Marathi film
-
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్.. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్.. ఆర్నెళ్ల తర్వాత ఓటీటీకి!
Baipan Bhari Deva on OTT: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. చిన్న సినిమాలు సైతం ఓటీటీల్లో అదరగొట్టేస్తున్నాయి. థియేటర్స్‌లో పెద్దగా ఆదరణ లభించని చిత్రాలకు సైతం.. ఓటీటీకి వచ్చేసరికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. థియేట్రికల్ రిలీజ్‌లోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ బైపన్ భారీ దేవ మూవీ దాదాపు రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది జూన్ 30న విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. మరొకటి హులు యాప్‌లో అందుబాటులో ఉంది. హాట్ స్టార్‌లో మరాఠీతోపాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం సబ్ టైటిల్స్‌లో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం హిందీ, మరాఠీ భాషల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం మరో ఓటీటీ హులు యాప్‌లో కేవలం అమెరికాలో మాత్రమే ఉంది. అక్కడ ఉన్న వారికి మాత్రమే బైపన్ భారీ దేవ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. కాగా.. బైపన్ భారీ దేవ అంటే స్త్రీతత్వం కఠినమైనది అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. బైపన్ భారీ దేవ చిత్రానికి కేదార్ షిండే దర్శకత్వం వహించారు. అలాగే జీ స్టూడియోస్, ఎమ్వీబీ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆరుగురు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు. -
సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్
బాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3' విడుదలకు రెడీగా ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం తగ్గకుండా కత్రీనా కైఫ్ కూడా భారీ యాక్షన్స్ సీన్స్‌లలో మెప్పించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య టైగర్-3 నవంబర్ 12న విడుదల కానుంది. టైగర్-3కి పోటీగా ఈ సారి తమిళ సినిమాలు జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నాయి. నేడు (నవంబర్ 10)న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ మరాఠీలో మన తెలుగు డైరెక్టర్ తీసిన 'నాళ్- భాగ్ 2' సినిమా కూడా నేడు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ టైగర్-3 ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది. మరాఠీలో 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాతో సుధాకర్ రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పట్లో అక్కడ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2 మీద అంచనాలు పెరిగాయి. నాళ్-2 చిత్రాన్ని జీ -స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా మొదటి పార్ట్‌కు జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా నాళ్-2 మూవీకి సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రానికి పోటీగా మన తెలుగోడు డైరెక్ట్ చేసిన చిత్రం బరిలో ఉంది. సుధాకర్ రెడ్డి ఎవరు..? ఎక్కంటి సుధాకర్ రెడ్డిది అంధ్రప్రదేశ్‌లోని గుంటురు జిల్లా.. హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. తెలుగులో పౌరుడు, మనసారా, మధుమాసం, దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలతో పాటు పలు ఉత్తరాది చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అమితాబ్ బచ్చన్ 'ఝుండ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశాడు. 2018లో 'నాళ్' (మరాఠి) సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. నాల్ సినిమా కథకు మూలం ఎంటి? నాల్.. మారాఠీలో 2018లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం. తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు. -
పెళ్లిచూపులు: అవే ప్రశ్నలు, వంకలు,.. అబ్బాయిని ఎందుకు అడగరో?
ఇంటికొచ్చిన అపరిచిత పురుషులు, స్త్రీలు. వారితో పాటు పెళ్లికొడుకు. వారి ముందుకు టీ కప్పుల ట్రేతో పెళ్లికూతురు రావాలి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ‘ఇంటికెళ్లి ఏ సంగతీ చెప్తాం’ అని వాళ్లు వెళ్లిపోతారు. సంబంధం ఖాయమా కదా అనే టెన్షన్. చెడితే మళ్లీ మొత్తం సీన్ రిపీట్ చేయాలి.ఆడపిల్లలను ప్రదర్శనకు పెట్టి బాధ పెట్టే ఈ పెళ్లిచూపుల తంతును మార్చలేమా అని ప్రశ్నిస్తూ తీసిన మరాఠీ సినిమా ‘స్థల్’టొరెంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.సెప్టెంబర్ 7–18 తేదీల్లో ‘స్థల్’ అక్కడ ప్రదర్శితం కానుంది. 1970లలో 80 లలో సినిమాల్లో పెళ్లిచూపులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నగరాల్లో అయితే ఒకలాగా... పల్లెల్లో అయితే ఒకలాగా.. కొద్ది మార్పులతో. అప్పుడైనా ఇప్పుడైనా ‘ఎంచేవాడు’ అబ్బాయే అవుతున్నాడు. ‘అబ్బాయి వాళ్లు ఓకే అంటే చాలు’ అనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువమంది ఉన్నారు. అసలు అమ్మాయిని చూడటానికి రావడంలోనే మగపెళ్లివారి పైచేయి ఉంది. ఇన్నేళ్లు గడిచినా అబ్బాయిని చూసుకోవడానికి అమ్మాయి వాళ్లు తరలి రావడం వినడం లేదు. పెళ్లి అంటే అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. కాని అమ్మాయి ఔను/కాదులకు ప్రాధాన్యం లేదు. ఈ పద్ధతి ఇంకా ఎంతకాలం అని ప్రశ్నిస్తోంది మరాఠి సినిమా ‘స్థల్’. ఆ మాటకు ‘పెళ్లి సంబంధం’ అని అర్థం. పత్తి రైతు ఇంట్లో అమ్మాయి ‘స్థల్’ సినిమా కథ మహరాష్ట్రలోని విదర్భ జిల్లాలో దోంగర్గావ్ అనే ఊళ్లో జరుగుతుంది. ఈ ప్రాంతమంతా పత్తి రైతులు. వయసొచ్చిన ఆడపిల్లకు తొందరగా పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే ఆడపిల్లవాళ్లు అనుకున్నంత మాత్రాన ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగిపోవు. దానికి సవాలక్ష కుదరాలి. ముందు పెళ్లిచూపుల తంతు జరగాలి. ఈ సినిమాలో బి.ఏ చదివిన సవిత అనే అమ్మాయి ‘పి.జి చదువుతాను మొర్రో’ అని మొత్తుకుంటున్నా వినకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెడతారు. అక్కడి నుంచి రకరకాల అనుభవాలు ఆమెకు ఎదురవుతుంటాయి. విదర్భ ప్రాంతంలో పెళ్లి చూపులకు వచ్చిన వారికి పెళ్లికూతురు ‘పోహా’ తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీ. దీని ‘పోహా కార్యక్రమం’ అంటారు. ఆ పోహాతో మొదలెట్టి పెళ్లి చూపుల తంతు అయ్యేంత వరకూ ముళ్ల పీఠంపై కూర్చున్నట్టు పెళ్లి కూతురు ఎదుర్కొనే శల్య పరీక్షలను ప్రశ్నిస్తుంది ఈ సినిమా. ఎన్నో లోపాలు, వంకలు పెళ్లిసంబంధాల్లో పెళ్లికూతురిలో వంకలు, లోపాలు వెతకడం కొనసాగుతూనే ఉంది. దీని గురించి జయంత్ సోమల్కర్ మాట్లాడుతూ ‘చదువు, ఉద్యోగం, రంగు, ఎత్తు... వీటన్నింటి మీద అబ్బాయి తరపు వాళ్లకు ఒక అభిప్రాయం ఉంటుంది. పెళ్లికూతురిలో ఆ మేరకు లోపం వెతకడానికి చూస్తారు. వంకలు పెడతారు. ప్రతి పెళ్లిచూపుల్లో అవే ప్రశ్నలు. పెళ్లికూతురు జవాబు చెప్పి చెప్పి విసిగిపోవాలి. అసలు అంతమంది వచ్చి కూచుని ఒకమ్మాయిని గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించామా? నా చిన్నప్పుడు మా అక్కలకు ఇలాగే పెళ్లిచూపులు జరుగుతుంటే చూసేవాణ్ణి. ఇటీవల మా కజిన్‌ను చూడటానికి అబ్బాయి వస్తే అదే తంతు. సినిమా తీయాలనిపించింది’ అన్నాడు. ఊరివాళ్లే నటులు జయంత్ సోమల్కర్ విదర్భ ప్రాంతం వాడే. తన సొంత ఊళ్లో షూటింగ్ మొత్తం చేశాడు. ఊరి వాళ్లనే నటీనటులుగా ఎంపిక చేసుకున్నాడు. రియలిస్టిక్‌గా అనిపించేందుకే అలా చేశాడు. ‘షూటింగ్ మధ్యలో పొలానికి నీళ్లు పెట్టి వస్తానని, బర్రెకు గడ్డి వేసి వస్తానని నటీనటులు వెళ్లిపోకుండా చూడటం నాకు పెద్ద సమస్య అయ్యింది’ అంటాడు జయంత్ నవ్వుతూ. ముఖ్య పాత్రను ఊరి అమ్మాయి నందిని చిట్కె అద్భుతంగా చేయడం కూడా యూనిట్‌కు ఆశ్చర్యమే. ‘పెళ్లి చూపుల తంతును సహజమైన హాస్యంతో నేను చూపించినా సంబంధాలు వద్దనేకొద్దీ పెళ్లికూతురిలో వచ్చే తిరుగుబాటును, ఆమెలో వచ్చే ఆగ్రహాన్ని చూపించాను. నన్ను తిట్టుకున్నా సరే... పదిమందైనా మారితే అదే పదివేలు’ అంటాడు జయంత్. ప్రతిష్టాత్మక 48వ టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘డిస్కవరీ సెక్షన్’లో భారతదేశం నుంచి ‘స్థల్’ ఒక్కటే ఎంపికైంది. ఇక్కడ ప్రదర్శితమయ్యాక ఇండియాలో రిలీజ్ చేయడానికి దర్శకుడు సిద్ధమవుతున్నాడు. -
రెంట్ ఇవ్వడానికి వెళ్తే.. రేట్ ఎంత అన్నాడు: ప్రముఖ నటి
ప్రముఖ సినీ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తేజస్విని నటి జ్యోతి చందేకర్ కుమార్తె. హౌస్ రెంట్ ఇవ్వడానికి కార్పొరేటర్ ఇంటికి వెళ్తే.. తనతో గడిపేందుకు డైరెక్ట్‌గా రమ్మని పిలిచాడని తేజస్విని తెలిపింది. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చానని పేర్కొంది. తేజస్విని మాట్లాడుతూ.. '2009-10 ప్రాంతంలో నేను సింహగడ్ రోడ్లో (పుణెలో) అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్మెంట్ ఓ కార్పొరేటర్‌కు చెందినది. నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లా. అతను నాకు నేరుగా ఆఫర్ ఇచ్చాడు. అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది. నేను వెంటనే తీసుకుని అతని ముఖం మీద విసిరా. నేను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించలేదు. నా వృత్తి కారణంగా, నా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున ఇలా ప్రవర్తించారు. ఈ సంఘటన నాకు ఓ అనుభవం లాంటిది' అని అన్నారు. కాగా.. 2004లో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. -
ఛత్రపతి శివాజీగా అక్షయ్ కుమార్.. వద్దంటూ నెటిజన్స్ ట్రోల్!
మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా మరాఠీలో ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఛత్రపతి శివాజీగా నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా హిందీలో హీరోగానూ, ప్రత్యేక పాత్రలు చేసిన చిత్రాలు, దక్షిణాదిన చేసిన రెండు మూడు చిత్రాలతో కలుపుకుని అక్షయ్ 150 చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడు మరాఠీలో మెయిన్ లీడ్ యాక్టర్‌గా అక్షయ్‌కు ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చత్రపతి శివాజీ పాత్రని అక్షయ్ కుమార్ పోషించొద్దని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’లో నటించి పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్రని చెడగొట్టాడని, ఇప్పుడు మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని ట్రోల్ చేస్తున్నారు. आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा ! आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z — Akshay Kumar (@akshaykumar) December 6, 2022 -
'హర్ హర్ మహాదేవ్' ప్రదర్శన నిలిపివేత.. ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరాఠీ చిత్రం ‘హర్ హర్ మహదేవ్’ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీపీ నేత అవద్, తన అనుచరులతో కలిసి థానే నగరంలోని ఓ మల్టిప్లెక్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. ‘హర్ హర్ మహాదేవ్’ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ స్క్రీనింగ్‌ను అడ్డుకున్నారు. అంతేగాక సినిమా చూస్తున్న ప్రేక్షకులపై దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హర్ హర్ మహాదేవ్ చూసినందుకు సినిమా ప్రేక్షకులను కొట్టడాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తాను సినిమా చూడలేదని, ఈ వివాదం గురించి తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు అనుమతి ఉంది కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని ఫడ్నవీస్ హెచ్చరించారు. చదవండి: Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం -
వెండితెరపై 65 ఏళ్ల మహిళ బయోపిక్.. ఆమె ఎవరంటే ?
Lata Bhagwan Kare To Be Made As Pan India Movie: భర్త భగవాన్ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించడానికి ఎస్కె మారథాన్ రేస్‌లో పాల్గొని, గెలిచిన 65ఏళ్ల లతా కారే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లతా భగవాన్ కారే’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. మరాఠీలో ‘లతా భగవాన్ కారే’ చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శక-నిర్మాతలు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు. విలేకరుల సమావేశంలో నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘లతా భగవాన్ జీవితంలో జరిగిన కథ ఇది. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘లతా భగవాన్ కారే’ చిత్రం రీమేక్‌ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకో వినూత్నమైన సబ్జెక్టుతో మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని ఎర్రబోతు కృష్ణ తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాజకీయ నాయకుడు డా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్న లతా కారే, సునీల్ కారే ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే Lata Bhagwan Kare | Official Teaser | 17 Jan ६५ वर्षाच्या स्त्रीची संघर्षगाथा !!#Releasing17Jan#LataBhagwanKare #TrueStory #65Years @naveendeshboina pic.twitter.com/yyD5s9HsoG — Lata Bhagwan Kare (@kare_lata) December 24, 2019 -
ది డిసిపుల్‌కి అంతర్జాతీయ పురస్కారం
చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’ వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకుంది. కరోనా వల్ల అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 77వ వెన్నిస్ ఫెస్టివల్‌ను మాత్రం నిర్వహించారు. 2001లో మీరా నాయర్ తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ తర్వాత వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంత దూరం వెళ్లిన చిత్రం ‘ది డిసిపుల్’ కావడం విశేషం. అలాగే ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణమే ఈ చిత్రకథ. ‘ది డిసిపుల్’ చిత్రదర్శకుడు గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
అతిథి పాత్రలో విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. దివంగత నటుడు, దర్శకుడు భగవాన్ దాదా జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె అతిథిపాత్ర పోషించనుంది. అలనాటి అందాలనటి గీతా బాలి పాత్రను ఆమె పోషిస్తుంది. ఈ సినిమాలో భగవాన్ దాదా జీవితం, అల్బేలా చిత్రం తీసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు.. ఇవన్నీ అందులో ఉంటాయి. 1951లో విడుదలైన అల్బేలా సినిమాలో భగవాన్ దాదా, గీతా బాలి హీరో హీరోయిన్లుగా నటించారు. చిన్న పాత్ర అయినా.. గీతాబాలి పాత్రలో నటించడం తనకు చాలా పెద్ద గౌరవమని విద్యాబాలన్ చెబుతోంది. ఈ కొత్త సినిమాకు షేఖర్ సర్తాండెల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మరాఠీ మసాలా!
కిక్కెక్కించే పిక్చర్లు బాలీవుడ్‌కే పరిమితం కాదు... మరాఠీ ఫిల్మీ దునియా కూడా ఆ స్థాయికి ఏమాత్రం తగ్గడం లేదు. బికినీల్లో తారల వయ్యారాలు చూడాలంటే ఇదివరకు థియేటర్ దాకా వెళ్లాల్సివచ్చేది. కానీ ఇప్పుడు... రిలీజ్‌కు ముందే మాంచి మసాలా చిత్రాలతో పోస్టర్సే పిచ్చెక్కించేస్తున్నాయి. ఈ మధ్య విడుదలైన ‘చిత్రాఫిట్ 3.1 మెగాపిక్సల్’ బోల్డ్ వాల్‌పోస్టర్ సినిమాకు యమ క్రేజ్ తీసుకొచ్చింది. అదే బాటలో తాజాగా విడుదలైన ‘బేకో నం.1’ ఫస్ట్ లుక్ పోస్టర్ మతి పోగొడుతోంది. టు పీస్ బికినీలో ఉన్న తార ముఖం కనబడటం లేదు గానీ... ఆమె సౌందర్యం మాత్రం నయనానందకరం చేస్తోంది. సినిమాలో శృంగార తార స్మిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖం లేకుండా పోస్టర్ అచ్చేసినా... ఆ అందాలను చూసిన ఎవరైనా అది స్మితేనని ఠక్కున చెప్పేస్తారనేది సినీజనం ఉవాచ!