break fast
-
'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్‌ఫాస్ట్‌ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్‌గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు. అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఎవరు తయారు చేశారంటే..?నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది. వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్‌లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్‌లా వస్తాయి.(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) -
హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!
సినీ నటులకు గ్లామర్ ఎంతో ముఖ్యమో తెలిసిందే. అందుకోసం ఫుడ్ దగ్గర నుంచి ఫిట్నెస్ వరకు ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరూ ప్రత్యేకంగా డైటిషన్లు, ఫిటెనెస్ శిక్షకుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాళ్ల లైఫ్‌స్టైలే చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇక వాళ్లు మనలా ఇడ్లీ, దోసలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల జోలికిపోరు వెజ్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్స్, స్మూతీ వంటి వాటిని తీసుకుంటుంటారు. కానీ ఈ కోలీవడ్ నటుడు మాధవన్ మాత్ర మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తింటాడట. అదేంటంటే..కేరళ రాష్ట్రమంతటా ఇష్టంగా ఆస్వాదించే 'పజంకంజి'నే మాదవ్ ఎంతో ఇష్టంగా తింటారటా. ఇదే తన అల్పాహారమని ఆయన చెబుతున్నారు. పజమ్కంజి అంటే మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. వాళ్లు పొద్దుపొద్దనే తినే రాత్రి భోజనం. తెలుగు నాట దీన్ని చద్దిన్నం అని పిలుస్తారు. కేరళలో దీన్ని 'పజంకంజి' అని పిలుస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే..రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజి నీటిలో పులియబెట్టి పొద్దునే కొద్దిగా పెరుగు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని తింటారు. ఇక్కడ మనం అన్నం వండగా వేరు చేసేదాన్ని గంజి అని అంటాం. దీన్నే కేరళలో కంజి అని పిలుస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. చెప్పాలంటే సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు..శరీరానికి తక్షణ శక్తిన అందిస్తుంది. ఇందులో 340 కేలరీలు ఉన్నాయి.విటమిన్ బీ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. నీరసం నుంచి త్వరితగతిన కోలుకోవడానకి ఉపయోగపడుతుంది. అలసట, జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పులియబెట్టిన గంజి అన్నాన్ని కేరళలో ఒకప్పుడూ చాలామంది ఇష్టంగా తినే వంటకంగా పేరుగాంచింది. రాను రాను దీనికి ఆదరణ కోల్పోయింది. అలాంటి పూర్వకాలం నాటి వంటకాన్ని నటుడు మాధవన్ ఇష్టంగా తింటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేగాదు ఇటీవల దీనిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి పలు రెస్టారెంట్లు తమ మెనూలో దీన్ని కూడా చేర్చి సర్వ్ చేయడం ప్రారంభించాయి. (చదవండి: రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!) -
కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు. అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్‌పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది. అంతేగాదు తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!) -
షుగర్ కంట్రోల్ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్-రిచ్ బ్రేక్‌ఫాస్ట్
శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం. నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్‌ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్ సౌత్ ఇండియన్ టిఫిన్ గురించి తెలుసుకుందామా.ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి, ప్రొటీన్లు, ఫౌబర్ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీతమిళనాడులో ఎక్కువగా పాపులర్ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తయారీ విధానంబియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు) శుభ్రంగా కడిగిన తరువాత, 4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.పెనంపై రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్తోగానీ వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే. -
బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
అధిక బరువు నుంచి బైటపడాలంటే చక్కని పోషకాహారంతోపాటు, రోజుకు కనీసం అరగంట వ్యామాయం చేయాల్సిందే. బరువు తగ్గాలంటే వ్యాయామం కంటే డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నం మానేశాం అంటూనే ఉదయం పూట టిఫిన్‌లో ఇడ్లీ, పూరీ, వడ దోసలు, చపాతీలు లాగించేస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దమా..!అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. రోజుమొత్తానికి శక్తినిచ్చేలా ఉండాలి. పోషకాలతో కూడిన అల్పాహారం తింటే ఆరోగ్యకరమైన బరువుతో, మెటబాలిజం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్లూటెన్-రహిత మిలెట్ల్స్ను తీసుకోవడం ఉత్తమం. మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రెడీమేడ్ మిల్లెట్ ఆధారిత పిండి, పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఫింగర్ మిల్లెట్ లేదా రాగి దోస, రాగి ఇడ్లీ, రాగి జావ : ఫైబర్, కాల్షియం ,ఐరన్ అధికం.జొన్నలతో కిచ్డీ, జొన్నరొట్టె : కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలంఫాక్స్టైల్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్స్‌తో చేసిన పొంగల్, లిటిల్ మిల్లెట్ దోస: కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంప్రోసో మిల్లెట్ దోస: సాధారణ దోసలాగానే బియ్యం కలపుకుండా, కొద్దిగా మినపపప్పు కలిపి చేసుకోవాలి. బార్నియార్డ్ మిల్లెట్ పొంగల్ : దీన్ని కూడా బియ్యం పొంగల్లాగా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ , ప్రోటీన్‌లో అధికం. -
సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల తనయ సారా టెండూల్కర్ అందరికీ సుపరచితమే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈసారి ఆమె తన సోదరుడు అర్జున్‌తో కలిసి ఇన్‌స్టాలో తాము తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌ల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తాము రోజు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో, ఏవి ఇష్టంగా తింటారో సవివరంగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అంతేగాదు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉదయాన్ని ప్రారంభిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమేగాక మంచి ఎనర్జీ కూడా వస్తుందని చెబుతోంది. తమలా ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలనుకుంటే ఈ లిస్ట్ ఫాలో అవ్వండి అంటూ ఆ రెసిపీల వివరాలు వెల్లడించింది సారా. అవేంటంటే.. అవకాడో టోస్ట్లైట్తో గిలకొట్టిన గుడ్లు.. హోల్ గ్రెయిన్బ్రెడ్ టోస్ట్‌పై క్రీమీ అవోకాడోని జత చేసి, దానికి ప్రోటీన్ ప్యాక్డ్ గిలకొట్టిన గుడ్లను జోడించండి. కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి కాస్త పెనంపై కాల్చాలి. చివరిగా వేడి సాస్‌తో గార్నిష్ చేసి తింటే టేస్ట్ అదుర్స్. పోహా! అటుకులనే పోహా అంటారు. తేలకగా జీర్ణమయ్యే ఆహారం. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి, చివరగా తాజా కొత్తిమీర నిమ్మకాయ జల్లుకుని తింటే నోటిలో నీళ్లు ఊరడం ఖాయం. దోస దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందిన అల్పహారం. దక్షణ భారతదేశంలో అత్యంత ఫేమస్ వంటకం. బియ్యం మినప్పులతో చేసిన దోసపిండిని పెనం మీద చక్కగా అట్టులా పోసి మసాల బంగాళ దుంప కూరని పెట్టి దొరగా కాల్చి తీయాలి. ఆ తర్వా కొబ్బరి చట్నీ, సాంబారుతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఉప్మా మంచి పోషకాలతో కూడిన దక్షిణ భారతదేశ వంటకం. సుగంధ ద్రవ్యాలు, చక్కటి పప్పు ధాన్యాలు, కూరగాయాలతో తయారు చేసే మంచి రెసిపీ. ఇడ్లీ మృదువుగా ఉంటుంది. ఆవిరిపై ఉడికించే వంటకం ఇది. రైస్ కేక్ మాదిరిగా ఉంటుంది. దీన్ని కూడా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో తింటే ఉంటుంది.. సామీరంగా వదిలిపెట్టరు. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన అల్పహార రెసిపీలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ డైట్లో జోడించండి, ఆరోగ్యంగా ఉండండి అంటోంది అందాల సారా. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయ్యిపోండి. (చదవండి: వరల్డ్ దోస డే! దోస రెసిపీని మొదటగా ఎవరు చూశారు? అంత క్రేజ్ ఎలా వచ్చిందంటే..?) -
Telangana: సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం సూపర్.. లాంఛింగ్ (ఫొటోలు)
-
CM Breakfast Scheme: తెలంగాణలో సీఎం అల్పాహార పథకం ప్రారంభం
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో సర్కారీ బడుల విద్యార్థుల కోసం.. సీఎం అల్పాహార(బ్రేక్‌ఫాస్ట్) పథకం ప్రారంభమైంది. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు శుక్రవారం ఉదయం ఈ పథకం ప్రారంభించారు. మరోవైపు అదే సమయంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 సర్కార్ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ అందించనుంది. తరగతుల ప్రారంభం కంటే అరగంట ముందు విద్యార్థులకు ఈ టిఫిన్ అందిస్తారు. సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఇప్పటికే ఖరారయ్యింది. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అల్ఫాహార నాణ్యతను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పాఠశాలల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. -
బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ అరటిపండు తింటున్నారా? అస్సలు అలా చేయకండి
రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఛాయిస్. ► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినకూడదా? అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు. -
బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి!
మీరు రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే అత్యంత ముఖ్యమైనది బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, ఫైబర్లతో కూడిన ఆహారం తీసుకోవడమనేది అత్యంత ముఖ్యం. వీటితో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం హాయిగా గడిచేలా చేస్తోంది. లేదంటే చిరాకుగా ఉండి ఏ పని చేయాలనే ఉత్సాహం లేకుండా అయిపోతుంది. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో రుచికరంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పొద్దుపొద్దునే అధిక చక్కెరలు, కొవ్వులు కలిగిన పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా శరీరంలో అధిక కేలరీల్లో కొవ్వుని అమాంతం పెంచేస్థాయి. తక్కువగానే ఫుడ్ తీసుకుంటున్నాం కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతుంటాం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటికి దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఆహారాలు ఏమిటో చూద్దామా! చక్కెర లేదా శుద్ధి చేసిన తృణధాన్యాలు పొద్దుపొద్దునే చక్కెర లేదా క్రంచిగా ఉంగే పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో చక్కెర ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచేస్తాయి. దీంతో చక్కెరను తగ్గించే ఇన్సులిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకు, అసహనం ఎక్కువై తెలియకుండానే అధిక ఆకలికి దారితీస్తుంది. అదే విధంగా కార్న్‌ఫ్లెక్స్ వంటి తియ్యని తృణధాన్యాల్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. పైగా వాటిలో చక్కెర స్థాయిలు లేకపోయినప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అంత మంచిది కాదనే చెబుతున్నారు వైద్యులు. వీటి కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందంటున్నారు. పాన్‌కేకులు, బ్రెడ్ పాన్‌కేకులు, బ్రెడ్స్ రుచికరంగా అనిపించినప్పటికి ఉదయాన్నే అల్పహారంగా తీసుకోవడానికి పోషకమైన ఆహారం కాదనే చెబుతున్నారు నిపుణలు. వీటిలో అధిక కేలరీల్లో చక్కెర, కొవ్వులు ఉంటాయి. దీని వల్ల పోషకాహరంతో కూడిన ప్రోటీన్లు ఫైబర్లు మిస్ అవుతాయని అంటున్నారు ఆహార నిపుణులు. వెన్నతో చేసిన టోస్ట్ బటర్డ్ టోస్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. కానీ దీనిలో అంత స్థాయిలో ప్రోటీన్లు ఉండవు. ఈ బటర్డ్ టోస్ట్‌లో ఎక్కువ కేలరీలలో పిండి పదార్థాలు, కొవ్వులు ఉండటం వల్ల దీన్ని అల్పహారంగా పరిగణించలేమని అంటున్నారు వైద్యులు. దీని బదులుగా హోల్ గ్రెయిన్ బ్రెడ్(వీట్‌బ్రెడ్), గుడ్లు లేదా చికెన్, దోసకాయ, ఆకుకూరలు, కూరగాయ ముక్కలు చేరిస్తే పుష్కలంగా ప్రోటీన్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది పూరీలు డీప్ ఫ్రై చేసిన ఆహారం ఉదయమే అల్పహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి వస్తాయి. ఇది లివర్‌కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి డీఫ్ ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లరసం దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని ఎంచుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు న్యూట్రీషియన్లు. తియ్యటి పెరుగు లేదా వెన్న లేని పెరుగు దీనిలో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియాలను అందిస్తుంది. కానీ ఈ పెరుగులో చక్కెర స్థాయిలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఇది మంచిదని చెప్పలేం అంటున్నారు ఆహార నిపుణులు. దీనిలో కొవ్వుల స్థాయి కూడా తక్కువగానే ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేందుకు ఉత్తమమైందని చెప్పలేం అంటున్నారు . ఫాస్ట్ ఫుడ్ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీటిలో ఎక్కువ కేలరీల్లో కొవ్వు, శుద్ది చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆకర్షణీయంగా రుచికరంగా అనిపించినప్పటికీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బెబుతున్నారు ఆహార నిపుణులు కాఫీ పానీయాలు పరగడుపునే ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇన్సులిన్ని స్రవించేలా చేయడమే గాక వాటి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది కూడా. పరాఠా ముఖ్యంగా మైదాతో చేసిన పరాఠాలు జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రమాదరకమైనవి. ఇవి వికారం వంటి అనుభూతులకు కారణమవుతాయి. అంతగా తినాలనిపిస్తే రాగులు, గోధుమలు వంటి వాటితో చేసిన పరాఠాలు ఉత్తమం. ఇంకా పరాఠాలను కూరలతో కలిపి తీసుకుంటుంటారు. అయితే వాటిలో పనీర్‌కు బదులుగా సోయాబీన్స్, బ్రోకలీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసిన కర్రీలను ఉపయోగించటం మంచిది. మ్యాగీ న్యూడిల్స్ దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటితో ఆరోగ్య ప్రయోజాలు లేకపోగా మంచి పోషక విలువలేమి శరీరానికి అందవు. దీనిలో 46 శాతం సోడియం ఉంటుంది. అందువల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియ స్థాయిలు పెరిగి హైపర్‌నాట్రేమియా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతేగాదు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది కూడా. (చదవండి: ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..) -
Viral Video: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!
-
ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా! వీడియో వైరల్
మాములుగా అడవిలో ఉండే జంతువులు తమకు నచ్చని ఆహారాన్ని స్వేచ్ఛగా తినేస్తాయి. అదే జంతుశాలలోనూ లేదా టైగర్ రిజర్వ్లలోనూ ఉంటే వాటి బాగోగులను నిర్వహణ అధికారులే చూస్తారు. అయితే అక్కడ వాటికి ఆహారం ఎలా అందిస్తారో, ఎలా తయారు చేస్తారో వంటి వాటికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగులన్ని ఎలిఫెంట్ క్యాంప్ వద్ద బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటికోసం పశువైద్యులు బియ్యం, రాగులు, బెల్లం కలిపిన ఆహారాన్ని పెద్ద పెద్ద సైజు బంతుల్లో తయారు చేసి వాటికి అందిస్తున్నారు. అందులో ఒక ఏనుగు తనకు ముందు పెట్టమన్నట్లుగా తొండంతో శబ్దం చేయడం వీడియోలో చూడవచ్చు. ఇది తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్లోనిది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఐతే పలువురు నెటిజన్లు అవి స్వేచ్ఛగా ఆహారం తినేలా చేయాలి, ఇది కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..
ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ లేదా టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి, దోసె, ఉప్మా, చపాతి. పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ, పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు.. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని లేదా పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. మధ్యాన్నం అన్నం తినేదాకా హుషారుగా పని చేసేవారు. ఎందుకంటే చద్ది అన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా రోజూ చద్దన్నం తింటే రోజంతా ఉత్తేజంగా శక్తివంతంగా ఉంటారని పెద్దవాళ్లు చెబుతారు. చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిరపకాయని నంచుకుని తింటే..శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అధిక రక్తపోటు తగ్గి,శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. చదవండి: కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే! అంతేకాదు.. రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి తోడేసి పొద్దున్నే అందులో పచ్చి ఉల్లిపాయి ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు ఎముకలకి మంచి బలం కూడా. చద్దన్నం తింటే మంచిదే అని ఎక్కువసేపు ఉంచకూడదు. వీలయినంత తొందరగా తినేయాలి. చదవండి: Health Tips: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇచా చేస్తే.. -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
బ్రేక్‌ఫాస్ట్ బిల్: చిక్కుల్లో ఫిన్లాండ్ ప్రధాని
హెల్సింకి: అధికారంలోకి రాగానే అనేక సంస్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్.. కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది. అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్ చేస్తోంది. ఈ మేరకు లోకల్ టాబ్లాయిడ్ ఒకటి కథనం ప్రచురించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో సన్నా మారిన్ స్పందించారు. ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్ చేశారు. On hyvä, että menettely selvitetään. Olen luottanut asiassa virkamiehiltä saamaani tietoon ja ohjeistukseen. En ole itse tehnyt hankintoja, vaan kaikki hankinnat on tehty valtioneuvoston kanslian virkakunnan ja työntekijöiden toimesta. — Sanna Marin (@MarinSanna) May 28, 2021 కాగా, రీఎంబర్స్మెంట్ గురించి చట్టంలో ఎక్కడా లేదన్న పోలీసులు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిన్నిష్ చట్టాలకు విరుద్ధంగా సన్నా వ్యవహరించారని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా, పోలీస్ విచారణను సన్నా స్వాగతించారు. కాగా, 35 ఏళ్ల సన్నా మారిన్ డిసెంబర్ 2019లో ఫిన్లాండ్కు ప్రధాని అయ్యింది. పాలనతో పాటు కరోనా కట్టడిలో మిగతా యూరోపియన్ దేశాల నుంచి శెభాష్ అనిపించుకుందామె. కానీ, తర్వాతి నుంచి ఆమె క్రేజ్ పడిపోతూ వస్తోంది. ఈ మేరకు జూన్ 13న జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష రైట్ వింగ్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. View this post on Instagram A post shared by Sanna Marin (@sannamarin) -
వేరీ టెస్టీ.. టైం సేఫ్టీ
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): ప్రస్తుతం బిజీ సమయంలో ప్రజలు వేడివేడిగా తమ ఇళ్లల్లోనే ఇన్స్టంట్ మిక్స్ ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో రకరకాల టిఫిన్స్, బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవడానికి గృహిణీలు ఒక రోజు ముందుగానే ఎంతో సమయం వృథా చేసుకునేవారు. ఒక రోజు ముందుగానే ఇడ్లీలు, దోశలు, వడలు తయారు చేసుకోవడానికి పిండిని ముందుగానే రుబ్బి పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వంటకం ఏదైనా సరే మార్క్ట్లో రెడ్‌మిక్స్ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకొని వచ్చిన నిమిషాల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. ఇష్టమైన్ బ్రేక్‌ఫాస్ట్ నిమిషాల్లో రడీగా.. నిత్యం బిజిగా ఉండే ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లే మహిళలకు, విద్యార్థులకు పొద్దుపొద్దునే ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తినడానికి ఇన్స్టంట్ రెడిమిక్స్ ప్యాక్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. బిజిగా ఉండేవారందరూ వీటిపై ఎక్కువ శ్రధ్ద కనబర్చుతున్నారు. ఇడ్లీ,వడ, దోశ, ఉప్మా, వడలను రెడిమిక్స్లతో తయారు చేసి అతిథులకు, కుటుంబీకులకు ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే అందజేస్తున్నారు. ఇంటిల్లిపాదికి సమయం వృథా కాకుండా తక్కువ సమయంలోనే వీటిని అందజేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. దీంతో పాటు ఓట్స్, నూడుల్స్, పాస్తా, మసాల ఓట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. దేశంలో పేరొందిన కంపెనీలు వీటిని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ మార్క్ట్లో రోజురోజుకీ రెడిమిక్స్కు ఆదరణ పెరుగుతోంది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా,పెసరట్లు, రవ్వదోశ తదితర వాటితో పాటు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే మ్యాగీనూడిల్స్, పాస్టా, కార్న్ఫ్లాక్స్, ఓట్స్, వేడివేడి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లాక్స్, చాకోస్‌తో పాటు ఫ్రెంచ్‌ఫ్రైస్ (ఆలు ఫింగర్చిప్స్)లాంటి చిరుతిళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇన్స్టంట్ల మిక్స్‌ల ధరలు రూ.30 నుంచి రూ.200ల వరకు ఆందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఫుడ్స్ తినడానికి తయారు చేసుకోవడానికి పెద్దగా సమయం లేక పోవడంతో పాటు రుచిగా ఉండడంతో ప్రజలు కోవిడ్ బారిన పడకుండా బయట హోటళ్లలో తినకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా చూసుకుంటకున్నారు. సమయం కలిసొస్తుంది తక్కువ సమయంలో మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ రెడీఫుడ్స్ ద్వారా సమయం కలిసొస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తక్కువ సమయంలోనే టిఫిన్ తయారు చేసుకునేందుకు వీటి వల్ల అవకాశం ఉంటుంది. దీంతో పాటు మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ ఫుడ్ రుచికరంగా ఉంటున్నాయి. – సంతోష్‌కుమార్, పెద్దశంకరంపేట రుచికరంగా ఉన్నాయి మార్కెట్లో రకరకాలుగా దొరికే ఇన్స్టంట్ ఫుడ్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉండడం వల్ల వీటికి ఎక్కువగా కొంటున్నాం. తక్కువ సమయంలో అవసరమైన టిఫిన్ తయారు చేసుకోవచ్చు. ధర తక్కువ ఉండడం, బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ సమయం లేకుండా తయారు చేసుకుంటుండడం వల్ల సమయం వృథా కాదు. – శ్రీనివాస్, పెద్దశంకరంపేట -
గరం గరం వడ సాంబార్.. తింటే షాక్..!
ముంబై : పొద్దుగళ్ల పొద్దుగళ్ల వడ సాంబార్ తినాలని ప్రతిఒక్కరు ఆరాటపడతారు. ఇక నాగ్‌పూర్‌లోని అజానీ స్క్వేర్‌లో స్నాక్స్ తయారీలో పాపులర్ అయిన హల్దీరామ్ నిర్వహిస్తున్న ఓ హోటల్‌కు జనం ఎగబడతారు. అక్కడ టిఫిన్స్ శుచిగా శుభ్రంగా ఉంటాయిన క్యూ కడతారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. తన భార్యతో కలిసి వడ సాంబార్ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సాంబార్లో బల్లి ప్రత్యక్షమవడంతో విషయం హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్వాహకులు బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, సాంబార్లో బల్లిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయమై సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఏ (నాగ్‌పూర్) కమిషనర్ మిలింద్ దేశ్‌పాండే తెలిపారు. కిచెన్‌లో ఉన్న లోపాలను గుర్తించామని, ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు లోబడి హోటల్ నడుచుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కిటీకీలకు తెరలు బిగించాలని ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. అప్పటివరకు హోటల్‌ను మూసేయించామని వివరించారు. ఇక కస్టమర్ లేవెనెత్తిన ఆరోపణలపై తమకు అనుమానాలు ఉన్నాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. బాధితులకు చికిత్సనందించామని.. వారికి ఆరోగ్యానికి బాగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. హోటల్ నిర్వహణకు సంబంధించి అధికారులకు తగు పత్రాలు అందిచామని తెలిపారు. ఇక బాధితులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. వారు ఎవరిపైనా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
వెంకయ్య విందుకు కాంగ్రెస్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ఇవ్వనున్న అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పార్లమెంట్ సభ్యులకు మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరుకావట్లేదని ఓ సీనియర్ నేత ప్రకటించారు. రఫెల్ ఒప్పందం, ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ సభ్యులకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, వెంకయ్య నాయుడు సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల నిర్ణయంపై వెంకయ్య నాయుడు తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఇదే నా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్: సచిన్
ముంబై: తన కుమారడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెగి మురిసిపోతున్నాడు. అర్జున్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఎంతబాగుందో అంటూ అర్జున్‌ని పొగడ్తలతో ముంచుత్తుతున్నాడు. ఈ మేరకు అర్జున్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ను బెడ్ పైనే ఉండి తింటుండగా తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సచిన్. 'మా అబ్బాయి తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఇది.. ఎప్పటికీ ఇదే నా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్'అని సచిన్ క్యాప్షన్ జోడించాడు. తనదైనందిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే సచిన్.. తాజాగా కుమారుడు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను సైతం ఫోటో తీసి అభిమానులతో పంచుకోవడం విశేషం. Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!! A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Jul 2, 2017 at 2:29am PDT -
అల్పాహారం కోసం విద్యార్థుల ఆందోళన
ఆదిలాబాద్ : వారంతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. ఉదయం 10 గంటలు అవుతున్నా... గరుకుల సిబ్బంది అల్పాహారం పెట్టకపోవడంతో విద్యార్థుల కడుపు మండింది. దాంతో విద్యార్థులంతా ధర్నాకు దిగారు.విద్యార్థి సంఘాల నేతలు కూడా వీరికి మద్దతుగా అక్కడికి చేరుకుని గురుకుల సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఇది చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... గురుకుల విద్యార్థులకు ఆహారం అందించే బాధ్యతను ఉన్నతాధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే, తన సిబ్బంది రాలేదంటూ కాంట్రాక్టర్ ఆదివారం ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించలేదు. ఉదయం 10 గం. దాటిన అల్పహారం అందకపోవడంతో విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని నిలదీశారు. దీంతో పంచాయతీ తాహసీల్దార్‌కు చేరింది. దాంతో తాహసీల్దార్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. కాంట్రక్టర్‌పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దాంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ గురుకుల పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. -
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్ జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జెడ్పీ నుంచి నిధులు విడుదల చేస్తూ ఆయన సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకే అల్పాహారం అందించేవారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థులకూ జెడ్పీ నిధులతోనే పౌష్టికాహారం అందించేందుకు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఆయా యాజమాన్యాల్లో పదో తరగతి చదువుతున్న 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిధులతో విద్యార్థులకు ఉప్మా, ఇడ్లీ, గుడ్లు, బిస్కెట్లను రోజు మార్చి, రోజు అల్పాహారంగా అందించాల్సి ఉంది. 25 వేల మందికి రూ.6 వంతున అల్పాహారం అందించేందుకు నెలకు రూ.45 లక్షల వ్యయం కానుంది.