Lata Bhagwan Kare To Be Made As Pan India Movie: భర్త భగవాన్ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించడానికి ఎస్‌కె మారథాన్ రేస్‌లో పాల్గొని, గెలిచిన 65ఏళ్ల లతా కారే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లతా భగవాన్ కారే’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. మరాఠీలో ‘లతా భగవాన్ కారే’ చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శక-నిర్మాతలు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు.
విలేకరుల సమావేశంలో నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘లతా భగవాన్ జీవితంలో జరిగిన కథ ఇది. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘లతా భగవాన్ కారే’ చిత్రం రీమేక్‌ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకో వినూత్నమైన సబ్జెక్టుతో మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని ఎర్రబోతు కృష్ణ తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాజకీయ నాయకుడు డా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్న లతా కారే, సునీల్ కారే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చదవండి: కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Lata Bhagwan Kare | Official Teaser | 17 Jan
— Lata Bhagwan Kare (@kare_lata) December 24, 2019
६५ वर्षाच्या स्त्रीची संघर्षगाथा !!#Releasing17Jan#LataBhagwanKare #TrueStory #65Years
@naveendeshboina pic.twitter.com/yyD5s9HsoG
Comments
Please login to add a commentAdd a comment