టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్‌ అలవాటు చేస్తున్నారా? | Shocking Side Effects of Eating Potato Chips; Check Here | Sakshi
Sakshi News home page

టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్‌ అలవాటు చేస్తున్నారా?

Published Mon, Mar 25 2024 6:07 PM | Last Updated on Mon, Mar 25 2024 6:20 PM

Shocking Side Effects of Eating Potato Chips check here - Sakshi

వేసవి వచ్చిందంటే  పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్‌ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు,  శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి.

ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్‌ తీసుకోవడం వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటో  తెలుసుకుందాం 

♦  చిప్స్‌లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 
ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్‌లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్‌ క్రమంగా దెబ్బతీస్తాయి.
♦ చిప్స్‌లో ఉండే ట్రాన్స్‌ ఫ్యాట్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్‌ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్‌ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
♦ చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్‌లో ఫైబర్‌ కంటెంట్‌ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
♦  చిప్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్‌ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్‌లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు.

నోట్‌:  పిల్లలకు జంక్‌ ఫుడ్‌ ఇచ్చే విషయంలో  పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే.  చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్‌. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్‌తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు,  పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్‌ వంటివి అలవాటు చేయడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement