మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.
గర్భిణీ స్త్రీలకు
శరీరానికి విటమిన్ సి, ఫైబర్ , జింక్, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి.
విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది.
మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.
శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు బాగా పనిచేస్తుంది.
శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సహాయ పడతాయి.
మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.
మొలకల్లో విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.
సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలు
తక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది. ఒక్కోసారి, జ్వరం అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది. మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.
నోట్: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment