Vidya Balan Reveals Shocking Things About Her Struggles In Career Starting n Up On Her Struggles, Details Inside - Sakshi
Sakshi News home page

Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు..

Published Fri, Mar 18 2022 1:12 PM | Last Updated on Fri, Mar 18 2022 2:51 PM

Vidya Balan Open Up On Her Struggles And She Kicked Out From 13 Movies - Sakshi

Vidya Balan Open Up On Her Struggles: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో విద్యా బాలన్‌ ఒకరు. లేడీ ఒరియెంటెడ్‌ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్‌ స్మిత బయోపిక్‌ ‘ది డర్టీ పిక్చర్‌’ మూవీతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకున్న విద్యా బాలన్‌ అప్పటి నుంచి వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తను ఎన్నో కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీ అంటేనే ఆసహ్యం వచ్చింది అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్‌ తొలి ట్వీట్‌, నెటిజన్ల అసహనం

కాగా ఆమె తాజాగా నటించిన చిత్రం జల్సా. ఈ మూవీ అమెజాన్‌ ప్రైంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యా బాలన్‌ భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్‌ చేస్తూ అసహ్యంగా చూసేశాడు. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను. ఇదంత 2003లో జరిగింది. ఆ సమయంలో నేను ఏ సినిమాలకు సంతకం చేయలేకపోయాను. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు నాపై ప్రభావం చూపింది’ అంటూ చెప్పుకొచ్చింది.

చదవండి: ‘రాధేశ్యామ్‌’పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌, మూవీకి అంత అవసరం లేదు..

అదే సమయంలో కె బాలచందర్‌ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్‌ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు పలు ప్రకటనల నుంచి కూడా తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్‌ డ్రైవ్‌ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్‌ తెలిపింది. ఆ తర్వాత అందమైన శరీరాకృతి కోసం రోజు గంటల తరబడి వ్యాయమం చేసి బరువు తగ్గాననని పేర్కొంది. ఇక ఇప్పడు నన్ను రిజెక్ట్‌ చేసిన నిర్మాతలే ఫోన్‌ చేసి సినిమా చేయాలని అడుగుతున్నారని, అయితే వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు విద్యా బాలన్‌ చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement