వీరమాచనేని రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని డైట్ గురు వీరమాచనేని రామకృష్ణ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో సంచలనం జరగడం ఖాయమని చెప్పారు. జీవన విధానం, వైద్య విధానం వేర్వేరు ప్రక్రియలన్నారు. కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని చెప్పారు. దీని కోసం తీసుకునే ట్రీట్‌మెంట్‌తో అనేక సైడ్ ఎఫెక్ట్స్ సంక్రమిస్తాయని తెలిపారు.
పేద, మధ్య తరగతి ప్రజలను డయాబెటిస్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. ఆదివారం మూసాపేట్ సమీపంలో ఉన్న కైతలాపూర్ గ్రౌండ్స్‌లో బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డైట్‌కు, వైద్య పద్ధతులకు సంబంధమే లేదని డైట్ విధానం ద్వారా లబ్ధి పొందిన అట్లూరి సుబ్బారావు, రామరాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment