Vidya Balan
-
ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు: విద్యా బాలన్
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆన్లైన్లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.విద్యాబాలన్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్‌ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో
ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్‌లాక్ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్‌లాక్‌కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్ సీన్లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్‌లో ప్రతీక్ గాంధీ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యాబాలన్(Vidya Balan) తో కలిసి లిప్‌లాక్ సన్నివేశం ఉంది. ప్రతీక్ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్... లిప్లాక్స్లోనూ సీనియరే. ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్ గాంధీ ఇటీవల లెహ్రెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్‌లాక్ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు. విద్య తన మొట్టమొదటి ఆన్–స్క్రీన్ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు. శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతీక్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకి బాగా హెల్ప్ చేసిందని చెప్పాడు.‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు. అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది. సీనియర్ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్ కర్ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్ నేచర్‌ను ప్రతీక్ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్ ఫుల్ కో స్టార్ అని పేర్కొన్నాడు.లిప్‌లాక్స్‌తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్ దో ప్యార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అయినప్పటికీ, విద్య ప్రతీక్ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్ దో ప్యార్ ఫెయిల్యూర్ అయినా, విద్యాబాలన్ భూల్ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది. -
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్‌లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్‌తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్‌గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్‌తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్‌తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్‌ప్లే నడిపించాాడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
OTT: ఓటీటీలో భయపెడుతూ నవ్విస్తున్న సినిమా!
సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది. ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ. - ఇంటూరు హరికృష్ణ. -
రోహిత్ శర్మపై నటి పోస్ట్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
బాలీవుడ్ భామ విద్యా బాలన్(vidya Balan) గతేడాది భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ హారర్-కామెడీ చిత్రంలో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నటి విద్యాబాలన్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ నెట్టింట విమర్శలకు దారితీసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్‌లో ఐదో టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) నిర్ణయాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బదులుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మకు మద్దతుగా విద్యాబాలన్ స్పందించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన పీఆర్ టీమ్ సూచనల మేరకే ఇలా రియాక్షన్ ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఫేమ్ కోసమే రోహిత్ శర్మ పేరును వాడుకుందని విద్యా బాలన్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నటి విద్యాబాలన్ టీమ్ స్పందించింది.స్పందించిన విద్యాబాలన్ టీమ్..విద్యాబాలన్ పోస్ట్‌పై పీఆర్ టీమ్ స్పందించింది. తమ సూచనల మేరకు ఆమె అలా చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యా బాలన్ తన ఇష్టపూర్వకంగా అలాంటి పోస్ట్‌ను చేసింది. ఇందులో పీఆర్ టీమ్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. విద్యాబాలన్ మొదటి నుంచి క్రీడాభిమాని కాదు.. కానీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవారిని ఆమె మెచ్చుకుంటుందని పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. టరోహిత్ను ప్రశంసిస్తూ విద్యాబాలన్ చేసిన ట్వీట్‌పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అసలు ఆమె ట్విటర్లో రోహిత్‌ను ఫాలో కావడం లేదని.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్‌లో భాగమేనని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రోహిత్‌ను ప్రశంసిస్తూ వచ్చిన స్క్రీన్ షాట్‌ను విద్యాబాలన్ మొదట షేర్ చేసి వెంటనే దాన్ని తొలగించారన్నారు. ఈ పోస్ట్ కాస్తా పెద్ద చర్చకు దారితీయడంతో దీనిపై విద్యా బాలన్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇది చదవండి: సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్గా మారిన బ్యూటీ)2014లో పద్మశ్రీ అవార్డు..కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సిరీస్ కోల్పోయిన్ భారత్..ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్‌ని ట్రోఫిని టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్ట్‌లో ఓటమి పాలవడంతో 3-1తో సిరీస్‌ను కంగారూలకు అప్పగించింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్‌తో ఆసీస్ తలపడనుంది. (ఇది చదవండి: అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్) Rohit Sharma, what a SUPERSTAR 🤩!! To take a pause & catch your breath requires courage … More power to you … Respect 🙌 !! @ImRo45— vidya balan (@vidya_balan) January 4, 2025 -
సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్గా మారిన బ్యూటీ
2011లో విడుదలైన ఒక సినిమాతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆమె గ్లామర్‌కు చాలామంది ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించేది. దానంతటికీ కారణం ఆమె తీసుకున్న నిర్ణయమే అని చెప్పవచ్చు. సినిమా ప్రారంభం ముందు ఇలాంటి సినిమాలో నటించవద్దని ఆమె సన్నిహితులు చెప్పినా వినకుండా ప్రాజెక్ట్‌పై సంతకం చేసేసింది. కానీ, అందరి అంచనాలకు మించి తన సత్తా ఎంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు పరిచయం చేసింది.సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఆమె సుమారు 12 కిలోల బరువు పెరిగారు. అందుకోసం ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్‌ను ఆమె తీసుకున్నారు. ఆపై ఆ పాత్ర తీరును బట్టి డర్టీ పిక్చర్లో తాను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదని సిగరెట్ తాగడం ఆమె అలవాటు చేసుకున్నారు.కానీ, ఆ సినిమా తర్వాత దానికి ఆమె చాలా అడిక్ట్ అయిపోయారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాల్చేదానినంటూ ఆమె చెప్పింది. ఆ వ్యసనం నుంచి బయట పడేందుకు చాలా కష్టపడినట్లు విద్యాబాలన్ పంచుకుంది. ప్రస్తుతం అయితే తాను పూర్తిగా సిగరెట్లు తాగడం మానేశానని ఆమె చెప్పింది.ది డర్టీ పిక్చర్ సినిమాకు ముందు విద్య చాలా సన్నగా పక్కింటి అమ్మాయిలా కనిపించేది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె 12 కిలోలు బరువు పెరగడం ఆపై స్మోక్ చేయడం వంటివి ఆమెపై చాలా ప్రభావం చూపాయి. సినిమాలో ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడంతో విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఆమె కష్టానికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ ఈ చిత్రంతో అందుకుంది. 2014లో పద్మశ్రీ అవార్డు కూడా విద్యాబాలన్ అందుకుంది. ఆపై కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. -
ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్' సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా 'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి,విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్స్‌లలో చూడని వారు తమ ఇంట్లోనే చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 ఓటీటీ ప్రకటన విషయాలను పలు వీడియోలతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే షేర్ చేసిన విషయం తెలిసిందే.రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. హారర్ కామెడీ జానర్లో 2024లో విడుదులై హిట్ కొట్టిన సినిమాల జాబితాలో భూల్ భూలయ్యా 3 టాప్‌లో ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవని చెప్పవచ్చు. హీరో ఎంట్రీ సాంగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఎంట్రీ సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. సుమారు రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
Year Ender 2024 భయపెట్టి, నవ్వించి ఏడ్పించిన సిల్వర్ క్వీన్స్
ఓటీటీ, థియేటర్ రిలీజెస్... ఈ రెండింటిలోనూ నటీమణులకు సంబంధించి అద్భుతమైన నటనకు చెప్పుకోదగ్గ సంవత్సరంగా 2024 నిలుస్తుంది. వారి నట ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని వైవిధ్యానికి, అద్భుత కథాకథనాలను హైలైట్ చేసిన సంవత్సరంగా కూడా 2024 గురించి చెప్పవచ్చు...టాప్ టెన్‌లో ఒకటి... దో పట్టీగ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు సవాలు విసిరే పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపించింది కృతీసనన్. సంక్లిష్టమైన సంబంధాలు, గృహహింసను ప్రతిబింబించే గ్రిప్పింగ్ డ్రామా ‘దో పట్టీ’లో సౌమ్య, శైలిగా ద్విపాత్రాభినయం చేసింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొనే మహిళగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు ΄పొందింది. పాత్రలలో భావోద్వేగాన్ని పండించడం లో కృతీసనన్ తనదైన నటనను ప్రదర్శించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘దో పట్టీ’ ప్రపంచవ్యాప్తంగా నాన్–ఇంగ్లీష్ సినిమాల టాప్–టెన్ జాబితాలో ఒకటిగా నిలిచింది.నవ్వుతూనే భయపడేలా... భయపడుతూనే నవ్వేలా!చాలా తక్కువ స్క్రీన్ టైమ్‌తో, ఆకట్టుకునే ట్విస్ట్‌లతో ‘స్త్రీ–2’లో మెప్పించింది శ్రద్ధాకపూర్. హాస్యం, హారర్‌ను మేళవించిన ఆమె నటన అదుర్స్ అనిపించింది. ఫ్రెష్ లుక్‌తో, చక్కని టైమింగ్‌తో ఆకట్టుకుంది. ‘సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటిది. ఎంటర్టైనింగ్ డైలాగులు ఉన్న‘స్త్రీ–2’లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు’ అంటుంది శ్రద్ధా కపూర్.అయితే ఆ అద్భుతమైన నటీనటులలో అందరి కంటే శ్రద్ధాకపూర్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ‘స్త్రీ–2’ విజయంతో ఇప్పుడు ‘స్త్రీ–3’కు ఉత్సాహంగా రెడీ అవుతోంది.16 కిలోల బరువు పెరిగింది!ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చమ్కీల జీవితం ఆధారం గా తెరకెక్కిన ‘అమర్ సింగ్ చమ్కీల’ అనే బయోగ్రఫీ డ్రామాలో పరిణీతి చోప్రా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశంలో పాత్ర పట్ల అంకితభావం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రా ఏకంగా 16 కిలోల బరువు పెరిగింది!‘చమ్కీల’ సినిమాలో అమర్ జోత్ కౌర్ పాత్రలో చోప్రాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ షూటింగ్‌కు ముందు... ‘కానీ మీరు ఆమెలా కనిపించడం లేదు’ అన్నాడు. అంతే.. బరువు పెరగడంపై దృష్టి పెట్టింది పరిణీతి చోప్రా. వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉన్న అమ్మాయి కాస్తా పాత్ర కోసం ఎడా పెడా తినేసి బరువు పెరిగింది.పరిణీతి చోప్రా ఉత్తమ నటన గురించి చెప్పుకునే చిత్రాలలో ‘చమ్కీల’ అగ్రస్థానంలో నిలుస్తుంది.వెరీ స్ట్రాంగ్ ఉమెన్సంప్రదాయ మహారాష్ట్ర మహిళగా ‘సర్ఫీర’లో రాధిక మదన్ అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమను పంచే భార్యగా, బలమైన వ్యక్తిత్వం, తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె పాత్ర ఆకట్టుకుంది.విభిన్నమైన పాత్రలు పొషించడం రాధికకు కొత్త కాకపొయినా ‘సర్ఫీర’లో పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంమాణికమైన నటనతో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ‘మరాఠీ భాష, యాసపై రాధికకు ఉన్న పట్టు ఈ సినిమాలో హైలైట్.‘కంటెంట్ డ్రైవెన్ స్క్రిప్ట్‌లు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది’ అని తన గురించి వినిపించే మాటను మరోసారి నిజం అని నిరూపించింది రాధికా మదన్.మాటలు కాదు... మాస్టర్ క్లాస్ఈ హసీన్ దిల్రూబా (2021)కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’లో తాప్సీ పన్ను మరోసారి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. రొమాన్స్, సస్పెన్స్, డ్రామాలను బ్యాలెన్స్ చేయడం లో తన నటనతో మాస్టర్ క్లాస్ అనిపించుకుంది. కుట్రల ఉచ్చులో చిక్కుకుపొయే ‘రాణి కాశ్యప్’ పాత్రను పొషించి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. ఎంతో సంక్లిష్టమైన పాత్రను కూడా అవలీలగా పొషించింది.‘లవ్ అంటే పిచ్చి కాదు’ అంటున్న తాప్సీ ప్రేమ చుట్టూ ఉండే నమ్మకం నుంచి త్యాగం వరకు ఎన్నో అంశాలను ప్రతిఫలించే పాత్రలో నటించి మెప్పించింది.‘రాణి పాత్రను పొషించినందుకు గర్వంగా ఉంది. నా క్యారెక్టర్ ద్వారా ఓపెన్ మైండ్‌తో ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితులతో పొరాడగలమని చెప్పాను’ అంటున్న తాప్సీ పన్ను సీక్వెల్లో లోతైన భావోద్వేగాలను ప్రదర్శించి మొదటి భాగంతో పొల్చితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.భయపడింది... భయపెట్టింది!‘భూల్ భులైయా 3’ ఫ్రాంచైజీతో మంజులికగా మెరిసింది విద్యాబాలన్. మంత్రముగ్ధులను చేసే నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అమీ జే తోమర్’ పాటకు మాధురీ దీక్షిత్ కలిసి చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. ‘భూల్ భులైయా 2’లో నటించడానికి ‘సారీ’ చెప్పింది విద్యాబాలన్. ‘భూల్ భులైయా నాకు బాగా నచ్చిన సినిమా. నేను బాగా నటించగలనా అనే సందేహం, రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం వల్లే నో చెప్పాల్సి వచ్చింది’ అంటుంది విద్య.అయితే ‘భూల్ భులైయా 3’ కోసం మరోసారి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నో చెప్పలేకపొయింది. స్క్రిప్ట్ బాగా నచ్చడమే కారణం. ‘ఈ సినిమాలో నేను నటించాల్సిందే’ అని డిసైడైపొయిన విద్యాబాలన్ తన నటనతో ‘భూల్ భులైయా 3’ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. -
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్‌లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్‌లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్నెస్ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్నెస్తో మెయింటైన్ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటంటే..విద్యాబాలన్ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు. బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్ఫ్లమేషన్ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్ఫ్లమేషన్ డైట్. అయితే ఇదేలా పనిచేస్తుందంటే.. 'ఇన్ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..ఇది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.కూరగాయలు..బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్లో ఉండేలా చూసుకోవాలి.పండ్లు..బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.ఆరోగ్యకరమైన కొవ్వులుఅవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి. మంచి కొవ్వులు ఉండే చేపలుమాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్, ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, నట్స్బాదం, పిస్తా వంటి వాల్నట్ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. (చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్
బాలీవుడ్ భామ విద్యా బాలన్ తాజాగా భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విద్యా బాలన్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి కోలీవుడ్‌లో తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఆ సంఘటనతో దాదాపు ఆరు నెలల పాటు అద్దంలో కూడా తన మొహాన్ని చూసుకోలేదని చెప్పింది. ఓ నిర్మాత తన నటన, డ్యాన్స్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా తనకు చెప్పకుండానే సినిమా నుంచి తొలగించాడని పేర్కొంది.విద్యా బాలన్ మాట్లాడుతూ.. 'నేను ఒక తమిళ చిత్రంలో చేశా. ఆ సినిమాలో రెండు రోజులు షూట్ పూర్తి చేశా. కానీ ఏమైందో తెలియదు.. నా ప్లేస్‌ను మరొకరితో భర్తీ చేశారు. ఈ విషయంపై చెన్నైలో నిర్మాతతో మాట్లాడేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లా. అతను సినిమాలోని కొన్ని క్లిప్‌లను మాకు చూపించి అవమానకరంగా మాట్లాడారు. మీ కూతురు ఏ యాంగిల్లో చూసినా హీరోయిన్గా కనిపిస్తోందా? అంటూ అవమానించాడు. తనకు నటించడం, డ్యాన్స్ చేయడం రాదని మొహంపైనే చెప్పాడని' ఆ చేదు ఘటనను గుర్తు చేసుకుంది.ఆయన మాటలతో చాలా బాధపడ్డానని విద్యాబాలన్ తెలిపింది. దాదాపు ఆరు నెలలు నా మొహం అద్దంలో కూడా చూసుకోలేదని వెల్లడించింది. ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంది. కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ది డర్టీ పిక్చర్ (2011) చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ప్రస్తుతం హారర్-కామెడీ చిత్రం భూల్ భూలయ్యా -3తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. -
వారెవా డ్యాన్స్ : అదరగొట్టిన మాధురి, విద్యా, వైరల్
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, నటనతో అభిమానులను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు కొందరి తారామణులు. వారిలో ఇప్పుడు ముందు వరసలో చేరారు మాధురీ దీక్షిత్. విద్యాబాలన్‌తో కలిసి ఇటీవల ‘అమి జె తోమార్ 3.0’ యుగళగీతానికి నృత్యం చేస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూల్ భులయ్యా3 సినిమాలోని ఈ పాట అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్లో ఇప్పటికే మాధురీ దీక్షిత్‌ను చూసిన నెటిజనులు చెక్కుచెదరని ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంక ‘అమి జె తోమర్ 3.0’ లో 45 ఏళ్ల విద్యాబాలన్‌తో కలిసి 57 ఏళ్ల మాధురి దీక్షిత్ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. 2007లో విడుదలైన భూల్ భులయ్యా సినిమాలోని ఒరిజనల్ ట్రాక్‌కి రీమేక్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కం΄ోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
ఆత్మల కాన్సెప్ట్‌తో వస్తోన్న హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని హారర్ సీన్స్ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న సింగం ఎగైన్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
'భూల్ భులయ్యా 3' నుంచి టీజర్..
కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి నటించిన ‘భూల్ భులయ్యా 3’ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో విడుదలైన భూల్ భులయ్యా ప్రాంఛైజీలో భాగంగా పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నిటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్నారు.భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. హారర్,సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సమ్మేళనానికి ఆమె పాత్ర చాలా కీలకం. ఆత్మలతో సంభాషించగలిగే పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించనున్నారు. దీపావళి సందర్భంగా ‘భూల్ భులయ్యా 3’ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను పంచుకున్నారు. -
ఎంఎస్ సుబ్బులక్ష్మి దిగి వచ్చినట్టున్న విద్యాబాలన్ ఫోటో ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
భారతరత్నానికి విద్యా చిత్ర నీరాజనం
‘‘గాన కోకిల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మాళ్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె కమనీయ కంఠస్వరాన్ని వింటూ పెరిగాను. మా అమ్మ ద్వారా నాకు సుబ్బులక్ష్మి అమ్మ సుప్రభాతం వినడం అలవాటైంది. ఇప్పటికీ నా దినచర్యప్రారంభమయ్యేది ఆ అమ్మ గాంధర్వ గానం వినడంతోనే. ఆమె 108వ జయంతి సందర్భంగా ఆ భారతరత్నానికి నేను సమర్పించగల చిరు కానుక ఇదే’’ అంటూ విద్యాబాలన్ భావోద్వేగపూరితమైనపోస్ట్ పెట్టారు. ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ చీరల గురించి ఆమె ఆపోస్ట్‌లో... ‘‘1960–80ల మధ్య ఎమ్మెస్ అమ్మ ఈ తరహా చీరలు ధరించారు. అప్పట్లో ఈ చీరలకు చాలా ప్రాచుర్యం ఉంది.ఎమ్మెస్ అమ్మ హుందాతనానికి చీరలది సగ భాగం అయితే మిగతా సగం ఆమె నుదుటి పైన కుంకుమ, విభూది, రెండు వైపులా ముక్కు పుడకలు, కొప్పు, కొప్పు చుట్టూ మల్లెపువ్వులకు దక్కుతుంది’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తయారు కావడానికి ఆమె మనవరాలు, ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ సిక్కీ మాలా సహాయం చేశారట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘నేను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్న ఈ ప్రయత్నానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సిక్కీమాలా మేడమ్. అలాగే నా ఈ కల సాకారం కావడానికి కారణమైన అనూపార్థసారథి (కాస్ట్యూమ్ డిజైనర్)కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు. భారతీయ గానకోకిల, భారతరత్న డా. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విలక్షణమైన శైలికి నివాళిగా ఈ చిత్రమాలికను విడుదల చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్గా విద్య చక్కగా ఒదిగి΄ోయారంటూ ఈ ఫొటోషూట్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే... ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా సినిమా రూపొందించడానికి బాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ గాన కోకిలగా ఫలానా తార నటించనున్నారంటూ వచ్చిన వార్తల్లో విద్యాబాలన్ పేరు కూడా ఉంది. తాజా ఫొటోషూట్ చూస్తే ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్ న్యాయం చేయగలరనిపించక మానదు. మరి... వెండితెర సుబ్బులక్ష్మిగా ఎవరు కనిపిస్తారో చూడాలి. -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు వీరే (ఫొటోలు)
-
స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్‌లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్‌తో గ్లామరస్‌గా ఉంది. అంతేగాదు ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్‌గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా
ఒకప్పడు తెలుగులో టాప్ హీరోయిన్గా మెప్పించిన ఇలియానా బాలీవుడ్లో కూడా మెప్పించింది. హ్యాపీ ఎండింగ్, రైడ్ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో 'దో ఔర్ దో ప్యార్'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాలో నోరా పాత్రలో చాలా బోల్డ్‌గా ఇలియానా మెప్పించింది. షిర్షా గుహా ఠాకూర్తా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'దో ఔర్ దో ప్యార్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
ఆ సినిమా తర్వాత సిగరెట్‌కు బానిసయ్యా.. : విద్యాబాలన్
సినిమా వాళ్ల రూటే సెపరేటు.. వారికి పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా, లేకున్నా సరే.. కథ డిమాండ్ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మందు తాగేస్తారు. కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. సినిమా అయిపోయాక మాత్రం వాటిని అంత ఈజీగా వదిలేయలేరు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది హీరోయిన్ విద్యాబాలన్.రోజూ సిగరెట్లు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సిగరెట్ ఎలా తాగుతారో తెలుసు కానీ నేనెన్నడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్లో నేను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు. అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నాను. ఆ సినిమా తర్వాత దానికి ఎంత అడిక్ట్ అయిపోయానంటే రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.ఆ స్మెల్ ఇష్టంధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ప్రస్తుతమైతే సిగరెట్లు తాగడం లేదు. అయితే కాలేజీ చదివే రోజుల్లో బస్ స్టాప్‌లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు నచ్చేది' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల నుంచి కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది.చదవండి: మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందా? -
ఐరన్లెగ్గా ముద్ర.. ఆరునెలలు ముఖం అద్దంలో చూసుకోలేదు!
టీనేజ్‌లో ఏది ప్రేమ? ఏది అట్రాక్షన్ అని తెలుసుకోవడం చాలా కష్టం.. ఎంతోమంది అట్రాక్షన్నే ప్రేమ అనుకుని ముందుకు వెళ్తుంటారు. తీరా కొంతకాలానికే ఆసక్తి తగ్గిపోయి బ్రేకప్ చెప్పుకుంటారు. అలా గతంలో తాను కూడా ప్రేమలో పడి పెద్ద గుణపాఠం నేర్చుకున్నానంటోంది హీరోయిన్ విద్యాబాలన్. 'కాలేజీలో ఉన్నప్పుడు తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించాను. అతడు పెద్ద పోకిరి అని తర్వాత అర్థమైంది. మేము బ్రేకప్ చెప్పుకున్నాక వాలంటైన్స్ డే రోజు అనుకోకుండా నాకు తారసపడ్డాడు. అతడు నన్ను చూసి.. నేను నా మాజీ ప్రియురాలితో డేట్‌కు వెళ్తున్నాను అని చెప్పాడు. తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అది విని షాకయ్యాను. నాకు పిచ్చెక్కినట్లయింది. ఇలాంటివాడినా ప్రేమించాను అనుకుని బాధపడ్డాను. తర్వాత నేను కూడా కొందరిని ప్రేమించాను. కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్‌కు వెళ్లలేదు. తొలిసారి సీరియస్‌గా, గాఢంగా ప్రేమించిన వ్యక్తి సిద్దార్థే.. అతడినే నేను పెళ్లి చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. 'తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాను. ఆ సమయంలో నా హృదయం ఎన్నిసార్లు ముక్కలైందో! ప్రతిరోజూ ఏడుపే నన్ను రిజెక్ట్ చేస్తుంటే తట్టుకోలేకపోయేదాన్ని.. ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ నిద్రపోయేదాన్ని.. ఇక నావల్ల కాదని చేతులెత్తేసేదాన్ని. కానీ తెల్లారి మళ్లీ సినిమా గురించే ఆలోచించేదాన్ని. ఒకసారి మోహన్‌లాల్‌తో నేను చేస్తున్న సినిమాను పక్కనపడేశారు. అప్పుడు నా చేతిలో ఉన్న మలయాళ సినిమా కూడా ఆపేశారు. దీంతో అందరూ నన్ను ఐరన్ లెగ్ అని పిలిచారు. నిజంగానే అంత దురదృష్టవంతురాలినా? అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని. 'ఐరన్ లెగ్'గా ముద్ర ఐరన్ లెగ్ అనే పదం వల్ల చాలామంది నిర్మాతలు నన్ను సినిమాలో తీసుకున్నట్లే తీసుకుని పక్కనపెట్టేశారు. డజన్లకొద్దీ సినిమాల్లో నాకు బదులుగా వేరే హీరోయిన్లను తీసుకున్నారు. ఒక నిర్మాత అయితే నేను దురదృష్టవంతురాలిని అని చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అసలు నా ముఖం హీరోయిన్లా ఉందా? అని నా పేరెంట్స్‌తో అన్నాడు. అప్పుడు ఆరునెలల దాకా నా ముఖం అద్దంలో చూసుకోలేదు. లగే రహో మున్నా భాయ్ సినిమా చేశాక అదే నిర్మాత నన్ను తన సినిమా చేయమని అడిగాడు' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. చదవండి: ఆ విషయంలో ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న బన్నీ! -
అయోమయం.. ఆశ్చర్యం
విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామమూర్తి లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘దో ఔర్ దో ప్యార్’. శీర్ష గుహ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నేను వీగన్... పాలతో తయారైన వాటిని తినను (విద్యాబాలన్)’, ‘మరి.. మీ ఫేస్వాష్లలో మిల్క్ ఉంటుంది కదా (ప్రతీక్ గాంధీ)!’, ‘మనం డేటింగ్లో ఉన్న వారిలా లేము.. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటున్నాం (ఇలియానా)’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘ప్రేమ కన్ఫ్యూజ్ చేస్తుంది. సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నవి కూడా టీజర్లో కనిపించాయి. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
Vidya Balan: పోలీసులను ఆశ్రయించిన విద్యాబాలన్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడదే కొంతమంది మోసగాళ్లకు బలమైంది. నెట్టింట చురుగ్గా ఉండే విద్యాబాలన్ పేరుతో ఓ నకిలీ అకౌంట్‌ని క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాబ్స్ ఇప్పిస్తానంటూ.. తనదైన అందం అభినయంతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాబాలన్. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం పక్కకి పెట్టదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పడు ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఆ మధ్య అచ్చం విద్యాబాలన్ నిజమైన ఇన్స్టాగ్రామ్ ఐడీతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కొంతమంది దుండగులు. ఆమె అకౌంట్లోని ఫోటోలు, వీడియోలు అన్ని ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అభిమానులతో చాట్ చేస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమందికి జాబ్స్ ఇప్పిస్తామని, అందుకోసం కొంత అమౌంట్ ఖర్చు అవుతుందంటూ పెద్ద ఎత్తున్న డబ్బులు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా విద్యాబాలన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 66 (C) ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ముఠాను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేశారు. Bollywood actress Vidya Balan lodged an FIR against an unknown person for creating a fake Instagram account in her name and asking for money from people. An unknown person who created an identical Instagram ID asked people for money by assuring them of jobs. Khar Police has… — ANI (@ANI) February 21, 2024 ‘భూల్ భూలయ్య 3’లో విద్యా బాలన్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు విద్యాబాలన్. కథ, తన పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం భూల్ భులయ్య 3లో నటిస్తున్నారు. అందులో మంజులిక పాత్రను పోషించబోతున్నట్లు హీరో కార్తిక్ ఆర్యన్ ప్రకటించాడు. అనీస్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
విద్యాబాలన్‌కు ఇంత పెద్ద కూతురా? ఇన్నేళ్లు సీక్రెట్‌గా దాచిపెట్టిందా?
విద్యాబాలన్.. డర్టీపిక్చర్ సినిమాతో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో అంతులేని క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ 2012లో నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల విద్యాబాలన్ ఓ అమ్మాయితో కలిసి ఉన్న వీడియో తెగ వైరలయింది. ఎయిర్‌పోర్టులో ఆమె చేయి పట్టుకుని నడిపించింది. తతో పాటు ఫోటోలకు పోజిచ్చింది. ఇది చూసిన జనాలు విద్యాబాలన్‌ను ఇంత పెద్ద కూతురు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తనకు కూతురు ఉందన్న విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచింది? అని అనుమానిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై విద్యాబాలన్ స్పందించింది. ఆ అమ్మాయి పేరు ఐరా అని, ఆమె తన సొంత కూతురు కాదని పేర్కొంది. అయితే తనకు కూతురు వరస అవుతుందని చెప్పింది. తన సోదరికి కవలలు సంతానం అని, అందులో ఒకరే ఐరా అని పేర్కొంది. అనవసరంగా దీన్ని పెద్ద విషయంగా చూస్తున్నారని అభిప్రాయపడింది. సినిమాల సంగతి.. కాగా విద్యాబాలన్ 2005లో సినీప్రయాణం మొదలుపెట్టింది. తన కెరీర్లో ఎన్నో మర్చిపోలేని హిట్లు ఇండస్ట్రీకి అందించింది. 2014లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీని బహుకరించింది. ఇకపోతే విద్యాబాలన్ చివరగా నీయత్ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె సీబీఐ అధికారిణిగా నటించింది. ప్రస్తుతం లవర్స్ అనే సినిమా చేస్తోంది. ఇందులో ప్రతీక్ గాంధీ, ఇలియానా కూడా నటించనున్నారు. Vidya Balan with her cute daughter ❤️✨#vidyabalan pic.twitter.com/PtcxQaGUHg — Viral Bhayani (@viralbhayani77) October 6, 2023 చదవండి: ప్రశాంత్ వరస్ట్ కెప్టెన్.. తేల్చేసిన హౌస్మేట్స్.. కన్నీటితో బ్యాడ్జ్ వెనక్కిచ్చేసిన రైతుబిడ్డ! -
విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే!
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. కళ్ల అభినయంతో నటలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన విద్యాబాలన్ ఓ ఇంటర్యూ తన కళ్ల అందం వెనుక దాగున్న రహస్యం గురించి, అందుకోసం తాను వాడే కాజల్ గురించి పంచుకుంది. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదాసీదా కాటుక కాదు.. పాకిస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’ కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! (చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
తొలిచూపులో ప్రేమకు బదులు లస్ట్ పుట్టిందంటున్న స్టార్ హీరోయిన్
ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్.. ఇలాంటివి చిత్రీకరించడంలో బాలీవుడ్ ఎప్పటినుంచో ముందు వరుసలో ఉంది. ఇలాంటివి తీయడంలో టాలీవుడ్ వాళ్లు తడబతడారేమో కానీ బాలీవుడ్ మాత్రం పర్ఫెక్షన్ చూపిస్తుంది. ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 సినిమా తెరకెక్కించింది. ఇది 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్‌కు సీక్వెల్. టైటిల్ చూసి మోసపోవద్దని, సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయంది తమన్నా. ఆమె మాటను నమ్మితే మోసపోయినట్లే! ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లే ఉందని, అంతా బోల్డ్ కంటెంటే అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీర్పు ఇచ్చేశారు. ఇలాంటి మితిమీరిన బోల్డ్ కంటెంట్‌తో గతంలో వచ్చిన డర్టీ పిక్చర్ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకుంది విద్యాబాలన్. తాజాగా ఆమె ప్రేమ, కామం వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2012లొ సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడిన ఆమె తమ మధ్య ముందు అట్రాక్షన్ ఏర్పడిందని పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'నిజానికి మొదట్లో నేను పెళ్లి చేసుకోవాలనే అనుకోలేదు. కానీ ఓ వయసు వచ్చాక నాలో చాలా పరిణతి వచ్చింది. 30 ఏళ్లకే నేను ఎంతో సక్సెస్ చూశాను. దాన్ని ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. కొంతమందితో డేటింగ్ చేశాను, కానీ వర్కవుట్ కాలేదు. ఒంటరిని అన్న ఫీలింగ్ ఎక్కువైంది. మన మంచిచెడ్డలు, కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ వ్యక్తి కావాలనిపించింది. ఈ క్రమంలో కొందరితో లవ్‌లో పడ్డా ఆ ప్రేమ కథలేవీ సుఖాంతం కాలేదు. కొన్నిసార్లు దారుణంగా మోసపోయాననిపించింది. అప్పుడే నేను అన్నింటినీ సీరియస్‌గా తీసుకోవడం మానేసి జాలీగా ఉండటం మొదలుపెట్టాను. అటువంటి సమయంలో ఓసారి సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను చూశాను. చూడగానే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడనిపించింది. అదే మా లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ఒకరికొకరం ఆకర్షితులయ్యాం. ముఖ్యంగా సిద్దార్థ్ నన్ను చూసుకునే విధానానికి ఇంకా పడిపోయాను. అతడే ముందుగా ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పి కలిసి ముందుకు ప్రయాణించాం' అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్. చదవండి: మనోజ్, మౌనిక.. నాన్నను ఎలాగైనా ఒప్పించమని వేడుకున్నా: మంచు లక్ష్మి -
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
కాఫీకి పిలిచి రూమ్‌కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
ఇంటర్నెట్‌ని షేక్‌చేస్తున్న విద్యాబాలన్ బోల్డ్ ఫోటోషూట్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ కోసం విద్యాబాలన్ సెమీ న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం న్యూస్ పేపర్‌ను అడ్డుపెట్టుకొని కూర్చీలో కూర్చొని ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ దిగిన ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 40ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ విద్యాబాలన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇది మరో డర్టీ పిక్చర్‌లా ఉందంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీని కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోయిన్లను ఇలా నగ్నంగా చూపించడంలో క్రియేటివిటీ ఏముంది అంటూ అతడ్ని కూడా ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
ఆ విషయాన్ని సిగ్గులేకుండా అడిగేశా: విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్లో విద్యాబాలన్‌కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది. (ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్‌కు, నాకు పోలికే లేదు) విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్‌తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు. 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి) -
ఎంత పిచ్చి ఉంటే మాత్రం భర్తను పట్టించుకోవా?.. నెటిజన్స్ ఆగ్రహం
కెమెరా అంటే సెలబ్రిటీలకు మహా ఇష్టం. షూటింగ్‌లోనే కాదు, బయట ఎవరైనా ఫోటోలు క్లిక్ చేయడానికి ప్రయత్నించినా ఐయామ్ రెడీ అంటూ వెంటనే పోజులిస్తుంటారు. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన విద్యాబాలన్ కూడా కారు దిగగానే ఇదిగో వస్తున్నా అంటూ నడుముకు చేయి పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వచ్చి అందంగా ఫోటోలు దిగింది. అంతా బానే ఉంది కానీ విద్యాబాలన్ తన ఫోటోల మీద పెట్టిన దృష్టి భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ మీద పెట్టినట్లు కనిపించడం లేదు. విద్యాతో ఫోటో దిగేందుకు సిద్దార్థ్ రెడీ అయినా ఆమె మాత్రం భర్తను పట్టించుకోలేదు. దీంతో అతడు ఇబ్బందికరంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అవేమీ పట్టించుకోని నటి హ్యాపీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోజులివ్వడంలో నిమగ్నమైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎంత ఫోటోల పిచ్చి ఉంటే మాత్రం భర్తను కూడా మైమరచిపోతారా?', 'అసలు వీళ్ల దాంపత్య జీవితం బాగానే ఉందా?' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో కలిసి ఫోటో దిగాలనుకున్న భర్తను విద్యాబాలన్ ఏమాత్రం లెక్క చేయకుండా పొగరు చూపించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం విద్యాబాలన్ చబ్బీగా ఎంత బాగుందోనని మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్ కిడ్‌పై ట్రోలింగ్ -
అదరహో.. ఫిల్మ్‌ఫేర్-2022లో మెరిసిన తారలు ఫొటోలు
-
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్‌కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్‌ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్‌కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్‌ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్‌ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
అవి హీరోల చిత్రాలు.. అందుకే ఫ్లాప్ అయ్యాయి: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ తన రెండు సినిమాలు పరాజయం కావడానికి కారణం హీరోలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె కెరీర్ ప్రారంభ రోజులకు గుర్తు చేసుకుంది. తన నటించిన తొలి ఏడు సినిమాల్లో రెండు ఫ్లాప్ అయ్యాయని, దానికి కారణం అవి హీరోలు ప్రాధాన్యంగా తీసిన సినిమాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో నా నిర్ణయాల గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నేను సంప్రదాయమైన సినిమాలు చేయలేదు. అందుకే నేను పెద్దగా సక్సెస్ కాలేకపోయాను. సినిమా ప్రమోషన్స్‌లో కూడా మీరు మరో అన్‌కన్వెన్షనల్(సంప్రదాయం కానీ సినిమాలు) చేస్తున్నారా? అని ప్రశ్నించేవారు’ అని చెప్పుకొచ్చింది. చదవండి: జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు! ఆ తర్వాత ‘అయితే ప్రజల అభిప్రాయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటుంటే మాత్రం ఆశ్యర్యం కలుగుతోంది. సంప్రదాయబద్ధమైన సినిమాలు చేయకపోవడం వల్లే నేను అంతగా సక్సెస్ చూడలేకపోయి ఉండొచ్చు. నేను చేసిన చిత్రాల్లో విజయం సాధించని సినిమాలన్ని మహిళా ప్రాధాన్యం కానీవే!’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా విద్యా బాలన్ పరిణణీత(2005) సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లగే రహో మున్నా భాయ్, గురు, హే బేబీ, భూల్ భూలయ్యా, కిస్మత్ కనెక్షన్, పా చిత్రాల్లో నటించింది. ఇక 2011లో సిల్క్ స్మిత బయోపిక్‌గా వచ్చిన ద డర్టీ పిక్చర్లో నటించింది. ఇందులో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డును గెలుచుకుంది. -
బాత్రూమ్లో లైబ్రరీ ఏర్పాటు చేయించుకున్న హీరో
సెలబ్రిటీల జీవన శైలి అంటే ఆసక్తి చూపనిదెవరు? అందునా పాపులర్ పర్సన్స్ అలవాట్లు, అభిరుచుల పట్ల చెవి రిక్కించని వారెవరు? ఆ గుంపులో మేమూ ఉన్నాం. అందుకే ఈ వివరాలు పోగేసుకొచ్చాం..! శారీ సుందరి.. తెలుసు మీకర్థమైందని! విద్యా బాలనే. ఇక్కడ చెప్పబోయేది కూడా ఆమెకున్న చీరల పిచ్చి గురించే. ఎక్కడ ఏ కొత్త రంగు.. డిజైన్.. నేతలో చీర కనిపించినా అది తన క్లాజెట్‌లో క్లోజ్ చేసుకునేదాకా నిద్రపోదట విద్యాబాలన్. నిద్రంటే గుర్తొచ్చింది.. రాత్రి కలలో కూడా తను చీరలోనే కనిపించాలని నిద్రపోయేప్పుడూ చీర కట్టుకునే నిద్రకుపక్రమిస్తుందని ఆమె సన్నిహితుల ఉవాచ. అన్నట్టు విద్యాబాలన్ లీస్ట్ బాదర్డ్ థింగ్ ఈజ్ సెల్ ఫోన్. అభిమానులూ.. ఆమె నంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ పెట్టేరూ..! ఆర్నెల్లయినా చూసుకోదట. ఫ్యాన్స్ సందేశాలే కాదు.. ఆమెకు పనిచ్చేవాళ్ల సమాచారాలను కూడా. అలా విద్యా చాలా ముఖ్యమైన భూమికలను, అత్యంత ప్రధానమైన ఈవెంట్లనూ మిస్ అయిన సందర్భాలు బోలెడట. అయినా సెల్ ఫోన్‌ను అక్కున చేర్చుకోదట. అదేమంటే ఫోన్లో తల దూర్చడం కంటే మనుషులతో మాటలు కలపడమే నాకిష్టం అంటుంది. వాటే టైమింగ్.. కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసు కదా! ఆ ప్రమాదంలో అతని కుడిచేతిక్కూడా గాయమై కొన్నాళ్లపాటు అది కదలకుండా ఉందట. అప్పుడు అన్ని పనులను ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకున్నాడు అమితాబ్.. రాయడం సహా. ఇప్పుడు కుడిచేత్తో ఎంత స్పీడ్‌గా .. సౌకర్యంగా రాయగలడో ఎడమచేత్తోనూ అంతే స్పీడ్‌గా సౌకర్యంగా రాయగలడు ఆ హీరో. సో వాట్.. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారా? అవును ఆ ప్రాక్టీస్ ఆ మ్యాన్ని ఎంత ఎక్స్‌పర్ట్‌ను చేసిందంటే రెండు వేర్వేరు విషయాలను ఏకకాలంలో రెండు చేతులతో రాసేంతగా! దటీజ్ బిగ్ బి.. అంటూ అభిమానులంతా ఆయనకు బిగ్ హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టేశారా! గోర్లు బలి ఆందోళన, కంగారు, ఒత్తిడి వగైరాను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కోతరహా. కానీ చాలామందిది ఒకే తరహా. ఏ కాస్త టెన్షన్.. స్ట్రెస్ ఫీలైనా వేలి గోళ్లను కరచుకుని కొరికేస్తుంటారు. ఆ లిస్ట్‌లో కరీనా కపూర్ కూడా ఉంది. అవును.. పాపం.. ఏ కాస్త కంగారు కలిగినా వేలి గోళ్లను దానికి బలిచ్చేస్తూంటుందట. హమ్మయ్య.. సెలబ్రిటీలూ సామాన్యులే ఈ విషయంలో అని సారూప్యత వెదుక్కోవచ్చు. ఇట్స్ నాటే లై వాష్‌రూమ్‌లో వార్తా పత్రికలు చదవడం చాలామందికి అనుభవం. కానీ పుస్తకాలు చదవడం చాలా మందికి కొత్తే! కానీ సైఫ్ అలీఖాన్‌కు చాలా చాలా పాత అలవాటు. అతను చిన్నప్పటి నుంచీ బాత్రూమ్లోనే పుస్తకాలు చదివేవాడట. సో పెద్దయ్యాకా.. అంటే నటుడిగా స్థిరపడ్డాక.. ఏకంగా బాత్రూమ్లోనే లైబ్రరీని ఏర్పాటు చేయించుకున్నాడు. చదవాలనిపించినప్పుడల్లా వాష్‌రూమ్‌లోకి దూరుతున్నాడని కరీనా కపూర్ కంప్లయింట్ చేస్తుందేమో! స్టాంప్సా? కాదు.. .. మరేంటి? సోప్స్! ఊప్స్..! ఎస్.. సల్మాన్ ఖాన్ ఏ కొత్త చోటుకి వెళ్లినా అక్కడ కనిపించిన సోప్స్‌ను తీసి బ్యాగ్‌లో వేసుకుంటాడట. ఏంటయ్యా అది? అని అంటే.. సోప్స్ కలెక్షన్ అని ఆన్సర్ చేస్తాడట. అలా తెచ్చుకున్న సోప్స్‌తో షవర్ ఎక్స్పరిమెంట్స్ చేస్తాడని బాలీవుడ్లో బ్యాడ్ టాక్. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి 16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్‌తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్‌తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్‌గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్‌లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్‌గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. -
నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు: విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్
Vidya Balan Open Up On Her Struggles: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకున్న విద్యా బాలన్ అప్పటి నుంచి వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తను ఎన్నో కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీ అంటేనే ఆసహ్యం వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం కాగా ఆమె తాజాగా నటించిన చిత్రం జల్సా. ఈ మూవీ అమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యా బాలన్ భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడు. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను. ఇదంత 2003లో జరిగింది. ఆ సమయంలో నేను ఏ సినిమాలకు సంతకం చేయలేకపోయాను. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు నాపై ప్రభావం చూపింది’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు పలు ప్రకటనల నుంచి కూడా తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్ తెలిపింది. ఆ తర్వాత అందమైన శరీరాకృతి కోసం రోజు గంటల తరబడి వ్యాయమం చేసి బరువు తగ్గాననని పేర్కొంది. ఇక ఇప్పడు నన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలే ఫోన్ చేసి సినిమా చేయాలని అడుగుతున్నారని, అయితే వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు విద్యా బాలన్ చెప్పింది. -
హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. తాజాగా విద్యాబాలన్ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో ఒక యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్ చేస్తున్నాను. ఇది హాట్ ఫొటోషూట్ కాదా..' అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్‌తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్. -
ఓటీటీలోకి 'జల్సా' చిత్రం.. ముచ్చటగా మూడోసారి
Vidya Balan Jalsa Movie Released In OTT: కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమాలకు ప్రత్యామ్నాయంగా కనిపించినవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. తర్వాత కొద్ది రోజులకు చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇవే కాకుండా బడా హీరోలు, అగ్ర నటులు సైతం ఓటీటీకే మొగ్గు చూపారు. బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభగల నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. ఒటీటీలో సినిమాను విడుదల చేసి హిట్ కొట్టిన మొదటి బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఆమె 2020లో నటించిన 'శకుంతల దేవి' చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. తర్వాత 2021లో 'షేర్ని' మూవీతో ఆ విజయ పరంపరను కొనసాగించింది. తాజాగా 'జల్సా' సినిమాతో తాను హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. జల్సా సినిమాను ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు విద్యా బాలన్ నటించిన 'తుమ్హారీ సులు' డైరెక్టర్ సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యా ఒక జర్నలిస్టుగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు విద్యా బాలన్ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే విడుదలై విజయం సాధించాయి. మరీ ఈ సినిమా ఓటీటీలో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందో చూడాలి. -
తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..
Top 5 Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్ నటీమణులు తమ సొంత బ్యాంకింగ్‌ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా తెరపై నటించిన బాలీవుడ్ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా ! 1. నుష్రత్ భరుచ్చా (ఛోరీ) హిందీలో వస్తున్న హార్రర్ మూవీ 'ఛోరీ'లో నుష్రత్ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్‌కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్‌ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్‌ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 2. విద్యా బాలన్ (కహానీ) భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్ బేబీ బంప్‌ను ధరించి నటించారు విద్యా బాలన్. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్‌గా తెలుగులో నయనతార హీరోయిన్గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 3. నీనా గుప్తా (బధాయి హో) 2018లో నటి నీనా గుప్తా, అమిత్ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 4. కరీనా కపూర్ ఖాన్ (గుడ్ న్యూస్) గుడ్ న్యూస్ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు. అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 5. కృతి సనన్ (మిమి) 'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. -
పదేపదే అదే కామెంట్.. అందుకే షాహిద్‌కి విద్యాబాలన్ గుడ్‌బై
షా హిద్ కపూర్.. బాలీవుడ్ లవర్ బాయ్. తను కలిసి నటించిన కథానాయికలు అందరి (దాదాపుగా)తో ప్రేమలో పడ్డాడు.. కరీనా కపూర్‌తో అతని లవ్ స్టోరీ మినహా మిగిలినవన్నీ వదంతులుగానే ప్రచారమయ్యాయి. అందులో ఒకటే విద్యాబాలన్‌తో ఇష్క్. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కిస్మత్ కనెక్షన్. దాంతోనే వీళ్ల పరిచయం మొదలైంది. ఆ షూటింగ్ జరుగుతుండగానే ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎప్పటిలాగే ఆ ప్రేమ కబుర్లు పుకార్లుగా షికార్లు చేశాయి. వాటిని మీడియా కూడా క్యాచ్ చేసింది. వాటి కోసం పత్రికలు, చానెళ్లలో ప్రముఖ స్థానాన్ని, ప్రైమ్ టైమ్‌నూ కేటాయించింది. ఆ ప్రచారానుసారం షాహిద్, విద్యల ప్రేమ కిస్మత్ కనెక్షన్ విడుదల తర్వాత కొన్ని నెలల వరకూ సాగింది. ఇంక అది పెళ్లితో పదిలం కానుందని షాహిద్ సన్నిహితులు అనుకునేలోపే వాళ్ల బ్రేకప్ వార్త వినిపించింది. కారణం.. షాహిద్ దుందుడుకుతనం, దురుసు ప్రవర్తన అని తేల్చారు ఆ ఇద్దరి సన్నిహితులు. విద్యా బాలన్ వెయిట్ గురించి కామెంట్ చేశాడట షాహిద్. ఒక్కసారి కాదు పదేపదే. గౌరవం లేని ప్రేమ మనజాలదు.. అదెప్పటికైనా ఇద్దరి దారులను వేరు చేయక తప్పదు అని గ్రహించింది విద్యా. మారు మాట్లాడకుండా షాహిద్‌కు గుడ్ బై చెప్పింది... కెరీర్ మీద ప్రేమను పెంచుకుంది. ‘మనం ఇష్టపడేవారు మనల్ని చులకనగా చూస్తుంటే మనసు విరిగి పోతుంది. ఆ చనువును మన చేతకానితనంగా తీసుకుంటే తట్టుకోలేం. నా విషయంలో అదే జరిగింది. ఆ వ్యక్తి .. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు.. అతని పట్ల నాకున్న ఇష్టాన్ని అలుసుగా తీసుకొని నాలో లోపాలు వెదుకుతూ, వెటకారమాడుతుంటే భరించలేకపోయా. ఆ బంధం కన్నా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమనుకున్నా. అందుకే ఆ రిలేషన్లోంచి బయటకు వచ్చేశా’ అని చెప్పింది విద్యాబాలన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆమె అలా అతని అహంకారాన్ని ప్రశ్నించినా షాహిద్కేమీ పట్టలేదు. ఆ బ్రేకప్ను చాలా తేలికగా తీసుకున్నాడు. అతనూ ఒక ఇంటర్వ్యూలో ‘నా కోస్టార్ట్స్లో ఇద్దరిని అమితంగా ఇష్టపడ్డాను. అందులో ఒకరు ఇష్టపడ్డ మనిషిని మోసం చేయడంలో ప్రసిద్ధులు’ అంటూ పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా కపూర్, ఇంకొకరు ప్రియాంక చోప్రానా? లేక విద్యా బాలనా? ఈ ఇద్దరిలో ఆ రెండో వ్యక్తి ఎవరో మీడియాకు అంతుచిక్కలేదు. కాఫీ విత్ కరణ్‌లో... షాహిద్ కపూర్‌తో ఉన్న స్నేహం గురించి విద్యా బాలన్‌ను అడిగాడు కరణ్ జోహార్ తన ‘కాఫీ విత్ కరణ్’ షోలో. ‘కొంత కాలంగా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న. ఆ పేరుతో నన్ను జత పర్చడం వినీ వినీ విసుగెత్తిపోయా. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలతో నటించా.. ఇంకెవరి పేరుతోనైనా జత చేయండి. అంటే నిప్పు లేందే పొగరాదని కాదు నా ఉద్దేశం.. ఆ నిప్పు రాజేసిన వాళ్ల పేరు చెప్పను అంటున్నానంతే’ అని కౌంటర్ ఇచ్చింది విద్యా బాలన్. ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో ఇంకేదో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎస్.. మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం ఒకప్పుడు. అది ఫ్రెండ్షిప్. అతను నా కోస్టార్’ అని బదులిచ్చింది. విద్యాబాలన్ ఇచ్చిన ఈ జవాబుతో షాహిద్ దగ్గర ఇంకేదో రాబట్టాలని చూసిన మీడియాకు నిరాశే ఎదురైంది ‘ఆమెకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు.. భవిష్యత్‌లో ఆమెతో నటించేదీ లేదు’ అన్న షాహిద్ సమాధానంతో. దీనికీ విద్యా కౌంటర్ ఇచ్చింది.. ‘ఫ్రెండ్షిప్కు అతను ఇచ్చే నిర్వచనమేంటో నాకు తెలీదు కానీ ‘కిస్మత్ కనెక్షన్’ సినిమా టైమ్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌మి. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండింది.. అయితే అది ప్రేమ కాదు.. అందులో రొమాన్స్ లేదు. నాతో నటించకూడదు అనుకోవడం అతని ఇష్టం. అతని ఆ నిర్ణయంతో నాకేం ఇబ్బంది లేదు.. ఇండస్ట్రీలో అతనొక్కడే హీరో అయితే తప్ప’ అంటూ. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమా ప్రమోషన్ సమయంలో విద్యా ‘నా కెరీర్లోనే కాదు జీవితంలోనే స్పెషల్ మూవీ ఇది. షూటింగ్ పూర్తయ్యాక ఒకరకమైన ప్రశాంతతను.. మనశ్శాంతినీ పొందాను. నా ప్రేమ కథ పూర్తయినట్టనిపించింది’ అని చెప్పింది. ఆ మాటలు షాహిద్ గురించేననే కథనాన్ని అల్లేసింది మీడియా. ఏమైనా షాహిద్‌కు విద్యా పట్ల ప్రేమ ఉండిందో లేదో తెలియదు కానీ విద్యా మాత్రం షాహిద్‌ను మనసారా ప్రేమించింది. దీనికి నిదర్శనం.. మీరా రాజ్‌పుత్ షాహిద్‌తో పెళ్లి నిశ్చయం కాగానే విద్యా గురించి ఆరా తీసిందట ఇంకా ఆమె మనసులో అతను ఉన్నాడేమోననే సందేహ నివృత్తి కోసం! కరీనా, విద్యా బాలన్తోనే కాదు షాహిద్ పేరు, ప్రేమ సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా, అమృతా రావుతోనూ వినిపించాయి. ఎవరితోనూ సీరియస్‌గా లేడు షాహిద్.. అనే నిందా వినిపించింది.. కనిపించింది.. మీరా రాజ్‌పుత్‌ను జీవితభాగస్వామిగా చేసుకోవడంతో. -ఎస్సార్ -
ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో విద్యాబాలన్, ఏక్తా కపూర్
ప్రపంచ సినీ రంగంలో అకాడమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది ఏ క్యాటగిరి అయినా అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా క్యాటగిరిల్లో వారిని వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల జాబితాను ఆస్కార్ వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్లు ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులు ఈ ఏడాది ఆస్కార్ సభ్యులుగా ఉన్నారు. ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో ఆస్కార్ ఆకాడమీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆస్కార్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. కాగా ‘మిస్టరీ థ్రిల్లర్ కహానీ’ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతిగా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ‘పా, బూల్‌బులయ్యా, పరిణీత, బాబీ జాసూస్, శకుంతలా దేవి’ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 2011లో వచ్చిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అలాగే బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్లు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులయ్యారు. డ్రీమ్ గర్ల్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలకు వీళ్లు నిర్మాతలుగా వ్యవహరించారు. -
Designer Sarees: జీవన సౌందర్యం
కళకు జీవనశైలి తోడైతే అది ఎప్పుడూ సజీవంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. దుస్తులపై ముద్రణ అనేది ఈ నాటిది కాదు. కానీ, హస్తకళా నైపుణ్యంతో ఒక థీమ్ డిజైన్ తీసుకురావడం ఎప్పుడూ ప్రత్యేకతను చాటుతుంది. అలా ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇవి. చీర అంటే తనకెంత ఇష్టమో విద్యాబాలన్ శారీ కలెక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఏ ఈవెంట్‌కైనా చీరకట్టుతో కనిపించే విద్యాబాలన్ తన సినిమా టైటిల్‌కు తగినట్టుగా ఆ చీర డిజైన్ ఉండాలనుకుంటారు. ఇటీవల ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐష్ర్ ఇలస్ట్రేషన్స్ స్టూడియో వారి హార్న్ ఓకే ప్లీజ్ సేకరణ నుంచి తీసుకున్న శారీలో మెరిశారు విద్యాబాలన్. చీర కొంగుపై పులి ముఖం, ముడివేసిన కేశాలంకరణ, చెవి రింగులతో విద్యా లుక్ నిజంగానే పులిలా గంభీరంగా కనిపిస్తుంది. మన రోడ్లమీద ట్రక్స్ చూస్తే వాటి మీద రాసి ఉన్న అక్షరాలు, ప్రింట్లు ఆకర్షిస్తుంటాయి. అవి చాలా సాదా సీదాగా అనిపించినా ఆ ట్రక్స్కే ఆ డిజైన్స్ సొంతం అనిపిస్తాయి. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఆ డిజైన్స్‌ని ఒడిసిపట్టుకొని, వాటిని చీరలు, దుపట్టాల మీదకు తీసుకువస్తే ఎలా ఉంటాయో చేసిన ప్రయత్నమే ఈ ‘హార్న్ ఓకే ప్లీజ్.’ సేంద్రీయ మస్లిన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, బయోడిగ్రేడబుల్ రంగులతో ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందిన 9 ప్రింట్లతో ఐశ్వర్యా రవిచంద్రన్ చేతిలో రూపుదిద్దుకున్న చిత్రకళ ఇది. ఐశ్వర్యా రవిచంద్రన్ ఇలస్ట్రేటర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. వినూత్నమైన కళకు సంప్రదాయ సొబగులు అద్ది శారీస్, జాకెట్స్, షర్ట్స్, జ్యువెలరీని కూడా రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక కలెక్షన్‌ను ఆర్గానిక్ మెటీరియల్‌పై సంప్రదాయ రంగుల కళను తీసుకొచ్చి దేనికది స్పెషల్‌గా రూపొందించిన చీరలు, దుపట్టాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. -
Vidya Balan: ‘షేర్నీ’ మూవీ రివ్యూ
చిత్రం: ‘షేర్నీ’ తారాగణం: విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా కథ - మాటలు: ఆస్థా టిక్కూ నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ దర్శకత్వం: అమిత్ మసూర్కర్ సంగీతం: బందిష్ ప్రొజెక్ట్, ఉత్కర్ష్ ధోతేకర్ నేపథ్య సంగీతం: బెనిడిక్ట్ టేలర్ కెమెరా: రాకేశ్ హరిదాస్; ఎడిటింగ్: దీపికా కాల్రా రిలీజ్: 2021 జూన్ 18(అమెజాన్ ప్రైమ్) అభివృద్ధి అనేది ఎప్పుడూ సాపేక్షమే! కొన్నిసార్లు అభివృద్ధి పేరిట మనిషి చేసే చర్యలు పురోగతి కన్నా ప్రకృతి వినాశనానికి దారి తీస్తాయి. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటివి ఇప్పుడు విస్తృత ప్రచారంలో ఉన్నా, నిజంగా మనం చేస్తున్నది ఏమిటనేది ఆలోచిస్తే? చిరుతపులుల లాంటి వన్యప్రాణుల విషయంలో మన మాటలకూ, చేతలకూ ఎంత తేడా ఉంది? ఇలాంటి అంశాలన్నిటినీ తీసుకొని, రూపొందిన చిత్రం – ‘షేర్నీ’. మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) లాంటివి పులి వేటను జనాకర్షకంగా చూపిస్తే, నాణేనికి రెండు వైపును ‘షేర్నీ’ పరిచయం చేస్తుంది. కథేమిటంటే.. మూడేళ్ళ క్రితం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో అవని అనే ఆడ చిరుతను చంపడం వివాదాస్పదమైంది. అప్పట్లో ప్రమీలా ఇస్తారీ అనే ఆవిడ అడవిలో కొన్ని కిలోమీటర్లు కాలినడకన వెతికి, ఆ ఆడపులి తాలూకు పిల్లల్ని కాపాడింది. ఆ నిజజీవిత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ క్రెడిట్స్ ఏమీ ఇవ్వకుండా ఈ ‘షేర్నీ’ కథను రాసుకున్నారు. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి (హిందీలో షేర్నీ) మనుషుల్ని గాయపరుస్తుంది. పులి బారి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపించి అయినా ఓట్లు కూడగట్టుకోవాలని రాజకీయ నేతల ఆకాంక్ష. రెండు పులికూనల్ని కన్న ఆ ఆడపులిని కాపాడాలనుకొనే ఫారెస్ట్ ఆఫీసర్ హీరోయిన్ (విద్యాబాలన్). పులిని పట్టుకోవడం కన్నా, చంపేసి వీ7రుడినని అనిపించుకోవాలనే వేటగాడు (శరత్ సక్సేనా). ఈ పాత్రల మధ్య షేర్నీ కథ నడుస్తుంది. ఆడపులిని, మహిళా అధికారినీ పోల్చకుండానే పోలుస్తూ, సమాజంలో ఎదురయ్యే కష్టాన్ని సూచనప్రాయంగా చెబుతుందీ కథ. ఎలా చేశారంటే.. ఆడ చిరుతపులి కోసం అన్వేషణ సాగే ఈ చిత్రంలో నిజానికి ప్రధానపాత్ర పులే. కథ అంతా పులి గురించే అయినా, చెప్పదలుచుకున్న పాయింట్ వేరు గనక తెరపై పులి కనిపించే దృశ్యాలు మాత్రం తక్కువే. పులులను కాపాడాలని తపించే కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ విద్యా విన్సెంట్ గా జాతీయ అవార్డు నటి విద్యా బాలన్ బాగా చేశారు. సిల్క్ స్మిత జీవితకథపై వచ్చిన ‘డర్టీ పిక్చర్’ మొదలు గణిత మేధావి ‘శకుంతలా దేవి’ బయోపిక్ దాకా చాలా పాత్రల్లో రాణించిన విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. పరిమితులు దాటని అభినయంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, చివరలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మనసు కదిలించారు. మానవత్వం లేని మనుషుల కన్నా, మ్యాన్ ఈటర్ అని ముద్ర పడ్డ పులి మీద సానుభూతి కలిగేలా చేశారు. విద్యాబాలన్ తో కలసి పనిచేసే ప్రొఫెసర్ హసన్ నూరానీగా విజయ్ రాజ్ సహజమైన నటనతో మెప్పిస్తారు. చాలాకాలం గుర్తుంటారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన శరత్ సక్సేనా ఇందులో పాతిక పులుల్ని చంపిన వేటగాడు పింటూగా కనిపిస్తారు. విద్యాబాలన్ అత్తగారి పాత్రలో ఇలా అరుణ్, మరీ ముఖ్యంగా విద్యాబాలన్ పై అధికారి బన్సల్ గా చేసిన బ్రిజేంద్ర కాలా తదితరులు ఈ సీరియస్ కథలో రిలీఫ్ ఇస్తారు. ఎలా తీశారంటే.. మన దేశంలో పులుల సంరక్షణకు సంబంధించి వాస్తవ పరిస్థితులను ఈ రెండు గంటల పైచిలుకు సినిమా కళ్ళకు కడుతుంది. మన దగ్గర అటవీ శాఖ ఎలా పనిచేస్తుంటుందో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. అభయారణ్యాల చుట్టుపక్కల గ్రామాలు, అక్కడి ప్రజలు, వాళ్ళ మీద రాజకీయ నాయకుల ప్రభావం లాంటివి ఇందులో చూడవచ్చు. ఒక దశలో పులి కన్నా మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు ఎంత క్రూరమైనవో ఈ కథ గుర్తు చేస్తుంది. పులుల లాంటి వన్యప్రాణుల నివాసాలలో గనుల తవ్వకాల లాంటివి చేపట్టి, వాటి ఇంట్లో చేరిన మానవుడు అవి జనావాసాలకు హాని కలిగిస్తున్నాయంటూ వాటినెలా మట్టుబెడుతున్నాడో చెప్పకనే చెబుతుంది. మనుషులు, జంతువులు సహజీవనం చేయాల్సి ఉంది. అది అటవీ, వన్యప్రాణి సంరక్షకులు పదే పదే చెప్పేమాట. కానీ, దాన్ని గాలికి వదిలేసి పులుల వేట మనిషి వీరత్వానికి ప్రతీక అనుకొంటూ, స్పృహ లేని పనులు చేయడాన్ని చర్చకు పెడుతుంది. నైట్ ఎఫెక్ట్ లో, అందమైన అటవీ ప్రాంతాల చిత్రీకరణలో రాకేశ్ హరిదాస్ పనితనం కనిపిస్తుంది. అయితే, ‘షేర్నీ’ చాలా సందర్భాల్లో సినిమాలా కాకుండా, సెమీ డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. తీసుకున్న అంశం మంచిదైనా, దాన్ని మరింత ఎమోషనల్ గా, ఎఫెక్టివ్ గా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కథ చాలా నిదానంగా నడిచిందనీ అనిపిస్తుంది. మొదట్లో కన్నా పోనూ పోనూ కథ, కథనం చిక్కబడి, చివరకు ఆసక్తి పెరుగుతుంది. అప్పటికి కాస్తంత ఆలస్యమైపోతుంది. అది ఈ సినిమాకు ఉన్న బలహీనత. అయితే, ‘న్యూటన్’ చిత్రం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అమిత్ మసూర్కర్ ఈసారీ తన మార్కు చూపారు. మనిషికీ, జంతువుకూ మధ్య ఉండే ఘర్షణ నేపథ్యంలోనే అధికారుల అవినీతి, నేతల ఎన్నికల రాజకీయ స్వార్థాలు, అటవీ గ్రామాల్లోని గిరిజనుల మంచితనం – ఇలా చాలా అంశాలను చూపెట్టారు. ఆశావాదం అతిగా చూపకుండా, మనసు చివుక్కుమనే ముగింపుతో ఆలోచింపజేశారు. ఆ మేరకు ‘షేర్నీ’ సక్సెస్. కొసమెరుపు: ఓ సెమీ డాక్యుమెంటరీ శైలి సినిమా! బలాలు ఎంచుకున్న కథాంశం కెమెరా వర్క్ విద్యాబాలన్ సహా పలువురి నటన బలహీనతలు స్లో నేరేషన్ డాక్యుమెంటరీ తరహా కథనం పులికూనల సంరక్షణను హడావిడిగా ముగించడం - రెంటాల జయదేవ -
షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ విద్యాబాలన్‌కు కొంచెం క్లిష్టమైన ప్రశ్న విసిరాడు. కానీ దీనికి కూడా ఆమె ఎంతో తెలివిగా చాకచక్యంగా సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అతడు ఏం అడిగాడంటే.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు? అని ప్రశ్నించాడు. దీనిపై విద్యాబాలన్ స్పందిస్తూ తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్(ఎస్ఆర్కే) అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. అంతేకాదు భర్తతో కలిసి దిగిన ఫొటోను సైతం షేర్ చేసింది. ఇదిలా వుంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'షేర్నీ’ ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఇందులో ఆమె అటవీశాఖ అధికారిణిగా కనిపించింది. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథే షేర్నీ. మధ్యప్రదేశ్ అడవుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. అమిత్ మసుర్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 18న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'మహాభారత్ 2'లోనూ ఆమె నటించనుంది. చదవండి: విద్యాబాలన్‌కు దగ్గరైన షాహిద్, కరీనా మనసు ముక్కలు ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి -
విద్యాబాలన్ వల్ల కరీనా, షాహిద్ విడిపోయారా?
కరీనా కపూర్, షాహిద్ కపూర్లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నటీనటులుగా ఎంత ఫేమసో ప్రేమికులుగానూ అంతే పాపులర్.. కిస్మత్ కనెక్షన్ ఫెయిలయ్యి ఈ ‘మొహబ్బతే’కు నాయికా, నాయకులుగా మారారు... కరీనా, షాహిద్.. ఇద్దరివీ పరస్పర విరుద్ధ మనస్తత్వాలు. ఆమె కొంచెం అహంభావి.. అతను కాస్త ఆకతాయి. ఆమెలోని ఆ అహం ఆత్మవిశ్వాసంగా అతణ్ణి ఆకర్శించింది. అతనిలోని ఆకతాయి తనం హీరోయిజమ్గా ఆమె మనసును దోచుకుంది. అలా ఆ ప్రేమ కథ మొదలైంది. సినిమాల్లో కరీనా.. షాహిద్ కన్నా సీనియర్. షాహిద్ తొలి సినిమా ‘ఇష్క్ విష్క్’చూసి అతనికి ఫ్యాన్ అయింది. ఎలాగైనా ఆ అబ్బాయిని కలవాలని ఉవ్విళ్లూరింది. కలిసింది. తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఆకట్టుకున్నారు. వారం తర్వాత వాళ్ల డేటింగ్ మొదలైంది. ‘నువ్వంటే ఇష్టం’ అని తొలుత కరీనానే చెప్పింది షాహిద్‌తో. ‘నాకూ ఇష్టమే’ అని చెప్పాడు. షూటింగ్ ప్యాకప్ చెప్పగానే చట్టాపట్టాల్తోనే సాయంకాలాలు గడిచిపోయేవి. బాలీవుడ్లో ఈ ముచ్చట భలే సందడి చేసింది. అది కరీనా వాళ్లమ్మ బబిత, అక్కయ్య కరిష్మానూ చేరింది. కెరీర్ పట్ల కరీనా సీరియస్‌గా లేదని అర్థమైంది వాళ్లకు. ఆమె మెదడులోంచి షాహిద్‌ను తప్పించే ఆలోచనలు చేయసాగారు. అతనే హీరో.. తన ప్రేమను స్క్రీన్ మీదకూ తెచ్చింది కరీనా... తను చేసే సినిమాల్లో హీరోగా షాహిద్‌ను తీసుకొమ్మని నిర్మాతలను కోరుతూ. ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా కాదనలేకపోయారు నిర్మాతలు. అలా వాళ్లిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ‘ఫిదా’ విడుదలైంది. ఫ్లాప్ అయింది. అయినా కరీనా పట్టు వీడలేదు. ‘36 చైనా టౌన్’, ‘మిలేంగే మిలేంగే’, ‘చుప్ చుప్ కే’ చిత్రాలూ వచ్చాయి ఈ ఇద్దరి కాంబినేషన్లోనే. తెర మీద ఆ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని గ్రహించారు దర్శకనిర్మాతలు. కరీనా తీరు బబిత, కరిష్మాకూ నచ్చలేదు. వ్యక్తిగతాన్ని కెరీర్‌తో ఎందుకు ముడిపెడుతున్నావ్? అది అన్‌ప్రొఫెషనల్’ అని బబిత కూతురిని హెచ్చరించింది కూడా. షాహిద్‌తో ప్రేమ బంధం తెంచుకొమ్మని అక్క కరిష్మా సలహా ఇచ్చింది చెల్లెలికి. జబ్ వి మెట్ నిజ జీవితంలోని వాళ్ల ప్రేమను తెర మీద ఎలా ప్రెజెంట్ చేయాలో.. ఆ జంటను ప్రేక్షకులు ప్రేమించేలా ఎలా చూపించాలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. చక్కటి స్క్రీన్ ప్లేనూ అల్లుకున్నాడు. ‘జబ్ వి మెట్’ సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. తెర మీద ఆ జంటకు క్రేజ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంది మీడియా.. ఆ రియల్ లవ్ స్టోరీని మళ్లీ ఒకసారి ప్రచురించి.. ప్రసారం చేసి. కానీ.. జబ్ వి మెట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే షాహిద్, కరీనాల ప్రేమ బంధం బలహీనపడసాగింది. ఇంట్లో కరీనాకు షాహిద్‌తో తెగతెంపులు చేసుకొమ్మనే పోరు ఎక్కువైంది. అదే సమయంలో షాహిద్ .. విద్యాబాలన్‌తో చనువుగా మెదులుతున్నాడనే వార్తలూ కరీనా చెవిన పడ్డాయి. షాహిద్‌ను నిలదీసింది. సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ముక్కలైంది. ‘జబ్ వి మెట్’ సినిమా టైమ్‌లోనే కరీనా తషన్ సినిమా కూడా చేస్తోంది. ఆ సెట్స్‌లో సైఫ్ అలీఖాన్‌తో తన బాధను పంచుకుంది. షాహిద్‌తో దూరం పెరిగింది. జబ్ వి మెట్ సెట్స్‌లో ఆ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆ సినిమా క్రూ కూడా పసిగట్టింది ‘ఏదో జరిగింది’ అని. అయినా ఆ జంట సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించకుండా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించి సినిమానూ పూర్తి చేశారని జబ్ వి మెట్ టెక్నీషియన్స్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. విధి భలే విచిత్రమైంది.. కరీనా, షాహిద్ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డన్నాళ్లు తెర మీద వాళ్ల జంట ఫెయిల్ అయింది. తెర మీద యాక్సెప్టెన్స్ వచ్చేప్పటికి నిజ జీవితంలో వాళ్ల మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఆ బ్రేకప్ వాళ్లిద్దరినీ చాన్నాళ్లపాటు వేధించింది. ఆ బాధను చూసి కాలానికీ జాలేసిందేమో.. ఆ జ్ఞాపకాల్లోంచి ఇద్దరినీ బయటపడేసింది. మావి డిఫరెంట్ పర్సనాలిలిటీస్. ఆ డిఫరెన్సే మా ఇద్దరిలో ఉన్న ఖాళీని పూరించింది. – షాహిద్ షాహిద్, నేను ఇంచుమించు ఒకే వయసువాళ్లవడం వల్ల త్వరగా కనెక్ట్ అయ్యాం. ఆ సేమ్ టెంపర్మెంటే బ్రేకప్‌కి కారణమై ఉండొచ్చు. – కరీనా కపూర్ - ఎస్సార్ చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ -
చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ..సెల్ఫీ అంటున్న మిల్కీ బ్యూటీ
నాన్న పుట్టిన రోజులు వేడుకలు జరిపిన నాగశౌర్య ముఖానికి మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం ఇంకా ఉందంటున్నారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లంగా ఓణిలో అదరగొడుతున్న అందాల యాంకర్ శ్రీముఖి చీర కట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ సెల్ఫీ తీసుకుంటూ కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
చిట్టి గౌనులో సారా, చీరలో విద్యా..మత్తెక్కిస్తున్న ఈషా
చిట్టి గౌనులో అదరగొట్టిన సారా అలీఖాన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బా ఇంట్లో దోశలు వేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది శ్రుతి హాసన్ బ్లాక్ సారీలో దర్శనమించి ఆకట్టుకుంటున్న విద్యాబాలన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సోషల్ హల్చల్: చూసీ చూడంగానే నచ్చేశారే..
► చూసీ చూడంగానే నచ్చేశావే అంటోన్న మోనాలియన్స్ ► సెల్ఫీకి పోజిస్తోన్న కలర్‌ఫుల్ చిలక స్వాతి దీక్షిత్ ► పచ్చందనమే.. పచ్చందనమే పాట గుర్తు చేస్తోన్న అరియానా గ్లోరీ ► నో ఫిల్టర్ అని చెప్తోన్న పరిణీతి చోప్రా ► ఐపీఎల్ హోస్టింగ్‌కు రెడీ అవుతున్న చౌదరి నేహా ► మన్మథ బాణాలు విసురుతున్న అనన్య పాండే ► క్లాసిక్ సెల్ఫీ దిగిన మాధురి దీక్షిత్ ► చీర కట్టుకోవడమంటే ఇష్టమంటోన్న విద్యాబాలన్ ► ఇది శ్రీముఖి నిన్నటి లుక్కు, కానీ చూసేవాళ్లకు ఇప్పటికీ కిక్కు ► పొట్టి బట్టల్లో హీటెక్కిస్తున్న వర్షిణి ► గంధపు చీరలో అందాలు పరుస్తోన్న వితికా శెరు ► ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్న అదితి శర్మ ► ఖాకీ రంగు దుస్తుల్లో బాలీవుడ్ బాంబ్ సన్నీలియోన్ ► అందాలను దాచేస్తూ అబ్బాయిలకు వల వేస్తోన్న పాయల్ రాజ్‌పుత్ ► ఎండకు మరింత మెరిసిపోతున్న నభా నటేశ్ ► ప్రియా ప్రియా నవ్వొద్దే.. నీ నవ్వుల్లో మమ్మల్ని బంధించొద్దే అని ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూసి పాడుకుంటున్న కుర్రకారు View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Aditi Sharma (@officialaditisharma) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
8 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: నటి
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నిర్మాత సిద్దార్థ్ రాయ్‌ను 2012 డిసెంబర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ నటిగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వివాహ బంధంపై స్పందించారు. తన ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య ప్రేమను నిలుపుకోవడం సులభమే కానీ ఆ ప్రయాణమే భయంకరంగా ఉంటుందన్నారు. ‘ఎందుకంటే భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్థలు సాధారణంగా ఉండేవే. కానీ వాటిని మనం విడిచి జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. అలా కాకుండా వాటినే పట్టుకుని ఉంటే మాత్రం భార్యభర్త బంధంలో ఉండే ఆ స్పార్క్ పోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ.. ‘వివాహం అనేది అన్ని విషయాల్లో భాగమై ఉంటుంది. అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వివాహం అంటేనే ఎవరో తెలియని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం. అది సాధారణ విషయమేమి కాదు. వారి ఇష్టాలు అయిష్టాలు, అభిరుచులు ఎరిగి మనం నడుచుకోవాలి. అందుకు తగ్గట్టుగా మనం మలచుకోవాలి. అది సులభమే కానీ దాని కోసం మనం చాలా విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. అదే చాలా బాధించే విషయం. అయినప్పటికి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా భాగస్వామితో ముందుకు వెళ్లాలి. అప్పుడే వైవాహిక బంధం సంతోషంగా, సాఫిగా సాగుతుంది. ఇందుకోసం చేసే ప్రయత్నాలను కూడా నేను ఇష్టపడతాను. ఈ ఎనిమిదేళ్ల నా వైవాహిక జీవితంలో నేర్చుకున్న విషయం ఇదే’ అని ఆమె అన్నారు. కాగా ఆమె సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం విద్యా డైరెక్టర్ అమిత్ మసుర్కర్ రూపొందిస్తున్న ‘షహారీ’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె మహిళ ఆటవీ అధికారిణిగా కనిపించనున్నారు. చదవండి: ట్రోల్స్: మగాడిలా ఉన్నానని కామెంట్ చేశారు ‘క్లైమాక్స్ చూసి అమ్మ ఏడ్చేసింది’ -
‘క్లైమాక్స్ చూసి అమ్మ ఏడ్చేసింది’
ముంబై: ఎప్పుడూ చీరకట్టులో నిండుగా కనిపించే విద్యాబాలన్.. ‘డర్టీ పిక్చర్’ వంటి సినిమా చేస్తారని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. విద్య సైతం ఇలాగే అనుకున్నారట. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఆ కథతో తన దగ్గరికి వచ్చినపుడు ఆశ్చర్యపోయారట. అయితే ఆర్టిస్టుగా తనపై ఉన్న తనకు ఉన్న నమ్మకంతో ఓకే చేశారట. ఆమె నమ్మకం నిజమైంది. ‘సిల్క్’ స్మిత పాత్రలో జీవించిన విద్య నటనా కౌశల్యానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. నిర్మాతపై కాసుల వర్షం కురిపించారు. 2011లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేగాక, విద్యకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, సిల్క్‌గా విద్యను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు గానీ, మరి ఆమె కుటుంబ సభ్యులు ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఎలా స్పందిస్తారోనన్న అంశం తన మనసును మెలిపెట్టిందట. ఈ విషయాల గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన విద్యా బాలన్.. ‘‘మనం చేసే పని సరైందే అయితే కచ్చితంగా మనకు మద్దతు లభిస్తుంది. మీకొక విషయం చెబుతాను. డర్టీ పిక్చర్ స్క్రీనింగ్ జరుగుతున్నపుడు, మా అమ్మానాన్న ఎలా స్పందిస్తారోనన్న భయం వెంటాడింది. కానీ సినిమా చూసి బయటకు రాగానే నాన్న చప్పట్లు కొట్టారు. ‘‘ఈ సినిమాలో ఎక్కడా నా కూతురు కనిపించనేలేదు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ అయితే క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంది. తెర మీద నా పాత్ర చనిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. నిజానికి, సెక్సీగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి ఒక సన్నని గీత ఉంటుంది. ఏదైమేనా ఆర్టిస్టుగా నాలోని భిన్న కోణాన్ని పరిచయం చేసేందుకు అవకాశం ఇచ్చిన డర్టీ పిక్చర్ టీంకు ధన్యవాదాలు’’అని విద్యా బాలన్ గత జ్ఞాపకాలు పంచుకున్నారు. చదవండి: ఫోటోలకు ఫోజులు.. బ్యాలెన్స్ తప్పిన కృతి! -
ఆ పాత్ర నాది కాదు : విద్యాబాలన్
ముంబై: బాలీవుడ్ నటి విద్యాబాలన్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. శుక్రవారం(జనవరి 1) ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త సంవత్సరం రోజునే ఆమె పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో విద్యాబాలన్ బాలీవుడ్ వెండితెరపై కనిపించారు. దానికంటే ముందు విద్యాబాలన్ బుల్లితెరపై ‘హమ్ పాంచ్’ సిరీయల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రారంభమైన ఏడాది తర్వాత విద్యాబాలన్ అందులో నటించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ‘నేను హమ్ పాంచ్ ప్రారంభమైన ఏడాది తర్వాత సీరియల్లో నటించాను. వాస్తవానికి ఇందులో మొదట నటి అమితా నంగియా లీడ్‌రోల్ రాధిక మాథూర్ పాత్ర పోషించారు. ఈ సీరియల్‌కు మా అమ్మ పెద్ద అభిమాని. అయితే ఏడాది తర్వాత నంగియా స్థానంలో నటించాలని సీరియల్ నిర్మాత ఏక్తా కపూర్ నన్ను సంప్రదించడంతో ఇందులో నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే ఈ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. అయినప్పటికీ హమ్ పాంచ్ అభిమానులు, మిగతా తారగణం అంతా నన్ను స్వాగతించారు. నేను రెండు యాడ్ ఫిల్మ్స్ చేస్తున్న సమయంలో మా అమ్మ హమ్ పాంచ్‌లో రాధిక వంటి క్యారెక్టర్లో నన్ను చూడాలని ఎప్పడూ అంటుండేది. కొన్ని రోజులకు హామ్ పాంచ్‌లో రాధిక మాథుర్ పాత్ర చేయాలనుకుంటున్నారా అని ఏక్తా నాకు ఫోన్ చేసి అడగడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. ఒక్కసారిగా ఎగిరి గంతేయాలన్న సంతోషం వచ్చింది. కానీ ఏక్తాతో కాల్ మాట్లాడుతున్నందున వినయంగా ఆమెకు తప్పకుండా అని సమాధానం ఇచ్చాను’ అని చెప్పారు. ఈ సీరియల్లో నటించిన భైరవి, షోమా, వందనాలు నా వయస్సు వారే అయినప్పటికి నటనలో వారికి నాకంటే చాలా అనుభవం ఉంది. దీంతో వారితో ఉన్న చేసే సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కాగా విద్యాతో పాటు ‘హమ్ పాంచ్’లో షోమా ఆనంద్, భైరవి రైచురియా, వందన పథక్, అశోక్ సారాఫ్ కూడా నటించారు నటించారు. ఈ సీరియల్ 1995 నుంచి 2006 వరకు ప్రసారం అయ్యింది. -
విద్యా సాయం
విద్య విలువ గురించి విద్యా బాలన్ ఎప్పుడూ చెబుతుంటారు. చెప్పడమే కాదు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పిల్లలకు సహాయం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి మరో మంచి ప్రయత్నం చేశారు విద్యా బాలన్. దీనికోసం తన చీరను వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు ఢిల్లీకి చెందిన ఓ కమ్యూనిటీ లైబ్రరీకి అందుతుంది. పరిధులను విస్తరించే పుస్తకాలు, అవగాహన కలిగించే పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు ఈ ఉచిత లైబ్రరీ అవి సమకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో లైబ్రరీకి నిధుల కొరత ఏర్పడటంతో విద్యా బాలన్లాంటి కొందరు ప్రముఖులను నిర్వాహకులు సంప్రదించారు. వేలం వేయడానికి ఏదైనా వ్యక్తిగత వస్తువు ఇవ్వాల్సిందిగా విద్యాని నిర్వాహకులు కోరగా, తన చీరను ఇచ్చారామె. ‘‘నాకు చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ‘ప్యూర్ టస్సర్’ చీరను ఇచ్చాను’’ అన్నారు విద్యా బాలన్. ఇంకా మాట్లాడుతూ– ‘‘పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. తరగతి గదిలో మనం నేర్చుకున్నవన్నీ గొప్ప పాఠాలే. తరగతి గది బయట మనం కలిసే వ్యక్తులు, వాళ్లతో మాట్లాడినప్పుడు తెలుసుకునే విషయాలు, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం ఇవన్నీ మనకు వెలకట్టలేని జీవిత పాఠాలు అవుతాయి. ఇక లైబ్రరీకి వెళితే ప్రపంచాన్ని మరచిపోవచ్చు. లైబ్రరీలో ఉండే సౌలభ్యమే అది. మన దేశంలో ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలి. కానీ దానికి చాలా నిధులు కావాలి. నా వంతుగా నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది’’ అన్నారు. -
విద్యా బాలన్ని డిన్నర్‌కి పిలవలేదు : మంత్రి
విద్యా బాలన్ని తాను డిన్నర్‌కి పిలవలేదని, వాళ్లే తనను ఆహ్వానిస్తే వీలుకాక పోలేదని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా స్పష్టం చేశారు. తన వాళ్ల షూటింగ్ ఆగిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ‘షేర్నీ’ షూటింగ్ నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చిన బాలివుడ్ నటి విద్యా బాలన్ని మంత్రి విజయ్ షా డిన్నర్‌కు ఆహ్వానిస్తే ఆమె నిరాకరించారని, దీంతో షూటింగ్‌కి అనుమతి ఇవ్వకుండా చిత్ర యూనిట్‌ని మంత్రి ఇబ్బందులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్ ఈ వార్తలపై వివరణ ఇచ్చారు. మంత్రి విజయ్ షా ‘షేర్నీ’ చిత్ర యూనిట్ బాలాఘాట్‌లో షూటింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. నన్ను డిన్నర్‌కు రమ్మని ఆహ్వానించారు. ఇప్పట్లో సాధ్యం కాదని, మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పాను. దీంతో డిన్నర్ ఏర్పాట్లు ఆగిపోయాయి. అంతే కానీ సినిమా షూటింగ్ మాత్రం ఆగిపోలేదు. అడవిశాఖ అధికారులు చిత్ర యూనిట్ వాహనాలకు అనుమతి నిరాకరించారనేది అవాస్తవం’ అని మంత్రి విజయ్ పేర్కొన్నారు. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందట. -
అడవుల్లో యాక్షన్
తాజా చిత్రం కోసం పవర్ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా మారారు విద్యా బాలన్. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందని టాక్. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొనబోతున్నారట విద్యా బాలన్. సినిమా పూర్తయ్యేంతవరకూ షూటింగ్ చేయాలని ప్లాన్ చేసిందట చిత్రబృందం. -
మరీ అంత దరిద్రంగా లేను: హీరోయిన్
ఫొటో చూస్తుంటేనే తెలుస్తోంది ఇది ఎన్నో ఏళ్ల క్రితం నాటిదని. కానీ మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారు. కాకపోతే ఆ పక్కన ఉన్న అమ్మాయి మాత్రం ఇప్పుడు కాస్త బొద్దుగా, ముద్దుగా మారిపోయింది. ఇంతకీ ఆమెవరనుకుంటున్నారు, బాలీవుడ్లో తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ విద్యాబాలన్. మలయాళంలో ఆమె నటించిన తొలి చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది. దీన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. (బరువు తగ్గాలమ్మాయ్ అన్నారు!) "అది 2000 సంవత్సరం. నేను మోహన్‌లాల్‌తో కలిసి నటించిన తొలి మలయాళ చిత్రం చక్రం షూటింగ్ సమయంలో దిగిన ఫొటో ఇది. కానీ మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.. చూస్తుంటే ఈ ఫొటోలో నేను అనుకున్నంత దరిద్రంగా ఏమీ లేను" అని విద్యాబాలన్ రాసుకొచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విద్యాబాలన్ 'భాలో టేకో' అనే బెంగాలీ చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు, అంటే 2005లో నవల ఆధారంగా నిర్మితమైన 'పరిణీత' చిత్రంలో నటించేందుకు సంతకం చేశారు. ఆ తర్వాత పలు భాషల్లో నటిస్తూ గొప్ప నటిగా ఎదిగారు. ఆమె చివరిసారిగా మహిళా ప్రధాన చిత్రం 'శకుంతల దేవి'లో నటించారు. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచే కాక విమర్శకుల నుంచి కూడా మెప్పును పొందింది. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట'లో హీరో అక్క క్యారెక్టర్ కోసం విద్యాబాలన్‌ను సంప్రదించారని సమాచారం. (ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?) -
పర్వీన్ బాబీ జీవిత చరిత్రపై విద్యాబాలన్ చూపు
ముంబై: గణిత మేధావి శకుంతల దేవి బయోపిక్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటన అందరిని అలరించింది. ఈ నేపథ్యంలో బయోపిక్‌లపై విద్యాబాలన్ ఆసక్తి చూపుతోంది. కాగా మాజీ బాలీవుడ్ నటి పరవీన్ బాబీ జీవీత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని జర్నలిస్ట్ కరీష్మా బాయ్ ఇటీవల విడుదల చేశారు. కాగా పరవీన్ బాబీ 2005సంవత్సరంలో మరణించారు. పరవీన్ జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, మలుపులు, ఆరోగ్య సమస్యలు తదితర విభిన్న సంఘటనలతో బయోపిక్కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. పర్వీన్ బాబీ గురించి జర్నలిస్ట్ కరీష్మా చెబుతూ.. పర్వీన్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆమె సినిమా కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు, ఓ ఆధ్యాత్మిక గురువు ఆమెను సినిమాలో నటించవద్దని చెప్పడం లాంటి ట్వీస్ట్‌లు ఆమె జీవితంలో అనేకం ఉన్నాయి. కాగా, నటి పరవీన్ను గొప్ప నటి అంటూ విద్యాబాలన్ కొనియాడారు. అయితే, పర్వీన్ బాబీ జీవిత చరిత్రను బమోపిక్గా రూపొందించడానికి విద్యాబాలన్ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. -
తగ్గాలమ్మాయ్ అన్నారు!
‘‘నేను కొబ్బరిబొండంలా గుండ్రంగా ఉండను, కొంచెం లావుగా ఉంటాను.. అంతే. అలా ఉండటంవల్ల నాకే మాత్రం ఇబ్బందిలేదు’’ అంటున్నారు విద్యా బాలన్. నేటి తరం కథానాయికలతో పోల్చితే విద్యాబాలన్ కొంచెం బొద్దుగానే ఉంటారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండటం వల్ల అందరూ వచ్చి నా బుగ్గలు పట్టుకుని లాగేవారు. చాలా ముద్దుగా ఉన్నావని అనేవారు. అయితే వయసు పెరిగేకొద్దీ ‘తగ్గాలమ్మాయ్’ అనే మాటలు మొదలయ్యాయి. ‘నీ ముఖం చాలా అందంగా ఉంది. కానీ కొంచెం లావు తగ్గితే బావుంటుంది కదా’ అనేవారు. ‘ఏం.. మీకు బుర్ర పెరగలేదా?’ అని వాళ్లను అడగాలనిపించేది. కానీ టీనేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అబ్బాయిల నుంచి కాస్త అటెన్షన్ కోరుకుంటాం. అది లేనప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్‌ను, బాధను మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో లావు గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. లావు తగ్గాలని చాలా పిచ్చి పనులు చేశాను. రోజుకు పది లీటర్లు నీళ్లు తాగితే సన్నబడతావని చెబితే, తాగడం మొదలుపెట్టాను. కొన్ని వారాల తర్వాత ఓ రోజు రాత్రి నాకు విపరీతంగా వాంతులు అయ్యాయి. కంగారుపడుతూ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ అడిగితే, పది లీటర్లు నీళ్లు తాగుతున్న విషయం చెప్పాను. ‘నిన్ను నీళ్లు తాగమని చెప్పినవాళ్లకు బుద్ధి లేదు. అలా తాగటం వల్ల ఆహారంలో ఉండే పోషకాలతో పాటు శక్తిని కోల్పోతావు. అందువల్ల అలా చేయకూడదు’ అన్నారు. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా చాలాసార్లు కావాలని బరువు తగ్గాను. కానీ, నా శరీరతత్వం వల్ల మళ్లీ బరువు పెరిగేదాన్ని. దాంతో బరువు మీద దృష్టి పెట్టడం మానేశాను. నేనెప్పుడైతే లావు తగ్గాలనుకోలేదో అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నాను. మనలో చాలామంది మన శరీరాన్ని తిట్టుకుంటూ బతుకుతాం. కానీ మన శరీరమే మనకి గుర్తింపును ఇస్తుందనేది గ్రహించలేం’’ అన్నారు విద్యాబాలన్. -
సోషల్ మీడియాలో విద్యాబాలన్ మార్కులు..
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు తమ వ్యక్తిగత అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన పదవ తరగతి మార్కులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే తాను చదువులో జీనియస్‌ను కాదని, కానీ సంతృప్తికర మార్కులు వచ్చేవని తెలిపింది. తన పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 150 మార్కులకు గాను 125మార్కులు వచ్చావని, అన్ని సబ్జెక్ట్‌లను కలిపి పదవ తరగతిలో 82.42శాతం మార్కులు సాధించానని పేర్కొంది. మరోవైపు విద్యాబాలన్ తాను చూపెట్టినట్లుగానే అభిమానులు మ్యాథ్స్ మార్కులు చూపెట్టాలని సూచించారు. గణిత మేధావి శకుంతులా దేవీ తన గణిత ప్రతిభతో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాధించుకున్నారు. అయితే శకుంతలా దేవి జీవితాన్ని విద్యా బాలన్ గొప్పగా నటిస్తే అంజు మీనన్ దర్శకత్వం సినిమాను విపరీతంగా ఆకర్శించింది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా పాత్రలో విద్యా బాలన్ నటన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. చదవండి: ‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’ -
ఆమె జీవితం ఒక జటిలమైన లెక్క
‘నేను చెట్టును కాను... ఉన్న చోటునే ఉండిపోవడానికి’ ‘ఏ ఊళ్లో అయినా నాలుగు రోజులు దాటితే నాకు బోర్ కొట్టేస్తుంది’ ‘నాకు కాళ్లున్నాయి.. ప్రపంచమంతా చుట్టేయాలని ఉంది’ శకుంతలా దేవిని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. జటిలమైన లెక్కల్ని సెకన్లలో తేల్చేసిన ఈ ‘హ్యూమన్ కంప్యూటర్’ జీవితం కూడా జటిలమైన లెక్క లాంటిదే. కూతురిగా, తల్లిగా, భార్యగా, జీనియస్‌గా ఆమె తన భావోద్వేగాలనే తాను విశ్వసించింది. ఎదుటివారితో ఇది ఘర్షణకు కారణమైంది. ఆమె బయోపిక్ ‘శకుంతలా దేవి’ ఆమె కథను చెబుతోంది. ‘రెండు జడలతో లెక్కలు చేసే’ ఒక భారతీయ జీనియస్‌ను పున:పరిచయం చేస్తుంది. కుటుంబం కూడా భలే స్వార్థపూరితమైనది. ఎవరికైనా ఇంట్లో రెక్కలు మొలిచాయని గ్రహించిన వెంటనే ఇక అన్ని పనులు పక్కన పెట్టి అన్ని బరువులను ఆ మనిషి మీద వేయడానికి చూస్తుంది. ‘శకుంతలా దేవి’ జీవితంలో జరిగింది అదే. కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన మేధ ఆమెకు వచ్చింది. ఆమె మెదడులో గణితానికి సంబంధించిన అద్భుతమైన శక్తి ఏదో నిక్షిప్తమై ఉంది. అది ఆమె ఐదో ఏటనే బయట పడింది. ఆ క్షణం నుంచి ఆమె కుటుంబానికి ఒక ‘సంపాదించే లెక్క’ అయ్యిందే తప్ప ప్రేమను పొందాల్సిన సభ్యురాలు కాకపోయింది. బెంగళూరు పసి మేధావి శకుంతలా దేవి బెంగళూరులోని ఒక సనాతన ఆచారాల కన్నడ కుటుంబంలో పుట్టింది (1929). వాళ్ల నాన్న సర్కస్‌లో పని చేసేవాడు. ట్రిక్స్ చేసేవాడు. శకుంతలా దేవి మూడేళ్ల వయసులో కార్డ్ ట్రిక్స్‌ను గమనించేది. ఐదేళ్ల వయసు వచ్చేసరికి అర్థ్‌మెటిక్స్‌లో అనూహ్యమైన ప్రతిభను కనపరచడం మొదలెట్టింది. రెండు రూపాయల ఫీజు కట్టలేక డ్రాపవుట్ అయిన ఈ పసిపాప ఆ క్షణం నుంచి కుటుంబానికి జీవనాధారం అయ్యింది. తండ్రి ఆ చిన్నారిని వెంట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇప్పించి ఫీజు వసూలు చేసి కుటుంబాన్ని నడిపేవాడు. ఆమెను అతడు మరి స్కూలుకే పంపలేదు. శకుంతలాదేవికి స్కూల్ చదువు ఉండి ఉంటే ఆమె ఏయే సిద్ధాంతాలు కనిపెట్టేదో. కాని ఆమె సాటివారిని అబ్బురపరిచే గణిత యంత్రంగా ఆ మేరకు కుదింపుకు లోనయ్యింది. తోబుట్టువు మరణం తమ ఇళ్లల్లో స్త్రీలు ముఖ్యంగా తన తల్లి బానిసలా పడి ఉండటం, తండ్రిని ఎదిరించి తనను, తన తోబుట్టువులను బాగా చూసుకోలేకపోవడం గురించి శకుంతలాదేవికి జీవితాంతం కంప్లయింట్లు ఉన్నాయి. వికలాంగురాలైన తన పెద్దక్క సరైన వైద్యం చేయించకపోవడం వల్ల మరణించిందనీ, ఇందుకు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని ఆమెకు ఆజన్మాంత ఆగ్రహం కలిగింది. ఆ అక్కతో శకుంతలాదేవికి చాలా అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ పోవడంతో తల్లిదండ్రులతో మానసికంగా ఆమె తెగిపోయింది. అప్పటికే దేశంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందిన శకుంతలా దేవి తన పదిహేనవ ఏట 1944లో లండన్ చేరుకుంది. లండన్ జీవితం శకుంతలా దేవికి ఇంగ్లిష్ రాదు. చదువు లేదు. ఉన్నదల్లా గణిత విద్య. దాంతో ఆమె సర్కసుల్లో పని చేసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంది. కాని రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ లెక్కలు చేయడం ఏమిటని, ఒక వేళ చేసినా అదేదో మేజిక్ లాంటిదే తప్ప మేధస్సు అయి ఉండదని చాలామంది నిరాకరిస్తారు. అప్పుడు పరిచయమైన ఒక స్పానిష్ మిత్రుడు శకుంతలా దేవిని అక్కడి పరిసరాలకు అవసరమైనట్టుగా గ్రూమ్ చేస్తాడు. అక్కడి యూనివర్సిటీలు ఆమెను పరీక్షిస్తాయి. అక్కడి సాధారణ ప్రజలు ఆమెను గుర్తిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా భారతీయ ఆహార్యాన్ని వదలకుండానే చీరలో పొడవైన కురులలో గణిత విద్యలు ప్రదర్శిస్తూ ఆమె విజేతగా నిలిచింది. అనూహ్య ప్రతిభ 95,443,993 క్యూబ్‌రూట్‌ను 457గా ఆమె రెండు సెకన్లలో జవాబు చెప్పింది. 33 అంకెల సంఖ్యను ఇచ్చి దాని సెవెన్త్ రూట్‌ను చెప్పమంటే 40 సెకన్లలో జవాబు చెప్పి చకితులను చేసింది. ఇక 1980 జూన్‌లో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆమెకు రెండు 13 అంకెల సంఖ్యల గుణకారం ఇస్తే 28 సెకెన్లలో జవాబు చెప్పి రికార్డు సాధించింది. గడిచిన శతాబ్దంలోని తేదీలు చెప్తే ఒక్క సెకనులో ఆమె ఆ తేదీన ఆ ఏ వారం వస్తుందో చెప్పేది. కొందరు సైంటిస్ట్‌లు ఉత్సాహం కొద్దీ ఆమె మెదడును పరిశీలించారుగాని ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ మేధ ఆమెకు మాత్రమే సొంతం. బంధాల జటిలత్వం సినిమాలో చూపిన కథ ప్రకారం ఆమెను గ్రూప్ చేసిన స్పానిష్ మిత్రుడు ఆమె లండన్‌లో గుర్తింపు పొందాక ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె కలకత్తాకు చెందిన ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌ను 1960లో పెళ్లి చేసుకుంది. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె జన్మించింది. తన ప్రదర్శనలు, పర్యటనలు ఆపేసి కొంతకాలం శకుంతలాదేవి కలకత్తాలో ఉండిపోయినా ఆమెకు అలా ఉండిపోవడం తీవ్ర అశాంతి కలిగిస్తుంది. భర్త అనుమతితో తిరిగి ప్రపంచ పర్యటన ప్రారంభిస్తుంది గాని కూతురికి దూరమయ్యాననే గిల్ట్ ఉంటుంది. ఆ తర్వాత తనే కూతురిని తీసుకుని భర్తను వదిలి తన వద్దే ఉంచుకుంటుంది. తన తండ్రి తనతో ఎలా వ్యవహరించాడో తాను కూడా కూతురి చదువు వదిలిపెట్టి తనతో పాటు తిప్పుకోవడం భర్త సహించలేకపోతాడు. క్రమంగా ఇది వారి విడాకులకు కారణమవుతుంది. కూతురిని ఎక్కడ కోల్పోతానోనని శకుంతలా దేవి ఆ అమ్మాయిని తండ్రికే చూపక పదేళ్ల పాటు దూరం చేసేస్తుంది. ఇవన్నీ తల్లీకూతుళ్ల మధ్య ఘర్షణకు కారణమవుతాయి. భర్తతో విడాకులు అవుతాయి. ఎన్ని జరిగినా శకుంతలా దేవి రెంటిని గట్టిగా పట్టుకోవడం కనిపిస్తుంది. ఒకటి లెక్కలు. రెండు కూతురు. లెక్కలకు ప్రాణం ఉండదు. ప్రాణం ఉన్న కూతురు ఆమెతో తీవ్ర పెనుగులాటకు దిగుతుంది. ‘నన్ను నా కూతురు ఎప్పుడూ తల్లిలానే చూసింది. నన్నో జీనియస్‌గా చూసి ఉంటే సరిగా అర్థం చేసుకునేది’ అని శకుంతలా దేవి అంటుంది. మరణించే సమయానికి కూతురితో ఆమెకు సయోధ్య కుదరడం ప్రేక్షకులకు ఊరట కలుగుతుంది. శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ గొప్ప ప్రయత్నం ఈ గొప్ప స్త్రీ జీవితాన్ని ఒక స్త్రీ అయిన విద్యా బాలన్ గొప్పగా అభినయిస్తే మరో స్త్రీ అయిన అంజు మీనన్ గొప్పగా దర్శకత్వం వహించింది. భారత్‌లో, లండన్‌లో ముందు వెనుకలుగా కథ నడుస్తూ శకుంతలా దేవి జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా విద్యా బాలన్ పరిపూర్ణంగా రూపాంతరం చెందింది. ఆమె కాకుండా మరొకరు ఆ పాత్ర అంత బాగా చేయలేరేమో. కొన్ని జీవితాలు రిపీట్ కావు. కాని వాటి నుంచి కొంత నేర్చుకోవచ్చు. శకుంతలా దేవి సినిమాను చూసి స్త్రీలు, పురుషులు విద్యార్థులు తప్పక నేర్చుకుంటారు. అదేమిటనేది వారి వారి వివేచనను బట్టి ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా లభ్యం. – సాక్షి ఫ్యామిలీ -
కూతురితో లెక్క తప్పింది
‘హ్యూమన్ కంప్యూటర్’ శకుంతలాదేవి ఒకకాలంలో దేశంలో బాలికలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చదువుకోవాలనుకున్న చాలామంది ఆడపిల్లలు శకుంతలాదేవిలా లెక్కల్లో టాప్‌గా నిలవాలనుకున్నారు. నిలిచారు కూడా. గణితం మగవారి సబ్జెక్ట్ అని, స్త్రీలు తెలుగో ఇంగ్లిషో బోధించుకోవాలని చాలా ఏళ్లుగా అనుకునేవారు. కాని శకుంతలాదేవి గణిత మేధ ఆ ఆలోచనను మార్చింది. ఆమె ఎవరికీ సాధ్యం కాని లెక్కలను సెకన్లలో తేల్చి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి భారత ప్రతిష్టను పెంచింది. 1929లో బెంగళూరులో జన్మించిన శకుంతలా దేవి తన 83వ ఏట 2013లో మరణించింది ఆమె కథ ఇప్పుడు ‘శకుంతలాదేవి’ పేరుతో నిర్మితమయ్యి అమేజాన్ ప్రైమ్‌లో జూలై 31న విడుదల కానుంది. శకుంతలా దేవిగా విద్యాబాలన్ నటించింది. తాజాగా వెలువడ్డ ట్రయిలర్‌ను బట్టి ఈ సినిమాలో శకుంతలా దేవి ఆమెకు కుమార్తెతో ఉండే ఘర్షణ ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. నిజజీవితంలో శకుంతలాదేవి పరితోష్ బెనర్జీ అనే ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె ఉంది. విడాకుల తర్వాత తండ్రిని కలవనివ్వకుండా పెంచిందనే కూతురి అసంతృప్తి ఈ సినిమాలో కథాంశం గా ఉంది. లెక్కల రంధిలో పడి తనను సరిగా పెంచకపోవడం గురించి కూడా కుమార్తె ఫిర్యాదు చేయడం సినిమాలో కనిపిస్తుంది. ‘నువ్వు ఆర్డినరీ అమ్మలా ఎందుకు ఉండవు?’ అని కూతురు ప్రశ్నిస్తే ‘నేను అమేజింగ్‌గా ఉన్నప్పుడు ఆర్డినరీగా ఎందుకు ఉండమంటావు’ అని శకుంతలాదేవి పాత్ర పోషించిన విద్యాబాలన్ అనడం కనిపిస్తుంది అనుపమ బెనర్జీ ఈ సినిమా ప్రారంభానికి క్లాప్ కొట్టడాన్ని బట్టి ఆమె దృష్టిలోని శకుంతలా దేవిని ఈ సినిమాలో చూడనున్నామని తెలుస్తోంది. సినిమాలో కూతురి పాత్రను ‘దంగల్’ అమ్మాయి సాన్యా మల్హోత్రా పోషించింది. అను మీనన్ ఈ సినిమా దర్శకురాలు.ఏమైనా ఈ సినిమా మరోసారి శకుంతలా దేవి స్ఫూర్తిని ప్రపంచానికి ఇవ్వనుంది. ‘గణితం నా బెస్ట్ ఫ్రెండ్’ అని ఈ సినిమాలో ఆమె చెబుతుంది. అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఒక స్త్రీ మేధను కాకుండా ఆమె గుండెల్లో దాగిన మనోభావాలు ఈ సినిమాలో చూడటానికి దొరుకుతాయని భావించవచ్చు. -
‘నాకు బిడ్డ కావాలి.. భర్త కాదు’
బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అనూ మీనన్ దర్శకత్వం వహించారు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతలా దేవి బాల్యం, హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమె ఎదిగిన క్రమంలో ఎదురైన అనుభవాలు.. ముఖ్యంగా గిన్నిస్‌బుక్ రికార్డు సాధించినప్పటికీ తన కూతురి చేత మంచి తల్లి అనిపించుకోలేకపోయిన సంఘటనలను స్పృశిస్తూ ట్రైలర్ సాగింది.(కథ వింటారా?) ముఖ్యంగా శకుంతలా దేవి వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని అనేక విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆడపిల్లలపై వివక్ష గురించి మాట్లాడే శకుంతలా దేవి.. ‘‘నాకు ఓ బిడ్డ కావాలి. కానీ భర్త కాదు’’ అంటూ కొంటెగా సమాధానం చెప్పడం.. కూతురు పుట్టిన తర్వాత భర్తకు దూరం కావడం, ఈ క్రమంలో గణితశాస్త్రమే సర్వస్వంగా బతికే తల్లిపై ఆమె కూతురు ద్వేషం పెంచుకోవడం వంటి భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. తల్లి నుంచి దూరమైన కూతురు ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధం కావడం, ‘‘నేనెప్పుడూ ఓడిపోను. అది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి’’ అని శకుంతలా దేవి సమాధానం చెప్పడం వంటి సీన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్ శకుంతలా దేవి పాత్రలో మరోసారి తనదైన నటనతో అందరి మనసులు దోచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదల కానుంది. -
‘మనుశర్మకు ఈ శిక్ష సరిపోదు’
సాక్షి, ముంబై: సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికా లాల్ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ విడుదలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ స్పందించారు. ‘ఈ వ్యాఖ్యలు పూర్తిగా నా వ్యక్తిగతం. మనుశర్మకి, అతనిలాంటి నేరాలు చేసే వ్యక్తులకు ఎంత కాలం శిక్ష వేసినా సరిపోదు. దీని గురించే నా మనసులో మెదులుతూ ఉంటుంది. ఏమో తను మంచిగా మారాడేమో.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. తను మంచిగా మారాడనే ఆశిస్తున్నాను’ అన్నారు. జెస్సికా హత్య ఆధారంగా బాలీవుడ్లో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2011లో వచ్చిన ఈ సినిమాలో విద్యాబాలన్ జెస్సికా సోదరి సబ్రినా లాల్ పాత్రలో నటించారు.(కథ వింటారా?) దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలిలోని టామరిండ్ కోర్టు రెస్టారెంట్ బార్లో పనిచేస్తున్న జెస్సికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేశాడు. సమయం మించిపోయిన కారణంగా మద్యం సర్వ్ చేయడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన మనుశర్మ ఆమెను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మను శర్మ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హైకోర్టు 2006 డిసెంబర్లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. -
కథ వింటారా?
‘ఓ మంచి కథ ఉంది. వింటారా?’ అని అడుగుతున్నారు విద్యాబాలన్. ఆ కథ ఆమెకు చాలా నచ్చింది. అందుకే అందరికీ కథ చెప్పాలనుకున్నారు... కాదు కాదు... చూపించాలనుకున్నారు. ఆ కథతో తొలిసారి ఓ షార్ట్ఫిల్మ్లోయాక్ట్ చేయడానికి అంగీకరించారామె. ‘నటఖట్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించడమే కాకుండా నిర్మించారు (రోనీ స్క్రూవాలాతో సంయుక్తంగా) కూడా విద్యా. షాన్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ గత ఏడాదే పూర్తయిందట. త్వరలోనే ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ‘నటఖట్’ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పిల్లాడి తల నిమురుతూ ఆలోచనల్లో నిమగ్నమైన గృహిణిగా విద్యా కనిపిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ కథ వినగానే షార్ట్‌ఫిల్మ్‌ని నేనే నిర్మించాలనుకున్నాను. ఈ కథ నన్నెంత ఆశ్చర్యానికి గురి చేసిందో మిమ్మల్ని కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
ఓటీటీ బాటలో మరో సినిమా
కరోనా దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్డౌన్ ఎప్పడు ఎత్తేస్తారో తెలియదు.. ఒకవేళ ఎత్తేసినా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కొత్త సినిమా షూటింగ్‌ల సంగతి తరువాత.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పటకే పలు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.(పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?) ఈ విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా ప్రకటించారు. ‘‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. చాలా త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మీ ముందుకు రాబోతుంది’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు విద్యా బాలన్. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. (గణిత ఘనాపాటి) ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెకక్కిన సంగతి తెలిసిందే. శకుంతలా దేవి పాత్రలో విద్యా బాలన్ నటించారు. అయితే మే 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నారు.(ఆడపులి) -
కరోనా భయం ఉన్నా..
-
ఆడపులి
విద్యా బాలన్ ఆడపులిలా మారబోతున్నారు. అంటే అంత పవర్‌ఫుల్‌గా అన్నమాట. ‘షేర్నీ’ అనే సినిమాలో ఆమె శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. షేర్నీ అంటే ఆడపులి అని అర్థం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. మర్డర్ 3 (2011), ‘సులేమానీ కీడా’ (2014), ‘న్యూటన్’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించిన అమిత్ మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘న్యూటన్’కి జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 90వ ఆస్కార్ ఆవార్డుల నామినేషన్ ఎంట్రీకి మన దేశం తరఫున ‘న్యూటన్’ వెళ్లింది. ఇప్పుడు ఓ మంచి కథతో అమిత్ ‘షేర్నీ’ని తెరకెక్కించనున్నారట. ‘‘ఈ సినిమాలో నాది మంచి పాత్ర. చాలా థ్రిల్‌గా ఉంది’’ అన్నారు విద్యాబాలన్. -
‘రూ 500 కోట్ల సినిమాతో సత్తా చాటుతాం’
ముంబై : పురుషాధిక్యం కలిగిన సినీ పరిశ్రమలో మహిళల ఇతివృత్తాలతో సినిమాలు వెల్లువెత్తడంపై బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ స్పందించారు. అక్షయ్ కుమార్ వంటి దిగ్గజ స్టార్లు లేకుండానే మహిళా స్టార్లతో ఏదో ఒక రోజు రూ 200 కోట్ల నుంచి రూ 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్‌తో జోడీగా గత ఏడాది విడుదలైన మిషన్ మంగళ్‌లో మహిళా నటులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంలో అందరి పాత్ర ఉన్నా ప్రధానంగా సక్సెస్ ఖిలాడీ ఖాతాలోకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలో మహిళల పాత్రపై విద్యాబాలన్ మాట్లాడుతూ గతంలో మహిళా ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవని, ఇప్పుడు మెయిన్స్ర్టీమ్ కమర్షియల్ చిత్రాల్లో మహిళల చుట్టూ కథ తిరిగే చిత్రాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ కహానీ, తుమ్హరీ సులు, డర్టీ పిక్చర్, బేగం జాన్, పరిణీత వంటి పలు మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో లీడ్ రోల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. -
డాటరాఫ్ శకుంతల
మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన ఇద్దరు కుమార్తెలు గీతా, బబితాల జీవితాల ఆధారంగా మూడేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘దంగల్’. మహావీర్‌గా ఆమిర్ ఖాన్, బబిత పాత్రను సాన్యా మల్హోత్రా చేశారు. ఇప్పుడు ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ సినిమాలో విద్యాబాలన్ కుమార్తెగా నటిస్తున్నారు సాన్య. ఇండియాలో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు గాంచిన గణితవేత్త, రచయిత శకుంతలాదేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. శకుంతలదేవి కూతురు అనుపమా బెనర్జీ పాత్రను సాన్య చేస్తున్నారు. శుక్రవారం సాన్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘దంగల్’ సినిమాలో నా పాత్ర కోసం జుత్తు కత్తిరించుకున్నాను. ఇప్పుడు అనుపమ పాత్ర కోసం కూడా నా జుత్తును కట్ చేసుకోవాల్సి వచ్చింది. పాత్ర కోసం ఇలా మారడం నాకు సంతోషంగానే ఉంది. నిజజీవిత పాత్రలను పోషించేటప్పుడు వారి లుక్‌లోకి మారిపోతే బాగా నటించవచ్చని నా నమ్మకం’’ అన్నారు సాన్య. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
గణిత ఘనాపాటి
ఏదైనా లెక్క కట్టాలంటే వెంటనే కబోర్డ్‌లో ఉన్న క్యాలిక్యులేటర్‌ని వెతుకుతాం. కానీ శకుంతలా దేవికి క్యాలిక్యులేటర్ అక్కర్లేదు. వేళ్లతోనే ఎంత పెద్ద లెక్కైనా వేసేస్తారు. అందుకే ఆమెను గణిత ఘనాపాటి అంటుంటారు. హ్యూమన్ కంప్యూటర్ అన్నట్టు. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విద్యా బాలన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. బాబ్డ్ హెయిర్ కట్‌తో విద్యాబాలన్ కనిపిస్తున్నారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్‌తో జరిగిన రేస్‌లోనూ శకుంతలా దేవియే ఫస్ట్ వచ్చిందనే కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
‘శకుంతలా దేవీ’ మొదలైంది!
కంప్యూటర్ కంటే వేగంగా గణించడం.. మానవ మేధస్సుకు సాధ్యపడనిది లేదని నిరూపించిన శకుంతలా దేవీ జీవతం ఆధారంగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హ్యూమన్ కంప్యూటర్‌గా పేర్గాంచిన శకుంతలా దేవీ పాత్రలో బాలీవుడ్ సంచలన నటి విద్యా బాలన్ నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. ‘శకుంతలా దేవీ’గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ నేడు(సెప్టెంబర్ 16) మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి విద్యాబాలన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్లో విద్యాబాలన్ నెం.1 పొజిషన్లో ఉండగా.. కంప్యూటర్, క్యాలికులేటర్ రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు అను మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
అక్షయ్ కుమార్ కెరీర్లోనే తొలిసారి!
బాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్. కమర్షియల్ జానర్‌ను పక్కన పెట్టి సందేశాత్మక చిత్రాలు చేస్తున్న అక్షయ్ మంచి విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా మిషన్ మంగళ్ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత శాస్త్రవేతల మామ్ ప్రయోగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా బాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి, నిత్య మీనన్, హె.ఆర్.దత్తాత్రేయ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ బాల్కి నిర్మించిన ఈ సినిమాకు జగన్ శక్తి దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. సినిమా విడుదల అయి రోజులవుతున్నా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా, 29 రోజుల్లో 200 కోట్ల మార్క్‌ను అందుకోవటం విశేషం. అంతేకాదు అక్షయ్ కెరీర్ లో 200 కోట్ల క్లబ్ లో చేరిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం. తొలి వారంలోనే 128.16 కోట్లు వసూళు చేసిన 'మిషన్ మంగళ్'.. రెండో వారం 49.95 కోట్లు, మూడో వారం 15.03 కోట్లు, నాలుగో వారం 7.02 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, హోప్ ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది, తనీష్ బాఘ్చి సంగీతమందిచారు. -
వంట నేర్చుకోను
విద్యా బాలన్‌కు వంట రాదు. నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆసక్తి లేని పనులను పనికట్టుకుని చేయడం ఎందుకూ? అంటారామె. 2012లో నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యాబాలన్. పెళ్లయిన వెంటనే విద్యా వాళ్ల అమ్మ ‘ఇప్పుడైనా వంట నేర్చుకో..’ అని సలహా ఇచ్చారట. ‘‘ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను. కావాలంటే వంటవాళ్లను పెట్టుకుంటాను. వాళ్లు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటా. లేదా బయటకు వెళ్లి తింటా. నాకు వంటా వార్పు మీద ఆసక్తి లేదు’ అని తల్లికి బదులిచ్చారు. అది మాత్రమే కాదు.. ‘‘వంట నేర్చుకో అని నాకు చెప్పే బదులు వంట వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఎందుకు చెప్పడం లేదు’ అని తిరిగి ప్రశ్నించారు కూడా. ‘‘వీళ్లు ఈ పని కచ్చితంగా చేయాలి’’ అని తరతరాలుగా వస్తున్న ఈ ఆలోచనా విధానాన్ని నేను పట్టించుకోను. నా భర్త కూడా నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యా బాలన్. -
గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ దాకా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా నటి విద్యాబాలన్ కూడా కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ముఖ్యపాత్రల్లో జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలిరోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి స్టోరీ లైన్ చెప్పాడు. ‘పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం పడుతుంది, రూమ్‌లోకి వెళ్దాం’ అన్నాడు. నేను ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెబితే అతను అంగీకరించలేదు. తీరా హోటల్ రూమ్‌కి వెళ్లగానే ఆ వ్యక్తి రూమ్ తలుపు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. నాకు కోపం రావడంతో తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నన్ను పైకీ, కిందకీ చూస్తూ వెళ్లిపోయాడు’’ అన్నారు. ఈ సందర్భంలో మరో సంఘటనను గుర్తు చేసుకున్నారామె. ‘‘కెరీర్ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినిమా అవకాశాల కోసం ఓ నిర్మాతను కలిశాను. నీది హీరోయిన్ ముఖమేనా? అని ఆ నిర్మాత అన్నారు’’ అని విద్యాబాలన్ పేర్కొన్నారు. -
‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’
విద్యా బాలన్.. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత. లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విద్యనే. నటనతోనే కాక విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు విద్యాబాలన్. అయితే ఈ గుర్తింపు వెనక ఎన్నో అవమానాలు, వేధింపులు, కష్టాలున్నాయంటున్నారు విద్యాబాలన్. అవి ఏంటో ఆమె మాటల్లోనే.. ‘1990 కాలంలో ‘హమ్ పాంచ్’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2003లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘భలో థేకో’తో సినిమాల్లో ప్రవేశించాను. ఈ రెండింటి మధ్య కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. నేను ఎదుర్కొన్న సంఘటనల్లో కొన్ని నేటికి నాకు కళ్లకు కట్టినట్లు గుర్తున్నాయి’ అన్నారు విద్య. ‘చెన్నైలో ఉండగా ఓ సంఘటన చోటు చేసుకుంది. నన్ను కలవడానికి ఓ దర్శకుడు వచ్చాడు. ఎక్కడైనా కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందామన్నాను. అందుకు అతడు అంగీకరించలేదు. హోటల్‌కు వెడదామన్నాడు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో హోటల్‌కి వెళ్లాను. కానీ మేం కూర్చున్న గది తలుపులు మూయడానికి నేను అంగీకరించలేదు. దాంతో ఆ దర్శకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఆ క్షణం నాకు అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఎంతో భయపడ్డాను. మరో చోట ఓ నిర్మాత నాకు తన సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. కానీ ఉన్నట్టుండి నన్ను ఆ సినిమా నుంచి తప్పించాడన్నారు. ఇలాంటి కొన్ని చేదు సంఘటనల తర్వాత 2005లో ‘పరిణీత’ చిత్రంతో విద్య బాలీవుడ్లో ప్రవేశించారు. అక్కడ కూడా ‘లావుగా ఉన్నావ్, ఫ్యాషన్ సెన్స్ లేదు’ అనే విమర్శలు ఎదుర్కొన్నారు విద్య. ఆ తర్వాత వచ్చిన ‘లగే రహో మున్నాభాయ్’, ‘పా’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ చిత్రాలు విద్యలోని నటిని వెలికి తీశాయి. ఆ తర్వాత ‘డర్టీ పిక్చర్’ చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు విద్య. ప్రస్తుతం విద్య నటించిన ‘మిషన్ మంగళ్ చిత్రం’ కూడా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!) -
విద్యావంతురాలు
విద్యాబాలన్ ఈ మధ్య వరుసగా విద్యావంతురాలి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ‘మిషన్ మంగళ్’లో ఇస్రో శాస్త్రవేత్తగా కనిపించిన విద్యా, ప్రస్తుతం ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు పొందిన గణిత ప్రావీణురాలు శకుంతలా దేవి బయోపిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అను మీనన్ దర్శకురాలు. ఈ సినిమాలో తన లుక్ గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘ఈ పాత్రలో బాబ్డ్ హెయిర్ కట్లో కనిపిస్తాను. నా సౌతిండియన్ ఫేస్ కట్ ఈ మ్యాథ్స్ జీనియస్‌కు బాగా మ్యాచ్ అవుతుందనుకుంటున్నాను. శకుంతలగారి 20 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వయసు వరకు అన్ని లుక్స్‌లో కనిపిస్తాను’’ అన్నారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు విద్యా. -
‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు వెబ్ సిరీస్‌ల మీద పడింది. ఇప్పటికే బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దిన్ సిద్ధిఖి వంటి ప్రముఖులు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి తాజాగా విద్యాబాలన్ కూడా చేరారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్‌లో విద్యాబాలన్ నటించనున్నారని సమాచారం. ఈ సిరీస్‌కి విద్యాబాలనే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. దీని గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘ఇందిరా గాంధీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం హక్కులను రెండేళ్ల క్రితమే నేను తీసుకున్నాను. అయితే ఆ సమయంలో నాకు వెబ్ సిరీస్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. సినిమాకు, వెబ్ సిరీస్‌కు చాలా తేడా ఉంది. సినిమాతో పోలీస్తే వెబ్ సిరీస్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందిరా జీ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు కాస్త ఎక్కువ సమయమే కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పలేను కానీ ఏడాది, రెండేళ్లలో ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాను’ అన్నారు విద్యాబాలన్. -
‘మిషన్ మంగళ్’పై కిషన్ రెడ్డి రివ్యూ!
ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్ మంగళ్’ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి దర్శకత్వంలో ఆర్ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్‌తో కలిసి ‘మిషన్ మంగళ్’ ప్రివ్యూ చూడటం అమేజింగ్‌గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. What an interesting way to end a good day! Had an amazing time watching the preview of the movie #MissionMangalyaan along with the movie leads @AkshayKumar, @Sonakshisinha, and other cast & crew members. It's a movie very well shot, to depict the glory of @isro and its success. pic.twitter.com/biSSpRhttD — G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2019 -
విడుదలకు ముందే ఇంటర్నెట్లో..
చెన్నై,పెరంబూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సినీ ప్రేక్షకులను ఎంతగా రంజింపజేస్తుందో, సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజ మాన్యాన్ని ఘోరంగా ముంచేస్తోంది. పైరసీదా రులను ఎవరూ అరికట్టలేని పరిస్థితి. పైరసీదా రులు ఎంత దారుణానికి ఒడికడుతున్నారంటే కొత్త చిత్రం తెరపైకి రాక ముందే అక్రమంగా వెబ్‌సైట్స్‌లో ఆడేస్తున్నాయి. ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చిత్రాలకు వందల మంది శ్రమ, కృషి ఉంటుంది. వందల మంది జీవనం సిని మా. అలాంటి సినిమాను క్షణాల్లో అక్రమంగా దోచుకుంటున్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు ఏం చేయలేని పరిస్థితి. తాజాగా నేర్కొం డ పార్వై చిత్రం అలాంటి అక్రమ దోపిడికే గురైంది. విడుదలకు రెండు రోజుల ముందే. స్టార్ నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం నేర్కొండ పార్వై. నటి విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్, అబిరామి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత భోనీకపూర్ నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇదే. హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ ఇది. హేచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. కాగా మంగళవారం నుంచే చిత్ర ప్రీమియం షోలను ప్రదర్శించారు. విదేశాల్లోనూ విడుదల చేశారు. చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అజిత్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఎక్కడ? ఎవరు? చిత్ర పైరసీకి పాల్పడ్డారో గాని నేర్కొండపార్వై మంగళవారం సాయంత్రమే వెబ్సైట్లలో వైరల్ అవుతోంది. ఇలా విడుదలకు రెండు రోజులు ముందే కొత్త చిత్రం ఇంటర్నెట్లలో ప్రచారం అయితే ఏ ఎగ్జిబిటర్ మాత్రం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ఇష్టపడతాడు? అజిత్ వంటి ప్రముఖ నటుడి చిత్రానికే ఈ గతి అయితే ఇక చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని సినీ వర్గాలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ.. నిర్మాత భోనీకపూర్ నేర్కొండ పార్వై చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులు తమకే చెంది ఉన్యాయని చిత్రాన్ని వెబ్సైట్లలో అక్రమంగా ప్రచారం కాకుండా నిషేధించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నేర్కొండ పార్వై చిత్రాన్ని వెబ్సైట్లలో ప్రచారంపై నిషేధం విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సుమారు 1129 వెబ్‌సైట్స్‌ను మూయించి వేసిం ది. అయినా కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ విడుదలకు రెండు రోజుల ముందే నేర్కొండ పార్వై చిత్రం వెబ్‌సైట్స్‌లో విడుదలైంది. -
ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!
‘పరిణీత’ సినిమాతో 2005లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విద్యా బాలన్.. తన 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2011లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా విద్యాబాలన్ నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యతోపాటు తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మాన్ జోషి, నిత్యా మీనన్, కృతి కుల్హారీ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఓ విలేకరి విద్యా బాలన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి విద్యా స్పందిస్తూ.. అవార్డుల గురించి నేను ఆలోచించనని బదులివ్వగా.. వెంటనే అక్షయ్ కలగజేసుకుంటూ.. తను అబద్ధం చెప్తోందన్నారు. ‘ఈమె పుట్టగానే.. జాతీయ అవార్డు వచ్చిందంటూ కుటుంబసభ్యులకు నర్సు శుభాకాంక్షలు చెప్పింది’ అంటూ అక్షయ్ ఛలోక్తి విసిరారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. -
పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ టుక్‌టాక్ చేసింది. టిక్‌టాక్ అనుకుంటే పొరపాటు... తను నిజంగా టుక్టాకే చేసింది. సరదాగా టుక్‌టాక్ అనే ట్యాగ్‌తో తాను చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో బెంగుళూరు బ్యూటీ విద్యాబాలన్ ఎరుపు రంగు చీరలో కనిపిస్తారు. ఈ వీడియోలో విద్యాబాలన్ పండితుని వాయిస్‌ను అనుకరిస్తూ .. ‘శాస్త్రాల ప్రకారం ప్రతీ అమ్మాయిలో దేవీ రూపాలు ఉంటాయి. కాకపోతే పెళ్లి అయ్యాక ఏ అమ్మవారు వారిలో నుంచి బయటకు వస్తారనేది మాత్రం భర్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది’ అని చెబుతుంది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు. కాగా విద్యాబాలన్ తాజా సినిమా మిషన్ మంగళ ఆగస్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్తల గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఒకపైపు ఆలోచింపజేస్తూనే మరోవైపు వినోదాన్ని అందిస్తుందని ఈ మూవీ హీరో అక్షయ్ కుమార్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే..! View this post on Instagram Some Tak-Tuk Time Passsssssss 🤪🤪🤪🤪🤪🤪🤪! A post shared by Vidya Balan (@balanvidya) on Jul 17, 2019 at 4:55am PDT -
కోలీవుడ్‌లో విద్యాబాలన్‌కు అవమానం!
తమిళసినిమా: నవ్విన నాప చేనే పండుతుందన్న సామెత తెలిసిందే. దీన్ని ఎందరో నిరూపించి చూపించారు. అలాంటి వారిలో నటి విద్యాబాలన్ ఒకరని చెప్పక తప్పదు. ఈ బెంగళూర్ బ్యూటీ ఆదిలో చాలా అవమానాలను ఎదుర్కొంది. నిజానికి విద్యాబాలన్ నటిగా ముందు కోలీవుడ్‌లోనే పరిచయం కావలసింది. అయితే లావు, రంగు వంకతో నువ్వు నటిగా పనికిరావు అని నిరుత్సాహపరచడంతో దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న విద్యాబాలన్ బాలీవుడ్లో పాగా వేసి కథానాయకిగా అవకాశాలను సంపాదించుకుంది. జాతీయ ఉత్తమనటి అవార్డును కూడా అందుకున్న విద్యాబాలన్ గురించి ఇప్పుడు భారతీయ సినిమానే గొప్పగా చెప్పుకుంటోంది. ఆ మధ్య మణిరత్నం దర్శకత్వంలో గురు చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. ఇకపోతే ఇటీవల టాలీవుడ్లో ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ సరసన నటించిన ఈమె తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను సుదీర్ఘకాలం తరువాత నేర్కొండ పార్వై చిత్రంతో పలకరించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటుడు అజిత్‌కు జంటగా గౌరవ పాత్రలో నటించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ పింక్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి విద్యాబాలన్ ఒక భేటీలో పేర్కొంటూ ఎవరి శరీర బరువు, ఛాయల గురించి పరిహాసించరాదని అంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. తాను సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు చాలా మంది తనను అవమానించేలా మాట్లాడారని చెప్పింది.అలాంటి చర్యలు తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాయని చెప్పింది. బరువు, రంగు వంటివి మనిషి సాధనకు ఎంత మాత్రం కారణం కావన్నది పరిహాసం చేసే వారు తెలుసుకోవాలని నటి విద్యాబాలన్ హితవు పలికింది. -
హ్యూమన్ కంప్యూటర్
ఎలాంటి మేథమేటిక్స్‌నైనా చిటికెలో సాల్వ్ చేయగలనని చాలెంజ్ చేస్తున్నారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. అందులోనూ తాను అరిథ్‌మెటిక్స్ ఫేవరెట్ అంటున్నారు. విద్యాబాలన్ సడన్‌గా లెక్కల వైపు ఎందుకు వెళ్లారనేగా మీ సందేహం? ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ నటించబోతున్నారు. గణితశాస్త్త్రంపై ఎన్నో పుస్తకాలు, రచనలు చేసిన శకుంతలాదేవికి ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా ‘లండన్ ప్యారిస్ న్యూయార్క్’ చిత్రదర్శకుడు అనూ మీనన్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. దానిని విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ‘ ‘హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవిగా పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె ఎంతో ఖ్యాతిని గడించారు. ఫెమినిస్ట్‌గా తన గొంతును వినిపించారు’’ అన్నారు విద్యాబాలన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. శకుంతలాదేవి ఐదేళ్ల వయసులోనే పద్దెనిమిదేళ్ల స్టూడెంట్ చేయగలిగిన లెక్కలను సాల్వ్ చేసేవారట. గిన్నిస్ బుక్‌లో చోటు కూడా సంపాదించారామె. కేవలం మ్యాథమేటిషియన్గా మాత్రమే కాదు. ఆస్ట్రాలాజీ, వంటలు, నవలా రచనలు కూడా చేశారామె. ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్’ అనే బుక్ కూడా రాశారు శకుంతల. 83 ఏళ్ల వయసులో 2013 ఏప్రిల్‌లో శకుంతలాదేవి కన్నుమూశారు. -
శకుంతలా దేవిగా విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరో బయోపిక్కు ఓకె చెప్పారు. స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న విద్య, తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తరువాత కూడా నటిగా కొనసాగుతున్న ఈ భామ ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. తాజాగా మరో చాలెంజింగ్ రోల్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో అధికారికంగా ప్రకటించారు. అను మీనన్ దర్శకత్వంలో, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. BIG DAY 🌞! Excited to play the role of Math Genius, #ShakuntalaDevi. @vikramix @anumenon1805 and I are thrilled to bring to life the true story of 'the human computer' - a small-town Indian girl, who took the world by storm! @Abundantia_Ent In theatres - Summer 2020 pic.twitter.com/LSCipkhwir — vidya balan (@vidya_balan) 8 May 2019 -
హెల్త్ జీరో కాకూడదు
నాజూకు రాణులు సన్నజాజుల్లా ఉండాలట.వాళ్ల బరువు ఏడు మల్లెల ఎత్తు తూగాలట.కానీ... ఇక్కడో అందమైన, ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మాట కూడా ఉంది.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని ఓ వాడుక. అంటే మరి... చిక్కిపోకుండా బొద్దుగా ఉంటేనో? అప్పుడామె ఇంకా మరింత అందంగా ఉందనే కదా అర్థం!అన్నట్టు ఒక్కమాట...సైజ్ జీరో అయితే హెల్త్ కూడా జీరో కావచ్చు. హెల్త్ జీరో అయితే జీవితమూ జీరో కావచ్చు. హెల్త్ కొరవడిన లైఫ్ హెల్ అనిపించవచ్చు.అందుకే సన్నబడినా, కండపట్టినాఆరోగ్యానికి మించిన అందం లేదని గ్రహించాలి.అటు ఆ ఏడుమల్లెలూ, సన్నజాజులే కాదు...ఇటు ఈ బొండుమల్లెలూ, ముద్దబంతులూ ఇచ్చే‘అందమైన’ సందేశం ఇదే! ‘‘ఆద్యా.. ఏంటమ్మా ఇది? ఏమీ తినకుండానే చేయి కడుక్కుంటున్నావ్?’’ కంచంలో వడ్డించిన భోజనం వడ్డించినట్టే వదిలేసిన ఆరేళ్ల మనవరాలిని మందలించింది అమ్మమ్మ.‘‘అమ్మో.. కర్రీస్‌లో ఎంత ఆయిల్ ఉందో?’’ భయంతో కళ్లింత చేసుకొని జవాబిచ్చింది ఆద్యా.‘‘ఏయ్ వేషాలా? ఎక్కడుందే ఆయిల్?’’ గద్దించింది ఆద్యా పిన్ని.‘‘అంతంత ఆయిల్ తింటే రోడ్డు రోలర్లా తయారవుతారు. నేను కంగనా రనౌత్‌లా ఉండాలి’’ .. కళ్లు, చేతులు, నడుము తిప్పుకుంటూ ఆ పిల్ల.అక్కడున్న పెద్దవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంకానయం.. ఆరేళ్ల వయసులో ఆద్యా ఆ మాటలు మాట్లాడుతోంది.ఆ పిల్ల మేనత్త కూతురు.. నాలుగేళ్ల పసికూనకైతే బార్బీడాలే రోల్ మోడల్!విస్మయం చెందాల్సిన విషయమే. జీరో సైజ్.. ప్రభావం!తెల్లటి ఛాయే అందం అనే భ్రమను ‘నిజం’గా ఎలా నమ్మించారో.. బ్యూటీ అంటే జీరోసైజే అనే పిచ్చినీ అంతే ‘వాస్తవం’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మ్యాగజైన్లు, పత్రికలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, కథనాలు, కథలు, సీరియళ్లు.. అన్నీ ఆ అతి నాజూకుతనానికే కిరీటం పెట్టాయి. అందం అంటే తెల్లటి రంగుతో.. 36–24–36 శరీర కొలతలు కాదు మొర్రో.. అందం అంటే ఆరోగ్యంతో ఉన్న ఆత్మవిశ్వాసమని ఇవే పత్రికల్లో మానసిక విశ్లేషకులు, వైద్యులు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా కమర్షియల్ యాడ్స్ మాయలో.. హోరులో వినట్లేదు.. చూడట్లేదు!శారీరక వ్యాయామం లేకుండా డైట్‌తో ఫలానా రోజుల్లోగా ఫలానా అన్ని కేజీలు తగ్గుతారు.. మేము గ్యారెంటీ అంటూ.. ‘డైట్‌కి ముందు.. తర్వాత’ అని ఫోటోలు వేసి మరీ నిలబెట్టిన హోర్డింగులు చూసి.. క్యూ కడ్తున్నారు. సన్నబడ్డమేమో గానీ.. నీరసించి ఆసుపత్రి పాలైన టీనేజ్ అమ్మాయిలు కళ్లముందే కనిపిస్తున్నా! సన్నజాజి.. ముద్దబంతి వెనకట.. ‘‘ఆ అమ్మాయి చూడు.. సన్నజాజి తీగలా ఎంత నాజూగ్గా ఉందో?’’ అని అన్నవాళ్లే కాస్త బొద్దుగా కనిపించిన ఆడపిల్లను చూసి‘‘ముద్దబంతి పువ్వు’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు. అంటే అందం.. మనిషి మనిషికీ మారినట్టే కదా! సన్నజాజి తీగను, ముద్దబంతినీ అభినందించారు అంటే ఆరోగ్యాన్ని.. దానిద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టు కదా! కండ కలవాడే (కలది కూడా) మనిషని గురజాడ కూడా సెలవిచ్చాడు. మనిషి మనిషికీ ఒంటితీరు మారుతుంది. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ల బరువు ఉండాలి. కష్టే ఫలి. చెమటోడ్చే శ్రమే ఆరోగ్య సూత్రం. అందుకే జీరో సైజ్ అబ్సేషన్గా మారిన తరాన్ని ఆ వెర్రిలోంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నాలే మొదలయ్యాయిప్పుడు. ధమ్ లగాకే హైష్షా..! జీరో సైజ్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వెలిగిందీ.. అందులో ఆరోగ్యం జీరో అని చాటిందీ సినిమా స్టార్సే.. సినిమాలే అయినా ఇప్పడు తూచ్ అంటోందీ అవే.. వాళ్లే! కరీనా కపూర్‌తో ఈ తరహా నాజూకుతనం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. జీరో సైజ్ కొలతల్లో ఇమడడానికి కరీనా తీసుకున్న అతి శ్రద్ధ ఆమెను అనారోగ్యం పాలు చేసింది. దాంతో హెల్త్‌ను మించిన గ్లో, ఫేమ్ లేదని అంతే త్వరగా దాంట్లోంచి బయటకు వచ్చింది కరీనా. పాజిటివ్ దృక్పథం, చేస్తున్న పనిపట్ల నిబద్ధత, ప్లస్ పాయింట్స్.. ప్లస్ సైజ్‌ను బీట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదే అందానికి యూనివర్స్ ఇచ్చే నిర్వచనం. బ్యూటీ పేజెంట్స్‌లో క్రౌన్‌ను డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ కూడా వీటికి సంబంధించే ఉంటుంది. ఈ సత్యానికి సినిమాలు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లావుగా ఉన్న భార్యతో బయటకు వెళ్లడానికి సిగ్గుపడే భర్తను రక్షించి ఆత్మవిమర్శలోకి నెట్టిన హీరోయిన్ కథ తెలుగులో ‘కితకితలు’తో ప్రారంభమై.. హిందీలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా వచ్చిన ‘ధమ్ లగాకే ౖహె ష్షా’గా కొనసాగుతోంది. ప్లస్ సైజ్ కథానాయికతో తెలుగులో ‘సైజ్ జీరో’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం కోసం అనుష్క శెట్టి బరువు పెరిగి పాత్రకు ప్రాణం పోసింది. అయినా.. ఆమె పట్ల ప్రేక్షకుల అభిమానం గ్రాము కూడా తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల నటి ఆర్. వరలక్ష్మి (ఆర్. శరత్ కుమార్ కూతురు), బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎట్సెట్రా.. నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు తప్ప నాజుకుతనంతో కాదు. పాతకాలంలో సంధ్యా, సావిత్రి, దేవిక, రాజశ్రీ తర్వాత జయచిత్ర లాంటి వారు లేరా.. అంటే ఉన్నారు. స్లిమ్‌గా ఉండే ట్రెండ్‌లో కూడా కాన్ఫిడెన్స్ పాత్‌ను ఎంచుకున్న లేటెస్ట్ హీరోయిన్స్ ఉదాహరణగా చూపించింది.. ఈ తరం కనెక్ట్ అవడం కోసమే. ప్లేబాయ్ టు మాల్స్..! లావుగా ఉండే వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి ప్లస్ సైజ్ మోడల్స్ కూడా వచ్చారు. వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ప్లస్ సైజ్‌లో లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ టాప్ బ్రాండ్స్ వాటికి తమ బ్రాండ్నేమ్నిస్తున్నాయి. మాల్స్‌లో స్పెషల్ స్పేస్ దొరుకుతోంది. ప్లేబాయ్ లాంటి పత్రికలు ప్లస్ సైజ్ మోడల్స్‌ను తమ ముఖచిత్రంగా వేసి స్టీరియో టైప్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ పత్రిక ఫోటోగ్రాఫర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న ఎల్. రామచంద్రన్ ఆ మోడల్స్‌తో ఫోటో షూట్ చేస్తున్నాడు. ‘‘సన్నని మేను, తెల్లటి రంగు అంటూ అందానికి నిర్వచనాలుండవ్. అవి కథల్లో, కవితల్లో మాత్రమే. ఆత్మసౌందర్యమే అసలైన సౌందర్యం’’ అంటాడు ఎల్. రామచంద్రన్. ఆయన ఫోటో షూట్‌కు మోడల్‌గా పనిచేసిన అక్షయ నవనీతన్.. టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పలు టీవీ షోలకు యాంకర్ కూడా. ఎల్.రామచంద్రన్ ఫోటో షూట్లో ఆమె గుండు చేయించుకుని (క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ బాధితలకు సంఘీభావంగా) కూడా పాల్గొన్నారు. ‘‘బాడీ షేమింగ్‌ను బ్రేక్ చేయడానికి విజువల్ ఆర్ట్‌ను మించిన మీడియం లేదు’’ అంటాడాయన.క్లారిటీ, సింప్లిసిటీ, స్ట్రెంత్.. సెల్ఫ్కాన్ఫిడెన్స్కు గ్రామర్.. గ్లామర్! దీన్ని మించిన అందం ఏం ఉంటుంది? ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తుల జీవితాలను చదివినా.. ఈ సామాన్య లక్షణాలే కనిపిస్తాయి! – సరస్వతి రమ అన్కండిషనల్గా ప్రేమించుకోవాలి మనమంటే హోల్ ప్యాకేజ్.. దాన్ని మొత్తంగా చూడగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్ కండిషనల్‌గా. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. చేసుకోవాలి కూడా. అలాగని అప్పియరెన్స్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి.. అదీ ఓ భ్రమ కోసం మనల్ని మనం హింసించుకోవడం తప్పు. మోడల్స్‌ను రోల్ మోడల్స్‌గా తీసుకోకూడదు. వాళ్ల ఫోటోలు.. షూట్స్‌ను చూసి మనం ఫోలో కావద్దు. కారణం.. అవన్నీ ఎడిట్, గ్రాఫిక్‌ల గిమ్మిక్కులు. ఆరోగ్యం కోసం, ఒబేసిటీతో బాధపడ్తున్న వాళ్లు సన్నబడాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం కూడా. కాని అందం కోసం.. అదీ స్పెసిఫిక్‌గా జీరో సైజ్ ఫ్రేమ్‌లోకి రావాలని తాపయత్రయ పడడం మాత్రం ప్రమాదమే. దీనివల్ల శారీరకంగానే కాదు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఎప్పుడైనా .. ఎక్కడైనా సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది. – డాక్టర్ పద్మాపాల్వాయి, సీనియర్ సైకియాట్రస్ట్ -
‘18 ఏళ్లకే నాకు ఫ్రీడం దొరికింది’
ప్రతీ ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది జీవితంలో అత్యంత ముఖ్యమని బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అన్నారు. తనకు పద్దెనిమిదేళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని.. అయితే తానెప్పుడు దానిని దుర్వినియోగం చేయలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ రేడియో షోలో సోనమ్ మాట్లాడుతూ.. ‘ అందరు భారతీయ పిల్లల్లాగే నాకు కూడా 18 ఏళ్లకే నా తల్లిదండ్రులు ఆర్థికంగా నాకు స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా ప్రతీ విషయంలో నాకు నేనుగా సలహాలు తీసుకునేలా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. తప్పో ఒప్పో సొంత నిర్ణయాలు తీసుకున్నపుడే వ్యక్తిగా పరిణతి చెందుతారని మా నాన్న చెబుతూ ఉంటారు. అయితే నేనెప్పుడు ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు’ అని పేర్కొన్నారు. తన తండ్రిలాగే ప్రతీ తండ్రి తమ బిడ్డలకు సొంతంగా ఎదిగే స్వేచ్ఛనివ్వాలని, అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయాలు గౌరవిస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని సోనమ్ సూచించారు. కాగా 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు సోనమ్. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటూ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ దేఖా తో ఐసా లగా’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాలో సోనమ్ లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం జోయా ఫ్యాక్టర్ సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉన్నారు. -
శ్రీదేవిలా నటించాలంటే గట్స్ ఉండాలి..
ముంబై : క్రేజీ తార సిల్క్ స్మిత పాత్రలో ఒదిగిపోయి బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. ఇటీవలే ఎన్టీయార్ బయోపిక్‌లో కూడా బసవతారకంగా కనిపించారు. తాజాగా తన అభిమాన నటి కోసం కాస్త కష్టంతో కూడుకున్నదైనా సరే మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు విద్య. తనకు గనుక అవకాశం వస్తే కచ్చితంగా స్వర్గీయ లెజండరీ నటి శ్రీదేవి పాత్రలో జీవించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తా అంటున్నారు. శుక్రవారం ఓ షోకు హాజరైన విద్యా బాలన్ మాట్లాడుతూ... ‘నేను శ్రీదేవి అభిమానిని. తుమ్హారి సులూ సినిమా కోసం శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’లోని ‘హవా హవాయి’ పాటలో నటిస్తున్నపుడు ఉద్వేగానికి లోనయ్యాను. నాకే గనుక శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేస్తా. అయితే అందుకు చాలా ధైర్యం కావాలి. నాకు ఇష్టమైన నటికి నివాళి అర్పించాలంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ అతిలోక సుందరిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇక తన పాత్రల ఎంపిక గురించి అడిగినపుడు... ‘ స్వాభిమానం ఉండాలి, అదే విధంగా మన జీవితంలో ఉన్న ముఖ్య వ్యక్తి మనమే అని భావించాలి. నన్ను అలాగే పెంచారు. అందుకే ఇష్కియా సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకొన్నా అని చెప్పుకొచ్చారు. -
‘యన్‌టిఆర్ మహానాయకుడు’ రివ్యూ
టైటిల్ : యన్.టి.ఆర్ మహానాయకుడు జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్, సచిన్ కేద్కర్ తదితరులు సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన ‘యన్‌టిఆర్ కథానాయకుడు’ దారుణ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘మహానాయకుడు’పై ఆ ప్రభావం పడింది. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ ఉన్నా.. ఈ మూవీపై అంచనాలు మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే .. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో సైతం ఆసక్తి లేనట్టు కనబడుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథ మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. (సాక్షి రివ్యూస్) తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. తన రాజకీయ ప్రచారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. నాదెండ్ల భాస్కర్ రావు ఘటనతో ఫస్ట్ హాఫ్‌ను ముగించగా.. ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం.. మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. సినిమాను ముగించేశారు. నటీనటులు తొలిభాగంలోనే ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా.. బాలయ్య వయసుకు తగ్గ పాత్ర కావడంతో.. ‘ఎన్టీఆర్’లా బాగానే నటించాడు. మరీ ఎన్టీఆర్‌ను మరిపించేంతగా కాకపోయినా.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. (సాక్షి రివ్యూస్) ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌దే అవుతుంది. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూసేశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. ఇక వీరిద్దరిని మినహాయిస్తే.. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ యన్‌టిఆర్ సినీ జీవితం పూల పాన్పులా గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజకీయ అరంగేట్రం.. సాధించిన విజయం.. అటుపై నాదేండ్ల వ్యవహారం.. మళ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి రావడం.. మళ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. అటుపై ‘వెన్నుపోటు’ ఘటన చోటుచేసుకోవడం.. ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్ క్షోభ పడటం.. ఎన్టీఆర్ స్వర్గస్తులు కావడం.. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఎన్టీఆర్ జీవితం. (సాక్షి రివ్యూస్) అయితే ఇవన్నీ ఉన్నది ఉన్నట్లు తీసే సాహసం బాలయ్య ఎలాగూ చేయలేడు. అలా చేయలేకే బయోపిక్ ముసుగులో తమకు నచ్చింది.. మెచ్చింది మాత్రమే తీసి.. కథానాయకుడుతో చేతులు కాల్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన మహానాయకుడు మీద సగటు ప్రేక్షకుడికి కూడా ఎలాంటి ఆసక్తి లేదంటేనే.. ఈ చిత్రాన్ని బాలయ్య ఏవిధంగా తీసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారని అర్థమవుతోంది. అందరూ అనుకున్నట్లే.. ఎన్టీఆర్ జీవితాన్ని మొత్తం చూపించకుండా అసంపూర్తిగా వదిలేశారు. బసవతారకం పాత్రతో సినిమాను చెప్పిస్తూ.. ఆమె మరణంతో మహానాయకుడును ముగించారు. అయితే ఎన్టీఆర్ చివరి ఘట్టం జోలికి పోకుండా నాదెండ్లను విలన్‌గా చూపెట్టి మహానాయకుడు సినిమాను చుట్టేశారు. నాదెండ్ల వ్యవహారంలో బాబు కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్యాన్ని, ఎన్టీఆర్‌ను, టీడీపీని రక్షించినట్లు.. చంద్రబాబే అసలు హీరో అన్నట్లు చూపించారు. ఇక సినిమాలో అక్కడక్కడా భావోద్వేగాలు బాగానే పండాయి. (సాక్షి రివ్యూస్) కీరవాణి తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా లాంటి మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగానే కుదిరాయి. ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటు అంశంపై చర్చలు జరుగుతుండటంతో.. మహానాయకుడులో చూపిన కథ ప్రేక్షకులను అంతగా మెప్పించడం కష్టమే. అయితే ఎన్టీఆర్ మిగిలిన జీవితాన్ని కూడా తెలుసుకోవాలంటే.. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చూడాల్సిందే. మహానాయకుడులో నాదెండ్ల వ్యవహారం కీ రోల్ కాగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు అంశం కీలకం కానుంది. ఈ మూడు చిత్రాలతో తెరపై ఎన్టీఆర్ జీవితగాథ సంపూర్ణంగా చూసినట్టవుతుంది. ప్లస్ పాయింట్స్ : కొన్ని ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ సాగదీత అసంపూర్తి కథ బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ చదవండి : ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
సైంటిస్ట్ వర్ష
ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్ మంగళ్’. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షీ సిన్హా, కీర్తి కుల్హారీ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో సైంటిస్ట్ వర్షా పిళ్లై పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు.‘‘మిషన్ మంగళ్’ సినిమా షూట్లో చివరి రోజు పాల్గొంటున్నాను’’అని ఆదివారం పేర్కొన్నారు నిత్యా మీనన్. జగన్ శక్తి దర్శకుడు. నిత్యా మీనన్‌కు హిందీలో తొలి చిత్రమిది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
ఆ వయసులోనే బాగా ఆస్వాదిస్తారు : విద్యాబాలన్
బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ విద్యాబాలన్ ‘డర్టీపిక్చర్’తో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవ తారకం పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇటీవలె విద్యా బాలన్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వయసు గురించి, ఆ వయస్సులో ఆడవారి ఆలోచనలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరూ అనుకునేట్టుగా.. నలభైల్లోకి వచ్చాక స్త్రీలకు శృంగారంపై ఆసక్తి ఉండదని, దాన్ని ఆస్వాదించలేరని అంటారు కానీ అది నిజం కాదని విద్యాబాలన్ అన్నారు. నిజానికి ఆ వయసులోనే వాటిపై మోజు ఎక్కువ అవుతుందనీ, నలభైల్లో స్త్రీలు ఒత్తిడికి గురికారని, వయసు మీద పడుతున్న కొద్దీ మహిళలు మరింత చలాకీగా, సంతోషంగా కనిపిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇరవైల్లో తన కలలకోసం బతికాననీ, ముప్పైల్లో తన గురించి తాను తెలుసుకున్నాననీ, నలభైల్లో తన జీవితాన్ని ఇష్టపడుతున్నాననీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం విద్యా బాలన్ మిషన్ మంగళ చిత్రంలో నటిస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
రైతులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో, సినిమా పరిశ్రమకు కూడా అంతే పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి మూడ్‌లోనే ఉన్నారు. అందుకే సంక్రాంతి సినిమాల గురించి, సినిమా వాళ్ల సంక్రాంతి గురించి ఈ వారం క్విజ్... 1. 2012, 2013, 2014 వరుసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసిన టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) మహేశ్‌బాబు సి) చిరంజీవి డి) అల్లు అర్జున్ 2. తెలుగు నిర్మాతల్లో ఏ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అన్నారో తెలుసా? ఎ) జీవీజీ రాజు బి) ‘దిల్’ రాజు సి) అర్జున్ రాజు డి) యం.యస్. రాజు 3. ఈ సంక్రాంతికి (2019) విడుదలైన సినిమాల్లో ఏ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమయ్యారో చెప్పుకోండి? ఎ) విద్యాబాలన్ బి) కియరా అద్వానీ సి) శ్రద్ధాకపూర్ డి) కంగనా రనౌత్ 4. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ 2017 సంక్రాంతికి వచ్చారు నాగార్జున. ఆ చిత్రంలో బంగార్రాజు సరసన నటించిన నటి గుర్తున్నారా? ఎ) లావణ్యా త్రిపాఠి బి) రమ్యకృష్ణ సి) అనసూయ డి) అనుష్క 5. తెలుగు వారి పెద్ద పండగ ‘సంక్రాంతి’. ఆ పేరుతో విడుదలైన సినిమాలో తెలుగులో పేరున్న నలుగురు హీరోలు నటించారు. వెంకటేశ్, శ్రీకాం త్, శివబాలాజీలతో పాటు మరో తమ్ముడుగా నటించిన ఆ నటుడెవరో చెప్పండి? (ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాల్లో ఓ ప్రముఖ హీరో) ఎ) శర్వానంద్ బి) తరుణ్ సి) రోహిత్ డి) ఆకాశ్ 6. ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...’ అనే పాట ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) మోహన్‌బాబు బి) హరనాథ్ సి) చంద్రమోహన్ డి) శ్రీధర్ 7. మహేశ్‌బాబు, వెంకటేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) సుకుమార్ సి) కృష్ణవంశీ డి) త్రివిక్రమ్ 8. ‘శతమానం భవతి ’ చిత్రంలోని సంక్రాంతి పాటలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ సందడి చేశారు. ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లు....’ అంటూ సాగే ఆ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 9. ఎన్టీ రామారావును ‘మనదేశం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. వారిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ 1955లో వచ్చిన ఓ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరేంటి? ఎ) మనదేశం బి) షావుకారు సి) సంసారం డి) మిస్సమ్మ 10. 2017 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజైంది. అది ఆయన నటించిన 100వ చిత్రం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమిగా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) రవీనా టాండన్ బి) టబు సి) హేమమాలిని డి) సుస్మితా సేన్ 11. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరు ఈ సినిమా చేశారో తెలుసా ? (ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది) ఎ) 7 ఏళ్లు బి) 8 ఏళ్లు సి) 10 ఏళ్లు డి) 6 ఏళ్లు 12. 2010 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన జూనియర్ యన్టీఆర్ సినిమా పేరేంటో తెలుసా? ( చిన్న క్లూ: ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు) ఎ) అదుర్స్ బి) ఆం్ర«ధావాలా సి) యమదొంగ డి) నరసింహుడు 13. ఈ ప్రముఖ దర్శకుని సినిమా ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలోకి రాలేదు. ఎవరా దర్శకుడు. కొంచెం మెదడుకి పదును పెట్టండి? ఎ) పూరి జగన్నాథ్ బి) వీవీ వినాయక్ సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) సుకుమార్ 14. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు రెండు చిత్రాలు మాత్రమే సంక్రాంతి పందెంలో నిలిచాయి. అందులో ఒకటి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘యోగి’. మరో చిత్రం ఏంటో కనుక్కుందామా? ఎ) వర్షం బి) పౌర్ణమి సి) బిల్లా డి) మున్నా 15. ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’, ‘దీపావళి’ మూడు పండగల పేర్లతో ఉన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కుందామా? ఎ) స్నేహా బి) ఆర్తి అగర్వాల్ సి) సౌందర్య డి) కల్యాణి 16. ‘ఊరంతా సంక్రాంతి’ చిత్రంలో ఇద్దరు పాపులర్ హీరోలు నటించారు. అందులో ఒకరు ఏయన్నార్. మరో హీరో ఎవరు? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) కృష్ణంరాజు డి) నాగార్జున 17. కమల్‌హాసన్ నటించిన ‘మహానది’ చిత్రంలో ‘సంక్రాంతి..సంక్రాంతి...’ అనే హిట్ పాట ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) దేవా సి) ఎస్.ఎ. రాజ్‌కుమార్ డి) కేవీ మహదేవన్ 18. తన మొదటి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలిచిన దర్శకుడెవరో తెలుసా? ఆయన దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) శ్రీను వైట్ల బి) బోయపాటి శ్రీను సి) క్రిష్ డి) శేఖర్ కమ్ముల 19. 2019 సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్ సినిమా విడుదలైంది. ఆ చిత్రం ‘పేట’. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్రిష. మరో హీరోయిన్? ఎ) నయనతార బి) రాధికా ఆప్టే సి) సిమ్రాన్ డి) మీనా 20. సంక్రాంతి అనగానే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు రిలీజవుతాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు మాటల ర^è యిత ఒక్కరే. ఆయనెవరు? ఎ) వక్కంతం వంశీ బి) అబ్బూరి రవి సి) బుర్రా సాయిమాధవ్ డి) యం.రత్నం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (డి) 3) (ఎ) 4) (బి) 5) (ఎ) 6) (ఎ) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (సి) 11) (సి) 12) (ఎ)13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (సి) 19) (సి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
ఆ ఫీలింగ్ కలగలేదు!
ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె నార్త్ వైపు(బాలీవుడ్) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆమె ‘బ్రీత్ 2’ అనే వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన మీరు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో నా షూటింగ్ పూర్తికావొచ్చింది. బ్రీత్ వెబ్‌సిరీస్ ‘బ్రీత్ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్ రోల్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : యన్.టి.ఆర్ కథానాయకుడు జానర్ : బయోపిక్ తారాగణం : బాలకృష్ణ, విద్యాబాలన్, దగ్గుబాటి రాజా, కల్యాణ్ రామ్, రానా, సుమంత్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు మరో మహానటుడి జీవిత కథ వెండితెర మీద అలంరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్.టి.ఆర్ కథానాయకుడు, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగానూ మారుతుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలు యన్.టి.ఆర్ కథానాయకుడు అందుకుందా.? తండ్రి పాత్రలో బాలయ్య మెప్పించాడా..? క్రిష్ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడా..? కథ : ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను చూపించారు. ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా సినీ జీవితంతో కథను మొదలుపెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్ అవుతుంది. రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల పద్దతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయన్ను కలిసేందుకు మద్రాస్ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్ ఎదిగిన తీరు. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. చివరగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగాన్ని ముగించారు. నటీనటులు : సినిమా అంతా ఒక్క ఎన్టీఆర్ పాత్ర చుట్టూనే తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఒక రకంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్ అంతగా ఆకట్టుకునేలా లేదు. నటన పరంగా మాత్రం బాలకృష్ణ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కాస్త వయసైన పాత్రలో బాలయ్య లుక్, పర్ఫామెన్స్ బాగుంది. సినిమాలో మరో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. తన పర్ఫామెన్స్తో ఆ పాత్ర స్థాయిని ఎంతో పెంచారు విద్యాబాలన్. సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్ రావుది. ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించాడు. లక్ష్మణుడి లాంటి తమ్ముడిగా రాజా నటన మెప్పిస్తుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఏ పాత్ర ఒకటి రెండు నిమిషాలకు మించి తెర మీద కనిపించదు. విశ్లేషణ : యన్.టి.ఆర్ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్ షాట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులను నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌ను మాత్రం మెప్పించాడు. ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరావాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : బాలయ్య, విద్యాబాలన్ నటన ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు సంగీతం మాటలు మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో బాలకృష్ణ లుక్ సాగదీత సన్నివేశాలు సినిమా లెంగ్త్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘యన్.టి.ఆర్’ కథానాయకుడు మూవీ స్టిల్స్
-
అప్పటినుంచి నాకు నచ్చినట్లు నేనుంటున్నాను
నటుడు, మాజీ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా (కథానాయకుడు, మహానాయకుడు) రూపొందింది. యన్.టి. రామారావు భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషించారు. ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. నేడు విద్యాబాలన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె పలు విశేషాలు పంచుకున్నారు. ► బర్త్‌డే స్పెషల్ అంటూ ఏమీ లేదు. ఈసారి తెలుగు సినిమా చేశానంతే. ఇంతకు ముందు కూడా చాలా తెలుగు సినిమాలు ఆఫర్ చేశారు. కొత్త భాషలోకి పరిచయం అవుతున్నాం అంటే ఆ పాత్ర ఎంతో ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండాలి. విబ్రీ మీడియా విష్ణుగారు ‘యన్.టి.ఆర్’ సినిమా అవుట్ లైన్ చెప్పినప్పుడు నేనిది కచ్చితంగా చేయాలి అనుకున్నాను. నా 9 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో మా మామయ్య వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ రామారావుగారి గురించి విన్నాను. ► ఇంతకు ముందు నేను రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పోషించాను. కానీ ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయట లేదు. రామారావుగారి కుటుంబ సభ్యులతో మాట్లాడటమే ఎక్కువ ప్రిపరేషన్. బాలకృష్ణగారితోనూ కథను బాగా డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడు క్రిష్‌గారు అన్నీ ఈజీ చేసేశారు. సీన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలో చూపించారు. దర్శకుల మీద డిపెండ్ అయ్యాను. దర్శకుల ఇన్పుట్స్, యాక్టర్స్ యాక్టింగ్ కెపాసిటీ విడివిడిగా ఉండవని నా అభిప్రాయం. ఇదంతా ఓ ప్రాసెస్. ► షూటింగ్ టైమ్‌లో నా డైలాగ్స్ నేనే చెప్పుకున్నాను. డబ్బింగ్ చెప్పుకోవాలని ముందే అనుకున్నాను. కానీ నా తెలుగు భాషలో కొంచెం అర్బన్ స్టైల్ కనిపిస్తుంది. తారకమ్మ చాలా స్వచ్ఛమైన, అచ్చ తెలుగు మాట్లాడేవారట. వేరే వాళ్లతో డబ్ చేస్తున్నాం అని నాకు చెప్పి మరీ డబ్బింగ్ చెప్పిచారు క్రిష్. ► ఈ మధ్య ఎక్కువగా బయోపిక్స్ చేస్తున్నాను. కావాలని చేయలేదు. నాకు ఆ ఆఫర్సే వచ్చాయి. అవి చాలా ఎగై్జటింగ్‌గా అనిపించాయి. ఏ పాత్ర గురించైనా విన్నప్పుడు ఈ పాత్ర చేయాలనే ఓ ఫీలింగ్ రావాలి. అది అనిపిస్తేనే సినిమా చేయాలనుకుంటా. ► ఈ జనరేషన్లో యంగ్‌స్టర్స్ అందరూ బావుండటమంటే కేవలం లుక్స్ అనే అనుకుంటున్నారు. గుడ్ లుక్స్, స్లిమ్‌గా ఉండాలని వాటి వెంట పరిగెడుతున్నారు. నాకు బరువు గురించి పెద్దగా పట్టింపులేదు. అయితే హీరోయిన్ ఇంత లావు ఉండకూడదని చెప్పేవారు. మొదట్లో నేను అమాయకంగా వాళ్లు చెప్పింది నమ్మేసి క్రాష్ డైట్లు, అదీ ఇదీ చేసేసి స్లిమ్ అయ్యాను. కానీ లైఫ్లెస్గా (నిస్సారంగా) అనిపించింది. ఆ తర్వాత తెలుసుకున్నాను మనం మనలా ఉంటేనే బాగుంటుందని. అప్పటి నుంచి నాకు నచ్చినట్టు నేనుంటున్నాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా? లేదా? అన్నది కూడా ముఖ్యమే. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. ఎలా ఉన్నామో అలా అంగీకరించగలగాలి. అప్పుడు ఎలా ఉన్నాం అన్నది పెద్ద ప్రశ్న అవ్వదు. దానికి సమాధానం కోసం పరిగెత్తే పని కూడా ఉండదు. ► ఇంతకు ముందు న్యూ ఇయర్‌కు కొత్త నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈరోజుతో నాకు 40ఏళ్లు వస్తాయి. ఈ సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోను. ఏదో కొత్త నిర్ణయం తీసుకుంటాం. 4,5 తారీఖుల్లో అది పాటించడం మానేస్తే గిల్టీ అనిపిస్తుంది. ఈ ఏడాది నుంచి ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నాను. ఎప్పుడూ కుదరదు కానీ ట్రై చేస్తా.. ► రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్ చేయాలనుంది. వీలుంటే మళ్లీ క్రిష్‌తో పని చేస్తా. ఇందిరా గాంధీ బుక్ రైట్స్ తీసుకున్నాను. ఆవిడ గురించి చెప్పడానికి చాలా మెటీరియల్ ఉంది. అందుకే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ‘మిషన్ మంగళ్’లోనూ నటిస్తున్నాను. బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ఎవ్వరిని అడిగినా ‘మాకు విద్యాబాలన్గారే ప్రేరణ’ అంటుంటారు. మరి మీరు అలా ఉండటానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అని అడగ్గా ‘‘ఈ విషయం తెలుసుకోవడం హ్యాపీగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు. ఫస్ట్ నా సిస్టర్ ప్రియా బాలన్. తను ఏ మూమెంట్లో అయినా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. తనే నా హీరో’’ అన్నారు. -
పల్లవి.. అనుపల్లవి
జయలలిత, శశికళ మధ్య స్నేహం గురించి చాలానే విన్నాం. రాజకీయ రాగాల్లో జయలలిత అను పల్లవి అయితే శశికళ పల్లవి అనేటంత. జయలలిత కథ చెప్పాలంటే శశికళ లేనిదే ఆ కథకు ఓ పరిపూర్ణత ఉండదు. అంతలా జయ జీవితంలో ఓ కీలక వ్యక్తిగా మారారు ఆమె. ఇప్పుడు తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా నాలుగు సినిమాలు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఒకటి. విబ్రీ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో జయలలిత పాత్రను విద్యా బాలన్ పోషించనున్నారని కోలీవుడ్‌లో టాక్. లేటెస్ట్గా శశికళ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట దర్శకుడు విజయ్. ఆల్రెడీ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘దియా’ (తెలుగులో ‘కణం’) ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు సాయిపల్లవి. ఇప్పుడు శశికళ పాత్రకు ఆమె పేరును పరిశీలిస్తున్నారట దర్శకుడు. మరి విజయ్ తెరకెక్కించనున్న ఈ రాజకీయ చదరంగ రాగాల్లో విద్యా ‘అనుపల్లవి’, సాయి ‘పల్లవి’ అవుతారా? అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి. -
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
-
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సన్నిహితులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేడుకలో ప్రసంగించిన మోహన్ బాబు చివర్లో ‘క్రిష్.. యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ముగించారు. బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, శాలినీ పాండే, శ్రియ, పాయల్ రాజ్‌పుత్ అలనాటి అందాల భామలుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్, సుమంత్, కైకాల సత్యనారాయణ, ప్రకాష్ కోవెలమూడి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
-
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
హైదరాబాద్‌లో శుక్రవారం ‘యన్‌టిఆర్’ సినిమా ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర హీరో బాలకృష్ణ, హీరోయిన్ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. వీరితో పాటు నటీనటులు జమున, గీతాంజలి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, సుమంత్, రానా, తారకరత్న, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ‘కళాబంధు’ టి.సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, నాజర్, నరేశ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
యన్.టి.ఆర్ : విద్యాబాలన్ లుక్
నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ యన్.టి.ఆర్. బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ లుక్‌ను రివీల్ చేశారు. హర్మోనియం వాయిస్తున్న విద్యాలుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
యన్.టి.ఆర్ : 16న ట్రైలర్.. 21న ఆడియో
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ యన్‌టిఆర్ బయోపిక్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా చిత్ర టైలర్, ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. యన్.టి.ఆర్ ట్రైలర్ లాంచ్ డిసెంబర్ 16న హైదరాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయి.ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా వస్తుంది. విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మరో సౌత్ సినిమాలో విద్యాబాలన్!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పింక్. ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్లో అజిత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పింక్ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయబోతున్నాడని.. కాదు అవన్ని రూమర్సే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయనున్నాడు. ఇందులో ఓ ప్రముఖ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్ నటించబోతోందని తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాతో బిజీగా ఉన్నారు. విద్యాబాలన్ ఇప్పటికే యన్.టి.ఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
భలే చాన్సులే!
‘మిషన్ మంగళ్’ అంటూ స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ని తోడుగా తీసుకెళ్తున్నారు. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌తో పాటు మరో భామ కూడా ఈ చిత్రానికి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్ కష్మీరా పరదేశి కూడా ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. -
‘యన్.టి.ఆర్’లో విద్యాబాలన్ లుక్
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించనున్నారు. తాజాగా సినిమాలో ఆమెలుక్ను రివీల్ చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు విద్యా. మేకప్ రూమ్‌లో అద్దం ముందు కూర్చున్న తన ఫోటోకు ‘నేనేం చూస్తున్నాను..?’ అన్న కామెంట్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండంగా కల్యాణ్ రామ్.. హరికృష్ణగా, రానా దగ్గుబాటి.. చంద్రబాబు నాయుడిగా, సుమంత్.. నాగేశ్వరరావు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను 2019 జనవరిలో రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్: ‘టైగర్’ పాత్రలో కైకాల
విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తూ చిత్రబృందం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రలకు పలువురిని ఫైనల్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించినట్లు దర్శకుడు క్రిష్ స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. నేడు(జులై25) కైకాల సత్యనారాయణ జన్మదిన సందర్బంగా క్రిష్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది. ‘కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకు పునాది వేసిన పితామహుడు టైగర్ హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు. టైగర్ H.M Reddy గారి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు #NTR pic.twitter.com/5aiK0gcKla — Krish Jagarlamudi (@DirKrish) July 25, 2018 -
ఎన్టీఆర్ : తొలి షెడ్యూల్ పూర్తయ్యింది
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా తేజ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో వాయిదా పడింది. తరువాత బాలయ్య హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన క్రిష్ సారధ్యంలో ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించారు. క్రిష్ స్టైల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి ఫెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షూటింగ్సెట్లో తీసిన ఓ ఫోటోను ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసిన క్రిష్ తొలి షెడ్యూల్ పూర్తయ్యిందంటూ కామెంట్ చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్
-
అతిథిగా శింబు
తమిళసినిమా: సంచలనాలకు కేంద్రబిందువు శింబు అంటారు. సమయానికి షూటింగ్‌లకు రాకుండా దర్శక, నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తాడని, కథలో జోక్యం చేసుకుంటాడని చాలా ఆరోపణలే ఆయనపై ఉన్నాయి. ఇవన్నీ శింబుకు తెలుసు. అందుకే ఇకపై వేరే శింబును చూస్తారని, షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తున్నాడనే ఆరోపణలు రావని, ఇటీవల చెప్పడం ఒక షాక్ అయితే, మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం, సెక్క సివంద వానం చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడం వంటివి శింబు నుంచి ఆశించనివే. తాజాగా నటి జ్యోతిక చిత్రంలో అతిథిగా మెరవడానికి అంగీకరించడం ఇంకా విశేషం. అవును నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాట్రిన్ మొళి. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సుళు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇందులో విద్యాబాలన్ పాత్రను జ్యోతిక పోషిస్తున్నారు. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిక భర్తగా విథార్థ్ నటిస్తున్నారు. హిందీలో నేహా నటించిన పాత్రను తెలుగు నటి లక్ష్మీమంచు చేస్తున్నారు.ఎంఎస్.భాస్కర్, మనోబాలా, కుమారవేల్, మోహన్‌రామన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో ఒక కీలక పాత్రలో నటుడు శింబు నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ధనుంజయన్నే తన ట్విట్టర్లో పేర్కొన్నారు.శింబు కాట్ట్రిన్ మొళి చిత్రంలో చేరడంతో ఆ చిత్ర కలరే మారిపోయింది. శింబు, జ్యోతికలది హిట్ పెయిర్. గతంతో వీరిద్దరూ కలిసి మన్మథ చిత్రంలో నటించారన్నది గమనార్హం. చాలా కాలం తరువాత మళ్లీ కలిసి నటించడం విశేషమే. -
విప్లవ నాయకురాలిగా...
మహానటి సావిత్రి బయోపిక్ ఇటీవలే సిల్వర్ స్క్రీన్‌కి వచ్చింది. మరో అందాల అభినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రానుందనే వార్త షికారు చేస్తోంది. కథానాయికగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత జీవితం సెన్సేషన్. సినిమాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా కుటుంబ పరిస్థితుల కారణంగా నటి అయ్యారు జయలలిత. ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు... ఇలా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ప్రత్యర్థి పార్టీ నాయకుడితో ఢీ అంటే ఢీ అన్నారు. పురచ్చి తలైవి (విప్లవ నాయకురాలు) అనే పేరు తెచ్చుకున్నారు. ‘ఉక్కు మహిళ’ అనిపించుకున్న జయలలిత బయోపిక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ విప్లవ నాయకురాలి పాత్ర చేయదగ్గ నాయిక ఎవరు? అంటే.. ‘విద్యాబాలన్’ కరెక్ట్ అనిపించిందట యూనిట్‌కి. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్’కి విద్యాబాలన్ పూర్తీగా న్యాయం చేశారు. ఇప్పుడు పవర్ఫుల్ లేడీ జయలలితగా జీవిస్తారని ఊహించవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. -
స్టార్ట్ టు ఎండ్.. నాన్‌స్టాప్
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు హీరోయిన్ జ్యోతిక. మణిరత్నం రూపొందిస్తున్న ‘చెక్క చివంద వానమ్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే విద్యా బాలన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తుమ్హారీ సులూ’ రీమేక్‌లో కూడా కనిపించనున్నారు జ్యోతిక. ‘కాట్రిన్ మొళి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విశేషం ఏంటంటే.. స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకూ ఒక్కటే షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. అక్టోబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ధనుంజయన్, లలిత, విక్రమ్ కుమార్ నిర్మించనున్నారు. -
మోడర్న్ మదర్‌స్టార్స్
తెల్ల చీర.. ఓ కంట్లో కుండల కొద్దీ కన్నీళ్లు.. మొహంలో దయనీయత... కంపిస్తున్న జీవితం..టాలీవుడ్, బాలీవుడ్ అమ్మకు ప్రతిరూపం పదేళ్ల కిందటిదాకా! ఎప్పుడూ ఎవరో ఒకరు ఆదుకోవాలని చూసే సెల్ఫ్ పిటీతో కుంగిపోతూ ఉంటుంది ఆ అమ్మ. ఇప్పుడు పరిస్థితులు మారాయి కనీసం బాలీవుడ్లో. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో ఆధునిక అమ్మ తెర మీద ధైర్యంగా అడుగులేస్తోంది. అంతకుముందు అమ్మంటే సినిమా కథ ఫార్ములాలో ఓ పాత్ర మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు.. కథను నడిపించే ప్రధాన నాయిక. ఉదాహరణ.. నిల్ బత్తే సన్నాట! నిజానికి ఈ మార్పు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా నుంచి మొదలైందని చెప్పొచ్చు. అందులో కథానాయిక కాజోల్‌కి తల్లిగా నటించిన ఫరిదా జలాల్ కొంచెం రివల్యూషనరీ మదర్‌గా కనిపించారు. ఆ తర్వాత నుంచి వచ్చిన చాలా సినిమాల్లో అమ్మ రూపురేఖలు.. వ్యక్తిత్వమూ మారిపోయాయి కొత్తగా... తల్లుల్లో ఉత్సాహాన్ని పెంచేలా! ఆ సినిమాలు కొన్ని.. పైన నిల్ బత్తే సన్నాట ఊసెత్తాం కాబట్టి దాన్నే మొదట ఉదహరించుకుందాం. అందులో తల్లే ప్రధాన పాత్ర. స్వర భాస్కర్ పోషించింది. ఆమె ఓ పనిమనిషి. కూతురిని పెద్ద చదువులు చదివించాలని కలలు కంటూంటుంది. కానీ పనిమనిషి కూతురు ఇంకో పనిమనిషి కాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా అనే నిస్పృహతో బతుకుతుంది. అంతే నిస్సత్తువగా బడికి వెళ్తూంటుంది. బిడ్డ ఆలోచనలు మార్చడానికి ఆ తల్లీ స్కూల్లో చేరుతుంది. కూతురితో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఆమెలో పోటీని రగిలిస్తుంది. జీవితం పట్ల ఆశను రేపుతుంది. ఉత్తేజాన్ని నింపుతుంది. అచ్చంగా ఓ అమ్మను హీరోయిన్గా చూపించిన ఈ సినిమా.. తీరు మారిన బాలీవుడ్ తలపుకు మచ్చు తునక. జానే తూ.. యా జానే నా.. ఫ్రెండ్లీ మదర్ కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేసిన సినిమా జానే తూ.. యా జానే నా! ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ సెల్యూలాయిడ్ ఫస్ట్ ఎంట్రీ ఈ మూవీ. అందులో అతనికి అమ్మగా రత్నా పాటక్ షా నటించింది. సర్కాస్టిక్ మదర్. విడో. భర్త పట్ల మిస్సింగ్ ఫీలింగ్‌నూ ఆ వ్యంగ్యంతోనే భర్తీ చేసుకుంటుంది. కొడుకుకు ఆప్తమిత్రురాలిలా మసలుకుంటుంది. బోలెడు ధైర్యాన్నిస్తుంది. అలా ‘జానే తూ యా జానే నా’ లో అమ్మను డేరింగ్ అండ్ డైనమిక్‌గా చిత్రీకరించారు. ఈ మధ్య వచ్చిన మంచి సినిమా కపూర్ అండ్ సన్స్‌లో కూడా రత్నా పాటక్ షా ఇన్స్పైరింగ్ మదర్‌లా నటించారు. భర్త వివాహేతర సంబంధం... కొడుకు గే అని తేలడం.. ఇలాంటి షాకింగ్ సందర్భాల్లో గట్టిగా అరుస్తూ కూలిపోకుండా.. సంయమనంగా డీల్ చేయగల స్త్రీగా అద్భుతంగా చిత్రీకరించిన పాత్ర అది. రత్నా పాటక్ షా ఒదిగిపోయి మహిళకు మరో నిర్వచనంగా నిలిచారు. ఇంగ్లిష్ వింగ్లిష్.. ‘‘నాకు కావాల్సింది ప్రేమ కాదు.. గౌరవం’’ అంటుంది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలోని అమ్మ ‘శశి’. నిజమే.. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని.. వంట తప్ప ఏమీ రాదని హేళన చేస్తే భర్త, ఇంగ్లిష్ రాకపోతే ఆ అమ్మకు ఏమీ తెలియదని.. ఒట్ట జడ్డని.. టీచర్, పేరెంట్ మీటింగ్‌కు ఆమెను అవాయిడ్ చేయాలని చూసే కూతురుంటే .. ఏ తల్లైనా ఆశ పడేది కాసింత గౌరవం పొందాలనే కదా! ఇంగ్లిష్ నేర్చుకొని అనర్గళంగా ఆ భాషలో స్పీచ్ కూడా ఇచ్చి ఆ గౌరవాన్ని దక్కించుకుంటుంది శశి. అమ్మ ఆత్మగౌరవం అనే ఓ సున్నితమైన అంశాన్నే ప్రధానం చేసుకొని మధ్య వయసు మహిళనే ముఖ్య భూమికగా పెట్టుకొని తీసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఎంత సూపర్ హిట్టో తెలియంది కాదు! అంటే అమ్మకు ప్రేమతో పాటు గౌరవాన్నీ ఇవ్వాలని మనమందరం కోరుకుంటున్నట్టేగా. మరెందుకు జాలి పాత్రలు? ఈ సినిమా శ్రీదేవికి రీ ఎంట్రీ. శశిగా ఆమె సింప్లీ సూపర్బ్. పా.. ప్రిజేరియా ఉన్న కుర్రాడి సింగిల్ పేరెంట్ స్ట్రగులే ‘పా’. ఆ సింగిల్ పేరెంటే విద్యా బాలన్. అసాధారణ జబ్బున్న పిల్లాడికి తల్లిగా ఏ మాత్రం నిరాశకు లోనవకుండా.. ఆ కొడుకుని సాధారణ పిల్లల్లాగే పెంచగలిగే ఆత్మబలం ఉన్న అమ్మ ఆమె. అసలా కథను ఎంచుకున్నందుకు బాల్కీకి, నటించి మెప్పించిన విద్యాబాలన్‌కు హ్యాట్సాఫ్. లిజన్ అమాయా.. భర్త మరణం భార్య కలలు, కలర్‌ఫుల్ లైఫ్‌కి ఫుల్స్టాప్ కానక్కర్లేదు. ఆయన జ్ఞాపకాలతో బతికే మొండితనమన్నా ఉండాలి.. లేదా కొత్త భాగస్వామిని ఎంచుకొని జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టే ధైర్యమన్నా కావాలి. రెండో కోవకు చెందినదే అమాయా తల్లి. తండ్రిని తప్ప ఇంకో వ్యక్తిని ఆ స్థానంలో ఊహిచంలేని కూతురికి ఇంకో భాగస్వామిని ఎంచుకున్నానని ఎలా చెప్పాలి? అని మథన పడుతుందే తప్ప బలహీనపడదు. తనకూ కొత్తగా జీవించే హక్కుందని బిడ్డకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి సంఘర్షణను కన్నీళ్లు.. దిగులు భావాలతో కాకుండా స్థిరమైన ఆలోచనలు, అభిప్రాయాలతో అధిగమిస్తుంది. ఆ పాత్రలో దీప్తి నావల్ జీవించింది. ఇవి ట్రైలర్స్ మాత్రమే. గే కొడుకును యాక్సెప్ట్ చేసే అమ్మగా ‘దోస్తానా’లో కిరణ్ ఖేర్, ప్రత్యర్థి మూఠాను వణికించే తల్లిగా ‘రామ్‌లీలా’ లో సుప్రియా పాఠక్, సెరిబ్రల్ పాల్సీ ఉన్న కూతురిని సంబాళించే తల్లిగా ‘మార్గరిటా విత్ స్ట్రా’లో రేవతి, ‘మిత్ర్’లో శోభనా, పంజాబీ బ్యూటీషియన్ అండ్ చిల్ మదర్‌గా ‘విక్కీ డోనర్’లో డాలీ అహ్లువాలియా వీళ్లంతా ఆధునిక అమ్మ బలం చూపించారు.ఆమె గౌరవం పెంచారు. అనవసరమైన త్యాగాలు, ఔన్నత్యాలకు జీవితాన్ని అంకితం చేసుకునే బేలతనం లేదు వాళ్లకు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.. పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే అమ్మతనం వాళ్లది. సెల్యులాయిడ్ను మోడర్న్ యాంగిల్లో సెట్ చేస్తున్న మదర్ స్టార్స్‌కి వందనాలు! నిల్ బత్తే సన్నాటలో.. ‘పా’లో విద్యా, అభిషేక్ -
శ్రీదేవిలా తెరపై వెలుగుతారా?
సాక్షి, చెన్నై: బయోపిక్ చిత్రాలు తెరకెక్కించడం అంత సులభం కాదు. ఎవరిని పడితే వారి బయోపిక్‌లను వెండితెరపై ఎక్కించనూలేరు. అందుకో అర్హత ఉండాలి. అందుకు తగ్గ చరిత్ర ఉండాలి. అలా మహానటి సావిత్రి జీవిత చరిత్ర నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్.ధోని జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సంచలన శృంగారతార సిల్క్‌స్మిత్ బయోపిక్ ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కింది. అందులో స్మిత పాత్రలో నటించిన నటి విద్యాబాలన్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాట పుట్టి, తమిళ చిత్రసీమలోకి బాలతారగా అడుగిడి, అటుపై తెలుగు, కన్నడం అంటూ పసివయసులోనే బహుభాషా బాలతారగా గుర్తింపు పొందిన నటి శ్రీదేవి. కథానాయకిగానూ భారతీయ సినీపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు, ప్రఖ్యాతులను పొందిన శ్రీదేవి అన్ని భాషల్లోనూ 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల దుబాయ్‌లో మరణించిన శ్రీదేవిపై ఆయన భర్త బోనీకపూర్‌నే చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా, బెంగళూర్‌కు చెందిన అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు ఆమె బయోపిక్‌ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందిస్తున్నారు. తాజాగా హిందీ దర్శకుడు హన్సల్ మెహ్తా శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం గురించి ఆయన తెలుపుతూ ఇంతకు ముందు శ్రీదేవిని తన చిత్రం లో నటింపజేయాలనుకున్నారు. ఇంతలోనే ఆమె అకస్మాత్తుగా మరణించడంతో తన కోరిక నెరవేరకుండా పోయిందని అన్నారు. అందుకే శ్రీదేవి జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి తమిళ చిత్రాల నుంచి హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగారని, ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు, వైద్యుల శస్త్ర చికిత్స తప్పిదంతో తల్లి మరణం, ఆ ఆస్పత్రి నిర్వాకంపై కోర్టు కేసు వేయడం, దుబాయిలో మరణం వరకూ శ్రీ దేవి జీవిత అంశాలు ఈ చిత్రం లో చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటి విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపారు. శ్రీదేవితో కలిసి నటించిన రజనీ కాంత్, కమల్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, మిథున్చక్రవర్తి లాంటి పాత్రలు కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంటా యని, వారి ఎంపిక జరుగుతోందని చిత్ర దర్శకుడు హన్సల్‌మెహ్తా తెలిపారు. -
ప్చ్... శ్రీదేవితో సినిమా తీయలేకపోయా!
సాక్షి, సినిమా : తన కెరీర్లో లెజెండరీ తార శ్రీదేవితో సినిమా తీయలేకపోయానని బాలీవుడ్ సీనియర్ దర్శక-నిర్మాత హన్సల్ మెహతా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తీసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ‘శ్రీదేవి హఠాన్మరణం నన్ను ఎంతగానో బాధించింది. ఆమెతో సినిమా తీయాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ, నా కోరిక తీరలేదు. అందుకే ఆమె బయోపిక్ అయినా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రం కోసం నటి విద్యాబాలన్‌ను సంప్రదిస్తున్నా’ అని అని మీడియాకు తెలిపారు. ఇక ఇండస్ట్రీలో మరో శ్రీదేవి అన్నది ఊహించుకోవటమే కష్టమంటూ ట్వీట్ చేసిన ఆయన.. బయోపిక్ ద్వారా ఆమె జీవితంలో తెలియని కొత్త కోణాలు చూపించే యత్నం చేస్తానని హన్సల్ చెప్పుకొచ్చారు. కాగా, హన్సల్ మెహతా.. ఖానా-ఖజానా, దూరియాన్, దస్ కహానియాన్, సిటీలైట్స్, అలీఘడ్ లాంటి చిత్రాలతోపాటు ఈ మధ్యే బోస్ : డెడ్/ఎలైవ్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్
జై సింహా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ త్వరలో ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రారంభించబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి పాత్ర ఎంపిక కోసం చాలా కసరత్తులు చేసిన చిత్రయూనిట్ ఫైనల్ ఓ బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేశారట. విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంది. -
తుమ్హారీ జో...
‘పెళ్లయిన తర్వాత మహిళలు కేవలం గృహిణిగా ఇంటికి అంకితం అయిపోవటం కాదు, వాళ్లకూ ఉద్యోగం చేయాలనే ఆశలుంటాయి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే కోరికలుంటాయి. అవి కలలు లాగే మిగిలిపోవద్దు’ అనే కథాంశంతో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో వచ్చిన హిందీ చిత్రం ‘తుమ్హారీ సులు’. రేడియో జాకీ కావాలనే సులోచన పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు రాధామోహన్. ఈ తమిళ రీమేక్‌లో సులోచన పాత్రలో జ్యోతికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు జ్యోతిక. సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా రీమేక్ (మలయాళ మూవీ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ రీమేక్ ‘36 వయదినిలే’) తో స్టార్ట్ చేసిన జ్యోతిక ఈ రీమేక్‌లోనూ కూడా నటించనున్నారని సమాచారం. 2007లో రాధామోహన్ దర్శకత్వం వహించిన ‘మొళి’లో జ్యోతిక నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇప్పుడు ‘తుమ్హారీ సులు’ కుదిరే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే.. లకలక అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో భయపెట్టిన జ్యోతిక పాత్రను హిందీ రీమేక్ ‘భూల్ భులేయా’లో విద్యాబాలన్ పోషించారు. ఇప్పుడు విద్యాబాలన్ సూపర్ హిట్ ‘తుమ్హారీ సులు’ సినిమాను తమిళంలో జ్యోతిక పోషిస్తుండటం విశేషం. -
చేస్తారా? తీస్తారా?
నవ్వు ఒకటి కాదు. దేహాకృతి ఒకటి కాదు. హావభావాలు ఒకటి కాదు. మరెలా ఆవిడ పాత్రను ఈవిడ పోషించడం? బాలన్.. ఇందిర పాత్రను పోషించగలరా లేదా అన్నది తర్వాతి సంగతి. ముందైతే ఈ సంగతి చెప్పండి. నటనలో ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని అనుకరించడానికి ఈ పోలికలన్నీ నిజంగా అవసరమా? ప్రధానిగా దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు, చిన్న కొడుకు సంజయ్ గాంధీతో తలనొప్పులు వచ్చినప్పుడు, రాజకీయాల్లో కల్లోలం చెలరేగినప్పుడు ఇందిరాగాంధీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో.. అంత స్ట్రాంగ్నెన్ లైఫ్‌లో ప్రతి మహిళలోనూ ఉంటుంది. విద్యాబాలన్లోనూ ఉండి తీరుతుంది. ఆ శక్తి చాలు కదా ఇందిరగా బాలన్ నటించానికి. సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిర : ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకానికి విద్యాబాలన్ రైట్స్ కొనుక్కున్నారు. దాంతో ఆ పుస్తకాన్ని సినిమాగా తియ్యబోతున్నారా, ఇందిరగా విద్యాబాలన్ సూట్ అవుతారా అనేది ఇప్పుడు టాపిక్ అయింది. రైట్స్ అయితే బాలన్ దగ్గరున్నాయి. విద్యే ఇందిరగా నటించాలనేముందీ? ఇంకెవరి చేతైనా యాక్ట్ చేయించవచ్చు కదా.. నిర్మాతగా మారి! -
విద్యాబాలన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి
సాక్షి, కొరుక్కుపేట: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుకున్న విద్యాబాలన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని సినీ దర్శక, నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలీవుడ్లో సినిమా, సీరియల్‌గా నిర్మిస్తున్న స్వర్గీయ ఇందిరాగాంధీ జీవిత కథలో విద్యబాలన్ నటించాలనుకోవడం సహించరాని విషయమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప మహిళానేత పాత్రలో మిమ్మల్ని చూపించడం కష్టమన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. లేకపోతే ఇందిరమ్మ అభిమానుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన అన్నారు. కళాకారులు ఏ పాత్రైనా పోషించవచ్చన్నారు. కానీ గతంలో వారు నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని తెలిపారు. ప్రజాగ్రహానికి గురై కోర్టుల చుట్టూ తిరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు. కనిమొళిపై చర్యలు తీసుకోవాలి.. తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కనిమొళిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొశారు. వివాదం సృష్టించడం వార్తల్లో నిలవడం ఇది కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. 2006లో నిర్భంధ తమిళ భాష బోధన చట్టాన్ని తీసుకువచ్చి మైనార్టీల హక్కులను హరించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కనిమొళి తిరుమల వేంకటేశ్వరస్వామిపై తిరుచ్చిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా ఆమె ఇలా మాట్లాడడం సబబుకాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేతిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో స్టాలిన్, స్టాలిన్ భార్య వెంకన్న భక్తులన్నారు. ఇవే వ్యాఖ్యలు ఇతర మతస్థులపై చేసే దమ్ము మీకు ఉందా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. నాస్తికత్వంపై ప్రసంగంలో వేంకటేశ్వరస్వామిని ఉదాహరణగా చూపడం కోట్లాది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వెంటనే కనిమొళిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏక్ కహానీ!
కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్.. కొందరి కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్..ఏక్ కహానీ అని మొదలుపెట్టి చెప్పే గొప్ప కథలవి.విద్యా బాలన్.. బాలీవుడ్లో హీరోయిన్ అనే పాత్రను హైలైట్ చేస్తూ రాసిన ఓ కథ ఉంది. ఏక్ కహానీ.. చదవండి.. తమిళ మలయాళం! విద్యాబాలన్ బాగా చదువుకుంది. ఇంట్లో వాళ్లంతా బాగా చదువుకున్నవారే! పుట్టి పెరిగింది అంతా ముంబైలో! ఇంట్లోనేమో తమిళం, మలయాళం మాట్లాడతారు. చిన్నప్పట్నుంచే ఎన్నో భాషలు వచ్చు. ఏదడిగినా చెప్పేయగలదు. సినిమాలంటే పిచ్చి. దీంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టేసింది. ముంబైలోనే ఉంటున్నా, బాలీవుడ్ స్టార్ అయినా, విద్యాబాలన్ ఇంట్లో ఇప్పటికీ తమిళ మలయాళాలే వినిపిస్తాయట!! ఐరన్ లెగ్.. చిన్న చిన్న షోస్ చేసిన తర్వాత విద్యాబాలన్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకో సినిమా అవకాశం వచ్చింది. షూట్ మొదలైన కొద్దిరోజులకే విద్యా బాలన్‌ను తప్పించారు. అలాగే ఇంకో సినిమా. ఇక దీంతో ఆమెకు ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసేశారు. విద్యాబాలన్ హీరోయిన్గా ఎంపికైన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లకముందే అనేక మలుపులు తిరుగుతున్నాయని, ఆమెను తీసుకుంటే బ్యాడ్‌లక్ అని ఎవ్వరూ అవకాశాలు కూడా ఇవ్వలేదు. దీంతో సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ వెళ్లిపోయింది విద్యా! ఫీమేల్ హీరో! బాలీవుడ్‌కు వెళ్లిపోయాక విద్యాబాలన్ కెరీర్ మొదట్లో గొప్పగా ఏమీ లేదు. సినిమాలైతే వస్తున్నాయి. యాక్టింగ్ సూపర్ అంటున్నారు. కమర్షియల్ సక్సెస్ లేదు. కమర్షియల్ సక్సెస్ వచ్చినా క్రెడిట్ అంతా డైరెక్టర్, హీరోలకే వెళ్లిపోతోంది. అప్పుడే విద్యాబాలన్ కెరీర్లో ఓ టర్న్ తీసుకుంది. మామూలు టర్న్ కాదది. ‘ఫీమేల్ హీరో’ అనే ఒక బ్రాండ్‌ను తయారుచేసిన టర్న్. ‘పా’, ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ లాంటి సినిమాలు వరుసపెట్టి చేసింది. అన్నీ సూపర్హిట్లే! హీరోయినే హీరో!! ఇటు యాక్టింగ్ పరంగా, అటు బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ఆమె సినిమాలు ఒక ఊపు ఊపుతున్నాయి. అవార్డులూ ఆమె అడ్రెస్ వెతుక్కొని మరీ ఆమెను వరించాయి. తాజాగా ‘తుమ్హారీ సులూ’తో తన బ్రాండ్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది విద్యాబాలన్! కపుల్ గోల్స్.. విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. కపుల్గోల్స్గా చెప్పుకుంటారు వీళ్లిద్దరినీ. కెరీర్ పీక్స్‌లో ఉన్న రోజుల్లోనే విద్యా బాలన్ పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లయ్యాక తన కెరీర్‌కు అడ్డుచెప్పని వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంది. పరిస్థితులు అన్నీ ఎలా కుదిరాయో కానీ, విద్యా, సరిగ్గా అలాంటి ఆలోచనలున్న వ్యక్తి సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడిపోయింది. 2012లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా విద్యా బాలన్ నటనకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో ఆమె తనను తాను మరింత కొత్తగా, ఫీమేల్ హీరోగా ఆవిష్కరించుకుంది. ‘ఎక్కడున్నారు ఇంకా?’ విద్యా బాలన్ నటనపై వచ్చిన విమర్శలు చాలా తక్కువ! ఆమె మీద వచ్చిన విమర్శలంటే అది బరువు పైనే!! ‘‘మీరు హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలే చేస్తారా? బరువు తగ్గి గ్లామర్ పాత్రలు కూడా చేస్తారా?’’ అంటూ విద్యా బాలన్‌ను ఓ ప్రెస్మీట్లో మీడియా అడిగితే, ‘‘నేనిలాగే చాలా హ్యాపీగా ఉన్నా. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని ఎందుకనుకుంటారు? ఎక్కడున్నారు మీరింకా?’’ అంటూ సెటైర్ వేసింది. అదీ విద్యా బాలన్ స్టైల్.! హీరోయిన్‌కి బ్రాండ్‌ను తీసుకొచ్చిన స్టైల్!! -
గృహిణిగా ఉండడమే హాయి!
న్యూ ఇయర్‌కి విద్యాబాలన్ నిర్ణయాలేం తీసుకోరట! ‘వై మేడమ్?’ అంటే.. ‘మొదటి రోజే వాటిని బ్రేక్ చేయడం బాగోదు కదా!’ అని పెద్దగా నవ్వేశారు. జనవరి ఫస్ట్ బాలన్ బర్త్‌డే కూడా. ఆ ఒక్క రోజు తన ఇష్టం వచ్చినట్లు ఉండి, రెండో రోజు నుంచీ డిసిప్లీన్డ్గా ఉండేందుకు విద్య ట్రై చేస్తారట. మంచి పాలసీనే. బాలన్‌కి నిన్నటితో 38 కంప్లీట్ అయ్యాయి. రోజుంతా ఇంట్లోనే ఆత్మీయులతో గడిపారు. డైటింగ్ పాట్లు లేకుండా చక్కగా డిన్నర్ చేశారు. వచ్చిన గిఫ్టుల్ని తెరిచి చూడ్డానికే.. ఆమెకు టైమ్ సరిపోలేదు. ‘ఇంతకీ మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఏమిటి?’’ అని మీడియావాళ్లెవరో బాలన్ని అడిగారు! ‘మీరెక్కడి నుంచి వచ్చారు?!’ అని బాలన్ ఉలిక్కిపడి చూసి పెద్దగా నవ్వారు. ‘మీ వాళ్లే ఎవరో ఇన్విటేషన్ పంపారు మేడమ్’ అన్నారు ఆ వచ్చినవాళ్లు. ఏ పనైనా.. వితౌట్ గిల్టీ చెయ్యాలని అనుకున్నారట విద్యాబాలన్. అదే తనకు తను ఇచ్చుకునే గిఫ్ట్ అట! మరి న్యూ ఇయర్ రిజల్యూన్? అలాంటిదేమీ లేదట! అయితే టూర్లు తగ్గించి, కుదురుగా ఒక చోట ఉండేందుకు కుదురుతుందేమో చూడాలి ఈసారి అన్నారు! 2017 విద్యాబాలన్‌కి రెండు మంచి హిట్లు ఇచ్చింది. ఒకటి ‘బేగమ్ జాన్’. ఇంకోటి ‘తుమ్హారీ సులు’. ఇప్పటికైతే ఇంకా కొత్త సినిమాలకు సంతకాలేం చెయ్యలేదు. ‘ఈ ఏడాది మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?’ నిన్న బర్త్‌డే పార్టీలోనే బాలన్ని మరో క్వొశ్చన్ వేస్తే.. ‘మార్పులేం కోరుకోవడం లేదు’ అన్నారు. అంటే.. మీనింగ్? ఇప్పుడున్నట్లే ఉండడం బాలన్‌కి బాగుందన్నమాట. అంటే.. సంతోషంగా.. తుమ్హారీ సులు చిత్రంలోని గృహిణిగా! -
మేరీ సులూ
‘తుమ్హారీ సులూ’ అని ఒక సినిమా వచ్చింది. సూపర్ డూపర్ స్మార్ట్ మూవీ. బొద్దుగా ఉన్న విద్యాబాలన్ స్టార్‌డమ్‌కి బరువు భారం కాదని, అగ్గిపుల్లలా తయారవ్వక్కర్లేదని, వంకర్లు తిరగడం కంటే ఎక్స్ప్రెషన్ స్ట్రాంగ్ ఉంటే స్క్రీన్‌ని చితకబాదొచ్చని, టికెట్లు చిరగ్గొట్టొచ్చని, చప్పట్ల కేరింతలు డీటీఎస్ కంటే లౌడ్‌గా ఉంటాయని, మళ్లీ మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తూనే ఉంది. సినిమా పేరు తుహ్మారీ సులూ అయితే ‘మేరీ సులూ’ అని ఎందుకు రాశారూ అని అనుకుంటున్నారా? సిద్ధార్థ్ రాయ్ కపూర్... అబ్బ ఇదేం ట్విస్టూ? పేరెందుకలా రాశారంటే ఇంకో కొత్త పేరు తెచ్చేరేంటి? ఎవరీ సిద్ధార్థ్ రాయ్ కపూర్! ఎవరంటే విద్యాబాలన్ ప్రియ మొగుడు. తుమ్హారీ సులూ ఇప్పటికే నాలుగుసార్లు చూశాడట. ఇంట్లో చూసే విద్య కంటే స్క్రీన్ మీద కనబడిన బాలనే బాగా నచ్చిందట! విద్యాబాలన్‌ని విషయం అడిగితే ‘స్క్రీన్ మీద ఇంకా పెద్దగా కనబడతాను కదా’ అని గట్టిగా నవ్విందట. -
బొద్దుగా.. బ్యూటిఫుల్‌గా..!
చూశారుగా.. విద్యాబాలన్‌ని! ‘సన్నగా ఉంటేనే చీర’ అనే ఫీలింగ్ మీలో ఉంటే.. ఆ ఫీలింగ్‌ని చుట్టచుట్టి.. వాషింగ్ మెషీన్లో పడేయండి. మీరు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా... కట్టే చీరను బట్టి అందం వస్తుంది. కడుపు నిండా తినండి. ఒంటి నిండా కట్టండి హెల్దీగా.. హ్యాపీగా ఉండండి. ► పెద్ద అంచు ప్లెయిన్ కంచిపట్టు చీరమీద వెజిటబుల్ కలర్స్‌తో కలంకారీ డిజైన్ వేశారు. మనం సాధారణంగా కంచిపట్టు అనగానే జరీ చూస్తాం. కానీ, కలంకారీతో ఇలా లుక్ మార్చేయవచ్చు. ఈ చీరలు ఏ వేడుకలోనైనా స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి. ► బెనారస్ ఆరెంజ్ నెట్‌కి నలుపురంగు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బార్డర్‌ను జత చేశారు. లైట్గానూ అదే సమయంలో రిచ్‌లుక్‌తో కనిపించాలనుకున్నప్పుడు ఈ స్టైల్ బాగుంటుంది. ప్లెయిన్ శారీకి, సంప్రదాయ డిజైన్ని జత చేస్తే పార్టీకి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చినట్టే! ►బంగారు, గులాబీరంగు కలిస్తే వచ్చే మెరపు చీర అందాన్ని పెంచింది. దీనికి మోచేతుల వరకు ఉండే సెల్ఫ్ బ్లౌజ్ ఆకర్షణీయంగా మార్చింది. దీనికి మరింత వన్నెతీసుకురావడానికి పేటల హారం, చెవులకు జూకాలు, చేతికి కంకణంతో సింపుల్ అండ్ సూపర్బ్ అనిపించేలా గెటప్‌ని తీసుకొచ్చారు. ►మన చేనేతలు ఎప్పుడైనా హుందాతనాన్ని తీసుకు వస్తాయి. ఎక్కడైనా ప్రత్యేకంగా కనిపించా లనుకుంటే బ్లాక్ అండ్ వైట్ చీర ఎంపిక సరైన ఆప్షన్. పాలనురగను తలపించే తెలుపు, బ్లాక్ బార్డర్‌తో ఆకట్టుకునే ఈ కోరాసిల్క్ శారీకి బ్లౌజ్ డిజైన్ మహారాణి కళను తీసుకువచ్చింది. ►ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్రింటెడ్ శారీ! పూర్తి కాంట్రాస్ట్‌గా ఉన్న రెండు ముదురు రంగు కాంబినేషన్ ఫ్యాబ్రిక్స్‌ని ఎంచుకొని, కుచ్చిళ్ల పార్ట్ రంగుని పల్లూ మీద త్రికోణంలో ప్రింట్‌గా వేయించుకుని ఇలా శారీ లుక్ పూర్తిగా మారిపోయేలా డిజైన్ చేసుకోవచ్చు. ► నైట్ పార్టీస్‌కి ఇలా రెడీ అవ్వచ్చు. బ్లాక్, గ్రే రెండు కలర్స్ షేడెడ్గా ఉండేవి ఎంచుకుంటే రిచ్‌గా, స్టైలిష్‌గా, స్లిమ్‌గా కనిపిస్తారు. పైగా తేలికగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లో హెవీగా అనిపించదు. పార్టీని ఎంజాయ్ చేయచ్చు. స్లిమ్‌గా కనిపిస్తున్నారు అనే కితాబులూ కొట్టేయవచ్చు. ► కంజీవరం అంచు, మధ్య పార్ట్ కోరా సిల్క్‌తో డిజైన్ చేసిన చీర ఇది. దీని వల్ల చీర మరీ హెవీగా కనిపించదు. తేలికగా ఉండాలనుకుంటే ఇలాంటి చీర మంచి ఎంపిక. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ధరించడంతో మరింత నిండుతనం చేకూరింది. ఈ చీర మీదకు టెంపుల్ జ్యూయల్రీ బాగా నప్పుతుంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - తుమ్హరీ సులు
-
మీ సులోచన
రోజూ చేసే పని నుంచి జీవితానికి ఒక కొత్త అర్థం వెతుక్కొనే హౌస్ వైఫ్... అదేనండీ... గృహిణి ఎక్కడ ఉండదు? సులోచన జీవితం కూడా అలాంటిదే. ఒక మిడిల్ క్లాస్ గృహిణి. పొద్దున్న లేస్తే ఇంటి పని వంట పని. భర్త అశోక్ తన కష్టాలు చెబితే అవి కూడా కష్టాలేనా అన్నట్లుగా సర్ది చెప్పే భార్య. ఒక చిన్న హోల్‌సేల్ బట్టలు కుట్టే ఫ్యాక్టరీలో పని చేస్తాడు భర్త. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నా... అక్కడికొచ్చిన కొత్తతరం వారసుడు భర్తను టార్చర్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగం కూడా ఉండదేమో అన్నంత దిగులుతో ఉంటాడు ఆ భర్త. ఇంకో పక్క స్కూల్లో చదువుకుంటున్న పదకొండేళ్ల కొడుకు పియర్ ప్రెషర్ వల్ల బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడతాడు. సులుకి ఉన్న ఇద్దరు అక్కయ్యలూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్లకు సులు అంటే చిన్న చూపు. ఎప్పుడూ ‘ఏదో ఒకటి చెయ్యచ్చు కదా’ అని దెప్పి పొడుస్తూ ఉంటారు. సులుకి రేడియో వినడమంటే ఇష్టం. అందులో వచ్చే కాంపిటీషన్లలో ప్రెషర్ కుక్కర్ లాంటివి తరచూ గెలుస్తూ ఉంటుంది. అదే పరంపరలో మరో సారి ఒక రేడియో స్టేషన్లో ఇంకో ప్రెషర్ కుక్కర్‌ను గెలుచుకుంటుంది. ‘ఆల్రెడీ ఒకటి గెలిచాను, ఇంకేదైనా ఇప్పించండి’ అని అడుగుతుంది సులు. ‘కుదరదు’ అంటారు అక్కడి సిబ్బంది. అదే సంస్థలో రేడియో జాకీ కోసం ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. దానిలో పాల్గొని సులు రేడియో జాకీ అవుతుంది. ఇదే సులుకు మొదటి ఉద్యోగం. అంటే ఇంటి పని వంటి పని కాకుండా జీతం వచ్చే ఉద్యోగం. సులుకు గుర్తింపు తెచ్చే ఉద్యోగం. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న అక్కయ్యలకు చూపించుకునే ఉద్యోగం. అంతా బాగానే ఉంది కానీ ఒక పెద్ద తిరకాసు. నైట్ టైమ్ టాక్ షోకి రేడియో జాకీ ఉద్యోగం. ఎలాగయితేనేమి భర్తను కన్విన్స్ చేసి ఉద్యోగానికి వెళ్తుంది సులు. అంత రాత్రి వేళ ఫోనులో ముచ్చట్లు పెట్టుకునే వాళ్లెవరు? లోన్లీగా ఉండే మగ పురుగులు... మాట్లాడుతుంది సులు. అది చాలా ప్రేమగా మాట్లాడే సులు ‘తుంహారీ సులు’ అంటే ‘మీ సులు’ అని అర్థం. అంతే నైట్ కాలర్స్ రెచ్చి పోయి మాట్లాడుతారు. దానికి సులు చాలా తెలివిగా సమాధానాలు ఇస్తుంది. షో పెద్ద హిట్. ఆ రేడియో స్టేషన్‌కి ఎప్పుడూ రానంత హిట్. సులుకి ఉద్యోగం చాలా నచ్చింది. తనకు ఒక ఉనికి ప్రసాదించిన ఉద్యోగం మరి నచ్చదా? కానీ అక్కయ్యలకు, భర్తకు నచ్చదు. ఉద్యోగం మానెయ్యమని ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. కానీ సులు మానుకోదు. ఒక మహిళ అస్తిత్వాన్ని ప్రశ్నించే సమాజానికి అద్దం పట్టాడు డైరెక్టర్ సురేశ్ త్రివేణి. కథ చెప్పడంలో కామెడీని ఆధారంగా తీసుకున్నాడు. ‘ఒక పెళ్లి అయిన మహిళ అర్ధరాత్రి పరాయి మగాళ్లతో మాట్లాడడం... అన్నది, అదీ తాను మాట్లాడుతుంది అందరూ వింటారని... భర్త కొడుకు కూడా వింటారు’ అనే నేపథ్యంలో మహిళ అస్తిత్వాన్ని నిలబెడతాడు డైరెక్టర్. నిజానికి మహిళలు నేడు తమ జీవితాల్లో నిలబడి ఉన్న కూడలికి సులు పరిస్థితికి ఎక్కువ తేడా లేదు. ఎంచుకున్న నేపథ్యం విపరీతమైనది అయినా, అది కథ చెప్పడానికి పనికి వచ్చింది. ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేయడానికి వర్కవుట్ అయ్యింది. అంతకంటే గొప్ప విషయం ఈ సినిమా ద్వారా చెప్పింది మహిళలకు ఉన్న పరిధులు. ఇదంతా జరుగుతున్నప్పుడు సులు కొడుకు స్కూల్లో ఒక అశ్లీల వీడియో విషయంలో పట్టుపడతాడు. ఆ తరువాత ఒక రోజు ఇల్లు వదిలి పారిపోతాడు. దీంతో పిల్లవాడు చేసిన తప్పుకు... సులు పెంపకానికి లింకులేస్తుంది సమాజం. ఒక పక్క బిడ్డ కనబడడం లేదన్న బాధ, మరో పక్క ఉనికిని వదులుకోవాలా... అన్న సంఘర్షణ మధ్య నుంచి సులు ఎలా గెలుస్తుంది అన్నదే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘మై కర్సక్తీ హై ’’ అన్నదే ఈ సినిమా థీమ్. అంటే ‘‘నేను చేయగలను’’ అని! సమాజానికి తెలియాల్సిన ఒక విలువైన విషయాన్ని ఏడుస్తూ... ఏడిపిస్తూ... చెప్పనక్కరలేదని, ఎక్కువ మందికి విషయం చేరాలంటే ఆర్ద్రత కలబోసినప్పటికీ హ్యూమర్ అవసరమని... అలా అని సెన్సిటివిటీని పోగొట్టకుండా అందంగా చెప్పవచ్చని డైరెక్టర్ నిరూపించాడు. మకిలి... అర్ధరాత్రి ఫోన్ చేస్తున్న మనుషుల్లో కన్నా మన చుట్టూనే ఎక్కువగా ఉంది అనిపించింది. ‘సులు’గా విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. సినిమా కోసం కొంచెం లావయ్యారామె. నడకలో ఒక రకమైన స్వింగ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. నా బరువు నా ఇష్టం అనిపించేలా ఉంది ఆ నడక. ప్రతి చోటా క్యారెక్టర్ పడకుండా చూసుకున్నారు. భర్త అశోక్ పాత్రలో మానవ్కౌల్ ఇమిడిపోయారు. చూడదగ్గ సినిమా. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. -
సిగ్గుపడితే అంతే సంగతులు
... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. ముఖ్యంగా సినిమా తారలకు సిగ్గు ఉండకూడదని పేర్కొన్నారామె. అందుకే.. బిడియస్తులు ఇండస్ట్రీకి రాకూడదని, వస్తే అంతే సంగతులని విద్యా సెలవిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఒక్కసారి ముఖానికి మేకప్ వేసుకుంటే.. ఆ క్యారెక్టర్ తప్ప పర్సనల్ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టేయాలి. రొమాంటిక్ సీన్ చేయాలంటే చేయాల్సిందే. నలుగురూ ఉన్నారు కదా అనుకుంటే ఫెయిలవుతాం. సెంటిమెంట్ సీన్లో ఏడవమంటే ఏడవాల్సిందే. సీన్ డిమాండ్ చేస్తే.. డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాల్సిందే. ‘అయ్య బాబోయ్ నాకు సిగ్గండీ’ అంటే సినిమాకి న్యాయం జరగదు. సిగ్గు, మొహమాటం, భయం.. ఈ రంగంలో పనికిరావు. బిందాస్‌గా ఉండటం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కాన్ఫిడెన్స్ గురించి చెప్పాలంటే.. ఒక్క సినిమా ఫీల్డ్‌లో మాత్రమే కాదు.. ఏ జాబ్ చేసినా అలానే ఉండాలి. అప్పుడే సక్సెస్ కాగలుగుతాం’’ అన్నారు విద్యాబాలన్. సురేశ్ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘తుమ్హారీ సులు’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో విద్యా పాత్ర పేరు సులు. రేడియో జాకీ క్యారెక్టర్ చేశారు. హౌస్‌వైఫ్‌గా ఉండే సులు అనుకోకుండా ఆర్జే జాబ్ ఒప్పుకుంటుంది. ఇది నైట్ డ్యూటీ. జాబ్‌లో చేరాక ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో సినిమా నడుస్తుంది. -
'పద్మావతి' దెబ్బకు ఆ సిన్మా ముందుకు జరిగింది!
