Side effects
-
ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?
పీడకలలు (Nightmares) ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఏదో ఒక సమయంలో రావడం మామూలే. తీవ్రమైన మానసిక ఒత్తిడికీ, ఆవేదనకు గురైన / గురవుతున్న వారితో పాటు ఆర్థిక, సామాజిక కారణాలతో బాధపడుతూ ఉండేవారికి ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక మరికొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత జెట్లాగ్ టైమ్‌లో లేదా ఆ తర్వాత కూడా పీడకలలు రావచ్చు. ఇవి అదేపనిగా వస్తుంటే అందుకు కారణాలేమిటి, వాటికి చికిత్స ఏమిటన్న విషయాలను తెలుసుకుందాం.అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో పీడకలలు రావడం అన్నది సాధారణమే అయినా... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం వల్లా... అలాగే వాటి దుష్ప్రభావం వారి దైనందిన జీవితంపై పడటంతో సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బతినడం జరగవచ్చు. దాంతో తమకు సంబంధించిన ఇతరత్రా పనులేవీ చేసుకోలేని విధంగా తీవ్రమైన మానసిక ఆందోళనకూ, తీవ్రమైన ఒత్తిడికీ, ఆందోళనకూ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్మేర్ డిజార్డర్’(Nightmare disorder)గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్’(Dream anxiety disorder) అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్మేర్ డిజార్డర్’ లేదా ‘రిపీటెడ్ నైటమేర్స్’ (Repeated nightmares) అంటున్నారు. (కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!)సాధారణంగా ‘నైట్మేర్ డిజార్డర్’ సమస్యకు మందుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ధైర్య వచనాలు చెప్పి సాంత్వన కలిగించడం అవసరం. అలాగే వాళ్లకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో పదే పదే ఇలాంటి కలలు రావడానికి మరో అంతర్గత కారణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి అండర్లైయింగ్ మెడికల్ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు. మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్ రెడ్యూసింగ్ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. అయితే భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, కుటుంబ పెద్ద మరణం... ఇలాంటి ఏవైనా కారణాలతో కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాంతమైనట్లుగా బాధితుల మనసులో నాటుకుపోయేలా చేస్తారు. ఫలితంగా పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! -
గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సెస్, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 25 నుంచి 49 ఏళ్ల మధ్య వ్యవసాయ కూలీలుగా ఉన్న గ్రామీణ మహిళల్లో 32 శాతం గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ...Hysterectomy) శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని, ఈ శస్త్ర చికిత్సలు ప్రభుత్వ బీమా పథకాల ద్వారానే జరుగు తున్నాయని వెల్లడైంది. గర్భసంచి(Uterus) తొలగింపు శస్త్ర చికిత్సలవైపు గ్రామీణ మహిళలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?! ఏ అంశాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి?! గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?! అవగాహన అవసరం...దేశంలో బిహార్, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాల్లోని గ్రామాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు స్త్రీ వైద్య నిపుణులు. వారు చెబుతున్న విషయాలేంటంటే..ఖర్చుకు భయపడి...వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత శుభ్రత తక్కువ. దీనివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, రుతు సమయంలో వచ్చే నొప్పులను ఇంటిలో పనుల కారణంగా భరిస్తున్నారు. అయితే గర్భసంచి వాపు, సిస్టులు అనగానే క్యాన్సర్ అని భయపడుతున్నారు.సమస్య తీవ్రం అయినప్పుడు హాస్పిటల్‌కు రావడం, త్వరగా నయం కాకపోవడంతో పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసి వస్తుందని, దీనివల్ల ఇంటి పనులు, కూలి పనులకు ఇబ్బందులు వస్తాయని, తమ వెంట వచ్చేవారి పని కూడా పోతుందని, టెస్టులకు, మందులకు అదనపు ఖర్చు అని.. ‘గర్భసంచి తొలగించు కుంటే’ ఈ చికాకులన్నీ పోతాయనే ఆలోచనకు వస్తున్నారు. శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాల కోసం వెతుకుతున్నారు.గర్భసంచి సమస్యలను వాయిదా వేసుకుంటూ కూలి పనులు ఎక్కువ ఉండని వేసవి కాలాన్ని ఆపరేషన్‌కు కేటాయించుకుంటున్నారు. త్వరగా పెళ్ళిళ్లు అవడం, పిల్లలు పుట్టడం, త్వరగా గర్భసంచి తొలగించుకోవడం అనేది గ్రామాల్లో కూలి పనులకు వెళ్లే వారిలో తరచూ కనిపిస్తోంది.అత్యవసర అవగాహనశుభ్రతకు సంబంధించిన అవగాహన అత్యవసరం. అధిక రక్తస్రావం సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. హార్మోన్లకు, బలానికి వాడే మందులను అందజేయాలి.తప్పనిసరై గర్భసంచి తొలగించుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మధుమేహం, బలహీనత, ఎముకల సమస్యలు... వీటన్నింటి పైనా అవగాహన కల్పించాలి.ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా ఉండటమూ దేశ భవిష్యత్తుకు కొలమానమే. వ్యవసాయ కార్మికులుగా ఉన్న మహిళలు తరచూ పురుగు మందులకు గురి కావడం వల్ల కూడా అధిక రుతుస్రావాలు, ఫైబ్రాయిడ్లు, గర్భాసంచి లోపాలు, జననేంద్రియ సమస్యలకు కూడా గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్ట్గర్భసంచి తొలగించడం వల్ల అండాలు విడుదల కాక హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకలపై ప్రభావం పడి, త్వరగా కీళ్ల సమస్యలు వస్తాయి. చాలా మందిలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల గర్భసంచి వాపు వస్తుంది. ఫైబ్రాయిడ్స్, సిస్టులు వస్తుంటాయి. అయితే అవగాహన లేక క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో గర్భసంచి తీసేయమని కోరుతున్నారు.పాప్‌స్మియర్ స్క్రీనింగ్‌తో గర్భసంచి సమస్య ఏంటో ముందే తెలుసుకోవచ్చు. దానికి తగిన మందులు వాడితే సరిపోతుంది. 40 ఏళ్ల లోపు మహిళలకు గర్భసంచి తొలగించకపోవడమే మంచిది. హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్టులు, కుటుంబం మొత్తానికి స్త్రీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. – డాక్టర్ భానుప్రియ, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నిజామాబాద్అడ్డంకిగా భావిస్తున్నారుగ్రామీణ మహిళలు ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం మందులు వాడటం, పదే పదే వైద్యులను సంప్రదించడం వారికి కష్టంగా మారుతుంది. అందుకు గర్భసంచి తొలగించుకోవడం మేలేమో అనే ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. సర్జికల్‌గా వచ్చే మెనోపాజ్ వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, చిరాకు, హాట్ ప్లషెస్.. అన్నీ ముప్పైల్లోనే కనిపిస్తాయి. – డాక్టర్ మనోరమ, మధిర, ఖమ్మం జిల్లా – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్‌కు రూ. 10 లక్షల జరిమానా
మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం అని అంటారు. దీనికి వైద్యులేమీ మినహాయింపు కాదనిపించే పలు ఘటనలను మనం చూసే ఉంటాం. తాజాగా అటువంటి ఉదాహరణ మన ముందు నిలిచింది. ఒక వైద్యుడు తాను 14 ఏళ్లుగా వైద్యం అందించిన బాధితునికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ బాధితునికి 14 ఏళ్లుగా వైద్యం అందించడం ఆ వైద్యునికి తలకుమించిన భారంలా మారింది. సదరు వైద్యుడు అందించిన ఔషధాలు ఆ బాధితునికి వికటించాయి. ఫలితంగా అతను ఇకముందు తండ్రి కాలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఉదంతం కోర్టు వరకూ చేరింది. వాదనల అనంతరం కోర్టు ఆ వైద్యునికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితునికి 30 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.యూపీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రిసైడింగ్ అధికారి తన తీర్పులో డాక్టర్ అరవింద్ గుప్తాకు ఈ జరిమానాను విధించారు. జరిమానా మొత్తంతో పాటు కేసు ఖర్చుల నిమిత్తం బాధితునికి రూ.25 వేలు చెల్లించాలని కూడా ఆదేశించారు. 30 రోజుల్లోగా బాధితునికి తొమ్మిది శాతం వడ్డీతో సహా మొత్తం సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. జౌన్‌పూర్‌కు చెందిన ఓ బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఈ ఉదంతంపై పిటిషన్ దాఖలు చేశాడు. తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలను కనేందుకు 14 ఏళ్లుగా ప్రముఖ వైద్యుని దగ్గర చికిత్స చేయించుకున్నట్లు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.ఆయనకు ఫీనిక్స్ హాస్పిటల్లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స అందించారు. డాక్టర్ అరవింద్ గుప్తా ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చికిత్స సమయంలో, బాధితుడికి పలుమార్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా బాధితునికి ఉపశమనం లభించకపోవడంతో ఆయన మరో వైద్యుడిని సంప్రదించారు ఆ రెండో వైద్యుడు నిర్వహించిన పరీక్షలో డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స కారణంగా బాధితునికి మరో అనారోగ్యం వాటిల్లిందని తేలింది. డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్సలో దుష్ప్రభావాల కారణంగా బాధితునికి ఇక తండ్రి అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
నటి నిమ్రా ఖాన్ క్రాష్ డైట్: ఇది ఆరోగ్యకరమేనా...?
34 ఏళ్ల పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్ హాస్య ధారావాహిక కిస్ దిన్ మేరా వియా హొవేగాలో చిన్న పాత్రతో యాక్టింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా నెమ్మదిగా మెహెర్బాన్, ఉరాన్, ఖూబ్ సీరత్, మే జీనా చాహ్తీ హూన్ వంటి ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఇటీవల చాలా తక్కువ వ్యవధిలో స్లిమ్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను ఇంతలా బరువు ఎలా తగ్గిందో కూడా వివరించింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఇలా.. వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతులు మంచివేనా..? అనే సందేహం మెదిలింది. అయితే ఈ విధానంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.పాక్ నటి ఇమ్రా ఖాన్ తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. తాను క్రాస్డైట్తో కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు తెలిపింది. అలాగే తాను ఈ డైట్‌ని ఎలా ఫాలో అయ్యిందో కూడా వివరించింది. బరువు తగ్గడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే గాక నిబద్ధతతో డైట్ ఫాలో కావాలని చెప్పుకొచ్చింది. తాను ఆహారంలో కేవలం తెల్లసొన, యాపిల్స్, గ్రీన్ టీ, వెజిటబుల్ జ్యూస్‌లు మాత్రమే తీసుకుని, పూర్తిగా కార్బోహైడ్రేట్లను నివారించానని తెలిపింది. ఇలా.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే దినచర్య అని పేర్కొంది. అందువల్లే కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తేనె, నిమ్మకాయ, చియా గింజలు కలిపిన గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ ప్రారంభించాలని చెప్పింది. అయితే ఇది ఏడు రోజుల డైట్ ప్లాన్ అని..చాలావరకు అందరూ మూడు రోజులు స్ట్రిట్‌గా ఫాలోఅయ్యి, ఆ తర్వాత మధ్యలోనే స్కిప్ చేసేస్తుంటడంతో మంచి ఫలితాలు పొందలేకపోతుంటారని చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ఇది సరైనదేనా..?నటి నిమ్రా డైట్ ప్లాన్ త్వరితగతిన ఫలితాలు ఇచ్చినప్పటికీ.. బరువు నిర్వహణకు ఇది సరైన ఆరోగ్య విధానం కాదని చెబుతున్నారు నిపుణుల. ఇలాంటి క్రాష్ డైట్లు తరుచుగా కొవ్వు తగ్గడం కంటే..శరీరంలోని నీటి శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో హర్మోన్ల అసమతుల్యత, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలనకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.అలాగే ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ ఆహారంలో చేర్చే ప్రయత్నం చేస్తే.. విపరీతమైన బరువు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా హర్మోన్ల మార్పులు, పిత్తాశయ రాళ్లు, మానసిక కల్లోలం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. మంచి ఫలితాల కోసం నిధానంగా బరువు తగ్గించే ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్లు మంచివని అన్నారు. వీటితో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడమే గాక ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రోగ నిరోధకశక్తి వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు.(చదవండి: బ్రెస్ట్ కేన్సర్: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!) -
Supreme Court: దుష్ప్రభావాలు రాయడం కుదరదు
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్ఎఫెక్ట్లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్‌చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి. ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్‌ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్ఎఫెక్ట్లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు. చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
పైనాపిల్ : ఆ సమస్యలుంటే తినకపోవడమే మేలు!
ప్రస్తుతం చాలామంది ఆరోగ్య స్ప్రుహతో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటున్నారు. వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. అయితే పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.అయితే ఈ పైనాపిల్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పండులో ఉండే తీపి, పిలుపు రుచి కారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడతుంటారు. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఈ పైనాపిల్‌లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుందిఇన్ని ప్రయోజనాలు ఉన్నా..దీనిలో సహజ చక్కెరలు, కేలరీలు అధికం. అలాగే ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు ఈ పండు తీసుకోకపోవడమే మంచిది. అలాగే కడుపులో అల్సర్, అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయంలో పైనాపిల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్స్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ తినాలనుకున్నా ఈ పండుని మితంగా తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
సోల్‌మేట్స్‌తో సోషల్‌గా...మనసుకు మేలే..!
సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి. టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది. -
ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!
సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ లోపిస్తే వచ్చే పరేషాన్ ఏమిటో అర్థం అవుతుంది."స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. – వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే ముందు నాన్ స్టెరైల్ వాటర్‌ని కలిపితే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం. – ఎంఆర్ఐ స్కానింగ్ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు. – ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్ ఆక్సైడ్ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు. – టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. – టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్–అప్లు అవసరం కావచ్చు. – స్కిన్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. – మధుమేహం నియంత్రణలో లేకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. – టాటూ ఆర్టిస్ట్ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. – ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. – టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. – కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.అనారోగ్య ‘ముద్ర’.. అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు.జాగ్రత్తలు ఇలా..– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్పోజ్ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.శుభ్రతతోనే.. సురక్షితం...టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి. నీడిల్స్ తమ ముందే ఓపెన్ చేయాలని కోరాలి. రీ యూజబుల్ మెటీరియల్ అంతా ఆటో క్లోవ్లో స్టెరైల్ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్ -
మొలకలొచ్చిన ఆలుగడ్డలు : ఇలా జాగ్రత్త పడదాం!
గింజలు, ఇతర తృణ ధాన్యాల్ని నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం వలన అందులోని పోషకాలు ఎక్కువగా అందుతాయి. కానీ మొలకెత్తిన తరువాత విషపూరితంగా మారే దుంపకూర గురించి తెలుసా? మార్కెట్ నుంచి తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు, బంగాళాదుంపల్లో తెల్లగా చిన్న చిన్న మొలకలొస్తాయి. ఇలాంటి వాటిని తినడం మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?మొలకలొచ్చిన బంగాళాదుంపలను మొలకల్ని తీసివేసి వండుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా మొలకెత్తిన దుంపలను వంటలో ఉపయోగించడం మంచిది కాదు. నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళదుంపలు ఎందుకు తినకూడదుగ్లైకోఅల్కలాయిడ్స్, యాంటీబయాటిక్ లక్షణాలు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాలతో సహా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వీటిని అధికంగా తింటే విషపూరితమయ్యే అవకాశాలే ఎక్కువ. మొలకెత్తిన బంగాళా దుంపల్లో అధిక స్థాయిలో గ్లైకోఅల్కలాయిడ్స్ పెరుగుతాయి. వీటి అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావొచ్చు. అయితే వీటి బాగా ఉడికించడం వల్ల ఈ విష ప్రభావం బాగా తగ్గుతుంది.మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న తర్వాత కొన్ని గంటల నుండి ఒక రోజులో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి మరీ ఎక్కువైతే రక్తపోటు, పల్స్ వేగం, జ్వరం, తలనొప్పి, గందరగోళం, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి.గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే మొలకలొచ్చిన దుంపలు తాజాగా ఉన్నంతవరకు బేషుగ్గా తినవచ్చని మరికందరు చెబుతున్నారు. ఆ మొలకల్ని శుభ్రంగా తీసేసి తినవచ్చు. అయితే దుంపలు కుళ్లిపోకుండా ఉన్నాయా లేదా అనేది గమనించడం ముఖ్యమంటున్నారు.మొక్కలు రాకుండా ఉండాలంటేఎక్కువ నిల్వ ఉండకుండా, తాజాగా ఉండే దుంపలను మాత్రమే వంటల్లో వాడు కోవడం. బంగాళాదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఎందుకంటే రెండింటినీ కలిపి ఉంచడం వల్ల దుంపలు తొందరగా మొలక లొస్తాయట. బంగాళాదుంపల సంచిలో ఆపిల్‌ను జోడించడం వలన అవి మొలకెత్తకుండా నిరోధించవచ్చట.చిన్న చిట్కా: ఇలా మొలకలొచ్చిన దుంపలను పెరట్లోని చిన్న కుండీల్లో వేస్తే చక్కగా పెరుగుతాయి. దుంపలు కూడా ఊరతాయి. -
Water Fasting : 21 రోజుల్లో 13 కిలోలు తగ్గాడు! ఇది సురక్షితమేనా?
బరువు తగ్గించుకోవడంకోసం ఉపవాసాలు, వ్యాయామాలు అంటూ ఊబకాయులు చాలా కష్టపడుతుంటారు. అయితే కోస్టా రికాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో బరువు తగ్గాడు. 21 రోజుల్లో కేవలం నీరు మాత్రమే తాగి 13.1 కిలోల దాకా బరువు తగ్గాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిస్ మిల్లర్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తన వాటర్ఫాస్టింగ్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. కోస్టా రికాలో 21 రోజుల పాటు నీటి ఉపవాసం (ఎలాంటి ఆహారం, ఉప్పు లేకుండానే) పాటించి 13.1 కేజీల బరువు తగ్గాడట. 6శాతం కొవ్వు తగ్గిందని అడిస్ వెల్లడించాడు. ఇప్పటికే సన్నగా ఉన్న మనిషి మరింత సన్నగా మారాడు. అయితే ఇది అందరూ ఆచరించవచ్చా? దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?నీటి ఉపవాసం సురక్షితమేనా?“నీటి ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. 24 గంటలమొదలు, కొన్ని రోజులు లేదా వారాల వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ ,మెరుగైన మానసిక స్పష్టత, దీర్ఘాయువుతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. .నీటి ఉపవాసం సమయంలో, శరీరం కాలేయం , కండరాల కణజాలంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్తో సహా నిల్వలపై ఆధారపడుతుంది.నిపుణుల సమక్షంలో మాత్రమేఅయితేఇది అంత సురక్షితం కాదనీ, సరైన వైద్య నిపుణుల సమక్షంలో మాత్రమే చెప్పాలని చెపుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. నీటి ఉపవాసం ప్రమాదాలు:పోషకాహార లోపాలు: విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపం ఏర్పడుడుతంది. ఫలితంగా బలహీనత, మైకం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.హైడ్రేషన్‌కు నీరు చాలా అవసరం అయితే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.జీవక్రియపై ప్రభావం : సుదీర్ఘ ఉపవాసం జీవక్రియను నెమ్మదిస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది.మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు నీటి ఉపవాసం జోలికి వెళ్లకుండా ఉండాలి. లేదా నిపుణులైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.నీటి ఉపవాసానికి ప్రత్యామ్నాయం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా అడపాదడపా ఉపవాసాలను ఎంచుకోవచ్చు. ఎంత బరువు ఉండాలి అనేది నిర్ధారించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం బరువు తగ్గాలి. నిరంతర వ్యాయామం, జీవనశైలి మార్పులు, పిండి పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు, చక్కని పోషకాహారం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం. -
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాలు.సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు. -
'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..
చాలామంది రోజుని ఓ కప్పు 'టీ'తో ప్రారంభిస్తారు. చక్కగా పాలతో చేసుకునే 'టీ' అంటేనే చాలమంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ 'టీ'ని తయారీలో చాలామంది మంచి చిక్కటి 'టీ' కోసం అదేపనిగా మరిగిస్తుంటారు. కాస్త మరిగిన 'టీ'నే మంచి రుచి అని చాలామంది ఫీలింగ్. అయితే ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి చిక్కటి టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరీ ఎలా ప్రిపేర్ చేసుకుని తాగితే మంచిదంటే..ప్రతి ఒక్కరూ టీని పలు విధాలుగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కొందరూ 'టీ'ని ఆకులతో చేయడానికి ఇష్టపడతారు. మరికొందరూ కొద్దిగా పాలను, చక్కెరను జోడించి తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసేటప్పుడూ బాగా మరిగిస్తుంటారు. కొందరూ చల్లారిపోవడం వల్ల మరేదైన కారణం వల్లనో తరుచుగా అదేపనిగా వేడిచేసి తాగుతుంటారు. ఇలా కూడా అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా బాగా మరిగిపోయిన చిక్కటి 'టీ' తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా 'టీ' తాగడం వల్ల బరువు తగ్గుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైతే అదే పనిగా కెఫిన్ పానీయాన్ని ఇలా వేడి చేస్తుంటామో అది మన ఆరోగ్యాన్నికి హానికరంగా మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 'టీ'లో టానిన్లు ఉంటాయి. దీనిలో పాలీఫెనోలిక్ జీవ అణువులు ఉంటాయి. అది ప్రోటీన్లు, సెల్యులోజ్, పిండి పదార్థాలు, ఖనిజాలతో బంధించే పెద్ద అణువులు. ఎప్పుడైతే టీని మరిగిస్తామో ఇవి కరగని పదార్థాలుగా మారి శరీరంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అసలు బాగా మరిగించిన 'టీ' తాగడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలేంటంటే..పోషకాల నష్టంటీని నిరంతరం ఉడకబెట్టడం వల్ల పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు B12, సీవంటి పోషకాలు క్షీణిస్తాయి.రుచి మార్పుపాలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల మాడిన వాసనలాంటి రుచిలా ఉంటుంది. అజీర్ణంఅతిగా ఉడకబెట్టడం వల్ల పాలలోని ప్రొటీన్ల డీనాటరేషన్కు దారి తీస్తుంది, వాటి నిర్మాణాన్ని మారుస్తుంది. ఫలితంగా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తి కడుపునొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.అసిడిటీ సమస్య..టీని మరిగించడం వల్ల దానిలో ఉండే పీహెచ్ మారుతుంది. మరింత ఆమ్లంగా మారుతుంది. హానికరమైన మిశ్రమాలుఅధిక ఉష్ణోగ్రత కారణంగా మెయిలార్డ్ వంటి హనికరమైన మిశ్రమాలను ఏర్పరుస్తుంది.క్యాన్సర్ కారకాలుమరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. ఎంతలా మరిగిస్తే అంతలా ఈ క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి.టీ తయారీకి సరైన వ్యవధి..కచ్చితంగా చెప్పాలంటే టీ తయారీకి జస్ట్ ఐదు నిమిషాలు చాలు. ఎక్కువసేపు కాయడం వల్ల టీలోని గుణాలు ఆక్సీకరణం చెందుతాయి. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. ఉత్తమ పద్ధతి..టీ అనంగానే పాలు పంచదారు, టీ పొడి వేసి మరిగించడం కాదంటున్నారు నిపుణులు. సరైన మార్గం ఏంటంటే..?. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసుకుని, అందులో ఒక టీస్పూన్ టీ పొడి లేదా ఆకులను వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి. దానిలో కొద్దిగా వేడి చేసిన పాలు, చక్కెర వేసి..కప్పు టీని చక్కగా ఆస్వాదించండి. ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కూడా. (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
-
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. -
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.గర్భిణీ స్త్రీలకుశరీరానికి విటమిన్ సి, ఫైబర్ , జింక్, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి.విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు బాగా పనిచేస్తుంది. శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సహాయ పడతాయి.మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.మొలకల్లో విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలుతక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది. ఒక్కోసారి, జ్వరం అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది. మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.నోట్: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే!
గురక సమస్యను చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారుగానీ, నిజానికి ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. గురకపెట్టేవారికి దాని ఇబ్బందులు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పక్కనున్న వారికి అదో పెద్ద సమస్య. అసలు అంతపెద్దగా గురక పెడుతున్నామనేది కూడావారికి తెలియదు. వినేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది గురక శబ్దం ఎంత బిగ్గరగా ఉందో. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక ఇచ్చే వార్నింగ్ బెల్స్ ఏంటి? తెలుసుకుందాం. నోటితోగాలి పీల్చుకోవడం, శ్వాసలో ఇబ్బంది ద్వారా నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్ధం.కొంత మందికి ఈ శబ్దం చిన్నగా గురక వస్తే మరి కొంత మందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువగాఅలసిపోయినపుడు, అలర్జీలు, మద్యం సేవించడం, స్థూలకాయం ఉన్నవాళ్లకి గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే ఈ గురక రోజూ వస్తోంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. దీర్ఘకాలిక గురక స్లీప్ అప్నియా కు దారి తీస్తుంది. ఈ స్లీప్ అప్నియా రెండు రకాలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): గొంతు కండరాలు రిలాక్స్ అవుతూ ఊపిరితిత్తులలోకి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది పెద్ద వయసువారిలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో చాలా కామన్. అలాగే టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ సమస్య ఉన్న పిల్లలోలనూ , ఊబకాయం, మద్యం, ధూమపానం అలవాటు, మత్తుమందులు లేదా ట్రాంక్విలైజర్లనువాడేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు ,టైప్ 2 మధుమేహం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల రుగ్మతలు, ముందస్తు స్ట్రోక్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA), ఇది శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు సంభవిస్తుంది. పెద్ద,మధ్య వయస్కులు , వృద్ధులకు సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సెంట్రల్ స్లీప్ అప్నియా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె లోపాలు. రక్తప్రసరణ గుండె ఆగిపోయేప్రమాదాన్ని పెంచుతుంది.నార్కోటిక్ నొప్పి మందులను, ఓపియాయిడ్ ముఖ్యంగా మెథడోన్ వంటి దీర్ఘం కాలం తీసుకుంటే సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి. గురక సమస్యలు: సాధారణంగా గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతీరును కూడా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. గురకతో మధ్యలో లేవడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతోపగటి పూట బద్ధకంగా, నిస్తేజంగా ఉండటమే కాదు, నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. నోట్. ఇది అవగాహనకు సంబంధించిన సమాచారం మాత్రమే. గురక సమస్యగా ఎక్కువగా బాధిస్తోంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊబకాయులైతే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ యోగా ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. -
తొందరపడి లిప్ లాక్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా చేస్తుంటాం. అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లిప్ టూ లిప్ ముద్దుల వల్ల లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి. ♦ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి. ♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా చాలా తొందరగా వ్యాప్తిస్తాయి. ♦ స్వీడిష్ సర్వే ప్రకారం, అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి. ♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. ♦ న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా సంభవించవచ్చు. -
మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
బాధంతా నీ ఒక్కదానిదే కాదమ్మా..నేనూ నీతోనే : కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కేన్సర్ పేషెంట్ల చికిత్స చాలా క్లిష్టం. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఎత్తు అయితే, కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్‌ను భరించడం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే మామూలు వారు ఈ ఆలోచన భరించడమే కష్టం. కానీ కేన్సర్ సోకిన వారు కచ్చితంగా ఫేస్ చేయాలి. అనేక శారీరక బాధలను భరించాలి. ధైర్యంగా నిలడాల్సిందే. ముఖ్యంగా ఎంత పెద్ద జుట్టు అయినా, కుచ్చులుగా కుచ్చులుగా ఊడిపోతోంది. బోడిగుండు అయిపోతుంది. వీటి అన్నింటినీ తట్టుకోని బైటపడాలంటే చాలా మానసిక స్థయిర్యం కావాలి. ఈ మొత్తం ప్రక్రియలో చికిత్సం అందించే వైద్యులు, నర్సులుతో, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందించే సపోర్ట్ చాలా కీలకం. దీనికి సంబంధించిన ఒకటి ట్విటర్లో ఒకటి నెటిజన్ల కంట తడి పెట్టిస్తోంది. (సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!) ముఖ్యంగా కీమోథెరపీ తరువాత జుట్టు ఊడిపోతున్న క్రమంలో చాలామంది రోగులు ముందుగానే తమ హెడ్ షేవ్ చేసుకుంటా ఉంటారు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడి తల్లి తన జుట్టును మొత్తం తీసివేయించుకనేందుకు పార్లర్‌కు వెళ్లింది. అంతా సిద్దమైన తరువాత ఆమె కుమార్తె వచ్చి అనూహ్యంగా హెయిర్‌కటింగ్ టూల్‌ను తీసుకొని తన జుట్టును కట్ చేసుకుటుంది. దీన్ని గమనించిన తల్లి కన్నీంటి పర్యంతమవుతుంది. ‘‘నేను నీతోనే.. అమ్మా... నువ్వు ఒంటరివి కాదు’’ అన్నట్టు తల్లిని హత్తుకుంటుంది. ట్విటర్లో షేర్ అయిన ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. (అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది) “Mom, you don’t have to go through this alone”🥺❤️ pic.twitter.com/fsdTasZAWt — non aesthetic things (@PicturesFoIder) March 29, 2024 -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్‌లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్‌లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్‌తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
గన్నేరు మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
గన్నేరు మొక్క శాస్త్రీయ నామం నెరియం ఒలియాండర్. దీనిని సాధారణ అలంకార మొక్కగా పెంచుతారు. దీనిలో పలు ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గన్నేరు చెట్టు భారతదేశానికి చెందిన ఒక మధ్య-పరిమాణపు చెట్టు. ఈ చెట్టు తన విస్తృతమైన, రంగురంగుల ఆకులకు ప్రసిద్ధి చెందింది. గన్నేరు ఆకులు సాధారణంగా రెండు రంగుల్లో ఉంటాయి: ఒక వైపు ఆకులు ఆకుపచ్చగా మరొక వైపు ఎరుపు, గులాబీ లేదా ఊదా రంగులో ఉంటాయి. వీటి పూలు ఎక్కువగా తెలుపు, గులాబీ, పసుపు, లేత గులాబీ రంగుల్లో ఉంటాయి. దేవుళ్ళకి ఇష్టమైన పూలా మొక్కగా ప్రసిద్ధి. వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గన్నేరు మొక్క ఎలా ఉంటుందంటే.. గన్నేరు చెట్టు సుమారు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.గన్నేరు ఆకులు పొడవుగా ఉంటాయి 5 నుంచి 10 సెం.మీ వ్యాసం కలిగి ఉంటాయి. గన్నేరు పువ్వులు పెద్దవిగా, తెల్లగా ఉంటాయి 5 రేకులు కలిగి ఉంటాయి. ఇక కాయలు పొడవుగా, సన్నగా ఉంటాయి గోధుమ రంగులో ఉంటాయి. గన్నేరు చెట్టును అలంకార మొక్కగా, ఔషధ మొక్కగా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు.. గన్నేరు ఆకుల రసం జ్వరం, దగ్గు, అజీర్ణం వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. గన్నేరు పువ్వులను రక్తహీనత చికిత్సకు ఉపయోగిస్తారు. గన్నేరు బెరడును క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని గుండె వైఫల్యానికి చికిత్స చేయడంలో ఉపయోగించబడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది: నొప్పిని తగ్గిస్తుంది చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది అయితే దీన్ని వైద్యులు, ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే వినియోగించాలి. లేదంటే ప్రమాదమే!. ఎందువల్ల అంటే..దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్లంగానే మరణించడం జరుగుతుంది. (చదవండి: రక్తంతో జుట్టురాలు సమస్యకు చెక్కు!) -
కూల్ డ్రింక్స్ అతిగా సేవిస్తే.. ఎంత ముప్పో తెలుసా? చివరికి...!
నేటి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి! నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్ ఒక స్టేటస్‌గా సింబల్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి. ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్‌ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి. గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. -
మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!
ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు, ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు. అంతేకాదు ధూమపానం చేయకపోయినా పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల సన్నిహిత కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. లైంగిక సామర్థ్యంపై దెబ్బ ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. తాజాగా డా. శ్రీకాంత్ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్లో పొగబాబులకు అర్థమయ్యేలా ట్విటర్లో షేర్ చేశారు. ఆ వివరాలు... డాక్టర్ గారూ కష్టంగా ఉందండి. ఎంత కష్టం? చాలా? ఏం చేసినా? లేదు సార్, అస్సలు నిలబడట్లేదా? కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు. అయ్యో? మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి. సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా! ఇదిగో సార్ రిపోర్టు. అక్కడికి రక్తం… pic.twitter.com/Sfgd2ss0Ba — Srikanth Miryala (@miryalasrikanth) March 4, 2024 (క్రికెట్లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్ కావడం) -
డీ విటమిన్ డోస్ ఎక్కువైతే.. యమడేంజర్!
మన శరీరానికి విటమిన్-డి ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో అదే డీ విటమిన్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఒక్కోసారి ప్రాణంకూడా పోవచ్చు. యూకేకు చెందిన 89 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం రిటైర్డ్ వ్యాపారవేత్త డేవిడ్ మిచెనర్ హైపర్ కాల్సీమియాతో బాధపడుతున్నారు. దీంతో అతను గత ఏడాది మేలో ఆసుపత్రిలో చేరాడు. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువైనాయని వైద్యులు గుర్తించారు. పది రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తరువాత, స్థానిక వైద్య సంఘం సభ్యులు అప్రమత్తమై ఒక నివేదికను రూపొందించారు. అలాగే విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మిచెనర్ పోస్ట్‌మార్టం నివేదిక అతని విటమిన్ డీ స్థాయిలు 380 వద్ద ఉన్నట్టు తేలింది. దీంతో పెద్దల్లో విటమిన్ డీ-30 వద్ద ఉంటే చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పెద్దలకు 600 అంతర్జాతీయ యూనిట్లు (IUలు) డోసేజ్ చాలని చెప్పారు. మితిమీరిన వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విటమిన్ డీ సప్లిమెంట్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరి చేయాలని నియంత్రణ సంస్థలను కోరుతూ సర్రే అసిస్టెంట్ కరోనర్ నివేదికను విడుదల చేశారు. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట నష్టాలు లేదా దుష్ప్రభావాల గురించి వివరించే ప్యాకేజింగ్‌లో లేదా ప్యాకేజింగ్‌లో ఎటువంటి హెచ్చరిక లేదని కరోనర్ జోనాథన్ స్టీవెన్స్ తన అధికారిక నివేదికలో రాశారు. ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
#LemonWater Side Effects వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది. సమ్మర్ సీజన్లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు, జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది. కానీ నిమ్మ నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? నిజానికి నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు, నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్ ♦ గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్, తలనొప్పి పెరుగుతాయి. ♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే లెమన్ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అతిగా సేవిస్తే పొటాషియం లోపం ఏర్పడుతుంది. ♦ విటమిన్ సీ మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. ♦ఎసిడిటీ వస్తుంది. ♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది ♦ నిమ్మలోని సిట్రస్ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం. దంత సమస్యలు కూడా వస్తాయి -
గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్ప్రుహ బాగా ఎక్కువయ్యంది. అందులో భాగంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన కాఫీ, టీలను దూరంగ ఉంచుతున్నారు. మంచి ఫిట్నెస్ కోసం అని గ్రీన్ టీ, లెమన్ టీ వంటి వాటిని తెగ సేవించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇలా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదేంటీ గ్రీన్‌టీ చెడు కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది కదా! మరీ ఇదేంటి అని సందేహిస్తున్నారా?. ఐతే ఇలా ఎందుకన్నారో సవివరంగా తెలుసుకోండి.! ఎదురయ్యే దుష్పలితాలు.. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుంది రోజూ 6 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దారితీస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అనుసరించే ముందు వీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి రైస్!) -
Rice Water రైస్ వాటర్ మ్యాజిక్ నిజమేనా? లేక జిమ్మిక్కా?
ఆధునిక కాలంలో అందమైన ముఖం, చక్కటి జుట్టు, గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న వీడియోలకు కొదవలేదు. మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..! సోషల్ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే.. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా, మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్ వాటర్‌తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి. అలాగే బియ్యం వాటర్‌తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది. ♦ ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత జుట్టుకు కూడా అప్లయ్ చేసుకొని, తరువాత కెమికల్స్‌లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్ అప్లై చేయాలి. ♦ రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా చర్మం నూతనంగా ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. నిపుణులు ఏమంటున్నారు? జపాన్, చైనా కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్మెంట్గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు. 1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్ చేసుకునేవారట. బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు. ఇవి చర్మానికి హాని కరం హానికరం. రైస్ వాటర్‌లోని స్టార్చ్‌తో జుట్టు పెళుసుబారుతుంది వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్‌లో ఉంటే స్టార్చ్, తేమను పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట. అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. నోట్: ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే, ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి) జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ, చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్ డ్రైయ్యర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా?
శారీరకంగా మానసికంగా మంచి ప్రయోజనకారి ఈ బాదంపప్పులు. డ్రై ఫ్రూట్స్‌లో ది బెస్ట్ ఇవి. వీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు అదుపులో ఉండటమే గాక మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గరిష్ట ప్రయోజనాలు పొందాలనుకుంటే మోతాదుకు మించకుండా తీసుకువాల్సిందే. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అత్యంత పోషకమైన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు ఫేస్ చేయాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల వీటిని రోజుకు ఎన్ని బాదంపప్పులు తీసుకుంటే మంచిది? ఎలా తీసుకోవాలి? తదితర విశేషాలు తీసుకుందాం!. దుకాణాల్లో సులభంగా కొనుగోలు చేయగలిగేవి ఈ బాదంపప్పులు. అదీగాక మార్కెట్లో బాదం పప్పులు బాదం పాలు, నూనె లేదా పౌడర్ రూపంలో లభిస్తున్నాయి కూడా. ఇవి స్థూల పోషకాలతో పాటు అధిక పోషకాల ప్రోఫైల్‌ను కలిగి ఉన్నాయి. దీనిలో రాగి, మాంగనీస్, విటమిన్ బీ2 లేదా రెబోప్లావిన్న్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని, నరాల వాపును తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..అల్పాహారంగా బాధంపప్పు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు క్యాలరీలను ఖర్చే చేసే దాన్నిబట్టి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. క్యాలరీ నియంత్రింత ఆహారంలో భాగంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలన్నింటిని పొందగలరు. ముఖ్యంగా పెద్దలు ప్రతిరోజూ 20 నుంచి 23 బాదంపప్పులు తీసుకుంటే సరిపోతుంది. ప్రతీరోజూ 30 నుంచి 35 గ్రాములు బాదం తినడం వల్ల లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడమే గాక సెంట్రల్ అడిపోసిటీ లేదా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు రోజూకి 84 గ్రాముల బాదంపప్పును తక్కువ కేలరీల ఆహారంలో భాగంగా తీసుకుంటే సమర్థవంతంగా బరువు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల విషయానికి వస్తే..పసిపిల్లలు (1-3 సంవత్సరాలు):రోజూకి 3-4 బాదంపప్పులు తీసుకుంటే మంచిది. పెద్ద పిల్లలైతే (వయసు 9-18 ఏళ్లు) రోజుకు ఎనిమిది నుంచి 10 బాదం పప్పులు తీసుకుంటే మంచిది. వీటిని ఆహారంగా తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిగణలోనికి తీసుకుని వైద్యుల సలహ మేరకు తీసుకుంటేనే మంచిది. అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. దాదాపు 100 గ్రాముల బాదంపప్పు మనకు 50 గ్రాముల కొవ్వును అందిస్తుంది. అందులో గణనీయంగా మోనోశాచురేట్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలా డైలీ తీసుకుంటే మాత్రం కేలరీలు బర్న్ అవ్వక విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వలు ఉండేందుకు దారితీస్తుంది కూడా. అధికంగా తీసుకున్నవారికి మలబద్దకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవ్వుతాయి. బాదంపప్పులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అధిక పీచు పదార్థం కూడా హానికరమే. దీనికి తగ్గటు అధికంగా నీరు తీసుకోకపోతే అజీర్తికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. కొన్ని బాదంపప్పులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అతిసారం, బలహీనత, అస్పష్టమైన దృష్టి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బాదంపప్పులు ఎక్కువ తిన్నవారికి శరీరంలో కాల్షియం ఆక్సలేట్లు ఎక్కువయ్యి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులో ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి అంత ఈజీగా శరీరంలో శోషించబడవు. (చదవండి: సూసైడ్ హెడేక్! నరకాన్ని తలిపించేంత భయానక 'తలనొప్పి'! తట్టుకోవడం ఎవరీ తరం కాదు!) -
మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
మన వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు. అతివలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..? ప్రయోజనాలు ⇒ మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం. ⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ⇒ జుట్టు పెరుగుదలకు మంచిది ⇒ బ్లడ్ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. ⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెంతులు-ఇంతులు మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్‌గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెండి పౌడర్‌ను ఎక్కువగా వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ, మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు. మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట. కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించాలి. మరికొన్ని ⇒ అతిసారం ⇒ అజీర్ణం ⇒ కడుపు ఉబ్బరం ⇒ వికారం ⇒ తలనొప్పి ⇒ తలతిరగడం -
ఈ సమస్యలు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినకూడదట.. ఎందుకో తెలుసా?
కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండటమే మంచిది. ►కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిని పచ్చిగా తింటే పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణక్రియ సమస్యలతో పోరాడక తప్పదు. ► కాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు, అవి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇది కడుపులో వాయువును సృష్టిస్తుంది. అందువల్లనే, కాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య..కాలీఫ్లవర్ వంటి కూరగాయలు గ్రంథుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ► హైపోథైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది. అలెర్జీ ప్రమాదం..కొందరికి కాలీఫ్లవర్ తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ► థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్లు కాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌ను తినడం వల్ల T3,T4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తాయి. ► గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో పిండి పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ► పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉంటే మంచిది. కాలీఫ్లవర్ అతిగా తినడం వల్ల తల్లి పాలు తాగి పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. ► కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువవుతుంది. -
రేపే చివరి చంద్రగ్రహణం.. అస్సలు చేయకూడని పనులు ఇవే
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆదివారం (తెల్లవారుజామున)ఏర్పడనుంది. పంచాంగం ప్రకారం..అక్టోబర్ 29న తెల్లవారు జామున 1:05 గంటలకు ఏర్పడే గ్రహణం 2:22 గంటల వరకూ ఉంటుంది.మొత్తం గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని అర్చకులు చెబుతున్నారు. ఈ గ్రహణం భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. సూతక్ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయవద్దు. ఇది అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు. మరి ఎలాంటి పనులు చేయకూడదు? గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏ పనులు చేయకూడదు? ►చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఆ సమయంలో తింటే ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. ► గ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ► చంద్రగ్రహణం సమయంలో దేవతామూర్తుల విగ్రహాలు, దేవాలయాలు మొదలైన వాటిని తాకడం నిషిద్ధం. ► చంద్రగ్రహణం సూతకాల సమయంలో నిద్రించడం నిషేధం. అయితే, రోగులు, వృద్ధులు, పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఉంది. ► గ్రహణ సమయంలో దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని అంటారు ► గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా నదీస్నానం లేదా ఇంట్లోనే స్నానం చేయాలి. ఏం దానం చేస్తే మంచిది? ► చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు. ► చంద్రగ్రహణం తర్వాత పాలను దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతారని చెబుతారు. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని నమ్మకం. ► అన్నం, బియ్యాన్ని దానం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ► వెండిని దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ► చంద్రగ్రహణం తర్వాత పంచదారని నైవేద్యంగా సమర్పించడం వల్ల సానుకూల ప్రభావం చూపుతుందని, ఇది సంపదను, శ్రేయస్సును కలిగిస్తుందని భావిస్తారు. గర్భిణిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూర్యుడు, చంద్రుడు కదలిక లేదా స్థాన మార్పు ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణం సమయంలో గర్భిణీలు చేయకూడని పనులను జ్యోతిష్య శాస్త్రంలో నొక్కిచెప్పారు. చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని అంటారు. దీనివల్ల పిల్లలు వైకల్యంతో పుడతారని నమ్మకం ఉంది. గ్రహణం గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బలంగా విశ్వసిస్తారు. కత్తి వంటి పదునైన వస్తువులను ప్రెగ్నెంట్ స్త్రీలు ఉపయోగించరాదని చెబుతారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాల్సిందిగా పెద్దలు చెబుతారు. -
స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..
మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది. మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్‌గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ అంటే.. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఎదురయ్యే దుష్పరిణామాలు.. వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది. ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగించొచ్చు నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా) -
జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా?
జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే. పైగా మొన్నటివరకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసెటమాల్ టాబ్లెట్లను విరి విరిగా వాడేస్తున్నారు. అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను అలా విచ్చలవిడిగా వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆ టాబ్లెట్లను అధికంగా వాడటం వల్లే కలిగే దుష్పరిణామాలు గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గకుంటే మళ్లీ మరో టాబ్లెట్ వేసుకోవడం చేయరాదు. అలాగే జ్వరం వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల మధ్య వ్యవధిలో పెద్దలకైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాలు వయస్సు అంత కన్నా లోపు ఉన్న పిల్లలకైతే 15 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ మోతాదును ఇవ్వాలి. ఇవేమి పాటించకుండా వీటిని ఎలా పడితే అలా వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను పొరపాటున కూడా వేసుకోరాదు. కాబట్టి ఇకపై పారాసెటమాల్ టాబ్లెట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి (చదవండి: తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!) -
Egg Side Effects: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?
గుడ్డు ఆరోగ్యానికి మంచిదని డైట్లో కంప్లసరీ ఉండేలా చూసుకుంటారు. దీనిలో ప్రోటీన్ల తోపాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కూడా ఉంటాయన్నది నిజమే. కానీ అలా అని వాటిని ఎక్కువగా తింటే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తింటే అంతే ప్రమాదం అంటున్నారు వైద్యులు. గుడ్డు ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్డు అస్సలు తినకూడదు. తింటే ఒక్కసారిగి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న పేషెంట్లు తింటే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. తినాలనుకుంటే గుడ్డులోని పసుపు భాగాన్ని బయటకు తీసి తినవచ్చు. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే గాక శరీరంలో అదనపు ప్రోటీన్లు, కొవ్వు కూడా పెరుగుతుంది. మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువే. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. అతిగే తింటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు (చదవండి: జీ20లో అదిరిపోయే వంటకాలు ఇవే..ఏకంగా 500కిపైగా..) -
బీపీని పెంచే అవకాశం.. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోండి
బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ►గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తీసుకునేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ► గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ► గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ► గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ► అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ► నిద్రలేమికి కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్టయితే... మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. -
తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..?
తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం! తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు: పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అస్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్ చిన్న ప్రేగు శోషక సామర్థా్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది. తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు! ►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం. ►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు ►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!) -
కీమోథెరపీ ఇక సేఫ్
సాక్షి, హైదరాబాద్: కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడం..వ్యాధికణాలకు మాత్రమే మందు అందించేలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. కేన్సర్ సోకిందంటే మరణం తప్పదనేది ఒకప్పటిమాట. కానీ ఇప్పుడు జీవితాన్ని మరింతగా పొడిగించేందుకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో కీమోథెరపీ కూడా ఒకటి. అయితే ప్రత్యేక రసాయనాలతో అందించే ఈ చికిత్సలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర కణాలు కూడా నాశనమయ్యేవి. రోగనిరోధక శక్తి తగ్గి వెంట్రుకలు రాలిపోవడం, ఒళ్లంతా దద్దుర్లు, నోట్లో పుండ్లు లాంటి దుష్ప్రభావాలు అనేకం ఉండేవి. ఒకవేళ వీటన్నింటిని తట్టుకున్నా, కీమో రసాయనాల నుంచి తప్పించుకున్న కొన్ని కణాలతో మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంతోపాటు, ఇచ్చే మందు నేరుగా కేన్సర్ కణాలకు మాత్రమే చేరేలా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నానో కణాలు తయారు చేసి..పేటెంట్ పొంది.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగపు అధ్యాపకుడు కొండపి ఆనంద్ తన పరిశోధనల ద్వారా నానో కణాలను తయారు చేశారు. అంతేకాకుండా తయారీ పద్ధతిని కూడా ఆవిష్కరించారు. పేటెంట్ హక్కులు కూడా పొందారు. ప్రస్తుతం ఇలా... కేన్సర్ చికిత్సలో భాగంగా కీమో రసాయనా లతో పాటు కణాలకు అవసరమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను కలిపి అందిస్తున్నారు. కానీ దీంతో ఫలితాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సేంద్రియ పదార్థాలకు ఏది కేన్సర్ కణమో, ఏది సాధారణమైందో తెలియదు. అందువల్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే ఈ సేంద్రియ పదార్థాలు ఉపయోగపడతాయి. రెండూ కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే... కీమో రసాయనాలు, సేంద్రియ పదార్థాలు రెండింటినీ కలిపి కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే చాలా లాభాలుంటాయని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ గుర్తించారు. ఈ పని సాధించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. కేన్సర్ కణాలకు చక్కెరలన్నా, ఇనుము అన్నా చాలా ఇష్టమని చాలాకాలంగా తెలుసు. ఈ కారణంగానే ఏమో కేన్సర్ కణాల్లో ఈ రెండు పదార్థాలను ఒడిసిపట్టుకోగల రిసెప్టర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విషయాలను అనుకూలంగా మార్చుకొని కేన్సర్‌పై పట్టు సాధించేందుకు కొండపి ఆనంద్ నేతృత్వంలో డాక్టర్ సొనాలి ఖన్రా, డాక్టర్ ఎస్ఎల్.బాలకృష్ణ, డాక్టర్ జగదీశ్ సేనాపతి, డాక్టర్ చుఖూ ముజ్, డాక్టర్ నేహాతోమర్, అంతం సోనీలతో కూడిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. పాలలోఉండే లాక్టోఫెర్రిన్, రక్తంలోని ప్రొటీన్లతో వీరి పరిశోధనలు సాగాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను, కీమో రసాయనాన్ని నానోస్థాయి అపోట్రాన్స్‌ఫెరిన్ ప్రొటీన్‌లోకి చేర్చడంలో విజయం సాధించారు. నోటితోనూ వేసుకోవచ్చు... కీమోథెరపీకి నరాల్లోకి ఎక్కించే పద్ధతి ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన లాక్టోఫెర్రిన్, అపోట్రాన్స్ఫెరిన్లతో తయారైన నానోస్థాయి కణాలను మాత్రం నేరుగా నోటిద్వారా కూడా అందించవచ్చని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన ప్రొటీన్లన్నీ సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు హాని జరగదని చెప్పారు. ఈ నానోస్థాయి కణాలు కేన్సర్ కణాల్లోని రిసెప్టర్లకు అతుక్కుపోవడం వల్ల అపోట్రాన్స్‌ఫెరిన్ విడిపోయి అందులోని కీమో రసాయనం బయటపడుతుందని, కేన్సర్ కణాన్ని నాశనం చేస్తుందని వివరించారు. సాధారణ కణాల్లో అపోట్రాన్స్‌ఫెరిన్, లాక్టోఫెర్రిన్లు ఉంటాయి కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి 2017లో తాము భారతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ నెల 20వ తేదీన లభించిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని ముందుకొస్తే అతితక్కువ దుష్ప్రభావాలు ఉండే కీమోథెరపీకి నాంది పలకవచ్చని చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ జన్యుచికిత్సలకూ ఉపయోగపడుతుందన్నారు. -
Turmeric: మీకు ఈ సమస్యలు ఉంటే పసుపు అస్సలు వాడొద్దు!
భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పసుపును కూడా మితంగానే వాడాలి. అధ్యయనం ప్రకారం రోజుకు ఒక టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడితే పసుపును వాడొద్దంటున్నారు నిపుణులు. ♦ పసుపు డయాబెటిక్ ఫేషెంట్స్కు అంత మంచిది కాదు అంటారు. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరుగుతుందట. ♦ పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు. ♦ ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. ♦ కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ♦ కొందరు అలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు చాలా మితంగా పసుపును వాడాలి. లేదంటే అలర్జీ సమస్య తీవ్రమవుతుంది. ♦ కొందరికి శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తినడం వల్ల మరింత వేడి పెరుగుతుంది. ♦ అధికంగా పసుపు వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
డ్రై ఫ్రూట్స్ తరచుగా తినే అలవాటుందా? అయితే అంతే సంగతులు!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని వాటిని అతిగా తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపించడమే గాక లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు న్యూట్రీషియన్లు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అతిసారం లేదా అపానవాయువుని పెంచడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం. అలెర్జీ: డ్రై ఫ్రూట్స్ కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దీందో శరీరంపై దురద, ఊపిరాడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలర్జీలు ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినకపోవడమే మంచిదని ఆహార నిపుణలు చెబుతున్నారు. బరువు పెరుగుట: కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకుంటే తొందరగా బరువు పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ మోస్తారుగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కిడ్నీ స్టోన్: జీడిపప్పుడ, బాదంపప్పు, వేరశేనగలో ఆక్సలేట్లు ఉంటాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరగుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు: జీర్ణశక్తి సరిగా లేనివారు ఇవి తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జీడిపప్పులో ఉండే ఫ్యాట్, ఫైబరే దీనికి కారణం. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
213 ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్.. జాబితా ఇదే! తెలిసీతెలియక ప్రాణాల మీదకు
సాక్షి, హైదరాబాద్: కాస్త ఒళ్లు వెచ్చబడితే వెంటనే ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పారాసిటమాల్ మాత్ర వేసుకుంటాం.. గొంతునొప్పి రాగానే మెడికల్ షాపుకెళ్లి అజిత్రోమైసిన్ అడుగుతాం.. ఒళ్లు నొప్పులకు ఐబూప్రోఫిన్ మాత్ర మింగేస్తాం.. ఇలా సాధారణ రోగాలకు మనలో చాలామంది వైద్యుడిని సంప్రదించకుండానే సొంత చికిత్స తీసుకుంటుంటారు. అయితే ఇది ప్రమాదకరమని, ఎలాంటి మందులనైనా డాక్టర్ సలహాతోనే వాడాలని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ సూచించింది. ఇష్టారాజ్యంగా మందులను వేసుకుంటే శరీరంలో తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని తెలిపింది. ముఖ్యంగా 213 ఔషధాల వాడకం వల్ల కొందరిలో ఈ తరహా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చంటూ ఆ జాబితాను విడుదల చేసింది. పరిశోధనల తర్వాత.. వివిధ కంపెనీలు పరిశోధనలు, అనుమతులు పొందాక తయారుచేసి విక్రయించే మందులను రోగులు వాడాక కొందరిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. దీనిపై అందే ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఈ విషయాన్ని ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేస్తాయి. ఆయా సైడ్ ఎఫెక్ట్స్‌పై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ పరిశోధనలు చేసింది. గుర్తించిన అదనపు సైడ్ఎఫెక్ట్స్ సమాచారాన్ని ప్రజలకు, డాక్టర్లకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసింది. ఆ ప్రకారం కంపెనీలకు సమాచారమివ్వాలని కోరింది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకురావాలని కోరింది. 2014 నుంచి 2020 వరకు సైడ్ ఎఫెక్ట్స్ వెలుగుచూసిన 213 రకాల మందుల జాబితాను ఇండియన్ ఫార్మకోఫియా కమిషన్ విడుదల చేసింది. వాటిల్లో కొన్నింటి వివరాలు.. ►పైపరాసిలిన్ కజోబ్యాక్టిమ్ ఇంజెక్షన్: తీవ్రమైన ఇన్ఫెక్షన్ కోసం వాడే యాంటిబయాటిక్ ఇది. దీనివల్ల కొందరిలో శ్వాస సమస్య, ఎముకల బలహీనత, పోటాషియం లోపం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. ►మ్యానిటాల్ ఇంజెక్షన్: తలకు దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చి మెదడులో నీరు చేరినపుడు దీన్ని వాడతారు. దీనివల్ల పొటాషియం లోపం వంటి సైడ్ఎఫెక్ట్స్ రావొచ్చు. ►రేబిస్ వ్యాక్సిన్: దీనివల్ల ఒక్కోసారి శరీరం మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ►ర్యాంటిడిన్: సాధారణంగా ఎసిడిటీకి వాడ తారు. దీనివల్ల కొందరిలో సడన్‌గా గుండె ఆగి పోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్యుడి సలహా మేరకు మరేదైనా మందు వాడాలి. ►సెఫ్ట్రాక్జోమ్: దీన్ని సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు, విరేచనాలకు, చిన్నచిన్న గడ్డలకు కూడా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రి యాక్షన్ రావొచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంత కం కావొచ్చు. కొందరిలో చర్మం ఊడిపోతుంది. ►అజిత్రోమైసిన్: యాంటీబయోటిక్. జలుబుకు ఎక్కువగా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీర మంతా చిన్నచిన్న చీము కురుపులు వస్తాయి. ►బ్రూఫెన్: దీన్ని మధ్యస్థాయి నొప్పులు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. చర్మం లేచిపోతుంది. ►అమాక్సిలిన్ క్లలానిక్ యాసిడ్ ట్యాబ్లెట్: జలుబు వంటి వాటికి వాడే యాంటీబయోటిక్ ఇది. కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. ►సిప్రోఫ్లాక్సిన్: దీన్ని తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లకు, చీముగడ్డల తగ్గుదలకు వాడతారు. కొందరిలో శరీరమంతా రియాక్షన్ వచ్చే అవకాశముంది. ►యామ్‌లో డెఫిన్: బీపీని తగ్గించే మందు ఇది. దీన్ని వాడటం వల్ల కొందరిలో వెంట్రుకలు ఊడిపోతాయి. చిగుళ్లు పెరుగుతాయి. ►సెఫిక్జిమ్: యాంటీబయోటిక్. తేలికపాటి గొంతు, శ్వాసకోశ సమస్యలు, ఉదర ఇన్ఫెక్షన్లకు వా డతారు. కొందరికి నోట్లో అల్సర్లు ఏర్పడతాయి. ►ఓఫ్లాక్సిన్: విరేచనాలు తగ్గేందుకు వాడతారు. కొందరిలో శరీరమంతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరిలో ప్రాణాంతకమైన రియాక్షన్లు రావొచ్చు. ►ట్రెమడాల్: నొప్పి తగ్గేందుకు వాడే మాత్ర. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి మూత్రం ఆగిపోవచ్చు. ►గ్లిబెంక్లమైడ్: షుగర్ తగ్గించేందుకు వాడతారు. దీన్ని వల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►ప్యాంటొప్రజోల్: దీన్ని ఎసిడిటీకి వాడతారు. దీన్ని వాడటం వల్ల కొందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ►జింక్: బలానికి వాడే ఈ టాబ్లెట్ వల్ల కొందరిలో విరేచనాలు రావొచ్చు. ►పారాసిటమాల్: జ్వరానికి వాడతారు. దీనివల్ల కొందరిలో చర్మంపై చిన్నచిన్న కురుపులు వస్తాయి. ►లోసార్టాన్: బీపీని తగ్గించే ఈ మందు వాడకం వల్ల కొందరిలో కండరాలు పట్టుకుంటాయి. అతిగా పనిచేస్తే ఎలా నొప్పులు వస్తాయో దీనివల్ల అలాగే జరుగుతుంది. ►రెమిడిసివీర్: కరోనా, ఎబోలా వైరస్ కట్టడికి వాడతారు. దీనివల్ల కొందరిలో గుండె వేగం తగ్గుతుంది. ►ఎటినెలాల్: బీపీ తగ్గించే మందు. దీన్ని వాడటం వల్ల కొందరిలో చర్మానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ►యాంబ్రాక్సాల్: దగ్గు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో కన్నీళ్లు వస్తాయి. ►డెకడ్రాన్: ఆస్తమాలో, ఇన్ఫెక్షన్లకు వాడతారు. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ►అమాక్సిలిన్: తేలికపాటి యాంటీబయోటిక్ ఇది. దీనివల్ల కొందరిలో కళ్లమంటలాంటిది వస్తుంది. ►ఎమిట్రిప్లిన్: తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌కు వాడతారు. దీర్ఘకాలిక నొప్పులకు ఉపయోగిస్తారు. దీనివల్ల కొందరిలో చిగుళ్ల రంగు మారుతుంది. ►సెఫ్ట్రాజోమ్: ఆసుపత్రుల్లో చేరినవారికి సర్జరీకి ముందు వాడే యాంటీబయోటిక్. దీనివల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►టెల్మాసార్టాన్: బీపీకి వాడతారు. దీంతో కొందరిలో చర్మ సంబంధ రియాక్షన్లు వస్తాయి. కొందరిలో ముఖం నల్లబడుతుంది. ►అటర్వస్టాటిన్: దీన్ని చెడు కొవ్వు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో విటమిన్–డి కొరత ఏర్పడుతుంది. -
యూఎస్‌ను వణికిస్తున్న జాంబీ డ్రగ్.. ఒళ్లంతా పుండ్లు, అవయవాల తొలగింపు
జైలజీన్. ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ‘జాంబీ’ డ్రగ్. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడక్కడ పెను విలయానికి దారి తీస్తోంది. దీన్ని ఫెంటానిల్ అనే డ్రగ్‌తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్సీతో కూడిన ప్రాణాంతకమైన మత్తుమందుగా మారుతోంది. కారుచౌకగా తయారవుతుండటంతో డ్రగ్ డీలర్లు కొన్నేళ్లుగా దీన్నే విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ట్రాంక్, ట్రాంక్ డోప్, జాంబీ డ్రగ్‌గా పిలిచే ఈ డ్రగ్ ప్రస్తుతం యూఎస్ వీధుల్లో పొంగి పొర్లుతోంది. ఎక్కడ చూసినా డ్రగ్ బానిసలు ట్రాంక్ మత్తులో జోగుతూ కన్పిస్తున్నారు. శరీరంపై దీని దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒంటిపై పుండ్లు పడటం, చర్మం ఊడిపోవడంతో మొదలై చూస్తుండగానే ఒంట్లో శక్తులన్నీ ఉడిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అడుగు తీసి అడుగేయడమూ కష్టమై బాధితులు నడిచే శవాల్లా మారి అచ్చం జాంబీలను తలపిస్తున్నారు! ఈ ధోరణి కొంతకాలంగా మరీ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కేంద్ర స్థానం ఫిలడెల్పియా ఈ జాంబీ డ్రగ్ ఉత్పాతానికి ఫిలడెల్పియా కేంద్ర స్థానంగా తేలింది. మామూలుగానే ఈ నగరం డ్రగ్స్ డీలర్లకు, బానిసలకు అడ్డా. దాంతో సహజంగానే జాంబీ డ్రగ్ వాడకం కూడా ఇక్కడ విచ్చలవిడిగా పెరిగింది. ఏ వీధిలో చూసినా దీని ప్రభావంతో ఎటూ కదల్లేక ఎక్కడపడితే అక్కడ పడిపోయిన డ్రగ్ బానిసలే కన్పిస్తున్నారు. జాంబీ డ్రగ్ బెడద చూస్తుండగానే అమెరికా అంతటికీ పాకుతోంది. తూర్పున న్యూయార్క్, మసాచుసెట్స్, మైన్, పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, దక్షిణాన టెక్సాస్, లూసియానా, అలబామా... ఇలా 36కు పైగా రాష్ట్రాల్లో వేలాది జాంబీ కేసులు వెలుగు చూడటం అధికారులను ఆందోళన పరుస్తోంది. సమస్య తీవ్రత బయటికి కన్పిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఫిలడెల్ఫియాలోనే ఏకంగా 90 శాతానికి పైగా డోప్ టెస్ట్ శాంపిళ్లలో జైలజీన్ జాడలు కన్పించాయి. న్యూయార్క్ నగరంలో 25 శాతానికి పైగా శాంపిళ్లలో జైలజీన్ బయటపడింది. సులువుగా దొరికేస్తోంది జైలజీన్ అమెరికాలో అతి సులువుగా దొరుకుతోంది. కేవలం పశువుల డాక్టర్ చీటీ చాలు. పైగా కారుచౌక కూడా. దీంతోపాటు దీని సరఫరాపై పెద్దగా నియంత్రణ కూడా లేదు. ఇది డ్రగ్ మాఫియాకు మరింతగా కలిసొచ్చింది . కరోనా సమయంలో ఫెంటానిల్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ క్రమంలోనే ట్రాంక్ వాడకం పెచ్చరిల్లింది! మితిమీరిన డ్రగ్స్ వాడకం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అమెరికాలో బాగా పెరుగుతోంది. 2021లో లక్ష మందికి పైగా డ్రగ్స్‌కు బలయ్యారు! వీటిలో 70 వేలకు పైగా కేసుల్లో ఫెంటానిల్ వాడినట్టు తేలింది. వాటిలో చాలావరకు ట్రాంక్ కేసులేనని అనుమానిస్తున్నారు. జాంబీ డ్రగ్ వాడితే... ♦ జైలజీన్ చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుంది. ♦ కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ♦ రక్తనాళాలు పాడవుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ♦ దాంతో చర్మం ఊడటంతో పాటు ఒళ్లంతా పుండ్లు పుడతాయి. ♦ పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కుళ్లిపోతున్నాయి.వాటిని తీసేయాల్సి వస్తోంది. ♦ మతిమరుపు వంటి మరెన్నో భయానక సైడ్ ఎఫెక్టులూ తలెత్తుతాయి. ♦ గుండె, ఊపిరితిత్తుల పనితీరు, కంటిచూపు మందగిస్తాయి. ♦ శ్వాస అందదు. బీపీ పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. ‘‘జాంబీ డ్రగ్ తమకు మరింతగా లాభాల పంట పండించగలదని ఫిలడెల్పియా డ్రగ్ డీలర్లు తొలుత కనిపెట్టారు. ఇప్పుడిది అమెరికాను దాటి కెనడా దాకా విస్తరించింది’’ – నబురన్ దాస్‌గుప్తా, ఎపిడెమాలజిస్ట్, సీనియర్ సైంటిస్ట్, నార్త్ కరోలినా వర్సిటీ చికిత్స లేదు ఫిలడెల్పియా తదితర చోట్ల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, క్లినిక్‌లకు జాంబీ డ్రగ్ బాధితులు బారులు తీరుతున్నారు. చాలామందికి కాళ్లు, చేతులు తీసేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తమ వద్దకు వస్తున్న వారికంటే రకరకాల కారణాలతో ముఖం చాటేస్తున్న వారే చాలా ఎక్కువగా ఉంటారని వారంటున్నారు. అయితే జైలజీన్ ఓవర్ డోస్ తాలూకు దుష్ప్రభావాలను తగ్గించేందుకు చికిత్స ఏదీ ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఫెంటానిల్‌తో పాటు ఇతర డ్రగ్స్ తాలూకు లక్షణాలను నెమ్మదింపజేయడానికి వాడే నాలోగ్జోన్ వంటివాటినే ప్రస్తుతానికి వీరికీ వాడుతున్నారు. కాకపోతే జైలజీన్ వాడకంతో తలెత్తున్న శ్వాస, బీపీ సమస్యలకు ఇది పని చేయడం లేదు. జైలజీన్ వాడకం తాలూకు సైడ్ ఎఫెక్టుల గురించి హెచ్చరిస్తూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) గత నవంబర్లోనే చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రులు, క్లినిక్‌లకు అలర్ట్ పంపింది. చూడటానికి ఇతర డ్రగ్ ఓవర్ డోస్ కేసుల్లాగే కన్పించడం వల్ల దీన్ని ఆరంభ దశలోనే కనిపెట్టడం కూడా కష్టమే. జైలజీన్ కథా కమామిషు ♦ గుర్రాలు, ఆవులు, గొర్రెలపై వాడేందుకు దీన్ని 1962లో తయారు చేశారు. ♦ అప్పట్లోనే మనుషులపైనా ప్రయోగాలు చేసినా శ్వాస, హృదయ స్పందన, బీపీ తగ్గిపోవడంతో నిలిపేశారు. ♦ 2000 నుంచీ డ్రగ్ బానిసలు దీన్ని హెరాయిన్‌తో కలిపి తీసుకోవడం మొదలైంది. ♦ కొకైన్, ఓపియం వంటివాటితో కలిపినా ఇది ప్రాణాంతకమే. కానీ ఫెంటానిల్ చౌక కావడంతో ఎక్కువగా దాన్నే వాడుతున్నారు. ♦ ఇలా ట్రాంక్గా పిలిచే జైలజీన్–ఫెంటానిల్ మిశ్రమ డ్రగ్ వాడకం 2011లో ప్యూర్టోరికోలో మొదలైంది. ♦ ప్యూర్టోరికో వాసులు ఎక్కువగా ఉండే ఫిలడెల్పియా లోని కెన్సింగ్టన్ తదితర చోట్లకూ పాకింది. ♦ కారుచౌకగా దొరుకుతుండటంతో కరోనా వేళ దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ♦ ఇప్పుడు అమెరికాలో కనీసం 30కి పైగా రాష్ట్రాల్లో విస్తరించి వణుకు పుట్టిస్తోంది. ♦ జైలజీన్ కారుచౌక. పైగా కేవలం పశువుల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఎంత పరిమాణంలో అయినా దొరుకుతుంది. ♦ ఇంజక్షన్‌తో పాటు పొడి రూపంలో కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో డ్రగ్ డీలర్ల పని మరింత తేలికైంది. ♦ హెరాయిన్ డోసు కనీసం 10 డాలర్లు పెట్టనిదే దొరకదు. కానీ ట్రాంక్ మాత్రం మూడు నాలుగు డాలర్లకే దొరికేస్తోంది. ♦ ఇల్లూ వాకిలీ లేక రోడ్లపై కాలం గడుపుతూ ఏళ్ల తరబడి డ్రగ్స్‌కు బానిసలైన అమెరికన్లంతా ట్రాంక్ బాట పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీకు తెలుసా?
మెదడు తనను తాను రిపేర్ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు ♦ నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ♦ దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది. ♦ నిద్రలేమి కారణంగా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ♦ ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. ♦ నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం. ♦ కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. ♦ కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. -
ఈ కాఫ్ సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కొంతమందికి వర్షాకాలం వస్తే చాలు... జలుబు, దగ్గు, కఫం. ఇంకొందరికి చలికాలంలో ఈ బాధలు వస్తాయి. అయితే ఈ కాలం ఆ కాలం అని కాకుండా కొందరు ఎప్పుడూ ఖంగ్ ఖంగ్... హాచ్ ∙హాచ్ ... అని అంటూ ఉంటారు. నానా విధాలైన దగ్గు మందులు, రకరకాలైన టాబ్లెట్లు వాడినా కొద్ది రోజులకే సమస్య షరామామూలే! అయితే, ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్నిపాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ... ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే అంటే వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పుదీనా, తులసి వంటివి సరిపోతాయి. ఇంతకూ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికడు పసుపు వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. స్టవ్ మీదినుంచి దించి గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీలోని కఫం వదులుతుంది. కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులుపాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కా΄ాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. ఈ కషాయాన్ని ఫ్రిజ్‌లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజులపాటు తాగకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు. -
అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏమవుతుందో తెలుసా?
అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠత తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదు మించి వాడకుండా ఉండటం మంచిది. -
కరోనా టీకా వల్ల మరణిస్తే పరిహారం ఇవ్వలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నాక దుష్ప్రభావాల వల్ల మరణిస్తే బాధ్యత వహించబోమని కేంద్రం పేర్కొంది. బాధిత కుటుంబానికి పరిహారమివ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల మరణించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువతుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రజలకు అందజేస్తున్న కరోనా టీకాలను థర్డ్ పార్టీలు (ప్రైవేట్ కంపెనీలు) తయారు చేస్తున్నాయని, అన్ని రకాల పరీక్ష తర్వాత నియంత్రణ సంస్థల ఆమోదంతోనే అవి మార్కెట్లోకి వస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొంది. కరోనా టీకాలు సురక్షితమేనని, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది. -
కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్‌లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్లను నిలిపివేసి, వాటిద్వారా తలెత్తిన దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. 34 దేశాల ప్రతినిధుల మద్దతు కోవిడ్ వ్యాక్సినేషన్‌తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా తయారు చేసి, అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. ప్రజలకు అందించారని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతిని తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను కోరింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని డిమాండ్ చేసింది. -
Health Tips: క్యారెట్లు, బీట్రూట్ తరచుగా తింటున్నారా? డేంజర్!
Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్యారట్లు క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ బీట్రూట్స్ను సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
తరుచూ పెరుగు వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లలో పెరుగు కలిపి వాడడం సర్వసాధారణం. పెరుగు చర్మనిగారింపుని పెంచడంతోపాటు, ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగిస్తుంది. ఈ రెండు కారణాలతోనే ఎక్కువగా ఫేస్ ప్యాక్‌లలో పెరుగుని వాడుతారు. అలాగని తరచూ పెరుగు వాడడం వల్ల చర్మానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మతత్వం ఉన్న వారు పెరుగుని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఎందుకంటే ముఖం మీద ఉన్న రంధ్రాలు పెరుగు వల్ల మరింత తెరుచుకుని మొటిమలు వస్తాయి. వేసవి, వర్షాకాలంలో పెరుగు వాడకం ఎక్కువగా ఉంటే మొటిమల సమస్య తీవ్రం అవుతుంది. పెరుగులో ప్రోటిన్, ల్యాక్టోజ్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్నాయని రాత్రి సమయంలో పెరుగు తింటే చర్మసమస్యలు పెరుగుతాయి. శరీరం మొత్తంలో ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇంతటి సున్నితమైన చర్మంపై పుల్లటి పెరుగు అప్లై చేస్తే మంట, దురద, దద్దుర్లు వస్తాయి. పెరుగుని ముఖానికి రాసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. జిడ్డు చర్మంపై పెరుగు రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు సరిపడవు. ల్యాక్టోజ్ అలెర్జీని కలుగజేస్తుంది. ఇటువంటి వారు ఫేస్‌ప్యాక్‌లలో కూడా పెరుగుని వాడకపోవడమే మంచిది. ఫేస్‌ప్యాక్‌లలో పెరుగు వాడితే మరిన్ని చర్మసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. -
కరోనానంతరం.. తప్పని తిప్పలు.. పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో ముడిపడిన దీర్ఘకాలిక ప్రభావాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వల్ప లక్షణాలతో కరోనా వచ్చినవారిలోనూ కాళ్లలో రక్తం గడ్డకట్టడం–డీప్ వీన్ త్రాంబసిస్ (డీవీటీ), ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబాలిజిమ్), శరీరంలోపల రక్తస్రావాల(బ్లీడింగ్) వంటివి రెండు నుంచి ఆరు నెలల దాకా సంభవించే అవకాశమున్నట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మైల్డ్ లక్షణాలతో, ఆసుపత్రుల్లో చేరని కేసుల్లో కూడా ఈ లక్షణాలు ఉంటున్నాయని స్వీడన్ యుమియా విశ్వవిద్యాలయ పరిశోధనల్లో సైతం వెల్లడైంది. ఇదీ సమస్య... కోవిడ్ కారణంగా రోగుల్లో రక్తం చిక్కబడడం పెరిగింది. వైరస్ తగ్గాక కొన్నిరోజుల దాకా రక్తం గడ్డకట్టడం కొనసాగుతుండంతో ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిపై ఈ ప్రభావం మరింత పెరిగి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి కోలుకునే క్రమంలో, ఆ తర్వాతా.. ఏ సందర్భంలోనైనా వైరస్ కారణంగా గుండె ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం, తదితర అంశాలపై నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డా. ఓరుగంటి సాయి సతీష్, యశోద చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. హరికిషన్ గోనుగుంట్ల తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. రక్తం గడ్డకట్టే లక్షణాలు పెరుగుతున్నాయి పోస్ట్ కోవిడ్ చికిత్సకు వచ్చిన పేషెంట్లలో డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం లక్షణాలు కనిపించాయి. వైరస్ పూర్తిగా తగ్గిపోయినా అది శరీరంలోని అవయవాలపై చూపిన ప్రభావం కొనసాగుతోంది. రక్తనాళాలపై ఎక్కువ కాలం ఇది కొనసాగడం వల్ల రక్తం గడ్డకట్టే లక్షణం ఉంంటోంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ఏ రక్తనాళాల్లోనైనా రక్త గడ్డకట్టొచ్చు. అంతవరకు గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి పోయే ఘటనలు పెరుగుతున్నాయి. గుండె అత్యంత వేగంగా కొట్టుకుని, గుండె నుంచి మెదడుకు రక్తప్రసారం ఆగిపోతే నిముషాల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నా... డయాబెటిస్, బీపీ సమస్యలున్నవారు, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటున్నవారు, కుటుంబంలో గుండెజబ్బులున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు చేయించుకోవాలి. – డా. ఓరుగంటి సాయి సతీశ్, ప్రొఫెసర్ కార్డియాలజీ, హెడ్ యూనిట్ 1, నిమ్స్ పల్మనరీ యాంజియోగ్రామ్‌తో గుర్తించొచ్చు కాలి నొప్పులు, వాపు, పిక్కల్లో నొప్పులు డీవీటీ లక్షణాలు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గినపుడు స్వల్పంగా రక్తం పడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, దగ్గు, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి ‘పల్మనరీ ఎంబాలిజం’ ప్రధాన లక్షణాలు. కరోనా నుంచి కోలుకున్నాక మూడు నెలలు దాటినా సమస్యలు తగ్గని వారు దీని బాధితులుగా భావించాలి. ఊబకాయులు, ఎక్కువకాలం ఆసుపత్రుల్లో ఉండి వచ్చిన వారికి డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం రావడానికి అవకాశం ఎక్కువ. వీటిని గుర్తించడానికి ‘సీటీ పల్మనరీ ఆంజియోగ్రామ్’చేయాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి -
గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడకూడదు... ఎందుకంటే?
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందులను వాడకూడదంటూ డాక్టర్లు ఆంక్షలు పెడతారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. నిజానికి మనం చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతవైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అది గర్భవతుల విషయంలో ఏమాత్రం చేయకూడదు. అది వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెడుతుంది. మామూలు వ్యక్తులు సైతం ఆన్‌కౌంటర్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదనేది వైద్యుల మాట. అందునా గర్భవతులు వాడటం వల్ల వారికి మాత్రమే కాకుండా... అది కడుపులో బిడ్డకు సైతం ఎన్నో రకాలుగా కీడు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... కాబోయే తల్లులు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల సాధారణ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు వాటిని సూచిస్తారు. అవి మాత్రమే... అందునా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. -
మందులు... జుట్టుపై వాటి దుష్ప్రభావాలు!
మనకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాల కోసం రకరకాల మందులు వాడుతుంటాం. వాటిల్లో కొన్నింటి దుష్ప్రభావాల వల్ల కొందరిలో జుట్టు రాలడం మామూలే. జుట్టు రాల్చే మందులు ∙మొటిమలకు వాడేవి, ∙కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు, ∙కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ∙నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు, ∙రక్తాన్ని పలచబార్చేవి ∙యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్ ∙కీమోథెరపీ మందులు. ∙మూర్చ చికిత్సలో వాడే మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ∙వేగంగా మూడ్స్ మారిపోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, ∙నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు, ∙స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు. ఇవి వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి జుట్టును రాలేలా చేస్తాయి. వెంట్రుక దశలు వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి. టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో దాదాపు 100 రోజుల పాటు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ చాలాకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ సమయంలో పీకితే వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది. కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, పెరుగుదల ఏమాత్రం ఉండదు. అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. మనం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి. టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతిలోకి వెళ్తుంది. దాంతో జుట్టు మొలవడం ఆలస్యం అవుతుంది. అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలుతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి. మందుల వల్ల జుట్టు రాలుతుంటే... ∙సాధారణంగా మందులు మానేయగానే జుట్టు మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. ∙ ప్రత్యామ్నాయ మందులు వాడటం. ∙జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ∙కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం. ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందరా... అలాగే ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది. -
కీమోతో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ కదా.. తీసుకోవాలా వద్దా?
మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. దేహంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్ సర్జరీ ద్వారా తొలగించడానికి అంత అనువుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కీమోలో ఇచ్చే రసాయనాల ద్వారా వాటిని నాశనం చేయ?డానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకేమందునే వాడవచ్చు కూడా. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతి లో కీమోలో ఇస్తుంటారు. ఈ రకరకాల మందులన్నీ వాటి ఉమ్మడి ప్రభావంతో క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని తుదముట్టిస్తాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు దానికి లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కీమోథెరపీలో కాంబినేషన్స్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. ఆ రోగిలో ఉన్న క్యాన్సర్ రకాన్ని, అతడి కండిషన్‌ను బట్టి ఏయే మందులు ఎంతెంత మోతాదులో, ఎంతకాలంపాటు ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందుల రూపకల్పన జరిగింది. అందువల్ల ప్రతి మందు వేర్వేరుగా పనిచేస్తుంటుందని గుర్తుంచుకోవాలి. ఇక కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో వల్ల పేషెంట్ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్ఎఫెక్ట్స్ వల్ల ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌లో భాగంగా... వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం) వంటివి కలగవచ్చు. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయితే... ఇటీవల సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీ మందులనూ రూపొందిస్తున్నారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు... డాక్టర్ సూచించినప్పుడు అపోహలు తొలగించుకుని, కీమో తీసుకోవడమే మంచిది. -
కరోనా టీకా: 49 వేల మందిలో సైడ్ ఎఫెక్ట్స్.. మరణించిన వారు ఎందరంటే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా నవంబర్ 30నాటికి 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె మంగళవారం సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వల్ల 49వేల మంది దుష్ప్రభావాలకు గురయ్యారని, మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆ బాధితుల శాతం 0.004శాతమేనని ఆమె చెప్పారు. 49వేల మందిలో 47,691మందికి స్వల్ప లక్షణాలుండగా, 163 మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, 1,965 మంది మధ్యస్థంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. టీకా వేసుకున్న తరువాత మరణించిన వారు 946 (0.00008)వత్రమేనని ఆమె తెలిపారు. అందులో 89 మంది మరణానికి కారణాలను అంచనా వేశామని, అయితే వ్యాక్సినే కారణమని నిర్ధారణ కాలేదన్నారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలముంటాయనే విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు. 94 దేశాలకు 7.23కోట్ల డోసుల ఎగుమతి... వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా 94దేశాలకు 7.23 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం 150 దేశాలకు కోవిడ్ సంబంధిత మందులను కూడా అందించామన్నారు. 1,509 మందికి పరిహారం ఆరోగ్య రంగంలో పనిచేస్త కోవిడ్ కారణంగా 1,509 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.22.12 లక్షల నుంచి రూ.50 లక్షలు అందించినట్టు తెలిపారు. -
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్‌లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్‌తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
Life Style: మీకు తరచూ కాళ్ల వాపు వస్తుందా.. ఐతే ఈ చిక్కులు తప్పవు!!
మనం ధరించే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నీ సరైన కొలతలలో ఉండకపోతే చూడ్డానికి ఎబ్బెట్టుగానే కాదు... అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. దుస్తులు మాత్రం ఇంచుమించు అందరూ సరయిన కొలతల్లోనే ఉండేలా చూసుకుంటారు కానీ, చెప్పుల విషయంలో అంతగా పట్టించుకోరు. నిజానికి దుస్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవరకు మన పాదాలను అంటిపెట్టుకుని ఉండి, జాగ్రత్తగా కాపాడేది పాదరక్షలే కాబట్టి ఎలాంటి పాదరక్షలను, ఎప్పుడు ఎంచుకోవాలి అనే విషయాలపై అవగాహన కోసం... చెప్పుల విషయంలో అలక్ష్యంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. ముఖ్యంగా పాదరక్షలు కొనేటప్పుడు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడమే కాదు, సరైన సైజును ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్, డయాబెటిస్ రోగులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు సరైన పాదరక్షలను ఎంచుకోకపోతే ఇబ్బందులే. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! చిన్నసైజు వద్దు... పాదం పరిమాణం కంటే చిన్నగానూ, బిగుతుగానూ ఉండే చెప్పులు ధరిస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. సరైన చెప్పులు వేసుకోకపోతే పాదాలకు పగుళ్లు, ఇన్ఫెక్షన్లూ తప్పవు. బిగుతైన బూట్లు ధరించడం వల్ల గోళ్ల పెరుగుదల నిలిచిపోవడమే కాక గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. షుగర్ రోగులకు ఇలాంటివి తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. అలాగని పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడమూ ఏమంత మంచిది కాదు. మడమల సమస్యలు ఎదురవుతాయి. వీటిమూలంగా కాళ్లు బెణకడం, నడకలో తేడా రావడం తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుల షాపింగ్‌కి మధ్యాహ్నాలు లేదా సాయంత్రాలే ఉత్తమం గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్ వంటి లైఫ్‌స్టైల్ సంబంధిత రోగులకు సహజంగానే కాళ్ల వాపులుంటాయి. అలాగే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం పాదాల వాపు సర్వసాధారణం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలల్లో కదలికలు నిలిచిపోయి పాదాలలో వాపు వస్తుంది. ఇది ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దవి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పులు కొనడానికి మధ్యాహ్నం లేదా సాయంత్రాలే మంచిది. సరైన సైజ్ చెప్పులు, బూట్లు వేసుకోవడం వల్ల సౌకర్యంగా ఉండటంతోపాటు పాదాలు కూడా పదిలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఒక కాలితో ట్రయల్ వద్దే వద్దు... పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్ వేసి సరిపోయిందని సంతృప్తి పడవద్దు. రెండు కాళ్లకూ వేసుకుని నాలుగడుగులు అటూ ఇటూ నడిచి, అవి సౌకర్యంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా బూట్లు కొనేటప్పుడు సాక్స్ తొడుక్కోకుండా ట్రయల్ చేయడం సరి కాదు. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, తద్ద్వారా ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో అవసరం. ఒక్కోసారి చెప్పుల నుంచి వాటిని తయారు చేసిన మెటీరియల్ మూలాన ఘాటైన వాసనలు వస్తుంటాయి. మంచి నాణ్యత గల చెప్పులు ఈ ఘాటైన వాసనను విడుదల చేయవు, చెప్పుల వాసన ఘాటుగా ఉంటే, మైకం, కళ్లు తిరగడం, కడుపులో తిప్పడం వంటి అసౌకర్యాలు కలుగుతాయి. రంగు కూడా ముఖ్యమే! చెప్పుల రంగు మామూలుగా ఉందో లేదో గమనించండి. సాధారణంగా మంచి నాణ్యత గల చెప్పుల రంగు ముదురుగా ఉండదు. అదే చవక రకం చెప్పుల రంగు చాలా బ్రైట్‌గా ఉంటుంది, ఈ రంగులలో ఎక్కువగా కాడ్మియం, సీసం, ఇతర హెవీ మెటల్ అంశాలు ఉంటాయి, ఇది పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి లేత రంగులే మంచిది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద చెప్పులు వేసుకుంటే బ్యాలన్స్ చేసుకోలేక పడిపోతారని, మెత్తటి చెప్పులయితే నడక సరిగా ఉండదనే అపోహతో బిగుతుగా ఉండే గట్టి చెప్పులు కొంటారు. నిజానికి, బిగుతైన చెప్పులు ధరించిన పిల్లలు పాదాల, కాలి వేళ్ల పెరుగుదలకు ఆటంకం కలిగించినట్లే. స్లిప్పర్ లోపల ఉన్న పొడవు పిల్లల పాదం కంటే కనీసం ఒక సెం.మీ అయినా ఎక్కువుండాలని నిపుణుల సలహా. బరువైన చెప్పులు వద్దు... మీరు కొనాలనుకుంటున్న చెప్పులను ఒకసారి చేతితో పట్టుకుని చూడండి. బరువు తక్కువగా ఉండి, చేతుల్లో భారమైన అనుభూతి లేనట్లయితే, అది కొత్త మెటీరియల్‌తో తయారయిందని చెప్పవచ్చు. బరువుగా అనిపిస్తే వాటిని కొనుగోలు చేయవద్దు. చివరగా ఒక మాట... చెప్పులే కదా అని తేలిగ్గా తీసేయద్దు. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇంకా బోలెడన్ని సంగతులున్నాయి. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! -
Health Tips: బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ..
బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ‘ఇ’, మాగ్నిషియం, మాంగనీస్, కాపర్, పాస్పరస్.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు పుష్టి, బరువు అదుపులో ఉంచడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం.. వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే బాదం పాలల్లో కూడా పోషకాలు తక్కువేం కాదు. ఐతే మితిమీరి తీసుకుంటే అలర్జీల రూపంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. కడుపులో వికారం బాదం అధికంగా తీసుకుంటే వీటిల్లోని మినరల్స్, నూట్రియన్స్ అవసరానికి మించడం వల్ల వాంతికి రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం.. వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన జీర్ణాశయాంతర ప్రతిచర్యలకు దారితీస్తుంది. చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. గింజల అలర్జీ నట్స్ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్జోస్ అలర్జీలున్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉండటమే మేలు. షుగర్ స్థాయిలు ఎక్కువ ఆవుపాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది కూడా అరోగ్యానికి హానికారకమే. థైరాయిడ్‌పై ప్రభావం బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే ఈ విధమైప ఆహారాలు థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణమవుతాయన్నమాట. వీటిని అధికమోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు బాదం పప్పు లేదా బాదం పాలు మితంగా తీసుకుంటే బెటర్! పిల్లలకవసరమైన పోషకాలు అందవు బాదం పాలు పిల్లలకు కూడా అంత మేలు చేసేదేంకాదు. పిల్లలకు అవసరమైన సరైన పోషకాలు కూడా దీనిలో అంతగా ఉండవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మాత్రం వీటిని అస్సలు పిల్లలకు పట్టించకూడదు. కాబట్టి బాదం పాలు తాగే ముందు ఓ సారి ఆలోచించి తాగితే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. చదవండి: World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే.. -
కాఫీ డే: రోజుకి ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
International Coffee Day 2021: మంచి నీటితో పోటీపడుతూ.. మనిషి జీవనంలో టీ, కాఫీలు ఒక భాగంగా మారిపోయాయి. అందుకే వీటి కోసమూ ప్రత్యేకంగా రోజులను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న(ఇవాళ) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. అదే విధంగా అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వర్తకం గురించి చర్చిస్తూనే.. పనిలో పనిగా ‘కాఫీ’ని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా. ఇంతకీ రోజూ ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు.. ఏం ఏం ప్రయోజనాలు ఉంటాయి. అతి వల్ల నష్టమేంటో చూద్దాం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ (హైపర్‌టెన్షన్), ఒంట్లో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం (హైపర్‌లిపిడేమియా) ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ ఏరకానికి చెందింది, ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అది ఫిల్టర్ కాఫీనా? సాధారణ కాఫీనా? అనే అంశం లాంటివన్నమాట. 2015 నుంచి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాఫీ డే నిర్వహిస్తూ వస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్ 1నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 1ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు. కాఫీ సుగుణాలివే... © కాఫీలో బోలెడన్ని మంచి గుణాలున్నాయి. © కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. © కాఫీలోని డైఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. © కాఫీ బాడీని ఉత్తేజితంగా ఉంచుతుంది. © అయితే ఈ బెనిఫిట్స్ కోసం కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. చదవండి: గర్భిణులకు కాఫీ సేఫేనా? కెఫిన్‌తో హెల్త్.. కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్‌జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. © కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే అవసరం లేని మాత్ర వేసుకుంటే కలిగిన సైడ్ ఎఫెక్ట్ కలిగినట్లే. © కాఫీ.. యాంగ్జైటీ మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. © రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాఫీ.. మూడు కప్పులు మహాఅయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే దేహానికీ, ఆరోగ్యానికీ మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని, అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ కాఫీ డే టు కాఫీ లవర్స్. -
టీకా తీసుకున్న 60 మందికి సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ఈ మేరకు నేషనల్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ మే 27వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక అందజేసింది. మొత్తం 60 కేసులకు గాను 55 కేసులకు టీకాతో స్థిరమైన సంబంధమున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోని 36 కేసుల్లో ఆందోళన సంబంధ సమస్యలు, 18 ఉత్పత్తి సంబంధమైనవి, ఒక్కటి మాత్రం ఈ రెండింటికీ చెందినదిగా వర్గీకరించింది. మిగతా, ఒక మరణం సహా 5 కేసులకు టీకాతో సంబంధం ఉన్నట్లు నిరూపణ కాలేదని పేర్కొంది. టీకా అనంతరం సంభవించిన ఈ మరణాన్ని యాదృచ్ఛిక ఘటనగా పేర్కొంది. దేశంలో జనవరి నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి టీకా ఇచ్చారు. -
అనుమతిచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ: సింఘాల్
సాక్షి, నెల్లూరు (కృష్ణపట్నం): కరోనా మహమ్మారికి విరుగుడుగా భావిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుష్ చేపట్టిన ప్రాధమిక విచారణలో తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అయితే ఈ మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనుమతిచ్చాకే ఈ మందు పంపిణీ జరుగుతుందని, అంతవరకు ఎవ్వరూ దీన్ని వాడకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మందుపై అధ్యయనానికి ఐసీఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తాం కృష్టపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ కమిషనర్ రాములు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందుతో సైడ్ఎఫెక్ట్స్ లేవని ప్రాథమిక నిర్థారణలో తేలిందని అన్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని అన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ జరుగుతుందని రాములు స్పష్టం చేశారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపేందుకు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీజీతో సంప్రదింపులు జరిపినట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తెలిపారు. -
మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం
పటమటకు చెందిన వెంకట్‌కు 45 ఏళ్లు.. గత కొన్నేళ్లుగా సుగర్‌తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన తీసుకోకుండా ఎవరో స్నేహితులు మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మి.. వేరే ఎవరికో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడాడు. అందులో స్టెరాయిడ్స్ ఉండటంతో సుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయి పరిస్థితి విషమంగా మారింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వ్యక్తి ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్‌తో చికిత్స పొందాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్గా పనిచేస్తుందని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్ని, మరొకరు పాజిటివ్ రాగానే సొంతంగా వాడేస్తున్నారు. అలాంటి వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, అవసరం మేరకు మాత్రమే వాడాలి. అంతేకానీ ప్రివెంటివ్ పేరుతో మందులు విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు. అపోహలు.. సొంత వైద్యాలు.. మొదటి వేవ్ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, మీజిల్స్–రూబెల్లా వ్యాక్సిన్, ఐవర్‌మెక్టిన్, హెచ్ఐవీ బాధితులకు వాడే లొపినావీర్ 50, రిటోనావీర్ 200 వంటి మందులను వైద్య రంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్ లేదు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు. ఇక ఇటలీలో కరోనా రోగికి పోస్టుమార్టం చేశారని, రక్తనాళాల్లో బ్లాక్స్‌కు ఆస్పిరిన్ వాడితే సరిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోసై్పన్ మందులను వాడేస్తున్నారు. వాటితో పాటు వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటిమిన్ సీ, డీ, జింక్, మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లు ఉన్నారు. ఒకరి ప్రిస్క్రిప్షన్.. మరొకరు.. కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను, తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకుని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మందులు వాడాల్సి ఉంది. అలా కాకుండా మధుమేహం ఉన్న వారు సైతం స్టెరాయిడ్స్ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుండా కొన్ని రకాల మందులతో డ్రగ్ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు. నష్టాలే ఎక్కువ.. యాంటీ వైరల్ డ్రగ్‌ను వైరస్ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్ వంటి యాంటిబయోటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూబుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాక యాంటిబయోటిక్స్ ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, జబ్బు చేసినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.. ఇప్పటి వరకు కరోనాకు ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్యం చేస్తున్నారు. ఆ మార్గదర్శకాల్లో ఫాబి ప్లూ మందులేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కూడా తొలగించడం జరిగింది. కరోనా సోకిన తర్వాత లక్షణాలు ఆధారంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. శరీరంలో పారామీటర్స్ పెరిగినట్లు స్టెరాయిడ్ లాంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆస్పిరిన్, ఎకోస్పైన్ మందులు రక్తం పలచపడటానికి వాడతాం. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఉండటంతో ఎక్కువగా వాడుతున్నారు. అయితే బ్రెయిన్లో గాయాలు ఉన్న వారు. రక్తం గడ్డకట్టే గుణం కోల్పోయిన వ్యాధులు ఉన్న వారు ఈ మందులు వాడకూడదు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమే. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ చదవండి: వ్యాక్సినేషన్లో అందరికీ ఆదర్శంగా ఏపీ పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి -
స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యాకు చెందిన ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌ను మన దేశంలో వినియోగించేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే ఇస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు తోడుగా ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అసలు ఈ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయన్న వివరాలు చూస్తే.. ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ కూడా ఓకే ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే గతేడాది ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్ రష్యాలో రిజిస్టరైంది. మన దేశంలో రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థ ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటెరో, పనాసీ బయోటెక్, గ్లాండ్, స్టెలిస్, విర్కో ఫార్మా కంపెనీలు మన దేశంలో ఏడాదికి 85 కోట్ల ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నాయి. మామూలు జలుబు వైరస్ నుంచి.. మనకు సాధారణంగా జలుబును కలిగించే రెండు రకాల అడెనో వైరస్‌లను తీసుకుని బలహీనపర్చి.. వాటికి కరోనా వైరస్ స్పైక్స్లో ఉండే ప్రొటీన్‌ను జోడించి వ్యాక్సిన్‌ను డెవలప్ చేశారు. సాధారణ అడెనోవైరస్లు కావడంతో శరీరం, రోగ నిరోధక వ్యవస్థ అతిగా రెస్పాండ్ కాకుండా.. తగిన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారించారు. సామర్థ్యం 91.6 శాతం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్ (95.3%), మోడెర్నా (94.1%) ఎఫిషియెన్సీతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. వాటి తర్వాత కోవిడ్ వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నది ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్‌కే. దీని ఎఫిషియెన్సీని 91.6 శాతంగా నిర్ధారించారు. రెండు డోసులు.. మూడు వారాల తేడా.. స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అర మిల్లీలీటర్ డోసు చొప్పున 21 రోజుల తేడాతో రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు కూడా వేసుకున్నాక శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్‌తో 28వ రోజు నుంచి 42వ రోజు మధ్య గరిష్టంగా ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తించారు. ఎక్కువ కాలం సేఫ్టీ స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా రెండు వేర్వేరు స్ట్రెయిన్లతో ఉంటాయి. మొదటి డోసులో ఒక రకం, రెండో డోసులో మరో రకం అడెనోవైరస్‌తో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇస్తారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ రెండు సార్లు క్రియాశీలమవుతుంది. యాంటీ బాడీస్ ఎక్కువ కాలం ఉండి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. పొడి రూపంలో వ్యాక్సిన్ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ పొడి రూపంలో (డ్రై ఫామ్) సాధారణ ఫ్రిజ్‌లలో 2 నుంచి 8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. దానికి డిస్టిల్డ్ వాటర్ కలిపి లిక్విడ్ ఇంజెక్షన్‌గా మార్చితే.. మైనస్ 18 డిగ్రీల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. లేదా రెండు, మూడు గంటల్లోగా లబ్ధిదారులకు వేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు రూ.750! మన దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఏ ధరతో సరఫరా చేస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను 60 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ లెక్కన సగటు ధర రూ.750 (పది డాలర్లు)గా ఉంది. ఇక్కడ చదవండి: కరోనా సెకండ్‌వేవ్; మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
నిద్రమాత్రలు వాడుతున్నారా.. జర జాగ్రత్త!
నిద్రమాత్ర వేసుకోకపోతే ఆ రాత్రికి ఇక నిద్ర లేనట్లే అన్న పరిస్థితిలో చాలామంది తమకు తెలియకుండా నిద్రమాత్రలకు బానిసవుతుంటారు. ఈ మాత్రలు మెదడు, కేంద్ర నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్ఎఫెక్ట్స్ చాలా శక్తిమంతమైనవి. పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, మెదడు పని చేయడానికి సహకరించక బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు అస్పష్టంగా మారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా క్షణక్షణానికీ మారడం (మూడ్ స్వింగ్స్), జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం. నిద్రమాత్రలను వరుసగా రెండువారాలు వాడితే దేహం వాటికి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత డోస్ పెంచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నిద్రమాత్ర వేసుకోకపోతే మానసిక ఆందోళన, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రదశకు చేరితే మూత్రవిసర్జన కష్టం కావడం, ఇతర మూత్ర సంబంధ సమస్యలు, నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలకు దారి తీస్తుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడకాన్ని డాక్టర్లు ఎందుకు సూచిస్తారంటే... అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో తగుమాత్రం డోస్‌ను సూచిస్తారు. వాటి వాడకం ఆ సమస్య నుంచి బయటపడే వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో నిద్రమాత్రలను రాసినట్లు తెలియనివ్వరు. తెలిస్తే ఎవరికి వారు తరచూ వాడి ఇతర సమస్యలు కొనితెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త. -
కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14 రకాలు
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఇవిగాక అరుదుగా మరో ఐదు రకాల సీరి యస్ రియాక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. టీకా తీసుకునే ముందు కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్ధిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, కొన్ని రకాల అల ర్జీలు, రక్తస్రావం సమస్యలు, జ్వరంతో ఉన్నవాళ్లు, బ్లడ్ థిన్నర్లు (రక్తాన్ని పలుచ బరిచే మందులు) వాడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. కోవాగ్జిన్ టీకాను తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. కోవాగ్జిన్ తీసుకోవా లని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి సందేశాలు అందినవారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ఈ మేరకు ఐదు పేజీలతో కోవాగ్జిన్ టీకా ఫ్యాక్ట్‌షీట్‌ను భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకునే ముందు కేంద్రంలో కోవాగ్జిన్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించింది. అనంతరం వేసుకోవాలా? లేదా? అనేది లబ్దిదారుల ఇష్టమేనని స్పష్టం చేసింది. టీకా వేసుకోవడానికి లేదా తిరస్కరించడానికి కూడా లబ్దిదారుడికి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో దాని సామర్థ్యంపై స్పష్టత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించిందని ఫ్యాక్ట్‌షీట్‌లో భారత్ బయోటెక్ తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్ వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని వివరించింది. ఈ నెల 6వ తేదీన మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 25,800 మందికి కోవాగ్జిన్ మొదటి డోస్ ఇచ్చారు. వారికి రెండో ఇంజెక్షన్ ఫిబ్రవరి 4వ తేదీన వేస్తారు. అప్పటి నుంచి 14 రోజులకు అంటే ఫిబ్రవరి 18వ తేదీ నాటికి వారిలో... ఎందరిలో ఏమేరకు యాంటీబాడీలు తయారయ్యాయో నిర్దారణకు వస్తారు. అంటే దాని సామర్థ్యం మరో నెలకు తెలుస్తుందని తెలిపింది. ఈ సమస్యలు రావొచ్చు... కోవాగ్జిన్ టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా 14 రకాల సైడ్ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. వికారం, వాంతులు, దద్దుర్లు, నీరసం, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్ వేసినచోట నొప్పి, వాపు, ఎర్రబారడం, దురద వంటివి ఉంటాయి. అలాగే ఇంజెక్షన్ వేసిన చేయి పైభాగం బిగుతుగా (కండరాలు పట్టేసినట్లుగా) తయారవుతుంది. ఇలా కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇక చాలా అరుదుగా కొందరిలో ఐదు రకాల సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని తెలిపింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ముఖంపైనా, గొంతులో వాపు రావడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, మైకంతో కూడిన నీరసం ఏర్పడటం జరుగుతుంది. వ్యాక్సినేషన్ ముందు డాక్టర్‌కు ఇవి చెప్పాలి... – ఏమైనా రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? దేనికోసం వాడుతున్నారు? ఆయా వివరాలు. – ఏమైనా అలర్జీలు ఉన్నాయా? – జ్వరం ఉందా – రక్తస్రావం వంటి సమస్యలు – బ్లడ్ థిన్నర్ వాడుతున్నారా? – రోగ నిరోధక శక్తికి సంబంధించి సమస్యలున్నాయా? – గర్భంతో ఉన్నారా? – పాలు ఇచ్చే తల్లులా – ఇంతకుముందు ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? మూడు నెలల పర్యవేక్షణ... దాదాపు క్లినికల్ ట్రయల్స్ పద్దతిలోనే ఈ వ్యాక్సిన్‌ను లబ్దిదారులకు వేస్తారు. ఇది అన్నిచోట్ల అందుబాటులో ఉండదు. కాబట్టి నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే వీటిని వేయాలి. రెండు డోసులు వేసుకున్నాక చివరి డోస్ నుంచి మూడు నెలల వరకు టీకాదారుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. వారికి ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ వస్తే ప్రభుత్వ నిర్దేశిత ఆసుపత్రుల్లో చికిత్స ఇస్తారు. టీకా వేసుకున్నవారు అవసరమైతే భారత్ బయోటెక్‌కు చెందిన టోల్‌ఫ్రీ నెంబర్ 18001022245కు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వస్తే ఐసీఎంఆర్ నైతిక విలువల కమిటీ విచారణ అనంతరం వాళ్లకు నష్టపరిహారాన్ని కంపెనీ చెల్లిస్తుంది. వీటన్నింటినీ ఒప్పుకున్నవారు కోవాగ్జిన్ టీకా వేసుకునేముందు అంగీకారపత్రం పైనా సంతకం చేసి ఇవ్వాలి. -
సైడ్ఎఫెక్ట్స్ చికిత్సకు 235 ఆసుపత్రులు రెడీ
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా సమయంలో ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వస్తే తక్షణమే ఆసుపత్రులకు తరలించి... సత్వర వైద్యం అందించనున్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 235 ఆసుపత్రులను వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసింది. అందులో 57 ప్రభుత్వ ఆసుపత్రులు, 178 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రులను అందుకోసం ఎంపిక చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో టీకా వేసుకున్నవారిలో ఎవరికైనా సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ వస్తే వారిని తక్షణమే ఆయా ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 329 పడకలను కరోనా టీకా సైడ్ఎఫెక్ట్స్ కేసుల కోసం కేటాయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 178 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు వెయ్యికి పైగా పడకలను వీటి కోసం ప్రత్యేకించినట్లు సమాచారం. టీకాతో సంబంధం లేకుండా సైడ్ఎఫెక్ట్స్ రావొచ్చు ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం పుణే నుంచి ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్ కరోనా టీకాలు మంగళవారం హైదరాబాద్ స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు చేరుకున్నాయి. వ్యాక్సిన్లను ముందుగా వైద్య సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, అనంతరం 50 ఏళ్లు పైబడినవారు, ఆ లోపు వయస్సున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందజేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. జూన్ వరకు వీరందరికీ వేసేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఆసుపత్రులు, వాటిల్లోని 1,500 కేంద్రాల్లో కరోనా టీకా వేస్తారు. టీకాలు వేసిన అనంతరం రియాక్షన్లు వస్తే వైద్య చికిత్స అందజేస్తారు. సైడ్‌ఎఫెక్ట్స్‌ను సాధారణ, ఒక మోస్తరు తీవ్రమైన, అతి తీవ్రమైనవిగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. టీకా వేసిన తర్వాత ఏదైనా తీవ్ర అనారోగ్య సంబంధమైన సమస్య లేదా సైడ్ఎఫెక్ట్స్ వస్తే వ్యాక్సిన్ వల్లే అనుకోవాల్సిన అవసరంలేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అప్పటికే ఏదైనా జబ్బు ఉండటం వల్ల కూడా రావొచ్చని పేర్కొంది. మార్గదర్శకాల్లోని అంశాలు సాధారణ సైడ్‌ఎఫెక్ట్స్‌లో నొప్పి, ఇంజెక్షన్ వేసిన చోట వాపు, జ్వరం, చిరాకు, అనారోగ్యం మొదలైనవి ఉంటాయి. తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. 102 డిగ్రీల వరకు అధిక జ్వరం రావొచ్చు. అతి తీవ్రమైన వాటిలో అనుకోకుండా ప్రాణం పోయే పరిస్థితి రావడం, మరణించడం జరగవచ్చు. అటువంటి వారిని వేగంగా ఆసుపత్రిలో చేర్పించాలి. పై మూడింటిలో ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వస్తే వెంటనే ఉన్నతస్థాయికి సమాచారం ఇవ్వాలి. కోవిన్ యాప్‌లో నమోదు చేయాలి. చిన్నపాటి దుష్ప్రభావాల నిర్వహణకు టీకా కేంద్రంలోనే మెడికల్ కిట్ ఉంటుంది. వాటి ద్వారా నయం చేయవచ్చు. అందువల్ల టీకా వేసుకున్న తర్వాత అరగంట సేపు టీకా కేంద్రంలోనే వేచిఉండాలి. అతి తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ వస్తే వెంటనే 102 లేదా 108 నంబర్లకు ఫోన్ చేసి పైస్థాయి ఆసుపత్రులకు తరలించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా 420 అంబులెన్స్(108)లను అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఆర్బీఎస్కేకు చెందిన 300 అత్యవసర వాహనాలు ఉంటాయి. ఇవిగాక ప్రభు త్వ, ప్రైవేట్ అంబులెన్సులుంటాయి. అన్ని టీకా కేంద్రాలకు అందుబాటులో అత్యవసర అంబులెన్సులు ఉంటాయి. సైడ్ఎఫెక్ట్స్ వస్తే టీకా కేంద్రంలో ఉన్న సిబ్బందికి అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు నిమ్స్‌లో టెలి మెడిసిన్ పద్ధతి లో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. -
వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం
ఇప్పుడు దేశమంతటా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై చర్చ నడుస్తోంది. మనదేశంలో ఈనెల 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వైద్య సిబ్బందికి తొలుత వేయనున్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అక్కర్లేదని, పూర్తిగా సురక్షితమని కాంటినెంటల్ హాస్పిటల్స్ ప్రమోటర్ అండ్ డైరెక్టర్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి చెబుతున్నారు. దేశమంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఆయన ఇప్పటికే తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఆయన అనుభవాలతో పాటు వ్యాక్సిన్ గురించి కీలకమైన విషయాలు, అపోహలూ, వాస్తవాలను డాక్టర్ రెడ్డి ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు... సాక్షి: మీరు ఏ వ్యాక్సిన్‌ను, ఎక్కడ తీసుకున్నారు? తీసుకున్న తర్వాత మీ అనుభవం ఏమిటి? డాక్టర్ రెడ్డి: నేను అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నాను. అక్కడ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అనుమతించారన్న విషయం తెలిసిందే కదా. గత డిసెంబర్లో నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. మిగతా వ్యాక్సిన్లైతే రెండు డోస్‌ల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉంటుంది. కానీ... ఫైజర్ రెండో డోస్ మూడో వారం తర్వాత తీసుకోవాలి. నా షెడ్యూల్డ్ ప్రకారం మళ్లీ త్వరలోనే వెళ్లి రెండో డోస్ కూడా తీసుకుంటా. ఇప్పుడు మనకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థంగా పనిచేస్తాయి? అది ఏ వ్యాక్సిన్ అయినప్పటికీ రెండు అంశాలు చాలా ప్రధానం. అవి... వాటి సమర్థత (ఎఫికసీ), భద్రత (సేఫ్టీ). ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు దాదాపు 95% ప్రభావవంతం అని వాళ్లు అంటున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎమ్–ఆర్ఎన్ఏ ప్రాతిపదికన అభివృద్ధి చేశారు. ఇక ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనెకా వ్యాక్సిన్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్. ఇక్కడి మన దేశంలోని వ్యాక్సిన్ కరోనా కిల్డ్/ ఇనాక్టివేటెడ్ వైరస్ ప్రక్రియ తయారవుతుంది. ప్రస్తుత వ్యాక్సిన్లు రెండో డోసు తీసుకున్న తర్వాత... దాదాపుగా అన్నీ కూడా 95 శాతం ప్రభావపూర్వకమని ఇప్పటికి చేసిన అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాధిని నివారిస్తూ... వ్యాక్సిన్ మనల్ని కాపాడుతుంది కాబట్టి 16 ఏళ్లకు పైబడిన వారందరూ, వ్యాక్సిన్లపైన అపోహలు వీడి... వాటిని తప్పక తీసుకోవాల్సిందే. పదహారేళ్ల లోపు వారిపై ట్రయల్స్ నిర్వహించనందున ప్రస్తుతం వారికి ఇవ్వడం లేదు. అయితే ఇటీవల ఫైజర్ వాళ్లు 16 ఏళ్ల లోపు వాళ్లపై కూడా ట్రయల్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ అందరికీ మామూలుగానే ఇవ్వవచ్చా? ఒకవేళ హైబీపీ, డయాబెటిస్ లాంటి లైఫ్‌స్టైల్ డిసీజెస్ ఉన్నవారికీ... లేదా ఇతర దీర్ఘవ్యాధులు (క్రానిక్ డిసీజెస్) ఉన్నవారికి ఏమైనా తేడాలుంటాయా? ప్రస్తుతం ఉన్న సిఫార్సుల ప్రకారం... ప్రజలు ఏ వయసు వారైనప్పటికీ లేదా హైబీపీ, డయాబెటిస్ లాంటి ఎలాంటి వ్యాధులున్న వారైనప్పటికీ వారందరికీ మొదటిసారి ఒక డోసు... ఫైజర్ మినహాయించి మిగతావి నాలుగు వారాల తర్వాత మరో డోసు తీసుకోవాలి. (ఫైజర్ ఒక్కదానికే రెండో డోసు తీసుకోడానికి మూడు వారాలు గడువు). ఇక రెండో డోస్ తీసుకున్న తర్వాత ఇంచుమించూ ప్రతి వ్యాక్సిన్ కూడా 90% వరకు రక్షణ కలుగజేస్తుందన్నది వ్యాక్సిన్ తయారీదారుల మాట. పదహారేళ్లు పైబడిన ఏ వయసు వారికైనా లేదా ఎలాంటి వ్యాధులు ఉన్నవారికైనా డోసు మోతాదులో కూడా మార్పులు ఉండవు. అయితే గర్భవతుల విషయంలో మాత్రమే వాళ్ల డాక్టర్ గర్భవతికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనాలు (ఇండివిడ్యువల్ రిస్క్ బెనిఫిట్స్) చర్చించి ఇవ్వవచ్చునని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఇక ఈ మాస్కులూ, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడాలూ... ఈ పనుల నుంచి విముక్తులవుతారా? లేక వాటిని అలాగే కొనసాగించాలా? ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనం మాస్కులు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలు పాటించాల్సిందే. సమాజంలో దాదాపు 80% మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే మాస్క్ తొలగించే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడే కాదు. కోవిడ్ విషయంలో మాత్రమే కాకుండా మరెన్నో వ్యాధులను నివారించే అవకాశం ఉన్నందున... శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలు ఎప్పటికీ పాటించడం మంచిదని ఓ వైద్యుడిగా నా సలహా. మాస్క్ అన్నది ఇప్పటికి ఒకింత ఇబ్బందిగానే ఉన్నప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ తర్వాత క్రమంగా అది తొలగిపోయే పరిస్థితి మునుముందు వస్తుందని ఆశిద్దాం. కరోనా వచ్చి తగ్గిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా? ఇంతకుముందు కోవిడ్–19 వచ్చి తగ్గిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్తో ఏ మేరకు యాంటీబాడీస్ తయారయ్యాయో తెలియదు. అలాగే యాంటీబాడీస్ తయారీకి ఎంతకాలం తీసుకుంటుందో, వాటితో ఏమేరకు రక్షణ కలుగుతుందో తెలియదు. కాబట్టి మునుపు కరోనా వైరస్ సోకిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వాటిని అధిగమించడం ఎలా? నేను వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన చోట కాసేపు నొప్పి తప్ప... నాకెలాంటి సమస్యా రాలేదు. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు కొద్దిగా జ్వరం, కాస్తంత నీరసం తప్ప ప్రస్తుతానికి పెద్దగా దుష్ప్రభావాలేమీ కనిపించలేదు. చాలా అరుదుగా కొంతమందిలో అలెర్జిక్ రియాక్షన్ కనిపించవచ్చు. అలాంటి వారికి అనాఫెలెక్టిక్ షాక్ వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఆ సమస్యను అధిగమించేందుకే వ్యాక్సిన్ ఇచ్చాక దాదాపు 15 నిమిషాల నుంచి అరగంట సేపు అక్కడే వేచి ఉండమంటున్నారు. ఈ అలెర్జిక్ రియాక్షన్, అనాఫెలెక్టిక్ షాక్ కనిపించిన వారికి మాత్రం తక్షణం తప్పక చికిత్స అందించాలి. ఇది కూడా చాలా అరుదుగా కొద్దిమందిలో కనిపించేదే కాబట్టి... సైడ్ఎఫెక్ట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆహార పదార్థాల్లో వేటికైనా దూరంగా ఉండాలా? అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీలేవు. వారు రోజు తినేవే తినవచ్చు. ఇప్పటికే యూకే స్ట్రెయిన్ అనీ, సౌత్ఆఫ్రికా స్ట్రెయిన్ అనీ వచ్చాయి కదా. ఇండియన్ స్ట్రెయిన్ అని ఏదైనా రావచ్చా? అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.... యూకే స్ట్రెయిన్, సౌత్ఆఫ్రికా స్ట్రెయిన్ మాత్రమే కాదు... తాజాగా అమెరికన్ స్ట్రెయిన్ కూడా వచ్చింది. భారత్‌లోనే వైరస్‌లో దాదాపు 6,000 రకాల మార్పులు కనిపించాయి. అయితే ఇవేవీ అంత ప్రభావం చూపేవీ కావు. కాకపోతే మున్ముందు ఇండియన్ స్ట్రెయిన్ లేదా మరో రకం స్ట్రెయిన్ వచ్చే అవకాశాలను కొట్టేయలేం. వైరస్ అనేక మార్పులకు లోనయ్యే ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పటికి మార్పుచెందిన స్ట్రెయిన్‌పై కూడా టీకా పనిచేస్తుందని నిపుణులు, తయారీదారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలకు కరోనా పీడ విరగడ అవుతుందా? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే... మనం ప్రతి ఏడాదీ ఫ్లూ టీకా తీసు కుంటూ ఉంటాం. కానీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ప్రతిసారీ తన స్ట్రెయిన్ మారుస్తూ ఉంటున్నందున ప్రతి ఏడాదీ ఫ్లూ టీకా తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఇప్పటికి మనం తయారుచేసుకున్న ఈ వ్యాక్సిన్లన్నీ అత్యవసరంగా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికే. ప్రస్తుతం రెండు డోసులు తీసుకున్న తర్వాత... మళ్లీ దీన్ని... ఫ్లూ టీకాలాగా ప్రతి ఏడాదీ తీసుకోవాలా, లేక ఒకసారి తీసుకుంటే దాని ప్రభావం ఏ రెండూ, మూడు లేదా ఐదేళ్ల పాటు ఉంటుందా... ఇలాంటి విషయాలేమీ మనకు తెలి యదు. పోనుపోనూ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటే దానికి అనుగుణంగా మనం టీకా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యవసరంగా మానవాళి ప్రాణాలు రక్షించుకోవడం కోసమే ఈ టీకా అని గుర్తించాలి. -
మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్
బీజింగ్: ఇన్ని రోజులు ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూశాయి. అయితే టీకా అందుబాటులోని వచ్చిన ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు నర్స్‌లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అభివృద్ధి చేస్తోన్న సినోఫామ్ వ్యాక్సిన్ గురించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనాకు చెందిన వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ సినోఫామ్ గురించి ఈ వ్యతిరేక ఆరోపణలు చేశారు. ఆ తర్వత గంటల వ్యవధిలోనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. (చదవండి: భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!) డాక్టర్ తావో లినా అనే వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ వీబోలో ‘చైనా అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ సినోఫామ్ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. దీని వల్ల 73 సైడ్ ఎఫెక్ట్లు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి, బీపీ పెరగడం, చూపు కోల్పోవడం, తల నొప్పి, మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతున్నాయి’ అని తెలిపారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన ఈ కామెంట్స్‌ని డిలీట్ చేయడమే కాక క్షమాపణలు చెప్పారు. విచక్షణారహిత వ్యాఖ్యలు చేసి.. నా సహోదరులను అవమానించాను అన్నారు. ఇక తావోని బెదిరించి ఇలా క్షమాపణలు చెప్పించారని ప్రపంచ మీడియా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో బీజింగ్ అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ తావో లినా వ్యాఖ్యలని వీఓఏ వక్రీకరించిందని.. చైనా వ్యాక్సిన్ సురక్షితం అని తెలియజేసింది. తావో లినా సినోఫార్మ్ వ్యాక్సిన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలను పోస్ట్ చేసినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాని వీఓఏ ఈ వ్యాఖ్యలని వక్రీకరించి.. తమ వ్యాక్సిన్ గురించి తప్పుడు ప్రచారం చేసిందని మండిపడింది. ఇక తావో తన వీబో అకౌంట్లో చేసిన వ్యాఖ్యలని డిలీట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ దుమారం సద్దుమణగకముందే చైనా మీడియాలో తావో లినా ‘చైనాలో అభివృద్ధి దశలో ఉన్న ఈ వ్యాక్సిన్లు క్షేమం, సురక్షితం కాదని నేను ఎప్పుడు చెప్పలేదు. మరో విషయం ఏంటంటే చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం గురించి ఇప్పటికే నేను పలు ఆర్టికల్స్ ప్రచురించాను. వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాను’ అన్నారు. ఇక గురువారం వీబోలో చేసిన మరో పోస్ట్‌లో తావో లినా సినోఫామ్ వ్యాక్సిన్ గురించి ఆయన చేసిన ఆరోపణలని స్వయంగా స్వయంగా తనే తిరస్కరించారు. ఇక సినోఫామ్ వ్యాక్సిన్ 79 శాతం సామర్థ్యం కలిగి ఉందని.. చైనా దానికి అనుమతి ఇచ్చింది.(చదవండి: వ్యాక్సిన్ పంపుతున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి!) -
కోవిడ్ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్?
న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించే పలు వ్యాక్సిన్లు ప్రపంచం ముంగిట్లోకి వస్తోన్న నేటి తరుణంలో ‘ఫైజర్’ వ్యాక్సిన్ డోస్ తీసుకోవడం వల్ల ఓ నలుగురిలో పక్షవాత లక్షణాలు వచ్చాయనే వార్తలు ఆందోళన కలిగించక మానవు. నిజంగా వ్యాక్సిన్ల వల్ల ‘రియాక్షన్ లేదా సైడ్ ఎఫెక్ట్స్’ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏ వ్యాక్సిన్ల వల్ల రియాక్షన్ రావచ్చు, ఏ వ్యాక్సిన్ల వల్ల రియాక్షన్ రాకపోవచ్చు? రియాక్షన్ ప్రభావం ప్రాణాంతకంగా ఉంటాయా? సాధారణంగా ఉంటాయా? ఈ విషయంలో రోగ నిరోధక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?... బ్యాక్టీరియా, వైరస్, ఇతర పరాన్న జీవులు మానవుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని శరీరం ‘ఫారిన్ బాడీ’గా గుర్తించి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే మానవుల్లో రోగ నిరోధక శక్తి పెరగుతుందని రోగ నిరోధక శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. అయితే ఆ ఫారిన్ బాడీ వల్ల తలెత్తే ముప్పు ఏమిటో గుర్తిస్తుందని ప్రముఖ రోగ నిరోధక శాస్త్రవేత్త చార్లెస్ జేన్వే 1989లోనే ఓ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఫారిన్ బాడీ ఏ రకానికి చెందినదో, దాని వల్ల కలిగే ముప్పు ఎలాంటిదో కనుగొనేందుకు మానవ శరీరంలోని జీవ కణాల్లో పలు రకాల సెన్సర్లు ఉంటాయని, సార్స్‌కు, కోవిడ్‌కు గల తేడాలను ఆ సెన్సర్లు గుర్తిస్తాయనే విషయం 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రోగ నిరోధక శాస్త్రవేత్తలకు అవగాహనకు వచ్చింది. ఫారిన్ బాడీ దాడి వల్ల శరీరంలోని కణజాలం ఎంత వరకు దెబ్బతిన్నదో ఈ సెన్సర్లు గ్రహించడమే కాకుండా, ఏ స్థాయిలో సదరు ఫారిన్ బాడీని ఎదుర్కోవాలో కూడా గ్రహిస్తాయి. మోతాదుకు మించిన రోగ నిరోధక శక్తిని ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలేమిటో కూడా ఈ సెన్సర్లు అంచనా వేస్తాయి. మానవ శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లను గుర్తించి వాటిని నిర్మూలించేవరకు మానవ శరీర కణాల్లో కొనసాగే ప్రక్రియకు సహజంగానే కొన్ని రోజుల కాలం పడుతుంది. ఈలోగా శరీరంలోని కొంత కణజాలం దెబ్బతినవచ్చు. ఇతర లోపాలు, జబ్బులు ఉన్నట్లయితే ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్ల వచ్చు. ( ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్ గుణపాఠం) అందుకనే మన శరీరంలోకి చొచ్చుకుపోతున్న వైరస్ లేదా బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ జీవుల ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏల నుంచి వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వివిధ స్థాయిల్లో వీటి పనితీరును పరీక్షిస్తారు. సురక్షితమన్న అభిప్రాయం కుదిరాకే వివిధ పద్ధతుల్లో వ్యాక్సిన్ డోస్‌లను మానవ శరీరాల్లోకి పంపిస్తారు. తద్వారా ఫారిన్ బాడీని వెంటనే గుర్తించి మానవ శరీర కణజాలం రోగ నిరోధక శక్తిని (యాంటీ బాడీస్) త్వరిత గతిన అభివృద్ధి చేస్తుంది. అది ఫారిన్ బాడీని నాశనం చేస్తుంది. మనకు హాని కలిగించే వైరస్‌లను బలహీన పరిచి వాటి నుంచే వ్యాక్సిన్లను తయారు చేస్తారు. మానవ శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా, గుడ్ వైరస్‌లను మన రోగ నిరోధక శక్తి చంపకుండా వ్యాక్సిన్ తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకని ఓ వ్యాక్సిన్‌ను తయారు చేయాలంటే ఆ ల్యాబ్‌లోని యావత్ సిబ్బంది అత్యంత సమన్వయంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ఇచ్చిన చోట చర్మం ఎర్రగా కందిపోవచ్చు. గడ్డలాగా చర్మం బిగుసుకుపోవచ్చు. స్వెల్లింగ్ రావచ్చు. విపరీతంగా మంట పుట్టవచ్చు. రోగ నిరోధక సెల్స్‌ను కండరాల్లోకి పంపించడం కోసం వ్యాక్సిన్ చేసిన చోట రక్త నాళాలకు సూక్ష్మ రంద్రాలు పడి నొప్పి పుట్టవచ్చు. ఒళ్లంతా సుస్థుగా ఉండవచ్చు. కొందరికి జ్వరం కూడా రావచ్చు. ఒకటి, రెండు సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయి. అందులో ఒకదాన్ని ‘అనఫాలాక్సీస్’ అంటారు. అది తీవ్ర స్థాయిలో ఎలర్జీ కలిగిస్తుంది. మరోదాన్ని ‘గిలియన్–బర్రీ సిండ్రోమ్’ అంటారు. మంటా, నొప్పి వల్ల నరాలు దెబ్బతినడం. అయితే ఐదు లక్షల వ్యాక్సిన్ డోసుల్లో ఒక డోస్ వల్ల ఏర్పడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ‘మోడర్నా’ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రెండు శాతం మందికి తల నొప్పి, అలసట లాంటి కాస్త తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఎవరికి ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకొని ప్రాణాలు నిలుపుకోవడం మంచిదని రోగ నిరోధక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్నా, తీసుకోక పోయినా వైరస్ల దాడి నుంచి, వ్యాధుల నుంచి శరీరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనషులుగా మనదేనని వారు సూచిస్తున్నారు. -
మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని.. ఇమ్యూనోజెనిక్ అని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామన్నది. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. ‘వలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్ అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ని బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ సానుభూతి వ్యక్తం చేసింది. వలంటీర్ ఆరోపణలపై ఆదివారమే స్పందించిన సీరం.. నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!) టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సదరు వలంటీర్ ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
రష్యా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్ ఇస్తే వారిలో 14 శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ఆరోగ్య మంత్రి మురాషఖో తెలిపారు. 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని హడావుడిగా మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ తెచ్చిన దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. మాస్కోలో సెప్టెంబర్ మొదట్లో తుది దశ ప్రయోగాలు మొదలు పెట్టారు. టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్లోకి విడుదల చేయ డంపై ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు అభ్యంతరాలు హెచ్చరికలు జారీ చేశారు. భా రత్కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. -
రష్యా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానినికి అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా వుండగా రష్యా టీకాను విజయవంతంగా తయారుచేశామని దాని క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ప్రకటించి వాటిని ప్రజలకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం, ఒంటినొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్ తాము ఊహించినవేనని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవి ఒకటి, ఒకటిన్నర రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేయగా వారిలో 14 శాతంమంది స్వల్ప దుష్ఫలితాలు ఉన్నాయని తెలిపారు. ఇక భారతదేశంలో ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: రష్యా వ్యాక్సిన్ వయా డాక్టర్ రెడ్డీస్ -
షాకిచ్చిన ఆస్ట్రాజెనెకా.. క్లినికల్ ట్రయల్స్‌కి బ్రేక్
లండన్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!) అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. -
పాముకాటుకు కొత్త మందు
సాక్షి, హైదరాబాద్: పాముకాటుకు దుష్ప్రభావం లేని విరుగుడు మందు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అలాగే పాముకాటు మందుకు కొరత లేకుండా ఆధునిక పద్ధతిలో ల్యాబొరేటరీల్లో తయారు చేసే విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. ‘నేచర్ జెనెటిక్స్’అనే వెబ్సైట్ తాజా సంచికలో ఈ వివరాలను ప్రచురించింది. ప్రస్తుతం పాముకాటు బాధితులకు వాడుతున్న యాంటీ వీనం సీరం అనే మందు కొన్నిసార్లు పని చేయకపోవడం, అనేక సందర్భాల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. యాంటీ వీనం సీరం వేశాక కొంతమందిలో బీపీ పడిపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం తదితర పలు సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పాము విషాన్ని గుర్రాల్లో ప్రవేశపెట్టి ప్రతిదేహకాలను (యాంటీ బాడీస్) ఉత్పత్తి చేస్తారు. వాటిని శుద్ధి చేసి యాంటీ వీనం సీరం తయారు చేస్తారు. అయితే గుర్రంలోని ప్రతిదేహకాలు, మనుషుల్లోని ప్రతిదేహకాలు ఒకటి కాదు కాబట్టి అనేకసార్లు దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో విరుగుడుగా పనిచేయట్లేవు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా ఆధునిక పద్ధతిలో యాంటీ వీనం తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు నేచర్ జెనటిక్స్ తెలిపింది. దీనివల్ల వంద శాతం సమర్థంగా పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాచు పాములోని జన్యువుల డీకోడ్! తాచుపాముల్లోని విషాన్ని ఉత్పత్తికి కారణమయ్యే 139 రకాల జన్యువులను పరిశోధకులు గుర్తించారు. అందులో 19 రకాలను సంక్లిష్టమైన జన్యువులుగా భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆధునిక పద్ధతిలో తాచు పాములోని జన్యువులను డీకోడ్ చేయడం ద్వారా వీటిని గుర్తించారు. మొదటిసారిగా భారతీయ తాచుపాముల విష సంబంధిత ట్యాక్సిన్ జన్యువుల పూర్తి జాబితా ఇప్పుడు మన వద్ద ఉందని నేచర్ జెనెటిక్స్ వెల్లడించింది. అత్యాధునిక జన్యు సాంకేతిక పరిజ్ఞానాల కలయికను ఉపయోగించి, మన నాగుపాములకు సంబంధించిన జన్యువులను కూడా శాస్త్రవేత్తలు సమీకరించారు. పాము కాటు మరణాలల్లో మూడో వంతు ఈ రకపు విషాలే కారణమని నిర్ధారించారు. వీటిని సింథటిక్ పద్ధతిలో లేబరేటరీల్లో యాంటీ వీనం తయారు చేసి ప్రస్తుత పాము కాటు మందును ఆధునీకరించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. గుర్రాల నుంచి తయారు చేయడం క్లిష్టమైన, శ్రమతో కూడిన వ్యవహారం. పైగా సీరం కొరత ఉండటంతో అనేకమంది పాము కాటుకు బలవుతున్నారు. రాష్ట్రంలో 942 పాము కాటు కేసులు.. రాష్ట్రంలో గతేడాది మొదటి 8 నెలల్లో 942 పాము కాటు కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 300 రకాల సర్పాలున్నాయి. అందులో 66 రకాల పాములు విషపూరితమైనవి. వాటిల్లో 61 రకాల పాముల్లో మనిషిని చంపేంత విషం ఉండదు. ఇక మిగిలినవే మనుషులకు ప్రాణాహాని. తెలంగాణలో 31 రకాల పాములున్నాయి. వాటిల్లో 6 పాములు మాత్రమే విషపూరితమైనవి. తాచు పాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర ఈ నాలుగు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక లంబిడి గాజుల పాము (ఇదో రకం అరుదైన కట్ల పాము, ఇది ఏటూరునాగారం ఏరియాలోనే ఉంటుంది).. ఇంకోటి బ్యాంబూ బిట్ వైఫర్. ఇది అరుదైన రక్త పింజర. వీటిల్లో తాచు పాములే 48 శాతం ఉంటాయి. 33 శాతం జెర్రి గొడ్డు రకం పాములుంటాయి. తాచుపాము, కట్లపాము కరిస్తే నరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రక్తపింజర కరిస్తే రక్తపు వాంతులతో మరణిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారిలో అనేక మంది పాము కా>ట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో యాంటీ వీనం సీరం ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లోనే పాము కాటుకు గురవుతారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రులు తెరిచి ఉండట్లేదు. దీంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఏటా వెయ్యి మంది..: డాక్టర్ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్ క్రిటికల్‌కేర్ శాఖాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ దేశంలో అనధికారికంగా 46 వేల మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో ఆ సంఖ్య వెయ్యి వరకు ఉంటుంది. దేశంలో శాస్త్రవేత్తలు తాచు పాములో అత్యంత కీలకమైన జన్యువులను గుర్తించారు. దీంతో ఆధునిక పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని యాంటీ వీనం కనుగొనే వీలు కలిగింది. – డాక్టర్ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్ క్రిటికల్‌కేర్ శాఖాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా...? ఒకింత జాగ్రత్త!
ఏదైనా కారణాలతో కాస్త నొప్పి అనిపించగా మెడికల్ షాపుకు వెళ్లిపోయి నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్) కొని వేసుకోవడం చాలా ఎక్కువగా జరుగుతోంది. కొందరు తమకు తెలిసిన మందుల పేర్లు చెప్పి అదేపనిగా తీసుకుంటూ ఉంటే... మరికొందరు పెయిన్‌కిల్లర్ ఏదైనా ఇవ్వమని అడుగుతుంటారు. ఇలా డాక్టర్ చీటీ లేకుండానే ఆన్‌కౌంటర్ పెయిన్‌కిల్లర్స్ వాడటం మన సమాజంలో చాలా ఎక్కువే. అయితే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన పురోగతి కారణంగా... ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, స్పాండిలోసిస్, ఇన్ఫెక్షియస్ జబ్బులకు చాలా కొత్తమందులు, గతంలో ఉన్న సైడ్ఎఫెక్ట్ లేని మందులు వస్తున్నాయి. కాబట్టి మునుపెప్పుడో డాక్టర్ రాసి ఇచ్చిన చీటీలోని మందులనే ఇంకా ఇప్పటికీ అదేపనిగా వాడటం సరైనది కాదు. ఎందుకంటే దానికంటే మెరుగైనవీ, సైడ్ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గినవీ అయిన మందులు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి. పైగా ముందుతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న మందులు మరింత త్వరితంగా ఉపశమనం ఇవ్వడంతో పాటు చాలా చవకగా కూడా లభ్యమవుతున్నాయి. అందుకే డాక్టర్‌ను సంప్రదించాకే మందులు వాడాలి. ఇక నొప్పి నివారణ మందుల విషయానికి వస్తే ఇలా డాక్టర్‌ను సంప్రదించాకే వాడటం అన్నది మరింతగా అవసరం. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఉదాహరణకు... నొప్పి నివారణకు మందులు వాడే వారిలో చాలా మందికి వాటి కారణంగా వచ్చే దుష్ప్రభావాలపై అవగాహనే ఉండదు. కొన్ని దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అవి నొప్పి నివారణ మందుల వల్ల అన్న విషయం కూడా వారికి తెలియనే తెలియదు. పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా... జాగ్రత్త: నొప్పి నివారణ మందులను చాలా కొద్ది మోతాదుల్లోనూ, చాలా కొద్ది వ్యవధికోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది. మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి. నొప్పులను తగ్గించే విషయంలో అవి ఒక వరప్రదాయినులే. అయినప్పటికీ వాటిని ఉపయోగించే విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. దుష్పరిణామాలివే... ►నొప్పి నివారణ మందులు కడుపులోకి వెళ్లగానే అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని లోని పొరల వరకు... లోపలివైపు పొరలను (ఇన్నర్ లేయర్స్‌ను) దెబ్బతీస్తాయి. ప్రధాన రక్తనాళాల చివరన ఉండే సన్నటి నాళాలు, మూత్రపిండాల్లోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి. దానికి తోడు కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. మామూలుగానైతే కొన్ని యాంటాసిడ్‌ను తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి. అదేపనిగా అంతకుమించి వాడకూడదు. ►రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునేవారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెఫ్రోపతి అత్యంత ప్రమాదకరం. ముందుగా చెప్పుకున్నట్లుగా రక్తనాళాల చివరన ఉండే సన్నటి రక్తకేశనాళికలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి నివారణ మందుల వల్ల అన్ని అవయవాలకంటే కిడ్నీ దెబ్బతినే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ►కొందరిలో ఈ మందులతో పాటు అధిక రక్తపోటు కూడా అదనపు కారణమై ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలాంటివారిలో గుండె పనితీరుపై మరింత ఒత్తిడి పడి గుండెజబ్బులు కూడా రావచ్చు. ►ఈ మందులు పరిమితికి మించి వాడటం వల్ల కడుపులోని లోపల ఉండే పొరలు దెబ్బతినవచ్చు. ఇలాంటివారిలో కొందరికి మేజర్ సర్జరీ కూడా అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ►కొందరిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడి కోయాగ్యులోపతి వంటి సీరియస్ పరిస్థితికి దారితీయవచ్చు. ఈ మందులు వాడే వారికి కొన్ని సూచనలు నొప్పి నివారణ మందులు తప్పనిసరిగా వాడాల్సిన వారు వాటి దుష్పరిణామాలను తగ్గించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... ►ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు నొప్పి నివారణ మందులను వాడకూడదు. ►అల్సర్ ఉన్నవారు వాడకూడదు. ∙పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ►గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ఉన్నవారు, గుండెజబ్బులతో బాధపడుతున్నవారు, హైబీపీ రోగులు వీటిని వేసుకోకూడదు. ►వీటిని వేసుకున్న తర్వాత నీరు ఎక్కువగా తాగాలి. ఎక్కువగా వాడాల్సి వస్తే కొన్ని రోజులు వ్యవధి అనంతరం మళ్లీ డాక్టర్ సలహా తీసుకుని ఆ మేరకే వాటిని వాడాలి. ►ఇవి వాడే సమయంలో తరచూ మూత్రపిండాలు, బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చివరగా... పెయిన్‌కిల్లర్ వాడాల్సి వచ్చినప్పుడు మీరీ నొప్పి భరించగలరేమో చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే నొప్పులు మరింత తీవ్రంగా ఉంటాయని గుర్తుంచుకోండి. – డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్