
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు.
ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్‌నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది.
‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.
చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
వెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్‌కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్‌నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.
చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
Comments
Please login to add a commentAdd a comment