2011లో విడుదలైన ఒక సినిమాతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆమె గ్లామర్‌కు చాలామంది ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించేది. దానంతటికీ కారణం ఆమె తీసుకున్న నిర్ణయమే అని చెప్పవచ్చు. సినిమా ప్రారంభం ముందు ఇలాంటి సినిమాలో నటించవద్దని ఆమె సన్నిహితులు చెప్పినా వినకుండా ప్రాజెక్ట్‌పై సంతకం చేసేసింది. కానీ, అందరి అంచనాలకు మించి తన సత్తా ఎంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు పరిచయం చేసింది.
సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్‌లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఆమె సుమారు 12 కిలోల బరువు పెరిగారు. అందుకోసం ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్‌ను ఆమె తీసుకున్నారు. ఆపై ఆ పాత్ర తీరును బట్టి డర్టీ పిక్చర్‌లో తాను స్మోక్ చేయాలి. ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదని సిగరెట్ తాగడం ఆమె అలవాటు చేసుకున్నారు.
కానీ, ఆ సినిమా తర్వాత దానికి ఆమె చాలా అడిక్ట్ అయిపోయారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాల్చేదానినంటూ ఆమె చెప్పింది. ఆ వ్యసనం నుంచి బయట పడేందుకు చాలా కష్టపడినట్లు విద్యాబాలన్ పంచుకుంది. ప్రస్తుతం అయితే తాను పూర్తిగా సిగరెట్లు తాగడం మానేశానని ఆమె చెప్పింది.
ది డర్టీ పిక్చర్ సినిమాకు ముందు విద్య చాలా సన్నగా పక్కింటి అమ్మాయిలా కనిపించేది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె 12 కిలోలు బరువు పెరగడం ఆపై స్మోక్ చేయడం వంటివి ఆమెపై చాలా ప్రభావం చూపాయి. సినిమాలో ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడంతో విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఆమె కష్టానికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ ఈ చిత్రంతో అందుకుంది. 2014లో పద్మశ్రీ అవార్డు కూడా విద్యాబాలన్ అందుకుంది. ఆపై కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment