భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల తనయ సారా టెండూల్కర్ అందరికీ సుపరచితమే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈసారి ఆమె తన సోదరుడు అర్జున్‌తో కలిసి ఇన్‌స్టాలో తాము తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌ల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తాము రోజు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో, ఏవి ఇష్టంగా తింటారో సవివరంగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అంతేగాదు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉదయాన్ని ప్రారంభిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమేగాక మంచి ఎనర్జీ కూడా వస్తుందని చెబుతోంది. తమలా ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలనుకుంటే ఈ లిస్ట్ ఫాలో అవ్వండి అంటూ ఆ రెసిపీల వివరాలు వెల్లడించింది సారా. అవేంటంటే..
అవకాడో టోస్ట్‌లైట్‌తో గిలకొట్టిన గుడ్లు..
హోల్ గ్రెయిన్‌బ్రెడ్ టోస్ట్‌పై క్రీమీ అవోకాడోని జత చేసి, దానికి ప్రోటీన్ ప్యాక్డ్ గిలకొట్టిన గుడ్లను జోడించండి. కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి కాస్త పెనంపై కాల్చాలి. చివరిగా వేడి సాస్‌తో గార్నిష్ చేసి తింటే టేస్ట్ అదుర్స్.
పోహా!
అటుకులనే పోహా అంటారు. తేలకగా జీర్ణమయ్యే ఆహారం. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి, చివరగా తాజా కొత్తిమీర నిమ్మకాయ జల్లుకుని తింటే నోటిలో నీళ్లు ఊరడం ఖాయం.
దోస
దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందిన అల్పహారం. దక్షణ భారతదేశంలో అత్యంత ఫేమస్ వంటకం. బియ్యం మినప్పులతో చేసిన దోసపిండిని పెనం మీద చక్కగా అట్టులా పోసి మసాల బంగాళ దుంప కూరని పెట్టి దొరగా కాల్చి తీయాలి. ఆ తర్వా కొబ్బరి చట్నీ, సాంబారుతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
ఉప్మా
మంచి పోషకాలతో కూడిన దక్షిణ భారతదేశ వంటకం. సుగంధ ద్రవ్యాలు, చక్కటి పప్పు ధాన్యాలు, కూరగాయాలతో తయారు చేసే మంచి రెసిపీ.
ఇడ్లీ
మృదువుగా ఉంటుంది. ఆవిరిపై ఉడికించే వంటకం ఇది. రైస్ కేక్ మాదిరిగా ఉంటుంది. దీన్ని కూడా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో తింటే ఉంటుంది.. సామీరంగా వదిలిపెట్టరు.
ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన అల్పహార రెసిపీలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ డైట్‌లో జోడించండి, ఆరోగ్యంగా ఉండండి అంటోంది అందాల సారా. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయ్యిపోండి.
(చదవండి: వరల్డ్ దోస డే! దోస రెసిపీని మొదటగా ఎవరు చూశారు? అంత క్రేజ్ ఎలా వచ్చిందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment