షుగర్‌ కంట్రోల్‌ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్‌-రిచ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ | How To Make This Protein Rich Breakfast Adai Dosa Recipe | Sakshi
Sakshi News home page

షుగర్‌ కంట్రోల్‌ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్‌-రిచ్‌ బ్రేక్‌ఫాస్ట్‌

Published Mon, May 20 2024 1:37 PM | Last Updated on Mon, May 20 2024 3:07 PM

How To Make This Protein Rich Breakfast Adai Dosa Recipe

శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం.  నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్‌ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్‌ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్‌ సౌత్ ఇండియన్ టిఫిన్‌ గురించి తెలుసుకుందామా.

ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి,  ప్రొటీన్లు, ఫౌబర్‌ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా  దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్‌ పేషంట్లకు కూడా మంచింది.  బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె.  

ఇంట్లోనే  సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీ
తమిళనాడులో ఎక్కువగా పాపులర్‌ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా.  పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.

పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్‌ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తయారీ విధానం
బియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు)  శుభ్రంగా కడిగిన తరువాత,  4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.
తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి.  గ్రైండ్‌ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి  తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి.  పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.

పెనంపై  రెండు చెంచాల  నూనె లేదా నెయ్యి వేసి  చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే  అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్‌తోగానీ  వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement