; కండెన్స్డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే. -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్‌తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్‌గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్‌గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024 -
రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!
ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియే ఈ ఈదుల్ ఫిత్ర్ పండుగ. ఈ పండుగను ప్రతీ ముస్లిమ్ కుటుంబం తమకున్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. అలాగే ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. ఆ తర్వాత రకరకాల వంటకాలను చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆరగించి సంతోషంగా గడుపుతారు. ఈ రోజు స్పెషల్‌గా చేసేది షీర్ ఖుర్మా. ఈ రంజాన్ రోజు వివిధ రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ షీర్ ఖుర్మా రెసిపీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అసలు ఈ రోజు ఎందుకు దీన్ని చేస్తార?. రీజన్ ఏంటంటే..? పవిత్ర మాసంలో ఆనందంగా చేసుకునే డెజర్ట్, రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా ఎప్పటి నుంచి పండులో భాగమైంది?. ఇది ఎందుకు చేస్తారు అంటే. ఈ షీర్ కుర్మా ఐక్యత ఆధ్యాత్మిక సమృద్ధికి గుర్తుగా ఈ తీపి వంటకాన్ని ప్రతి ముస్లీ కుటుంబం తయారు చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందులో వివిధ మాంసాహార రెసిపీలు ఉన్నప్పటికీ.. ఈ షీర్ కుర్మాదే అగ్రస్థానాంలో ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లీం కుటుంబంలో తమకున్నంతలో ఈ షీర్ కుర్మాను తప్పనిసరిగా చేస్తారు. ఇన్నీ రెసిపీలు ఉన్నా ఈ షీర్ కుర్మాకే ఎందుకంత ప్రాధాన్యత వచ్చిదంటే.. షీర్ కుర్మా చరిత్ర.. ఈ షీర్ కుర్మా రెసిపీ వంటకం పర్షియన్ సామ్రాజ్యం నుంచి మన వంటకాల్లో భాగమయ్యింది. ఇక్కడ షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే పర్షియన్ భాషలో ఖర్జూరం. రంజాన్ మాసంలో ఖర్జూరాలు అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే..ఈదుల్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అంతేగాదు ఇది కేవలం రంజాన్ కోసం తయారు చేసే వంటకమే కాదట..ఆ రోజు తీసుకున్నా స్పైసీ ఫుడ్ల నుంచి కాస్త ఉపశమనం కోసం చివరిగా ఈ తీపి వంటకాన్ని అందించేవారు. ఆ తర్వాత క్రమేణ ఇది లేకుండా రంజాన్ మెనూ ఉండనంతగా ఈ రెసిపీకి ప్రజాధరణ వచ్చింది. బ్రిటీష్ పాలన కంటే ముందే మన దేశంలో షీర్ కుర్మా చేసేవారట. ఉత్తర భారతదేశంలో 'సెవియన్' అని పిలిచే వెర్మిసెల్లికి భిన్నమైన రెసిపీ వంటకం ఈ షీర్ కుర్మా. మరో కథనం ప్రకారం అరబ్బులు వాణిజ్యం చేసే నిమిత్తం మన దేశంలోకి రావడం వల్ల ఈ రెసిపీని ఇక్కడకు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. దీని తయారీ కూడా ప్రాంతాల వారీగా చేసే విధానం కూడా మారుతుంటదని చెబుతున్నారు. మాములుగా వెర్మిసెల్లి, పాలు, ఖర్జురాలతో తయారు చేసుకునేవారు. కాలానుగుణంగా అన్ని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రజల అభిరుచులకు అనుగుణంగా పిస్తా, బాదం, లవంగాలు, కుంకుమపువ్వు, రోజ్‌వాటర్ వంటి పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించారు. ఎక్కడ ఫేమస్ అంటే.. ఈ షీర్ ఖుర్మా ముఖ్యంగా హైదరాబాద్ ,లక్నో వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ నగరాల్లో క్రీమీ, రిచ్ డెజర్ట్‌లతో నెమ్మదిగా ఉడికించి, ఎండిన ఖర్జూరం, కొబ్బరి, బాదం, జీడిపప్పు మరియు పిస్తాతో అలంకరించి నోరూరించేలా అట్రెక్టివ్గా తయారు చేస్తారు. దీన్ని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేస్తారు. ఖర్జూరాలు ఇక్కడ చక్కెర బదులుగా తీపిని అందించి షీర్‌కుర్మాకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. అంతేగాదు ఈద్-ఉల్-ఫితర్‌లో షీర్ ఖుర్మాను సంతోషకరమైన ట్రీట్‌గా భావిస్తారు ముస్లీంలు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో ఉపయోగించే పాలు, నెయ్యి, ఖర్జురాల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇక పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ఈ నెల రోజుల పాటు ఉపవాసాలతో శుష్కించిన శరీరాన్ని ఉపశమనంలా ఉంటుంది ఈ రెసిపీ. ఉపవాశం కారణంలో పొట్టలో వచ్చే, ఎసిడిటీల నుంచి ఈ తీపి వంటకం కాపాడుతుంది. సమ్మర్లో శరీరానికి చలువ చేస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. మన సంప్రదాయాలకు అనుగుణంగా చేసే ఇలాంటి వంటకాలు ఆరోగ్యప్రదంగానూ సంతోషన్ని పంచేవిగానూ ఉంటాయి కదూ..! (చదవండి: Eid al Fitr 2024: ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష! కృతజ్ఞతలు తెలిపే శుభసయం..!) -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్‌ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
'పఖాలా'తో వేసవి తాపం పరార్!
ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు. ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం. నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఎన్నిరకాలు తయారు చేస్తారు.. సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు. బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు. సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు. జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి. ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది. అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు. View this post on Instagram A post shared by FOOD IN ODISHA | Odisha food | Odia Cuisine (@foodinodisha) (చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!)