సాక్షి, ముంబై: అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పోటీపడటానికి ఇతర బాలీవుడ్ చిత్రాలేవీ ఇష్టపడటం లేదు. డిసెంబర్ 1 నాడే విద్యాబాలన్ తాజా సినిమా 'తుమ్హారి సూలు' విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో సంకేతాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఈ చిత్ర దర్శక నిర్మాతలు తమ మనస్సు మార్చుకున్నారు. 'పద్మావతి'తో పోటీని నివారించేందుకు ఒక వారం ముందుగానే నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మరింత ముందుకు జరిగింది. నవంబర్ 24న కాదు 17నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు 'డీఎన్ఏ' వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. పద్మావతి సినిమాకు ఒక వారం ముందు విడుదలైనా.. వారం రోజుల తర్వాత థియేటర్లలో తమ సినిమా ఉండే పరిస్థితి ఉండదని, కాబట్టి కనీసం రెండు వారాలు ముందుకు జరిగితే.. ఎక్కువకాలం థియేటర్లలో ఉండే అవకాశముంటుందని దర్శకనిర్మాతలు.. 'తుమ్హారీ సూలు' సినిమా విడుదల తేదీని ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. 'తుమ్హారి సూలు' కామెడీ ఎంటర్టైనర్. విద్యా బాలన్ ఈ సినిమాలో లేట్ రేడియో షో నిర్వహించే ఆర్జేగా నటించారు. మధ్యతరగతి గృహిణిగా, హస్కీ వాయిస్‌తో శ్రోతలకు మత్తెక్కించే రేడియో జాకీగా ఆమె నటన.. ట్రైలర్లో ఆకట్టుకుంది. ఇక, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో దీపికా పదుకోన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్ రాజ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, విలన్ సుల్తాన్ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. భన్సాలీ మార్క్ గ్రాండ్ విజువలైజేషన్.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా మలిచిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్లో ఖిల్జీగా రణ్వీర్ సింగ్ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్, దీపిక అభినయం కనబర్చారు. -
విద్యాబాలన్ క్షేమం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ‘డీఎన్ఏ’ పత్రిక వెల్లడించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బాంద్రా వెళుతుండగా ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యాబాలన్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం బాగా దెబ్బతింది. ‘విద్యాబాలన్ సురక్షితంగా ఉన్నారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేద’ని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 38 ఏళ్ల విద్యాబాలన్ తాజాగా నటించిన ‘తుమ్హారీ సులూ’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లో ఆమె బిజీగా ఉన్నారు. ఇందులో లేట్ నైట్ ఆర్.జె. (రేడియో జాకీ) సులోచన పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఇంతకుముందు ‘లగే రహో మున్నాభాయ్’లో ఆర్.జె.గా ఆమె కనిపించారు. ‘తుమ్హారీ సులూ’ లో విద్యాబాలన్ తొలిసారిగా పూర్తి కామెడీ రోల్ చేశారు. ఈ సినిమాకు కామెడీ హైలైట్ అవుతుందని చిత్రబృందం తెలిపింది. నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. -
పహ్లాజ్ నిహలానీపై వేటు
► ప్రసూన్ జోషికిసెన్సార్ బోర్డు బాధ్యతలు ► సభ్యురాలిగా విద్యాబాలన్ న్యూఢిల్లీ: జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై వేటు పడింది. సీబీఎఫ్సీ పదవినుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ఆదేశించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. జూలై చివర్లోనే నిహలానీని తప్పిస్తారని కేంద్రం సంకేతాలిచ్చింది. సీబీఎఫ్సీ కమిటీలో నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయని ఇటీవలే సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఎంపికైన∙దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. బ్లాక్, తారే జమీన్పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ–6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ అవార్డును, ఉత్తమ గీతరచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషిని సీబీఎఫ్సీ చీఫ్‌గా నియమించటంపై చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. వివాదాల పుట్ట నిహలానీ.. 2015లో సెన్సార్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ నిహలానీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆరెస్సెస్ అండదండలతోనే నిహలానీకి ఈ పదవి దక్కిందనే విమర్శలూ ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు, చిత్రాల సెన్సార్ విషయంలో చిత్రసీమ నిహలానీ తీరును చాలాసార్లు బహిరంగంగానే విమర్శించింది. తనను ‘ట్రూ ఇండియన్’గా పరిచయం చేసుకునే నిహలానీ.. చాలా చిత్రాలకు కట్స్, బీప్స్, ఖండనల విషయంలో అతిగా వ్యవహరించేవారని విమర్శలున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రంలో అశ్లీలం ఎక్కువగా ఉందంటూ భారత్‌లో విడుదలకు అనుమతించ కపోవటంతో తొలిసారిగా నిహలానీ వార్తల్లో కెక్కారు. జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’లోనూ చాలా సీన్లను ఈయన తొలగించారు. ఆ తర్వాత ఎన్‌హెచ్ 10, దమ్ లగాకే హైస్సా, అలీగఢ్, ఉడ్తా పంజాబ్, హరామ్ ఖోర్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఇందు సర్కార్, బాబుమషాయ్ బందూక్‌బాజ్ మొదలైన చిత్రాల్లోనూ కీలక సన్నివేశాల్లో దృశ్యాలను తొలగించారు. -
ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి
ముంబయి: బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీలు అనగానే గుర్తొచ్చే పేరు విద్యాబాలన్. ది డర్టీ పిక్చర్ తో ఇండస్ట్రీలో వేడి పుట్టించిన సీనియర్ నటి విద్యాబాలన్ ఖాతాలో పా, కహానీ వంటి హిట్లున్నాయి. హిట్ వస్తే ఎగిరి గంతేయకపోయినా.. ఫ్లాప్‌లు ఎదురైతే భరించలేనని, కాస్త కష్టంగా ఉంటుందని చెబుతోంది ఈ బొద్దుగుమ్మ. ఆమె లేటెస్ట్ మూవీలు బాబీ జాసూస్(2014), కహానీ సీక్వెల్ కహానీ-2(2016), బేగం జాన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. ఫెయిల్యూర్ ప్రభావం మాత్రం తర్వాతి మూవీపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. సినిమా హిట్ అయితే బంధువులు, సన్నిహితులతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను. అదే విధంగా మూవీ ఫ్లాప్ అయితే ఏదో మూలకు పరిమితమయ్యే రకం కాదని స్పష్టం చేసింది విద్య. సినిమా పరాజయం పాలైతే ఆ బాధను అందరితో షేర్ చేసుకుంటూ ఏడ్చేస్తానని తెలిపింది. కొన్ని రోజులవరకు ఆ బాధ ఉండటం ఎవరికైనా సహజమేనని చెప్పింది. ఫ్లాపులపై ఇతరులు ఏమన్నా పట్టించుకోనని, ఏం చేయాలో తనకు తెలుసునని కొన్ని సందర్భాల్లో జరిగేదాన్ని ఎవరూ మార్చలేరని అభిప్రాయపడింది విద్యాబాలన్. -
తోటి నటిని దెప్పిపొడిచిన టాప్ హీరోయిన్!
బాలీవుడ్ నాయకి కంగనా రనౌత్‌కు వివాదాలు కొత్త కాదు. బాలీవుడ్ ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎక్కువంటూ ఏకంగా కరణ్ జోహర్ షోలో పేర్కొని పెద్ద దుమారమే ఆమె లేవనెత్తింది. అంతకుముందు హృతిక్ రోషన్‌తో గొడవపడ్డ సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె మరో వివాదానికి తెరలేపింది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆమె తాజా చిత్రం ‘సిమ్రాన్’ క్రెడిట్ ఎవరికీ దక్కాలనేది వివాదం రేపుతోంది. సిమ్రాన్ చిత్ర ఒరిజినల్ కథ వాస్తవానికి అపూర్వ అస్రానిది. కంగనతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో తెరవెనుక రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన వివరిస్తూ పెద్ద ఫేస్బుక్ పోస్టే పెట్టారు. ఆ తర్వాత ‘మణికర్ణిక’ చిత్రం విషయంలో వివాదమే రేగింది. నిజానికి ఈ చిత్రాన్ని తాను తెరకెక్కించాల్సి ఉందని, కానీ కంగన దీనిని తనవద్ద నుంచి దొంగలించిందని దర్శకుడు కేతన్ మెహతా ఆరోపించారు. తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇలా క్రెడిట్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కంగనను పరోక్షంగా దెప్పిపొడుతూ మరో టాప్ హీరోయిన్ విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. ‘దర్శకుడు ఇలా (క్రెడిట్) కార్డు కానుకగా ఇచ్చినప్పుడు ఇంకా క్రెడిట్ ఎవరికీ కావాలండి? థాంక్యూ సురేష్ త్రివేని’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టి.. తన పేరిట అదనంగా వచ్చిన క్రెడిట్ కార్డు ఫొటోను పోస్టు చేసింది. విద్యాబాలన్ తాజా చిత్రం ’యువర్ సులూ’ కు సురేష్ త్రివేని దర్శకుడు. నిర్మాత తనూజ్ గార్గ్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ విద్య ఎక్స్ట్రా క్రెడిట్ అడగకముందే.. ఆమెకు దర్శకుడు క్రెడిట్ కార్డు ఇచ్చేశాడు’ అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఈ చర్చలోకి అపూర్వ అస్రాని కూడా ప్రవేశించి.. అదనపు ‘క్రెడిట్’ కోసం నిర్మాతను విద్య డిమాండ్ చేయకముందే.. ఆమెకు నిర్మాత ఇచ్చేశాడు. హిలేరియస్’ అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిన ఈ పోస్టు లక్ష్యం ఎవరో చెప్పకనే చెప్పేశారు వీరు. కంగనను దెప్పిపొడిచేందుకు విద్య ఈ పోస్టు పెట్టిందని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్‌బ్రాండ్ కంగన ఎలా స్పందిస్తుందనేది ఆకస్తికరంగా మారింది. -
సూపర్‌స్టార్‌కు హ్యాండిచ్చిన విద్యాబాలన్
బాలీవుడ్ భామ విద్యాబాలన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మరోసారి హ్యాండిచ్చారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్‌తో నటించడానికి ఒక పక్క ప్రముఖ కథానాయికల నుంచి యువ నాయికల వరకూ పరితపిస్తుంటే, నటి విద్యాబాలన్‌కు మాత్రం అలాంటి లక్కీఛాన్స్ మూడు సార్లు తలుపుతట్టింది. అయినా ఆ జాణ సద్వినియోగం చేసుకోలేకపోతోందనే చెప్పాలి. ది దర్టీ పిక్చర్ చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్‌కు ఇంతకు ముందు లింగా చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. దాన్నే కాదు కదా ఆ తరువాత కబాలి చిత్రంలోనూ ఆమెకే ముందు అవకాశం వచ్చింది. దాన్ని విద్యాబాలన్ అందుకోలేకపోయింది. తాజాగా మరోసారి వచ్చిన అవకాశాన్ని ఈ అమ్మడు కాలదన్నుకుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా కబాలి–2 చిత్రానికి రెడీ అవుతున్నారు. పా.రంజిత్‌నే దర్శకత్వం వహించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రజనీకాంత్ అల్లుడు, యువ స్టార్ నటుడు ధనుష్ హ్యాడింల్ చేస్తున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాటలకు బాణీలు కట్టడంలో బిజీగా ఉన్నారు. చిత్రం షూటింగ్ ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో నటి విద్యాబాలన్ నాయకిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోనూ ఆమె నటించడంలేదని తెలిసింది. కాల్షీట్స్ సమస్య కారణంగానే విద్యాబాలన్ రజనీకాంత్ చిత్రాన్ని అంగీకరించలేకపోయిందని సమాచారం. దీంతో మరో బాలీవుడ్ బ్యూటీ కోసం కబాలి–2 చిత్ర యూనిట్ వేట మొదలెట్టిందని తెలిసింది. -
సులోచన అండ్ వండర్ఫుల్ మదర్స్!
‘తుమ్హారీ సులు’... విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా ఇది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ‘లగే రహో మున్నాభాయ్’ (తెలుగులో ‘శంకర్‌దాదా జిందాబాద్’గా రీమేక్ చేశారు)లో రేడియో జాకీ (ఆర్జే)గా నటించిన విద్యా... మళ్లీ ఈ సినిమాలో ఆర్జేగా సులోచన పాత్రలో నటిస్తుండడం స్పెషల్. ఇంకో స్పెషల్ ఏంటంటే... శుక్రవారం పూజా కార్యక్రమాలతో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది. ఈ పూజకు విద్యా తల్లి సరస్వతీ బాలన్‌తో పాటు చిత్ర నిర్మాతలు అతుల్, తనూజ్ గర్గ్, శాంతి శివరామ్, దర్శకుడు సురేశ్ త్రివేణిల మాతృమూర్తులు హాజరై చిత్రబృందాన్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారితో విద్యా ఫొటో దిగారు. ‘‘వండర్ఫుల్ మదర్స్ బ్లెస్సింగ్స్‌తో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది.మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నా’’ అని విద్యా పేర్కొన్నారు. పాటతో ఈ రోజు ముంబైలోని వోర్లీలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. జూన్ నెలాఖరుకి సినిమాని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. -
మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..!
బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ల సినిమాలకు పాక్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల కాలం పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ చర్యల మూలంగా చాలా వరకు మన సినిమాలు పాక్ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలను పాక్ తమ దేశంలో ప్రదర్శించేందుకు అనుమతించదు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమాను కూడా భారతజాతీయం గీతం ఉందన్న కారణంతో పాక్ లో ప్రదర్శించేందుకు నిరాకరించింది. అయితే తాజాగా మరో సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేగం జాన్ సినిమాపై పాక్ సెన్సార్ బోర్డ్ నిషేదం విధించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఈ సినిమాలో అభ్యంతరపెట్టాల్సిన అంశాలేవి లేవని, అయినా పాక్ నిషేదం విధించటం బాధాకరమని చిత్రయూనిట్ తెలిపింది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జాణల్లా జీవించారు.. రాణుల్లా పోరాడారు బేగం జాన్ : ట్రైలర్ నిడివి : 2 ని. 55 సె. హిట్స్ : 1,45,37,696 లివ్డ్ యాజ్ ఓర్స్, ఫాట్ యాజ్ క్వీన్స్.. ‘బేగమ్ జాన్’ చిత్రం ట్రైలర్ ట్యాగ్ లైన్ ఇది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బేగం జాన్’లో బేగంగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ఆమెతో పాటు ఉద్ధండులైన నసీరుద్దీన్ షా, ఇళా అరుణ్ మొదలైన వాళ్లు! బెంగాలీ చిత్రం ‘రజ్కహిని’ కి ఇది రీమేక్. 1947 కాలం నాటి ఈ కథలో విద్యాబాలన్ బ్రోతల్ హౌస్ పెద్దమ్మిగా నటించారు. భారతదేశ చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆదేశాల ప్రకారం దేశ విభజన జరుగుతుంది. ఆ విభజన రేఖ విద్యాబాలన్ ఇంటి మీదుగా వెళుతుంది. అంటే ఇంటిని అక్కడి నుంచి తొలగించాలి. అధికారులు వస్తారు. ఇల్లు ఖాళీ చెయ్యాలని చెబుతారు. ఇండియా– పాకిస్థాన్ విభజన రేఖ ఈ ఇంటి గుండా పోతుందని చెబుతారు. విద్యాబాలన్ వినదు. ‘బ్రోతల్ హౌసే కదా.. ఖాళీ చెయ్యడానికి ఏమయింది?’ అని అంటారు అధికారులు. ‘బ్రోతల్ హౌసే.. కానీ ఇది మా ఇల్లు’ అని చెబుతుంది విద్య. ‘విభజన పేరుతో ఎవరైనా ఈ ఇంటిని ధ్వంసం చెయ్యాలని చూశారా వారి కాళ్లను, చేతులను వాళ్ల దేహం నుంచి వేరు చేస్తాను అంటుంది’ విద్య. ‘నిన్ను చంపేస్తారు’ అని హెచ్చరిస్తారు. ‘రాణిలా ఛస్తాను కానీ ఇక్కడి నుంచి కదలను. ఏం చేస్తారో చెయ్యండి’ అంటుంది విద్య. బ్రిటిష్ అధికారులకు, విద్యాబాలన్ ‘కుటుంబ సభ్యులకు’లకు పోరు మొదలౌతుంది. తర్వాత ఏమౌతుంది? ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాలి. ట్రైలర్లో కథంతా తెలిసినట్లు అనిపిస్తుంది. ఇంతకు ఇంతా కథ ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో ఉండబోతోంది. పిల్లలకు చూపించండి... ఎంజాయ్ చేస్తారు యామ్‌ట్రాక్ స్లో–మో కొల్లీషన్ నిడివి : 42 సె. హిట్స్ : 54,65,55 ‘స్టెల్లా’ మంచు తుపాను రెండు రోజుల క్రితం యు.ఎస్.లోని కొన్ని ప్రాంతాలను అస్తవ్యస్తం చేసేసింది. దాని ఎఫెక్ట్ ఇంకా అక్కడక్కడా ఉంది. ముఖ్యంగా మసాచుసెట్స్ రాష్ట్రంలో అనేక చోట్ల రహదారులు మంచులో కూరుకుపోయాయి. ఇళ్లు, వాకిళ్లు కనుమరుగైపోయాయి. లోపల ఎవరున్నారో, బయట నుంచి ఎవరొస్తున్నారో కనుక్కోవడం కష్టం అయిపోయింది. ఇక లోకల్ రైలు పట్టాలపై 20 అంగుళాల ఎత్తున మంచు పేరుకుపోయింది. ర్యాన్క్లిఫ్, న్యూయార్క్ స్టేషన్ల గుండా నిత్యం పరుగులు తీసే ప్యాసింజర్ రైళ్లు ఈ రెండు రోజులూ పట్టాలు కనిపించకుండా పెద్ద పలకలా గడ్డకట్టుకు పోయిన మంచును స్లో మోషన్లో కోసుకుంటూ నడిచాయి. ఈ వీడియోలో మీకు అలాంటి ‘అత్యద్భుతమైన’దృశ్యమే కనిపిస్తుంది. ‘యామ్‌ట్రాక్’ కార్పోరేషన్ రైలు స్టేషన్లోకి వస్తున్నప్పుడు దానిని ఎక్కేందుకు స్టేషన్లో నిలబడిన ప్యాసింజర్లు కొందరు స్మార్ట్ఫోన్లలో చిత్రీకరించారు. వాళ్లలో ఒకరు ఇదిగో ఇలా యూట్యూబ్‌లో పెట్టారు. పెట్టిన కొద్ది సేపటికే లక్షలో హిట్స్ వచ్చిపడ్డాయి. -
విద్యా ఓకే... వెయిటింగ్లో ఖుష్బూ!
దీపికా పదుకొనె కాదు... విద్యా బాలన్‌తో సూపర్‌స్టార్ జోడీ కడుతున్నారట! మరో హీరోయిన్గా ఖుష్బూ పేరు వినిపిస్తోంది. ‘కబాలి’ తర్వాత రజనీకాంత్ హీరోగా మరో సినిమా తీయడానికి దర్శకుడు పా. రంజిత్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ముంబయ్ నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్‌కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తారంటూ వచ్చిన వార్తలను దర్శకుడు ఖండించారు. మరి, రజనీకి జోడీగా ఎవరు నటిస్తారంటే? ‘‘ఓ హీరోయిన్గా విద్యా బాలన్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్గా ఖుష్బు నటించే ఛాన్సుంది. 90లలో స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి’’ అని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. రాజకీయాలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఖుష్బు రీసెంట్గా రీ–ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో రాధిక, సుహాసిని, ఊర్వశి, ఆమె ముఖ్య తారలుగా ఓ సినిమా రూపొందుతోంది. తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. రజనీ–రంజిత్ సినిమా ఓకే అయితే సూపర్ ఛాన్స్ వచ్చినట్లే! ‘కబాలి’లోనూ రజనీకి జోడీగా యంగ్ లుక్స్‌తో కనిపించే హీరోయిన్లను కాకుండా కాస్త ఎక్కువ వయసున్న హీరోయిన్లా కనిపించే రాధికా ఆప్టేను దర్శకుడు పా. రంజిత్ ఎంపిక చేశారు. అందులో ఆమె పాత్ర కూడా అటువంటిదే. మరి, ఇప్పుడీ సినిమాలో విద్యా బాలన్, ఖుష్బు పాత్రలు ఎలా ఉంటాయో!? రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ మేలో ప్రారంభించాలనుకుంటున్నారు. -
ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?
ముక్కు సూటిగా మాట్లాడటం.. మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టడం బాలీవుడ్ నటి విద్యాబాలన్ నైజం. త్వరలో 'బేగం జాన్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్న ఈ అమ్మడు తాజాగా ఓ క్లినిక్ వద్ద కనిపించడం బాలీవుడ్లో వదంతులకు తావిచ్చింది. విద్యాబాలన్ గర్భవతి అయిందని, త్వరలోనే ఆమె ఓ బిడ్డను ప్రసవించబోతున్నదని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఆమెకు అర్థంలేని ప్రశ్నలు ఎదురవ్వడమూ మొదలైంది. చికాకు పరుస్తున్న ఈ ప్రశ్నలపై 'మిడ్-డే' పత్రికతో మాట్లాడుతూ విద్యాబాలన్ ఘాటుగా స్పందించింది. 'ఇది చాలా చికాకు పరుస్తోంది. నేను ఏదైనా కారణంతో క్లినిక్‌కు వెళ్లి ఉండవచ్చు. పెళ్లి తర్వాత ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లితే.. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఊహాగానాలు మొదలుపెడతారా?' అంటూ ప్రశ్నించింది. 'డర్టీ పిక్చర్' నటి విద్య 2012లో నిర్మాత సిద్ధార్థ రాయ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి, ప్రెగ్నెన్సీ గురించి, పిల్లలను ఎప్పుడు కంటారంటూ సంబంధంలేని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని ఆమె పేర్కొంది. 'ఇది నాకు, నా భర్తకు సంబంధించిన వ్యక్తిగత అంశం. దీంతో ఇతరులకు ఏం సంబంధం లేదు. ఇలా అడుగటం మా వ్యక్తిగత ఏకాంతంలోకి చొరబడటమే. కానీ మన దేశమే అలా తయారైంది. ఇరుగుపొరుగువారు, బంధువులు తరచూ ఇవే అనవసర ప్రశ్నలు అడుగుతుంటారు. మా పెళ్లినాడే మా అంకుల్ ఒకాయన పెళ్లి మండపంలోకి వచ్చి 'నెక్ట్స్టైం నేను చూసేటప్పటకీ మీరు ఇద్దరు కాదు ముగ్గురు ఉండాల'ని అన్నాడు. మా పెళ్లి ఫొటోలను కూడా అప్పటికి క్లిక్ చేయలేదు. కనీసం హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లాలో నిర్ణయించుకోలేదు. కానీ ఆయన అలా అనడంతో ఏం చెప్పాలో తోచలేదు. చిన్నగా నవ్వాను' అని విద్యాబాలన్ వివరించింది. 'అయినా, ఈ పిల్లల గోల ఏంటో? నేనేమీ పిల్లల్ని కనే మెషిన్‌ను కాదు. అయినా, ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఎవరైనా పిల్లల్ని కనకుంటే వచ్చే నష్టమేమీ లేదు' అంటూ విద్య ముగించింది. -
పిల్లల్ని కనే యంత్రాన్ని కాదు!
‘మీరు ఎప్పుడు అమ్మ కాబోతున్నారు?’ – పెళ్లయిన కథానాయికలకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో ఇదొకటి. వాళ్లు ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెబుతుంటారు. కానీ, విద్యా బాలన్ రూటే సపరేటు కదా! ఆమెను ఈ ప్రశ్న అడగ్గా.. ‘‘నేనేమీ బేబీ మేకింగ్ మెషీన్ కాదు. ఎనీవే, ప్రపంచంలో రోజు రోజుకీ పాపులేషన్ పెరుగుతోంది. కొందరికి పిల్లలు లేనట్లయితే మంచిదే’’ అన్నారు. దీంతో పాటు పెళ్లి మండపంలో జరిగిన ఓ సంఘటనను విద్యాబాలన్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఫ్యామిలీ ప్లానింగ్ అనేది నాకూ, మా ఆయనకూ సంబంధించినది. మిగతా వాళ్లకు దాంతో పని లేదనుకుంటున్నా. కానీ, మన దేశంలో బంధువులు, ఇరుగు పొరుగువారు అనవసరమైన ప్రశ్నలు వేస్తారు. పెళ్లయిన కొన్ని నిమిషాలకు మా అంకుల్ ఒకరు మా (సిద్ధార్థ్, విద్యా బాలన్) దగ్గరకు వచ్చి, ‘మళ్లీ నేను మిమ్మల్ని చూసినప్పుడు ముగ్గురు కనిపించాలి’ అన్నారు. పెళ్లప్పుడే∙పిల్లల ప్రస్తావన తీసుకొచ్చారాయన. నేను నవ్వి ఊరు కున్నా. ఎందుకంటే అప్పటికి హనీ మూన్‌కి ఎక్కడికి వెళ్లాలనేది కూడా నిర్ణయించు కోలేదు’’ అన్నారు విద్యాబాలన్. -
సినీనటులకు రాజకీయ స్టాండ్ ఉండకూడదట!
న్యూఢిల్లీ: కహానీ, డర్టీపిక్చర్ లాంటి సినిమాలతో విలక్షణనటిగా గుర్తింపు తెచ్చుకుని తనదైన నటనతో దూసుకుపోతున్న బాలీవుడ్ భామ విద్యాబాలన్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయాలపై ఒక వైఖరి తీసుకోకూడదని నేషనల్ అవార్డు విజేత విద్య అభిప్రాయపడ్డారు. రాజకీయాలపై తన వైఖరిని వ్యక్తం చేయడం ద్వారా తన అభిమానులను ప్రభావితం చేయడం తనకు ఇష్టముండదని తెలిపారు. అందుకే తాను ఎలాంటి రాజకీయ స్టాండ్ తీసుకోనని వివరించారు. పద్మావతి ఔట్ డోర్ సెట్ దాడి ఘటనపై స్పందించిన విద్య ఇటీవల కొత్త సినిమాలు యాక్టవిస్టుల దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఇది తనను చాలా బాధించిందన్నారు. ఈ దాడులు పెరుగుతున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు ఏదో విధంగా వివాదం సృష్టించి దృష్టిని తమవైపు మరల్చుకుంటారని విద్య ఆరోపించారు. పరిశ్రమకు బయట, లోపల ఉన్న కొంతమంది వ్యక్తులు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. అలాగే సింగర్ నాహిద్కు మద్దతుగా నిలిచారు. కళలకు ఎల్లలు లేవని వ్యాఖ్యానించారు. ఈశ్వర్ ని అయినా.. అల్లా అని అయినా కలుపేది ఆ కళేనని తాను నమ్ముతానని చెప్పారు. వేశ్యాగృహం నడిపే మహిళ కథ విన్నపుడు వివాదాస్పదమవుతుందని తాను భావించాననీ, కానీ "బేగం జాన్" కు ఎలాంటి కట్ లు లేకుండా సెన్సార్ అనుమతి లభించడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే అవసరమైతే నిర్మాత మహేష్ భట్, దర్శకుడు శ్రీజిత ముఖర్జీ ఈ మూవీ కోసం ఫైట్ చేస్తారనే నమ్మకం కూడా తనకు ఉండిందన్నారు. ఈ సినిమాలో చాలా ఆకట్టుకునే బలమైన దృశ్యాలున్నాయని చెప్పారు. కాగా వేశ్యాగృహం యజమానిగా బేగం జాన్ పాత్రలో విద్యాబాలన్ నటించిన బేగం జాన్ ట్రైలర్లో దేశవ్యాప్తంగా పలువురిని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
-
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేషాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది విద్యా. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ సమక్షంలో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. -
సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!
కోల్‌కతాలో విమానాశ్రయంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ఫీ పేరిట దురుసుగా వ్యవహరించిన అతని తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తాజా చిత్రం ’బేగం జాన్’ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న విద్యా బాలన్ కోల్‌కతా విమానాశ్రయంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి తనతో సెల్ఫీ దిగాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకుంది కూడా. అయితే, సరిగ్గా మొబైల్‌ఫోన్‌తో సెల్ఫీ క్లిక్ చేసే సమయంలో ఆమె చుట్టూ చేయి వేసి వికృతబుద్ధి బయటపెట్టుకున్నాడు. చుట్టూ చేయి వేయడంతో కంగుతిన్న ఆమె అతని తీరును తీవ్రంగా వారించింది. అయినా అతను ఫొటోలు తీస్తూ ఉండటంతో సహనం కోల్పోయిన ఆమె ఆ వ్యక్తిపై తీవ్రంగా మండిపడింది. ’అసలు ఏం చేస్తున్నావు. సక్రమంగా ప్రవర్తించడం తెలియదా?’ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటన గురించి విద్యాబాలన్ స్పందిస్తూ..’ఓ అగంతకుడు మీ చుట్టూ చేతులు వేస్తే.. పురుషులైనా, మహిళలైనా అసౌకర్యంగా భావిస్తారు. అది వ్యక్తిగత పరిధిలోకి చొరబడటమే అవుతుంది. మేం పబ్లిక్ ఫిగర్లమే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు’ అని పేర్కొంది. -
'బేగం జాన్' ఫస్ట్ లుక్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేసాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో లీక్ అయిన బేగం జాన్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. -
రజనీకి జంటగా విద్యాబాలన్
రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్ పా దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ రూపొందిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు, ఇందులో రజనీకి జంటగా బాలివుడ్ నటి విద్యాబాలన్ నటించవచ్చనే సమాచారం వెలువడింది. దీనిగురించి విద్యాబాలన్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపారు. అయినప్పటికీ, అప్పట్లో కాల్షీట్లు కుదరలేదు. దీంతో ఆ చిత్రావకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలోనూ రజనీ వృద్ధ గెటప్‌లో నటించనున్నారని సమాచారం. – టినగర్