national award winner
-
ఏడోసారి జాతీయ అవార్డు అందుకున్న సంస్థ
వంటనూనెల తయారీ సంస్థ గోల్డ్‌డ్రాప్ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు జాతీయ అవార్డు అందుకున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈమేరకు గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ (సీఐటీడీ) అవార్డును ప్రదానం చేశారు. గోల్డ్‌డ్రాప్ సంస్థ ఈ అవార్డు అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, పరిశుభ్రత, పోషకాల పరంగా మెరుగైన వంట నూనెగా గోల్డ్‌డ్రాప్ నిబద్ధత చాటుకుంటోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ ‘మరోసారి ఈ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సంస్థ ఉత్పత్తుల్లో నాణ్యతను పాటించడం, కొత్తగా ఆవిష్కరణలు చేయడం పట్ల దృష్టి సారిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లుఆహార ఉత్పత్తుల తయారీలో నిబంధనల ప్రకారం భద్రత, సరైన నాణ్యత పాటించే సంస్థలకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఇండియా (సీఐటీడీ) అవార్డులు అందిస్తోంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1984 ఏప్రిల్ 28న స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇది ఉత్పత్తులను తయారు చేస్తోంది. సన్‌ప్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, పామోలిన్ నూనె.. వివిధ ఆయిల్ ఉత్పత్తులను అందిస్తోంది. -
సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్
బాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3' విడుదలకు రెడీగా ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం తగ్గకుండా కత్రీనా కైఫ్ కూడా భారీ యాక్షన్స్ సీన్స్‌లలో మెప్పించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య టైగర్-3 నవంబర్ 12న విడుదల కానుంది. టైగర్-3కి పోటీగా ఈ సారి తమిళ సినిమాలు జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నాయి. నేడు (నవంబర్ 10)న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ మరాఠీలో మన తెలుగు డైరెక్టర్ తీసిన 'నాళ్- భాగ్ 2' సినిమా కూడా నేడు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ టైగర్-3 ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది. మరాఠీలో 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాతో సుధాకర్ రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పట్లో అక్కడ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2 మీద అంచనాలు పెరిగాయి. నాళ్-2 చిత్రాన్ని జీ -స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా మొదటి పార్ట్‌కు జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా నాళ్-2 మూవీకి సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రానికి పోటీగా మన తెలుగోడు డైరెక్ట్ చేసిన చిత్రం బరిలో ఉంది. సుధాకర్ రెడ్డి ఎవరు..? ఎక్కంటి సుధాకర్ రెడ్డిది అంధ్రప్రదేశ్‌లోని గుంటురు జిల్లా.. హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. తెలుగులో పౌరుడు, మనసారా, మధుమాసం, దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలతో పాటు పలు ఉత్తరాది చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అమితాబ్ బచ్చన్ 'ఝుండ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశాడు. 2018లో 'నాళ్' (మరాఠి) సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. నాల్ సినిమా కథకు మూలం ఎంటి? నాల్.. మారాఠీలో 2018లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం. తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు. -
అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం.. ఇంటివద్ద అభిమానుల సందడి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి నెలకొంది. పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న బన్నీ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇంటికి చేరుకున్న బన్నీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అల్లు అర్జున్‌పై పూల వర్షం కురిపించారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ (పార్ట్-2) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోనూ రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15, 2024న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. Icon star @alluarjun receives a roaring welcome from the fans in hyderabad, after receiving the National award for 'Best Actor' at #69thNationalFilmAwards2023 in Delhi. 🔥 pic.twitter.com/usVUX9elSC — Allu Arjun Official (@TeamAAOfficial) October 18, 2023 #WATCH | Allu Arjun receives the Best Actor Award for 'Pushpa: The Rise', at the National Film Awards. pic.twitter.com/FemqdiV41y — ANI (@ANI) October 17, 2023 Can fire be awarded, I believe it can be ❤️🔥 Congratulations Bunny @alluarjun for writing HISTORY & being the Telugu Pride. The Rise is written & let the Rule begin.#Pushpa2TheRule pic.twitter.com/fq9UpYnHsq — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 17, 2023 -
మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్‌తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్‌లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్‌తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్‌తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్‌ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్‌లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్‌తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్‌కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్‌గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్‌కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్‌తో గ్లోబల్‌గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్‌లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్‌గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్‌లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్‌కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్‌గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్‌లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్‌లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్‌లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్‌లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్‌లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్‌లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్‌కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్‌లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్‌కి గురై, నన్ను హత్తుకుంది. -
ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కూడా
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు వైరల్‌గా మారాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె నటి మాత్రమే ప్లేబ్యాక్ సింగర్‌గా, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇటీవల ఆమె నటించిన ఓ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఆమె నేరుగా ఒక్క తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడి ప్రక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. అచ్చంగా తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు ఆకాశమే నీహద్దురా చిత్రంలో నటనతో అబ్బురపరిచన అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ బ్యూటీ నటిగా కంటే ముందు సింగర్‌గా, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పలు షార్ట్ ఫిలింస్‌లో కూడా నటించింది. ఈ క్రమంలో ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. మాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన సూరారై పోట్రు(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) మూవీలో చాన్స్ కొట్టేసింది. లాక్డౌన్లో ఓటీటీలో విడుదలైన ఈచిత్రం ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అపర్ణ.. సుందరిగా సూర్య భార్య పాత్రలో నటించి అద్భుతమైన నటన కనబరిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న తన పాత్రకుగానూ అపర్ణ ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకుంది. ఇలా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ ప్రస్తతం బొద్దుగా తయరవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) -
వెండితెరపై 65 ఏళ్ల మహిళ బయోపిక్.. ఆమె ఎవరంటే ?
Lata Bhagwan Kare To Be Made As Pan India Movie: భర్త భగవాన్ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించడానికి ఎస్కె మారథాన్ రేస్‌లో పాల్గొని, గెలిచిన 65ఏళ్ల లతా కారే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లతా భగవాన్ కారే’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. మరాఠీలో ‘లతా భగవాన్ కారే’ చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శక-నిర్మాతలు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు. విలేకరుల సమావేశంలో నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘లతా భగవాన్ జీవితంలో జరిగిన కథ ఇది. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘లతా భగవాన్ కారే’ చిత్రం రీమేక్‌ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకో వినూత్నమైన సబ్జెక్టుతో మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని ఎర్రబోతు కృష్ణ తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాజకీయ నాయకుడు డా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్న లతా కారే, సునీల్ కారే ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే Lata Bhagwan Kare | Official Teaser | 17 Jan ६५ वर्षाच्या स्त्रीची संघर्षगाथा !!#Releasing17Jan#LataBhagwanKare #TrueStory #65Years @naveendeshboina pic.twitter.com/yyD5s9HsoG — Lata Bhagwan Kare (@kare_lata) December 24, 2019 -
విషాదం: లెజెండరీ దర్శకురాలు మృతి
సాక్షి, ముంబై: చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మరాఠీ సినిమా ఇండస్ట్రీ ముఖాన్నే మార్చేసిన దర్శకురాలు, నిర్మాత సుమిత్ర భవే(78) తుదిశ్వాస విడిచింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రాణాలు విడిచింది. సునీల్ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించింది. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేసింది. సునీల్ సుక్తాంకర్ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు. సుమిత్ర సినిమాల్లో 90 పైచిలుకు పాటలను స్వయంగా ఈయనే రచించాడు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ వీరికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2016లో వారు తీసిన కాసవ్ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డు వచ్చింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీద జూ.ఎన్టీఆర్ చక్కర్లు వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు -
కవి మనసు ఖాళీగా ఉండదు
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’ (‘ఠాగూర్’ సినిమా) పాటతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రచయిత సుద్దాల అశోక్‌తేజ. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వాటి గురించి అశో క్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య మీడియాలో నేను పోయానని ఒకరు, విషమంగా ఉన్నానని మరొకరు మాట్లాడుతున్నారు. అవన్నీ పుకార్లే. నాకు ఆపరేషన్ జరిగి దాదాపు 47 రోజులైంది. చక్కగా కోలుకుంటున్నాను. నేను బావుండాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి మామూలు మనిషి అవ్వాలని ఎంతోమంది స్నేహితులు, బంధువులు కోరుకున్నారు. అనారోగ్యం శరీరానికే కానీ, కవి మనసుకు కాదు. అది ఖాళీగా ఉండలేదు. అందుకే నేను ఈ అనారోగ్యం, కరోనా టైమ్‌లో కూడా రాస్తూనే ఉన్నాను. గతంలో నేను ‘శ్రమకావ్యం’ అని రాశాను. ఇప్పుడు ‘అరణ్య కావ్యం’ రాస్తున్నా. 70 నుండి 80 అధ్యాయాలు ఉండే పెద్ద కవిత ఇది. దాని పేరు ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’. అడవి వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగింది? అలాంటి అడవిని ఎన్ని రకాలుగా హింసించారు? అనే విషయాలను ప్రస్తావిస్తూ అడవి తన గోడు వెళ్లబోసుకుంటుంది. అడవి హింసించబడటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆçస్పత్రిలో చేరకముందు, ఆపరేషన్ అయిన మూడో రోజు నుండే నేను ఈ కవితను రాస్తూ బిజీగా ఉన్నాను. ఇవికాకుండా నూతన నటీనటులతో వస్తున్న ‘సతి’ అనే సినిమాకి పాట రాశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాపై ఏమైనా రూమర్స్ వస్తే నమ్మొద్దని అందరికీ తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు. -
ఇది ఎప్పటికీ మారదు
దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నీనా గుప్తా. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటారు. అంతేకాదు.. ‘వో చోక్రి (1994)’ అనే సినిమాకు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల ‘బదాయీ హో’ అనే సినిమాలో నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర గురించి నీనా మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్నవారు చేయలేని ఓ డిఫరెంట్ పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. అలాగే హీరోలు, హీరోయిన్లకు లభిస్తున్న పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్న హీరోలు ఇప్పుడు పాతికేళ్ల వయసు ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారు. నాలాంటి వారినేమో నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రలు చేయమంటున్నారు. ఇది చాలా బాధాకరం. సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అనడానికి ఇదొక ఊదాహరణ. ఈ విషయంలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు’’ అన్నారు. -
వయసు.. సొగసు
వయసుతో పాటు వైన్‌లా పాతబడుతున్నానని జాతీయ అవార్డు గ్రహీత, మరాఠీ నటి రాజేశ్వరి సచ్దేవ్ చెబుతోంది. ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని, కెరీర్‌లోని ప్రతి మలుపులోనూ తగిన ప్రతిఫలాన్ని పొందానని సంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజేశ్వరి నటించిన ‘డోంబివ్లీ రిటర్న్’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది -
విమర్శకు పట్టం
జాతీయ పురస్కారం సుప్రసిద్ధ విమర్శకురాలు, ప్రజాస్వామికవాది, అధ్యాపకురాలు అయిన కాత్యాయనీ విద్మహేకు సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా... ‘ఉత్తముల మహిమ నీరు కొలదీ తామర సుమ్మీ’ అన్నాడొక ప్రాచీన కవి. తమ విద్యని ఎదుటివారు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రకటిస్తారట పండితులు. అది ఎట్లా ఉంటుందంటే సరస్సులో నీరు ఎంత వరకు ఉంటే తామర అంతవరకు పెరిగినట్లుగా... 2007లో ఆంధ్ర విశ్వకళా పరి షత్తులోని ఒక పురాతన సభా మందిరంలో మొదటిసారి కాత్యాయనీ విద్మహేని చూశాను, విన్నాను. ఆరోజు ఆమె కట్టిన నెమలిపురి కంటి రంగు చీర గురించి, అది ఆమెకిచ్చిన హుందాతనపు మెరుపు గురించి వినవచ్చిన ప్రశంసాఝంకారాల రొద నుంచి నన్ను నేను ఏకాంత పరుచుకుని మరీ విన్నాను. ఆ తర్వాత కలిసి పని చేసే క్రమంలో వరంగల్, హైదరాబాద్, కడప, గుంటూరు, నరసాపురం, విశాఖ వేదికల మీదా విన్నాను. సాహిత్య సభలూ, క్షేత్ర పర్యటనలు, సాహిత్య సంస్థల నిర్మాణ సందర్భాల్లోనూ విన్నాను. ఆడంబరమూ పలుచదనమూ లేని ఉత్తముల మహిమలాంటి ఆమె రచనల సారమే తన ఉపన్యాస సారంగా, జీవన సారంగా అర్థం చేసుకున్నాను. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఇపుడు మాట్లాడుకోడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక సందర్భం మాత్రమే. వేలాది కవులూ రచయితలూ కొద్దిమంది విమర్శకుల నిష్పత్తిలో నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు విమర్శాకాశంలో నిండుగా వెలుగుతున్నారు కాత్యాయని. ఒక రచనపై మన భావోద్వేగాలే ప్రామాణిక విమర్శగా దబాయింపు సత్యాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ తనని తాను ఆవల బెట్టుకుని లోచూపుకి సాధనాలు సమకూర్చుకున్నారు. కొ.కు, రావిశాస్త్రిల దృక్పథం గురించీ, కన్యాశుల్కం, రాబందులూ- రామచిలుకలు లాంటి మంచి పుస్తకాల గురించి, అస్తిత్వ సాహిత్యం, ప్రపంచీకరణల సంక్లిష్టతల గురించి విస్తృతాధ్యయనపు ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృష్టికోణపు సాయంతో పునర్నిర్మించే పనిని నిలకడగా చేస్తుండటం విమర్శారంగానికి ఒక చేర్పు. ‘ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాన్ని మార్చగల కార్యక్రమం లేకపోవడం వల్ల స్త్రీవాదం తరచుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దానిని అధిగమించడానికి విశాలమయిన, పునాది మార్పుకు సంబంధించిన చైతన్యం కలిగిన రాజకీయార్థిక పోరాటాలతో సమన్వయం సాధించాల్సి ఉంది’ అన్నది కాత్యాయని అవగాహన. 1980ల తర్వాత వెల్లువెత్తిన అనేక అస్తిత్వ చైతన్యాల మధ్య మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌గా తనని తాను స్థిరపరుచుకున్నారు. ఈ ఆచరణలో భాగంగా స్త్రీల సాహిత్య పోరాటాలను సామాజిక పోరాటాలతో అనుసంధానం చేసే లక్ష్యంతో ఏర్పడిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణంలో కీలక భాగస్వామి అయ్యారు. ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల సహానుభూతితో స్పందిస్తూ తన కలాన్నీ, గళాన్నీ పదును పెట్టుకున్నారు. తోటివారితో కలిసి పని చేయడంలో కాత్యాయనిది ఒక ప్రత్యేక వ్యాకరణం. సామూహికత ఒక్కటే సమాపకం. ప్రొఫెసర్లు, స్కాలర్లు, కొత్త రచయితలు, గొప్ప రచయితలు, మేధావులు, కార్యకర్తలు ఎవరితో కలిసి పని చేయడమయినా అసమాపకం. 1982లో రూపొందించకున్న స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ద్వారానూ, జ్యోతీరాణి, శోభ, గిరిజారాణి, బుర్రారాములు వంటి వారితో కలిసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడం ద్వారానూ తన కార్యక్షేత్రాన్ని విస్తరింప చేసుకున్నారు. తాను నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారా తన విద్యార్థులను ప్రభావితం చేశారు. ఓరుగల్లు ఆకాశంలో అందుకోలేని ఎత్తులో ఎగిరే కాకతీయ తెలుగు శాఖ పతాకపు రెప రెపలు విన్నపుడల్లా మనసులో ఒక స్పర్థ. విశ్వవిద్యాలయం కల్పించే ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోకుండా సభలూ, సమావేశాలూ, అధ్యయన యాత్రలూ, ప్రాజెక్టులూ, పరిశోధనలూ పుస్తక ప్రచురణలూ అన్నింటి వెనుకా చోదకశక్తి వలే పని చేసిన విద్యావేత్త కాత్యాయని. ఈ పురస్కార సందర్భం కొందరికయినా ఎందుకు పండగ సందర్భం కావాలి? కాత్యాయని జిజ్ఞాస కలిగిన విమర్శకురాలయినందుకు కావొచ్చు. ప్రజాస్వామికవాది అయినందుకు, తెలంగాణని హత్తుకున్నందుకు కావొచ్చు. సమూహంలో తనని తాను నిలబెట్టుకున్నందుకూ మంచి ఉపన్యాసకురాలయినందుకు కూడా కావొచ్చు. మగవారి సత్యాలకే చెల్లుబాటు ఉన్న విమర్శారంగంలో నిక్కచ్చి స్వరం వినిపిస్తున్న స్త్రీ అయినందుకు మరీ మరీ కావొచ్చు. సామాజిక దుర్భిక్షాలకి సాహిత్యమొక నివారణోపాయం. వానలతో ఎడతెగక పారే జీవనది సాహిత్యం. ముంతతో వెళితే ముంతెడు నీళ్లు, కడవతో వెళితే కడివెడు నీళ్లు తెచ్చుకోవచ్చు. పరిశోధనా దాహం మెండుగా ఉన్న కాత్యాయని బహుశా ఒక నదీపాయని తన జ్ఞానంతో అనుసంధానం చేసుకుని ఉంటారు... చిరకాలం సారవంతమైన విమర్శాఫలాలను వాగ్దానం చేస్తూ... - కె.ఎన్.మల్లీశ్వరి