
నీనా గుప్తా
దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నీనా గుప్తా. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటారు. అంతేకాదు.. ‘వో చోక్రి (1994)’ అనే సినిమాకు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల ‘బదాయీ హో’ అనే సినిమాలో నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర గురించి నీనా మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్నవారు చేయలేని ఓ డిఫరెంట్ పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. అలాగే హీరోలు, హీరోయిన్లకు లభిస్తున్న పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్న హీరోలు ఇప్పుడు పాతికేళ్ల వయసు ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారు. నాలాంటి వారినేమో నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రలు చేయమంటున్నారు. ఇది చాలా బాధాకరం. సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అనడానికి ఇదొక ఊదాహరణ. ఈ విషయంలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment